Nollywood
-
గుసగుసలేం లేవు.. సీక్రెట్‌గా పెళ్లి తంతు.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన స్టార్స్ వీరే!
ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్ల నుంచి సినీ, టీవీ నటీనటుల వరకు పెళ్లి పీటలు ఎక్కినవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ జాబితాలో ఎక్కువగా ఉంది బాలీవుడ్ స్టార్సే. ఎంతోకాలంగా డేటింగ్, రిలేషన్స్‌లో ఉన్న కొందరు లవ్‌బర్డ్స్ రహస్యంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 2022లో కత్రినా-విక్కీ కౌశల్, రణ్‌బీర్-ఆలియా భట్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ పెళ్లి చేసుకోగా.. ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీలతో పాటు పలువురు నటీనటులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జంటల సంఖ్య ఎక్కువగానే ఉంది. రహస్యంగా పెళ్లిపీటలెక్కి అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఆ స్టార్స్ ఎవరో చూద్దాం! పోలిటికల్ లీడర్‌తో హీరోయిన్.. నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహాద్ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె ఆలస్యంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 6న అహ్మద్‌ను సీక్రెట్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా.. తన పెళ్లి ప్రకటనను నెల రోజుల తర్వాత ప్రకటించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. వీరికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కమెడియన్‌తో నటి.. బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ కమెడియన్ కుమార్ వరుణ్‌ను పెళ్లాడింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 23న పెళ్లి పీటలెక్కింది. అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఆలస్యంగా ప్రకటించిన ఈ జంట పెళ్లి విషయంలోనూ గోప్యత పాటించింది. వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు, అతి సన్నిహితుల సమక్షంలో ఇంటిమేట్ వెడ్డింగ్‌తో మాన్వి, కుమార్‌లు ఏడడుగులు వేశారు. వివాహ తంతుకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండ జాగ్రత్త పడ్డారు. కనీసం పెళ్లంటూ రూమర్స్ కూడా వినిపించలేదు. దీంతో పెళ్లి అనంతరం ఒక్కటయ్యామంటూ వీరిద్దరూ నెట్టింట ఫొటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్, ఫాలోవర్స్ కంగుతిన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకున్నారంటూ వారి పోస్టుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాయిస్ ఆర్టిస్ట్‌తో నటి ఏడడుగులు.. అలాగే మరో బాలీవుడ్ నటి చిత్రాశి రావత్ కూడా రహస్యంగా పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, నటుడు, వాయిస్ ఆర్టిస్ట్ ధృవాదిత్య భగ్వనానీని ఫిబ్రవరి 4న పెళ్లాడింది. ఛత్తీస్‌ఘడ్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి సందడిని అభిమానులతో పంచుకుంది. దీంతో క్షణాల్లో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా చిత్రాశి రావత్ షారుక్ ఖాన్ ‘చక్ దే ఇండియా’ మూవీతో గుర్తింపు పొందింది. ఇందులో హాకీ ప్లేయర్ కోమలిగా తన నటన, ఆటతో ఆకట్టుకుంది. ప్రియుడితో ‘కోడలా కోడలా కోడుకు పెళ్లామా’ నటి.. అలాగే సాత్ నిభానా సాతియా సీరియల్ నటి దేవలీనా భట్టాచార్జి (కోడలా కోడలా కొడుకు పెళ్లామా ఫేం) కూడా సీక్రెట్‌గానే పెళ్లిపీటలెక్కింది. గతేడాది డిసెంబర్లో తన ప్రియుడితో ఏడడుగులు వేసిన దేవలీనా ఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించింది. లోనావాలాలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో దేవలీనా స్నేహితులు విశాల్ సింగ్, రష్మీ సింగ్, భావిని పురోహిత్ దంపతులు ఉన్నారు. దీంతో ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు ఏకంగా ట్విటర్లో దేవలీనాకీ షాదీ (#DevoleenaKiShaadi) అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా కీర్తి పెళ్లి! బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ పెళ్లిపీటలెక్కింది. బాయ్‌ఫ్రెండ్, నటుడు రిబ్బు మెహ్రాను పెళ్లాడింది. ఫిబ్రవరి 25న గుట్టుచప్పుడు కాకుండా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని రిబ్బు నివాసం ఈ వివాహ వేడుకకు వేదికగా మారింది. తమ పెళ్లి ఫోటోలను కొత్త జంట ఆలస్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. -
బాలీవుడ్ నాకేం ఇవ్వలేదు: సీనియర్ నటుడు
బాలీవుడ్లో ఏ బ్యాక్‌గ్రౌండూ లేని వాళ్ల టాలెంట్‌ను తొక్కేస్తారన్న నిందలు ఒకవైపు ఉంటే ఎంత పేరు ఉన్నా ఇవ్వాల్సినన్ని వేషాలు ఇవ్వలేదు అని బాధపడేవారు మరోవైపు. సీనియర్ నటుడు కబీర్ బేడీ తన తాజా పుస్తకం ‘స్టోరీస్: ఐ మస్ట్ టెల్’ వస్తున్న సందర్భంగా ‘నాకు ఇవ్వాల్సినన్ని వేషాలు ఇవ్వలేదు’ అని బాలీవుడ్‌ను తలుచుకుని వాపోయాడు. ఢిల్లీలో జన్మించి భారతీయ నటుడిగా ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన కబీర్ బేడీ అమెరికా, యు.కె, యూరప్‌లలో ఎంత పని చేసినా తన దేశంలో తాను చేయగలిగినన్ని పాత్రలు చేయలేదని బాధ పడ్డాడు. ఇటీవల అతని తాజాపుస్తకానికి సంబంధించి వర్చువల్‌గా సల్మాన్ ఖాన్ అతిథిగా జరిగిన కార్యక్రమంలో కబీర్ బేడీ ఈ వ్యాఖ్య చేశాడు. ‘నేను నటుడిగా పరిణితి చెందిన కొద్దీ ఆ పరిణితికి చెందిన పాత్రలను నాకు బాలీవుడ్ ఇవ్వలేదు. నేను వాటికోసం ఎదురు చూస్తూనే ఉండిపోయాను. నా పని అంతా దేశం బయటే సాగాల్సి వచ్చింది’ అన్నాడతను. 76 ఏళ్ల ఈ అందగాడు సినిమా జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కల్చరల్ షాకులిచ్చాడు. ఇప్పటి వరకూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కబీర్ తన కుమార్తె పూజా బేడీ ప్రేమకు, ఆగ్రహానికి కూడా కారకుడయ్యాడు. అతని ఆస్తి తనకు దక్కడానికి అది ఏ ప్రియురాలి బారినో పడకుండా ఉండటానికి పూజా చాలా బాధలు పడాల్సి వచ్చింది. ‘నా విజయాలను, నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లను, బాధలను కూడా ఈ పుస్తకంలో వెల్లడి చేశాను’ అని కబీర్‌బేడి చెప్పాడు. ‘మీ పుస్తకం నుంచి కొత్తతరం నేర్చుకునే విషయాలు తప్పక ఉంటాయని భావిస్తాను’ అని సల్మాన్ ఖాన్ అన్నాడు. ఇంతకీ పుస్తకంలో ఏముందో చదివితే తప్ప తెలియదు. చదవండి: అమితాబ్‌కి భార్యగా..'నా కల నెరవేరింది' ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు -
రాజమౌళికి కొత్త అభిమానిని : నైజీరియా దర్శకురాలు
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో భారీ వసూళ్లు సాధించటంతో పాటు భారతీయ సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈసినిమాపై అంతర్జాతీయ స్థాయి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో టాప్ డైరెక్టర్ చేశారు. నైజీరియాకు చెందిన మహిళా దర్శకురాలు టోపె ఓషిన్ ఇటీవల బాహుబలి సినిమాను చూసి సినిమాపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. బాహుబలి సినిమా రెండు భాగాలను మార్చి మార్చి చూసినట్టుగా వెల్లడించినా ఓషిన్, ఎలా స్పందించాలో అర్థం కావటం లేదని ట్వీట్ చేశారు. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్. సినిమా చూస్తున్నప్పుడు నాకు బాధ, ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం కలిగాయి.నా మీద బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. బాహుబలి సినిమా కోసం ఎంత సమయమైనా కేటాయించ వచ్చు అందుకే స్క్రిప్ట్, ఎడిటింగ్ లాంటి చాలా పనులున్నా పక్కన పెట్టి సినిమా చూశాను. నేను మళ్లీ బాహుబలి గురించి ట్వీట్ చేయకుండా ఉండగలనేమో చూస్తాను. అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను కూడా చూస్తానని వెల్లడించారు ఓషిన్. This film experience called #Baahubali Still catching my breath. I’ll come back and tweet a lot. Or maybe too little, if I still find myself tongue tied and catching my breath. 😮😮😮😮 — Tope Oshin (@topeoshin) 15 January 2018 I watched Part 1. And then the 1st half of Part 1 again. And then Part 2. And I’m going back to watch Part 1 again now, and then I know I’ll watch part 2 again. Whaaaat. I’m not going to recover from this film in a while. @niyiakinmolayan you were sooooo right!!! #Baahubali — Tope Oshin (@topeoshin) 15 January 2018 Right now I feel very unworthy to share same #Filmmaker title with the makers of #Baahubali It’s a complete masterpiece, judged by the entire experience you get from watching it. Bowing in awe! 🙇🏽♀️ 🙇🏽♀️ 🙇🏽♀️ — Tope Oshin (@topeoshin) 15 January 2018 I’m excited, sad, happy, content, wowed, entertained, spellbound, intimidated, encouraged, transported, all in one from watching #Baahubali! I guess it’s what I’ll now call #TheBaahubaliEffect 😰🤩😱❤️ — Tope Oshin (@topeoshin) 15 January 2018 And yes I have and am in the middle of pending work. Edits. Scripts to read and review, emails to draft and reply. But this #Baahubali break was worth stopping everything and more! 😰😰😰 Now, back to work. I’ll try not to tweet about the film again. I hope. 🤔 — Tope Oshin (@topeoshin) 15 January 2018 -
అక్కడ ఆడవాళ్ల చర్చంతా ఈ ఆపరేషన్లపైనే!
అమెరికన్ కిమ్ కర్ధాషియన్ ఆఫ్రికన్ మహిళలలను చెడగొడుతోందా? చెడగొడితే చెడిపోతారా ఎవరైనా? కోహ్లి చేయించుకున్నాడని స్టెప్ కటింగ్, ప్రభాస్ వేసుకున్నాడని మిర్చీ డ్రెస్ ఎంత మంది యూత్ సొంతం చేసుకోలేదు! మనది అభిమానం అయినప్పుడు కర్దాషియన్ ది కూడా తప్పులేనట్లే! ఇంతకీ అసలు విషయం ఏమంటే నాలీవుడ్ లో కిమ్ లాగే 'లేడీ వడివేలు'ల సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కడిదీ నాలీవుడ్? ఎవరీ లేడీ వడివేలులు అనగా.. ప్రేమికుడు సినిమా గుర్తుందా.. అందులో బాటమ్స్ ఎత్తుగా కనపడేలా వడివేలు గోచీ పెట్టుకుని, పైన ప్యాంట్ వేసుకునే సీన్ మర్చిపోలేం కదా. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో మహిళలు ఇలాంటి ఐడియానే ఫాలో అవుతున్నారు. మరీ ముఖ్యంగా నాలీవుడ్(నైజీరియా ఫిలిం ఇండస్ట్రీ) హీరోయిన్లయితే బాటమ్స్ ఎత్తు పెంచుకునే ఆపరేషన్లు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కిమ్ కర్దాషియన్ కూడా ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే సోషల్ మీడియా స్టార్ గా ఎదిగారు. ఆమెను చూసి, ఆమెలా తయారైతే తామూ సూపర్ స్టార్లుగా మారిపోతామనుకుంటున్నారట నాలీవుడ్ హీరోయిన్లు.ఆఫ్రికా సంప్రదాయాల ప్రకారం వెనుక భాగం ఎత్తుగా మహిళలు అందెగత్తెలనే నమ్మకం స్థిరపడటం కూడా ఆపరేషన్ల పెరుగుదలకు మరో కారణం. డబ్బున్నవాళ్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటుండగా, మధ్యతరగతి, పేద మహిళల కోసం రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. వెనుక భాగం ఉబ్బెత్తుగా ఉండేలా తయారుచేసిన లో దుస్తులు ధరిస్తే ఎవరైనాసరే 'లేడీ వడివేలు'లా కనిపిస్తారు. ఈ ప్లాస్టిక్ సర్జరీల పుణ్యమాని డాక్టర్లు కోటీశ్వరులైపోతున్నారు. 'డబ్బున్నవాళ్లు జరుపుకొంటున్న పార్టీల్లో ఆడవాళ్ల చర్చంతా ఈ ఆపరేషన్లపైనే' అంటున్నారు సర్జన్ డాక్టర్ ఎబునే.