
కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలాపాల్‌కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు చెబుతున్నారు.
(ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్.. నిన్న గాక మొన్న ప్రపోజ్. అంతలోనే పెళ్లి)
గతేడాది జూన్ నుంచే డేటింగ్‌లో ఉన్న అమలాపాల్ నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. కాగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. అమలాపాల్ తెలుగులో స్టార్ హీరోలందరితో నటించింది. అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. కాగా.. హీరోయిన్ అమలాపాల్ తన ప్రియుడు, ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో నవంబర్ 5న వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్‌ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment