ఆ 240 వెబ్‌సైట్లు ఇక చూడలేరు
దిల్లీ: వ్యభిచారానికి ఉపయోగిస్తున్న 240 ఎస్కార్ట్ వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకుంది. ఎస్కార్ట్ సేవలు అందిస్తున్న 240 వెబ్‌సైట్లను నిలిపి వేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే నిపుణుల కమిటీకి తెలపాలని సూచించారు.
అయితే ప్రభుత్వ చర్యను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడనర్లు తప్పుబట్టారు. కొన్ని వెబ్సైట్లపై నిషేధించి విధించినంత మాత్రానా సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఈ వెబ్సైట్లు పేర్లు లేదా లింకులు కొద్దిగా మార్చుకున్నా మళ్లీ వస్తాయని వెల్లడించారు. ఎస్కార్ట్ వెబ్‌సైట్లను నిర్వహించే వారిని కనిపెట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. దినపత్రికల్లో ఎస్కార్ట్ ప్రకటనలు రాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదని, మనదేశానికి చెందిన వెబ్సైట్లను మాత్రమే నిషేధించడం సబబు కాదని పేర్కొన్నారు.