Dating sites
-
డేటింగ్‌సైట్లు.. హైటెక్ వ్యభిచారం.. సిటీ యువతుల ఫొటోలు వాట్సాప్‌కు పంపి..
సాక్షి ప్రతినిధి కర్నూలు: మనీశ్ (పేరు మార్చాం) అనే ఒక ఇంజినీరింగ్ విద్యార్థి గూగుల్లోకి వెళ్లి ‘కాల్ గర్ల్స్ మొబైల్ నంబర్స్ ఇన్ కర్నూలు’ అని ఒక సైటు తెరిచారు. అందులో కొన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి. వాటిలో ఒక నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడారు. సిటీ పేరు అడిగితే మనీశ్ కర్నూలు అని చెప్పాడు. రూ.10వేలు అవుతుంది.. అడ్వాన్స్‌గా రూ.5వేలు ఫోన్‌పేలో పంపాలని చెప్పారు. మనీశ్ ఫోన్ చేసిన నంబర్‌కు ఫొటోలు వాట్సాప్‌లో పంపారు. చదవండి: ఏసీ టెక్నీషియన్ పాడుపని.. నమ్మించి యువతిని హోటల్‌కు తీసుకెళ్లి.. మోసపోతానేమోననే భయంతో ఆన్లైన్లోని మరో నంబర్‌కు మనీశ్ ఫోన్ చేశాడు. ఫొటోలు తెప్పించుకుని చూశాడు. ఇలా నాలుగైదు నంబర్లు విచారించి ఫొటోలు చూసి ఒక నంబర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.5వేలు పంపాడు. డబ్బులు పంపిన తర్వాత కర్నూలులోని మేడమ్ ఒకరు నీకు ఫోన్ చేస్తారు.. లొకేషన్ చెబుతారు.. అని అవతలి వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్!! .. మనీశ్ ఒక్కడే కాదు ‘డేటింగ్ ఉచ్చు’లో పడి వేల మంది చితికిపోతున్నారు. ఆధునిక యుగంలో అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకూ లావాదేవీలన్నీ మొబైల్ ద్వారా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇందులో అతిపెద్ద మోసం ‘ఆన్లైన్ డేటింగ్’! ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో 302 మిలియన్ డాలర్లు ఈ డేటింగ్ వల్ల నష్టపోతున్నారని ఎఫ్‌టీసీ(ఫెడరల్ ట్రేడ్ కమిషన్) గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే ఇది ఏ స్థాయి కుంభకోణమో ఇట్టే తెలుస్తోంది. జనాభా అధికంగా ఉండి, స్మార్ట్ఫోన్లను ప్రపంచంలో అత్యధికంగా వాడే ఇండియా, చైనాకే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఇండియాలో ఏడాదిలో ఏకంగా రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అంచనా. కర్నూలు, నంద్యాల జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు 1,637మంది బాధితులు రూ.8.77కోట్లు నష్టపోయారు. వీరంతా విధిలేక ఫిర్యాదు చేసిన వారే. భయంతో, పరువు పోతుందని పోలీసులను ఆశ్రయించనివారు వేలల్లో ఉంటారు. వీరు కనీసం రూ.వందకోట్లు నష్టపోయి ఉంటారు. డేటింగ్సైట్లలో వివరాల నమోదు ఆన్లైన్ బుకింగ్‌లో మరొక పద్ధతి ఉంది. డేటింగ్ సైట్ తెరవగానే అందులో పేరు, జెండర్, మెయిల్ ఐడీ వివరాలు ఎంటర్ చేయాలి. ఈ వెబ్సైట్లలోకి వెళితే ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు మొత్తం వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందులో జెండర్, వయస్సు ఆధారంగా ప్రొఫైల్స్ ఉంటాయి. ఏ వయస్సు వారికి ఎంత వయస్సు ఉన్నవారు కావాలి? అమ్మాయి ఇన్కాల్ లేదా ఔట్కాల్ అనే ఆప్షన్ ఉంటుంది. అన్నీ పూర్తి చేసి అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ నంబర్ పనిచేయదు. ఇలా 80 శాతం సైట్లు అడ్వాన్స్ పేరుతో నగదును బదిలీ చేయించుకుని ఆపై నంబర్ బ్లాక్ చేస్తారు. లోకల్ నంబర్.. హైటెక్ వ్యభిచారం డేటింగ్సైట్లలో కొందరు ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వీరు తెలుగులో మాట్లాడతారు. ఫొటోలు పంపాలంటే అడ్వాన్స్‌గా రూ. వెయ్యి ఫోన్‌పేలో పంపాలి. ఆపై ఓ వ్యక్తి ఫోన్ చేసి అడ్రస్ చెబుతారు. అక్కడకు వెళితే తీసుకెళతారు. అక్కడ ఫోన్లో మాట్లాడుకున్న డబ్బులు ఫోన్‌పేలోనే చెల్లించాలి. ఆపై అమ్మాయిలను చూపిస్తారు. ఆపై మళ్లీరేటు చెబుతారు. ‘అదేంటి? మాట్లాడుకున్న డబ్బులు చెల్లించాను కదా?’ అని అడిగితే ‘అది ఎస్కార్ట్చార్జ్(మీడియేటర్). ఇక్కడ మేడం(కాల్‌గర్ల్)కు ఇవ్వాలి? లేకపోతే వెళ్లండి? అని తేల్చేస్తారు. ఎలాగూ డబ్బు పోయిందని మరికొంత చెల్లిస్తారు. ఇలా హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి పిలిపిస్తారు. కలకత్తా, డార్జిలింగ్, మణిపూర్, నాగాలాండ్, ముంబయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి యువతులు వస్తుంటారు. ఇన్కాల్, ఔట్ కాల్ సర్వీసు పేరుతో వారు హోటల్ లేదంటే పర్సనల్ రూంకు వచ్చే ఏర్పాటును ‘ఎస్కార్ట్స్’(మధ్యవర్తులు) చేస్తారు. నొయిడా, గుర్గావ్, బిహార్, గుజరాత్, కలకత్తా నుంచి ఎక్కువగా డేటింగ్ నడుస్తోంది. మొబైల్స్‌కు వారే ఫోన్ చేస్తారు. డేటింగ్ తీరుతెన్నులు వివరిస్తారు. మీ ప్రాంతం ఏది? అని అడిగి, ఆ సిటీలోని కొన్ని ప్రాంతాల పేర్లు చెబుతారు. అక్కడ కొంతమంది మేడమ్స్ ఉన్నారని, మెంబర్íÙప్ తీసుకుంటే వారి నంబర్లు ఇస్తామని, వారితో ఫోన్లో మాట్లాడి రిలేషన్ చేయొచ్చని ముగ్గులోకి దించుతారు. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది మెంబర్‌షిప్‌లు ఉంటాయి. మూడు నెలలకు రూ.3,500, ఆరు నెలలకు రూ. 5 వేలు, ఏడాదికి రూ.7వేలు ఫీజు తీసుకుంటారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఈ నంబర్లు కూడా పనిచేయవు. ‘స్మార్ట్’ డీల్ గూగుల్లోకి వెళ్లి ‘ఆన్లైన్ డేటింగ్’ అని టైప్ చేస్తే సైట్లు కన్పిస్తాయి. వీటితో పాటు ప్రాంతాన్ని బట్టి ‘కాల్‌గర్ల్స్ మొబైల్ నంబర్స్ ఇన్ కర్నూలు’ అని టైప్ చేస్తే ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఫోన్ చేస్తే రేటు, ఇతర వివరాలు వివరిస్తారు. రేటు కుదిరాక వాట్సాప్‌లో ‘హాయ్’ అని టైప్ చేస్తే ఫొటోలు పంపిస్తారు. ఫొటోను బట్టి రేటు ఫిక్స్ చేస్తారు. అందులో కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఆన్లైన్లో చెల్లించాలి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా లావాదేవీలు సమయాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. ‘షార్ట్ టైమ్’(గంట), మూడు గంటలు, ఫుల్నైట్ అని మూడు రకాలు డీల్స్ ఉంటాయి. ఈ వివరాలు వాట్సాప్‌కు పంపిస్తారు. ఇందులో షార్ట్ టైంకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు, మూడు గంటలైతే రూ.7వేల నుంచి రూ. 10వేల వరకు, ఫుల్నైట్కు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు నిర్ణయిస్తారు. సైట్లను బట్టి రేట్లలో తేడాలు ఉన్నాయి. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా చెల్లించాలి. డబ్బు పంపిన తర్వాత ఫోన్ పనిచేయదు. నంబర్‌ను బ్లాక్ చేస్తారు. ఫోన్‌పే, గూగుల్‌పే అకౌంట్లన్నీ ఫేక్ ఈ తరహా నేరాలను ‘రొమాన్స్ స్కామ్స్’ ‘హనీట్రాప్’గా పోలీసులు పరిగణిస్తారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. దీంతో పోలీసులు సైబర్ మిత్ర, పోలీసు వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఇచ్చారు. డీజీ ఆఫీసు నుంచి ఈ ఫిర్యాదులను మానిటర్ చేస్తారు. వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఈ తరహా నమోదైన కేసుల ఆధారంగా కర్నూలు జిల్లా పోలీసులు ఫోన్‌పే, గూగుల్‌పే వివరాలతో ఆ ప్రాంతాలకు వెళ్లారు. వివరాలు ఆరా తీస్తే ఈ తతంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల వివరాలు తెలుస్తున్నాయి. ఆధార్, బ్యాంక్ ఐడీలు వారికి తెలీకుండానే వారి ఐడీలతో ఫేక్ అకౌంట్లు సృష్టించారు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జీవితాలు ఛిన్నాభిన్నం ఇంజినీరింగ్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించే కొందరు విద్యార్థినులు, పేద కుటుంబాల నుంచి వచ్చి హాస్టళ్లలో చదివే మరికొందరు విద్యార్థినులు ఆర్థిక అవసరాల కోసం ఈ సైట్లలోకి వెళ్లి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడి, తమది ఫలానా సిటీ అని, డేటింగ్‌కు తాము సిద్ధమని మొబైల్ నంబర్లు ఇస్తున్నారు. వీరికి నార్త్ ఇండియన్స్ ఎస్కార్ట్స్‌గా ఉంటారు. ఫోన్ చేస్తే హిందీలో మాట్లాడతారు. సిటీని బట్టి, ఆయా సిటీలోని యువతుల ఫొటోలు వాట్సాప్‌కు పంపిస్తారు. నగదు బదిలీ చేసిన తర్వాత యువతుల ఫోన్ నంబర్లు ఇస్తారు. వారు చెప్పిన అడ్రస్‌కు వీరు వెళతారు. అడ్వాన్స్ పోనూ మిగిలిన డబ్బులు యువతులకు చెల్లిస్తారు. ఈ తరహా వ్యవహారంలో చాలామంది యువతుల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. పేదరికంతో ఆర్థిక అవసరాల కోసం కొందరు, విలాసాలతో ఇంకొందరు యవ్వనాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని డేటింగ్ సైట్లను నిషేధించాలని పలువురు మేధావులు కోరుతున్నారు. -
డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు
Actress Suchitra Krishnamoorthi Reveals Her Daughter Forced Into Dating: 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సుచిత్రా కృష్ణమూర్తి. తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్ ఆగ్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ 46 ఏళ్ల ముంబై నటి. సుచిత్రా కృష్ణమూర్తి నటిగానే కాకుండా గాయనీగా కూడా పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన 'భూల్ భులయా 2', 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే తాజాగా సుచిత్రా కృష్ణమూర్తి పలు ఆసక్తికర విషయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇటీవల ఓ ప్రెస్ ఇంటరాక్షన్‌లో తన కన్న కూతురే తనను డేటింగ్ చేయమని బలవంతపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దర్శకుడు శేఖర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సుచిత్రా ఎనిమిదేళ్లకు 2007లో విడాకులు తీసుకుంది. ఈ జంటకు కావేరి కపూర్ అనే కుమార్తె ఉంది. 'నా విడాకుల తర్వాత నా కూతురు కావేరి నా పేరును డేటింగ్ సైట్లో నమోదు చేసింది. పురుషులతో డేటింగ్ చేయమని బలవంతం కూడా చేసింది. ఎవరికీ తెలియని ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నానని, తర్వాత అతనితో కూడా విడిపోయానని, ఇప్పుడు నేను ఉన్నది డేటింగ్ చేసేందుకు కాదని నా కుమార్తెకు అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత నాకు అసభ్యకరంగా మెసేజ్‌లు రావడంతో డేటింగ్ సైట్లో నా ప్రొఫైల్‌ను తొలగించింది.' అని సుచిత్రా కృష్ణమూర్తి పేర్కొంది. కాగా సుచిత్రా కుమార్తె కావేరి 'అవర్ లవ్ స్టోరీ'తో నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి: ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు చదవండి: 'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్ పేరిట ట్రెండింగ్.. ఎందుకంటే ? -
వారం రోజుల్లో పెళ్లి.. ఇదేంటే.. అసలు విషయం తెలిసి
‘‘కావ్యా (పేరుమార్చడమైనది) ఒక్కసారి కళ్లు తెరువమ్మా! ఏమైందే. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడిలా చేశావ్, నీకీ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే సరిపోయేది కదా!’’ సుభద్రమ్మ ఏడుస్తునే ఉంది. ‘‘నువ్వు కాసేపు మౌనంగా ఉండు’’ అంటూ భర్త రాఘవరావు సుభద్ర మీద కేకలేశాడు. కాసేపటికి కావ్య లేచి తల్లిదండ్రులని చూసి, తలదించుకుంది. ‘‘ఏమైందమ్మా! కాస్త ఆలస్యమైతే ఎంత దారుణం జరిగేది. ఉరివేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది తల్లీ’’ అనునయంగా అడిగాడు రాఘరావు. ఆ మాటలతో కావ్య తండ్రిని పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయింది. ‘‘నీకు ఇష్టమని చెప్పాకనే కదా, పెళ్లి పెట్టుకున్నది..’ సందేహంగా అడిగాడు కూతుర్ని. ‘‘నిజమే నాన్నా!’’ అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయిన కూతుర్ని చూసి, భయమేమీ లేదమ్మా ఇప్పటికైనా చెప్పు. ‘‘పెళ్లి ఆపేద్దామంటే వాళ్లకు చెప్పేస్తే. నీ చావు చూసే పెళ్లి వద్దమ్మా!’ అన్నాడు రాఘరావు. ‘‘అది కాదు నాన్న నేను ఎంతగానో నమ్మిన వంశీ (పేరుమార్చడమైనది) నన్ను టార్గెట్ చేశాడు’’ ఏడుస్తూనే చెప్పింది కావ్య. అర్థం కాక ‘‘వంశీ నీ బెస్ట్ ఫ్రెండ్ కదమ్మా, ఏమైంది’’ కంగారుగా అడిగాడు. కూతురు చెప్పిన విషయం వినడంతోనే రాఘవరావు కోపంతో ఉగిపోయాడు. ∙∙ కావ్య తన క్లాస్మేట్ వరుణ్(పేరు మార్చడమైనది)తో స్నేహంగా ఉండేది. బీటెక్ నాలుగేళ్లూ ఇద్దరూ చాలా క్లోజ్‌గా తిరిగారు. పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ ఒక అవగాహనతో తాము క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసుకున్నారు. రెండుమూడు నెలల వరకు ఎవరి పనుల్లో వారుండిపోయారు. ఓ రోజు ఫ్రెండ్ ఫోన్ చేసి, డేటింగ్ సైట్స్‌లో కావ్య వరుణ్ క్లోజ్‌గా ఉన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని చెప్పింది. వాటిని కావ్య చూసింది. వరుణ్‌కి ఫోన్ చేసి తిట్టింది కావ్య. తనేమీ వాటిని షేర్ చేయలేదని రివర్స్ అయ్యాడు వరుణ్. ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీకి చెప్పింది. ఎలాగైనా ఆ సైట్స్ నుంచి తన ఫొటోలు డిలీట్ చేయించమని వేడుకుంది. కావ్య చెప్పినట్టు వంశీ వాటిని వివిధ సైట్స్ నుంచి తొలగించేశాడు. ‘హమ్మయ్య’ అనుకుని వంశీకి ‘థాంక్స్’ చెప్పింది. ఆరు నెలల తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. త్వరలో పెళ్లి అనుకున్నారు. భవిష్యత్తు సంతోషంగా ఉండబోతుందనుకున్న కావ్యకు పాత వీడియోలు, ఫొటోలు మళ్లీ వివిధ రకాల సైట్లలో అప్లోడ్ అయి ఉండటంతో షాకైంది. వంశీని అడిగితే పెళ్లికి ముందు తనతో గడిపితేనే, అవన్నీ తీసేస్తానని, లేదంటే సమాచారం అంతా పెళ్లికొడుక్కి చేరుతుందని బెదిరించడం మొదలుపెట్టాడు వంశీ. షాకైంది కావ్య. ‘సైట్స్ నుంచి తొలగించినట్టే తొలగించి, అవన్నీ దాచిపెట్టుకొని, పెళ్లి కుదిరే సమయానికి పాత వీడియోలను, ఫొటోలను అడ్డుపెట్టుకొని తన జీవితంతో ఆడుకుంటున్నాడ’ని అర్ధమైంది కావ్యకు. పెళ్లి ఆగిపోతుందని, పరువు పోతుందని భయపడి చావే శరణ్యం అనుకుంది. విషయమంతా తెలుసుకున్న రాఘరావు కూతురుని తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. కావ్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వంశీ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వ్యక్తిగత వివరాలు గోప్యం కొందరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. చాలాసార్లు సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీస్తుంటారు. ఇద్దరి మధ్య సంబంధం చెడినప్పుడు వీటిని అడ్డుగా పెట్టుకొని ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వివిధ రకాల యాప్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లలో పెట్టడం ఎక్కువగా జరుగుతోంది. అందుకని ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండటం అవసరం. పరువు పోతుందని పొలీసులను సంప్రదించకుండా మూడోమనిషి సాయం తీసుకుంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు కేసు ఫైల్ చేయాలి. వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. సమస్యకూ సత్వరమే పరిష్కారం అందుతుంది. సైబర్ క్రైమ్ సమస్యలకు htps://4s4u.appolice.gov.in/ ఫోన్ నెంబర్: 90716 66667 సంప్రదించవచ్చు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ బ్లాక్ చేయకూడదు.. బ్లాక్మెయిల్ చేస్తున్నారనగానే వెంటనే భయపడిపోతారు. వేధింపులు భరించలేక సదరు వ్యక్తి నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. ఒకసారి వేధించాలనుకున్న వ్యక్తి రకరకాల మార్గాల ద్వారా బెదిరింపులకు దిగుతాడు. డబ్బులు ఇస్తామనో, మరో విధంగానో కాంప్రమైజ్ అవుతాను అనే ధోరణి నుంచి బయపడాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడనగానే వారి డేటా, కాల్ రికార్డ్ చేసుకోవాలి. అన్ని మెసేజ్‌లను స్క్రీన్ షాట్స్ చేసి పెట్టుకోవాలి. వెంటనే http://www.cybercrime.gov.in/ నేషనల్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
టెకీకి నరకం చూపిన ‘వరుడు’: మెసేజుల్లో మాత్రమే మర్యాద!
‘సంధ్యా.. (పేరుమార్చడమైనది) ఎంతసేపు కూర్చుంటావే అలా. నెలరోజులుగా చూస్తున్నాను. సరిగా తినడం లేదు. నిద్రపోవడం లేదు. ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు. ఎందుకీ ఆలోచన’ గట్టిగానే మందలిస్తున్నట్టుగా అంది తల్లి. ‘అదేం లేదమ్మా!’ సర్దిచెబుతున్నట్టుగా అంది సంధ్య. ‘చూడమ్మా! నీవు ఆ కార్తీక్ (పేరు మార్చడమైనది)ని మర్చిపోలేకుంటే చెప్పు. అయిందేదో అయ్యింది. వాళ్ల వాళ్లతో మాట్లాడి,పెళ్లి చేస్తాం’ అనునయిస్తూ చెప్పింది తల్లి. ‘వద్దమ్మా! పెళ్లొద్దు. నే చచ్చిపోతాను’ అంటూ ఏడుస్తూ తల్లిని చుట్టేసింది. ‘ఏమైంద’ని తల్లీ తండ్రి గట్టిగా అడిగితే అసలు విషయం బయటపెట్టింది సంధ్య. ∙∙ సంధ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెళ్లిసంబంధాలు చూస్తూ సంధ్య ప్రొఫైల్‌ని మ్యాట్రిమోనియల్ సైట్లో పెట్టారు పేరెంట్స్. వచ్చిన ప్రొఫైల్స్‌లో కార్తీక్‌ది సంధ్యకి బాగా నచ్చింది. సంధ్య కూడా కార్తీక్‌కు నచ్చడంతో ఇంట్లోవాళ్లతో మాట్లాడారు. ఇరువైపుల పెద్దలు ఓకే అనుకున్నారు. నెల రోజుల్లో పెళ్లి అనుకున్నారు. దాంతో ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. సినిమాలు, షికార్లకు వెళ్లేవారు. త్వరలో జీవితం పంచుకోబోతున్నవారు అనే ఆలోచనతో పెద్దలూ అడ్డుచెప్పలేదు. పెళ్లి తర్వాత ఇద్దరూ విదేశాల్లో స్థిరపడాలనుకున్నారు. అందుకు ముందస్తుగా కావాల్సిన ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కార్తీక్ పాస్‌పోర్ట్ చూసింది సంధ్య. అందులో అతని పుట్టినతేదీ వివరాలు చూసి, ఆశ్చర్యపోయింది. అదే విషయాన్ని కార్తీక్‌ని అడిగింది. ‘మ్యాట్రిమోనియల్ సైట్ ప్రొఫైల్‌లో వేరే వివరాలున్నాయి. పాస్‌పోర్టులో వేరేగా ఉన్నాయి’ అని నిలదీసింది. ‘అదేమంత పెద్ద విషయం కాదు. డేటాఫ్ బర్త్‌లో కొంచెం తేడా అంతేగా!’ అన్నాడు కొట్టిపారేస్తూ కార్తీక్. ఇదే విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించింది సంధ్య. ప్రొఫైల్‌లో తప్పుడు వివరాలు ఇవ్వడం, ఇన్ని రోజులూ అసలు విషయం చెప్పకుండా దాచడంతో సంధ్య తల్లిదండ్రులు కార్తీక్‌ని, అతని తల్లిదండ్రులను నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు కార్తీక్. ‘ఇంకా ఎన్ని వివరాలు దాస్తున్నారో.. ఈ సంబంధం మాకొద్దు’ అని చెప్పేశారు సంధ్య అమ్మనాన్నలు. సంధ్య కూడా తల్లిదండ్రులతో ‘మీ ఇష్టమే నా ఇష్టం’ అనేసింది. దీంతో అనుకున్న పెళ్లి ఆగిపోయింది. ∙∙ నెల రోజులుగా తిండీ, నిద్రకు దూరమైన సంధ్య ఆ కొద్ది రోజుల్లోనే ఐదు కేజీల బరువు తగ్గిపోవడంతో భయపడిన సంధ్య తల్లిదండ్రులు డాక్టర్ని సంప్రదించారు. సంధ్య ఏదో మానసిక సమస్యతో బాధపడుతోందని చెప్పారు డాక్టర్. కార్తీక్‌ని మర్చిపోలేకనే ఇదంతానా అని తల్లి కూతురుని నిలదీయడంతో అదేం కాదంటూ అసలు విషయం చెప్పింది సంధ్య. ‘డియర్.. నీవెప్పుడూ ఆనందంగా ఉండాలి’ వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు సంధ్య. నెల రోజులుగా వాట్సప్ మెసేజ్‌లతో తల తిరిగిపోతోంది సంధ్యకి. ఆ వెంటనే వాట్సప్ కాల్. ‘నిన్నెలా ప్రశాంతంగా ఉండనిస్తాను. నీ ఫొటోలు అడల్ట్స్ ఓన్లీ సైట్లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్నిక ఎవ్వరూ పెళ్లి చేసుకోనివ్వకుండా చేస్తా’ అంటూ బూతులు మాట్లాడుతూ ఫోన్. ఎత్తకపోతే బెదిరింపులు, ఎత్తితే బయటకు చెప్పనలవికాని మాటలతో వేధింపులు. డిప్రెషన్‌తో బయటకు రాలేకపోతోంది. ఇన్నాళ్లూ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పడం, నేనే పరిష్కరించుకుంటాను అనుకున్న సంధ్య.. ఇక వేగలేక ‘చచ్చిపోతాను’ అంటూ తల్లి వద్ద ఏడ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ‘అమ్మా, కార్తీక్‌ని మర్చిపోలేక కాదు. అతన్ని పెళ్లి చేసుకున్నా నిజంగానే చచ్చిపోతాను. ఈ వేధింపులు నా వల్ల కాదు’ అనడంతో సంధ్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తెలివిగా ఎదుర్కోవాలి... దొరికితే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని మెసేజుల్లో చాలా అందమైన, మర్యాదపూర్వకమైన భాష వాడేవాడు కార్తీక్. కానీ, ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే వాడు. వాట్సప్ కాల్ అయితే రికార్డ్ కాదని అతని ప్లాన్. నిపుణుల సాయం తీసుకున్న సంధ్య, వారిచ్చిన సూచన మేరకు ఒక రోజు కార్తీక్ వాట్సప్ కాల్ చేసినప్పుడు స్పీకర్ ఆన్ చేసి, మరో ఫోన్లో అది రికార్డ్ చేసింది. ఆ వాయిస్‌ను పోలీసుల ముందు పెట్టింది. దీంతో వేధింపులకు చెక్ పడింది. కేసు ఫైల్ అయ్యి, అతను విదేశాలకు వెళ్లడం కూడా ఆగిపోయింది. తెలివిగా సమస్యను ఎదుర్కోవాలి. అవగాహన లేకుండా జీవితాలను చేజార్చుకోకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ ధైర్యంగా ఉండాలి మ్యారేజీ బ్యూరోలు, డేటింగ్ సైట్స్‌లలో వివరాలతో పాటు, తప్పుడు ఫోటోలు కూడా పెడుతుంటారు. తెలిసి, తెలియక వారితో క్లోజ్ అయినప్పుడు ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. పూర్తి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క అభిరుచులు తెలుసుకోవడం మాత్రమే కాదు అతని గురించి పూర్తి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని, మూవ్ అవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు. తమకు అన్యాయం జరిగిందని అర్ధమైతే, ధైర్యంగా దగ్గరలోని పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
విజయనగరంలో ’విష సంస్కృతి’
సాక్షి, విజయనగరం: అసలే కరోనా... అందులోనూ లాక్ డౌన్... ఖాళీగా ఇంట్లో ఉండలేక కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసగాళ్లు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఇప్పటికే ఏటీఎమ్‌ల వద్ద డబ్బులు విత్ డ్రాలు చేసేటప్పుడు మోసాలు ఎక్కువయ్యాయి. ఆన్లైన్ ద్వారా ఫలానా బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని, కేవైసీ వివరాలు కావాలంటూ వచ్చిన మెసెజ్‌లన్నింటినీ జాగ్రత్తగా కూపీలాగి వేలకు వేలు విత్‌డ్రా జరిగిపోతున్న కేసులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ఆన్లైన్లో వాహనాల క్రయవిక్రయాల పేరుతో డబ్బులు దోచేస్తున్న ఉదంతాలు ఇటీవల జిల్లాలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ మోసాల పరంపరలో మరో ముందడుగు పడింది. డేటింగ్ సైట్ల విషసంస్కృతి జిల్లాలోనూ ప్రవేశించింది. డేటింగ్ పేరుతో దోపిడీ ఆన్లైన్లో అమ్మాయిలతో చాటింగ్‌లు, డేటింగ్లు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్‌ను ఓపెన్ చేశాడో ప్రబుద్ధుడు. ఆన్లైన్ ద్వారా అమ్మాయిల ఫొటోలు ఎరవేసి, వారితో చాటింగ్ చేయడానికి, డేటింగ్‌కు నేరుగా ఆన్లైన్ ద్వారా వారితో మాట్లాడించి, డబ్బులు అకౌంట్లో వేయించుకోవడం, డబ్బులు ఖాతాలో పడిపోగానే సెల్ స్విచ్చాఫ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇప్పటికే ఇలా కొందరి ఖాతాలు ఖాళీ చేశాడు. జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ నరేష్ చాటింగ్ చేస్తూ తన ఖాతా నుంచి రూ. 8,500 వేయడానికి ఒప్పందం కుదుర్చుకుని, ఆ తర్వాత పొరపాటున రూ. 85 వేలు ట్రాన్స్ఫర్ చేసేశాడు. తప్పు తెలుసుకుని తన ఖాతాలోకి తిరిగి డబ్బులు పంపించాలని వేడుకున్నా, ఫలితం లేక పోయింది. డేటింగ్ సైట్ నిర్వాహకుడి సెల్ స్విచ్చాఫ్ అయిపోయింది. దిక్కు తోచని స్థితిలో ఆ బాధితుడు జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి ఈ నెల 11న ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విజయనగరంలోని రింగురోడ్డు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నడుపుతున్న ఆన్ లైన్ డేటింగ్ వ్యవహారంలో మరిన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఆన్లైన్లో తలదూరిస్తే... అంతే! ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియోలు చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ‘లొకొంతో‘ పేరుతో డేటింగ్ వెబ్సైట్ యాడ్లు వస్తుంటాయి. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు పరిచయాలు పెంచుకోవడం, అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వడం వంటివి చోటు చేసుకుంటుంటాయి. ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి జార్ఘండ్ రాష్ట్రం నుంచి కొన్నేళ్ల క్రితం జిల్లాకు వచ్చి స్థిరపడిన కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన విజయనగరం రింగురోడ్డు సమీపంలో నివాసముంటున్నాడని పోలీసులు కనుగొన్నారు. అంతేకాదు రామనారాయణం ప్రాజెక్ట్ సమీపంలో ఒక ఆలయాన్ని ఆయన కట్టించినట్లు తేలింది. తద్వారా సమాజంలో గౌరవప్రదమైన పెద్దమనిషిగా చెలామణీ అవుతున్నాడు. కుమార్‌కు ఇద్దరు భార్యలు కాగా వారిలో రెండో భార్య అతని కార్యకలాపాలకు పూర్తిసహకారం అందిస్తోందని విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతమంది బాధితులు కుమార్ ఆన్లైన్ ద్వా రా మోసపోయారు, వారి సెల్ నెంబర్లు, ఫోన్‌కాల్స్, చాటింగ్‌లపై కూపీలాగుతున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కొంత నగదు చేతులు మారిందని, ఒక ఎస్ఐ, ఒక సీఐ ఈ కేసును నీరుగార్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. చురుగ్గా కేసు విచారణ ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ ద్వారా పురుషులకు వల చేసి, డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు వచ్చింది. కేసు విచారణలో ఉంది. పారదర్శకంగా విచా రణ జరిపేందుకు ఈ కేసుకు ప్రత్యేకాధికారిగా విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డిని నియమించాం. త్వరలోనే పూర్తివివరాలు వెల్లడిస్తాం. -బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ -
బాస్ మీద కోపం.. డేటింగ్ సైట్లలో ఫోన్ నంబర్
బెంగళూరు: బాస్ మీద కోపంతో ఓ వ్యక్తి అతడి ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక యాజమాని పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేసి.. అతడి ఇంటికి పంపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఉద్యోగి చర్యలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన హరిప్రసాద్ జోషి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్ మనీ డ్రా చేసుకోవాలనుకున్నాడు. దీని గురించి బాస్ అవినాష్ ప్రభుకు తెలిపాడు జోషి. అయితే వైరస్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని చెప్పాడు యజమాని. అంతేకాక మునుపటి బిజినెస్ హెడ్ కూడా అవసరమైన పత్రాలను సమర్పించలేదని, అందువల్ల చెల్లింపు విడుదలలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి ముగిసిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేల్లిస్తానని ప్రభు, జోషికి హామీ ఇచ్చాడు. (4 నెలల్లో రూ. 30 వేల కోట్లు విత్‌డ్రా) కానీ డబ్బులు అత్యవసరం ఉండటంతో జోషి ఎదురుచూడటానికి ఇష్టపడలేదు. దాంతో దీని గురించి బాస్‌కు రోజు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దాంతో ప్రభు అస్సలు డబ్బు చెల్లించనని.. ఏం చేసుకుంటావో చేసుకోమని జోషిని బెదిరించాడు. బాస్ ప్రవర్తనతో విసిగిపోయిన జోషి.. అతడి భార్య, పిల్లలకు అసభ్యకరమైన మెయిల్స్ పంపాడు. ప్రభు ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక వారి పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేశాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రభు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి జోషిని అరెస్ట్ చేశారు. అతడి మీద ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
డేటింగ్ యాప్.. బాప్రే బాప్
‘కొత్తగా స్నేహితులను చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే అందుకోసం ఏవేవో ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు.. మీ మొబైల్ ఫోన్ తీసుకోండి.. మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అంతే మీ ఆలోచనలకు సరితూగే వేలాది మంది మీ కోసం ఎదురుచూస్తున్నారు.. వెంటనే వారితో ముచ్చటించండి.. స్నేహితులుగా మారండి..’ ఇవీ డేటింగ్ సైట్లు చెబుతున్న మాటలు.. ఇటీవల ఢిల్లీలో 52 ఏళ్ల మహిళకు ఓ డేటింగ్ యాప్‌లో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిసి స్నేహితులుగా మారారు. ఓ రోజు నేరుగా కలుద్దామని నిర్ణయించుకున్నారు. ఇలా తరచూ కలుస్తుండేవారు.. కానీ ఓ రోజు ఆ మహిళ తన అపార్ట్మెంటులో హత్యకు గురైంది. తీరా చూస్తే ఆ ‘స్నేహితుడే’ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. డేటింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండకపోతే జరుగుతున్న పరిణామాలకు ఇదో చిన్న ఉదాహరణ. దేశంలో ఇప్పుడు డేటింగ్ యాప్‌లు, సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌లను రూపొందిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ఫోన్లు ఉండటంతో వెంటనే ముందూ వెనుక చూడకుండా యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా వీటిని వాడుతున్నారు. కొందరేమో నిజంగానే స్నేహితుల కోసం ఈ యాప్‌లను వాడుతుండగా.. మరికొందరేమో మోసం చేయాలనే దురుద్దేశంతోనే వీటిని వాడుకుంటున్నారు. అయితే వీరి వలలో పడి మోసపోయిన వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు కానీ చెప్పడానికి భయపడుతున్నారు. సమాజంలో పరువు పోతుందని భావించి ఎవరితో చెప్పుకోకుండా వారిలో వారే మథనపడుతున్నారు. ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘స్కౌట్’యాప్‌తో మోసాలు.. విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకుని స్కౌట్ అనే డేటింగ్ యాప్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని కొందరు బాధితులు ‘సాక్షి’తో వాపోయారు. అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడిస్తామని మాయ మాటలు చెప్పారన్నారు. వీడియో కాల్ మాట్లాడాలంటే డబ్బులు పంపాలని అడిగారని.. నిజంగానే మాట్లాడతారేమోనన్న ఆశతో డబ్బులు పంపామన్నారు. డబ్బులు పంపిన వెంటనే తమ నంబర్లు బ్లాక్‌లో పెట్టారని, మోసపోయామని తెలుసుకునే లోపే నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో ప్రకటన ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నామని, ఈ యాప్ తో అనేకమంది విద్యార్థులు ఇందులో ఇరుక్కుని, నష్టపోతున్నారని, ఎవరితో చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగానే కాకుండా.. తెలంగాణ, ఏపీల్లో కూడా ఈ దందా జరుగుతోందని పేర్కొన్నారు. సాధారణంగా చేసే తప్పులు... ► వీడియో కాల్ లేదా వెబ్ కెమెరా ద్వారా మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమరుపాటు ప్రదర్శించినా చిక్కుల్లో పడతారు. స్క్రీన్ షాట్లు తీసి, మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ► డేటింగ్ సైట్లలో ప్రతి పది మందిలో ఒకరు నగ్న చిత్రాలను పంచుకుంటున్నారట. బాగానే మాట్లాడుతున్నారు కదా అని నగ్న చిత్రాలను వారితో షేర్ చేస్తే అంతే సంగతులు.. ► వ్యక్తిగత విషయాలను ఎదుటివారితో సులువుగా పంచుకుంటారు. మీ అడ్రస్.. మీ తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యం ఇలా ఏవీ కూడా ఎవరితోనూ డేటింగ్ యాప్‌లల్లో పంచుకోకూడదు. ► డేటింగ్ యాప్‌లల్లో ఉన్నవారు దాదాపు 57 శాతం మంది తమ గురించి పూర్తిగా అబద్ధాలే చెబుతున్నారట. ఉద్యోగం, పెళ్లి, రూపం, ఆకారం, నేపథ్యం ఇలా అన్ని విషయాల్లో అబద్ధమే చెబుతున్నారని తేలింది. మోసగాళ్లను ఎలా గుర్తించవచ్చు.. డేటింగ్ సైట్లలో మోసగాళ్లను ఎలా గుర్తించాలో సైబర్ నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. వాటిని పాటిస్తే కొంతలో కొంత వారి బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. వాటిలో కొన్ని.. అవతలి వ్యక్తి భాష, వాక్య నిర్మాణం, ఇంగ్లిష్ సరిగా లేకపోయినా, అక్షర దోషాలున్నా వారిని దూరంగా ఉంచడమే మంచిది. ప్రొఫైల్‌పై ఉన్న ఫొటోను గూగుల్ సెర్చ్ చేయాలి. ఒకవేళ మోసగాళ్లయితే ఆ ఫొటో గూగుల్‌లో ఉంటుంది. స్నేహితులుగా మారిన తర్వాత.. ఏవేవో కష్టాలు, కథలు చెబుతూ.. డబ్బులు అడుగుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ డబ్బులు పంపకూడదు. డబ్బుల గురించి మాట్లాడారంటే వారు మోసగాళ్లే. మోసపోయామని తెలిసిన వెంటనే ఇంట్లో వారికి కానీ.. పోలీసులకు కానీ కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. మోసగాళ్లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటారు. అప్పుడే వేరే ఎవరూ మోసపోకుండా జాగ్రత్తపడతారు. ఆన్లైన్లో బాగా మాట్లాడుతున్నారు కదా.. నేరుగా కలుద్దామంటే ముందూ వెనుక ఆలోచించకుండా వెళ్లకూడదు. వెళితే ఏదైనా దారుణం జరగొచ్చు. ఇటీవలే ఫేస్బుక్ స్నేహితుడు.. లైంగిక కోరికలు తీర్చలేదని ఓ అమ్మాయిని దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఏవేవో లింకులు పంపి వాటిని చూడమంటే అస్సలు చూడకండి. ఆ లింకుల్లో అశ్లీల చిత్రాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి లింకులు తెరిస్తే మీ ఫోన్ లేదా కంప్యూటర్లో మాల్వేర్ డౌన్లోడై మీ వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. -
అమ్మాయిలను సమకూరుస్తామంటూ మోసాలు..
సాక్షి, హైదరాబాద్ : డేటింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ఐదుగురు బెంగాలీలను సైబర్‌క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు టెలీకాలర్స్ పేరుతో యువతుల్ని జాబ్‌లో చేర్పించుకుని డేటింగ్ సైట్లను నిర్వహిసున్నారని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. భారీ స్థాయిలోకాల్ సెంటర్లు ఏర్పాటు చేసి డేటింగ్ రాకెట్ నడుపుతున్నారని వెల్లడించారు. ముఠా సూత్రధారి దేబశిష్ ముఖర్జీతో సహా ఫజుల్ హాక్, సందీప్ మిత్ర, యువతులు అనిత డెయ్, నీత శంకర్లను అరెస్టు చేశామని తెలిపారు. గెట్ యువర్ లేడీ, వరల్డ్ డేటింగ్, మై లవ్ పేర్లతో డేటింగ్ సైట్లు క్రియేట్ చేసి యువతుల్ని సమకూరుస్తామంటూ.. వేలకు వేలు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. 20 కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి అమాయకులను బురిడీ కొట్టించారని పోలీసులు తెలిపారు. కాల్ సెంటర్లకు సంబంధించిన మెటీరియల్ సీజ్ చేశామని తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ మోసాలకు బలికావద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు. -
లేడీ ప్రొఫైల్‌తో కేడీ పనులు
డేటింగ్ సైట్లలో యువతిగా నైజీరియన్ యువకుడు ఆస్ట్రేలియన్ యువకుడికి రూ.64 లక్షల గాలం అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు సాక్షి, హైదరాబాద్: అందమైన యువతి ఫొటోలతో డేటింగ్ సైట్లతో యువకులను ఆకర్షించి... ప్రేమ, పెళ్లి అని కోట్లు కొట్టేశారు. చివరకు లక్షలు సమర్పించుకున్న ఆస్ట్రేలియన్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు... సూత్రధారి నైజీరియన్‌ను గురువారం అరెస్టు చేశారు. నైజీరియా నుంచి వచ్చిన మహ్మద్ హుస్సాని బౌరా కోకాపేట్లో నివసిస్తున్నాడు. టోలిచౌకికి చెందిన మెహసీన్ ఆగా, మరో మహిళతో కలసి డేటింగ్ సైట్లలో ప్రేమ పేరుతో యువకులను టార్గెట్ చేయడం వీరి పని. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో నైజీరియా వాసి మహ్మద్ హుస్సాని బౌరా అలియాస్ సారా హైమిస్ (లేడీ ప్రొఫైల్)తో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. మెయిల్స్, ఫోన్ కాంటాక్ట్‌లతో దగ్గరయ్యారు. తానూ ఆస్ట్రేలియన్ యువతినే అని నమ్మించాడు. ఇండియాలో ఫ్యాబ్రిక్స్ అండ్ జెమ్స్ వ్యాపారం చేసేందుకు వచ్చానని తెలిపాడు. భారత ప్రభుత్వం నుంచి రూ.14.29 కోట్లు రావాల్సి ఉందని... ఆస్ట్రేలియన్ను నమ్మించాడు. ఇందుకు ట్యాక్స్ చెల్లించేం దుకు రూ.1.43కోట్లు కావాల్సి ఉందని, కొంచెం డబ్బులు సమకూర్చాలని కోరాడు. రూ.64 లక్షలు సమర్పించుకున్న ఆస్ట్రేలియన్... పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా అని... ఆస్ట్రేలియా వ్యక్తి రూ.64 లక్షలు మెహసీన్ ఆగా అకౌంట్‌కు బదిలీ చేశాడు. నగదు బదిలీ కాగానే... నిందితులు మెయిల్స్, చాటింగ్ బంద్ చేసేశారు. దీంతో యువతిని కలిసేందుకు నేరుగా హైదరాబాద్ వచ్చి న ఆస్ట్రేలియన్... అది కుదరకపోవడంతో సీఐడీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చే శాడు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ పోలీసులు గురువారం హుస్సాని, మెహసీన్ను అరెస్ట్ చేశారు. ఓ మహిళను పలుసార్లు ఆస్ట్రేలియా వ్యక్తితో మాట్లాడిం చినట్టు పోలీ సులు గుర్తించారు. ఆ మహిళ పరారీలో ఉందని సీఐడీ ఐజీ తెలిపారు. రూ.20 లక్షలు న్న బ్యాంక్ ఖాతాను సీజ్ చేశామని, ల్యాప్‌ట్యాప్, పెన్డ్రైవులు, మొబైల్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నామన్నారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు.