
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలాపాల్. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జంటగా ఆడుజీవితం చిత్రంలో మెరిసింది. అయితే గతేడాది తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకన్న అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఫంక్షన్‌ను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది భామ. ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. గతంలో అమలాపాల్ డైరెక్టర్ విజయ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment