Suchitra Krishnamoorthi
-
నా లైఫ్‌లో ఎన్నో లవ్స్టోరీలున్నాయి.. అందుకనే విడిపోయాం!
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి- విడాకులు జంట పదంగా మారిపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపించే దంపతులు కూడా సడన్‌గా విడిపోతున్నట్లు చెప్పి షాకిస్తున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం.. సగం జీవితం కూడా కలిసి ప్రయాణించకుండానే వేరుపడటం సర్వసాధారణమైపోయింది. ప్రముఖ గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి - దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అన్నీ తెలిసీ పెళ్లి సుచిత్ర కన్నా శేఖర్ 30 ఏళ్లు పెద్దవాడు. అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. అయినా అతడితో ప్రేమలో పడిందీ సింగర్. ఇంట్లో ఒప్పుకోకపోతే వారిని ఎదిరించి మరీ తనను పెళ్లాడింది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా ఒక కూతురు పుట్టింది. కానీ 2007లో వీరు విడిపోయారు. హీరోయిన్ ప్రీతి జింటా వల్లే తాము విడాకులు తీసుకున్నామని ఆరోపించింది సుచిత్ర. ఇటీవలే మరోసారి విడాకులపై స్పందిస్తూ.. అతడి ప్రేమలో నిజాయితీ లేదని విమర్శించింది. ప్రేమ కథలతోనే సాగిన జీవితం తాజాగా శేఖర్ తను సాగించిన ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా జీవితంలో ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయి. లవ్ స్టోరీలు లేకుండా నా లైఫే లేదు. అయితే గౌరవం ఇచ్చిపుచ్చుకోని మనుషులతో మాత్రం ఎన్నడూ కలిసుండలేదు. కానీ రానురానూ రిలేషన్‌షిప్‌కు అర్థాలే మారిపోతూ వచ్చాయి. రొమాన్స్ ఉండట్లే, జీవితాంతం కలిసుందామన్న మాటలూ ఉండట్లే.. కానీ ప్రేమించుకుంటున్నారు. అయినా ఒకరి గురించి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకుని కనెక్ట్ అయ్యాక ఎందుకని విడిపోతారు? గౌరవమర్యాదలకు లోటు వచ్చినప్పుడే అలా జరుగుతుంది. అందరూ స్నేహితులే నేనైతే నా మాజీలందరినీ గౌరవించాను, గౌరవిస్తున్నాను. అందుకే ఇప్పటికీ వారంతా నా స్నేహితులుగా ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా శేఖర్ కపూర్ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు చిత్రాల్లో తెరపై మెప్పించాడు. నిర్మాతగా దిల్ సే, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ద గురు సినిమాలు చేశాడు. చదవండి: ధనుష్ పాటపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ భార్య -
హోటల్లో డైరెక్టర్ తనతోపాటే రాత్రి ఉండిపోమన్నాడు: సింగర్
ప్రముఖ సింగర్, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ వస్తున్న ఆమె తాజాగా సినీపరిశ్రమలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించింది. ఆనాడు జరిగిన సంఘటనను తలుచుకుంటూ.. 'ఆ రోజుల్లో ఆడిషన్స్ హోటల్లోనే జరిగేవి. అలా నేను ఒక డైరెక్టర్‌ను హోటల్లో కలిశాను. అతడు.. నీకు మీ అమ్మ ఎక్కువ క్లోజా? నాన్న ఎక్కువ చనువుగా ఉంటాడా? అని అడిగాడు. నేను.. మా నాన్నతోనే నాకు ఎక్కువ చనువు అని చెప్పాను. ఆ తర్వాత డైరెక్టర్ చెప్పిన మాట విని నేను ఒక్కసారిగా షాకయ్యాను. సరే అయితే మీ నాన్నకు ఫోన్ చేసి నేను రేపు ఉదయం నిన్ను ఇంటి దగ్గర దింపుతానని చెప్పు అన్నాడు. మొదట అతడేం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలవుతోంది. రేపు పొద్దునవరకు ఈయనతో ఏం చేయాలి? అనుకున్నాను. కానీ అతడి మాటల వెనుక ఉన్న ఆంతర్యం అర్థమై నా కాళ్లు, చేతులు వణికిపోయాయి. దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే నా బ్యాగు తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి పరుగుతీశాను. ఇలా చాలాసార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇంతకన్నా దారుణమైన సంఘటనలను చాలామంది ఫేస్ చేశారు. వారితో పోలిస్తే ఇది చాలా చిన్నది' అని చెప్పుకొచ్చింది నటి. కాగా షారుక్ ఖాన్ కబీ హా కబీ నా సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది సుచిత్రా కృష్ణమూర్తి. ఆ తర్వాత ఎన్నో హిందీ చిత్రాల్లో నటించింది. 1999లో దర్శకుడు శేఖర్ కపూర్‌ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కానీ వీరి వివాహబంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఇటీవలే సుచిత్ర బ్రేవ్ హార్ట్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. చదవండి: ఇండియాలో ఎక్కువమంది చూసిన సినిమా ఏదో తెలుసా? -
ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్
ప్రముఖ గాయని, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి చాలాకాలం తర్వాత మరోసారి తన విడాకుల గురించి ప్రస్తావించింది. 1999లో దర్శకుడు శేఖర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె 2007లో అతడికి విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు వరకు నటిగానూ మంచి క్రేజ్ అందుకున్న ఆమె వివాహం తర్వాత నటించకూడదని శేఖర్ పెట్టిన కండీషన్ వల్ల నటనకు దూరైంది. తనకంటే 30 ఏళ్లు పెద్దవాడు, అందులోనూ అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోవడంతో ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా వాళ్లను ఎదిరించి మరీ శేఖర్‌తో ఏడడుగులు వేసింది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. కానీ అతడి ప్రేమలో నిజాయితీ లేదంటూ శేఖర్‌కు విడాకులిచ్చేసి తన దారి తాను చూసుకుంది. ఈ విషయాలన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆమె హీరోయిన్ ప్రీతిజింటాపై మరోసారి నిప్పులు చెరిగింది. తన విడాకులకు కారణం ప్రీతినే అని వెల్లడించిన సుచిత్రా.. ఇప్పటికీ తనను క్షమించేది లేదని చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్యలో ప్రీతి దూరడం వల్లే తమ వైవాహిక జీవితం తెరపడిందని గతంలో కూడా హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ రోజుల్లోనే ఈ ఆరోపణలను ప్రీతి ధీటుగా తిప్పికొట్టింది. 'నేనిప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్ను. కనీసం నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం లేదు. కేవలం ఇంట్లో ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయావు. సుచిత్రా.. నువ్వు నాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. నీ మానసిక స్థితి సరిగా లేనట్లుంది.. ముందు వెళ్లి ఏదైనా మంచి సైకియాట్రిస్ట్‌కు చూపించుకో' అని కౌంటర్ ఇచ్చింది. సదరు వ్యాఖ్యలను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి గుర్తు చేయగా.. సుచిత్ర స్పందిస్తూ.. 'తన మాటలను నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. ఒక గృహిణిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. 20 ఏళ్లు తల్లిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎవరెన్ని మాట్లాడినా సత్యానికే బలం ఉంటుంది. చివరకు అదే నిలబడుతుంది. ఇప్పటికీ నేను ఆమెను క్షమించను. అసలు తను ఉందా? లేదా? అన్నది కూడా పట్టించుకోను' అని చెప్పుకొచ్చింది. (చదవండి: ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. పవన్ 'బ్రో'పై థమన్ సీరియస్ కామెంట్స్) -
నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్
మీరు 1990ల నాటి ఇండియన్ సంగీతానికి అభిమాని అయితే, బాలీవుడ్లో వచ్చిన డోల్ డోల్.. దమ్ తారా అనే పాటకు కచ్చితంగా ఫిదా అయింటారు. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ 'కబీ హాన్ కబీ నా' పాటకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో అభిమానులను సొంతం చేసుకున్న సింగర్,నటి సుచిత్రా కృష్ణమూర్తి. ఆమె 1999లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వారికి కావేరి అనే కూతురు కూడా ఉంది. కానీ కొన్ని విభేదాల వల్ల 2007లో విడిపోయారు. సుచిత్ర మార్చి 9, 1974న మహారాష్ట్రలోని తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్‌గా ఉండగా, ఆమె తల్లి ప్రొఫెసర్‌గా పనిచేశారు. (ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు) తాజాగా సుచిత్రా కృష్ణమూర్తి తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌లో నిజాయతీ లేదని, ప్రేమించి పెళ్లి చేసుకుని తనని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తూ.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వైవాహిక బంధంలో భర్త నిజాయతీగా లేకపోవడం వల్లే విడిపోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. తనకు సినీ పరిశ్రమలో ఎవరూ తెలియకపోయిన ఇష్టంతో సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. ఆప్పట్లో పరిశ్రమపై తన తల్లిదండ్రులకు సదుద్దేశం లేదు. అందువల్ల వాళ్లకు అబద్ధం చెప్పి కొచ్చి వెళ్లి సినిమాలో పనిచేశానని చెప్పింది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే) అక్కడ తను నటించిన చాలా సినిమాలు సూపర్‌హిట్స్ అందుకోవడంతో మంచి గుర్తింపు వచ్చిందని సుచిత్రా కృష్ణమూర్తి తెలిపింది. అయితే అదే సమయంలో అక్కడ శేఖర్‌తో పరిచయం ఏర్పడినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, అప్పటికే తనకు సినిమాల్లో మంచి క్రేజ్ ఉందని పేర్కొంది. కానీ పెళ్లి తర్వాత మూవీల్లో నటించకూడదని శేఖర్ కండీషన్ పెట్టినట్లు ఆమె గుర్తు చేసుకుంది. ఆయన మాటకు గౌరవం ఇచ్చి వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదులు కోవాల్సి వచ్చిందని తెలిపింది. శేఖర్ కపూర్‌ని పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకు ప్రధాన కారణం తనకంటే వయసులో 30 ఏళ్లు పెద్దవాడు కావడంతో ఇంట్లో వ్యతిరేఖత వచ్చిందని సుచిత్రా కృష్ణమూర్తి చెప్పింది. అంతే కాకుండా అప్పటికే ఆయనకు విడాకులు కూడా అయ్యాయని తెలిపింది. అతడిని పెళ్లి చేసుకోవద్దని తన అమ్మ పదే పదే చెప్పినా వినకుండా చేసుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇష్టంతో పెళ్లి చేసుకుంటే తను మోసం చేసి వెళ్లిపోయాడని సుచిత్ర తెలిపింది. -
డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు
Actress Suchitra Krishnamoorthi Reveals Her Daughter Forced Into Dating: 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సుచిత్రా కృష్ణమూర్తి. తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్ ఆగ్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ 46 ఏళ్ల ముంబై నటి. సుచిత్రా కృష్ణమూర్తి నటిగానే కాకుండా గాయనీగా కూడా పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన 'భూల్ భులయా 2', 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే తాజాగా సుచిత్రా కృష్ణమూర్తి పలు ఆసక్తికర విషయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇటీవల ఓ ప్రెస్ ఇంటరాక్షన్‌లో తన కన్న కూతురే తనను డేటింగ్ చేయమని బలవంతపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దర్శకుడు శేఖర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సుచిత్రా ఎనిమిదేళ్లకు 2007లో విడాకులు తీసుకుంది. ఈ జంటకు కావేరి కపూర్ అనే కుమార్తె ఉంది. 'నా విడాకుల తర్వాత నా కూతురు కావేరి నా పేరును డేటింగ్ సైట్లో నమోదు చేసింది. పురుషులతో డేటింగ్ చేయమని బలవంతం కూడా చేసింది. ఎవరికీ తెలియని ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నానని, తర్వాత అతనితో కూడా విడిపోయానని, ఇప్పుడు నేను ఉన్నది డేటింగ్ చేసేందుకు కాదని నా కుమార్తెకు అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత నాకు అసభ్యకరంగా మెసేజ్‌లు రావడంతో డేటింగ్ సైట్లో నా ప్రొఫైల్‌ను తొలగించింది.' అని సుచిత్రా కృష్ణమూర్తి పేర్కొంది. కాగా సుచిత్రా కుమార్తె కావేరి 'అవర్ లవ్ స్టోరీ'తో నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి: ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు చదవండి: 'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్ పేరిట ట్రెండింగ్.. ఎందుకంటే ? -
అందుకే కోర్టును ఆశ్రయించా: నటి
గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1997లో ఆమె ప్రసిద్ధ దర్శకుడు శేఖర్‌కపూర్‌ను వివాహమాడారు. వీరికి కావేరీ అనే కూతురు కూడా ఉంది. ఆమె తల్లి నుంచి పుణికి తెచ్చుకున్న కళతో మ్యూజిక్ రంగంలో సత్తా చాటుతోంది. కాగా గత కొన్నేళ్ల క్రితమే సుచిత్రా దంపతులు విడిపోయారు. దీంతో కావేరి బాధ్యతలు భుజాన మోస్తూ సుచిత్ర సింగిల్ పేరెంట్‌గా బతుకుతున్నారు. ఇదిలా ఉండగా... ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న మూడు పడక గదుల ఫ్లాట్‌లో నటుడు కబీర్ బేడి, భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నారు. (రాంగోపాల్‌వర్మను పెళ్లి చేసుకోవాలనుకున్నా: సుచిత్ర) అయితే ఈ ఫ్లాట్ తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌కు చెందినదని.. చట్ట ప్రకారం ఇది తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్ర వాదిస్తూ వచ్చారు. తన కూతురు ఉండటానికి ఇల్లు లేదని చెబుతున్నా నాలుగేళ్లుగా కబీర్ బేడి ఆ ఇంటిని ఖాళీచేయడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకున్న ఆమె కోర్టును ఆశ్రయించారు. మాజీ భర్త నుంచి కూతురికి రావాల్సిన ఆస్తి కోసం న్యాయపోరాటానికి దిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. మున్ముందు తన కూతురికి ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పటికే దీనివల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నానని, ఇంతకు మించి ఏమీ చెప్పలేన’ని మాట్లాడటానికి నిరాకరించారు. ఇక ఈ విషయమై చాలాసార్లు శేఖర్‌కపూర్‌కు నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతోనే ఆమె కోర్టును ఆశ్రయించారని సమాచారం. -
ప్రియాంక ఫొటో నాకు బాగా నచ్చింది: నటి
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో గ్రామీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్లో ప్రియాంక అందాలను ఆరబోస్తూ దుస్తులను ధరించింది. అయితే భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రియాంక అలాంటి దుస్తులతో హాజరవడమేంటని ఆమెకు నెటిజన్లు క్లాసు పీకుతున్నారు. ప్రముఖ డిజైనర్ వెండల్ రాడ్రిక్స్ సైతం ఆమె వేసుకున్న దుస్తులను విమర్శించాడు. ‘కొన్ని రకాల బట్టలు ఏ వయసులో వేసుకోవాలో ఆ ఏజ్‌లో మాత్రమే ధరించాల’ని మండిపడ్డాడు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అతను ఆ పోస్ట్‌ను తొలగించాడు. ప్రియాంక డ్రెస్సును మాత్రమే విమర్శించానని, ఆమెను కాదని వివరణ ఇచ్చాడు. ప్రియాంక చోప్రా డ్రెస్సుపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడంపై బాలీవుడ్ నటి సుచిత్ర కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంకను విమర్శిస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమెకు మద్దతు తెలిపింది. ‘ప్రియాంక గురించి వెండల్ రాడ్రిగస్ అలా మాట్లాడటం బాధాకరం. నాకు తెలిసినంతవరకు ప్రియాంక.. తన బెల్లీని దుస్తులతో కప్పిపుచ్చాలనుకోలేదు. అదే ఆమెను రాక్‌స్టార్‌గా మార్చింది. ఆమె ఆత్మవిశ్వాసం ప్రతీ మహిళకు ప్రేరణగా నిలుస్తుంది. దేవుడు మమ్మల్ని ఎలా పుట్టించాడో అలానే ఉంటాం.. కానీ పురుషులు ఊహించుకునేట్టుగా మేం కనిపించం. ముందు మీ బుద్ధి మార్చుకోండి. ఓ విషయం.. నేను ప్రియాంక అభిమానిని కాదు. కానీ ఆమె ఫొటో నాకు ఎంతగానో నచ్చింద’ని పేర్కొంది. చదవండి: కాలిఫోర్నియా బీచ్‌లో గ్లోబల్ జంట చక్కర్లు -
కలకలం రేపిన సుచిత్ర
ముంబై: బాలీవుడ్ ప్రముఖులు కబీర్ బేడి, సుచిత్రా కృష్ణమూర్తి మధ్య వివాదం రాజుకుంది. తన కుమార్తెకు చెందిన ఇంటిని బేడి ఖాళీ చేయడం లేదని సుచిత్ర ఆరోపించారు. అయితే తాము అద్దెకు ఉంటున్న ఇల్లు సుచిత్ర కుమార్తెకు చెందినది కాదని బేడి తెలిపారు. ధంతేరస్ సందర్భంగా బేడి తన భార్య పర్వీన్ దుసాంజ్తో కలిసి వజ్రాలు కొంటున్న ఫొటోను సుచిత్ర ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా... ‘వజ్రాలు కొనుక్కోవడానికి డబ్బులుంటాయని కానీ, సొంత ఫ్లాట్ కొనుక్కుని కావేరి ఇల్లు ఖాళీ చేయడానికి డబ్బులుండవు. ఇలాంటి ప్రవర్తనను ఏమనాల’ని సుచిత్ర కామెంట్ పెట్టారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న మూడు పడక గదుల ఫ్లాట్‌లో బేడి అద్దెకు ఉంటున్నారు. అయితే ఈ ఫ్లాట్ తన మాజీ భర్త, దర్శకుడు శేఖర్ కపూర్‌కు చెందినదని.. చట్ట ప్రకారం ఇది తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్ర వాదిస్తున్నారు. తన కూతురు ఉండటానికి ఇల్లు లేదని చెబుతున్నా రెండేళ్లుగా కబీర్ బేడి ఖాళీచేయడం లేదని ఆమె తెలిపారు. ఈ విషయమై చాలాసార్లు శేఖర్‌కపూర్‌కు నోటీసులు పంపించినా స్పందన లేదని వాపోయారు. తనపై సుచిత్ర చేసిన ఆరోపణలను బేడి తోసిపుచ్చారు. తాము అద్దెకు ఉంటున్న ఇల్లు శేఖర్‌కపూర్ సోదరి సొహైల చర్నాలియాదని, అగ్రిమెంట్ రాసుకుని అద్దెకు దిగామని ‘ముంబై’ మిర్రర్‌తో చెప్పారు. తన భర్త సోదరి ఇంటిని కోరే హక్కు సుచిత్రకు లేదని, దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు. అయితే బేడి చెబుతున్న అగ్రిమెంట్ కాపీని తనకు ఇవ్వాలని శేఖర్‌కపూర్‌ను సుచిత్ర అడిగారు. -
రేప్ చేస్తామని ట్వీట్లు.. పీఎస్‌లో నటి ఫిర్యాదు
ముంబై: 'అజాన్' గురించి ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి-గాయని సుచిత్రా కృష్ణమూర్తి పట్ల సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆమె పట్ల కొందరు 'లైంగికంగా కించపరిచేలా' వ్యాఖ్యలు చేశారు. ఆమెను రేప్ చేస్తామని బెదిరించారు. తీవ్రస్థాయిలో వెల్లువెత్తిన 'లైంగిక వేధింపుల ట్వీట్ల'పై ఆమె పోలీసులను ఆశ్రయించారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెల్లవారుజామునే చెవులు పగిలిపోయేలా 'అజాన్' పిలుపు ఇవ్వడాన్ని ఆమె ట్విట్టర్లో తప్పుబట్టారు. తన దేవుడిని గుర్తుచేసేందుకు ఇలా పబ్లిక్ లౌడ్స్పీకర్లు వాడాల్సిన అవసరం లేదని, ఇది బలవంతంగా మతాన్ని ప్రజలపై రుద్దడమేనని అన్నారు. ఆమె వ్యాఖ్యలను కొంతమంది ప్రశంసించగా.. మరికొంతమంది తప్పుబట్టారు. గతంలో బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కూడా ఇదేవిధంగా ట్వీట్ చేసి సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని చవిచూశాడు. తాజాగా తనకు వచ్చిన లైంగిక బెదిరింపుల స్ర్కీన్షాట్లను కొన్నింటినీ ట్వీట్ చేసిన సుచిత్ర.. 'ఈ వికృత వ్యక్తులను చూడండి. నా దేశాన్ని చూస్తే జాలేస్తుంది. మహిళల పట్ల ఇలాంటి దృక్పథం ఉన్నప్పుడు ప్రపంచంలో మన దేశమే రేప్ రాజధానిగా ఉండటంలో ఆశ్చర్యమేముంది' అని పేర్కొన్నారు. -
'ఏం మనుషులు.. ఆ నటికి నిద్రే ముఖ్యమేమో'
లక్నో: తెల్లవారు జామున 5గంటలకే ఆజాన్ ఇచ్చి నిద్రభంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించిన గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తికి సమాజ్‌వాది పార్టీకి చెందిన ఓ నేత కౌంటర్ ఇచ్చారు. దేవుడి ప్రార్థనకంటే ఆమెకు నిద్రే ముఖ్యమైనట్లుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు గతంలో నుంచి వస్తున్నాయి. వీళ్లంతా అసలు ఏం మనుషులో నాకు అర్థం కావట్లేదు. ఆమెను చూసి నాకు బాధగా ఉంది.. బహుశా ఆమెకు నిద్రనే బాగా ముఖ్యమైనట్లుంది' అని ఎస్పీ నేత జుహీ సింగ్ అన్నారు. నిన్న(ఆదివారం) ఆజాన్ వల్ల తనకు నిద్రాభంగం కలిగిందని, అయినా, దేవుడిని ప్రార్థించాలని ఇతరులకు ఇబ్బంది కలిగేలా తెల్లవారు జామున్నే మైకుల ద్వారా చెప్పడం దేనికంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను బ్రహ్మముహూర్తంలోనే మేల్కొంటానని, పూజలు చేస్తానని, యోగాలాంటివి చేస్తానని, తన దేవుడిని గుర్తు చేసుకునేందుకు ప్రత్యేక లౌడ్ స్పీకర్స్ అవసరం లేదంటూ కూడా ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆమెపై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. -
'మా వైవాహిక జీవితానికి ప్రీతిజింటా తెరదించింది'
ముంబై: లైంగికంగా వేధిస్తున్నారని మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త, ఐపీఎల్ ఫ్రాంచైజీలో సహా భాగస్వామి నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త ప్రీతి జింటా ఫిర్యాదు చేయడం తాజాగా సంచలనం రేపింది. గతంలో కూడా ఎలాంటి బెదిరింపులకు తలవొగ్గకుండా పలుమార్లు ఫిర్యాదు చేసి జింటా అందర్నిఆకర్షించారు. ప్రీతి జింటా తన జీవితంలో సంచలనం రేపిన కొన్ని ఘటనలను, ప్రత్యేక సంఘటనలు, వివాదాలు, విశేషాలను ఓసారి పరిశీలిద్దాం. 1. 2003లో అండర్ వరల్డ్ మాఫియాపై కోర్టులో ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాలీవుడ్ లో ఏ హీరో, హీరోయిన్ కూడా మాఫియాకు భయకుండా ప్రీతిలా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. 2. 2005 లో తనపై అమర్యాదపూర్వకంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గొంతుతో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముంబైకి చెందిన పత్రికపై పరువు నష్టం కేసును ప్రీతిజింటా నమోదు చేసింది. 3. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తో తన వైవాహిక జీవితానికి తెరపడటానికి కారణం ప్రీతి జింటా అంటూ సుచిత్రా కృష్ణమూర్తి ఆరోపణలు చేసింది. అయితే సుచిత్ర ఆరోపణలకు ధీటుగా స్పందించిన ప్రీతి.. ఆమె మానసిక పరిస్థితి బాగా లేదు అని వ్యాఖ్యలు చేశారు. 4. ఐపీఎల్ క్రేజ్ కు ఆకర్షితురాలై.. బాలీవుడ్ కు దాదాపు గుడ్ బై చెప్పిందనే విమర్శలు వచ్చాయి. 5. 2001లో విడుదలైన 'చోరి చోరి చుప్కే చుప్పే' చిత్రంలో వ్యభిచారి పాత్రను పోషించడమే కాకుండా సర్రోగసి మదర్(అద్దె తల్లి)గా నటించి ప్రీతి జింటా సంచలనానికి తావిచ్చింది. 6. క్యా కహనా చిత్రంలో పెళ్లికాకుండానే తల్లైన పాత్రను పోషించి ప్రీతి జింటా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. మణిరత్నం దర్శకత్వం వహించిన 'దిల్ సే' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రీతిజింటా ఆ చిత్ర హీరో షారుక్ ఖాన్ ను నీవు బ్రహ్మచారివేనా అంటూ ప్రశ్నించడం అనేక విమర్శలకు దారి తీసింది.