బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆమెపై పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పెళ్లైన కొన్ని నెలలకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అప్పట్లో ఆమెపై నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న స్వరభాస్కర్‌కు ఆమె భర్త సర్‌ప్రైజ్ ఇచ్చారు.
(ఇది చదవండి: స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..)
ఆమె భర్త ఫాహద్ అహ్మద్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్వరభాస్కర్ సోషల్ మీడియాలో పంచకున్నారు. ఈ సందర్బంగా సీమంతానికి హాజరైన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు తెలియకుండా ప్లాన్ చేసి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో వివాహం చేసుకున్నారు ఈ జంట. మార్చిలో సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఆ తర్వాత స్వరా భాస్కర్ గర్భం ధరించినట్లు జూన్‌నెలలో వెల్లడించింది. బేబీ బంప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. గతంలో స్వరా భాస్కర్‌పై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలయ్యాయి. కాగా.. ఆమె 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment