Here Is All About Bollywood Celebrities Who Wedded Secretly - Sakshi
Sakshi News home page

Celebrities Secret Wedding: గుసగుసలేం లేవు.. సీక్రెట్‌గా పెళ్లి తంతు.. ఈ ఏడాది ఫ్యాన్స్‌కు షాకిచ్చిన స్టార్స్‌ వీరే!

Published Mon, Mar 6 2023 7:20 PM | Last Updated on Mon, Mar 6 2023 8:22 PM

Here Is All About Bollywood Celebrities Who Wedded Secretly in Recently - Sakshi

ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. స్టార్‌ హీరోహీరోయిన్ల నుంచి సినీ, టీవీ నటీనటుల వరకు పెళ్లి పీటలు ఎక్కినవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ జాబితాలో ఎక్కువగా ఉంది బాలీవుడ్‌ స్టార్సే. ఎంతోకాలంగా డేటింగ్‌, రిలేషన్స్‌లో ఉన్న కొందరు లవ్‌బర్డ్స్‌ రహస్యంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 2022లో కత్రినా-విక్కీ కౌశల్‌, రణ్‌బీర్‌-ఆలియా భట్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ పెళ్లి చేసుకోగా.. ఈ ఏడాది సిద్ధార్థ్‌ మల్హోత్రా-కియారా అద్వానీలతో పాటు పలువురు నటీనటులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జంటల సంఖ్య ఎక్కువగానే ఉంది. రహస్యంగా పెళ్లిపీటలెక్కి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన ఆ స్టార్స్‌ ఎవరో చూద్దాం!

పోలిటికల్‌ లీడర్‌తో హీరోయిన్‌..
నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వర భాస్కర్‌ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహాద్‌ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె ఆలస్యంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 6న అహ్మద్‌ను సీక్రెట్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోగా.. తన పెళ్లి ప్రకటనను నెల రోజుల తర్వాత ప్రకటించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్‌ వీడియో ద్వారా పంచుకుంది. వీరికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కమెడియన్‌తో నటి.. 
బాలీవుడ్‌ నటి మాన్వి గాగ్రూ కమెడియన్‌ కుమార్‌ వరుణ్‌ను పెళ్లాడింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 23న పెళ్లి పీటలెక్కింది. అయితే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు ఆలస్యంగా ప్రకటించిన ఈ జంట పెళ్లి విషయంలోనూ గోప్యత పాటించింది. వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు, అతి సన్నిహితుల సమక్షంలో ఇంటిమేట్‌ వెడ్డింగ్‌తో మాన్వి, కుమార్‌లు ఏడడుగులు వేశారు. వివాహ తంతుకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండ జాగ్రత్త పడ్డారు. కనీసం పెళ్లంటూ రూమర్స్‌ కూడా వినిపించలేదు. దీంతో పెళ్లి అనంతరం ఒక్కటయ్యామంటూ వీరిద్దరూ నెట్టింట ఫొటోలు షేర్‌ చేయడంతో ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ కంగుతిన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకున్నారంటూ వారి పోస్టుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

వాయిస్‌ ఆర్టిస్ట్‌తో నటి ఏడడుగులు..
అలాగే మరో బాలీవుడ్‌ నటి చిత్రాశి రావత్‌ కూడా రహస్యంగా పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, నటుడు, వాయిస్‌ ఆర్టిస్ట్‌ ధృవాదిత్య భగ్వనానీని ఫిబ్రవరి 4న పెళ్లాడింది. ఛత్తీస్‌ఘడ్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా తన పెళ్లి సందడిని అభిమానులతో పంచుకుంది. దీంతో క్షణాల్లో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా చిత్రాశి రావత్‌ షారుక్‌ ఖాన్‌ ‘చక్‌ దే ఇండియా’ మూవీతో గుర్తింపు పొందింది. ఇందులో హాకీ ప్లేయర్‌ కోమలిగా తన నటన, ఆటతో ఆకట్టుకుంది. 

ప్రియుడితో ‘కోడలా కోడలా కోడుకు పెళ్లామా’ నటి..
అలాగే సాత్‌ నిభానా సాతియా సీరియల్‌ నటి దేవలీనా భట్టాచార్జి (కోడలా కోడలా కొడుకు పెళ్లామా ఫేం) కూడా సీక్రెట్‌గానే పెళ్లిపీటలెక్కింది. గతేడాది డిసెంబర్‌లో తన ప్రియుడితో ఏడడుగులు వేసిన దేవలీనా ఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించింది. లోనావాలాలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో దేవలీనా స్నేహితులు విశాల్‌ సింగ్‌, రష్మీ సింగ్‌, భావిని పురోహిత్‌ దంపతులు ఉన్నారు. దీంతో ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు ఏకంగా ట్విటర్‌లో దేవలీనాకీ షాదీ (#DevoleenaKiShaadi) అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ట్రెండ్‌ అయ్యింది. 

గుట్టుచప్పుడు కాకుండా కీర్తి పెళ్లి!
బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ పెళ్లిపీటలెక్కింది. బాయ్‌ఫ్రెండ్‌, నటుడు రిబ్బు మెహ్రాను పెళ్లాడింది. ఫిబ్రవరి 25న గుట్టుచప్పుడు కాకుండా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని రిబ్బు నివాసం ఈ వివాహ వేడుకకు వేదికగా మారింది. తమ పెళ్లి ఫోటోలను కొత్త జంట ఆలస్యంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అవి వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement