ఆఫ్రికా తీరంలో భారతీయుల కిడ్నాప్‌ | Pirates kidnap 20 Indians aboard commercial vessel off west African coast | Sakshi
Sakshi News home page

ఆఫ్రికా తీరంలో భారతీయుల కిడ్నాప్‌

Published Tue, Dec 17 2019 1:55 AM | Last Updated on Tue, Dec 17 2019 1:55 AM

Pirates kidnap 20 Indians aboard commercial vessel off west African coast - Sakshi

న్యూఢిల్లీ: ఆఫ్రికా పశ్చిమ తీరంలో 20 మంది భారతీయులను సముద్ర దొంగలు కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌ వ్యవహారాన్ని భారత అధికారులు నైజీరియా అధికారులకు చేరవేశారు. హాంకాంగ్‌ జెండాతో ఉన్న పడవలో వీరు ప్రయాణిస్తుండగా కిడ్నాప్‌ అయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 10 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై నైజీరియా అధికారులతో మాట్లాడామని విదేశాంగ శాఖ తెలి పింది. నైజీరియా తీరం వెంట ఇలా జరగడం ఈ ఏడాది ఇది మూడోది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement