గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన బ్యూటీ అమలాపాల్. నవంబర్‌లో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా.. ఇటీవలే తాను ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. తాజాగా తన భర్తతో కలిసి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫోటోలు షేర్ చేస్తూ కాస్తా ఫన్నీగా కామెంట్స్ చేసింది ముద్దుగుమ్మ.
అమలాపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ సమయంలో ఒక పురుషుడి పొట్ట దాదాపు అతని భార్య గర్భంతో సమానంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాంటి అపోహలను తొలగించే సరైన సమయం ఇదే. ఇప్పుడు కేవలం నేను మాత్రమే గర్భవతి కాదు. మేమిద్దరం. సారీ మై హస్బెండ్' అంటూ ఫన్నీ ఫోటోలను పంచుకుంది.
కాగా.. తమిళంలో మైన చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్, విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. తమిళం, తెలుగులోనూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాజ ఈ జంట మనస్పర్థలు కారణంగా 2017లో విడిపోయారు. కాగా.. గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తితో డేటింగ్ విషయం బయటకొచ్చింది. అమలాపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రియుడు పెద్ద పార్టీని ఏర్పాటు చేసి లవ్ ప్రపోజ్ చేశాడు. అమలాపాల్ యాక్సెప్ట్ చేయడంతో ప్రియుడు ఆమె చేతికి ఉంగరం తొడిగి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment