
1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుచిత్రా కృష్ణమూర్తి. తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్‌బాత్ ఆగ్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ 46 ఏళ్ల ముంబై నటి.
Actress Suchitra Krishnamoorthi Reveals Her Daughter Forced Into Dating: 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుచిత్రా కృష్ణమూర్తి. తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్‌బాత్ ఆగ్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ 46 ఏళ్ల ముంబై నటి.
సుచిత్రా కృష్ణమూర్తి నటిగానే కాకుండా గాయనీగా కూడా పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన 'భూల్ భులయా 2', 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే తాజాగా సుచిత్రా కృష్ణమూర్తి పలు ఆసక్తికర విషయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇటీవల ఓ ప్రెస్ ఇంటరాక్షన్‌లో తన కన్న కూతురే తనను డేటింగ్ చేయమని బలవంతపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది.
చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దర్శకుడు శేఖర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సుచిత్రా ఎనిమిదేళ్లకు 2007లో విడాకులు తీసుకుంది. ఈ జంటకు కావేరి కపూర్ అనే కుమార్తె ఉంది. 'నా విడాకుల తర్వాత నా కూతురు కావేరి నా పేరును డేటింగ్ సైట్‌లో నమోదు చేసింది. పురుషులతో డేటింగ్ చేయమని బలవంతం కూడా చేసింది. ఎవరికీ తెలియని ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, తర్వాత అతనితో కూడా విడిపోయానని, ఇప్పుడు నేను ఉన్నది డేటింగ్ చేసేందుకు కాదని నా కుమార్తెకు అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత నాకు అసభ్యకరంగా మెసేజ్‌లు రావడంతో డేటింగ్ సైట్‌లో నా ప్రొఫైల్‌ను తొలగించింది.' అని సుచిత్రా కృష్ణమూర్తి పేర్కొంది. కాగా సుచిత్రా కుమార్తె కావేరి 'అవర్ లవ్ స్టోరీ'తో నటిగా ఎంట్రీ ఇవ్వనుంది.
చదవండి: ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు
చదవండి: 'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్ పేరిట ట్రెండింగ్.. ఎందుకంటే ?