నాకు యాక్టింగ్ రాదు.. అందుకే బాడీ చూపించా: పూజా బేడీ | Pooja Bedi Reveals She Was Terrible Actor | Sakshi
Sakshi News home page

Pooja Bedi: షాకింగ్ నిజం బయటపెట్టిన 'శక్తి' నటి

Nov 5 2024 10:18 AM | Updated on Nov 5 2024 10:39 AM

Pooja Bedi Reveals She Was Terrible Actor

చాలామంది హీరోయిన్లకు యాక్టింగ్ రాదు. ఏదో గ్లామర్‌తో మేనేజ్ చేసేస్తుంటారంతే! అయితే తమకు నటించడం రాదని ఎవరైనా చెబుతారా? కానీ బాలీవుడ్ నటి పూజా బేడీ ఇప్పుడు అదే చేసింది. తనకు అస్సలు యాక్టింగ్ రాదని, దీని నుంచి తప్పించుకునే బాడీ పార్ట్స్ చూపించి తప్పించుకునేదాన్ని అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)

బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూతురు పూజా బేడీ. పలు హిందీ సినిమాల్లో ఈమె నటించగా, అవి హిట్ అయ్యాయి. కాకపోతే ఈమె పెద్దగా మూవీస్ చేయలేదు. తెలుగులో చిట్టెమ్మ గారి మొగుడు, ఎన్టీఆర్ 'శక్తి' చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇవి రెండూ డిజాస్టర్స్ కావడంతో తెలుగులో మరో అవకాశం రాలేదు.

రీసెంట్‌గా ఫిక్కీ (FICCI) ఈవెంట్‌లో పాల్గొన్న ఈమె.. తనో దారుణమైన నటి అని చెప్పింది. క్లీవేజ్(ఛాతీ భాగం) చూపించి మేనేజే చేసేదాన్ని అని పూజా బేడీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా బేడీ కూతురు ఆలయ.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేస్తోంది. తన కుమార్తె మాత్రం తనలాంటిది కాదని, ఉదయం 6 గంటలకే నిద్రలేస్తుందని.. యాక్టింగ్ ప్రొఫెషన్ అంటే ఆమెకు డెడికేషన్ అని చెప్పుకొచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే పూజా బేడీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.

(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్‌ని భయపెట్టిన బిచ్చగాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement