కబీర్ బేడీ
బాలీవుడ్‌లో ఏ బ్యాక్‌గ్రౌండూ లేని వాళ్ల టాలెంట్‌ను తొక్కేస్తారన్న నిందలు ఒకవైపు ఉంటే ఎంత పేరు ఉన్నా ఇవ్వాల్సినన్ని వేషాలు ఇవ్వలేదు అని బాధపడేవారు మరోవైపు. సీనియర్ నటుడు కబీర్ బేడీ తన తాజా పుస్తకం ‘స్టోరీస్: ఐ మస్ట్ టెల్’ వస్తున్న సందర్భంగా ‘నాకు ఇవ్వాల్సినన్ని వేషాలు ఇవ్వలేదు’ అని బాలీవుడ్‌ను తలుచుకుని వాపోయాడు. ఢిల్లీలో జన్మించి భారతీయ నటుడిగా ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన కబీర్ బేడీ అమెరికా, యు.కె, యూరప్‌లలో ఎంత పని చేసినా తన దేశంలో తాను చేయగలిగినన్ని పాత్రలు చేయలేదని బాధ పడ్డాడు. ఇటీవల అతని తాజాపుస్తకానికి సంబంధించి వర్చువల్‌గా సల్మాన్ ఖాన్ అతిథిగా జరిగిన కార్యక్రమంలో కబీర్ బేడీ ఈ వ్యాఖ్య చేశాడు.
‘నేను నటుడిగా పరిణితి చెందిన కొద్దీ ఆ పరిణితికి చెందిన పాత్రలను నాకు బాలీవుడ్ ఇవ్వలేదు. నేను వాటికోసం ఎదురు చూస్తూనే ఉండిపోయాను. నా పని అంతా దేశం బయటే సాగాల్సి వచ్చింది’ అన్నాడతను. 76 ఏళ్ల ఈ అందగాడు సినిమా జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కల్చరల్ షాకులిచ్చాడు. ఇప్పటి వరకూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కబీర్ తన కుమార్తె పూజా బేడీ ప్రేమకు, ఆగ్రహానికి కూడా కారకుడయ్యాడు. అతని ఆస్తి తనకు దక్కడానికి అది ఏ ప్రియురాలి బారినో పడకుండా ఉండటానికి పూజా చాలా బాధలు పడాల్సి వచ్చింది. ‘నా విజయాలను, నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లను, బాధలను కూడా ఈ పుస్తకంలో వెల్లడి చేశాను’ అని కబీర్‌బేడి చెప్పాడు. ‘మీ పుస్తకం నుంచి కొత్తతరం నేర్చుకునే విషయాలు తప్పక ఉంటాయని భావిస్తాను’ అని సల్మాన్ ఖాన్ అన్నాడు. ఇంతకీ పుస్తకంలో ఏముందో చదివితే తప్ప తెలియదు.
చదవండి: అమితాబ్‌కి భార్యగా..'నా కల నెరవేరింది'
ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment