Swara Bhaskar
-
కొన్ని ఈవీఎంల్లో ‘ఫుల్ చార్జింగ్’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. అణుశక్తినగర్ అసెంబ్లీ స్థానం ఫలితంపై తీవ్ర అనుమానాలున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి ఫహాద్ అహ్మద్ పేర్కొన్నారు. ఎన్సీపీ (అజిత్) అభ్యర్థి సనా మాలిక్ చేతిలో కేవలం 3,378 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలన్నింట్లోనూ సనా మాలిక్ ఆధిక్యం కనబరిచారు. తక్కువ చార్జింగ్ ఉన్న ఈవీఎంల్లోనేమో సనా వెనకబడ్డారు. ఇదెలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. అహ్మద్ అనుమానాలను ఆయన భార్య, సినీ నటి స్వరాభాస్కర్ కూడా బలపరిచారు. ‘‘17 రౌండ్ల దాకా నా భర్తే ఆధిక్యంలో ఉన్నారు. కానీ చివరి మూడు రౌండ్లలో లెక్కించిన ఈవీఎంలన్నీ 99 శాతం బ్యాటరీ చార్జింగ్ ఉన్నవే! వాటన్నింట్లోనూ సనా మాలికే ఆధిపత్యం సాధించడంతో ఫలితమే తారుమారైంది’’అని చెప్పుకొచ్చారు. ‘‘రోజంతా ఓటింగ్ ప్రక్రియ కొనసాగాక ఈవీఎం యంత్రాల్లో చార్జింగ్ తగ్గాలి. చాలా ఈవీఎంల్లో అలాగే తగ్గింది కూడా. కానీ కొన్ని ఈవీఎంల్లోనే, ప్రత్యేకించి చివరి మూడు రౌండ్లలో లెక్కించిన వాటిలోనే ఫుల్ చార్జింగ్ ఉంది. ఇదెలా సాధ్యం?’’అని ఆమె ప్రశ్నించారు. -
ధిక్కార ‘స్వర’ భాస్కరం!
స్వర భాస్కర్... బాలీవుడ్ హీరోయిన్, నటిగా కొందరికి తెలుసు. హిందుత్వ వ్యతిరేకిగా... తప్పును తప్పు అని ఎత్తిచూపగల వ్యక్తిగా మరికొందరికి పరిచయం! ముస్లిం స్నేహితుడిని పెళ్లాడి.. ఇటీవలే తల్లిఅయిన స్వర భాస్కర్ తాజాగా మళ్లీ తన ధిక్కార స్వరంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీరును నేరుగా ప్రశ్నించారు. ఏళ్లుగా నిర్బంధంలో మగ్గుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, గుజరాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వంటి వారికి మద్దతుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో స్వర భాస్కర్ మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు న్యాయవ్యవస్థను ఒక ప్రశ్న అడగదలిచాను. దేనికి మీకు భయం? సామాన్య ప్రజలకైతే బతుకు సాగాలన్న భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేసి కొడతారన్న భయం ఉంటుంది. దేశంలో ముస్లింలను ఎక్కడపడితే అక్కడ దాడి చేసి కొట్టేస్తున్నారు. పాపం ఈ దేశంలో దళితులపై కూడా విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయి. మాలాంటి వాళ్లకు కూడా పని దొరకదనో.. కామెడీ షోల్లాంటివి చేయనివ్వరని, నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకంటారనో భయాలు ఉండవచ్చు. మరి మీకే రకమైన భయాలు ఉన్నాయి? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు.. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లోకి చేరిపోతున్నారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై పోయి ఉంటారు. ఖరీదైన.. మంచి కాలేజీల్లో, విదేశాల్లో చదువుకుని ఉంటారు. పెళ్లాం పిల్లలతో వాళ్లు జీవితంలో స్థిరపడి పోయి ఉంటారు. అలాంటి మీకు ఈ వృద్ధాప్యంలో ఎందుకు భయం? ఇంకా ఎలాంటి ఆశ మిగిలిపోయింది మీలో? ఏం కావాలి మీకు? రాజ్య సభ సభ్యత్వం, గవర్నర్ పదవుల అవసరం ఏమిటి? ఇన్ని ఆశలు పెట్టుకున్న మీరు మీ పని చేయమని మాత్రమే కదా మేము అడుగుతున్నది? అది కూడా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు?’’ అంటూ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.Why are you so scared at this age? What is the greed you have at this age? Do you want a Governor or Rajya Sabha post at this age?- @ReallySwara#UmarKhalidpic.twitter.com/2CSyEGWUFL— Mohammed Zubair (@zoo_bear) September 18, 2024 ఉమర్, ఖాలిద్, అతర్, గుష్ఫా, షెర్జీల్ ఇమామ్ వంటి ఎందరో మూడు నాలుగైదేళ్లుగా జైళ్లలో మగ్గిపోతున్నారని గుర్తు చేసిన స్వర.. ‘‘న్యాయవ్యవస్థ వీరిని పూర్తిగా మరచిపోయినట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ లేకుండా.. విచారణ కూడా మొదలు కాకుండా ఇలాంటి వాళ్లు ఎంతకాలం నుంచి మగ్గిపోతున్నారో కూడా న్యాయవ్యవస్థ పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘అందుకే నేను ఈ వేదికపై నుంచి నాలుగేళ్ల కాలం అనేది ఎంత పెద్ద సమయమో చెప్పదలుచుకున్నాను. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరులో ఇరవయ్యవ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత మూడుసార్లు కోవిడ్ వచ్చి పోయింది. వ్యాధి కారక వైరస్ మూడు నాలుగు మార్లు రూపం మార్చుకుంది కూడా. ప్రాణాంతక మహమ్మారి జబ్బుకు చికిత్స కూడా దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఫహాద్ (భర్త)ను కలిశా. అప్పట్లో ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండింది. తరువాత మా దోస్తీ కాస్తా ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. పెళ్లికి నిర్ణయించాం. అదీ పూర్తయ్యింది. కానీ... అప్పుడూ.. ఇప్పుడూ వాళ్లు (ఉమర్ తదితరులు) జైళ్లల్లోనే ఉండిపోయారు. బెయిల్ రాలేదు.. విచారణ మొదలు కాలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
మార్చిలో రెండోసారి పెళ్లి, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి
బాలీవుడ్ నటి స్వర భాస్కర్- సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్.. పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. జూన్‌లో గర్భం దాల్చినట్లు ప్రకటించిన స్వర భాస్కర్ ఇటీవలే సీమంతం వేడుక ఘనంగా జరుపుకుంది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వర, ఆమె భర్త ఫహద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నెల 23న కూతురు పుట్టిందని పేర్కొన్నారు. అప్పుడే ఆమెకు పేరు కూడా ఖరారు చేశారు. తమ చిన్నారికి రుబియా అనే పేరు పెడుతున్నట్లు తెలిపారు. స్వర భాస్కర్- ఫహద్ అహ్మద్ 201లో ఓ నిరసన కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. ఈ ఏడాది జనవరి 6న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అలా తొలుత రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 16న సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఈ జంట మార్చిలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. జూన్‌లో ప్రెగ్నెన్సీ వచ్చినట్లు పేర్కొంది స్వర భాస్కర్. తాజాగా పాపాయికి జన్మనిచ్చిన స్వర దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) చదవండి: లీక్‌ల బెడద.. ఏదైనా అధికారికంగా ప్రకటిస్తాం: మంచు విష్ణు -
హీరోయిన్ సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆమెపై పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పెళ్లైన కొన్ని నెలలకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అప్పట్లో ఆమెపై నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న స్వరభాస్కర్‌కు ఆమె భర్త సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..) ఆమె భర్త ఫాహద్ అహ్మద్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్వరభాస్కర్ సోషల్ మీడియాలో పంచకున్నారు. ఈ సందర్బంగా సీమంతానికి హాజరైన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు తెలియకుండా ప్లాన్ చేసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో వివాహం చేసుకున్నారు ఈ జంట. మార్చిలో సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఆ తర్వాత స్వరా భాస్కర్ గర్భం ధరించినట్లు జూన్నెలలో వెల్లడించింది. బేబీ బంప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. గతంలో స్వరా భాస్కర్‌పై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలయ్యాయి. కాగా.. ఆమె 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
భర్తతో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. ట్రెడిషనల్ లుక్ ఫోటోస్ వైరల్
-
గుసగుసలేం లేవు.. సీక్రెట్‌గా పెళ్లి తంతు.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన స్టార్స్ వీరే!
ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్ల నుంచి సినీ, టీవీ నటీనటుల వరకు పెళ్లి పీటలు ఎక్కినవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ జాబితాలో ఎక్కువగా ఉంది బాలీవుడ్ స్టార్సే. ఎంతోకాలంగా డేటింగ్, రిలేషన్స్‌లో ఉన్న కొందరు లవ్‌బర్డ్స్ రహస్యంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 2022లో కత్రినా-విక్కీ కౌశల్, రణ్‌బీర్-ఆలియా భట్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ పెళ్లి చేసుకోగా.. ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీలతో పాటు పలువురు నటీనటులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జంటల సంఖ్య ఎక్కువగానే ఉంది. రహస్యంగా పెళ్లిపీటలెక్కి అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఆ స్టార్స్ ఎవరో చూద్దాం! పోలిటికల్ లీడర్‌తో హీరోయిన్.. నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహాద్ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె ఆలస్యంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 6న అహ్మద్‌ను సీక్రెట్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా.. తన పెళ్లి ప్రకటనను నెల రోజుల తర్వాత ప్రకటించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. వీరికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కమెడియన్‌తో నటి.. బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ కమెడియన్ కుమార్ వరుణ్‌ను పెళ్లాడింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 23న పెళ్లి పీటలెక్కింది. అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఆలస్యంగా ప్రకటించిన ఈ జంట పెళ్లి విషయంలోనూ గోప్యత పాటించింది. వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు, అతి సన్నిహితుల సమక్షంలో ఇంటిమేట్ వెడ్డింగ్‌తో మాన్వి, కుమార్‌లు ఏడడుగులు వేశారు. వివాహ తంతుకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండ జాగ్రత్త పడ్డారు. కనీసం పెళ్లంటూ రూమర్స్ కూడా వినిపించలేదు. దీంతో పెళ్లి అనంతరం ఒక్కటయ్యామంటూ వీరిద్దరూ నెట్టింట ఫొటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్, ఫాలోవర్స్ కంగుతిన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకున్నారంటూ వారి పోస్టుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాయిస్ ఆర్టిస్ట్‌తో నటి ఏడడుగులు.. అలాగే మరో బాలీవుడ్ నటి చిత్రాశి రావత్ కూడా రహస్యంగా పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, నటుడు, వాయిస్ ఆర్టిస్ట్ ధృవాదిత్య భగ్వనానీని ఫిబ్రవరి 4న పెళ్లాడింది. ఛత్తీస్‌ఘడ్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి సందడిని అభిమానులతో పంచుకుంది. దీంతో క్షణాల్లో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా చిత్రాశి రావత్ షారుక్ ఖాన్ ‘చక్ దే ఇండియా’ మూవీతో గుర్తింపు పొందింది. ఇందులో హాకీ ప్లేయర్ కోమలిగా తన నటన, ఆటతో ఆకట్టుకుంది. ప్రియుడితో ‘కోడలా కోడలా కోడుకు పెళ్లామా’ నటి.. అలాగే సాత్ నిభానా సాతియా సీరియల్ నటి దేవలీనా భట్టాచార్జి (కోడలా కోడలా కొడుకు పెళ్లామా ఫేం) కూడా సీక్రెట్‌గానే పెళ్లిపీటలెక్కింది. గతేడాది డిసెంబర్లో తన ప్రియుడితో ఏడడుగులు వేసిన దేవలీనా ఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించింది. లోనావాలాలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో దేవలీనా స్నేహితులు విశాల్ సింగ్, రష్మీ సింగ్, భావిని పురోహిత్ దంపతులు ఉన్నారు. దీంతో ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు ఏకంగా ట్విటర్లో దేవలీనాకీ షాదీ (#DevoleenaKiShaadi) అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా కీర్తి పెళ్లి! బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ పెళ్లిపీటలెక్కింది. బాయ్‌ఫ్రెండ్, నటుడు రిబ్బు మెహ్రాను పెళ్లాడింది. ఫిబ్రవరి 25న గుట్టుచప్పుడు కాకుండా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని రిబ్బు నివాసం ఈ వివాహ వేడుకకు వేదికగా మారింది. తమ పెళ్లి ఫోటోలను కొత్త జంట ఆలస్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. -
స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకోవడంపై పలువురు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత సాధ్వి ప్రాచి వీరి వివాహంపై తీవ్రంగా స్పందించారు. శ్రద్ధ వాకర్‌కు పట్టిన గతే స్వర భాస్కర్‌కు పడుతుందని హెచ్చరించారు. బాహుశా పెళ్లికి ముందు స్వర భాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'శ్రద్ధవాకర్‌ను ఆమె ప్రియుడే 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన వార్తను స్వర భాస్కర్ ఎక్కువగా పట్టించుకోనట్లు ఉంది. పెళ్లి చేసుకోవాలనే పెద్ధ నిర్ణయం తీసుకునే ముందు స్వరభాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సింది. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం. నేనేమీ ఎక్కువగా చెప్పలేను. కానీ శ్రద్ధ వాకర్‌కు ఏం జరిగిందో స్వర భాస్కర్‌కు కూడా అదే జరుగుతుంది.' అని సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ఫాహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది స్వరభాస్కర్. వీరి వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మతపెద్దలు పేర్కొన్నారు. ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తనతో సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. అనంతరం వాటిని తీసుకెళ్లి అడవిలో పడేశాడు. చదవండి: పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే.. -
వివాదంగా మారిన హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. ట్రోలింగ్ షురూ
నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారింది.సమాజ్‌వాదీ పార్టీ ఫహాద్ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. గతనెల 6నే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న స్వర భాస్కర్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ పెళ్లి వివాదంగా మారింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని స్వర భాస్కర్ పెళ్లాడటంతో ముస్లిం వర్గాల నుంచి ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో ఫహాద్‌ను స్వర భాస్కర్ అన్నయ్య అని పిలిచి ఇప్పుడు పెళ్లెలా చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.ఆ సమయంలోనే ఫహాద్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆమె ఫహాద్‌ని అన్నయ్య అని పిలిచేది. అతని పుట్టినరోజు సందర్భంగా కూడా.. ఫహద్‌ను ‘భాయ్(సోదరుడు)అంటూ సంబోదిస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇప్పుడీ ట్వీట్‌ను వైరల్ చేస్తూ.. అన్నా అని పిలిచిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకోవాలనిపించి అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి దీనిపై ఆమె ఏమైనా కౌంటర్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
పొలిటికల్ లీడర్‌ను పెళ్లాడిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి పీటలు ఎక్కింది. తన స్నేహితుడు, ప్రియుడు ఫహద్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లాడింది. అయితే తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది. గత నెల జనవరి 6న పెళ్లి జరగగా నేడు( ఫిబ్రవరి 16న) సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. చదవండి: బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. ఆ స్టార్ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా? గత నెల జనవరి 6న వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు ఆమె తెలిపింది. రాజకీయ కార్యకర్త, సమాజ్‌వాది పార్టీ లీడర్ అయిన అహ్మద్ ఫహద్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఈ వీడియో షేర్ చేస్తూ ‘ప్రేమను వెతికినప్పుడు మొదట స్నేహం ఎదురువుతుంది. ఆ తర్వాతే అది ప్రేమతో ఎండ్ అవుతుంది. ఈ జర్నీలో ఒకరినొకరం తెలుసుకున్నాం. ఫైనల్‌గా నా లవ్ దొరికింది. వెల్కమ్ టూ మై హార్ట్ ఫహద్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Sometimes you search far & wide for something that was right next to you all along. We were looking for love, but we found friendship first. And then we found each other! Welcome to my heart @FahadZirarAhmad It’s chaotic but it’s yours! ♥️✨🧿 pic.twitter.com/GHh26GODbm — Swara Bhasker (@ReallySwara) February 16, 2023 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి
భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 83వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆయనతో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్ ఈ పాదయాత్రను సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న యాత్ర కశ్మీర్లో ముగియనుంది. ఇటీవలే రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. భర్త రాబర్ట్‌తో వాద్రాతో వచ్చి తొలిసారి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాలను కవర్ చేసి 1,209 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొన్నారు. చదవండి: గుజరాత్ తొలి విడత ఎన్నికలు.. 11 గంటల వరకు 18.95% పోలింగ్ -
Swara Bhaskar: చంపేస్తామంటూ స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న తన నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖను పంపారు. బెదిరింపు లేఖపై నటి స్వర భాస్కర్ వెర్సోవా పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సోషల్ మీడియాలో తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది స్వర భాస్కర్. 2017లో ఆమె వీరసావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలంటూ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ట్వీట్ చేసింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చదవండి: (కాలికి గాయం, నడవలేని స్థితిలో నిత్యామీనన్!) -
ఐదేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఐసీయూ బెడ్‌పై ఉంది.. ఈ సినిమాతోనే ఆక్సిజన్ దొరికింది
Swara Bhasker Brutally Trolled For Allegedly Dig At Vivek Agnihotri: బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమాలో విభిన్నమైన పాత్రలు చేసే స్వరా వాస్తవ జీవితంలో కూడా విభిన్నంగా ఉంటుంది. సినిమాలపై స్పందన నుంచి సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంది స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజన్ల మనోభావాలు దెబ్బతినే పోస్టులు, ట్వీట్లు పెట్టి ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంది స్వరా భాస్కర్. 'మీ కష్టంతో వచ్చిన విజయాన్ని చూసి మిమ్మల్ని ఎవరైనా అభినందించాలని అనుకుంటే.. గత ఐదేళ్లుగా తలలో చెత్త పెట్టుకుని గడపరనుకుంటా.' అని ట్వీట్ చేసింది ఈ కాంట్రవర్సీ బ్యూటీ. అయితే ఈ ట్వీట్ 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ఉద్దేశించి చేసిందని నెటిజన్స్ స్వరాపై మండిపడుతున్నారు. ట్వీట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటా స్వరా. ప్రజలు అడుగుతున్నారు.. తాము ఆదరిస్తున్న సినిమాను ఎందుకు ప్రముఖ బాలీవుడ్ తారలు మెచ్చుకునేలా ఒక్క పదం కూడా మాట్లాడట్లేదని. అంటే కేవలం ప్రముఖమైన వారు మాత్రమే. మీరు చిల్ అవ్వండి.' అని నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ 'స్వరా చాలా తెలివైనది. ఒకరి కష్టంపై పేరు సంపాందించుకోవడం ఎలానో తనకు చాలా బాగా తెలుసు. కానీ జనం పిచ్చోళ్లు కాదు. నిన్ను నమ్మడానికి. ఇది నీ కెరీర్‌కు సహాయపడదు.' అని రాసుకొచ్చాడు. If you want someone to congratulate you for the ‘success’ of your efforts.. maybe don’t spend the last five years shitting on their heads.. 💁🏾♀️ #justsaying — Swara Bhasker (@ReallySwara) March 13, 2022 మరొకరైతే 'అతను అభినందించడానికి అర్హుడు స్వరా. ఐదేళ్ల నుంచి బాలీవుడ్ దాదాపు ఐసీయూ బెడ్‌పై ఉంది. ఈరోజు బాలీవుడ్‌కు అతనే ఆక్సిజన్ అందించాడు. ప్రజలు మర్చిపోయిన మిమ్మల్ని అతనే గుర్తు చేశాడు.' అని రాశారు. కాగా మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ తారలు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, హన్సల్ మెహతా, ఆదిత్య ధర్ తదితరులు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ చిత్రానికి హర్యాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కల్పించాయి. He deserve to be Congratulated @ReallySwara Since 5 years Bollywood has almost in ICU Bed, Today he gave Oxygen for Bollywood.. You were deleted from people brain, he reminded.. If you not support him by thinking he's not Terrorists gang, then read comments@vivekagnihotri https://t.co/EOSyiB3jc3 — RaMesh Chauhan #BJP_Only (@RameshChauhanM) March 14, 2022 People are talking about big Bollywood stars .. U can chill..Nobody is expecting anything from you.. #TheKashmiriFiles https://t.co/WtX3whFLjn — Upadhya Dr 🇮🇳 (@LonelyStranger_) March 14, 2022 -
వారు తిరస్కరించిన పాత్రలతోనే నా కెరీర్ రూపొందింది..
Swara Bhaskar Says Her Career Made Up Of Roles Rejected By Others: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్ పక్కన పెడితే.. వాస్తవ జీవితంలో మిగతా బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నంగా ఉంటారామె. సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తారు స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టి.. ఆపై ట్రోలింగ్‌కు గురవుతారు. అయితే తాజాగా తాను నటించిన పాత్రల గురించి పలు ఆసక్తిర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కెరీర్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలు ఇతరులు వద్దనుకోవడం వల్లే తనకు వచ్చాయని పేర్కొన్నారు. 'రాంజనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి చిత్రాలలో నాకు వచ్చిన పాత్రలను మొదటగా వేరే నటీమణులకు ఆఫర్ చేశారు. ప్రేమ్ రతన్ ధన్‌పాయో సినిమాలో సల్మాన్ ఖాన్‌కు చెల్లెలిగా చేయాలని ఎవరు కోరుకుంటారు. ఇలాంటి పాత్రలన్నీ ఆఖరి నిమిషంలో అకస్మాత్తుగా వదులుకునేసరికి చివరిగా నన్ను సంప్రదించేవారు. అయితే ఇదందా నన్ను పెద్దగా బాధించేది కాదు. ఒక పాత్రను ఒప్పుకునేప్పుడు నేను బాక్సాఫీస్ గురించి, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయాలు పెద్దగా ఆలోచించను. ఇంకా వీరే ది వెడ్డింగ్ సినిమాలో ముందుగా నాకు బదులు రియా కపూర్ చేయాల్సింది. కానీ, ఆ పాత్రను నాకివ్వమని స్వయంగా రియా కపూర్ ఒప్పించింది.' అని పేర్కొంది స్వరా భాస్కర్. ఇలా ఇతరులు తిరస్కరించిన పాత్రలతో తన కెరీర్ రూపొందినట్లు, ఆ పాత్రలతోనే తనకు మంచి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. -
హీరోయిన్‌కు కరోనా, మీ చావు కబురు కోసం ఎదురుచూస్తుంటామంటూ..
సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరసగా సినీ తారలు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి' అని సూచించింది. చదవండి: క్లైమాక్స్ లేకుండా రిలీజైన రానా మూవీ, ప్రేక్షకుల అసహనం.. డబుల్ మాస్క్ దరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నా’ అని పేర్కొంది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. తనకు కరోనా అంటూ చేసిన పోస్ట్‌పై తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ‘గుడ్‌న్యూస్ చెప్పావు. ‘2022లో బెస్ట్ న్యూస్ ఇదే, కరోనా వచ్చిందా? అయిదే చచ్చిపో.. నీ మరణవార్త కోసం ఎదురు చూస్తుంటాం’ అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు స్పందించిన పోస్ట్స్ నెట్టంట చర్చనీయాంశమైంది. చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’ View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
కోవిడ్ బారిన పడ్డ మరో బాలీవుడ్ నటి
Actress Swara Bhaskar tests positive for Covid-19: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ఏక్తా కపూర్, మంచు లక్ష్మీ, మహేశ్ బాబు వంటి స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 'నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి' అని సూచించింది. డబుల్ మాస్క్ దరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నా అని పేర్కొంది. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
మీకంటే నా పనిమనిషి చాలా అందంగా ఉంటుంది..నటిపై ట్రోలింగ్
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురవుతారు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్. తాజాగా తాను పెట్టిన పోస్టుకు నెటిజన్ ఓ కామెంట్ చేశాడు. దానికి స్వరా ఘాటు రిప్లై ఇచ్చింది. స్వరా భాస్కర్ ఈ మధ్యే ఓ మైక్రో బ్లాగింగ్‌ను మొదలుపెట్టారు. అందులో చీరతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్‌గా 'ఒక చీర, ఒక పార్క్, ఒక నడక, ఒక పుస్తకం.. ప్రశాంతంగా.. ఇలా కచ్చితంగా ఫీల్ అవ్వాలి.' అని రాసుకొచ్చారు. A sari, a park, a walk, a book.. ‘at peace’ must feel like this 💛✨#smalljoys #gratitude #feelingwise :) pic.twitter.com/QREYOLYnyO — Swara Bhasker (@ReallySwara) November 9, 2021 ఈ పోస్ట్‌కు 'చీరలో మీకంటే నా పనిమనిషి చాలా అందంగా, గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌కు స్వరా 'మీ పనిమనిషి సహాయం నిజంగా అందమైనది. ఆమెను, ఆమె శ్రమను మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఆమెతో చులకనగా ప్రవర్తించవద్దు.' అని ఘాటుగా సమాధానమిచ్చింది. అలాగే గత నెలలో ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ తనపై ట్విటర్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు చేసింది. I’m sure your your household help is beautiful. I hope you respect her labour and her dignity & don’t act like a creep with her. 🙏🏽 https://t.co/nf8egoWkJl — Swara Bhasker (@ReallySwara) November 11, 2021 -
షారూక్ ఖాన్ ఉత్తమ మనిషి.. ఇద్దరిలో రెండోస్థానం
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! వద్దంటే వద్దు టీకాలను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ చాలా చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికాలో పిల్లలకు టీకా తప్పనిసరి చేయడం పట్ల కాలిఫోర్నియా తల్లిదండ్రులు ప్రదర్శనకు దిగారు. ‘జీఈ’ సంస్థ ఉద్యోగులు వ్యతిరేక ప్రదర్శన జరిపారు. ఇటలీలో టీకా వ్యతిరేక నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగించారు. – ఆరన్ జిన్, జర్నలిస్ట్ ఉత్తమ మనిషి సభ్యత, హుందాౖయెన ప్రవర్తనకు షారూక్ ఖాన్ ఉదాహరణ. ఇండియా అనే ఒక భావనలోని అన్ని ఉత్తమ లక్షణాలకు ఆయన ప్రతినిధి. ఆయనకూ, గౌరీకీ నా ప్రేమ. – స్వర భాస్కర్, నటి ఇద్దరిలో రెండోస్థానం ప్రపంచంలో వంద కోట్ల జనాభా ఉన్నవి రెండే దేశాలు. చైనా: ఒక్క డోస్– 223 కోట్లు; రెండు డోసులు– 105 కోట్లు. భారత్: ఒక్క డోస్–100.7 కోట్లు; రెండు డోసులు– 29.3 కోట్లు. దీనర్థం వంద కోట్ల టీకాలు వేసిన దేశాల్లో మనది రెండో స్థానం అని. – అంకిత్ లాల్, రచయిత మరిచిపోలేని రోజు 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ సైన్యం అండ ఉన్న లష్కర్లు గొడ్డళ్లు, కత్తులు, తుపాకులతో జమ్మూకశ్మీర్ మీద దాడి చేశారు. పురు షులు, స్త్రీలు, పిల్లల మీద అనూహ్యమైన అకృత్యాలకు తెగబడ్డారు. బారాముల్లా కాన్వెంట్‌లోని నన్స్ను కూడా వదల్లేదు. దీన్ని ఎన్నటికీ మరిచిపోవద్దు; ఎన్నటికీ క్షమించొద్దు. – నందిని బాహ్రీ, వ్యాఖ్యాత వాళ్లకు వదిలేయాలి నేను బొట్టు పెట్టుకుంటాను– నీ ఇష్టం. నేను బొట్టు పెట్టుకోను– అదీ నీ ఇష్టమే. నీకు నచ్చినా నచ్చకపోయినా బొట్టు పెట్టుకోవాల్సిందే– ఇది స్త్రీ మీద పెత్తనం. ఇప్పుడు దీన్నే ‘బొట్టు’ స్థానంలో ‘బుర్ఖా’ను మార్చి చదవండి. ఏం ధరించాలో, ఏం తినాలో మహిళలకు చెప్పడం పితృస్వామ్య అణిచివేత. – అద్వైత్, హిస్టారియన్ నలుగురితో నారాయణ! ‘పేరెంట్స్’తో ఒక కార్యక్రమంలో ఉన్నాను. ఇద్దరు దంపతులు అక్కడికి రాగానే వేసుకోవడానికి మాస్కులు బయటికి తీసి, చుట్టూ ఉన్నవాళ్లకు లేకపోవడంతో వాళ్లు కూడా వేసు కోలేదు. దాంతో మాస్కు వేసుకున్నదాన్ని నేనొక్క దాన్నే అయ్యాను. ప్రజలు ఏం చేయాలో సామాజిక ధోరణి శాసిస్తుంది. సామాజిక ధోరణిని నియమ నిబంధనలు శాసిస్తాయి. – నిస్రీన్ అల్వాన్, అసోసియేట్ ప్రొఫెసర్ వీరుడికి వందనం గ్రేట్ అష్ఫాకుల్లా ఖాన్‌ను ఆయన జయంతి రోజున(అక్టోబర్ 22) స్మరించుకుంటున్నాను. ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సహ వ్యవస్థాపకుడు; ప్రసిద్ధ ఖాకోరీ ఘటనలో ప్రముఖ పాత్ర పోషించినవాడు. నవ్వు ముఖంతో ఉరికంబం ఎక్కిన విప్లవకారుల్లో అష్ఫాకుల్లా ఖాన్ ఒకరు. అప్పుడాయనకు కేవలం 27 ఏళ్లు. – రిజ్వాన్ అర్షద్, కర్ణాటక ఎమ్మెల్యే -
భారత ట్విటర్ ఎండీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ టూల్‌కిట్ కేసుకు సంబంధించి మే 31న భారత ట్విటర్ ఎండీ మనీశ్ మహేశ్వరీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. భారత ట్విటర్ ఎండీని విచారించడానికి మే 31న ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీస్ బృందం కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లినట్లు వినికిడి. ఇక నటి స్వరా భాస్కర్, భారత ట్విటర్ ఎండీ మనీష్ మహేశ్వరి, ఇతరులపై ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసుపై ఢిల్లీలోని తిలక్ మార్గ్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఫేక్ న్యూస్, వినియోగదారుల రక్షణ అంశంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నేపథ్యంలో ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసింది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై పదే పదే హెచ్చరిస్తున్నా ట్విటర్ పట్టించుకోని కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు మే 24న సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్‌కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు -
Ashok Shrivastav: ‘అతడి ఇంట్లోని మహిళల మీద జాలి కలుగుతోంది’
‘ఫైండ్ ఎ బెడ్’ అనే యూఎన్ కోవిడ్ సహాయ కార్యక్రమానికి ఇండియా నుంచి బాలీవుడ్ నటీమణులు రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్ అంబాసిడర్లుగా ఉన్నారు. అయితే.. అందుకు వారు తగినవారు కాదు అని దూరదర్శన్ టీవీ జర్నలిస్ట్ అశోక్ శ్రీవాత్సవ్ ట్వీట్ చేయడం వివాదం అయింది. ‘తగని’ ఆ ముగ్గురూ శ్రీవాత్సవ్ కు తగిన సమాధానమే ఇవ్వబోతున్నారు. రిచా అయితే ఇప్పటికే టిట్ ఫర్ ట్వీట్ ఇచ్చేశారు. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్.. ఈ ముగ్గురూ.. ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ అని ఒక ఇమేజ్ ఉంది. కేవలం వాళ్లు నటించిన సినిమాల వల్ల మాత్రమే వచ్చిన ఇమేజ్ కాదు అది. విలక్షణమైన వాళ్ల వ్యక్తిత్వం కూడా ఆ ఇమేజ్‌కి కొంత కారణం. 34 ఏళ్ల రిచా సామాజిక కార్యకర్త. విద్యార్థి ఉద్యమాలకు మద్దతు ఇస్తుంటారు. అందువల్ల తనకు సినిమా ఛాన్స్‌లు పోతాయనేం భయపడరు. ఇక నాలుగు పదుల సన్నీ లియోన్. ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్. తర్వాత హాలీవుడ్‌కి, అక్కణ్ణుంచి బాలీవుడ్‌కి వచ్చారు. రాజకీయ స్పృహ, చైతన్యం రెండూ ఎక్కువే. మూగజీవుల సంరక్షణ సంస్థ ‘పెటా’కు బ్రాండ్ అంబాసిడర్ కూడా పని చేశారు. 33 ఏళ్ళ స్వరా భాస్కర్ డేర్ అండ్ డెవిలిష్! ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై జరిగే ప్రదర్శనలకు తన గళాన్ని ఇస్తుంటారు. సినిమాల్లో, ఓటీటీల్లో ఆమె వేసే పాత్రలు కూడా ఆమెకు దీటైనవే. అంటే దాపరికాలు ఉండనివి. ఈ ముగ్గురూ ప్రస్తుతం ‘ఫైండ్ ఎ బెడ్’ అనే ప్రచారోద్యమానికి మద్దతిస్తున్నారు. అయితే.. ‘ఫైండ్ ఎ బెడ్‌కు వీరు తగని వ్యక్తులు’ అని అశోక్ శ్రీవాత్సవ్ అనే జర్నలిస్టు విమర్శించడంతో రిచా, సన్నీ, స్వరా స్పందించవలసి వచ్చింది. బాధ్యత గల ఉద్యోగంలో ఉండి మహిళల్ని కించపరిచేలా రిచా, సన్నీ, స్వరాలను అంత మాట అన్న శ్రీవాత్సవ్ గురించి తర్వాత తెలుసుకోవచ్చు. ముందైతే ‘ఫైండ్ ఎ బెడ్’ ఏమిటో చూద్దాం. ఇదొక యూత్ ప్రోగ్రామ్. కోవిడ్ ఉద్ధృతితో ఆసుపత్రులలో బెడ్లు దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో ముంబైలోని ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూమెంట్ టు యునైటెడ్ నేషన్స్’ (ఐఐఎంయుఎన్) అనే సంస్థ తాజాగా ‘ఫైండ్ ఎ బెడ్’ అనే కార్యాచరణను భుజానికెత్తుకుంది. దేశంలోని 160 నగరాలను కలుపుతూ 26 వేల మంది విద్యార్థులతో ఒక వ్యవస్థను నిర్మించి, వారి ద్వారా అవసరమైన వారికి కోవిడ్ ఆసుపత్రులలో బెడ్లను సమకూర్చేందుకు చక్కటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఏయే ఆసుపత్రులలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని ఈ యువ సైన్యం ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారికి ఆ ప్రాంతంలో బెడ్ దొరికేలా ‘ఫైండ్ ఎ బెడ్’ ఏర్పాట్లు చేస్తుంది. యువతరంలో బాలీవుడ్ నటీనటులకు, అందులోనూ సామాజిక కార్యక్రమాల్లో కాస్త చురుగ్గా ఉండేవాళ్లకు క్రేజ్ ఉంటుంది కాబట్టి ఐ.ఐ.ఎం.యు.ఎన్. రిచా చద్దా, సన్నీ లియోన్, స్వరా భాస్కర్లను తమ ప్రచారోద్యమ గౌరవ సార థులుగా నియమించుకుంది. అది చూసే మన శ్రీవాత్సవ్ భ్రుకుటి ముడివేసి, ‘తగని వ్యక్తులు’ అని వీళ్ల మీద ఒక ట్వీట్ ముద్ర వేశారు. ∙∙ అశోక్ శ్రీవాత్సవ్ దూరదర్శన్‌లో సీనియర్ కన్సల్టింగ్ ఎడిటర్. అంతటి మనిషి ఇప్పుడిలా ఈ ముగ్గురిపై నోరు పారేసుకుని డీడీ ప్రతిష్టకే భంగం కలిగేలా చేశారని విమర్శలు వస్తున్నాయి. ‘ఫౌండ్ ఎ బెడ్’కు తమని తగని వ్యక్తులుగా పేర్కొంటూ ఆ ముగ్గురి ఫొటోలు పెట్టి ట్విట్టర్లో కామెంట్‌ను పోస్ట్ చేసిన శ్రీవాత్సవ్‌కు ఏ మాత్రం కనికరం లభించే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఇలాంటివే కొన్ని అనవసర వ్యాఖ్యల్ని చేసిన చరిత్ర అతడికి ఉంది. ఇప్పుడిక భవిష్యత్తునూ లేకుండా చేసుకునేలా ఉన్నారు. ‘‘అతడి ట్వీట్‌ను చూసి షాక్ తిన్నాను. దూరదర్శన్ ఇలాంటి స్త్రీ ద్వేషినీ, దుష్ట మానవుడినా ఉద్యోగంలోకి తీసుకుంది!’’ అని రిచా ట్వీట్ చేశారు. ఆపత్సమయాలలో ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తారు. ఇతడు సహాయం చేయకపోగా, ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు. వెంటనే నటి పన్ను తాప్సీ.. రిచాకు మద్దతుగా స్పందించారు. ‘‘అతడు నా గురించి కూడా గతంలా ఇలాగే కామెంట్ చేశాడు. ముఖ్యమైన ట్వీట్లకు సమాధానం ఇవ్వవలసిన తొందరలో ఉండి అతడిని వదిలేశాను. తన అధికారాన్ని ఆ వ్యక్తి ఇలా వాడుకుంటున్నాడు’’ అని తాప్సీ అన్నారు. ‘‘ఇలాంటి వాళ్లను ఊరికే వదలిపెట్టకూడదు’’ అని తాప్సీ ట్వీట్‌కి రిచా రిప్లయ్ ఇచ్చారు. ముగ్గురిలో మిగతా ఇద్దరు.. సన్నీ లియోన్, స్వరా భాస్కర్ వెంటనే ఏమీ స్పందించలేదు. శ్రీవాత్సవ్‌పై వారు దూరదర్శన్‌కు ఫిర్యాదు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. రిచా అయితే నేటికీ ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నారు! ‘‘ఇలాంటి ఒక వ్యక్తి జాతీయ మీడియాలో ఎలా పని చేస్తున్నట్లు!! అతడి ఇంట్లోని, ఆఫీసులోని మహిళల మీద జాలి కలుగుతోంది’’ అని అంటున్నారు. -
2019లోనే సుశాంత్ సోదరికి తెలుసా?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తి.. అతడికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చేదని.. డబ్బు తీసుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక సుశాంత్ మెంటల్ హెల్త్ కండిషన్ గురించి రియా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నటుడి కుటుంబ సభ్యులు గతంలో ఆరోపించారు. మీడియాలో కూడా రియాకు సంబంధించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో నటి స్వర భాస్కర్ రియాకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం.. మీడియా, రియాను కసబ్ కన్నా దారుణంగా వేధిస్తుందని విమర్శించారు స్వర. తాజాగా రియాను ఈ కేసులో కావాలనే ఇరికించారంటున్నారు స్వర. అంతేకాక సుశాంత్ మానసిక అనారోగ్యం గురించి అతడి మాజీ మేనేజర్ శ్రుతి మోదీకి, అతడికి సోదరికి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్‌ని ట్వీట్ చేశారు స్వర. (చదవండి: రియాకు న్యాయం జరగాలి: మంచు లక్ష్మి) 2019, నవంబర్ 26న జరిగిన ఈ వాట్సాప్ చాట్‌లో శ్రుతి.. సుశాంత్ సోదరి నీతుకి ఓ ప్రిస్కిప్షన్‌ని మెసేజ్ చేసింది. దాంతో పాటు సుశాంత్‌కు వైద్యం చేస్తోన్న సైక్రియాట్రిస్ట్ సుసాన్ వాకర్ ఫోన్ నంబర్ని కూడా సెండ్ చేసింది. దీనికి బదులుగా నీతు.. ఆ వైద్యుడిని కలవాలని ఉందంటూ రిప్లై కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ చాట్ కాస్త సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి అజయ్ కుమార్ అనే జర్నలిస్ట్ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన స్వర.. ‘హేయ్ మనస్సాక్షి లేని యాంకర్స్.. రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ మానసిక అనారోగ్యం గురించి అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసిందని ఈ వాట్సాప్ చాట్ నిరూపిస్తోంది. గట్టిగా అరుస్తూ.. డిబెట్లు నిర్వహించే యాంకర్లు దీన్ని విస్మరించారు ఎందుకు. చూడబోతే రియాను కావాలనే ఈ కేసులో ఫ్రేమ్ చేసినట్లు అనిపిస్తోంది’ అంటూ స్వర ట్వీట్ చేశారు. సుశాంత్ మానసిక అనారోగ్యం గురించి రియా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ హీరో కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని ఈ చాట్‌తో స్పష్టమవుతోంది. ఇక సుశాంత్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ప్రిస్క్రిప్షన్‌లో ఉంది. Hey Voyeurs & shameless conscience-less anchors! Chat Proves #RheaChakraborty had informed the family about the mental health of SSR way back in 2019. Why did all the high decibel, screaming shouting anchors conveniently ignore this story? Does it seem like Rhea is being framed? https://t.co/qFWDuEw6B2 — Swara Bhasker (@ReallySwara) August 30, 2020 -
అవుట్‌సైడర్స్‌కి ప్లస్ అదే!
‘‘నెపోటిజమ్ కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు.. ప్రతి పరిశ్రమలోనూ ఉంది. అలానే బాలీవుడ్లో నెపోటిజమ్ ఉంది. బాలీవుడ్ ఒక ఫ్యూడల్ వ్యవస్థలా పని చేస్తోంది’’ అన్నారు హిందీ నటి స్వరా భాస్కర్. ‘తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు స్వర. ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్’ అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు స్వరా భాస్కర్. ‘‘నెపోటిజమ్ గురించి అందరూ ఎలా అనుకుంటారంటే... ఒక్క సినిమాలో స్టార్ కిడ్ని పరిచయం చేస్తే చాలు వాళ్ల కెరీర్ సెట్ అయిపోయినట్టే అనుకుంటారు. కానీ అలా జరగదు. ప్రతీ సినిమాకి కష్టపడాలి. నిరంతర కృషే మనల్ని స్టార్‌గా నిలబెడుతుంది. అవుట్‌సైడర్‌గా ఉంటూ స్టార్ కిడ్స్ పరిస్థితి చూస్తే జాలిగా అనిపిస్తుంటుంది. వాళ్ల ఒత్తిడి, వాళ్ల మీద ఉండే అంచనాలు అలాంటివి. కానీ వాళ్లకు ఉండే అవకాశాలు తక్కువేం కాదు. అవుట్‌సైడర్‌గా మాకు కష్టంగా అనిపించే విషయాలు వాళ్లకు చాలా సులువుగా జరిగిపోతాయి. అయితే మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రస్తుతం చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ‘వీళ్లు టాలెంట్‌తోనే ఎదిగారు’ అనే పేరు స్టార్ కిడ్స్‌తో పోల్చుకుంటే.. అవుట్‌సైడర్స్‌కి త్వరగా ఏర్పడుతుంది. అదే అవుట్‌సైడర్స్‌కి ప్లస్’’ అన్నారు. బాలీవుడ్లో ఉండే పోటీ గురించి చెబుతూ– ‘‘సినిమా అనేది పెద్ద పోటీ ప్రపంచం. నిరంతరం ఎవరో ఒకరితో మనం మనకు తెలిసోతెలియకో పోటీ పడుతూనే ఉంటాం. బయట చాలా మంది స్టార్ కిడ్స్‌కి చాలా పొగరు, వాళ్ల పవర్‌ను ఇతరుల మీద రుద్దాలనుకుంటారు అని అభిప్రాయపడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో నేను రెండు రకాల వాళ్లతో (ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్) పని చేశా. ఎదుటివారితో చాలా చక్కగా ప్రవర్తించి, కష్టపడే మనస్థత్వం ఉన్నవాళ్లు, టైమ్ విషయంలో కచ్చితంగా ఉండేవాళ్లు ఎక్కువగా ఇన్సైడర్సే. కొందరు అవుట్‌సైడర్స్ స్టార్‌డమ్‌ను తలకెక్కించుకొని వాళ్ల స్టార్ స్టేటస్‌ను దుర్వినియోగం చేయడం గమనించాను. ఇది నేను ఎవ్వర్నీ ఉద్దేశించి చెప్పడం లేదు. నా అనుభవం ద్వారా చెబుతున్నాను. స్టార్‌డమ్‌ను దుర్వినియోగం చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు’’ అని వివరించారు స్వరా భాస్కర్. -
అలా బయటకు కనిపిస్తారా?
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి దర్యాప్తుపై ముంబై పోలీసులను తప్పుపట్టడం న్యాయం కాదని నటి స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై పోలీసులను నమ్మకపోవడానికి ఎలాంటి కారణాలు లేవు. సీబీఐ తన పని తాను నిష్పాక్షికంగా చేస్తుందని నేను నమ్ముతున్నాను అని పేర్కొంది. కోర్టులు, న్యాయవ్యవస్థ లాగానే పోలీసులు కూడా వారి పని చేసుకునేందుకు అనుమతించాలి. అనవసరంగా నిందలు వేయడం కరెక్ట్ కాదు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాకుండా 'సుశాంత్ డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఎందుకు అనుకోకూడదు? అతను ఎప్పుడూ డిప్రెషన్లో ఉన్నట్లు కనిపించలేదు అని కొందరు ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నట్లు బయటకు కనిపిస్తారా? సుశాంత్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కాబట్టి మనం ఈ నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నాం. మానసిక ఆరోగ్యానికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాల’ని పేర్కొన్నారు. (ముంబై పోలీసులకు శివసేన ఎంపీ కితాబు) సుశాంత్ కేసును సీబీఐ విచారించడాన్ని స్వాగతిస్తూనే నటి ఇలా రెండు విధాలుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొదటినుంచి సుశాంత్ మరణం కేసు విచారణలో ముంబై పోలీసులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు సాగకుండానే సుశాంత్ డిప్రెషన్ వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని, అతను బై పోలార్ డిసీస్‌తో బాధపడుతున్నాడని ముంబై పోలీసులు చెప్పడం తీవ్ర దుమారాన్నిరేపిన సంగతి తెలిసిందే. అనేక మలుపుల మధ్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై విచారణను పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న రియా చక్రవర్తి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు సుశాంత్ మరణానికి సంబంధించి మరేదైనా కేసు నమోదైతే దానిని కూడా సీబీఐ మాత్రమే విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, రియాతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద రియాను మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. (రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’) -
పవర్ ఏంజెల్స్
ఇద్దరిదీ ఢిల్లీ.. ఇద్దరిదీ జేఎన్‌యూ. ఒకరిది ఫేస్బుక్. ఇంకొకరిది బాలీవుడ్. ఒకరు.. మనీ అండ్ మైండ్. ఇంకొకరు.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఇద్దరి మీదా ఇప్పుడు కేసులు! కామెంట్స్ డిలీట్ చేయలేదని అంఖీ.. తీర్పులను ‘ఒబే’ చేయలేదని స్వరా.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు!! న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. మనీ మైండెడ్‌గా ఉండమని చెబుతుంటారు మహిళలకు అంఖీ దాస్. సముచితమైన సలహానేనా ఇది! డబ్బు మనిషిగా ఉండటం?! అంఖీ ఉద్దేశం, ఉద్బోధన సరిగ్గానే ఉన్నాయి. ‘మీ చేతిలో ఒక నైపుణ్యం ఉంటే, దానిని కనుక మీరు సొమ్ము చేసుకోకపోతే ఆ నైపుణ్యానికే అవమానం’ అంటారు. ఇందులో విడమరచి చెప్పేందుకు ఏమీ లేదు. అవకాశం లేక కానీ, ప్రతి ఇంట్లోని మహిళకూ తనూ ఏదైనా చేసి, నాలుగు డబ్బులు సంపాదించాలని ఉంటుంది. పరిస్థితులు వారిని వెనక్కు లాగుతూ ఉండొచ్చు. అప్పుడే కదా ముందుకు రప్పించే ‘మెంటర్’ ఉండాలి. దారి చూపించే మనిషి. కమల అనే గృహిణికి దారి చూపించడానికి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ నుంచి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసి వచ్చిన కావ్య అనే అమ్మాయే అక్కర్లేదు. ఆకు కూరలు అమ్ముతూ వాడుకగా ఇంటి ముందు ఆగే వృద్ధురాలూ ‘మెంటర్’ కావచ్చు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇకనమిక్ టైమ్స్ ఉమెన్స్ ఫోరమ్‌లో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన అంఖీ దాస్.. ఆ ఫోరమ్‌కి హాజరైన మహిళలకు ఈ మాటే చెప్పారు. పట్టణాల్లోని మహిళా వ్యాపారవేత్తలు గ్రామాల్లోని ఔత్సాహిక యువతులకు ‘మెంటర్’గా ఉండాలని. వాళ్లనూ, వీళ్లను కలిపేందుకు అప్పటికే ఫేస్బుక్లో ఉన్న ‘గోల్’ ప్రోగ్రామ్‌లో చేరేందుకు వాళ్ల దగ్గర సంతకాలు కూడా తీసుకున్నారు అంఖీ దాస్. ఫేస్‌బుక్‌కు ఇండియా, దక్షిణ మధ్య ఆసియా దేశాల పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఆమె. చిన్న తాడు ఉన్నా బావిలోకి చేద వేయాలన్న అసక్తి ఉన్న మహిళల్ని మైనీ మైండెడ్‌గా మార్చడమే ‘గోల్’ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరుతోంది కూడా. ఫేస్బుక్ సహకారంతో గ్రామీణ యువతులు, పట్టణ ప్రాంత గృహిణులు ఆర్థికంగా శక్తిమంతులు అయ్యారంటే అందుకు అంఖీ దాస్ నిర్వహణా సామర్థ్యాలే కారణం. అయితే వేర్వేరు సామాజిక, రాజకీయ, పాలనా పరిస్థితులున్న దేశాలలో ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను నడిపించడం అన్నది తరచు మాటలు పడవలసిన ‘జాబ్’ కూడా! నిందలు, ఆరోపణలు, విమర్శలు.. వీటితో పాటు ఇప్పుడు అంఖీ దాస్ బెదరింపుల్ని కూడా ఎదుర్కొంటున్నారు. చంపేస్తామని, రేప్ చేస్తామని రెండు రోజులుగా ఆమెకు ‘థ్రెట్స్’ వస్తున్నాయి. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు ఆమె. ఆమెపైనా ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు అవుతున్నాయి. ఆగస్టు 14న ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఆంగ్ల దినపత్రికలో అంఖీ దాస్‌పై ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండియాలో మైనారిటీలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్ట్ అవుతున్న కామెంట్లను ఆమె తొలగించడం లేదని, లౌకిక గుణం కలిగి ఉండవలసిన ఫేస్‌బుక్‌ను మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంచుతూ, లౌకిక రాజ్యస్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని అంఖీపై వాల్‌స్ట్రీట్ ఆరోపణ. దీనిపై వెను వెంటనే స్పందించిన సోషల్ మీడియా పౌరులు.. ‘నవ్వలా చేస్తావా! నిన్నేం చేస్తామో చూస్తుండు..’ అని ఆమెను తమ కామెంట్స్‌తో నేటికీ భయభ్రాంతురాలిని చేస్తూనే ఉన్నారు. అంఖీ పోలీసులను ఆశ్రయించారు. ఫేస్‌బుక్‌లోకి రాకముందు వరకు ఆమె మైక్రోసాఫ్ట్ (ఇండియా) పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా ఉన్నారు. అంఖీ కోల్‌కతాలోని లోరెటో కాలేజ్‌లో డిగ్రీ చేశారు. ఢిల్లీ జె.ఎన్.యు.లో అంతర్జాతీయ సంబంధాలు, రాజనీతి శాస్త్రాలను చదివారు. మహిళలు, గ్రామీణ యువతుల ఆర్థిక , సామాజిక అభివృద్ధే ప్రధానంగా ఫేస్‌బుక్‌ను నడిపిస్తున్న అంఖీ దాస్ ప్రస్తుతానికైతే జవాబు చెప్పవలసిన స్థితిలోనే ఉన్నారు. ‘కమ్యూనల్ పోస్ట్’ లను డిలీట్ చేయకపోవడం అన్నది.. అది ఎవరి నిర్లక్ష్యం అయినా సరే. అంఖీ దాస్‌తో పాటు ఇప్పుడు చిక్కుల్లో పడిన మరో మహిళ స్వరాభాస్కర్. దేశ లౌకిక స్పృహకు భంగం వాటిల్లేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించారన్నది అంఖీ పై నేరారోపణ అయితే.. న్యాయస్థానాల లౌకిక నిబద్ధతను శంకించిన ‘నేరానికి’ స్వరాపై అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు వెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ముంబైలో ‘ముంబై కలెక్టివ్’ అనే ఎన్జీవో ఆధ్యర్వంలో ‘ఆర్టిస్ట్స్ అగైన్స్ట్ కమ్యూనిజం’అనే అంశం మీద మాట్లాడుతూ.. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో న్యాయస్థానాల లౌకిక రాజ్యాంగ కట్టుబాటును ఈ బాలీవుడ్ నటి శంకించారు. అంఖీ లానే స్వరదీ ఢిల్లీనే. తనూ జె.ఎన్.యు.లో చదివింది. ఒక విషయంపై పరస్పర విరుద్ధంగా టీచర్‌తో తర్కించే ఒకే బెంచీలోని విద్యార్థుల్లా ‘మోదీకి అనుకూలం’ అని అంఖీ, ‘మోదీకి వ్యతిరేకం’ అని స్వర.. కేసులు ఎదుర్కొంటున్నారు. న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. -
నేను బీ గ్రేడా?
బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత హీరోయిన్ తాప్సీ బాగోగుల గురించి తెలుసుకునేవారి సంఖ్య సడన్‌గా ఎక్కువైపోయిందట. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి)ను ప్రోత్సహించేవారే పరోక్షంగా కారణమంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఒక అవుట్‌సైడర్ (అంటే ఇండస్ట్రీలో తెలిసినవారు లేకపోవడం). ప్రస్తుతం బాలీవుడ్లో మంచి జోరుమీద ఉన్న తాప్సీ కూడా అవుట్‌సైడర్. అందుకే అవుట్‌సైడర్‌గా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అంటూ తాప్సీకి ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయి. ఈ విషయంపై తాప్పీ స్పందిస్తూ – ‘‘సుశాంత్‌ను నేనెప్పుడూ కలవలేదు. కానీ అతను మరణించిన రోజు (జూన్ 14) నుంచి నాకు ‘ఆర్ యు ఓకే, నువ్వు బాగానే ఉన్నావా? సంతోషంగానే ఉంటున్నావా? ఏవైనా విషయాలు మనసు విప్పి చెప్పాలనుకుంటున్నావా?’ అంటూ నాకు రోజు ఫోన్లు, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. మా అమ్మానాన్న ఢిల్లీలో ఉంటారు. నేను, నా చెల్లులు ముంబైలో ఉంటాం. మాతో పెద్దవాళ్లెవరూ లేరని మా ఇరుగు పొరుగు వారు కూడా నాపై ఓ ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారు. ‘నువ్వు ఇక్కడి అమ్మాయివి కాదు. మీ తల్లిదండ్రులు నీతో లేరు. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాతో చెప్పుకో’ అనడం నాకు కొత్తగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో అవుట్‌సైడర్స్ చాలా ఇబ్బందులుపడుతున్నారని చిత్రీకరించేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునేవారు చాలా భయపడతారు’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే.... నెపోటిజమ్ డిస్కషన్స్‌లో భాగంగా హీరోయిన్స్ తాప్సీ, స్వరా భాస్కర్లను ‘బీ గ్రేడ్ యాక్టర్స్’ అని అన్నారట కంగనా రనౌత్. ఈ విషయంపై తాప్సీ ట్వీటర్ వేదికగా పరోక్షంగా స్పందించారు. ‘‘పది, పన్నెండు తరగతుల స్టూడెంట్స్ ఫలితాల తర్వాత మా రిజల్ట్స్ కూడా వచ్చాయని విన్నాను. మా గ్రేడ్ సిస్టమ్ అధికారికమేనా? ఇప్పటివరకు నెంబర్ సిస్టమ్ అనుకున్నానే!’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు తాప్సీ. కరణ్ జోహార్ వారసులను మాత్రమే ప్రోత్సహిస్తాడని కంగనా విమర్శిస్తున్నారు. కరణ్ మంచివాడని, ఏ బ్యాక్‌గ్రౌండూ లేని తాను బాలీవుడ్లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నానని తాప్సీ అనడం కంగనాకి మింగుడుపడలేదు. అందుకే తాప్సీ బీ గ్రేడ్ యాక్టర్ అని కంగనా అనడం, తాప్సీ సమాధానం ఇవ్వడం జరిగింది. -
‘ఇది మన సమాజం ఆలోచన తీరు’
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ‘రాస్భరి’. అయితే దీనిలోని ఓ సన్నివేశం పట్ల సినీ గేయ రచయిత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చీఫ్ ప్రసూన్ జోషి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగి ఉన్న పురుషుల ముందు ఓ చిన్న అమ్మాయి వారిని రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేస్తుందని.. పిల్లలను ఇలాంటి సన్నివేశాల్లో నటింపజేయడం అవసరమా అని ప్రసూన్ జోషి ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘రాస్భరి’ టీమ్‌తో పాటు దీనిలో ప్రధాన పాత్రలో నటించిన స్వరా భాస్కర్‌ను ఉద్దేశిస్తూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు. ‘‘రాస్భరి’ వెబ్‌సిరీస్‌లో ఓ చిన్న పాప తాగుబోతులను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను చూస్తే చాలా విచారం కలిగింది. ‘రాస్భరి’ టీం ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి సన్నివేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకేతాలా లేక దోపిడీ స్వేచ్ఛకు ఉదాహరణలా’ అనే దాని గురించి ప్రేక్షకులు, మేధావులు ఆలోచించుకోవాలి. వినోదం కోసం చిన్నారులను ఇలాంటి సన్నివేశాల్లో నటింపజేయడం ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు. (బరువు పెరుగుతున్నా!) Saddened byWebseries #Rasbhari’s irresponsible content portraying alittle girl child dancing provocatively in frontof men drinking.Creators& audience need 2seriously rethink Freedomof expression or freedom of exploitation?Let’s spare children in thedesperate need4 entertainment. — Prasoon Joshi (@prasoonjoshi_) June 26, 2020 దీనిపై స్వరా భాస్కర్ స్పందించారు. ‘బహూశా ఈ సీన్ అపార్థానికి దారి తీస్తుందేమో. కానీ ఈ సన్నివేశం మీరు ఊహించిన దానికి పూర్తిగా భిన్నం. ఆ పాన తన ఇష్టానుసారం డ్యాన్స్ చేస్తుంది. అది చూసి ఆమె తండ్రి సిగ్గుపడతాడు. అంతే తప్ప ఇక్కడ ఆ చిన్నారి డ్యాన్స్ ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశంతో తీయలేదు. సమాజం తనను కూడా లైంగిక దృష్టితో చూస్తుందనే విషయం పాపం తనకు తెలియదు. ఇది మన సమాజపు ఆలోచన తీరు’ అంటూ ఘాటుగా స్పందించారు స్వరా భాస్కర్. వెబ్‌సిరీస్‌లో ఈ సన్నివేశం స్వరా చిన్నప్పటి వెర్షన్లో వస్తుంది. ఓ స్టూండెట్ తన టీచర్ వెంటపడే కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌పై ఇప్పటికే చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. (అమ్మా తప్పు చేశానా?) -
బరువు పెరుగుతున్నా!
ఈ లాక్డౌన్ సమయంలో బరువు పెరిగే పనిలో బిజీగా ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్. కృష్ణ సేన్ అలియాస్ స్వీటీ సేన్ అనే ఓ అమ్మాయి అబ్బాయిగా మారి రెండుసార్లు వివాహం చేసుకుంది. ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ స్వీటీ సేన్ బయోపిక్‌లో స్వరభాస్కర్ నటించనున్నారు. ఈ చిత్రం గురించి స్వరభాస్కర్ మాట్లాడుతూ – ‘‘ఈ లాక్డౌన్ సమయంలో ఫుల్‌గా తింటూ బరువు పెరుగుతున్నాను. స్వీట్స్, కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నాను. కొన్నిసార్లు అర్ధరాత్రి జంక్ ఫుడ్ తీసుకుంటున్నాను. ఇదంతా కృష్ణ సేన్ బయోపిక్ కోసమే. ఈ లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో, షూటింగ్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ కచ్చితంగా తెలియదు. లాక్డౌన్ ముగిసిన తర్వాత నా ప్రస్తుత మూవీ కమిట్మెంట్స్ని పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోనే ఈ బయోపిక్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ బయోపిక్కు స్వర ఓ నిర్మాత కూడా కావడం విశేషం. -
అమ్మా తప్పు చేశానా?
మంచివాళ్లనుకున్న అబ్బాయిలు మంచి స్కూళ్లలోని అబ్బాయిలు మంచి కుటుంబాల అబ్బాయిలు ఇలా ఎలా చేయగలుగుతారు?.. మోనా తల్లి విస్మయం. మోనాకైతే లోకం మీదే నమ్మకం పోయింది. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి వందల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి వేల లైక్స్ ఉండే అమ్మాయి బాయ్స్ దగ్గర తన మార్ఫింగ్ ఫొటోలు చూసి గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అబ్బాయిలూ.. ఆలోచించండి. ఏడిపించడం ఫన్ అవుతుందా?! ‘‘అమ్మా.. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు వద్దంటున్నా వినకుండా ఫొటోలు షేర్ చేసి తప్పు చేశాను కదా..’’ గట్టిగా ఏడుస్తోంది మోనా (పేరు మార్చాం). పద్నాలుగేళ్ల అమ్మాయి. ఢిల్లీలో మంచి పేరున్న స్కూల్లో చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ ‘బాయ్స్ లాకర్ రూమ్’ స్క్రీన్ షాట్స్‌లో మోనా మార్ఫింగ్ ఫొటో ఉంది. మోనాపై బాయ్స్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఉన్నాయి. వాటిని తనే తల్లికి చూపించింది. ‘‘లేదురా.. నువ్వు తప్పేం చేయలేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. అబ్బాయిలదే తప్పు. నేను నీవైపే ఉన్నాను. వాళ్లకు బద్ధొచ్చేలా చేస్తాను’’ అన్నారు మోనా తల్లి. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. అబ్బాయిలు మళ్లీ ఇలాంటి పని చేయకుండా గట్టి శి„ý పడేలా చేయడానికి ఏమేమి చట్టాలు ఉన్నాయో పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టారు. ∙∙ ఇది ఢిల్లీలో జరిగిన ఘటన. అయితే మిగతా చోట్ల భవిష్యత్తులో బయట పడబోయే ఘటన కూడా కావచ్చు! ‘బాయ్స్ లాకర్ రూమ్’ అనే మాటను దేశం ఈ ఆదివారం తొలిసారిగా వినింది. ఇదేమీ భారత్‌పై ఉగ్రవాదులు తలపెట్టిన దాడుల ఆపరేషన్ పేరు కాదు. దేశవిద్రోహల కోడ్ లాంగ్వేజి కూడా కాదు. ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అకౌంట్ పేరు. అందులో ఉన్నవాళ్లంతా పసితనం వీడని పద్నాలుగూ పదిహేనేళ్ల మగ పిల్లలే. ఢిల్లీలోని ఐదారు స్కూళ్లలోని వాళ్లు. వాళ్లలోనే ఒకరిద్దరు అడ్మిన్లు. ఆ అకౌంట్ చాట్ గ్రూప్‌లో జరిగే రహస్య సంభాషణలన్నీ తమ క్లాస్మేట్స్ అయిన ఆడపిల్లల గురించే! వాళ్ల ఫొటోలను షేర్ చేస్తారు. మార్ఫింగ్ చేస్తారు. కామెంట్స్ రాస్తారు. నవ్వుకుంటారు. వాటిల్లో బాడీ షేమింగ్ ఉంటుంది, రేపిస్టు మెంటాలిటీ ఉంటుంది. వీళ్ల చాటింగ్ స్క్రీన్ షాట్స్ కొందరు అమ్మాయిల (వాళ్లలో మోనా కూడా ఉంది) ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో షేర్ అవడంతో ‘బాయ్స్ లాకర్ రూమ్’ సంగతి బయటపడింది. ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లల్ని మానసికంగా కృంగదీసి, వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే చాటింగ్ అది. సున్నిత మనస్కులు తట్టుకోలేరు. కరోనా వైరస్‌ను వుహాన్‌లో మొదట ఒక చైనా నర్సు గుర్తించారు. అలా ఈ ప్రమాదాన్ని మనదేశంలో వెంటనే గుర్తించిన వ్యక్తి.. స్వాతీ మలీవాల్. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్. ఢిల్లీపోలీసులకు, ఇన్స్టాగ్రామ్ సంస్థకు మర్నాడే.. అంటే సోమవారమే.. ఆమె నోటీసులు పంపారు. ఇలాంటి తత్వం ఉన్న మగపిల్లలకు తక్షణం ఒక బలమైన హెచ్చరిక వెళ్లాలి అని స్వాతి అనుకున్నారు. ∙∙ మంగళవారం ఉదయానికి పోలీసులు లాకర్ రూమ్ సభ్యుడొకరిని కనిపెట్టారు. పద్నాలుగేళ్ల విద్యార్థి అతడు. ఢిల్లీలో పేరున్న స్కూల్లో చదువుతున్నాడు. ‘రూమ్’ తాళం చెవిలా దొరికాడతడు. మిగతా సభ్యులు పేర్లు, వాళ్లు ఏయే స్కూళ్లలో చదువుతున్నదీ అతడి నుంచి, అతడి స్నేహితుల నుంచి పోలీసులు రాబట్టారు. వాళ్లలో ఒకరిద్దరు ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏప్రిల్ మొదటివారంలో ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొదలైంది. ఒకర్నుంచి ఒకరు జమ అయ్యారు. ఇద్దరు అడ్మిన్లు కాబట్టి గ్రూపు త్వరత్వరగా వృద్ధిచెందింది. గ్రూపు టాపిక్ ఒక్కటే.. అమ్మాయిలు.. అమ్మాయిలు.. అమ్మాయిలు! తెలిసిన అమ్మాయిలు. క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు! వాళ్ల ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సంపాదించడం, ఇందులో షేర్ చేయడం. షేమింగ్ చేయడం! బుధ, గురువారాల్లో వీళ్లలో మరికొందరు బయటపడ్డారు. వీరిపైన ఏం చర్య తీసుకుంటారని తెలియకపోయినా, ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రం.. ‘పోలీసులు ఇంటికి రావడం’ అనే శిక్షను అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్‌తో జువెనైల్ జస్టిస్ బోర్డు.. కేసులేమీ తీసుకోవడం లేదు. దాంతో పోలీసులు నిందిత విద్యార్థులను ప్రస్తుతానికి వాళ్ల తల్లిదండ్రుల అదుపులోనే ఉంచుతున్నారు. మొబైల్ ఫోన్స్ తీసేసుకున్నారు. తమకు తెలియకుండా వాళ్లను సిటీ బయటికి పంపించడం చేయకూడదని చెప్పి వెళుతున్నారు. బాయ్స్ లాకర్ రూమ్ చాట్‌లో తమ కూతుళ్ల ఫొటోలు ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రుల పరిస్థితీ దాదాపుగా అలానే ఉంది. ‘‘అమ్మా.. నా తప్పేమీ లేదు కదా’’ అని కూతురు అపరాధిలా అడగడం ఏ తల్లిని మాత్రం బాధించదు! ∙∙ తల్లి చెబుతున్న దానిని బట్టి మోనాకైతే ఈ అనుభవం తర్వాత లోకం మీదే నమ్మకం పోయింది! ‘నేనీ సమాజంలో ఉండలేను మమ్మీ’ అంటోంది. ‘ఫొటోలు షేర్ చెయ్యకమ్మా.. ఎవరైనా మిస్ యూజ్ చేస్తారు’ అని మొదట్లో తల్లి చెప్పినప్పుడు మోనా నవ్వింది. ‘పిచ్చి భయాలు మమ్మీ నీవన్నీ. మీ రోజుల్లో అలా ఉండేదేమో. బాయ్స్ ఇప్పుడు మర్యాదగా ఉంటున్నారు. గర్ల్స్‌ని, ఆడవాళ్లని రెస్పెక్ట్ చేస్తున్నారు’ అని మోనా అంది. ఇప్పుడు అదే బాయ్స్ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు! ఎందుకిలా చేశారు అని అడితే.. ‘ఫర్ ఫన్’ అంటున్నారు! దుర్గంధం ఈ దర్గంధపూరిత ప్రవర్తనకు అబ్బాయిల తల్లిదండ్రులనే నిందించాలి. ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వక పోవడం మీ హక్కు అన్నట్లు అబ్బాయిల్ని పెంచుతున్నారు. బాయ్స్.. ఈ పనికి మీరు సిగ్గుపడాలి. – నటి సోనమ్ కపూర్ ఇంత విషమా! ఈ వయసులో ఇంత పురుషాహంకారం అంటే ఈ విషం ఎంతవరకూ పాకపోబోంది! అత్యాచారాలను ప్రేరేపించే ఇలాంటి ఆలోచనా ధోరణులను ఇప్పుడే అదుపులో పెట్టాలి. – నటి స్వరా భాస్కర్ -
దూరంగా ఉంటునే ఆశీర్వదించారు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా సెలబ్రిటీలు స్వీయ నిర్భందానికి పరిమితయ్యారు. ఇక పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు కరోనాపై సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు తమ బర్త్‌డే పార్టీని స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఖరీదైన రెస్టారెంట్లలో చాలా స్పెషల్‌గా జరుపుకుంటారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ బర్త్ డే(ఏప్రిల్ 9) అందుకు భిన్నంగా జరిగింది. ప్రస్తుతం స్వరభాస్కర్ 32వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సమయంలో స్వయంగా వెళ్లి విష్ చేసే పరిస్థితి లేకపోవటంతో స్నేహితులు, అభిమానులు స్వర భాస్కర్‌కు ఎవరి ఇంట్లో వారు ఉంటూనే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మరికొంత మంది స్నేహితులు గ్రూప్ వీడియో కాలింగ్ చేసి ఆమెకు వర్చువల్ బర్త్‌డే పార్టీని సెలబ్రేట్ చేశారు. స్వర వర్చువల్ బర్త్‌డే పార్టీ నాలుగు గంటలపాటు ఆటా, పాటలతో చాలా ఉల్లాసంగా కొనసాగింది. SO blessed to have so many kind friends & well wishers in the world, such a loving family & such a thoughtful & giving bunch of close friends who made my #lockdownBirthday so special & wonderful! SO much gratitude, counting my blessings everyday! Thank u all ♥️ I feel so loved! — Swara Bhasker (@ReallySwara) April 10, 2020 దీనిపై స్పందించిన స్వర ‘లాక్డౌన్ సమయంలో వచ్చిన నా బర్త్ డేకు విష్ చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన సన్నిహితుల బృందం ఆశీర్వాదానికి చాలా కృతజ్ఞతలు, అందరికీ ధన్యవాదాలు. ఏమాత్రం ఊహించని వర్చువల్ పార్టీని సెలబ్రేట్ చేయటం చాలా సరదా ఉంది. మీరు కుటుంబసభ్యుల వంటి స్నేహితులని చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. ఇక 2018లో వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాలో స్వరభాస్కర్ నటించిన విషయం తెలిసిందే. Had the most unbelievably fun virtual birthday party, with across countries & continents. FOUR HOURS complete with games & performances! U guys r literally THE BEST people ever! I have no words to tell you’ll how lucky I am that you’ll are my friends like family. 😍😘 THANK YOU pic.twitter.com/IT71Wnn5Tj — Swara Bhasker (@ReallySwara) April 10, 2020 -
బీజేపీ పాకిస్తాన్ ప్రేమలో పడింది అందుకే..
ఇండోర్ : ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్కు పద్మశ్రీ ఎలా ఇస్తారని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. తాజాగా బాలీవుడ్ నటి స్వరభాస్కర్ కూడా వ్యతిరేకించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ప్రేమలో పడిందని.. అందుకే పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్కు పద్మశ్రీ ప్రకటించిందని విమర్శించారు. (చదవండి: పొద్దున నన్ను తిడుతారు.. రాత్రి నా పాటలు వింటా) ఆదివారం ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ‘ రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి’ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరభాస్కర్ మాట్లాడుతూ.. సీఏఏ ఒక మోసపూరిత చట్టమని మండిపడ్డారు. ‘శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం.. చొరబాటు దారులను అరెస్ట్ చేయడం లాంటి చట్టాలు ఇదివరకే భారత్‌లో ఉన్నాయి. దాని ప్రకారమే అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇచ్చి పద్మశ్రీ కూడా ప్రకటించారు. మళ్లీ సీఏఏ లాంటి చట్టాలు ఎందుకు? ఆ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం?’ అని ఆమె ప్రశ్నించారు. ‘ఒకవైపు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భారతీయులను అరెస్టులు చేస్తారు. వారిపై దాడులు చేస్తారు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటిస్తారు. ఇదీ బీజేపీ ప్రభుత్వం తీరు. ఎక్కడికి వెళ్లినా పాకిస్తాన్ మంత్రాన్ని జపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ప్రేమలో పడింది. అందుకు పాకిస్తానీయులకు అవార్డులు ప్రకటిస్తుంది’ అని స్వరభాస్కర్ విమర్శించారు. కాగా, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్ విమర్శించింది. -
చిన్నోడి డాన్స్‌కి బాలీవుడ్ తార ఫిదా
స్వతహాగా టాలెంట్ ఉంటే చాలు చేతిలో ఉన్న సోషల్ మీడియాతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. ఒక్క వీడియోతో పావులర్ అయిన వారి సంఖ్యకు కొదవేలేదు. తాజాగా ఓ బుడ్డోడు వేసే స్ప్రింగ్ లాంటి స్టెప్పులకు బాలీవుడ్ తారాలు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన పాటకు ఓ పదేళ్ల కుర్రాడు వేస్తున్న డాన్స్ పలువురిని ఫిదా చేస్తోంది. దీనిని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్‌తో పాటు మరికొందరు ట్విటర్లో షేర్ చేశారు. లిటిల్ స్టార్ అంటూ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
చిన్నోడి డాన్స్‌కి ఫిదా
-
వెండి తెరపై మండే భాస్వరం
నటన, చదువు, సామాజిక బాధ్యత ఉన్న నటీమణుల పరంపర హిందీలో ఉంది. షబానా ఆజ్మీ, స్మితాపాటిల్, దీప్తీ నావెల్లది ముందు తరం. నందితాదాస్ది తర్వాతి తరం. స్వరభాస్కర్, రాధిక ఆప్టే తదితరులది నేటితరం. సినిమా రంగంలో ఉన్నవారు ప్రజల సమస్యలకు గట్టిగా ప్రతిస్పందించాలి అంటుంది స్వర భాస్కర్. తెర మీదగానీ నిజ జీవితంలోగాని ఆమె ‘సాధారణ బుర్ర’లకు ఇస్తున్న షాకులు చాలానే ఉన్నాయి. సంజయ్ లీలా బన్సాలీ అంటే హిందీలో చాలాపెద్ద పేరు. ఆయన తీసిన ‘పద్మావత్’ చాలా కారణాల రీత్యా వార్తల్లోకి ఎక్కింది. ఆ సినిమా చూశాక స్వర భాస్కర్ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాసింది. ‘డైరెక్టర్‌గారూ... సినిమా అంతా చూశాక నేనంతా కలిíపి ఒక యోనికి కుదించబడ్డాను అన్న భావన కలిగింది’ అని అందులో రాసింది.స్త్రీ ఉనికి అంతా ఆమె లైంగికతే అన్న భావనలో సంజయ్ లీలా బన్సాలీ పద్మావత్ పాత్రను (దీపికా పడుకోన్) తీర్చిదిద్దాడని స్వర భాస్కర్ ఆరోపణ. ఈ ఉత్తరం దుమారం రేపింది. 2018లో ‘వీరి ది వెడ్డింగ్’ సినిమా వచ్చింది. అందులో స్వర భాస్కర్ భర్త విదేశాలలో ఉండగా ఒంటరిగా జీవించే భార్యగా నటించింది. భర్తతో ఆమెకు విధేదాలు ఉంటాయి. అలాగని భర్తను చీట్ చేయలేదు. ఒంటరి జీవితంలోని ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె తనను తాను తృప్తి పరుచుకునేందుకు సిద్ధపడుతుంది. ఆ సన్నివేశం తెర మీద ఇన్హిబిషన్స్ లేకుండా చేసింది. భారతీయ సినిమాలలో ఈ సన్నివేశంలో నటించిన మొదటి నటి ఆమె. దీని మీద భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు సంప్రదాయవాదులు గుర్రుమన్నారు. కాని స్వర పట్టించుకోలేదు. స్త్రీల గురించి, మనుషుల నిజ ప్రవర్తనను ప్రభావితం చేసే సంఘటనల గురించి తెలియనివారే ఇటువంటి కామెంట్లు చేస్తారు అని కొట్టి పారేసింది. ఇటీవల ‘సిఏఏ’ చట్టం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. దీని మీద విద్యార్థులు గట్టి అభ్యంతరాలు చెప్పారు. దేశంలో చాలా నగరాల్లో నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. ముంబై ఆజాద్ మైదాన్‌లో భారీ సభ జరిగితే అందరి కంటే ముందు స్వర భాస్కర్ హాజరయ్యింది. ‘భారత రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం ప్రతి నిజ భారతీయుడి విధి. మనందరం కలిసికట్టుగా దీనిని ఎదిరిద్దాం. ఆవాజ్‌దో హమ్ ఏక్ హై’ అని ఆ సభలో నినదించింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ముసుగులు ధరించిన దుండగలు విద్యార్థులపై దాడికి తెగబడుతున్నారన్న వార్త వినగానే అంతరాత్రిపూట వారి సహాయం కోసం వీడియో రిలీజ్ చేసిందామె. బాలీవుడ్లో ఇప్పుడు చెరపలేని పేరుగా మారిన స్వరభాస్కర్ తండ్రి తెలుగువాడు అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన పేరు చిత్రపు ఉదయభాస్కర్. కోరుకొండ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రభావంతో మిలట్రీలోకి వెళ్లాడు. నేవీలో పని చేశాడు. రిటైర్ అయ్యాక కూడా ఆయనకున్న విశేష అనుభవం రీత్యా రక్షణ రంగ నిపుణుడుగా పని చేస్తున్నాడు. స్వరభాస్కర్ తల్లి ఇరా భాస్కర్ బిహారీ. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సినిమా శాస్త్రాన్ని బోధించే ప్రొఫెసర్ ఆమె. వీరి సంతానమైన స్వర ముందు నుంచి చురుకు. జె.ఎన్.యులో చదువుకుంటున్నప్పుడు ఒక గట్టి గొంతు. స్వర భాస్కర్ జె.ఎన్.యులో చదువుకున్న చాలామందికి మల్లే వామపక్ష భావజాలంతో ప్రభావితమైన విద్యార్థి. కవిత్వం పట్ల మక్కువ ఉంది. తను స్వయంగా రాస్తుంది. సాహిత్యం పట్ల అనురక్తి ఉంది. నటన పట్ల కుతూహలం ఉంది. జె.ఎన్.యులో ఉండగా ఆమెకు నటన పట్ల ఆసక్తి కలిగింది. ఎన్.కె.శర్మ యాక్ట్ ఒన్ అనే థియేటర్ గ్రూప్ ఢిల్లీలో ఎక్కువమందికి తెలుసు. కొన్నాళ్లు ఆ గ్రూప్‌తో కలిసి పని చేసింది స్వర భాస్కర్. నాటకాలు వేసింది. అయితే ఆమెకు సినిమాలలో పని చేయాలని ఉండేది. 2008లో ముంబై చేరుకుందామె. బాలీవుడ్లో అడుగుపెట్టాక స్వర భాస్కర్‌ను మొదట ప్రేక్షకులు గుర్తించింది ‘లిజన్ అమాయా’ అనే సినిమాతో. దీప్తి నావెల్ తల్లిగా స్వర భాస్కర్ కూతురుగా ఆ సినిమాలో నటించారు. దీప్తి నావెల్‌కు భర్త చనిపోయి ఉంటాడు. పాత కాలపు మిత్రుడు ఆమె పట్ల ఆదరంగా ఉంటాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాని కూతురు స్థానంలో ఉన్న స్వర భాస్కర్ ఆ పెళ్లిని అంగీకరించదు. తన తల్లి కేవలం శారీరక సుఖం కోసమే ఈ పని చేయాలనుకుంటోంది అనే భావనలో ఆ టీనేజ్ అమ్మాయి సతమతమవుతుంది. కాని పెళ్లి అనేది కేవలం భౌతిక సుఖం కోసం కాదని జీవన సహచర్యం కోసం కూడా అని ఆమెకు మెల్లగా తెలిసి వస్తుంది. ధునుష్ హిందీలో తొలిసారిగా నటించిన ‘రాంఝనా’, అర్జున్ కపూర్ ‘ఔరంగజేబ్’, సల్మాన్ ఖాన్ ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ సినిమాలు ఆమెకు మంచి పాత్రలు ఇచ్చాయి. కాని ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది మాత్రం ‘తను వెడ్స్ మను’ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు. తను వెడ్స్ మనులో భర్తకు తెలియకుండా తప్పు చేసి ఆ గిల్ట్తో నలిగిపోయే పాత్రలో ఆమె ఆకట్టుకుంది. దాంతో లీడ్ రోల్ చేసే విధంగా రెండు మంచి అవకాశాలు ఆమెకు వచ్చాయి. ఆ సినిమాలే ‘నీల్ బత్తి సన్నాట’, ‘అనార్కలీ ఆఫ్ ఆరా’. ఒక చేయగలిగిన నటికి చేయగలిగిన పాత్రలు వస్తే ఆమె ఎలా చెలరేగగలదో ఈ సినిమాలు నిరూపిస్తాయి. ‘నీల్ బత్తి సన్నాటా’లో స్వరభాస్కర్ ఒక సింగిల్ మదర్. పదో క్లాస్‌కు వచ్చిన కూతురు ఉంటుంది. ఆ కూతురు బాగా చదువుకోవాలని ఆ తల్లి కోరిక. లెక్కలు రాని కూతురు మాత్రం చదువు ఆపేసి తల్లిలానే పని మనిషిగా కుదురుకుంటే చాలు అనుకుంటూ ఉంటుంది. కాని తల్లి మాత్రం కూతురు కోసం తపన పడుతుంది. కూతురిలో రోషం తెప్పించాలని తానూ విద్యార్థిగా మారి కూతురి క్లాస్‌లో చేరుతుంది. తాను లెక్కలు నేర్చుకుని కూతురికి నేర్పాలని తపన పడుతుంది. కాని కూతురు ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటుంది. కాని చివరకు తల్లి ఆశయానికి అనుగుణంగా బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అవుతుంది. ఈ సినిమాలో స్వరభాస్కర్ అనుక్షణం తన ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రిలీజయ్యాక ఆమె ఎన్నో ప్రశంసలు దక్కాయి. కాని అంతకంటే ముఖ్యమైన సినిమా ‘అనార్కలీ ఆఫ్ ఆరా’. బిహార్‌లో ‘డబుల్ మీనింగ్’ పాటలను స్టేజ్ మీద పాడుతూ నర్తింటే లోకల్ ఫిమేల్ పాప్ సింగర్ల సమూహం ఒకటి ఉంది. ‘ఆరా’ అనే ఊరిలో అలాంటి గాయని అనార్కలీ. ఆమె స్టేజ్ మీద బూతు పాటలు పాడుతుంది కనుక మనిషి కూడా బూతై ఉంటుందని తప్పుడు అంచనా వేస్తాడు ఆ ఊరి పెద్దమనిషి ఒకడు. లొంగ దీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆమె లొంగదు. జీవిక కోసం ఎన్ని పనులు చేసినా ఆత్మాభిమానం ఉన్న స్త్రీ బలవంతులకు లొంగదు అని అనార్కలీ తన పాత్ర ద్వారా చెబుతుంది. ఈ సినిమాలో బిహారీ భాషలో డైలాగ్స్ చెప్పడానికి, బూతు గాయనిగా హావభావాలు పలికించడానికి, ఉన్మత్తత ప్రదర్శించడానికి స్వరభాస్కర్ ఏ మాత్రం సంకోచించలేదు.ఆ పాత్ర ఆమెకు చాలా పేరు తెచ్చింది. స్వరభాస్కర్ ఇప్పుడు ‘షీర్‌కుర్మా’ అనే సినిమాలో నటిస్తోంది. ‘షీర్‌కుర్మా’ అంటే సేమ్యా పాయసం అని అర్థం. ఇందులో ముస్లిం మొహల్లాలో ఉండే ఇద్దరు స్త్రీల మధ్య సాన్నిహిత్యాన్ని స్వర తన పాత్ర ద్వారా చూపించనుంది. కల్పిత, కల్మష ప్రవర్తన తెర మీద, తెర బయట అక్కర్లేదంటుంది స్వరభాస్కర్. నిజాయితీ ముఖ్యం అంటుందామె. సత్యాన్ని సత్యంగా చూపించడానికి, చెప్పడానికి సంకోచించాల్సిన పని లేదంటుంది ఆమె. బాలీవుడ్లో ఎందరో హీరోయిన్లు, కేరెక్టర్ ఆర్టిస్టులు స్త్రీలలో ఉన్నారు. వారు మన దారిలో తారసపడినా పడకపోయినా స్వరభాస్కర్ తప్పక తారసపడుతూనే ఉంటుంది– చాలా కారణాలకు. ఇది మాత్రం తప్పదు. – సాక్షి ఫ్యామిలీ -
ఆంటీ వివాదంపై నటి వివరణ
ముంబై : తనను ఆంటీ అన్నందుకు నాలుగేళ్ల చిన్నారిని అకారణంగా దూషించిన నటి స్వర భాస్కర్ తనపై వచ్చిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తాను జోక్‌గానే బాలుడిని దుర్భాషలాడినట్టు కామెడీ షోలో చెప్పానని, తానెన్నడూ చిన్నారులను, సహ నటులను దూషించలేదని అన్నారు. స్వర ఇటీవల ఓ కామెడీ టాక్ షోలో మాట్లాడుతూ తాను పాల్గొన్న తొలి షూటింగ్లో తనను ఆంటీ అని పిలిచిన చిన్నారిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డానని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. స్వర తీరుపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. బాలుడిని దుర్బాషలాడి నిజంగానే ఆంటీ అనిపించుకున్నావని దుయ్యబట్టారు. స్వర ఆంటీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. తాను కామెడీ షోలో పాల్గొంటూ సరదాగా ఈ విషయాన్ని పంచుకున్నానని, వ్యంగ్యంగా ఆ ఘటన గురించి చెప్పే క్రమంలో ఆ భాష వాడాల్సి వచ్చిందని..అది కూడా హాస్య ధోరణిలో ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. తాను జోక్‌గా చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేశారని చెప్పుకొచ్చారు. కాగా బాలుడిని దుర్భాషలాడటంపై స్వర భాస్కర్ తీరును తప్పుపడుతూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఎన్జీవో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఆమెపై ఫిర్యాదు చేసింది. స్వర భాస్కర్‌పై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. చదవండి : ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి -
ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి
బాలీవుడ్ నటి స్వరభాస్కర్ విమర్శలపాలైంది. ‘సన్ ఆఫ్ అభిష్’ అనే షోలో ఆమె చేసిన వివాదాస్పదవ్యాఖ్యలే అందుకు కారణమయ్యాయి. ఈ షోలో ఆమె మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో యాడ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘యాడ్ షూట్ చేసే సమయంలో నాలుగేళ్ల బాలుడు నన్ను ఆంటీ అని పిలిచాడు. ఇది నాకెంతో చిరాకు తెప్పించింది. ఎవరికైనా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు కదా. ఆంటీ అనగానే నేను కోపంతో చెడామడా తిట్టేశాను. అసలు వీళ్లు చిన్నపిల్లలా లేక దెయ్యాలా’ అని ఆమె అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆమె మాటలు షోలో నవ్వు తెప్పించాయి కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. బాలీవుడ్ నటి చిన్నపిల్లలను తిట్టడం కామెడీనా? నాలుగేళ్ల పిల్లోడిని బూతులు తిడతావా? అంటూ స్వరభాస్కర్‌ను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అప్పుడు కాదు.. ఇప్పుడు నిజంగానే నువ్వు ఆంటీ అయ్యావు అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘#swara_aunty’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. జాతీయ చానల్లో చిన్నపిల్లలను తిట్టడం దారుణమంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలను జాతీయ బాలల సంరక్షణ సంస్థ తీవ్రంగా పరిగణించింది. ఆమెపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక నవంబర్ 5న టాప్ ట్రెండ్‌లో #swara_aunty ఒకటిగా నిలిచింది. This is ‘humour’? Calling a 4 year old child a ‘Ch*^%a’ a ‘Kameena’? Saying with great confidence that children are ‘evil’? #PanautiJunior is sounding completely deranged here, and that moron @kunalkamra88 is watching like a drunk dodo at this ‘wisdom’. pic.twitter.com/wM7f401tkm — Shefali Vaidya ஷெஃபாலி வைத்யா शेफाली वैद्य (@ShefVaidya) November 4, 2019 Can this #swara_aunty be charged for abusing a 4 year old child ? Disgust me to the core&they call themself educated&sophisticated.I think she was a born moron when she was 4,kaun si min ki galti se yeh paida hui thi parents must be ashamed of her. You embarrass them as well 🤬 — Vandy (@im_vandy) November 4, 2019 -
ఇక పాకిస్తాన్ గురించి ఏం మాట్లడతాం?
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ తాజాగా ఎన్నికల ఫలితాలపై ట్విటర్ వేదికగా స్పందించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో స్వర ఆప్, కన్హయ్య కుమార్, భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌ల తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే స్వర ప్రచారం చేసిన అభ్యర్థులేవరు విజయం సాధించలేదు. ఈ క్రమంలో భోపాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ మీద.. బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ విజయం సాధించారు. ఈ విషయంపై స్వర ట్విటర్ వేదికగా స్పందించారు. ‘భారతదేశానికి కొత్త రోజులొచ్చాయి. తొలిసారి మనం ఉగ్రవాద ఆరోపణలు కలిగిన వ్యక్తిని పార్లమెంట్‌కు పంపుతున్నాం. ఇప్పుడు పాకిస్థాన్ గురించి ఏమని మాట్లాడుకోవాలి?’ అంటూ ట్వీట్ చేశారు స్వర. Yayyyeeeee for New beginnings #India ! First time we are sending a terror accused to Parliament 💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾 Woohoooo! How to gloat over #Pakistan now??!??? 🤔🤔🤔🤔 #LokSabhaElectionResults20 — Swara Bhasker (@ReallySwara) May 23, 2019 -
పాకిస్థాన్ నటికి గట్టి కౌంటర్
ముంబై: భారత్- పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల నాయకులతో పాటు సెలబ్రిటీల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. పాకిస్థాన్ నటి వీణా మాలిక్ తమ దేశ సైన్యాన్ని పొడుగుతూ, భారత్ ఆర్మీని విమర్శిస్తూ ట్విటర్లో కామెంట్లు, ఫొటోలు పెట్టారు. పాక్ ఆర్మీ బందీగా పట్టుకున్న భారత పైలట్ అభినందన్‌ను వెక్కిరిస్తూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. (తలొగ్గిన పాక్.. రేపు అభినందన్ విడుదల) వీణా మాలిక్ కామెంట్లపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ దీటుగా స్పందించారు. ‘వీణాజీ.. దుర్బలమైన మీ మనస్తత్వం చూసి సిగ్గుపడుతున్నాం. మీ ఆనందం ఎక్కువసేపు నిలవదు. మా పైలట్ రియల్ హీరో. చాలా ధైర్యవంతుడు, సమర్థవంతుడు. కారాగారాన్ని కూడా హుందాగా స్వీకరించారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను ప్రశ్నించిన పాకిస్థాన్ ఆర్మీ మేజర్ చూపిన సభ్యత కూడా మీరు చూపలేకపోయార’ని వీణా మాలిక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడుల నేపథ్యంలో స్పందించిన బాలీవుడ్ నటులపై కూడా అంతకుముందు వీణా మాలిక్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తేరె ప్యార్ మైన్’ సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన వీణా మాలిక్ పలు హిందీ సినిమాల్లో నటించారు. హిందీ రియాల్టి షో బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పోటీ పడ్డారు. ‘నగ్నసత్యం’ అనే తెలుగు సినిమాలోనూ నటించారు. -
నిర్మాత స్వర
బాలీవుడ్లో కథానాయికలు నిర్మాతలుగా మారే జాబితా పెరుగుతోంది. ఆల్రెడీ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది ‘చప్పాక్’ సినిమాతో దీపికా పదుకోన్ కూడా నిర్మాతగా మారనున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి స్వరా భాస్కర్ చేరారు. ‘‘నిర్మాతగా మారాలన్న ఆలోచన నాకు ఏడాదిన్నర క్రితమే వచ్చింది. ప్రస్తుతం ఆ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాం. వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేయడం, కొత్తవారిని ప్రోత్సహించడమే నిర్మాతగా నాకు ఉన్న ప్రస్తుత లక్ష్యాలు’’ అని స్వరా భాస్కర్ పేర్కొన్నారు. గతేడాది జూన్ 1న విడుదలైన ‘వీరే ది వెడ్డింగ్’ స్వరా భాస్కర్’ తెరపై కనిపించిన చివరి చిత్రం. -
అట్టహాసంగా సోషల్ మీడియా అవార్డ్స్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్–2018 కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలు శుక్రవారం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మెన్ గద్దె అనూరాధ, పర్యాటక శాఖ సీఈఓ హిమాన్షు శుక్లాలు పాల్గొన్నారు. మంత్రముగ్ధులను చేసిన ‘మిత్ర’ ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ‘మిత్ర’ రోబోను ఆవిష్కరించారు. ఈ రోబోను 2017 హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు తొలిసారిగా ఆవిష్కరించారు. ఐదడుగులున్న ఈ రోబో తన మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పర్యాటక శాక సీఈఓ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సోషల్ మీడియా రంగంలో అవార్డులను ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తోందన్నారు. సోషల్ మీడియా ద్వారా పర్యటక రంగ అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో సెల్ఫీలు దిగడానికి యువత ఎగబడ్డారు.తరలిరానున్న సినీ తారలు.. శనివారం సోషల్ మీడియా రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటున్న సినీ ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటీ కరీనా కపూర్, టాలీవుడ్ నటీ సమంతా అక్కినేని, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లకు అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో రాణిస్తున్న మరో 40 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. -
ఇప్పటికీ అర్థం కావడం లేదు
సినిమాలోని పాత్రకు సరిపడ గ్లామర్ లేదు.. ఫేస్‌లో సరైన ఎక్స్‌ప్రెషన్స్‌ను చూపించడం లేదు... ఇలాంటి కారణాలతో హీరోయిన్స్‌ను రిజెక్ట్ చేస్తుంటారు కొందరు డైరెక్టర్లు. కానీ, తెలివైన అమ్మాయిలా కనిపించినందుకు ఓ సినిమా చాన్స్‌ను కోల్పోయారట బాలీవుడ్ బ్యూటీ స్వరభాస్కర్. ఈ వింత అనుభవం గురించి ఆమె చెబుతూ–‘‘లుక్స్ బాగుండే హీరోయిన్స్‌కు మంచి అవకాశాలు వస్తుంటాయి. లేకపోతే ఏ హీరోయిన్ మేకప్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టరు. కానీ, నేను ముంబైకి వచ్చిన కొత్తల్లో సినిమా చాన్స్ కోసం ఓ డైరెక్టర్‌ను కలిశాను. ‘నువ్వు చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావు.. మా సినిమాలో తీసుకోలేం’ అన్నారాయన. ఆ డైరెక్టర్ మాటల్లోని మర్మం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అలాంటి సంఘటనలను వీలైనంత త్వరగా మర్చిపోవడమే మంచిది’’ అని చెప్పుకొచ్చారు స్వరభాస్కర్. -
ఏంటి ఇదేమన్నా జోక్ అనుకుంటున్నారా : నటి
‘ఏంటి ఇదేమన్నా జోకా? అంటే మనం ఈ దౌర్జన్యాలను, పోకిరి వేషాలు వేసే వాళ్లను అలా వదిలేయాలంటారా? అయినా విధ్వంసం సృష్టించే అటువంటి గూండాలతో ఫొటో దిగడానికి ఎవరు ఇష్టపడతారు. అసలేం జరిగింది? మనందరికీ ఏమయ్యింది?’ అంటూ నటి స్వరా భాస్కర్ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) నాయకులను ఉద్దేశించి ట్విటర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ఈ విధంగా ట్వీట్ చేసి మరోసారి తనుశ్రీ దత్తాకు తన మద్దతు తెలిపారు. కాగా తనుశ్రీ- నానా పటేకర్ వివాదం ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్ర సమయంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించారు. అలాగే ఆ సమయంలో నానాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు తనను బెదిరించారని తనుశ్రీ పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనుశ్రీ పబ్లిసిటీ కోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోందని ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనూశ్రీపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా.. తనూశ్రీ తన చెల్లెలితో కలిసి బిగ్‌బాస్‌లో పాల్గొంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్ఎస్ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్‌బాస్ సెట్‌కు వెళ్లి వారికి లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్‌లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన స్వరా భాస్కర్ ఎంఎన్ఎస్ నేతలను ఉద్దేశించి ట్వీట్ చేసి తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. IS THIS A JOKE?????? Or are we now just okay with institutionalised hooliganism?????? And who takes pictures with the goons that threaten vandalism????? WHAT IS WRONG WITH US GUYS??!???? https://t.co/dL8gZvlYAR — Swara Bhasker (@ReallySwara) October 4, 2018 -
‘వారిని అరెస్ట్ చేస్తే దేశంలోని జైళ్లు సరిపోవు’
సాక్షి, న్యూఢిల్లీ : మవోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల పలువురు ప్రజా సంఘాల నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విరసం నేత వరవరరావుతో సహా అరెస్ట్‌యిన వారిని అర్బన్ నక్సలైట్స్ అని పోలీసులు వ్యాఖ్యానించడంతో కొందరు ‘మీటూ అర్బన్ నక్సల్’ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్యాగ్స్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వారిపై పలు వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్ పేరుతో వారిన అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘పోలీసులు వారిని మాత్రమే అరెస్ట్ చేయగలరు. వారి ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. ఆ విధంగా ఆలోచించే ప్రజలను కూడా అరెస్ట్ చేస్తే దేశంలో ఉన్న జైళ్లు సరిపోవు. జాతిపిత మహాత్మ గాంధీని ఈ దేశంలో హత్య చేశారు. గాంధీని హత్య చేసిన వారే నేడు అధికారంలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేయగలమా?’’ అని ప్రశ్నించారు. దేశ సంపదను కాజేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, చోక్సీలను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందని ఆమె ప్రశ్నించారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా సంఘాల నేతలను మాత్రం ప్రభుత్వం కుట్ర పూరితంగా అణచివేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా బీమా-కోరేగావ్ ఘటనతో వారికి ఎలాంటి సంబంధం లేదని, ప్రధాని హత్యకు వారు ప్రయత్నించారన్న వార్త తనకు వింతగా అనిపించిందని స్వర భాస్కర్ వ్యాఖ్యానించారు. -
బానిసనయ్యాను అందుకే దూరంగా ఉంటున్నాను
ప్రతి విషయం గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే నటి, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ స్వర భాస్కర్ కొద్ది రోజులుగా కనిపించడం లేదు.. అంటే ట్విటర్లో కనిపించడం లేదని. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. నిఖచ్చిగా మాట్లాడుతూ.. నెటిజన్ల విమర్శలు ఎదుర్కొనే స్వర భాస్కర్ కొద్ది రోజులుగా ట్విటర్లో కనిపించడం లేదు. దాంతో ట్రోలర్స్‌కి భయపడి స్వర తన ట్విటర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్వయంగా స్పందించారు స్వర భాస్కర్. ‘ప్రస్తుతం నేను యూరోప్ టూర్లో ఉన్నాను. వచ్చేవారం ఇండియాకు తిరిగి వస్తాను. ఈ సెలవులను ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అంతేకాక ఈ మధ్య నేను ట్విటర్‌కు బాగా అడిక్ట్ అయినట్లు అన్పిస్తోంది.అందుకే ట్విటర్‌కు దూరంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు. కానీ గాసిప్ రాయుళ్లు మాత్రం ‘ఈ 30 ఏళ్ల నటి నోటికి అడ్డు అదుపూ లేకుండా మాట్లాడ్తది. దాంతో స్వరకు, ఆమె హేటర్స్‌కు మధ్య ఇప్పటికే చాలాసార్లు గొడవలు జరిగాయి. వీటన్నింటి దృష్టిలోపెట్టుకునే స్వర ప్రస్తుతం ట్విటర్‌కు దూరంగా ఉంటుందనే’ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కానీ స్వర మాత్రం ఈ వార్తలు వాస్తవం కాదంటున్నారు. ప్రస్తుతం స్వర ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లలో యాక్టీవ్‌గానే ఉన్నారు. -
ఆ నటికి ముద్దు పెట్టబోయాడట!
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఈ మధ్య ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. హాలీవుడ్ ప్రొడ్యుసర్ హార్వీ వీన్‌స్టీన్ వ్యవహారంతో మొదలైన ‘మీ టూ’ క్యాంపైన్తో కాస్టింగ్ కౌచ్ పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. అది బాలీవుడ్‌ను తాకి సౌత్‌లోనూ పాకి, మన టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఎవరోకరు తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ.. ‘నాకు ఇలాంటి ఒక అనుభవమే ఎదురైంది. నేను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఓ నిర్మాత దగ్గర పనిచేసే మేనేజర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడ’ని తనకు ఎదురైన ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. మీడియా ముందు బోల్డ్‌గా మాట్లాడటంతో అప్పట్లో వార్తల్లో కెక్కారు స్వర భాస్కర్. ‘వీరే ది వెడ్డింగ్’లో తాను చేసిన బోల్డ్ క్యారెక్టర్‌పై వచ్చిన విమర్శలను ఆమె ఘాటుగానే తిప్పికొట్టారు. కరీనా కపూర్, సోనమ్ కపూర్లు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. -
డబ్బులిచ్చి మరీ ఆ పని చేయిస్తున్నారు: నటి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి విమర్శలను ఎదుర్కుంటున్నారు. ఆమె తాజాగా నటించిన వీరే ది వెడ్డింగ్ చిత్రంలో ఆమె ఓ సంచలన సన్నివేశంలో నటించారు. అయితే ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఆమె ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా మంది ‘తమ ఇంట్లోని అడవాళ్లతో చిత్రానికి వెళ్లామని, కానీ, ఆ సన్నివేశం రాగానే థియేటర్ నుంచి బయటకు వచ్చేశామని’ ట్వీట్లు చేశారు. మరోవైపు చిత్రంపై మొదటి నుంచి వ్యతిరేకత కనబరుస్తున్న హిందూ అతివాదులు అయితే స్వరపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రోలింగ్‌పై స్వర భాస్కర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ‘కొందమంది డబ్బులు ఇచ్చిమరీ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు సినిమా చూడడానికి, ఇలాంటి ట్వీట్స్ పెట్టడానికి ఖచ్చితంగా డబ్బులు తీసుకునే ఉంటారు’ అంటూ కౌంటర్ వేశారు. స్పెల్లింగ్ కూడా రాదా?... ఇక స్వర భాస్కర్‌కు మద్ధతుగా నిలుస్తున్న కొందరు.. ట్రోలింగ్ చేసే వారికి రిటార్ట్ ఇస్తున్నారు. ‘మాస్టర్బేషన్(స్వయంతృప్తి) స్పెల్లింగ్ కూడా సరిగ్గా రానివాళ్లు.. వాళ్ల ఇంట్లో మహిళలతో సినిమాలు వెళ్తున్నారా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శశాంఖ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కరీనా కపూర్ పాటు సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. తమ స్నేహితురాలి వివాహం కోసం కలుసుకున్న యువతులు.. వ్యక్తిగత విషయాలను దర్శకుడు బోల్డ్‌గా చూపించిన యత్నమే వీరే ది వెడ్డింగ్ కథ. Why are so many sanskari people watching #VeereDiWedding with their grandmothers? — Rahul Pandita (@rahulpandita) 2 June 2018 -
అట్టహాసపు పెళ్లిలో చెలిగింతలు
జీవితంలో ఎన్నో కష్టాలుండొచ్చు. బంధుత్వాల భారాలు మోయలేనంతవిగా ఉండొచ్చు. ఎడబాట్లు బాకుల్లా గుచ్చుకోవచ్చు. సంప్రదాయాలు కొరికినట్లు అనిపించొచ్చు. ఒక్కరిగా అనుభవించాలి అంటే నరకమే అనిపించొచ్చు. కానీ ముగ్గురు చెలియలు కష్టాల్ని మరపించే చక్కలిగింతలు పెడుతుంటే ప్రపంచం మళ్లీ అందంగా అనిపిస్తుంది. బంధాలు మరోసారి తియ్యగా అనిపిస్తాయి. ‘వీరె ది వెడ్డింగ్’ అలాంటి అనుభూతుల ‘చెలిగింతలు’... ఇవాళ రేపు రక్త సంబంధాలు నిర్వచించడానికి కష్టంగా ఉంటున్నాయి. దగ్గరి సంబంధాలు అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నాయి. ఆధునిక జీవితంలో మనిషి ఒంటరి అవుతున్నాడు. అతణ్ణి అంతో ఇంతో కాపాడుతున్నది స్నేహ సంబంధాలే. నలుగురు స్నేహితురాళ్లు ఒకరికొకరు నిలబడి ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నించిన కథే ‘వీరే ది వెడ్డింగ్’. హిందీ సినిమాలలో కొత్త ధోరణిలో కథలు చెప్పడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక కొనసాగింపు. ‘లైంగిక నిస్పృహ’, ‘ఫ్రీ సెక్సువల్ ఎక్స్ప్రెషన్’ సినిమాల్లో చూపించడానికి బాలీవుడ్ ప్రయత్నిస్తోందనడానికి కూడా ఈ సినిమా ఒక ఉదాహరణ. కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ వంటి మంచి ఆర్టిస్టులు ఉండటం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో సఫలమైందనే చెప్పాలి. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. దర్శకుడు ‘శశాంక్ ఘోష్’. కథ.. కాళింది పూరి (కరీనా కపూర్), అవ్ని మల్హోత్రా (సోనమ్ కపూర్), సాక్షి సోనీ (స్వర భాస్కర్) , మీరా (శిఖా తల్సానియా) ఈ నలుగురు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. అందరూ ఎవరికి వారు ఇండిపెండెంట్‌గా ఉండాలనుకొనే మనస్తత్వం ఉన్నవారు. నలుగురిలో ఒకరైన కాళింది చిన్న వయస్సులోనే తల్లిని పోగొట్టుకుంటుంది. మరో పెళ్లి చేసుకున్న తన తండ్రితో అంతంత మాత్రమే సంబంధ భాందవ్యాలుంటాయామెకు. తండ్రికి, బాబాయ్‌కు ఆస్తి గొడవలు జరిగి తను పెరిగిన ఇల్లు శాంతి నివాసానికి కోర్టు తాళం వేస్తుంది. ఢిల్లీ నుండి వెళ్లిపోయి ఆస్ట్రేలియాలో ఉంటుంది కాళింది. అక్కడ ఓ రోజు ఆమె బోయ్ ఫ్రెండ్ రిషబ్ మల్హోత్రా (సుమిత్ వ్యాస్) మ్యారేజ్ ప్రపోజల్ పెడతాడు (అప్పటికే వారిద్దరూ రిలేషన్ షిప్లో ఉంటారు). ప్రపోజల్‌కి కారణం ఇంట్లో పెద్ద వాళ్లు ఒత్తిడి చేస్తుంటారు. ‘ఇప్పుడు ఇలా బాగానే ఉంది కదా పెళ్లెందుకు. పెళ్లి చేసుకుంటే లేనిపోని చిక్కుల్లో పడతాం’ అంటుంది కాళింది. కానీ తన ఇంట్లో వాళ్లకోసం సంప్రదాయం పేరు చెప్పి ఆమెతో సరే అనిపిస్తాడు రిషబ్. ఆ విషయాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి అందర్నీ తన వివాహానికి ఆహ్వానిస్తుంది. అక్కడ నుండి కథ ఇండియాకు (ఢిల్లీ) వస్తుంది. అప్పటికే మిగతా ముగ్గురు ఫ్రెండ్స్‌లో ఒకరైన మీరాకి ఒక ఆంగ్లో ఇండియన్‌తో పెళ్లయి ఒక బాబు ఉంటాడు. మరో స్నేహితురాలు సాక్షికి లండన్‌లో ఉన్న బిజినెస్ మేన్‌తో పెళ్లయి వాళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుందామె. ఆ బాధలో ఆమె ఎప్పుడూ తాగుతూ పర్వర్టెడ్లా మారిపోతుంది. ఇక మిగిలిన స్నేహితురాలు అవ్ని ఢిల్లీ కోర్టులో లాయర్‌గా (విడాకులు ఇప్పించే లాయర్) పని చేస్తుంటుంది. ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ స్కైప్‌లో మాట్లాడుకోవలసిందే ఆ మిత్రబృందం. పెళ్లి హడావిడి.... మామూలుగా ‘పెళ్లి’ అంటే సింపుల్‌గా గుళ్లో అయినా చేసుకోవచ్చు. కానీ దాన్ని అట్టహాసంగా చేస్తే అదో పెద్ద తంతు. ఇక్కడే మన హీరోయిన్ కాళిందికి కాలింది. ప్రతి చిన్న విషయాన్ని ధూమ్ ధామ్ చేద్దాం అనుకునే వరుడి తరఫున తల్లిదండ్రులు, చుట్టాలు హడావిడి. ఉదాహరణకు కాళింది, రిషబ్ ఆస్ట్రేలియా నుండి ఇండియా చేరుకోగానే ఎయిర్‌పోర్ట్‌లోనే కార్యక్రమాల హడావిడి షురూ అవుతుంది. తన కాబోయే కోడలికి పూజారితో తిలకం దిద్దించడం నుంచి నగలు పెట్టడం దాకా అన్ని కార్యక్రమాలతోటి చాలా హడావిడి చేస్తుంటుంది రిషబ్ తల్లి. ఇదంతా తనకు చాలా ఇబ్బందిగా ఉందని, తనవల్ల కాదని రిషబ్‌కు చెప్తుంది కాళింది. ఓ నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే అన్ని కార్యక్రమాలు శుభ్రంగా ముగిసిపోతాయి... మన దారిన మనం హ్యాపీగా ఆస్ట్రేలియా వెళ్లిపోవచ్చు... సర్దుకుపోవాలని చెప్తాడతను. రిషబ్ తన మీద చూపించే ప్రేమ కోసం అన్నిటికీ సరేనంటు ఒప్పుకొంటుంది కాళింది. సంగీత్ కార్యక్రమాన్ని రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తారు పెళ్లికొడుకు తరఫువారు. ఆ సందర్భంగా అందరూ పార్టీలో ఉంటే రిషబ్, కాళింది మాత్రం స్టేజీ మీద నుండే గొడవ పడుతుంటారు. ఆమె తొడుక్కునే రింగ్ విషయంలోనే వారిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ కార్యక్రమమంతా రభసగా మారుతుంది. అక్కడి నుండి ఒక్కొక్కరు ఓ రకంగా బయటì కెళతారు. ఈ గొడవలు, గందరగోళం అంతా పెళ్లి వల్లే అందుకే ఇవేవీ వద్దు నా దారిన నేను ఆస్ట్రేలియా వెళతాను అనుకుని తన స్నేహితులకు చెప్పి బయలుదేరుతుంది కాళింది. ఆమె పెళ్లి చేసుకోకుండానే ఆస్ట్రేలియా వెళ్లిపోయిందా? తన తండ్రితో తన రిలేషన్ ఎలా ఉంది? చివరకు తను పుట్టి పెరిగిన ఇల్లు తన చేతికి వస్తుందా? స్నేహితురాళ్లంతా ఆమె కోసం ఏం చేశారు? అనేది మనం సినిమా థియేటర్లోనే చూడాలి. సినిమా ప్లస్ పాయింట్స్... ∙యూత్‌ని ఎట్రాక్ట్ చేసే మ్యారేజ్ కాన్సెప్ట్ ∙బోల్డ్ డైలాగ్స్ ∙కెమెరా వర్క్ ∙కలర్‌ఫుల్ కాస్టూమ్స్ మైనస్ పాయింట్స్... స్లో న్యారేషన్. తారాగణం : కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శికా తల్సానియా దర్శకుడు : శశాంక్ ఘోష్ నిర్మాణం : బాలాజీ మోషన్ పిక్చర్, అనిల్‌కపూర్ ఫిల్మ్స్ కెమెరా : సుధాకర్ రెడ్డి యాకంటి – శివ మల్లాల -
ఫ్రెండ్ కోసం పెళ్లి తేదీ మార్చుకున్న హీరోయిన్
సాక్షి, ముంబై : జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకగా భావించే వివాహానికి ప్రాణ స్నేహితులు, సమీప బంధువులు రాలేరని తెలిస్తే మనసు చిన్న బుచ్చుకోవడం సహజం. వారి కోసం వివాహ తేదీలో మార్పు చేసుకోవడమంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే సోనమ్ కపూర్ ఇందుకు మినహాయింపు. స్నేహితురాలి కోసం ఏకంగా పెళ్లి తేదీనే మార్చుకున్నారు. అసలు విషయమేమిటంటే.. ఈనెల (మే) 8న తేదీన సోనమ్ కపూర్ పెళ్లి వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో జరిగిన విషయం తెలిసిందే. అయితే వారి వివాహం మార్చి 12నే జరగాల్సిందట. కానీ ఆరోజే సోనమ్ స్నేహితురాలు స్వరా భాస్కర్ సోదరుడు ఇషాన్ వివాహం జరగనుండడంతో.. సోనమ్ తల్లిదండ్రులను ఒప్పించి మరీ వివాహ తేదీని మే 8కి మార్పించారట. తాజాగా ఈ విషయాన్ని స్వరా భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సోనమ్ చాలా డల్‌గా కన్పించింది. ఇషాన్ వివాహ తేదీని మార్చాల్సిందిగా నా తల్లిదండ్రులను ఒప్పించమని నన్ను అడిగింది. అలా కుదరకపోవడంతో తనే పెళ్లి తేదీని మార్చుకుని స్వీట్ షాక్ ఇచ్చిందంటూ’ స్వరా భాస్కర్ తమ మధ్య ఉన్న స్నేహబంధం గురించి చెబుతూ మురిసిపోయారు. -
మళ్లీ సిగరెట్ కాల్చను!
‘‘అవును.. ఇకపై సినిమాల్లో నా క్యారెక్టర్ కోసం సిగరెట్ కాల్చను. ఎవరైనా అలాంటి క్యారెక్టర్ నాకు ఆఫర్ చేస్తే సింపుల్‌గా నో అని చెప్తా’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్. ఇంతకీ ఈ బ్యూటీ సిగరెట్ ఎందుకు వెలిగించారంటే ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా కోసం. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానీయా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. శిఖా తల్సానియా వెడ్డింగ్ చుట్టూ సాగనున్న ఈ సినిమాలో చైన్ స్మోకర్గా కనిపించనున్నారట స్వరా భాస్కర్. ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇందులో ఓ సీన్ కోసం డైరెక్టర్ నన్ను స్మోక్ చేయమన్నారు. నా ఎంటైర్ లైఫ్‌లో మోస్ట్ వరస్ట్ టేస్ట్ అనిపించింది. కొన్నిసార్లు నువ్వు సరిగా స్మోక్ చేయడం లేదని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత ఆయన్ని ఎలాగో కన్విన్స్ చేయగలిగాను. కానీ ఇప్పుడు ఎవరైనా స్మోక్ చేసే క్యారెక్టర్ ఇస్తే.. నాకు అవసరం లేదని తేల్చి చెప్పేస్తాను’’ అని చెప్పారు స్వరా భాస్కర్. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా జూన్ 1న విడుదల కానుంది. -
కథువా ఘటన; ఆ సినిమాను చూడకండి
సాక్షి, ముంబై: బాలీవుడ్ చిత్రం వీరె ది వెడ్డింగ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. కథువా ఘటనపై స్పందిస్తూ ఈ చిత్రంలోని హీరోయిన్లు ఫ్లకార్డ్లతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే వారి చేష్టలు సమంజసంగా లేవంటూ ఆ సమయంలో విమర్శలు.. ట్రోలింగ్ ఎదురుకాగా... ఇప్పుడు ఆ ప్రభావం వాళ్లు నటించిన చిత్రంపై పడింది. ‘హిందువుల అత్మగౌరవం నిలవాలంటే ఈ చిత్రాన్ని(వీరె ది వెడ్డింగ్) బహిష్కరించండి. కరీనా, సోనమ్, స్వరభాస్కర్లు బీగ్రేడ్ హీరోయిన్లు. హిందువులపై అపవాదులు వేసే అలాంటి వాళ్ల చిత్రాలను ఆదరించాల్సిన అవసరం హిందువులకు లేదు. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే’ అంటూ ప్రముఖ కాలమిస్ట్ షెఫాలీ వైద్యా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీటర్లో బాయ్కాట్వీర్దేవెడ్డింగ్ పేరిట యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఇక హిందువులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఈ హీరోయిన్లంతా ఎక్కడికి పోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కథువా చిన్నారిపై ఘటనను తామూ ఖండిస్తున్నామని.. కానీ, సరిగ్గా సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలోనే వీళ్లు ఇలా డ్రామాలు ఎంతవరకు సరైందని మరికొందరు రీట్వీట్లు చేస్తూ షెఫాలీ నినాదానికి మద్ధతు ఇస్తున్నారు. హిందుస్థాన్‌లో పుట్టినందుకు సిగ్గు పడుతున్నామని.. ఆలయంలో హత్యాచారానికి గురైన 8 ఏళ్ల చిన్నారికి న్యాయం జరగాలంటూ ఈ ముగ్గురు ఫ్లకార్డ్లతో తమ ఫోటోలను ట్వీటర్లో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ను ఎదుర్కున్నారు. -
ఆ ప్రశ్నలు ఇప్పుడొద్దు
నలుగురు అమ్మాయిల గ్యాంగ్. ఒకరు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. మరొకరు పెళ్లి కోసం ఇంటినుంచి బయటకు వచ్చారు. ఇంకొకరు విడాకుల కోసం వెయిట్ చేస్తున్నారు. నాలుగో అమ్మాయి ప్రస్తుతానికి పెళ్లికి రెడీ అవుతోందట. మరి.. ఫైనల్‌గా వీరి కథకు శుభం కార్డ్ ఎలా పడింది? అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. శశాంక ఘో‹ష్ దర్శకత్వంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిక్షా తల్సానియా ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘వీరే ది వెడ్డింగ్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది. అమ్మాయిల గ్యాంగ్‌తో ట్రైలర్ మూవీపై ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాను జూన్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ట్రైలర్ లాంచ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అండ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ కామెంట్స్ గురించి సోనమ్ కపూర్ అండ్ స్వర భాస్కర్‌ను కొశ్చన్ చేశారు అక్కడి పాత్రికేయులు. అయితే క్యాస్టింగ్ కౌచ్ విషయాన్ని ఈజీగా దాటవేశారు ఈ బాలీవుడ్ భామలు. ‘‘మీరు అడిగిన ప్రశ్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాకు చెందినది కాదు.ఈ సినిమా ఫంక్షన్ నుంచి డైవర్ట్ కావడం ఇప్పుడీ సందర్భంలో సరికాదనిపిస్తోంది’’ అని తెలివిగా చెప్పారు స్వరభాస్కర్. ‘‘క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది కాదు. ఇప్పుడు సరోజ్‌ఖాన్ కామెంట్స్ గురించి స్వరభాస్కర్ స్పందిస్తే అది హెడ్లైన్ అవుతుంది. సినిమా గురించి కాదు’’ అని సోనమ్ కపూర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీనాకపూర్, తల్సానియా కూడా పాల్గొన్నారు. -
వీరే ది వెడ్డింగ్ ట్రైలర్.. వెరీ బోల్డ్
ముంబై : తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత కరీనా కపూర్ ఖాన్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో ‘వీరే ది వెడ్డింగ్’ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నలుగురు స్నేహితురాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. 2 నిమిషాల 49 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. శశాంఖ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెబోతో పాటు సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు యువతుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వారు ఎదుర్కొన్న పరిణామాల సమాహారమే ఈ సినిమా. సోనమ్ కపూర్‌కు ఎదురైన సమస్య గురించి మిగిలిన ముగ్గురు స్నేహితురాల్ల మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ట్రైలర్ బోల్డ్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్. కరీనా కపూర్‌కు ఓ యువకుడు ప్రపోజ్ చేయడంతో పెళ్లి కోసం సిద్ధమైన ఆమె ఇచ్చే బ్యాచిలరేట్ పార్టీ, సంగీత్, ఇతర పెళ్లి వేడుకలతో సరదాగా సాగుతుంది. అదే సమయంలో నలుగురు స్నేహితురాళ్లు ఒకరికొకరు ఎలా అండగా నిలిచారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. బాలాజీ టెలిఫిల్మ్స్, అనిల్ కపూర్ ఫిల్మ్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్మించాయి. బెబో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వీర్ ది వెడ్డింగ్ మే 1న విడుదల కానుంది. -
నీ బతుకెందుకు?.. నటి ఫైర్
సాక్షి, ముంబై : ఎలాంటి వ్యవహారంపైన అయినా సరే నిఖచ్ఛిగా మాట్లాడేతత్వం ఉన్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి స్పందించారు. కరీనా కపూర్‌ను ట్రోల్ చేస్తూ కొందరు చేసిన కామెంట్లపై ఆమె సీరియస్ అయ్యారు. ఓ వ్యక్తిని అయితే ఏకీపడేస్తూ ఆమె బదులు ఇచ్చారు. తాజాగా కరీనా కథువా ఘటనపై స్పందిస్తూ ఫ్లకార్డు పట్టుకున్న ఫోటోను స్వర భాస్కర్ తన ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. ‘హిందువు అయి ఉండి ఓ ముస్లింను వివాహం చేసుకున్నావ్. పైగా అతనితో కాపురం చేసి ఓ కొడుకు కన్నావ్. మళ్లీ అతని తైమూరు అనే రాక్షస రాజు పేరు పెట్టుకున్నావ్. సిగ్గు లేదా?’ అని కామెంట్ చేశాడు. దీనికి స్వర భాస్కర్ అంతే ఘాటు బదులిచ్చింది. ‘నీ బతుక్కి నువ్వు సిగ్గుపడాలి. దేవుడు నీకు బుర్ర ఇస్తే దానిని కల్మషంతో నింపావు. భారతీయునిగా, హిందువుగా పుట్టి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. బహిర్గతంగా ఇలాంటి చెత్త వాగుడు మాట్లాడటం సమంజసమేనా?’ అని ఆమె రీ ట్వీట్ చేశారు. మరికొందరికి కూడా ఆమె దాదాపు ఇలాంటి సమాధానాలే ఇచ్చారు. #KareenaKapoorKhan #IndiaAgainstRape #JusticeForOurChild #JusticeforAsifa #JusticeForUnnao pic.twitter.com/NEqPsArNC6 — Swara Bhasker (@ReallySwara) 14 April 2018 -
పెళ్లింట... బ్యాండ్ బాజా
పెళ్లింట ధూమ్ ధామ్‌గా దుమ్ము రేపే డ్యాన్స్‌తో హంగామా చేయడానికి సోనమ్ కపూర్ అండ్ గ్యాంగ్ రెడీ అయ్యారు. అదేంటీ ఆనంద్ అహూజాతో సోనమ్ పెళ్లి మేలో కదా? ఇప్పుడే గానా భజానాకి ఎందుకు రెడీ అయ్యారు అనుకుంటున్నారా? నిజమే. పెళ్లికి టైమ్ ఉంది. కానీ ఆమె నటిస్తున్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతోంది. ట్రైలర్ రిలీజ్‌కు జస్ట్ ఐదారు రోజులే ఉంది. ఆ ట్రైలర్ కోసమే ఈ హంగామా. పైగా రియల్ వెడ్డింగ్కన్నా ముందే షూటింగ్ పూర్తి చేసేయాలని సోనమ్ హడావిడి పడుతున్నారట. ప్రస్తుతం తీస్తున్న పాట తాలూకు చిన్న బిట్‌ను ట్రైలర్లో చూపించాలనుకుంటున్నారట. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, తన్సానీయా ముఖ్య పాత్రలుగా రూపొందిన సినిమా ‘వీరే ది వెడ్డింగ్’. నలుగురు అమ్మాయిల మ్యారేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగనుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కరీనా కపూర్ నటిస్తున్న తొలి చిత్రమిదే. ప్రస్తుతం ఆ సినిమాలో ‘తరీఫన్...’ అనే స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. తరీఫన్ అంటే పంజాబీలో కాంప్లిమెంట్స్ అని అర్థం అట. ఈ సాంగ్‌కు ఫరాఖాన్ కుందర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయడానికే సోనమ్ అండ్ గ్యాంగ్ రెడీ అయింది. ‘‘ఫైనల్‌గా సోనమ్ కపూర్‌తో లవ్లీ సాంగ్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఫరాఖాన్. ‘‘ఫరా.. మీతో కలిసి వర్క్ చేయడం నా లక్. ఈ సాంగ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు సోనమ్. మరి... ఈ పెళ్లింట బ్యాండ్ బాజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
దమ్మున్న అమ్మాయిలు
పెద్ద దర్శకులంటే, పెద్ద హీరోలంటే.. ఇండస్ట్రీలోని పెద్దపెద్దవాళ్లే వణికి చస్తుంటారు. ఈ హీరోయిన్లు చూడండీ.. స్వరా భాస్కర్, పార్వతి.. మనసులో ఉన్నది ఎలా ధైర్యంగా మాట్లాడేశారో! దమ్మున్న అమ్మాయిలు అనిపించారు. స్వరా భాస్కర్ బాలీవుడ్ నటి. ‘పద్మావతి’ సినిమా చూసొచ్చి భన్సాలీని పబ్లిక్‌గా తిట్టేసింది. లాస్ట్ సీన్ ఆమెకు నచ్చలేదు.. దీపికా పదుకోన్, వందల మంది మహిళల్ని వెంటేసుకుని.. ఖిల్జీ నుంచి తప్పించుకోడానికి.. వెళ్లి అగ్నిగుండంలో పడిపోవడం! ‘స్త్రీకి బతికే హక్కులేదా? స్త్రీ అంటే ఇక వేరే అర్థం లేదా? స్త్రీ దేహానికి ఇంకో పరమార్థమే లేదా’ అనే అర్థం వచ్చేలా కాస్త తీవ్రంగానే భన్సాలీపై ఆమె విరుచుకుపడింది. ఇక అప్పట్నుంచీ స్వరా భాస్కర్‌కు భన్సాలీ అభిమానుల టార్చర్ మొదలైంది. ఇంకో అమ్మాయి పార్వతి. మలయాళీ నటి. ‘కసాబా’ (2016) చిత్రంలో మమ్ముట్టీ.. మహిళా పోలీస్ బాస్‌ను అభ్యంతరకరంగా తిడతాడు. ఆ డైలాగ్‌తో ఆ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పించడం డైరెక్టర్ ఉద్దేశం కావచ్చు కానీ, స్త్రీని అనకూడని మాట అది! స్త్రీ దేహధర్మాలను కించపరిచే డైలాగ్ అది. దానిపై మమ్ముట్టిని, డైరెక్టర్‌ను తిట్టిపడేసింది పార్వతి. ఏడాదిగా తిడుతూనే ఉంది. డిసెంబర్లో మళ్లీ ఒకసారి క్రిటిక్ల సభలో ఆమె ఈ విషయాన్ని ఉతికి ఆరేసింది. మమ్ముట్టి అభిమానులు కూడా ప్రతీకారంగా పార్వతిపై ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉన్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. సినిమాల్లోనే కాదు, సినిమాల బయటా ధైర్యంగా ప్రశ్నించే అమ్మాయిలు ఉన్నారు! -
పద్మావత్‌తో అసలేం చెప్పదల్చుకున్నావ్?
సాక్షి, సినిమా : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై విలక్షణ నటి స్వర భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్మావత్ చిత్రం ద్వారా ప్రజలకు అసలేం సందేశం ఇవ్వదల్చుకున్నావంటూ భన్సాలీని ఆమె ఏకీపడేశారు. ఈ మేరకు ఆమె రాసిన ఓ బహిరంగ లేఖను ది వైర్ శనివారం ప్రచురించింది. ‘‘అత్యాచార బాధితులు, వితంతువులు, చిన్న, పెద్దా, ముసలి, గర్భవతి... ఇలా మహిళలకు ఈ సమాజంలో బతికే హక్కు ఉంటుంది. మరి అలాంటప్పుడు పద్మావత్ ద్వారా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారు?. చిత్రం చివరలో దీపిక చేసిన పద్మావతి పాత్ర అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుంటుందని చూపించారు. అయ్యా భన్సాలీగారు... ఇది 13వ శతాబ్దం కాదు.. 21వ శతాబ్ధం. మహిళలకు మాన-ప్రాణాల మీద అవగాహన,ఆత్మాభిమానం, గౌరవ మర్యాదలు ఉన్నాయి. వారిలో రాను రాను మనోధైర్యం కూడా చాలా పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో పద్మావత్ ద్వారా మీరు అసలు ఏం చెప్పదల్చుకున్నారు?. సతీ సహగమనం, జౌహర్(ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించటాన్ని జౌహర్ అంటారు) వంటి దురాచారాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది. మరి గ్రాండియర్ పేరిట పద్మావత్‌తో ఎలాంటి సందేశం ఇచ్చారో మీ ఆత్మ సాక్షిని ఓ సారి ప్రశ్నించుకోండి?’’ అంటూ స్వర భాస్కర్ 8 పేరాల లేఖలో భన్సాలీకి ప్రశ్నల వర్షంతో చురకలు అంటించారు. అయితే భన్సాలీ మాత్రం ఆమె విమర్శలపై స్పందించేందుకు నిరాకరించారు. గతంలో కూడా స్వర భాస్కర్ భన్సాలీ చిత్రాలపై తరచూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తను వెడ్స్ మను, రాంఝ్నా, తను వెడ్స్ మను రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి కమర్షియల్ చిత్రాలతోపాటు నీల్ బటే సన్నాటా, అనార్కలీ ఆఫ్ ఆరా వంటి ప్రయోగాత్మక చిత్రాలతో స్వర భాస్కర్ మంచి గుర్తింపు పొందారు. -
నిల్ బటే సన్నాటా
ఓడిపోవడం తప్పుకాదు. కాని ప్రయత్నించకుండా ఓటమిని అంగీకరించడం తప్పు. కలలు ఉండాలి.. సాకారం చేసుకోవడానికి సాహసమూ కావాలి.. అని చెప్పే సినిమా నిల్ బటే సన్నాటా! నిల్ ఇంగ్లిష్ పదం.. బటే ఉత్తరప్రదేశ్ హిందీ పదం. సన్నాటా.. హిందీ! బటే అంటే డివైడెడ్ బై, సన్నాటా అంటే నిశ్శబ్దం.. శూన్యం! సున్నాను దేనితో భాగించినా సున్నానే వస్తుంది. అదే సినిమా పేరు. అంటే నథింగ్ అని! ఈ సినిమా కూడా ఇక్కడే మొదలవుతుంది. ఆర్థికంగా ఏమీ లేనితనంతో.. లెక్కలు రానితనంతో.. భవిష్యత్ పట్ల ఆశలేని తనంతో! చందా.. కూతురి జీవితం పట్ల ఎన్నో కలలున్న తల్లి. సింగిల్ మదర్. ఓ పనిమనిషి. కూతురు అపేక్ష.. చాలా నిరాసక్తంగా, ఎలాంటి ఆశలు, కలలు లేక మొండిగా ఉంటుంది. టెన్త్‌క్లాస్ చదువుతుంటుంది. లెక్కల్లో వెనకబడుతుంది. చదవడం పట్ల పెద్దగా ఆసక్తి కూడా చూపదు. చందాకేమో తన బిడ్డ మంచి చదువులు చదివి గొప్ప ఉద్యోగం సంపాదించాలనే ఆశయం. అందుకోసం తనెంతైనా కష్టపడ్డానికి సిద్ధమవుతుంది. ఆ ఉత్సాహం బిడ్డలో నింపాలని తాపత్రయపడుతుంటుంది. మార్కులు తక్కువ వచ్చినప్పుడల్లా బాధపడి.. ‘‘బాగా చదువు, ట్యూషన్ కూడా పెట్టిస్తా’ అనడమే కాదు పెట్టిస్తుంది కూడా. అయినా చదువులో రాణించదు. ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావ్ అని తల్లి అడిగితే ‘‘పనిమనిషిగా సెటిల్ కావడానికి అంత చదువు అవసరం లేదు’’ అని సమాధానమిస్తుంది నిర్లక్ష్యంగా. ‘‘పనిమనిషి అవడమేంటి?’’ అన్న అమ్మ ప్రశ్నకు ‘‘మరి? డ్రైవర్ కొడుకు డ్రైవర్ అయినప్పుడు పనిమనిషి కూతురు పనిమనిషి కాక ఐఏఎస్ అవుతుందా?’’ అని వెటకారం చేస్తుంది తల్లిని అపేక్ష. కూతురి ప్రవర్తనతో బాధపడుతుంది చందా. ఆ పిల్ల పెడసరం మాటలకు తల్లడిల్లుతుంది. ఆమె ఆలోచనాధోరణిని మార్చాలనుకుంటుంది. కూతురు చదివే స్కూల్లో.. అపేక్ష తీరు గురించి ఒకసారి తన యజమానురాలి (రత్న పాఠక్ షా)తో చెప్తుంది చందా. ఆమెను దీదీ అని పిలుస్తూ తనకో పెద్దదిక్కుగా భావిస్తుంటుంది చందా. కూతురి తరహాతో తాను పడుతున్న బాధను పంచుకుంటుంది. వింటున్న రత్నాపాఠక్ తనదైన శైలిలో చాలా తెలివిగా చందాలో చదువుకునే ఆలోచనను రేకెత్తిస్తుంది. కూతురికి చదువు మీద ఉత్సాహం, భవిష్యత్ పట్ల ఆశ కలగాలంటే ఆమెకు పోటీగా నువ్వుండాలన్నట్టుగా చెప్తుంది. ఆలోచనల్లో పడ్తుంది చందా. తను చదువుకోవాలి.. పిల్లకు చదువు విలువ తెలియజెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. చేరాలని కూతురు చదివే స్కూల్‌కి వెళ్తుంది. చందా ఆలోచన విని విస్తుపోతాడు ప్రిన్సిపల్. అవును అంటూ నిశ్చయంగా తలూపుతుంది. జాయిన్ అయిపోతుంది... కూతురి క్లాస్‌లోనే. బిడ్డకు పోటీగా.. అపేక్షకు తల్లిగా కాకుండా ఓ స్టూడెంట్‌గానే అందరికీ పరిచయం అవుతుంది చందా. తరగతిలో తల్లీబిడ్డలు ఎవరికి ఎవరో అన్నట్టుగానే ఉంటారు. లెక్కల పట్ల చాలా శ్రద్ధ పెడ్తుంది. క్లాస్మేట్ అబ్బాయితో స్కూల్లోనే లెక్కలు చెప్పించుకుంటుంది. జీవితానికి, లెక్కలకు లంకె పెట్టి.. లాజిక్ చూపించి ఆ సబ్జెక్ట్‌ను ఈజీగా అర్థమయ్యేలా చేస్తాడు ఆ అబ్బాయి. ఆసక్తి పెరుగుతుంది చందాకు. ఉదయమే లేచి వంట చేసి, ఇళ్లల్లో పని చేసుకొని స్కూల్‌కి వెళ్తుంది. మళ్లీ సాయంకాలం ఇళ్లల్లో పని చేసుకొని ఇంటికెళ్లి చదువుకుంటుంది. తల్లి కష్టాన్ని చూసి ఈ వయసులో ఇవి అవసరమా అన్నట్టుగా నవ్వుకుంటుంది అపేక్ష. యూనిట్ టెస్ట్స్లో కూతురికన్నా తల్లికే ఎక్కువ మార్కులు వస్తాయి. ముఖ్యంగా మ్యాథ్స్‌లో. కూతురు ఫెయిలవుతుంది. చందాను చూసి బుద్ధి తెచ్చుకొమ్మని కోప్పడ్తాడు మాస్టర్. కూతురిని అలా తిట్టేసరికి తల్లి మనసు చివుక్కుమంటుంది. ఇంటికొచ్చాక బిడ్డను సముదాయిస్తుంటే అపేక్ష వినదు. క్లాస్‌లో ఆమె ప్రగతి కూతురికి మింగుడు పడదు. నెమ్మదిగా అపేక్షలోనూ పోటీతత్వం మేలుకొంటుంటుంది. తల్లికి లెక్కలు చెప్తున్న అబ్బాయితోనే తనూ లెక్కలు చెప్పించుకుంటుంది. తర్వాత జరిగిన పరీక్షలో అపేక్షకూ మంచి మార్కులు వస్తాయి. తల్లిని లెక్కచేయదు. నీకు చదువు అవసరమా అన్నట్టు ఇన్సల్ట్ చేస్తుంది. బాధపడ్డ చందా స్కూల్‌కి వెళ్లడం మానేస్తుంది. హోటల్లో, ఇళ్లల్లో పనిచేస్తూ డబ్బులు పోగేస్తుంటుంది. ఓసారి బిడ్డ మాటలకు చింత చెందుతూ రోడ్డు మీద అనాలోచితంగా కలెక్టర్ (సంజయ్ సూరి) కారుకు అడ్డం వస్తుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను తిడుతుంటే అతను కారు దిగి ‘‘ఆడవాళ్లతో మర్యాదగా మాట్లాడండి’’ అని కానిస్టేబుల్‌ను మందలిస్తాడు. ఆ ఐఏఎస్ అంటే గౌరవం పెరుగుతుంది చందాకు. ఒకసారి కలెక్టర్ బంగ్లాకు వెళ్లి అతనిని కలిసి తన గురించి, కూతురి పట్ల ఉన్న తన ఆశయం గురించీ చెప్తుంది. చదువుకు ఆకాశమే హద్దు. పనిమనిషి కూతురు పనిమనిషే కావాలని లేదు. ఐఏఎస్కూడా కావచ్చు అని చెప్తాడు. ఎలా అని అడుగుతుంది. ఆప్షన్స్ చెప్తాడు. ఆ లక్ష్యం ఆమె మనసులో నాటుకుంటుంది. అందరికీ తెలుస్తుంది... ఓసారి హోటల్ నుంచి ఇంటికి రావడం ఆలస్యం కావడంతో తనతో పాటు పనిచేసే ఓ వ్యక్తి చందాను ఇంటి దగ్గర దింపుతాడు. అది చూసిన అపేక్ష అమ్మను అపార్థం చేసుకొని అనకూడని మాట అంటుంది. చెంప చెళ్లుమనిపిస్తుంది చందా. స్కూల్లో అందరికీ తెలిసిపోతుంది అపేక్ష వాళ్లమ్మే చందా అని. చందా పట్ల అపేక్ష విసురు ప్రవర్తన గురించి కూడా తెలుస్తుంది. క్లాస్మేట్స్ అపేక్షకు చీవాట్లు పెడ్తారు. అప్పుడర్థం అవుతుంది తల్లి విలువ కూతురికి. తెల్లవారి నుంచి స్కూల్‌కి రమ్మని అమ్మను బతిమాలుతుంది. వస్తుంది. టెన్త్ మెయిన్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇద్దరూ కష్టపడి చదువుతారు. చందాకు కూతురి ఫలితాల మీదే ఆందోళన ఉంటుంది. ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయి తన మీద తల్లికి నమ్మకాన్ని పెంచుతుంది. అప్పుడు చెప్తుంది చందా కూతురితో.. ‘ప్రతి మనిషికి కల ఉండాలి. ఆ కల సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి... సాహసం ఉండాలి’’ అని. ఆ పాఠం ఆ పిల్ల జీవననేస్తం అవుతుంది. కట్‌చేస్తే.. చందా కూతురు అపేక్ష.. సివిల్స్ పాసయి ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూలో అడుగుతారు.. ‘ఐఏఎస్ ఎందుకు కావాలనుకుంటున్నావ్?’’ అని. ‘‘ఎందుకంటే నేను పనిమనిషిని కాదల్చుకోలేదు కాబట్టి’’ అని సమాధానమిస్తుంది. అపేక్ష ఐఏఎస్ అవుతుంది. సున్నాను దేనితో భాగించినా శూన్యమే. కాని సున్నాకు ఎడమవైపున ఎన్ని అంకెలు చేరిస్తే అంత విలువ పెరుగుతుంది. జీవితమూ అంతే. ఏమీ లేదనుకుని సాగితే ఏమీ కనపడదు. ఏదో కావాలని నడిస్తేనే ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ పాఠమే ‘నిల్ బటే సన్నాటా’. ఇది ఓ ఒంటరి స్త్రీ జీవన పోరాటం. కూతుర్ని ఆశలపల్లకీలో ఎక్కించడానికి ఆమె పడిన ప్రయాస. కలల ప్రపంచంలో తిప్పడానికి ఆమె చేసిన ప్రయాణం. ప్రతి అమ్మాయికి చదువు ఎంత అవసరమో అని కూడా చూపిన సినిమా. తల్లిదండ్రుల పరిమితులు పిల్లలను ఆపకూడదు అని చాటే సినిమా! చిన్న లైన్‌ను అద్భుతంగా తెరకెక్కించారు సినిమా దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి. ఇది ఆమె మొదటి సినిమా. చందాగా స్వరా భాస్కర్ నటనకు మాటల్లేవ్. అపేక్షగా రియా శుక్లా సింప్లీసూపర్బ్. ‘నిల్ బటే సన్నాటా’ చూడాలనుకునేవాళ్లు యూట్యూబ్‌లో చూడొచ్చు. ఒకసారి కలెక్టర్ బంగ్లాకు వెళ్లి అతనిని కలిసి తన గురించి, కూతురి పట్ల ఉన్న తన ఆశయం గురించీ చెప్తుంది చందా. చదువుకు ఆకాశమే హద్దు. పనిమనిషి కూతురు పనిమనిషే కావాలని లేదు. ఐఏఎస్కూడా కావచ్చు అని చెప్తాడు. ఎలా అని అడుగుతుంది. ఆప్షన్స్ చెప్తాడు. ఆ లక్ష్యం ఆమె మనసులో నాటుకుంటుంది. నిల్ బటే సన్నాటా’లో ఓ దృశ్యం -
తాగి గదిలోకి వచ్చాడు.. కౌగిలించుకోవాలన్నాడు
ముంబై : కాస్టింగ్ కౌచ్ ఈ మధ్య అన్ని సినీ పరిశ్రమల్లో సర్వసాధారణంగా వినిపిస్తున్న పేరు. అవకాశాలు దక్కాలంటే తమ అవసరాలు తీర్చాలంటూ మేకర్లు.. నటీమణులను వేధించటమన్నది దీని ప్రధాన ఉద్దేశ్యం. దీనిపై సీనియర్, జూనియర్ తేడా లేకుండా ప్రతీ హీరోయిన్లు స్పందించటం చూస్తున్నాం. అయితే ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఈ సమస్య ఎదురవ్వక తప్పదంటున్నారు టాలెంటెడ్ నటి స్వర భాస్కర్. రాంఝ్నా, ప్రేమ్ రతన్ ధన్‌పాయో లాంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆమె తానూ అలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నానని చెప్పారు. ముంబై మిర్రర్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు ఆమెను ఎలా వేధించాడో చెప్పుకొచ్చారు. ‘‘నేను అప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. ఓ చిత్ర అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను. ఆ చిత్ర దర్శకుడు అర్థరాత్రులు కూడా వదలకుండా నాతో సీన్ల గురించి చర్చించేవారు. గదికి రమ్మని చెప్పి గంటల తరబడి సోల్లు కబుర్లు చెప్పేవాడు. ఓసారి ఉన్నట్లుండి లవ్, సెక్స్ అంటూ మాట్లాడటం ప్రారంభించారు. దాంతో నాకు చాలా భయం వేసేది. మరోరోజు పీకల దాకా తాగి నా గదికి వచ్చారు. నన్ను కౌగిలించుకోవాలని ఉందంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే అప్పటికే నేను లైట్లు ఆపేసి ఉండటంతో పడుకున్నానేమో అనుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే ఆ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ నిర్మాత దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. తర్వాత పూర్తి భద్రతతో షూటింగ్ కొనసాగిందంట. అదే సమయంలో ఆ దర్శకుడిని ఆమె గట్టిగా హెచ్చరించటంతో రెండు వారాలపాటు అతను షూటింగ్‌కు రాకుండా పోయాడంట. ఆ తర్వాత ఎలాగోలా ఆ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన ఆమె తర్వాత అతని మొహం కూడా చూడలేదంట. ‘కాస్టింగ్ కౌచ్ అనేది ఓ పెద్ద తప్పు. అవకాశాల కోసం లొంగిపోవటం అంటే ప్రాణాలు పొగొట్టుకోవటమే’ అని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్, సోనమ్ కపూర్ లతోపాటు వీరే ది వెడ్డింగ్ చిత్రంలో స్వర భాస్కర్ నటిస్తోంది. -
ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే: నటి
ముంబయి : ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోన్న చిన్నారుల మృతిపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూపీ ఆరోగ్య శాఖమంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ అందక ఇప్పటివరకు 70 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోరకలిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లోని ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఫేమ్ స్వర భాస్కర్ ట్విట్టర్ ద్వారా ఈ ఘటనపై స్పందించారు. ఇతరులు చేసిన తప్పులకు చిన్నారులు బలవుతున్నారని ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు. మరోవైపు బాబా రాఘవ్‌దాస్ కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బందిపై వేటు వేసిన ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు, ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్నాథ్ కూడా బాధ్యులని తెలీదా? ఆయనపై చర్యలు తీసుకోరా? ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
సినీ ప్రమోషన్లో లైంగికంగా వేధించారు: నటి
బాలీవుడ్లో మంచినటిగా అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర సంపాదించుకుంది స్వర భాస్కర్. మసాలా సినిమా అయినప్పటికీ మహిళల సమ్మతి కూడా ముఖ్యమనే విషయాన్ని ఆమె తాజా సినిమా ‘అనార్కలి ఆఫ్ ఆర్హా’ లో చెప్పింది. ఆ తర్వాత ఫెమినిస్టుగా తన గొంతు వినిపించింది. ఇప్పుడు ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా లైంగికంగా వేధింపులకు గురైన విషయాన్ని ధైర్యంగా వెల్లడించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ప్రేమ్‌రతన్ ధన్‌పాయో సినిమా ప్రమోషన్ సందర్భంగా రాజకోట్‌లో తన పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. 2015లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ’ప్రేమ్‌రతన్ ధన్‌పాయో’లో స్వర సల్మాన్ సవతి సోదరిగా నటించింది. ‘సినిమా ప్రమోషన్ సందర్భంగా నేను సల్మాన్ సర్‌తో కలిసి ప్రయాణించాను. రాజ్‌కోట్ విమానాశ్రయంలో ఆయనను చూసేందుకు దాదాపు రెండువేల మంది చుట్టుముట్టారు. ఈ సందర్భంగా మూగిన కొందరు నన్ను లైంగికంగా తాకేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ ఉన్నా లాభం లేకపోయింది. అల్లరిగా ఉన్న అక్కడి నుంచి బయటపడి నేను కారులో ఎక్కేందుకు అక్కడే ఉన్న అనుపమ్ ఖేర్ సహాయపడ్డారు’ అని స్వర తెలిపారు. అంతకుముందు ముంబై రైల్లో ఓ తాగుబోతు తనముందే లైంగిక అసభ్య చర్యలకు పాల్పడ్డాడని, మొదట భయపడినా అతన్ని పోలీసులకు పట్టించేందుకు ప్రయత్నించానని, కానీ అతను తప్పించుకొని పారిపోయాడని తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. -
ఉగ్రదాడులతో మాకు లింకేంటి: నటి
దాయాది దేశాల మధ్య జరుగుతున్న ఉగ్రవాద పోరు వల్ల పాకిస్తాన్ ఆర్టిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ అంటోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో అల్లకల్లోల పరిస్థితులు కుదుటపడే వరకూ పాక్ ఆర్టిస్టులపై భారత్ లో తాత్కాలికంగా నిషేధం విధించగా.. బాలీవుడ్ కు చెందిన కొందరు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను నటించిన 'నిల్ బట్టే సన్నాటా' మూవీకిగానూ ఉత్తమనటిగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా పాక్ ఆర్టిస్టుల ప్రస్తుత పరిస్థితిపై నోరువిప్పింది. మా నటీనటులకు రాజకీయాలతోగానీ, ఉగ్రదాడులతోగానీ ఎలాంటి సంబంధం లేదని, అయినా వారిని ఇందులోకి లాగుతున్నారని ఆమె పేర్కొంది. నిజం చెప్పాలంటే.. పాక్ కు చెందిన ఆర్టిస్టుల పరిస్థితి దారుణమని అభిప్రాయపడింది. కొన్ని నెలల కిందట పాక్ బెస్ట్ సింగర్లలో ఒకరైన అంజాద్ సాబ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. పాకిస్తాన్ ప్రజలు కూడా ఉగ్రవాదం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో రెండుసార్లు దాయాది దేశంలో పర్యటించిన స్వర భాస్కర్ తెలిపింది. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఎక్కువగా విమర్శలపాలయ్యాడని చెప్పింది. ఇటీవల ఉడీలో ఉగ్రదాడి చేసి 19 మంది భారతీయ జవాన్లను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించింది. పీఓకేలో భారత ఆర్మీ పటిష్టమైన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి 38 మంది ఉగ్రవాదులను హతం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ నటులకు ఎలాంటి హానీ జరగకూడదని భావించిన భారతీయ సినీ ఇండస్ట్రీ పెద్దలు వారిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
ప్రేమ వ్యవహారం బయటపెట్టిన నటి
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన ప్రేమ వ్యవహారాన్ని ఎట్టకేలకు వెల్లడించింది. అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ రైటర్ హిమాన్షు శర్మతో అమ్మడు డేటింగ్ చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా రూమర్లు వచ్చాయి. అయితే పెళ్లి వార్తలను స్వర భాస్కర్ తోసిపుచ్చింది. 'త్వరలోనే మేం పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇప్పుడప్పుడే పెళ్లి పీటలు ఎక్కే ఉద్దేశం లేదు. మీమిద్దరం కెరీర్ లో బిజీగా ఉన్నాం. ప్రస్తుతానికి కెరీర్ కే మా ప్రాధాన్యం' అని ఆమె తెలిపింది. తామిద్దం డేటింగ్ లో ఉన్నామని, తమ కమిట్ మెంట్ పై హ్యాపీగా ఉన్నామని వెల్లడించింది. హిమాన్షు తన అభిమాన స్క్రిప్ట్ రైటర్ అని వెల్లడించింది. గుజారిష్, తనూ వెడ్స్ మనూ, ఔరంగజేబు, రాంజనా, తనూ వెడ్స్ మనూ రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో తదితర సినిమాల్లో స్వర భాస్కర్ నటించింది. అబ్బాస్ టైర్ వాలా లేటెస్ట్ మూవీ 'మ్యాంగో'లో ఆమె నటిస్తోంది.