Kabir Bedi
-
గ్లామర్ హీరోయిన్.. మతిస్థిమితం కోల్పోయి.. చివరి రోజుల్లో తిండి మానేసి..
అందంతో కట్టిపడేసింది. నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది. సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అందచందాలకు జనాలే కాదు సినీఇండస్ట్రీ దాసోహమైంది. తనతో పరిచయం పెంచుకోవాలని చూసినవారు కొందరైతే ప్రేమాయణం నడిపినవారు మరికొందరు. కానీ ఏ ప్రేమా పెళ్లిదాకా వెళ్లలేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్స్‌తోనే సావాసం చేసింది. ఆఖరి రోజుల్లో మానసిక స్థితి సరిగా లేక.. అనారోగ్యంతో కన్నుమూసింది. వెండితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన ఆవిడ పేరు పర్వీన్ బాబి. నేడు (జనవరి 20) ఆమె ఇరవయ్యవ వర్ధంతి. ఈ సందర్భంగా తనపై ప్రత్యేక కథనం..పద్నాలుగేళ్లకు పుట్టిన ఆశాదీపం పర్వీన్పర్వీన్ బాబి (Parveen Babi) గుజరాత్లో పుట్టింది. పెళ్లయిన పద్నాలుగేళ్లకు పర్వీన్ పుట్టడంతో ఆ పేరెంట్స్ సంతోషపడిపోయారు. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా పెంచారు. కానీ తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. తండ్రి మరణం తర్వాత తల్లితో ఓ హవేలీలో నివసించింది. సైకాలజీ చదివిన పర్వీన్ మోడలింగ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడి నుంచి సినీపరిశ్రమవైపు అడుగులు వేసింది. క్రికెటర్ సలీమ్ దురానీ సరసన చరిత్ర మూవీలో యాక్ట్ చేసింది. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చింది దర్శకుడు కిశోర్ సాహు. వేశ్యగా నటించిన పర్వీన్తనకు గుర్తింపు ఇచ్చిన ఫస్ట్ మూవీ మజ్బూర్ అయితే సెన్సేషన్ సృష్టించింది మాత్రం దీవార్. ఈ సినిమాలో పర్వీన్.. వేశ్యగా నటించింది. తర్వా అమర్ అక్బర్ ఆంటోని, కాల పత్తర్, సుహాగ్, షాన్, నమక్ హలాల్, ద బర్నింగ్ ట్రైన్.. ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్‌తో ఆరు సినిమాలు చేయగా అన్నీ హిట్లు, సూపర్ హిట్లుగానే నిలవడం విశేషం. ఎక్కువగా మోడ్రన్, గ్లామర్ పాత్రలే వేస్తూ టాప్ హీరోయిన్గా కొనసాగింది. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన మొట్టమొదటి బాలీవుడ్ నటిగానూ చరిత్ర సృష్టించింది.ప్రేమ- పెళ్లి?1969లో పాకిస్తాన్‌కు చెందిన దూరపు బంధువుతో ఎంగేజ్మెంట్ జరిగింది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆ నిశ్చితార్థం పెళ్లిదాకా రాకుండానే ఆగిపోయింది. తర్వాత నటుడు, విలన్ డేనీ డెంజోంగ్పా(Danny Denzongpa)ను ప్రేమించింది. చిత్రపరిశ్రమ అంతా పర్వీన్ వెంటపడుతుంటే ఆమె మాత్రం డానీ కోసం పరితపించింది. అతడు కూడా పర్వీన్‌ను చూసి ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉండటం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. కానీ ఇద్దరూ సినిమాలతో బిజీ అవడంతో కాసేపు కలిసుండే సమయం కూడా కరువైంది. దీంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఫ్రెండ్షిప్ను కొనసాగించారు.(చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?)పెళ్లయిన వ్యక్తితో లవ్అనంతరం నటుడు, వివాహితుడు కబీర్ బేడీ (Kabir Bedi)తో ప్రేమలో పడింది. ఇటాలియన్ సీరియల్ సెట్ వీరి ప్రేమకు పునాది వేసింది. కానీ కబీర్‌కు యూరప్‌లో గ్రాఫ్ పెరగడంతో బాలీవుడ్ రాలేకపోయాడు. అటు పర్వీన్.. తను సంతకం చేసిన సినిమాల కోసం ముంబై తిరిగిరాక తప్పలేదు. రెండేళ్ల లవ్ జర్నీకి ఫుల్స్టాప్ పెట్టింది. గుండె నిండా ఆ బాధ కూరుకుపోయినప్పుడే ఉన్నప్పుడే మహేశ్ భట్ (Mahesh Bhatt) పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం.. స్నేహంగా, ప్రేమగా మారింది. కానీ అప్పటికే మహేశ్‌కు పెళ్లయి కూతురు (పూజా భట్) కూడా ఉంది. పర్వీన్‌కు పిచ్చి అభిమాని అయిన మహేశ్ కుటుంబాన్ని వదిలేశాడు. ఇల్లొదిలేసి పర్వీన్‌తో సహజీవనం మొదలుపెట్టాడు. మూడేళ్లు కలిసున్నారు.దిగజారిన మానసిక స్థితిఓ రోజు మహేశ్ ఇంటికి వచ్చేసరికి పర్వీన్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నన్ను చంపడానికి అమితాబ్ ఫ్యాన్‌లో ఏదో డివైజ్ పెట్టాడు అంటూ కత్తి పట్టుకుని నిల్చుంది. అమితాబ్ తనను కిడ్నాప్ చేయించాడంది. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడున్న శంఖంలో బాంబ్ ఉందంటూ అరిచి గోల చేసింది. తనను ఎవరో ఏదో చేస్తారని మంచం కింద దాక్కునేది. తనకు పెట్టే భోజనంలో విషం కలుపుతున్నారని అనుమానించేది. ఎవరైనా ఒక ముద్ద తింటేకానీ ప్లేటు ముట్టేది కాదు. ఇలా రోజురోజుకూ ఆమె మానసిక ఆరోగ్యం దిగజారుతుంటే మహేశ్‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉన్న ఒక్క స్నేహితుడినీ గెంటేసిన హీరోయిన్సైకియాట్రిస్ట్కు చూపిస్తే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అని తేలింది. టాబ్లెట్స్‌తో ఫలితం లేకపోవడంతో సినిమా వాతావరణానికి దూరంగా బెంగళూరులో ఉంచారు. అక్కడ ఆమె ఎక్కువరోజులు ఉండలేక ముంబైకి తిరుగుప్రయాణమైంది. డానీ.. తనకు ఏ కాస్త సమయం దొరికినా పర్వీన్ దగ్గరకు వెళ్లి ఆమెను సరదాగా ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ ఓ రోజు డానీని ఇంట్లోకి రానివ్వలేదు పర్వీన్. నన్ను చంపేందుకు నిన్ను అమితాబ్ పంపాడు కదా.. గెటవుట్ అని అరిచింది. బిగ్‌బీ మనుషులు తనను చంపాలనుకుంటున్నారన్న అనుమానంతో నిద్రాహారాలకు దూరమైంది. ఒంటరిగా..మహేశ్ తన పరిస్థితి చూడలేక ఇంట్లో నుంచి వచ్చేశాడు. భార్యకు దగ్గరయ్యాడు. దీంతో పర్వీన్ ఒంటరిగానే మిగిలిపోయింది. మధుమేహం, కీళ్లనొప్పులతోనూ బాధపడింది. 2005 జనవరి 20న పర్వీన్ (50) చనిపోయింది. ఆ విషయం రెండు మూడు రోజులవరకు ఇరుగుపొరుగుకు కూడా తెలియలేదు. తిండి మానేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని చెప్తుంటారు. పర్వీన్ మరణవార్త తెలిసి పరుగెత్తికొచ్చిన మహేశ్ ఆమె అంత్యక్రియలు జరిపించాడు. పర్వీన్ తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమానంగా రాసిచ్చింది.చదవండి:ర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
నాకు యాక్టింగ్ రాదు.. అందుకే బాడీ చూపించా: పూజా బేడీ
చాలామంది హీరోయిన్లకు యాక్టింగ్ రాదు. ఏదో గ్లామర్‌తో మేనేజ్ చేసేస్తుంటారంతే! అయితే తమకు నటించడం రాదని ఎవరైనా చెబుతారా? కానీ బాలీవుడ్ నటి పూజా బేడీ ఇప్పుడు అదే చేసింది. తనకు అస్సలు యాక్టింగ్ రాదని, దీని నుంచి తప్పించుకునే బాడీ పార్ట్స్ చూపించి తప్పించుకునేదాన్ని అని షాకింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూతురు పూజా బేడీ. పలు హిందీ సినిమాల్లో ఈమె నటించగా, అవి హిట్ అయ్యాయి. కాకపోతే ఈమె పెద్దగా మూవీస్ చేయలేదు. తెలుగులో చిట్టెమ్మ గారి మొగుడు, ఎన్టీఆర్ 'శక్తి' చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇవి రెండూ డిజాస్టర్స్ కావడంతో తెలుగులో మరో అవకాశం రాలేదు.రీసెంట్గా ఫిక్కీ (FICCI) ఈవెంట్లో పాల్గొన్న ఈమె.. తనో దారుణమైన నటి అని చెప్పింది. క్లీవేజ్(ఛాతీ భాగం) చూపించి మేనేజే చేసేదాన్ని అని పూజా బేడీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా బేడీ కూతురు ఆలయ.. బాలీవుడ్లో హీరోయిన్గా చేస్తోంది. తన కుమార్తె మాత్రం తనలాంటిది కాదని, ఉదయం 6 గంటలకే నిద్రలేస్తుందని.. యాక్టింగ్ ప్రొఫెషన్ అంటే ఆమెకు డెడికేషన్ అని చెప్పుకొచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే పూజా బేడీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు) -
శాకుంతలం: కీలకపాత్రలో బాలీవుడ్ నటుడు
దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శకుంతలగా సమంత, దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ పోషిస్తున్నారు. ఓ కీలక పాత్రను బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ పోషించనున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు చిత్రనిర్మాతల్లో ఒకరైన గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ. ఈ సినిమా అంగీకరించిన సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ బుక్ ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్’ని నీలిమకు బహమతిగా ఇచ్చి, ‘‘డియర్ నీలిమ. ఈ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు «థ్యాంక్స్. నిన్ను నా సోదరిలా భావిస్తున్నాను. నీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కబీర్ బేడి. ‘‘థ్యాంక్యూ సార్. మీతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు నీలిమ. ఈ చిత్రానికి ‘దిల్’ రాజు ఓ నిర్మాత. Thank you so much @iKabirBedi Sir, such a privilege to work with you. Can’t wait to read this. #StoriesIMustTell #KabirBediSir #Shaakuntalam pic.twitter.com/1zxfo2eSSd — Neelima Guna (@neelima_guna) August 5, 2021 -
ఒకానొక సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి: కబీర్ బేడి
న్యూఢిల్లీ: జీవితంలో అనుకోని విజయాలు, అంతలోనే పతనాలు ఇలా ఎన్నో చూశానంటున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు కబీర్ బేడి. ఇటీవల ఆయన రాసిన పుస్తకం ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్’ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన మనవరాలు ఆలయతో లైవ్ వీడియో చాట్‌లో ముచ్చటించారు. కబీర్ రాసిన పుస్తకం మార్కెట్లో అత్యధిక కాపీలు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆయన తన మనవరాలు అలయతో చాలా సేపు సంభాషించారు. అందులో కబీర్.. తన జీవితంలో చవిచూసిన ఎత్తు పల్లాలు, వివిధ సంబంధాలు, వివాహం, విడాకులు, మానసిక ఆరోగ్యం లాంటి అంశాలను పంచుకున్నారు. కబీర్ రాసిన పుస్తకం తన స్నేహితులు చదివారని, వారికి ఎంతగానో నచ్చిందని ఆలయ తెలిపింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది నా జీవితంలో ఊహించని విజయాలు, అనుకోని పతనాలను చూడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది. కాని అంతలా జీవితంలో కిందకు పడ్డా వాటి నుంచి లేచాను. లైఫ్‌లో ఫెయిల్యూర్ కావడం సహజమే, కాని ఎదగాలన్న ఆశ వదులుకోవద్దు. నా వైఫల్యాల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నాను అలాగే ఇతరులు కూడా చేస్తారని ఆశిస్తున్నానని ఆయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. కబీర పుస్తకానికి స్పందన రోజు రోజు పెరుగుతుండడంతో ఆయన తన పుస్తకాన్ని ఇటలీలో అతిపెద్ద ప్రచురణకర్త అయిన మొండడోరితో సెప్టెంబర్‌లో ఇటలీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by ALAYA F (@alayaf) చదవండి: తాప్సీపై కంగనా ఫైర్.. తన పేరు వాడొద్దంటూ చురకలు -
బాలీవుడ్ నాకేం ఇవ్వలేదు: సీనియర్ నటుడు
బాలీవుడ్లో ఏ బ్యాక్‌గ్రౌండూ లేని వాళ్ల టాలెంట్‌ను తొక్కేస్తారన్న నిందలు ఒకవైపు ఉంటే ఎంత పేరు ఉన్నా ఇవ్వాల్సినన్ని వేషాలు ఇవ్వలేదు అని బాధపడేవారు మరోవైపు. సీనియర్ నటుడు కబీర్ బేడీ తన తాజా పుస్తకం ‘స్టోరీస్: ఐ మస్ట్ టెల్’ వస్తున్న సందర్భంగా ‘నాకు ఇవ్వాల్సినన్ని వేషాలు ఇవ్వలేదు’ అని బాలీవుడ్‌ను తలుచుకుని వాపోయాడు. ఢిల్లీలో జన్మించి భారతీయ నటుడిగా ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన కబీర్ బేడీ అమెరికా, యు.కె, యూరప్‌లలో ఎంత పని చేసినా తన దేశంలో తాను చేయగలిగినన్ని పాత్రలు చేయలేదని బాధ పడ్డాడు. ఇటీవల అతని తాజాపుస్తకానికి సంబంధించి వర్చువల్‌గా సల్మాన్ ఖాన్ అతిథిగా జరిగిన కార్యక్రమంలో కబీర్ బేడీ ఈ వ్యాఖ్య చేశాడు. ‘నేను నటుడిగా పరిణితి చెందిన కొద్దీ ఆ పరిణితికి చెందిన పాత్రలను నాకు బాలీవుడ్ ఇవ్వలేదు. నేను వాటికోసం ఎదురు చూస్తూనే ఉండిపోయాను. నా పని అంతా దేశం బయటే సాగాల్సి వచ్చింది’ అన్నాడతను. 76 ఏళ్ల ఈ అందగాడు సినిమా జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కల్చరల్ షాకులిచ్చాడు. ఇప్పటి వరకూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కబీర్ తన కుమార్తె పూజా బేడీ ప్రేమకు, ఆగ్రహానికి కూడా కారకుడయ్యాడు. అతని ఆస్తి తనకు దక్కడానికి అది ఏ ప్రియురాలి బారినో పడకుండా ఉండటానికి పూజా చాలా బాధలు పడాల్సి వచ్చింది. ‘నా విజయాలను, నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లను, బాధలను కూడా ఈ పుస్తకంలో వెల్లడి చేశాను’ అని కబీర్‌బేడి చెప్పాడు. ‘మీ పుస్తకం నుంచి కొత్తతరం నేర్చుకునే విషయాలు తప్పక ఉంటాయని భావిస్తాను’ అని సల్మాన్ ఖాన్ అన్నాడు. ఇంతకీ పుస్తకంలో ఏముందో చదివితే తప్ప తెలియదు. చదవండి: అమితాబ్‌కి భార్యగా..'నా కల నెరవేరింది' ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు -
గుర్రపు స్వారీ...రెడీ
హీరోలకు దీటుగా తాము స్టంట్స్ చేయగలమని నిరూపిస్తున్నారు కొందరు కథానాయికలు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్. ఆమె తన తాజా చిత్రం ‘పానిపట్’ కోసం గుర్రపు స్వారీ సాధన చేస్తున్నారు. అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతీసనన్, కబీర్ బేడి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పానిపట్’. 17వ శతాబ్దంలో జరిగిన మూడో పానిపట్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బీటౌన్ టాక్. ‘‘హార్స్ రైడింగ్ (గుర్రపు స్వారీ) సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సారి ‘పానిపట్’ సినిమా కోసం సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కృతీసనన్. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య హీరోగా చేసిన ‘దోచేయ్’ చిత్రాలతో తెలుగు తెరపై మెరిశారు ఈ బ్యూటీ. -
కలకలం రేపిన సుచిత్ర
ముంబై: బాలీవుడ్ ప్రముఖులు కబీర్ బేడి, సుచిత్రా కృష్ణమూర్తి మధ్య వివాదం రాజుకుంది. తన కుమార్తెకు చెందిన ఇంటిని బేడి ఖాళీ చేయడం లేదని సుచిత్ర ఆరోపించారు. అయితే తాము అద్దెకు ఉంటున్న ఇల్లు సుచిత్ర కుమార్తెకు చెందినది కాదని బేడి తెలిపారు. ధంతేరస్ సందర్భంగా బేడి తన భార్య పర్వీన్ దుసాంజ్తో కలిసి వజ్రాలు కొంటున్న ఫొటోను సుచిత్ర ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా... ‘వజ్రాలు కొనుక్కోవడానికి డబ్బులుంటాయని కానీ, సొంత ఫ్లాట్ కొనుక్కుని కావేరి ఇల్లు ఖాళీ చేయడానికి డబ్బులుండవు. ఇలాంటి ప్రవర్తనను ఏమనాల’ని సుచిత్ర కామెంట్ పెట్టారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న మూడు పడక గదుల ఫ్లాట్‌లో బేడి అద్దెకు ఉంటున్నారు. అయితే ఈ ఫ్లాట్ తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌కు చెందినదని.. చట్ట ప్రకారం ఇది తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్ర వాదిస్తున్నారు. తన కూతురు ఉండటానికి ఇల్లు లేదని చెబుతున్నా రెండేళ్లుగా కబీర్ బేడి ఖాళీచేయడం లేదని ఆమె తెలిపారు. ఈ విషయమై చాలాసార్లు శేఖర్‌కపూర్‌కు నోటీసులు పంపించినా స్పందన లేదని వాపోయారు. తనపై సుచిత్ర చేసిన ఆరోపణలను బేడి తోసిపుచ్చారు. తాము అద్దెకు ఉంటున్న ఇల్లు శేఖర్‌కపూర్ సోదరి సొహైల చర్నాలియాదని, అగ్రిమెంట్ రాసుకుని అద్దెకు దిగామని ‘ముంబై’ మిర్రర్‌తో చెప్పారు. తన భర్త సోదరి ఇంటిని కోరే హక్కు సుచిత్రకు లేదని, దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు. అయితే బేడి చెబుతున్న అగ్రిమెంట్ కాపీని తనకు ఇవ్వాలని శేఖర్‌కపూర్‌ను సుచిత్ర అడిగారు. -
పోరాటమే ఊపిరిగా..!
ఒకటో శతాబ్దం నాటి కాలం అది. గౌతమీ పుత్ర శాతకర్ణి తన శత్రు దేశపు రాజుతో విజయమో... వీరస్వర్గమో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఎంతో మంది సైనికులు యుద్ధభూమిలో తమ ప్రాణాలను ఒడ్డి పోరాడుతున్నారు. మరి విజయం ఎవరిది...? ఆ సంగతి పక్కన పెడితే... ఈ పోరాట దృశ్యాలను ‘గౌతమీ పుత్ర శాతకరి’్ణ టీమ్ చిత్రీకరించింది. క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మొరాకోలో జరుగుతోంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. క్రిష్ మాట్లాడుతూ- ‘‘ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో దాదాపు వెయ్యి మంది షూటింగ్లో పాల్గొనగా బాలకృష్ణ, కబీర్బేడీల మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాం. బాలకృష్ణ ఏకంగా రోజుకు 14 గంటల పాటు ఈ చిత్రం కోసం శ్రమిస్తు న్నారు. అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియాస్లలో చిత్రీకరణ జరిపాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, మాటలు: బుర్రా సాయి మాధవ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు. -
'నా కూతురివి విషపూరిత వ్యాఖ్యలు.. క్షమించను'
బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ, ఆయన కుమార్తె పూజాబేడీ మధ్య విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. కబీర్ బేడీ నాలుగో పెళ్లి చేసుకోవడంపై పూజాబేడీ బాహాటంగా విమర్శలు చేశారు. 70వ పుట్టినరోజున తన తండ్రి వివాహం చేసుకున్న పర్వీన్ దుసాంజ్‌ను 'మంత్రెగత్తె'గా, 'రాక్షసమైన సవతి తల్లి'గా అభివర్ణించారు. ట్విట్టర్లో చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో పూజాబేడీ వాటిని ఉపసంహరించుకున్నారు. 70వ ఏట ఘనంగా తండ్రి చేసుకున్న నాలుగు పెళ్లికి ఆమె దూరంగా ఉన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య సత్సంబంధాలు లేని విషయం ఇది చాటుతున్నా.. తాజాగా కూతురు పూజాబేడీ తీరుపై కబీర్ బేడీ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేం పెళ్లి చేసుకున్న వెంటనే పర్వీన్ దుసాంజ్పై నా కూతురు పూజ చేసిన విషపూరిత వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. చెడు ప్రవర్తనను ఎంతమాత్రం క్షమించను' అంటూ ఆయన ట్వీట్ చేశారు. -
నాలుగోసారి... పెళ్ళిపీటలపై కబీర్‌బేడీ
గుబురు గడ్డం... గుర్తుపట్టే రూపం... గంభీరమైన స్వరం... కబీర్ బేడీని చూడగానే ఇవన్నీ బొమ్మ కడతాయి. ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడైన కబీర్ బేడీ అనగానే, అప్పట్లో ప్రసిద్ధమైన దుస్తుల అడ్వర్టైజ్మెంట్స్ గుర్తొచ్చేవి. ప్రముఖ నటి పూజా బేడీ తండ్రి అయిన కబీర్ బేడీ తన 70వ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. చిరకాలంగా తన స్నేహితురాలైన 40 ఏళ్ళ పర్వీన్ దుసంజ్ను తన పుట్టినరోజైన శనివారం నాడు అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని, పార్టీకి వచ్చిన బంధుమిత్రుల్నీ, అతిథుల్నీ ఆశ్చర్యపరిచారు. కబీర్ బేడీకి ఇది నాలుగో పెళ్ళి. నిజానికి, పర్వీన్, కబీర్ బేడీలు గడచిన పదేళ్ళుగా కలిసి ఉంటున్నారు. కబీర్ బేడీ కుమార్తె పూజా బేడీ కన్నా పర్వీన్ నాలుగేళ్ళు చిన్న. ఈ పెళ్ళి విషయం తండ్రి తనకు ముందుగా చెప్పలేదని ఆరోపించిన పూజా బేడీకి సహజంగానే ఈ వివాహం నచ్చలేదు. ‘ప్రతి అద్భుత జానపద గాథలో ఒక మంత్రగత్తె కానీ, దుష్టురాలైన సవతి తల్లి కానీ ఉంటుంది. నాకిప్పుడు అలాంటి ఆవిడ వచ్చింది! పర్వీన్ దుసంజ్ను కబీర్ బేడీ పెళ్ళి చేసుకున్నారు’ అని పూజాబేడీ ఆదివారం ట్వీట్ చేశారు. అయితే, ఆ తరువాత ఆ ట్వీట్‌ను తానే తొలగించారు! ముంబయ్‌లో జరిగిన పుట్టినరోజు పార్టీకి అమెరికా, బ్రిటన్, దుబాయ్, మలేసియా, ఐరోపా తదితర దేశాల నుంచి మిత్రుల్ని కబీర్ బేడీ ఆహ్వానించారు. ‘కబీర్ బేడీ, పర్వీన్ దుసంజ్ల సంయుక్త ఆహ్వానం’ అని ఆహ్వానపత్రికలోనే పేర్కొన్నారు. తండ్రీ కూతుళ్ళ మధ్య విభేదాలను బహిర్గతం చేసిన ఆ పాత ట్వీట్ సంచలనం రేపడంతో, దాన్ని తొలగించిన పూజా బేడీ కొత్తగా మరో ట్వీట్ చేశారు. ‘‘మా నాన్న గారి నాలుగో పెళ్ళి గురించి చేసిన గత ట్వీట్‌ను తొలగించాను. అంతా సానుకూలంగా చూద్దాం. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని ఆ ట్వీట్లో పూజా బేడీ పేర్కొన్నారు. అతిథులతో సహా ఎవరికీ ముందుగా సమాచారం లేని ఈ పెళ్ళికి పూజ గైర్హాజరవడం గమనార్హం. కాగా, ఈ విషయమై ఆమె వివరణనిస్తూ, ‘‘గడచిన రెండు మూడేళ్ళుగా నాకూ, మా నాన్న గారికీ మధ్య కొన్ని వ్యక్తిగత తగాదాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ, నాకూ, పర్వీన్‌కూ మధ్య ఉన్న శత్రుత్వం వల్ల ఆ తగాదాలు పెరిగిపోయాయి. నన్ను వాళ్ళ పెళ్ళికి పిలవలేదు’’ అని చెప్పారు. ప్రసిద్ధ ఒడిస్సీ నర్తకి అయిన మొదటి భార్య ప్రతిమా బేడీ ద్వారా కబీర్ బేడీకి కలిగిన సంతానం - నటి పూజా బేడీ. ఆ తరువాత ఆయన సుసాన్ హమ్‌ఫ్రేస్, నిక్కీ బేడీలను వివాహం చేసుకున్నారు. ఆ బంధాలన్నీ విచ్ఛిన్నమయ్యాక పర్వీన్‌కు దగ్గరైన కబీర్ సుదీర్ఘ కాలం సహజీవనం తర్వాత ఇప్పుడు ఆమెను పెళ్ళి చేసుకున్నారు. నాన్న చేసుకున్న కొత్త పెళ్ళితో సహజంగానే కుమార్తె అలిగినట్లుంది. -
తండ్రి నాలుగో పెళ్లిపై.. కూతురి ట్వీట్‌తో హల్చల్
ముంబై: బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ మరోసారి పెళ్లి చేసుకున్నారు. చాలాకాలంగా తనతో కలిసి ఉంటున్న 40 ఏళ్ల పర్వీన్ దుసాంజ్‌ను తన 70వ పుట్టినరోజున వివాహమాడారు. అయితే, వీరి పెళ్లిపై కబీర్ బేడీ కూతురు, నటి పూజాబేడి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేశాయి. 'ప్రతి సాహస కథలోనూ ఒక క్రూరమైన మంత్రగత్తె లేదా రాక్షస సవతి తల్లి ఉంటుంది. నా విషయంలో ఇప్పుడే వచ్చింది. కబీర్ బేడీ ఇప్పుడే పర్వీన్‌ను పెళ్లి చేసుకున్నారు' అంటూ పూజాబేడీ ట్వీట్ చేసింది. ఈ కామెంట్ ట్విట్టర్లో హల్చల్ చేసింది. దీంతో ఈ కామెంట్‌ను పూజాబేడి తొలగించారు. తన తండ్రిపై చేసిన వ్యాఖ్యను తొలగించానని, ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించాలని అన్నారు. కబీర్ బేడీ, ఆయన మొదటి భార్య, ఒడిస్సీ డాన్సర్ ప్రతిమా బేడీకు పూజాబేడీ పుట్టారు. ఆ తర్వాత ప్రతిమా బేడీతో విడిపోయిన కబీర్ మరో ఇద్దరిని సుసాన్ హంఫ్రేయ్స్, నిక్కీ బేడిని వివాహమాడారు. ఈ పెళ్లిలు కూడా పెటాకులు కావడంతో గతకొంతకాలంగా పర్వీన్‌తో ఆయన సహజీవనం చేస్తున్నారు. కబీర్ బేడీతో కూతురు పూజాబేడీకి విభేదాలు ఉన్న విషయం తాజా కామెంట్‌తో మరోసారి వెల్లడైంది.