baby shower
-
తల్లి కాబోతున్న హీరోయిన్.. సీమంతం చేసిన కేజీఎఫ్ నటుడు (ఫోటోలు)
-
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం
హీరోయిన్ హరిప్రియ (Hariprriya) త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ క్రమంలో నటుడు వశిష్ట సింహ భార్య సీమంతం వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాడు. తన సీమంతం ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను ఈ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హరిప్రియ, వశిష్ట సింహ 2023లో పెళ్లి చేసుకున్నారు.ఎవరీ హరిప్రియ?హరిప్రియ కర్ణాటకవాసి. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే క్లాసికల్ డ్యాన్స్‌పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. అలా ఎన్నో ప్రోగ్రామ్స్‌కు హాజరయ్యేది. తను 12వ తరగతి చదువుతున్న సమయంలో తన డ్యాన్స్ స్టిల్స్ దర్శకుడు రిచర్డ్ కాస్టెలినో కంటపడ్డాయి. వెంటనే ఆమెను సినిమా కోసం సంప్రదించడం.. ఇంట్లో ఒప్పుకోవడంతో బడి అనే తుళు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. మనసుగుల మత్తు మధుర చిత్రంతో కన్నడ వెండితెరకు హీరోయిన్‌కు పరిచయమైంది.(చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)తెలుగులోనూ హీరోయిన్గా..యష్ సరసన నటించిన 'కళ్ళర సంతె'తో క్రేజ్ తెచ్చుకుంది. శివరాజ్‌కుమార్ 'చెలువెయె నిన్నే నోడలు' మూవీతో సెన్సేషన్ అయింది. ఉగ్రం, నీర్ దోసె, బెల్ బాటమ్, బిచ్చుగత్తి: చాప్టర్ 1 వంటి చిత్రాలతో అలరించింది. తకిట తకిట చిత్రంతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ, అలా ఇలా ఎలా అనే సినిమాలతో మెప్పించింది. తమిళంలోనూ రెండుమూడు మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం కన్నడలో బెల్ బాటమ్ 2, హ్యాపీ ఎండింగ్, లగామ్ సినిమాలు చేస్తోంది.కేజీఎఫ్ మూవీలో విలన్‌గా..వశిష్ట (Vasishta N Simha) విషయానికి వస్తే ఇతడు కూడా కర్ణాటకవాసే! రుద్ర తాండవ, ఎలోన్, నాన్ లవ్ ట్రాక్, ముఫ్టీ, టగారు, ఉపేంద్ర మట్టె బా, 8 ఎమ్ఎమ్ బుల్లెట్ వంటి చిత్రాల్లో నటించాడు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా! తెలుగులో కిరాక్ పార్టీ మూవీలో ఓ సాంగ్ పాడాడు. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు ఆలపించాడు.అలా మొదలైన ప్రేమకథఈ ఇద్దరికీ ఎలా ముడిపడిందో హరిప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నా దగ్గర రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోవడంతో మిగతాది ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట నాకు ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన పప్పీతో నా కుక్కపిల్ల కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే మా మధ్య ప్రేమ కూడా పెరిగింది’ అని తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! -
ప్రముఖ లేడీ కమెడియన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తండ్రి కాబోతున్న టీమిండియా క్రికెటర్.. ఘనంగా భార్య సీమంతం (ఫొటోలు)
-
హీరోయిన్ హర్షిక బేబీ షవర్.. హోస్ట్ చేసింది స్టార్ హీరోనే (ఫొటోలు)
-
బిగ్‌బాస్ సుజాత సీమంతం 'ఫోటోలు' షేర్ చేసిన రాకింగ్ రాకేశ్ (ఫొటోలు)
-
ప్రణీత సుభాష్ బేబీ షవర్ ఫోటోలు వైరల్ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్‌కి త్వరలో మరో బుజ్జాయి
ప్రముఖ హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ వేడుకలు చేసుకుంది. బెంగళూరులోని బస్టైన్ గార్డెన్ సిటీలో ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే ఈమెకు పాప ఉండగా.. త్వరలో మరో బిడ్డ పుట్టనుంది.(ఇదీ చదవండి: కూతురికి రామ్‌చరణ్ బహుమతి.. ఆ గిఫ్ట్‌కు మగధీరతో లింక్!)కర్ణాటకకు చెందిన ప్రణీత సుభాష్.. 2010లో నటిగా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం తదితర సినిమాల్లో నటించింది. మలయాళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. 2021లో నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాదికే అర్న అనే అమ్మాయి పుట్టింది. కొన్నాళ్ల క్రితం తాను మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించింది.ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోల్ని పోస్ట్ చేస్తున్న ప్రణీత.. తాజాగా తనకు బేబీ షవర్ వేడుకలు చేసినట్లు పేర్కొంది. అలానే ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చింది. ఈ సెలబ్రేషన్స్ బట్టి చూస్తే మరికొన్నిరోజుల్లో ప్రణీత మరో బిడ్డకి జన్మనివ్వనుంది. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్.. అదేంటంటే!) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
సినిమా ఆర్టిస్టులకే కాదు.. సీరియల్ ఆర్టిస్టులకూ అంతే క్రేజ్ ఉంటుంది. ఒక్క సీరియల్ అయిందంటే అందులో ఉన్నవారందరినీ జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తర్వాతి కాలంలో సీరియల్స్ చేసినా, చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. బుల్లితెర నటి సీమంతంఇటీవల నటి మహేశ్వరి సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనకు పండంటి బాబు పుట్టగా.. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. తాజాగా మరో బుల్లితెర నటి సీమంతం ఘనంగా జరిగింది. ముత్యాల ముగ్గు సీరియల్లో కొండమ్మ పాత్రలో నవ్వులు పూయించిన స్వప్న ప్రస్తుతం గర్భిణి.వేడుకల ఫోటోలు2022లో ఆమెకు పెళ్లయింది. త్వరలో ఆమె తల్లి కాబోతోంది. తాజాగా తనకు సీమంతం జరగ్గా ఆ వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మనసిచ్చి చూడు, ముత్యమంత ముగ్గు వంటి ధారావాహికల్లోనూ నటించింది. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడె సీరియల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Swapnakondamma Varakavi (@bujjivarakavi) చదవండి: ఆయన్ను ఫాలో అయి మరీ కొడితే ప్రైజ్‌మనీ ఇస్తానంటూ జక్కన్న బంపర్ ఆఫర్ -
బాలీవుడ్ స్టార్ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్ చూశారా? (ఫోటోలు)
-
Maheshwari: వైభవంగా బుల్లితెర నటి సీమంతం (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఇది రెండోసారి!
బుల్లితెర నటి మహేశ్వరి త్వరలో రెండోసారి తల్లి కాబోతోంది. ఇప్పటికే మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజిచ్చింది. ఆ హంగామా అంతా ఎలా జరిగిందో కూడా వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు చేసింది. భార్య అంటే పంచప్రాణాలైన శివ తనకు జీవితాంతం గుర్తుండిపోయేట్లు గత నెలలో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మరోసారి సీమంతం మహేశ్వరికి మాటైనా చెప్పకుండా అన్నీ అరేంజ్ చేసి సీమంతం చేశాడు. ఇప్పుడు మరోసారి ఆమె సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నీలిరంగు చీరలో నిండా నగలు వేసుకుని ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది మహేశ్వరి. ఫ్యాన్స్ విషెస్ ఈ ఫోటోలు చూసిన అభిమానులు మహేశ్వరి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మహేశ్వరి.. వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్‌లో నటించింది. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్త శివనాగ్తో కలిసి పార్టిసిపేట్ చేసింది. వీరికి హరిణి అనే కూతురు ఉంది. చదవండి: మా వాడిని చూసి భయపడుతున్నారా.. ? విజయ్ మేనమామ కామెంట్లు వైరల్ -
Amala Paul Baby Shower: గ్రాండ్‌గా హీరోయిన్ అమలాపాల్ సీమంతం ఫోటోలు వైరల్
-
ప్రియుడితో పెళ్లి.. ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలాపాల్. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జంటగా ఆడుజీవితం చిత్రంలో మెరిసింది. అయితే గతేడాది తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకన్న అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఫంక్షన్‌ను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది భామ. ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. గతంలో అమలాపాల్ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
గ్రాండ్‌గా బుల్లితెర నటి సీమంతం.. ఫోటోలు వైరల్!
యే రిష్తా క్యా కెహ్లతా హై అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి మోహెనా కుమారి సింగ్. ఆ తర్వాత నయా అక్బర్ బీర్బల్, సిల్సిలా ప్యార్ కా, ప్యార్ తునే క్యా కియా, కుబూల్ హై లాంటి సిరీస్‌ల్లో కనిపించింది. ఆ తర్వాత సుయేష్ రావత్‌ను 2019లో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇప్పటికే అయాన్ష్ అనే బాబు కూడా ఉన్నారు . తాజాగా బుల్లితెర భామ మోహెనా సింగ్ రెండోసారి గర్భం ధరించింది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన భర్తతో కలిసి ఉన్న బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా మోహెనా కుమారి సింగ్‌కు సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఆమె కేవలం నటిగా మాత్రమే కాదు.. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Mohena Kumari Singh (@mohenakumari) -
Mahishivan: జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్.. ఏడ్చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
సర్ప్రైజ్ సీమంతం.. ఏడ్చేసిన బుల్లితెర నటి
సీరియల్స్‌లో యాక్ట్ చేసినవారిని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. ఒకవేళ వారు యాక్టింగ్‌కు దూరంగా ఉన్నా సరే ఫలానా సీరియల్లో ఈ పాత్ర చేశారు, ఆ పాత్రలో భలే కనిపించారు అంటూ ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అందుకనే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. యూట్యూబ్‌లోనూ సొంతంగా ఛానల్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు తమ విషయాలను వీడియోల ద్వారా జనాలతో షేర్ చేసుకుంటున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి కూడా అదే చేసింది. రెండోసారి ప్రెగ్నెంట్ వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసింది మహీశ్వరి. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్తతో కలిసి పాల్గొంది. ఆమె భర్త శివనాగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఈ జంటకు హరిణి అనే కూతురు ఉంది. త్వరలో ఆమెతో ఆడుకోవడానికి ఓ బుజ్జి పాపాయి రానుంది. మహేశ్వరి ప్రస్తుతం ప్రెగ్నెంట్. దీంతో ఆమెకు ఏదైనా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు శివ. సర్ప్రైజ్ సీమంతం.. ఇంకేముంది, సీమంతం వేడుక ప్లాన్ చేశాడు. భార్యకు తెలియకుండానే సీమంతం వేడుకకు కావాల్సినవన్నీ సమకూర్చాడు. భార్య, కూతురికి అవసరమయ్యే షాపింగ్ కూడా చేశాడు. బోటింగ్‌కు వెళ్తున్నాం.. అని చెప్పి వారిని నేరుగా ఓ ఈవెంట్ హాల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కనిపించడంతో షాకైంది నటి. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తనను రెడీ చేసి సీమంతం చేశారు. ఎమోషనలైన నటి ఈ సర్ప్రైజ్ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది మహేశ్వరి. ఆమె ఏడుస్తుంటే మేఘన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అనంతరం మహేశ్వరి- శివ కేక్ కట్ చేశారు. ఆ కేక్ కూడా చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేయించారు. భార్య పొట్టకు ముద్దుపెడుతున్న భర్త, ఆ పక్కన వారి మొదటి కూతురు నిలుచున్నట్లు ప్రత్యేకంగా తయారు చేయించారు. కేక్ కట్ చేయడంతో పాటు పనిలో పనిగా ఫోటోషూట్ కూడా చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సిద్దార్థ్‌వర్మ - విష్ణుప్రియ, ఇంద్ర- మేఘన దంపతులు, యాంకర్ రవి హాజరయ్యారు. చదవండి: తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్ -
ఘనంగా హీరోయిన్ సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Yashas Chandrakant Patla (@yashas.patla) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ తన ట్విటర్లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv — Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024 -
Kavya Gowda Baby Shower Pics: వైభవంగా కన్నడ నటి కావ్య గౌడ సీమంతం (ఫోటోలు)
-
కూతురితో కలిసి వేడుకలో పాల్గొన్న కల్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ తెలుగువారికి సుపరిచితమే. మెగా అల్లుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. అయితే ప్రస్తుతం కల్యాణ్ దేవ్ ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ నవిష్క అనే కూతురు ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే కల్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఉంటున్న కల్యాణ్ దేవ్ గతంలో తన తల్లి బర్త్‌డే జరుపుకున్న ఫోటోలను పంచుకున్నారు. అలాగే తాజాగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా తన చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకలో పాల్గొన్న ఫోటోలను కల్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వేడుకలో తన కూతురు నవిష్కతో కలిసి పాల్గొన్నారు. మీ అందరి ప్రేమ, అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతోంది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ్ దేవ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
Pearle Maaney Baby Shower Function: నటి సీమంతం.. భర్తతో కలిసి సందడి చేసిన అమలాపాల్ (ఫోటోలు)
-
హౌస్ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్‌లో సీమంతం వేడుకలు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. సోమవారం రాగానే హౌస్‌లో నామినేషన్ల పర్వం మొదలవుుతంది. నామినేషన్ల మొదటి రోజే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సారి కాస్తా ప్రత్యేకంగా మహారాజ్యంలో జరుగుతాయని తెలిపారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియ కాస్తా ఆసక్తిని పెంచింది. అలా ఈ వారంలో జరిగిన నామినేషన్స్‌లో ఏర్పాటు చేసిన రాజ్యంలో శోభ, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించాడు. శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్లు కత్తులను బయటకు తీసి.. మిగిలిన వారిలో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ సబబు అనిపిస్తే వారిని రాజమాతలు నేరుగా నామినేట్ చేస్తారు. అయితే ఈ వారంలో భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్స్‌లో నిలిచారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో బిగ్ బాస్ హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. ఈ వారంలో కంటెస్టెంట్స్‌కు ఊహించని సర్ప్రైజ్లతో ముందుకొచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో శివాజీ కుమారుడిని డాక్టర్‌గా పంపించి హౌస్‌లో ఎమోషన్ పండించారు. శివాజీకి సర్ప్రైజ్ తాజాగా రిలీజైన ప్రోమోలో మరో కంటెస్టెంట్ అంబటి అర్జున్‌కు బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన భార్య సురేఖ హౌస్‌లోకి తీసుకొచ్చారు. దీంతో తన భార్యను చూసిన అర్జున్ ఫుల్ ఎమోషనలయ్యాడు. భార్య, భర్తల అనుబంధం ఏంటనేది వీళ్లిద్దరి చూస్తే తెలిసిపోతుంది. హౌస్‌లో అడుగుపెట్టిన అర్జున్ భార్య.. భర్తకు గోరుముద్దలు తినిపించింది. నీ ఎమోషన్స్‌ను బయటపెట్టు.. నువ్వు సరిగా రియాక్ట్ అవ్వట్లేదంటూ తన భర్తకు సలహాలు కూడా ఇచ్చింది. ఇది చూసిన శివాజీ.. దిస్ ఇజ్ లైఫ్ అంటూ కొటేషన్ ఇచ్చేశాడు. అర్జున్ భార్యకు సీమంతం అయితే ప్రస్తుతం అర్జున్ భార్య గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. హోస్లో అడుగుపెట్టిన ఆమెకు కంటెస్టెంట్స్ అందరూ కలిసి సీమంతం వేడుక నిర్వహించారు. హౌస్మేట్స్ ఎంతో సంతోషంగా ఆమెకు సీమంతం నిర్వహించడంతో అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య సీమంతం చూసి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆమె హౌస్ నుంచి బయటకెళ్తుండగా ఫుల్ ఎమోషనలయ్యారు. ఈ ప్రోమోలు చూస్తే మొత్తానికి బిగ్ బాస్ హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
హీరోయిన్ సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆమెపై పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పెళ్లైన కొన్ని నెలలకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అప్పట్లో ఆమెపై నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న స్వరభాస్కర్‌కు ఆమె భర్త సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..) ఆమె భర్త ఫాహద్ అహ్మద్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్వరభాస్కర్ సోషల్ మీడియాలో పంచకున్నారు. ఈ సందర్బంగా సీమంతానికి హాజరైన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు తెలియకుండా ప్లాన్ చేసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో వివాహం చేసుకున్నారు ఈ జంట. మార్చిలో సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఆ తర్వాత స్వరా భాస్కర్ గర్భం ధరించినట్లు జూన్నెలలో వెల్లడించింది. బేబీ బంప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. గతంలో స్వరా భాస్కర్‌పై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలయ్యాయి. కాగా.. ఆమె 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara)