
ముంబై: బాలీవుడ్ ప్రముఖులు కబీర్ బేడి, సుచిత్రా కృష్ణమూర్తి మధ్య వివాదం రాజుకుంది. తన కుమార్తెకు చెందిన ఇంటిని బేడి ఖాళీ చేయడం లేదని సుచిత్ర ఆరోపించారు. అయితే తాము అద్దెకు ఉంటున్న ఇల్లు సుచిత్ర కుమార్తెకు చెందినది కాదని బేడి తెలిపారు. ధంతేరస్ సందర్భంగా బేడి తన భార్య పర్వీన్ దుసాంజ్‌తో కలిసి వజ్రాలు కొంటున్న ఫొటోను సుచిత్ర ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా... ‘వజ్రాలు కొనుక్కోవడానికి డబ్బులుంటాయని కానీ, సొంత ఫ్లాట్ కొనుక్కుని కావేరి ఇల్లు ఖాళీ చేయడానికి డబ్బులుండవు. ఇలాంటి ప్రవర్తనను ఏమనాల’ని సుచిత్ర కామెంట్ పెట్టారు.
ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న మూడు పడక గదుల ఫ్లాట్‌లో బేడి అద్దెకు ఉంటున్నారు. అయితే ఈ ఫ్లాట్ తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌కు చెందినదని.. చట్ట ప్రకారం ఇది తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్ర వాదిస్తున్నారు. తన కూతురు ఉండటానికి ఇల్లు లేదని చెబుతున్నా రెండేళ్లుగా కబీర్ బేడి ఖాళీచేయడం లేదని ఆమె తెలిపారు. ఈ విషయమై చాలాసార్లు శేఖర్‌కపూర్‌కు నోటీసులు పంపించినా స్పందన లేదని వాపోయారు.
తనపై సుచిత్ర చేసిన ఆరోపణలను బేడి తోసిపుచ్చారు. తాము అద్దెకు ఉంటున్న ఇల్లు శేఖర్‌కపూర్ సోదరి సొహైల చర్నాలియాదని, అగ్రిమెంట్ రాసుకుని అద్దెకు దిగామని ‘ముంబై’ మిర్రర్‌తో చెప్పారు. తన భర్త సోదరి ఇంటిని కోరే హక్కు సుచిత్రకు లేదని, దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు. అయితే బేడి చెబుతున్న అగ్రిమెంట్ కాపీని తనకు ఇవ్వాలని శేఖర్‌కపూర్‌ను సుచిత్ర అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment