బెంగళూరు: బాస్ మీద కోపంతో ఓ వ్యక్తి అతడి ఫోన్ నంబర్‌ని డేటింగ్ సైట్లలో అప్‌లోడ్ చేశాడు. అంతేకాక యాజమాని పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేసి.. అతడి ఇంటికి పంపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఉద్యోగి చర్యలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన హరిప్రసాద్ జోషి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్ మనీ డ్రా చేసుకోవాలనుకున్నాడు. దీని గురించి బాస్ అవినాష్ ప్రభుకు తెలిపాడు జోషి. అయితే వైరస్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని చెప్పాడు యజమాని. అంతేకాక మునుపటి బిజినెస్ హెడ్ కూడా అవసరమైన పత్రాలను సమర్పించలేదని, అందువల్ల చెల్లింపు విడుదలలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి ముగిసిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేల్లిస్తానని ప్రభు, జోషికి హామీ ఇచ్చాడు. (4 నెలల్లో రూ. 30 వేల కోట్లు విత్‌డ్రా)
కానీ డబ్బులు అత్యవసరం ఉండటంతో జోషి ఎదురుచూడటానికి ఇష్టపడలేదు. దాంతో దీని గురించి బాస్‌కు రోజు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దాంతో ప్రభు అస్సలు డబ్బు చెల్లించనని.. ఏం చేసుకుంటావో చేసుకోమని జోషిని బెదిరించాడు. బాస్ ప్రవర్తనతో విసిగిపోయిన జోషి.. అతడి భార్య, పిల్లలకు అసభ్యకరమైన మెయిల్స్ పంపాడు. ప్రభు ఫోన్ నంబర్‌ని డేటింగ్ సైట్లలో అప్‌లోడ్ చేశాడు. అంతేకాక వారి పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేశాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రభు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి జోషిని అరెస్ట్ చేశారు. అతడి మీద ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment