అమెరికన్ కిమ్ కర్ధాషియన్ ఆఫ్రికన్ మహిళలలను చెడగొడుతోందా? చెడగొడితే చెడిపోతారా ఎవరైనా? కోహ్లి చేయించుకున్నాడని స్టెప్ కటింగ్, ప్రభాస్ వేసుకున్నాడని మిర్చీ డ్రెస్ ఎంత మంది యూత్ సొంతం చేసుకోలేదు! మనది అభిమానం అయినప్పుడు కర్దాషియన్ ది కూడా తప్పులేనట్లే! ఇంతకీ అసలు విషయం ఏమంటే నాలీవుడ్ లో కిమ్ లాగే 'లేడీ వడివేలు'ల సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కడిదీ నాలీవుడ్? ఎవరీ లేడీ వడివేలులు అనగా..
ప్రేమికుడు సినిమా గుర్తుందా.. అందులో బాటమ్స్ ఎత్తుగా కనపడేలా వడివేలు గోచీ పెట్టుకుని, పైన ప్యాంట్ వేసుకునే సీన్ మర్చిపోలేం కదా. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో మహిళలు ఇలాంటి ఐడియానే ఫాలో అవుతున్నారు. మరీ ముఖ్యంగా నాలీవుడ్(నైజీరియా ఫిలిం ఇండస్ట్రీ) హీరోయిన్లయితే బాటమ్స్ ఎత్తు పెంచుకునే ఆపరేషన్లు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కిమ్ కర్దాషియన్ కూడా ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే సోషల్ మీడియా స్టార్ గా ఎదిగారు. ఆమెను చూసి, ఆమెలా తయారైతే తామూ సూపర్ స్టార్లుగా మారిపోతామనుకుంటున్నారట నాలీవుడ్ హీరోయిన్లు.ఆఫ్రికా సంప్రదాయాల ప్రకారం వెనుక భాగం ఎత్తుగా మహిళలు అందెగత్తెలనే నమ్మకం స్థిరపడటం కూడా ఆపరేషన్ల పెరుగుదలకు మరో కారణం.
డబ్బున్నవాళ్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటుండగా, మధ్యతరగతి, పేద మహిళల కోసం రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. వెనుక భాగం ఉబ్బెత్తుగా ఉండేలా తయారుచేసిన లో దుస్తులు ధరిస్తే ఎవరైనాసరే 'లేడీ వడివేలు'లా కనిపిస్తారు. ఈ ప్లాస్టిక్ సర్జరీల పుణ్యమాని డాక్టర్లు కోటీశ్వరులైపోతున్నారు. 'డబ్బున్నవాళ్లు జరుపుకొంటున్న పార్టీల్లో ఆడవాళ్ల చర్చంతా ఈ ఆపరేషన్లపైనే' అంటున్నారు సర్జన్ డాక్టర్ ఎబునే.
అక్కడ ఆడవాళ్ల చర్చంతా ఈ ఆపరేషన్లపైనే!
Published Tue, Jun 7 2016 2:38 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement
Advertisement