escort services
-
ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో మహిళలకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి మహిళల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం.. వారి వ్యక్తిగత ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటిని ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో ప్రొఫెషనల్స్‌గా పేర్కొంటూ అశ్లీల వ్యాఖ్యలు జోడించడం... ఇలా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్‌లు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశంజిల్లా కంభం మండలానికి చెందిన గంగుల హరీష్(19) 2022 ఏప్రిల్‌లో యూట్యూబ్‌లో ఒక ఛానల్‌ను క్రియేట్ చేశాడు. నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి, మహిళల ఫొటోలను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకునేవాడు. తన యూట్యూబ్ ఛానల్లో మహిళలను ఎస్కార్ట్ సర్వీస్ ప్రొఫెషనల్స్‌గా పేర్కొంటూ, అశ్లీల వ్యాఖ్యలతో ఆ ఫొటోలను ఆప్‌లోడ్ చేస్తున్నాడు. దీంతో అతని ఛానల్‌ను 20 వేల మంది సబ్ స్రైబ్ చేయడంతో పాటు అతను అప్లోడ్ చేసిన వీడియోలను చాలా మంది వీక్షించారు. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు అతడిని హెచ్చరిస్తూ కాల్స్ చేయడంతో వాటిని యూట్యూట్ నుంచి తొలగించాడు. అనంతరం బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు గంగుల హరీష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
బాస్ మీద కోపం.. డేటింగ్ సైట్లలో ఫోన్ నంబర్
బెంగళూరు: బాస్ మీద కోపంతో ఓ వ్యక్తి అతడి ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక యాజమాని పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేసి.. అతడి ఇంటికి పంపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఉద్యోగి చర్యలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన హరిప్రసాద్ జోషి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్ మనీ డ్రా చేసుకోవాలనుకున్నాడు. దీని గురించి బాస్ అవినాష్ ప్రభుకు తెలిపాడు జోషి. అయితే వైరస్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని చెప్పాడు యజమాని. అంతేకాక మునుపటి బిజినెస్ హెడ్ కూడా అవసరమైన పత్రాలను సమర్పించలేదని, అందువల్ల చెల్లింపు విడుదలలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి ముగిసిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేల్లిస్తానని ప్రభు, జోషికి హామీ ఇచ్చాడు. (4 నెలల్లో రూ. 30 వేల కోట్లు విత్‌డ్రా) కానీ డబ్బులు అత్యవసరం ఉండటంతో జోషి ఎదురుచూడటానికి ఇష్టపడలేదు. దాంతో దీని గురించి బాస్‌కు రోజు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దాంతో ప్రభు అస్సలు డబ్బు చెల్లించనని.. ఏం చేసుకుంటావో చేసుకోమని జోషిని బెదిరించాడు. బాస్ ప్రవర్తనతో విసిగిపోయిన జోషి.. అతడి భార్య, పిల్లలకు అసభ్యకరమైన మెయిల్స్ పంపాడు. ప్రభు ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక వారి పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేశాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రభు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి జోషిని అరెస్ట్ చేశారు. అతడి మీద ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఆ 240 వెబ్సైట్లు ఇక చూడలేరు
దిల్లీ: వ్యభిచారానికి ఉపయోగిస్తున్న 240 ఎస్కార్ట్ వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకుంది. ఎస్కార్ట్ సేవలు అందిస్తున్న 240 వెబ్సైట్లను నిలిపి వేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే నిపుణుల కమిటీకి తెలపాలని సూచించారు. అయితే ప్రభుత్వ చర్యను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడనర్లు తప్పుబట్టారు. కొన్ని వెబ్సైట్లపై నిషేధించి విధించినంత మాత్రానా సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఈ వెబ్సైట్లు పేర్లు లేదా లింకులు కొద్దిగా మార్చుకున్నా మళ్లీ వస్తాయని వెల్లడించారు. ఎస్కార్ట్ వెబ్సైట్లను నిర్వహించే వారిని కనిపెట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. దినపత్రికల్లో ఎస్కార్ట్ ప్రకటనలు రాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదని, మనదేశానికి చెందిన వెబ్సైట్లను మాత్రమే నిషేధించడం సబబు కాదని పేర్కొన్నారు.