RCB Star Maxwell Wife Vini Raman Shares Her Tamil Baby Shower Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Vini Raman Baby Shower Photos: తమిళ సంప్రదాయ పద్ధతిలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్‌! ఆ విషాదం తర్వాత..

Published Tue, Jul 25 2023 4:04 PM | Last Updated on Tue, Jul 25 2023 4:33 PM

RCB Star Maxwell Wife Vini Raman Shares Her Tamil Baby Shower Photos Goes Viral - Sakshi

RCB Star Maxwell Wife Vini RamanTamil Baby Shower: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, ఆర్సీబీ స్టార్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్‌ పొందబోతున్నాడు. భార్య వినీ రామన్‌తో కలిసి ఈ ఏడాది మేలో ఈ శుభవార్తను పంచుకున్నాడు మాక్సీ. రెయిన్‌ బో బేబీ రాబోతుందంటూ సంతోషం వ్యక్తం చేశారీ దంపతులు. 

ఈ క్రమంలో మాక్సీ సతీమణి వినీ రామన్‌ తాజాగా తన సీమంతం ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ‘వలైకాప్పు’ వేడుకకు సంబంధించిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. 

సంప్రదాయ పద్ధతిలో
ఇందులో.. నిండైన చీరకట్టులో.. చేతులకు గాజులు, మెడలో నగలు వేసుకుని.. నుదుటిన కుంకుమ బొట్టు ధరించి.. భర్తను ఆప్యాయంగా హత్తుకున్న వినీ ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. విదేశాల్లో ఉన్నా సరే మన సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోకుండా పుట్టబోయే బిడ్డకోసం ఇంత అందమైన వేడుక చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ పలువురు వినీ మాక్స్‌వెల్‌ను అభినందిస్తున్నారు.

ఆ విషాదం తర్వాత
కాగా తమిళనాడు మూలాలున్న వినీ రామన్‌.. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది మార్చి 18న వీరి పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగింది. ఇక ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో మాక్సీ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మేలో ముగిసిన తాజా ఎడిషన్‌లో ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ 14 ఇన్నింగ్స్‌ ఆడి 400 పరుగులు సాధించాడు. 

కాగా గతంలోనూ వినీ రామన్‌ గర్భవతి అయినప్పటికీ ఆ బిడ్డ ఈ భూమ్మీదకు రాకుండానే వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె గర్భం దాల్చడంతో రెయిన్‌బో బేబీ(గర్భస్రావం లేదంటే తల్లి కడుపులోనే శిశువు చనిపోయిన తర్వాత పుట్టబోయే బిడ్డ) అంటూ మాక్సీ దంపతులు గుడ్‌న్యూస్‌ షేర్‌ చేయడం విశేషం. 

చదవండి: 'మా దురదృష్టం.. అతడి లాంటి ఆటగాళ్లు జట్టుకు కావాలి! కొంచెం కూడా భయపడలేదు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement