websites
-
కేసీఆర్ హయాంలోని కంటెంట్ తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా నుంచి మాజీ సీఎం కేసీఆర్ హయాంలోని ముఖ్య మైన కంటెంట్ తొలగిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు. ఈ కంటెంట్ ప్రజల ఆస్తి అని, తెలంగాణ చరిత్రలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాల కోసం భద్రపరచడానికి చర్యలు అవసరమని పేర్కొన్నారు. సీఎస్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా వెళ్లాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.కేటీఆర్‌ను కలిసిన సింగరేణి కార్మికులుసింగరేణి వే బ్రిడ్జ్‌ల వద్ద బొగ్గు లారీ లోడింగ్, అన్ లోడింగ్ కార్మికులను కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించాలని ‘సింగ రేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్, అన్లోడింగ్ లెవలింగ్ వర్క ర్స్ యూనియన్’ విజ్ఞప్తి చేసింది. యూనియన్ నాయకులు సోమవారం అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావును కలిశారు. సింగరేణిలో 47 వేబ్రిడ్జ్‌ల వద్ద 1,755 మంది కార్మికులు పనిచేస్తు న్నారని, వీరిలో భూ నిర్వాసితులు ఎక్కువమంది ఉన్నారని, తమకు పీస్ రేట్ ప్రకారం కూలీ చెల్లిస్తున్నారని వివరించారు.మరోవైపు ఐదేళ్లకోమారు మెడికల్ ఫిట్నెస్ సొంత ఖర్చులతో చేసుకోవాలని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. తమను కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించి వేతనాలు ఇవ్వాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేటీఆర్‌తో కాంగ్రెస్ నేతలు సందడి చేశారు. సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామ సమయంలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్తుండగా అక్కడే ఉన్న వేములవాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆయనతో సెలీ్ఫలు దిగారు. -
డిజిటల్ సమాచారం తొలగింపును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సమా చారాన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్‌మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని ఉద్దేశపూర్వంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని డిజిటల్ సమాచారాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధా నకార్యదర్శి శాంతికుమారికి మంగళవారం కేటీఆర్ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తర్వాత తొలగించిన వైబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను ఆ లేఖలో కేటీఆర్ జత చేశారు. సీఎంగా కేసీఆర్ పనిచేసిన కాలానికి సంబంధించిన (జూన్ 2014 – డిసెంబర్ 2023) వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో విలువైన సమాచారం తొలగించారన్నారని లేఖలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందని, కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లు కూడా తొలగించారని చెప్పారు. ఈ చర్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఉన్నారనే సందేహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్‌ను భద్రపర్చాల్సిన అవసరముందన్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. -
టెక్నాలజీ.. ఈసీ ఈజీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పౌరులకు అవసరమైన ప్రతి సమాచారాన్నీ, అవసరమైతే స్పందించే సౌకర్యాన్నీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించింది. అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునేందుకు ‘కేవైసీ’, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’, బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు, ప్రచార అనుమతుల కోసం ‘సువిధ’.. ఇలా ఎన్నో యాప్‌లు, వైబ్సైట్లు. వీటి ద్వారా ఓటరు నమోదు నుంచి మొదలుపెడితే ఫిర్యాదులు, నామినేషన్లు, ప్రచార అనుమతులు, కౌంటింగ్, ఫలితాల వరకూ ప్రతీదీ ఇంట్లోనే కూర్చుని తెలుసుకునే వీలుండటం గమనార్హం. ఓటు నమోదు చేసుకోండి కొత్త ఓటు నమోదు, ఓటు బదిలీ, తప్పులు సరి చేసుకునేందుకు ‘ఓటర్ హెల్ప్‌లైన్’ఉపయోగపడుతుంది. ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలను పొందవచ్చు. అభ్యర్థులెవరో తెలుసుకోండి నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ద్వారా ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల పూర్తి వివరాలతో పాటు నామినేషన్ల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడఫిట్లు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని రూపొందించింది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర, స్థిరచరాస్తులు వంటి సమాచారం ఉంటుంది. ‘సువిధ’తో సులభం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడం, ప్రచార అనుమతులు పొందడం ‘సువిధ’తో సులభతరం అవుతుంది. అభ్యర్థులు ఇంట్లో కూర్చొని తొలుత ఆన్లైన్లోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆస్తుల ఆఫిడవిట్ పత్రాలు, నామినేషన్‌ను బలపరిచేందుకు పది మంది ఇతరుల వివరాలను నమోదు చేయాలి. కావాల్సిన పత్రాలు సమర్పించిన తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణీత సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ‘సక్షం’తో చేయూత పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ‘సక్షం’యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆయా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. వారికి ప్రత్యేకంగా ఒక స్వచ్చంధ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీ వంటి సదుపాయాలను సమకూరుస్తారు. అబ్జర్వర్, ఈఎస్ఎంఎస్ పోలీసులు, వ్యయ పరిశీలకుల కోసం అభివృద్ధి చేసిన యాప్ ‘అబ్జర్వర్’. ఎన్నికల పరిశీలకులు నివేదికలు సమర్పించడానికి, నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. సీ విజిల్ కేసులను రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) యాప్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల వివరాలు, సీజ్ చేసిన నగదు, మద్యం, ఇతరత్రా వస్తువుల డేటాను డిజిటల్ రూపంలో పొందవచ్చు. ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్) ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ ఉపయోగపడుంది. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజున ఓటర్లను వాహనాలలో తరలించడం లాంటివి ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ‘ఓటర్ టర్నౌట్’ కేంద్ర ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన యాప్‌లలో ఈ ‘ఓటర్ టర్నౌట్’కీలకమైంది. రియల్ టైం డేటా ఆధారంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వారీగా సుమారు ఓటింగ్ శాతాన్ని అంచనా వేస్తారు. ఈ డేటాను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వినియోగదారులకు అనుమతి ఉంది. నిర్దిష్టమైన ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని అంచనా వేసే వీలుండటంతో ఇది అభ్యర్థులకు, మీడియా సంస్థలకు ఉపయుక్తకర సాధనం. అయితే ఇది కేవలం శాసనసభ, లోకసభ, ఉప ఎన్నికల సమయాలలో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ‘నోడల్’ మేడ్ ఈజీ ఎన్నికల సమయంలో నోడల్ అధికారులు అనుమతుల ప్రక్రియను సులభతరంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ‘ఎన్కోర్ నోడల్’యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి వివిధ కార్యకలాపాలను, ర్యాలీలు, బహిరంగ సభలు వంటి వాటికి సంబంధించిన అనుమతులు జారీ చేయవచ్చు. అభ్యంతరాలు తెలపొచ్చు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులు, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి అభ్యర్థులకు నోటిఫికేషన్ పంపవచ్చు. -
ఈ లింక్‌పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం
ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు. ఇప్పుడా రోజులు పోయాయి. అక్కడక్కడా ఫెక్సీలున్నా అవన్నీ బడా నేతల దృష్టిలో పడేందుకు చోటా, మోటా లీడర్ల ప్రయత్నాల్లో భాగమే. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాది కీలక పాత్ర. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్... రీల్స్, షార్ట్స్, మీమ్స్.. మాధ్య మమేదైనా సరే.. ఓటరు మానసిక స్థితిని ప్రభావితం చేసే మార్గాలే! అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రచారం కోసం వారిని ఆశ్రయిస్తున్నారు. పార్టీలు తమ విధానాలను బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సోషల్ బాట పడుతున్నాయి... కరోనా తర్వాతి ప్రపంచంలో సమాచార సాధనంగా సోషల్ మీడియా పట్ల దృక్పథమే పూర్తిగా మారిపోయింది. డేటా–సేకరణ, విజువలైజేషన్ ప్లాట్‌ఫాం స్టాటిస్టికా ప్రకారం ఫేస్‌బుక్‌కు భారత్‌లో 36.7 కోట్ల యూజర్లున్నారు. వాట్సాప్‌కు 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వారి అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో వీటితో పాటు ఎక్స్, ఇన్‌స్టా, వాట్సప్ చానళ్లదీ కీలక పాత్రే. అందుకే పార్టీలు ప్రచారానికి సోషల్ ప్లాట్‌ఫాంలను ఎంచుకుంటున్నాయి. ఫేస్బుక్లో ప్రతి పార్టీకీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి దాకా ఓ పేజ్ ఉంది. ప్రతి రాజకీయ నాయకుడికీ ఓ సైన్యమే ఉంది. ఇక వాట్సాప్ గ్రూప్లకైతే కొదవే లేదు. ఇవి కూడా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కులాలు, మతాలవారీగా ఎప్పుడో ఏర్పాటయ్యాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలనే ఆయుధంగా చేసుకుని బీజేపీ 2014లో అధికారంలోకి వచి్చంది. ఎక్స్‌లో ప్రధాని మోదీకి ఏకంగా 9.7 కోట్ల ఫాలోయర్లున్నారు. రాహుల్‌కు 2.5 కోట్ల మంది ఉన్నారు. పర్సనల్ అప్రోచ్.. ఎన్నికలంటే ఇంటింటికీ వెళ్లి ఓట్లగడం పాత పద్ధతి. ఇప్పుడంతా పర్సనల్ అప్రోచ్. బీజేపీ ఇటీవల వాట్సాప్ ఉన్న వాళ్లందరికీ ‘ప్రధాని నుంచి లేఖ’ పంపింది. కేంద్రం ఇప్పటిదాకా ఏం చేసింది, ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని పౌరులను కోరింది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ అనే వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది. మోదీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నదీ చెబుతూ వీడియో చేసి పెట్టడానికి వీలు కల్పించింది. సాధారణ పౌరుడిని ప్రధానే నేరుగా అభిప్రాయం కోరడం, ఓటేయడానికి కారణాన్ని అడిగి తెలుసుకోవడం కచి్చతంగా వారి అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మారుస్తుందన్నది బీజేపీ అంచనా. రాహుల్ గాంధీ వాట్సాప్ చానల్‌ను కాంగ్రెసే నిర్వహిస్తోంది. అందులో రాహుల్ ప్రజలతో సంభాíÙస్తారు. వారి ప్రశ్నలకు బదులిస్తారు. ఈ వాట్సాప్ సమాచారం సర్క్యులేషన్‌ను జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఎక్కువ వాట్సాప్ గ్రూపుల ద్వారా మరింత ఎక్కువ మంది ఓటర్లతో వేగంగా, మెరుగ్గా అనుసంధానం కావచ్చన్నది కాంగ్రెస్ భావన. ప్రభావశీలతపై సందేహాలూ.. సోషల్ మీడియా ప్రభావంపై అనుమానాల్లేకపోయినా ఓటర్లుగా ఫలానా పార్టీకి ఓటేసేలా ప్రభావితం చేయడంలో వాటి శక్తిపై మాత్రం సందేహాలున్నాయి. వాటి ప్రచారం తటస్థ ఓటర్ల వైఖరిలో మార్పు తేవచ్చేమో గానీ సంప్రదాయ ఓటర్లు, పార్టీ మద్దతుదారుల అభిప్రాయాలను ప్రభావితం చేయబోదని విశ్లేషకుల అంచనా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థి కులం, స్థానిక అనుబంధం, పార్టీకి విధేయత వంటివే సంప్రదాయ ఓటర్లను ప్రభావితం చేస్తాయంటున్నారు. అభ్యర్థి చరిష్మా, విశ్వసనీయత, పార్టీకి ప్రజాదరణ కూడా ఓటర్లను కదిలిస్తాయని విశ్లేషిస్తున్నారు. కీలకంగా ఇన్ఫ్లుయెన్సర్లు... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఎక్కువమందిని ఆకర్షించగల, ప్రభావితం చేయగల వ్యక్తులు. రీల్స్, షార్ట్స్ ప్రాచుర్యంతో వీరి ప్రాబల్యం మరింతగా పెరిగింది. ఎన్నికల్లో కూడా కీలక ప్రచారకర్తలుగా మారారు. సామాజిక మాధ్యమాల్లో 10,000 మంది ఫాలోయర్స్ ఉన్నవారిని ‘నానో’ ఇన్‌ఫ్లూయెన్సర్లని, లక్ష దాకా ఉంటే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, 10 లక్షలుంటే మాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, అంతకు మించితే మెగా ఇన్ఫ్లుయెన్సర్లని అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఇన్ఫ్లూయెన్సర్లు కీలకంగా మారారు. ముందున్న బీజేపీ.. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్ పెరిగింది. పార్టీలు వారికి ప్రధాన ఖాతాదారులుగా మారుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ ముందుంది... ► ప్రభుత్వ పథకాలపై కంటెంట్ కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో కలిసి పని చేయడానికి నాలుగు ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు తెలిపారు. ఇదంతా బీజేపీకి లబ్ధి చేసేదే. ► వివిధ ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్సర్లతో బీజేపీ 50కి పైగా సమావేశాలను ఏర్పాటు చేసింది. మోదీ నేతృత్వంలో మంత్రులు కూడా ప్రధాన చానళ్లకు బదులు పాడ్‌కాస్ట్ షోలు, యూట్యూబ్ చానళ్లలో కనిపిస్తున్నారు. ► ఎస్.జైశంకర్, స్మృతీ ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి కేంద్ర మంత్రులు యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా ఫాలోవర్లున్న పాడ్‌కాస్టర్ రణ్వీర్ అలహాబాదియాకు ఇంటర్వ్యూలిచ్చారు. కాంగ్రెస్‌దీ అదే బాట... ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను వాడుకునే విషయంలో కాంగ్రెస్ కూడా ఏమీ వెనకబడి లేదు. భారత్ జోడో యాత్రలోనూ, తాజాగా ముగిసిన భారత్ జోడో న్యాయ్ యాత్రలోనూ వారిని బాగానే ఉపయోగించుకుంది... ► రెండు జోడో యాత్రల్లోనూ ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకే రాహుల్ ప్రాధాన్యమిచ్చారు. ► ‘అన్ ఫిల్టర్డ్ విత్ సమ్దీశ్’ యూ ట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ► ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియో పాడ్‌కాస్ట్ కర్లీ టేల్స్ వ్యవస్థాపకుడు కామియా జానీతో తన భోజనం తదితరాల గురించి పిచ్చాపాటీ మాట్లాడారు. ► రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన హయాంలో ‘జన్ సమ్మాన్’ వీడియో పోటీలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలపై సోషల్ ప్లాట్‌ఫాంల్లో 30 నుంచి 120 సెకన్ల వీడియోలు షేర్ చేసిన వారిలో విజేతలకు నగదు బహుమతులిచ్చారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యాప్తి సగటున 40 శాతం ఉందని అంచనా. ఆ లెక్కన 2 లక్షల ఓటర్లుండే అసెంబ్లీ స్థానంలో సోషల్ మీడియా ద్వారా కనీసం 70 నుంచి 80 వేల మందిని ప్రభావితం చేసే వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలాసార్లు విజేతను తేల్చడంలో ఐదారు వేల ఓట్లు కూడా నిర్ణాయకంగా మారుతున్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద సంఖ్యేనని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాను ఇప్పుడు ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. – అంకిత్ లాల్, అడ్వైజర్, పొలిటికో – సాక్షి, నేషనల్ డెస్క్ -
'ఫేక్ వెబ్‌సైట్స్' క్లిక్ చేశారో ఖతమే! వాటిని ఇలా గుర్తించండి!!
రాజన్న సిరిసిల్ల: సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ వెబ్‌సైట్స్ పేరుతో నగదు అపహరిస్తున్నారు. ఫర్నీచర్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఇస్తున్నామంటూ ఫేక్ వెబ్సైట్లతో బురిడీ కొట్టిస్తున్నా రు. నమ్మి వాటిపై క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ఇటీవల జిల్లాలో సైబర్‌మోసాలు వరుసగా జరుగుతున్నాయి. సోషల్‌మీడియాలో వస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు! సిరిసిల్లటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరికి క్రెడిట్‌కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి ఓ కాల్ వచ్చింది. బాధితులు అతనితో క్రెడిట్‌కార్డ్ నంబర్, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.77వేలు నష్టపోయాడు. సిరిసిల్లటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరు ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ యాడ్ చూసి అందులోని లింక్‌పై క్లిక్ చేయడంతో వాట్సాప్‌కు కనెక్ట్ అయ్యింది. దీంతో బాధితుడు వారు చెప్పినట్లు కొన్ని టాస్క్‌లు చేయడంతో రూ.40వేలు నష్టపోయాడు. కోనరావుపేట్ ఠాణా పరిధిలో ఒకరికి తక్కువకే వజ్రాలు ఇస్తామంటూ ఓ కాల్ వచ్చింది. లోన్ ఇస్తామని చెప్పిన వారు ముందుగా చార్జీలు రూ.27వేలు చెల్లించాలనడంతో పంపాడు. తర్వాత తను మోసపోయానని గుర్తించాడు. సిరిసిల్లటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరికి కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది. వారి మాటలు నమ్మి డెబిట్‌కార్డ్ వివరాలు, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.లక్ష వరకు మోసపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరు నర్సరీ వ్యాపారం కోసం ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్‌ను సంప్రదించాడు. తర్వాత కొత్త నంబర్ నుంచి కాల్ రావడంతోపాటు ఒక పేమెంట్ స్కానర్‌ను పంపించారు. బాధితుడు దాన్ని స్కాన్ చేయడంతో రూ.లక్ష నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బిజినెస్ ఎమోషనల్ అని చెప్పి టెలిగ్రామ్‌లో ఒక లింక్ పంపించారు. అందులో భాగంగా కొన్ని టాస్క్ లు చేస్తే డబ్బు వస్తుందని నమ్మబలికారు. వారు చెప్పినట్లుగా కొన్ని టాస్క్‌లు చేయడంతో కొంత డబ్బు పంపించారు. ఇందులో భాగంగా బాధితుడు రూ.96వేలు నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాధితుడు పార్ట్ టైం జాబ్ గురించి ఒక యాప్‌లో నమోదు చేసుకున్నాడు. ఇందులో భాగంగా వారు ఇచ్చిన వర్క్‌లో డాటా తప్పుగా ఎంటర్ చేశారని బెదిరించి బాధితుడి నుంచి రూ.55వేలు తీసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సోషల్‌మీడియాలో వచ్చే యాడ్స్‌ను నమ్మొద్దు. ఎస్బీఐ యోనో బ్లాక్ అయిందని, పాన్‌కార్డు అప్డేట్ చేయాలని వచ్చే మెస్సేజ్‌లను నమ్మొద్దు. ఆ మెస్సేజ్‌లలో వచ్చే లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు. సోషల్‌మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టవద్దు. మీ ప్రమేయం లేకుండా మీ సెల్‌ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పొద్దు. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా గమనించాలి. అప్రమత్తతే అవసరం.. కొత్త ఫోన్ నంబర్ నుంచి కాల్ వస్తే ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్చేస్తే తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంది. డెబిట్‌కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. – అఖిల్‌మహాజన్, రాజన్నసిరిసిల్ల ఎస్పీ ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్‌తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
సీసీఎల్ఏ భూమి సైట్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ముగిసి పదిరోజులు దాటినా రాష్ట్రంలో భూపరిపాలన గాడిలో పడడం లేదు. కోడ్ కారణంగా గతంలో నిలిపివేసిన నాలుగైదు వెబ్సైట్లను పునఃప్రారంభించకపోవడమే ఇందుకు కారణమని రెవెన్యూ వర్గాలంటున్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పరిధిలోకి వచ్చే ల్యాండ్ రెగ్యులరైజేషన్ మేనేజ్మెంట్ సిస్టం (ఎల్‌ఆర్‌ఎంఎస్), యూఎల్సీ రెగ్యులరైజేషన్, ఈల్యాండ్స్ టీఎస్, జీవో 58, 59ల ద్వారా ప్రభుత్వ భూముల్లోని కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించిన వెబ్సైట్లతో సహా ఇతర భూపరిపాలన వెబ్సైట్లు పనిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. వాస్తవానికి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత భూముల క్రమబద్ధీ కరణ నిలిచిపోయింది. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉండి నిర్మాణాలు చేసుకున్న వారికి ఆ భూములను క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు లక్షలాది మంది జీవో 58, 59 ద్వారా భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోగా, అందులో 30–40 శాతం మాత్రమే దరఖాస్తులను పరిష్కరించారు. ఈ దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్ల లాగిన్లకు మాత్రమే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే చాలా చోట్ల ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు ఎన్ని కలు ముగిసిన తర్వాత క్రమబద్దీకరణ జరుగుతుందని భావించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుండడంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుందని రెవెన్యూ యంత్రాంగం భావించింది. కానీ, ఎన్నికలకు ముందు మూసేసిన వెబ్సైట్లను ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రాష్ట్రంలో భూముల క్రమబద్దీకరణ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందోనన్న ఆలోచనతోనే తాత్కాలికంగా నిలిపివేశామని చెపుతున్నారు. -
పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్సైట్లపై కేంద్రం నిషేధం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. అక్రమాలకు పాల్పడుతున్న వెబ్సైట్లపై కేంద్ర హోం శాఖ నిషేధం విధించింది. సర్వీస్ పేరుతో వెబ్సైట్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది. ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న వెబ్సైట్లను కేంద్ర హోం శాఖ గుర్తించింది. ఈ వెబ్సైట్లు మోసపూరిత పెట్టుబడి పథకాలు, పార్ట్ టైమ్ జాబ్ మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్.. 100 వెబ్సైట్లను బ్లాక్ చేయాలని సిఫార్సు చేసింది. దీంతో ఆర్ధిక నేరాలకు పాల్పడిన ఈ వెబ్సైట్లపై కేంద్రం చర్యలు తీసుకుంది. విదేశీ వ్యక్తులచే నిర్వహించబడుతున్న ఈ ప్లాట్‌ఫాంలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, అద్దె ఖాతాలను ఉపయోగించాయి. కార్డ్ నెట్‌వర్క్‌లు, క్రిప్టోకరెన్సీలు, అంతర్జాతీయ ఫిన్‌టెక్ కంపెనీల వంటి వివిధ మార్గాల ద్వారా ఈ ఆర్థిక నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశం నుండి తరలిస్తున్నారని కనుగొన్నారు. నవంబర్ 5న 22 చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్‌కాన్ -
దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు
ఢిల్లీ: ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. ఎందుకంటే చాలా వెబ్సైట్లు తమ పేర్లలో .ఇన్ అనే డొమైన్‌ను వాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఇండియా పేరు ఉంది కాబట్టే ఇండియా స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన ఐఎన్‌లను ఆయా వెబ్సైట్ల పేరు చివరన పెట్టుకున్నాయి. .ఇన్ డొమైన్‌ను కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్(టీఎల్‌డీ) అంటారు. దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మారితే .ఇన్ అనే డొమైన్ భారత్ అనే కొత్త పేరును ప్రతిబింబించదు. అçప్పుడు భారత్ అనగానే ఠక్కున స్ఫురించేలా కొత్త టీఎల్‌డీ(డొమైన్)కు మారితే బాగుంటుంది. భారత్ ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లోని బీహెచ్ లేదా బీఆర్ ఇంగ్లిష్ అక్షరాలతో కొత్త డొమైన్‌ను వాడాలి. అంటే .బీహెచ్ లేదా .బీఆర్ అని ఉంటే సబబుగా ఉంటుంది. కానీ ఈ రెండు డొమైన్లను ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించారు. దీంతో వెబ్సైట్ పేరు చూడగానే ఇది భారత్‌దే అని గుర్తుపట్టేలా ఉండే కొత్త డొమైన్ మనకిప్పుడు అందుబాటులో లేదు. అదే ఇప్పుడు అసలు సమస్య. ఎన్ఐఎక్సై్స వారు ఇన్‌రిజిస్ట్రీ సంస్థ ద్వారా .ఇన్ డొమైన్‌ను రిజిస్టర్ చేశారు. ప్రత్యేకమైన అవసరాల కోసం ఇందులోనే సబ్‌డొమైన్‌లను సృష్టించి కొన్ని సంస్థలకు కేటాయించారు. ఉదాహరణకు జీఓవీ.ఇన్ అనే డొమైన్‌ను భారత ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకుంటున్నాయి. ఎంఐఎల్.ఇన్ అనే డొమైన్‌ను దేశ సైన్యం వినియోగిస్తోంది. ఒక్కో డొమైన్ ఒక్కో దేశాన్ని వెంటనే స్ఫురణకు తెచ్చేలా ప్రాచుర్యం పొందాయి. ఉదాహరణకు .సీఎన్ అనగానే చైనా వెబ్సైట్లు, .యూఎస్ అనగానే అమెరికా వెబ్సైట్లు, .యూకే అనగానే బ్రిటన్ వెబ్సైట్లు గుర్తొస్తాయి. భారత్‌లోని చాలా ప్రముఖమైన వెబ్సైట్లు సైతం తమ ఐడెంటిటీ(గుర్తింపు)ను నిలబెట్టుకున్నాయి. మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఒక్కసారిగా డొమైన్ మారిపోతే కొత్త డొమైన్‌తో ఆయా వెబ్సైట్లకు మళ్లీ అంతటి గుర్తింపు రావడం చాలా కష్టం. .బీహెచ్, .బీఆర్ మనకు రావేమో!.బీహెచ్, .బీఆర్ అనే భారత్‌కు సరిగ్గా సరిపోతాయి. కానీ ఇప్పటికే .బీహెచ్ను బహ్రెయిన్ దేశానికి, .బీఆర్‌ను బ్రెజిల్ దేశానికి, .బీటీను భూటాన్‌కు కేటాయించారు. దీనికి మరో పరిష్కారం ఉంది. డొమైన్లోని అక్షరాలను పెంచుకుని .BHARAT, లేదా .BHRT అనే కొత్త డొమైన్‌కు తరలిపోవడమే. కొత్త డొమైన్‌కు మారినాసరే ఆయా వెబ్సైట్లు పాత డొమైన్లనూ కొనసాగించవచ్చు. వీటి నిర్వహణలో వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే ఆయా సంస్థల అసలు వెబ్సైట్ ఏది అనేది గుర్తించడం కష్టమవుతుంది. నకిలీ వెబ్సైట్ల బెడద ఒక్కసారిగా పెరిగిపోతుంది. బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి సమస్య తలెత్తితే ఇక అంతే సంగతులు. కొత్త డొమైన్ ప్రాచుర్యం పొందాక పాత డొమైన్లకు.. ఇవి ఏ దేశానికి చెందినవబ్బా ? అనే కొత్త అనుమానం నెటిజన్లకు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే డొమైన్ పేరు సమస్య ఒక్కటే పొంచి ఉంది. నిజంగానే దేశం పేరు మారితే ఇలాంటి కొత్త రకం సమస్యలు ఏమేం వస్తాయో ఇçప్పుడే చెప్పలేం. చూద్దాం.. ఈ డొమైన్ల కథ ఏ మలుపు తిరుగుతుందో! ఇదీ చదవండి: తెరపైకి భారత్..! -
ఆపకపోతే చర్యలు తప్పవు.. 15 వెబ్సైట్లకు కేంద్రం నోటీసులు!
నిషేధిత ఈ-సిగరెట్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ- సిగరెట్ల ప్రచారం, విక్రయాలు జరుపుతున్న వెబ్సైట్లపై కొరడా ఘుళిపించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ-సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలను చేపడుతున్న 15 వెబ్సైట్లకు తమ కార్యకలపాలు నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో వైపు ఈ-సిగరెట్లపై నిషేధాన్ని సమర్థంగా పాటించేలా చూడాలని ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. సోషల్ మీడియాలో ఈ-సిగరెట్ల ప్రకటనలు, విక్రయాలను కూడా మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, మరో ఆరు వెబ్సైట్లు కూడా పర్యవేక్షణలో ఉన్నాయని, త్వరలో వాటికి నోటీసులు జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "టేక్‌డౌన్ నోటీసులు జారీ చేసిన 15 వెబ్సైట్లలో నాలుగు కార్యకలాపాలు నిలిపివేయగా.. మిగిలినవి ఇంకా స్పందించలేదని అధికారలు తెలిపారు. నోటీసులు అందుకున్న వెబ్సైట్ యాజమాన్యం ప్రతిస్పందించి, చట్టానికి లోబడి ఉండకపోతే, ఈ వెబ్సైట్లను తొలగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణమే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని భావిస్తోంది. తదనుగుణంగా ఈ వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని యోచిస్తోంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ ప్రకటన) చట్టం 2019లో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. -
సైబర్ మోసాలకు గురైతే..ఇలా రిపోర్ట్ చేయండి..!
డబ్బు పోగొట్టుకోవడం, బెదిరింపులు ఎదుర్కోవడం, వీడియో–ఆడియో సంభాషణల ద్వారా ఇబ్బందులకు లోను అవడం.. ఇవన్నీ ఇటీవల ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా అధికంగా జరుగుతున్న నేరాలు. ఈ–మోసాలకు గురైతే ఏం చేయాలి? ఇంటర్నెట్లో భద్రంగా ఎలా ఉండాలి..? వివరంగా తెలుసుకుని ఆచరిస్తే సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. మన దేశంలో సైబర్ నేరాలను అధికారులకు రిపోర్ట్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీలైనంత ఎక్కువ సాక్ష్యాలను సేకరించాలి. ఇందులో స్క్రీన్ షాట్లు, ఇ–మెయిల్స్, చాట్లాగ్లు, బ్యాంక్లావాదేవీల రికార్డులు, వీడియో అండ్ ఆడియో సంభాషణలు లేదా మీ ఫిర్యాదుకు మద్దతునిచ్చే ఏవైనా ఇతర సంబంధిత సమాచారం అంతా మీ దగ్గర ఉండాలి. 1. సంఘటన ఆధారంగా.. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మొదలైనవాటిలో మీరు అవతలి వ్యక్తులతో కమ్యూనికేట్ చేసిన విధానం. తేదీ, సమయం, ఏ ప్లాట్ ఫారమ్ (ఇంటర్నెట్, సోషల్ మీడియా... మొదలైనవి) అనే అంశాల్ని చూసుకోవాలి. అలాగే సాక్ష్యాలను అప్లోడ్ చేయాలి (నగదు చెల్లింపులు /బ్యాంక్ స్క్రీన్షాట్లు ఆర్థిక మోసాలకు సంబంధించిన స్టేట్మెంట్లు. వేధింపులకు లేదా ఇతర వాటికి సంబంధించిన స్క్రీన్షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి ఏమైనా ఉంటే జత చేయాలి). 2. అనుమానితుడి వివరాలు ఏవైనా ఉంటే.. అనుమానితుడి పేరు, గుర్తింపు (మొబైల్, ఇ–మెయిల్, సోషల్ మీడియా యుఆర్ఎల్ మొదలైనవి), ప్లేస్ (ఆఫీస్... మొదలైనవి). 3. కంప్లైంట్స్ వివరాలు బాధితుడి పూర్తి పేరుతో పాటు తండ్రి/జీవిత భాగస్వామి/ సంరక్షకుడు మొదలైనవి నోట్ చేయాలి. ఇ–మెయిల్ ఐడీ /ఫోన్ నెంబర్, చిరునామా, ఐడీ గుర్తింపు (ఆధార్.. మొదలైనవి)తో మీ దగ్గరలోని స్థానిక పోలీస్‌స్టేషన్ లేదా సంబంధిత పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలి. నేరం గురించి, సంఘటన జరిగిన తేదీ, సమయం, మీరు సేకరించిన సాక్ష్యాలతో సహా అన్ని వివరాలతో కూడిన రాతపూర్వక ఫిర్యాదుతో వారికి అందించాలి. మీ ఫిర్యాదుకు ఏవైనా సంబంధిత పత్రాలు లేదా సాక్ష్యాధారాల కాపీలను జత చేయాలి. మీ పట్ల జరిగిన నేరం వరుస పద్ధతిలో సాక్ష్యాలను జాబితా చేయడం మంచిది. మీ కంప్లైంట్ /ఎఫ్ఐఆర్/ పిటిషన్ ఫాలోఅప్ గురించి విచారించాలి. మీ కేసుకు కేటాయించిన దర్యాప్తు అధికారిని క్రమం తప్పకుండా వివరాలను కనుక్కుంటూ ఉండాలి. అధికారి పేరు, సంప్రదింపు వివరాలు, మీకు అందించిన ఏవైనా రిఫరెన్స్ నంబర్ల రికార్డును మెయిన్‌టెయిన్ చేయాలి. ఇ–మెయిల్, సందేశాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ కంటెంట్‌తో సహా సైబర్ నేరానికి సంబంధించిన అన్ని సంబంధిత సాక్ష్యాలను భద్రపరిచారని నిర్ధారించుకోవాలి. విచారణ ప్రయోజనాల కోసం సాక్ష్యాలను తారుమారు చేయద్దు. సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ సంబంధిత పోర్టల్స్: దేశంలో వివిధ రకాల సైబర్ నేరాలను నివేదించడానికి ఉన్న పోర్టల్స్.. పరువు నష్టం, సైబర్ బెదిరింపు, సైబర్ స్టాకింగ్, అశ్లీల కంటెంట్, అశ్లీలత, లైంగిక వేధింపులు, ఫిషింగ్ మోసాలు.. వంటి సైబర్ మోసాలను నివేదించడానికి మీరు https://www. cybercrime.gov.in/ పెట్టుబడి మోసాలు, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు, ఇ–కామర్స్ మోసాలు, వర్క్ ఫ్రమ్ హోమ్స్కామ్లు, ఫిషింగ్ మోసాలతో సహా ఆర్థిక సైబర్ మోసాలకు గురైనట్లైతే.. 1930కి కాల్ చేయవచ్చు. సిటిజన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్కామర్ల నిధులను స్తంభింపజేయడానికి ఈ వ్యవస్థ సహాయం చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ టెర్రరిజానికి సంబంధించిన సంఘటలను రిపోర్ట్ చేయడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ((CERT-In)) వెబ్సైట్ ద్వారా https://cert-in.org.in లో రిపోర్ట్ చేయవచ్చు. పోగొట్టుకున్న ఫోన్ల గురించి https://ceir.sancharsaathi.gov.in/ Home/index.jspలో రిపోర్ట్ చేయచ్చు. మీ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ మీకు అనుమతిస్తుంది. సరైన సూచనల కోసం పోలీస్‌స్టేషన్‌ను కూడా సంప్రదించవచ్చు. ఎవరైనా మీ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ సేవల కోసం మీ ఆధారాలను ఉపయోగిస్తున్నారని అనుమానం వస్తే.. దానిని https://tafcop. sancharsaathi.gov.in/ telecomUser/ లో రిపోర్ట్ చేయవచ్చు. వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అనేది మీరు యుపీఐని ఉపయోగించి అనుకోకుండా ఇతరులకు డబ్బును బదిలీ చేస్తే, ఫిర్యాదు చేయడానికి అనుమతించే పథకం. సంబంధిత యుపీఐ సర్వీస్ప్రొవైడ్ (పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే మొదలైనవాటిపై ఫిర్యాదు), టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. https://ceir.sancharsaathi.gov.in/ Home/index.jsp పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. ప్రత్యామ్నాయంగా CRPC@rbi.org.inకు మెయిల్ చేయవచ్చు. యుపీఐ లావాదేవీకి సంబంధించి https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanismలో రిపోర్ట్ చేయచ్చు. సైబర్ సెక్యూరిటీకి చిట్కాలు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, ప్రత్యేక అక్షరాలు, సంఖ్యా కలయికతో బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించాలి. మీ ఆన్లైన్, సోషల్ మీడియా, ఇ–మెయిల్ ఖాతాల కోసం .. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ని ప్రారంభించాలి. ఎసెమ్మెస్ ద్వారా మీ మొబైల్ పరికరానికి పంపిన ప్రత్యేక కోడ్‌ని లేదా ప్రత్యేక ప్రమాణీకరణ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు. సురక్షిత డేటా ట్రాన్స్మిషన్ కోసం గ్కిఅ2 లేదా గ్కిఅ3 ఎన్క్రిప్షన్తో మీ వైఫై రూటర్‌ని సెట్ చేయాలి. చట్టబద్ధ్దమైనదని మీకు కచ్చితంగా తెలిస్తే తప్ప పబ్లిక్ ౖÐð ఫైని ఎప్పటికీ ఉపయోగించవద్దు. మీ సోషల్ మీడియా ఖాతాల్లోని సీక్రెట్ సెట్టింగ్‌లను చెక్ చేస్తూ ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలను నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవాలి. సాఫ్ట్వేర్ యాప్‌లు, ఫైల్స్‌ను రిప్యుటేషన్ ఉన్నవాటి నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయాలి. మీ ముఖ్యమైన డేటా, ఫైల్స్ డేటా, క్లౌడ్ స్టోరేజీ మొత్తాన్ని క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవడం మంచిది. డిజిటల్ భద్రత పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. లోతైన పరిష్కారానికి.. సోషల్ మీడియా మోసాలకు సంబంధించి సరైన, సంతృప్తికరమైన పరిష్కారం దొరకలేదు అనుకుంటే జ్టి్టpట://జ్చఛి.జౌఠి.జీn/లో రిపోర్ట్ చేయవచ్చు. ఈ ఎఅఇ కమిటీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ బాధితుల కంప్లైంట్స్‌ను అప్పీళ్లతో పరిష్కరిస్తుంది. (చదవండి: పీ ఫర్ పాడ్‌కాస్ట్.. బీ ఫర్ భార్గవి) -
1991లో ఒకటి.. ఇప్పుడు నిమిషానికి 175.. యాక్టివ్‌గా ఉన్నది 18 శాతమే!
సాక్షి, అమరావతి: ఇంటర్నెట్ ప్రపంచంలో కోట్లాది వెబ్సైట్లు సమాచార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. లావాదేవీలకు వారధిగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిమిషానికి 175 కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. రోజూ 2.52 లక్షల కొత్త వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. 1991లో ఒక్క వెబ్‌సైట్‌తో ప్రారంభమైన ఇంటర్నెట్ ఈ రోజు బిలియన్ల సంఖ్యకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఇంటర్నెట్లో సుమారు 1.13 బిలియన్ల వెబ్సైట్లు ఉన్నట్లు ఇంగ్లాండ్‌కు చెందిన ఇంటర్నెట్ సంస్థ నెట్క్రాఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. అధికంగా ఆంగ్లంలోనే వెబ్సైట్లను రూపొందిస్తున్నారు. 18 శాతం మాత్రమే యాక్టివ్.. ఇంటర్నెట్లోని కోట్లాది వెబ్సైట్లలో కేవలం 18 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్టు నెట్క్రాఫ్ట్ పేర్కొంది. ప్రస్తుతం 20.29 కోట్ల వెబ్సైట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. యాక్టివ్ వెబ్సైట్ల కంటే పని చేయనివి ఐదు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక Ðవెబ్సైట్లో అనేక వెబ్ పేజీల సమాచారం ఉంటుంది. 50 బిలియన్ల వెబ్‌పేజీల సమాచారం నెట్లో నిక్షిప్తమైంది. టిల్æబర్గ్ వర్సిటీ (నెదర్లాండ్స్) పరిశోధన ప్రకారం ఇండెక్డ్ వెబ్ ఏకంగా 4.98 బిలియన్ల పేజీలను కలిగి ఉంది. రెండు బిలియన్ల మంది షాపింగ్ దాదాపు 71 శాతం వ్యాపారాలను వెబ్సైట్లపై ఆధారపడి నిర్వహిస్తున్నారు. ఇందులో 28 శాతం ఆన్లైన్ వ్యాపారం నడుస్తోంది. 43 శాతం మంది చిన్న వ్యాపారులు తమ వెబ్సైట్లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. 2 బిలియన్ల మందికిపైగా వివిధ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ–కామర్స్ విక్రయాలు 4.2 ట్రిలియన్ల డాలర్లుకుపైగా చేరుకుంటున్నాయి. వెబ్సైట్లో ఇలా.. ♦ ప్రపంచ వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే వస్తోంది. గూగుల్‌లో అత్యధికంగా సగటున 22 నిమిషాల పాటు బ్రౌజింగ్ సమయాన్ని వెచి్చస్తున్నారు. ఇది యూట్యూబ్‌లో 9 నిమిషాలుగా ఉంది. ♦ ఒక రోజులో 3 బిలియన్ల కంటే ఎక్కువగా గూగుల్ శోధనలు జరుగుతున్నాయి. ♦ ఒక్క రోజులో 70,000కు పైగా వెబ్సైట్లు హ్యాక్‌కి గురవుతున్నాయి. ♦ ఒక రోజులో దాదాపు 120 బిలియన్ ఈ–మెయిల్స్ పంపుతున్నారు. ♦ప్రతిరోజూ 4 బిలియన్ గిగాబైట్ల కంటే ఎక్కువ ఇంటర్నెట్ ట్రాఫిక్ నమోదవుతోంది. ♦ 63 మిలియన్ వెబ్సైట్లు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్నాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర వెబ్సైట్లలో 76.17 శాతం మొబైల్‌కు అనుకూలమైనవి కాగా 23.83 శాతం వెబ్సైట్లు మొబైల్లో ఓపెన్ కావు. -
వెబ్సైట్ల నిర్వహణ తప్పనిసరి.. సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీలకు వెబ్సైట్ల నిర్వహణను తప్పనిసరి చేసింది. తద్వారా స్టాక్ బ్రోకర్లు(ఎస్బీలు), డిపాజిటరీ పార్టిసిపెంట్లు(డీపీలు) చేపట్టే వివిధ లావాదేవీ(యాక్టివిటీ)ల సమాచారం ఇన్వెస్టర్లకు పారదర్శకంగా అందుబాటులోకి రానుంది. ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో సంబంధిత వెబ్సైట్లను ఎస్బీ, డీపీలు తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. వెరసి ఇన్వెస్టర్లకు ఉత్తమ సర్వీసులు అందించేందుకు వీలుంటుంది. ఆయా వెబ్సైట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్టరైన చిరునామా, ప్రధాన కేంద్రం, బ్రాంచీలు, కాంటాక్టుకు వీలయ్యే పేర్లు, ఈమెయిల్ ఐడీలు తదితర ప్రాథమిక సమాచారంతోపాటు కీలక యాజమాన్యం, కంప్లయెన్స్ అధికారుల వివరాలు సైతం పొందుపరచవలసి ఉంటుందని తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. తాజా మార్గదర్శకాలు ఆగస్ట్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలియజేసింది. ఈ సర్క్యులర్ అమల్లోకి వచ్చిన వారంలోగా ఎస్బీలు, డీపీలు వెబ్సైట్ యూఆర్ఎల్(లింక్)ను స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించవలసి ఉంటుందని సర్క్యులర్‌లో సెబీ స్పష్టం చేసింది. యూఆర్ఎల్లో సవరణలు చేపడితే మూడు రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. (ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు) -
నూపుర్ శర్మ వ్యాఖ్యలు.. భారత్‌పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్సైట్లు హ్యాక్
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు భారత్‌కు భారీ చేటును తీసుకొచ్చాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది. ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎక్స్టెన్షన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లతో పాటు పలు ప్రముఖ సంస్థల వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. దాదాపు 70 వెబ్సైట్లను, పోర్టల్స్‌ను హ్యాక్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్ వంటి ప్రముఖ సంస్థల వెబ్సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చదవండి: ప్రవక్తపై కామెంట్లు: మా బాస్‌ను మధ్యలోకి లాగి బద్నాం చేయకండి! -
అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్లో రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్సైట్లు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్... మొఘల్‌పుర... కాలాపత్తర్... రామ్‌గోపాల్‌పేట్... కార్ఖానా... ఇలా నగరంలో వరుసగా దారుణాలు వెలుగులు చూస్తున్నాయి. ప్రతి ఉదంతంలోనూ నలిగిపోయింది మాత్రం బాలికలే. జూబ్లీహిల్స్, కార్ఖానా కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో మైనర్లు ఉన్నారు. ఈ పెడ ధోరణి వెనుక పోర్న్ వెబ్సైట్ల ప్రభావం ఎక్కువగానే ఉంటోందని పోలీసులు చెబుతున్నారు. ఇంటర్నెట్లో ఉన్న వీటి సర్వర్లు విదేశాల్లో ఉండటంతో చర్యలకు ఆస్కారం ఉండట్లేదంటున్నారు. నిఘా సంస్థలు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీని పరిగణించినంత తీవ్రంగా ఇతర అశ్లీలతను పరిగణించట్లేదు. ‘చేతుల్లోకి’ రావడంతో తేలికైంది.. కొన్నేళ్ల క్రితం అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు ఉండేవి. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూడటానికి ఆస్కారం ఉండేది. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగిన తర్వాత నెట్కేఫ్లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం మొదలైంది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అదే జరిగితే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. స్పార్ట్‌ఫోన్ యుగం ప్రారంభమైన తర్వాత ఈ పోర్న్ సైట్లన్నీ వాటి నుంచే చూసేందుకు అవకాశం చిక్కింది. ఈ కారణంగానే అనేక మంది యువత పోర్నోగ్రఫీకి బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు అదుపుతప్పి జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. చదవండి: (Hyderabad: బస్‌పాస్ చార్జీలు భారీగా పెంపు?) ఆ సర్వర్లు ఇక్కడ లేకపోవడంతో... పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. తెలివిమీరిన వీటి నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు ఏర్పాటు చేసి మరో సైట్ ప్రారంభిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు అందే వరకు యథేచ్ఛగా ఇంటర్నెట్లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. ఈ కారణంగానే వరుసగా ఫిర్యాదులు వచ్చిన వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. ఇక్కడి చట్టాలు అక్కడి వారికి పట్టకపోవడంతో నిర్వాహకుల వివరాలు కోరుతూ లేఖలు రాసినా, ఈ– మెయిల్స్ పంపినా వారి నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. ఇది పోర్న్ వెబ్‌సైట్స్ నిర్వాహకులకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోతున్నారు. ఆ చర్యలు మిగిలిన వాటిపై లేవు.. ప్రస్తుతం చైల్డ్ పోర్నోగ్రఫీని మాత్రమే తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధమూ కొనసాగుతోంది. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో సాగుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డన్ర్ (ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్నెట్, సోషల్‌మీడియా వంటి సైబర్ స్పేస్‌లో ఉన్న అంశాలను సీఎంఏఎంగా పరిగణిస్తారు. దీన్ని గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లను రూపొందించింది. గూగుల్, యాహూ సహా ఇతర సెర్చ్ ఇంజిన్లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్ మీడియా ఉన్న సీఎస్ఏఎంలను గుర్తించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాంటి చర్యలు వీటికీ అవసరం.. ఆయా సైబర్ స్పేస్, సోషల్ మీడియాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా.. తక్షణం గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వారి వినియోగించిన ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తుంది. ఈ సమాచారం స్థానిక పోలీసులకు ఇచ్చి నిందితులను అరెస్టు చేయిస్తుంది. చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉన్న మాదిరిగానే ఇతర అశ్లీల అంశాలపైనా చర్యలు అవసరమన్నది నిపుణుల మాట. పోర్న్‌సైట్స్‌ను ఎవరు సెర్చ్ చేసినా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీనిపైనా సుమోటో కేసుల్ని నమోదు చేయాలని ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
వెంటాడే చిత్రాలు..
ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో ఫ్రెండ్స్‌కి హోటల్లో పార్టీ ఇచ్చాను. అక్కడ, ఫ్రెండ్స్‌తో పాటు నన్ను నేను మరిచిపోయి చేసిన డ్యాన్స్ వీడియోను ఎవరో ఆన్లైన్ ఫ్లాట్ఫారమ్లలో పోస్ట్ చేశారు. ఇది నన్ను చాలా ఇబ్బందులకు గురిచేసింది. ఆ వీడియోను ఎలా తొలగించాలో అర్థం కావడంలేదు. – ఓ బాధితురాలు ∙∙ ఐదేళ్ల క్రితం నా మొదటి భర్తతో విడిపోయాను. మూడేళ్ల క్రితం మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మాకు ఏడాదిన్నర పాప కూడా ఉంది. నా మాజీ భర్తతో గతంలో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు కొన్ని అశ్లీల వెబ్సైట్లలో కనిపించాయి. అవి చూస్తే ఇప్పటి నా భర్తతో ఇప్పుడు విభేదాలు వచ్చేలా ఉన్నాయి. వాటిని నా మాజీ భర్త పోస్ట్ చేయలేదని తెలిసింది. వాటిని తొలగించడం ఎలాగో తెలియడం లేదు. –ఓ బాధితురాలు ∙∙ ఒక రోజు మద్యం తాగి వాహనం నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భానికి సంబంధించి నేనున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఆశ్చర్యపోయాను. ఆ ఫొటోను ఎవరో అనుకోకుండా పోస్ట్ చేసి ఉంటారు. చాలా చోట్లకు షేర్ అయ్యింది కూడా. కానీ, దాని వల్ల నేను తాగుబోతుననే ముద్ర నా చుట్టూ ఉన్నవారిలో పడుతోంది. అది డిలీట్ చేయడం ఎలాగో తెలియదు. – ఓ బాధితుడు మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మనకు తెలియకుండానే ఆన్లైన్ వేదికలపై కనిపిస్తే, ప్రస్తుత జీవితంపై అవి ప్రభావం చూపకుండా ఉండవు. ఇలాంటప్పుడు ఆ చిత్రాలను కానీ, వీడియోలు కానీ డిలీట్ చేయడం ఎలా?! దీనికి సంబంధించి ఎవరిని సంప్రదించాలి, వీటి కట్టడికి చట్టాలు లేవా? ఇలాంటి సందేహాలు మనందరిలో రావడం సహజం. యూజర్ హక్కులు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించే హక్కు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జిడిపిఆర్)లో భాగంగా ఉంది కానీ దానికి ప్రత్యేకించి చట్టాలు అంటూ ఏమీ లేవు. అయితే, రైట్ టు కన్ఫర్మ్, రైట్ టు యాక్సెస్, రైట్ టు కరెక్ట్, రైట్ టు పోర్టబులిటీ, రైట్ టు ఫర్గెట్... ఇవన్నీ వ్యక్తిగత డేటాకు సంబంధించి ఒక యూజర్‌కు ఉన్న హక్కులు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో ‘పరువు’ తీయడం అనేది ఒక ఉద్యమంలా తయారయ్యింది. వాటికి ఎన్ని క్లిక్‌లు, ఎన్ని షేర్లు, ఎన్ని కామెంట్లు వస్తే అంత బాగా ‘ఖ్యాతి’ వచ్చినట్టుగా, ‘డబ్బు’లు వస్తాయన్నట్టుగా ఆన్లైన్ వేదికలు తయారయ్యాయి. అవతలి వ్యక్తికి కలిగే బాధ మీద డబ్బు సంపాదించుకోవడం అతి మామూలు విషయంగా మారిపోవడంతో ఇలాంటి ‘వెంటాడే చిత్రాలు’ మన జీవితంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అయోమయ పరిస్థితిని కలిగిస్తున్నాయి. మరేం చేయాలి? డేటా ప్రొటెక్షన్‌లో భాగంగా ‘రైట్ టు ఫర్గెట్’ హక్కు ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లకుండా ఉండాలి. అందుకు ప్రపంచవ్యాప్తంగా మేధావి వర్గం కలిసి ఓ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమయ్యింది ఈ లోపు మనం చేయాల్సినవి... ► www.cybercrime.gov in లోనూ, హెల్ప్‌లైన్ 155260 కి ఫోన్ చేసి.. ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా మహిళ తన పరువుకు భంగం కలిగిందని ఫిర్యాదు చేస్తే.. ఆమెకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సంబంధించిన డేటా 24 గంటల్లోపు తొలగించాలనేది చట్టంలో ఉంది. కాబట్టి ఫిర్యాదులో వెనుకంజ వేయకూడదు. ► సైబర్‌క్రైమ్ విభాగం సాయం తీసుకోవాలి. సోషల్ మీడియా నిర్వహణ మనం సృష్టించిన దానికి తగిన ప్రోత్సాహం లభించడానికి, ఇతరులు మన ఆలోచనలను సానుకూలంగా అర్ధం చేసుకోవడానికి సోషల్ మీడియా గొప్ప రహదారి. పాత స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి మంచి అవకాశం. దీంతోపాటు మన కుటుంబంలోని వ్యక్తుల అభిరుచుల, ఆలోచనలనూ గమనించవచ్చు. పరస్పర చర్యల ఆధారంగా ఒక వ్యక్తి ప్రవర్తనా అంశాన్ని సోషల్ మీడియా పర్యవేక్షిస్తుంది. అలాగే, డాక్యుమెంట్ చేయబడుతుంది. అలాగే, తన వ్యాపార ప్రయోజనం కూడా ఉంటుంది. కాబట్టి అత్యుత్సాహం చూపకుండా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆఫ్‌లైన్‌లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటామో.. అదే విధంగా ఆన్లైన్ వేదికలు, మనం వెలిబుచ్చే అభిప్రాయాలు, పంచుకునే చిత్రాలు.. అన్నింటి పట్లా జాగరూకతతో ఉండాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
లేటెస్ట్ టెక్నాలజీతో.. సరికొత్త లుక్‌లో ఎడ్యుకేషన్.సాక్షి.కామ్
సాక్షి, ఎడ్యుకేషన్: విద్యార్థులు, అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు, ఉద్యోగాన్వేషణకులకు శుభవార్త. విద్యా ప్రపంచంలో విశేష ఆదరణ కలిగిన education.sakshi.com (sakshieducation.com) వెబ్సైట్ సరికొత్త హంగులతో మీ ముందుకు వచ్చింది. నూతన సాంకేతికతతో వెబ్సైట్ రూపకల్పన జరిగింది. ఈ వెబ్సైట్లో కేంద్ర, రాష్ట్ర పోటీపరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, బిట్‌బ్యాంక్, స్టడీ మెటీరియల్, గైడెన్స్, జీకేతో పాటుగా కరెంట్ అఫైర్స్(తెలుగు మీడియం&ఇంగ్లీషు మీడియం) అందుబాటులో ఉన్నాయి. అలాగే పది, ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడే సిలబస్, స్టడీ మెటీరియల్, ఈ–బుక్స్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, కేరిర్ గైడెన్స్ కథనాలు ఉన్నాయి. తాజా ఉద్యోగ సమాచారం, విద్యా సంబంధిత సమాచారం, కరెంట్ ఆఫైర్స్, ఆన్లైన్ టెస్టులు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాలు, స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్, వీడియోలు, ప్రాక్టీస్ టెస్టులతోపాటు ఈ–బుక్‌లు కూడా నూతన వెబ్సైట్లో ఉన్నాయి. కావాల్సిన సమాచారాన్ని కేటగిరి వైజ్ ఎంపిక చేసుకుని తెలుసుకునే సౌలభ్యం ఉంది. నాణ్యమైన విద్యా సంబంధిత కంటెంట్‌ను అందించడమే education.sakshi.com లక్ష్యం. మీ బంగారు భవిష్యత్‌కు ఎడ్యుకేషన్.సాక్షి తోడుగా ఉంటుంది సగౌరవంగా చెప్పగలం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న సాక్షి ఎడ్యుకేషన్ వీక్షకులకు కృతజ్ఞతలు..ఇలాగే ఇకపై మరింత ఎక్కువగా ఆదిస్తారని కోరుకుంటున్నాం. -
తాలిబన్ల వెబ్సైట్లు బంద్ !
బోస్టన్: తాలిబన్ల అధికారిక నిర్ణయాలను ప్రపంచానికి ఐదు భాషల్లో అందిస్తున్న వెబ్ సైట్లు శుక్రవారం హఠాత్తుగా ‘ఆఫ్‌లైన్’లోకి వెళ్లిపోయాయి. తాలిబన్లను ఆన్లైన్ వేదికపై అడ్డుకునేందుకే ఇలా వెబ్సైట్లను క్రియాశీలక స్థితి నుంచి పక్కకు నెట్టారని వార్తలొస్తు న్నాయి. తాలిబన్ల సందేశాలను ఈ వెబ్సైట్లు పష్తో, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, దారీ భాషల్లో ప్రపంచానికి అందిస్తున్నాయి. ఈ వెబ్సైట్లకు శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన కంటెంట్ డెలివరీ నెట్వర్క్, ప్రొటెక్షన్ ప్రొవైడర్ సేవలను ‘క్లౌడ్‌ఫ్లేర్’ సంస్థ అందిస్తోంది. వెబ్సైట్ల తాజా స్థితిపై ఆరా తీసేందుకు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ.. ‘క్లౌడ్‌ఫ్లేర్’ను సంప్రదించినా ఆ సంస్థ స్పందించలేదు. పలు ‘తాలిబాన్ గ్రూప్’లను వాట్సాప్ తొలగించిందని ఎస్ఐటీఈ నిఘా సంస్థ డైరెక్టర్ రీటా కట్జ్ వెల్లడించారు. ఆన్లైన్ వేదికలపై తాలిబన్ల దూకుడు నుంచి అల్‌ఖాయిదా, ఇతర ఇస్లామిక్ ఉగ్రసంస్థలు స్ఫూర్తి పొందకుండా కట్టడి చేయాలని టెక్ దిగ్గజాలను ఆమె కోరారు. ఫేస్బుక్, ట్విట్టర్లు కూడా పలు తాలిబన్ల ఖాతాలను తొలగించాయి. తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌కు ట్విట్టర్లో ఏకంగా 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
ఆదమరిచి క్లిక్ చేస్తే.. బ్లాక్ మెయిల్ చేసి..
బనశంకరి: స్మార్ట్ ఫోన్ వినియోగదారులనే టార్గెట్‌గా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, ఎస్కార్ట్స్, లోకాంటో వెబ్ లింక్‌లు పంపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు మొదట మొబైల్ ఫోన్‌కు మోసపూరిత వెబ్సైట్ లింక్ తో కూడిన మెసేజ్ పంపిస్తారు. లేదా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం లో పరిచయం పెంచుకుని మొబైల్ నంబర్లను సేకరించి పలు రకాల ప్రలోభాలతో ఊరిస్తారు. వారు పంపిన లింక్‌పై క్లిక్ చేయమంటారు. క్లిక్ చేస్తే చాలు.. వీడియో కాల్లో నగ్న దృశ్యాలు కనిపించి క్షణాల్లో రికార్డు, స్క్రీన్ షాట్లను తీసుకుంటారు. మరో పక్క బాధితుని బంధుమిత్రుల ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు, ఫోన్‌నంబర్లనూ సేకరిస్తారు. వారికి మీ చిత్రాలను, వీడియోలను ట్యాగ్‌చేస్తామని, వాట్సప్‌కు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రకంగా పెద్దమొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు తరచూ బెంగళూరు నగర సీఇఎన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వీడియో కాల్స్‌కు, వెబ్ లింక్‌లకు స్పందించరాదని పోలీసులు సలహా ఇచ్చారు. -
HYD : ఫేక్ వెబ్ సైట్లు క్రియేట్ చేస్తున్న ముఠా అరెస్ట్
-
Facebook: కొత్త ఫీచర్ గురించి తెలుసా?!
సాక్షి, ముంబై: గతేడాది ఫేస్బుక్ ప్రైవసీ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆఫ్ - ఫేస్బుక్ పేరుతో తెచ్చిన ఈ ఫీచర్ సాయంతో ఫేస్బుక్ లో యాప్స్, వెబ్ సైట్లు, థర్డ్ పార్టీ సైట్లు షేర్ చేసే డేటాను మీరు కంట్రోల్ చేయవచ్చు. ఆ ఆప్షన్ ను మీరు ఆన్ చేస్తే కంటెంట్ మీ ఫేస్ బుక్ లో డిస్ప్లే అవుతుంది. ఆ డేటా ను మీరు క్లియర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదే ఆప్షన్ ఆఫ్ చేస్తే ఆ డేటా ఫేస్బుక్లో కనిపించదు. అంతేకాదు ఏ కంపెనీకి చెందిన యాడ్స్ ఫేస్బుక్లో కనిపించాలన్నా, లేదా బ్లాక్ చేయాలన్నా అంతా మీ చేతిలోనే ఉంటుంది. దీంతో పాటు మీరు ఫేస్బుక్లో ఏ కంటెంట్‌ను ఎక్కువగా చూస్తున్నారో థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో తెలుసుకోవడం కష్టం. ఆఫ్-ఫేస్ బుక్ ఫీచర్ తో లాభం ఏంటి? ఫేస్బుక్ లో కొన్ని టూల్స్ ను వినియోగించి బిజినెస్ కు సంబంధించిన యాడ్స్, ప్రమోషన్, లేదంటే ఫేస్బుక్ యూజర్ వ్యక్తిగత డేటా తెలుసుకోవచ్చు. అయితే మీరు ఆఫ్ ఫేస్బుక్ టూల్ తో ఏఏ సంస్థలు మీకు బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. మరి ఈ టూల్ ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం. (Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!) ఆఫ్-ఫేస్ బుక్ టూల్ ను ఎలా యాక్టివ్ చేసుకోవాలి? • ముందుగా ఫేస్బుక్ సెట్టింగ్ అండ్ ప్రైవసీ ఆప్షన్ లోకి వెళ్లాలి. • ఆ తరువాత సెట్టింగ్ పై క్లిక్ చేయండి. • సెట్టింగ్ పై క్లిక్ చేసిన వెంటనే “యువర్ ఫేస్ బుక్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. • ఆ తరువాత ఆఫ్ ఫేస్బుక్ యాక్టివిటీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి మీరు మీ ఆఫ్ ఫేస్బుక్ టూల్ ని యూజ్ చేసి ఇక పై మీ ఫేస్బుక్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలో డిసైడ్ చేయోచ్చు. అంతేకాదు మీరు ఫేస్బుక్ లో చూసిన కంటెంట్ హిస్టరీని డిలీట్ చేయోచ్చు. ఆఫ్ ఫేస్ బుక్ ఫీచర్ ను ఆపేస్తే ఏమవుతుంది? ఆఫ్ ఫేస్బుక్ ఫీచర్ ను ఆఫ్ చేస్తే వెబ్ సైట్లు, యాప్స్, ఇతర థర్డ్ పార్టీ టూల్స్ ఫేస్ బుక్ లో మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో కనిపెట్టలేవు. ఫేస్బుక్ సైతం మీరు ఏం కంటెంట్ చూస్తున్నారో గుర్తించలేదు. దీంతో పాటు యాడ్స్ కూడా మీ ఫేస్ బుక్ లో డిస్ ప్లే కావు. (కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు!) మీరు యాపిల్ సంస్థ డివైజెస్ ను వినియోగిస్తున్నారా? అయితే ఇటీవల యాపిల్ సంస్థ iOS 14.5 అప్ డేట్ ను విడుదల చేసింది. దీని సాయంతో ఫేస్ బుక్ లో మీ వ్యక్తిగత సమాచారాన్ని, లేదంటే డిస్ ప్లే అవుతున్న పలు కంపెనీల యాడ్స్ , మీరు చూసే కంటెంట్‌ను వ్యాపారం నిమిత్తం ఇతర కంపెనీలకు షేర్ చేయడం అసాధ్యం అవుతుంది. (Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!) -
Captcha: నేను రోబోను కాదు!
సాక్షి, సెంట్రల్ డెస్క్: మనం ఏదో ఒక పని మీద వెబ్సైట్లు ఓపెన్ చేస్తుంటాం.. ఒక్కోసారి ఆ పేజీలు ఓపెన్ కావడానికి ముందు ‘క్యాప్చా (CAPTCHA)’ను కంప్లీట్ చేయాలని అడుగుతుంది. అడ్డంగా, పొడుగ్గా సాగదీసి, వంగి ఉన్న అక్షరాలను చూపి.. వాటిని గుర్తించి ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఇంకొన్ని వెబ్ సైట్లలో ‘ఐయామ్ నాట్ రోబో (నేను రోబోను కాదు)’ అని టిక్ చేయాలని కోరుతుంది. మరికొన్నిటిలో చాలా బొమ్మలు పెట్టి.. ఇందులో కారు ఉన్న బొమ్మలను టిక్ చేయండి అని అడుగుతుంది.. అసలు ఇవన్నీ ఏమిటి? ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం రోబోలం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. వెబ్సైట్లకు రక్షణ కోసం కంప్యూటర్ టెక్నాలజీలు పెరిగాక ఆటోమేటిక్ ప్రోగ్రాములు, రోబోల రూపకల్పన మొదలైంది. నిర్దేశించిన పనిని, నిర్దేశించిన సమయంలో ఆటోమేటిగ్గా చేసే ఈ ప్రోగ్రాములు, రోబోల సాయంతో వెబ్ సైట్లను ఓపెన్ చేయడంతోపాటు, పేజీలను రీడ్ చేయొచ్చు. ఏదైనా వెబ్‌సైట్‌ను ఒకేసారి పెద్ద సంఖ్యలో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే.. వెబ్సైట్లు, వాటి సర్వర్లు క్రాష్ అవుతాయి. దీనితో పాటు వైరస్ అటాక్‌లు, ఫిషింగ్, మాల్వేర్లను చొప్పించడం వంటివాటిని కూడా ఈ ఆటోమేటిక్ ప్రోగ్రాములు, రోబోలు చేయగలుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికే ‘క్యాప్చా’ విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాప్చా అంటే.. ‘కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ అపార్ట్’. వెబ్సైట్లను రోబోలు, ఆటోమేటిక్ ప్రోగ్రాముల నుంచి రక్షించేందుకు.. 2000వ సంవత్సరంలో దీనిని రూపొందించారు. మనుషులు సులువుగానే గుర్తించగలిగి.. కంప్యూటర్లు గుర్తించలేని చిన్నపాటి పరీక్ష ఇది అని చెప్పొచ్చు. అక్షరాలను గుర్తించడంతో.. అక్షరాలను చదివి గుర్తించడంలో మనుషులకు మంచి నైపుణ్యం ఉంటుంది. మనకు తెలిసిన అక్షరాలు వంగి ఉన్నా, సాగదీసి ఉన్నా, వివిధ రకాల ఫాంట్లలో ఉన్నా కూడా మనం కాస్త సులువుగానే గుర్తించగలం. ఈ సామర్థ్యమే మొదట క్యాప్చా రూపకల్పనకు మార్గం చూపింది. కంప్యూటర్లు ‘ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్’ సాంకేతికత సాయంతో అక్షరాలను గుర్తిస్తాయి. అవి నిర్దేశించిన మేరకు మాత్రమే కచ్చితంగా అంచనా వేస్తాయి. మనుషుల తరహాలో భిన్నమైన వాటిని గుర్తించలేవు. క్యాప్చా: ఒకే పదంతో పరీక్ష మొదట్లో ఒకే పదం ఉన్న క్యాప్చాలను ఉప యోగించారు. ప్రోగ్రామర్లు కంప్యూటర్‌కు ముందే ఒక పదాన్ని ఇస్తారు. అంటే క్యాప్చా ఏమిటనేది ఈ కంప్యూటర్‌కు ముందే తె లుస్తుంది. తర్వాత ఆ పదాన్ని సాగదీసి, వంచి, అక్షరాలను కూడా వేర్వేరుగా సాగదీసి.. వాటి మధ్య దూరం పెంచి ఒక ఇమేజ్ను తయారు చేస్తారు. దీనిని క్యాప్చాగా పెడతారు. మను షులు ఆ పదాన్ని లేదా అక్షరాలను గుర్తించి.. పక్కనే ఇచ్చిన బాక్స్‌లో నమోదు చేస్తారు. కంప్యూటర్ దానిని సరైనదిగా గుర్తించి వెబ్‌పేజీని ఓపెన్ చేస్తుంది. ఆటోమేటిక్ ప్రోగ్రాములు, రోబోలు ఈ క్యాప్చాలను అర్థం చేసుకోలేకపోతాయి కాబట్టి వెబ్‌పేజీ ఓపెన్కాదు. ప్రతిసారి ప్రోగ్రామర్లు పదాలను ఇవ్వలేరు కాబట్టి.. ముందే వేల సంఖ్యలో పదాలను కంప్యూటర్‌కు ఇచ్చారు. కంప్యూటరే ప్రతిసారి ఆటోమేటిగ్గా వాటిల్లోంచి ఓ పదాన్ని ఎంపిక చేసి.. వంచి, సాగదీసి క్యాప్చాలుగా పెడుతుంది. రీక్యాప్చా: రెండు పదాలతో.. సాంకేతికత పెరిగిన కొద్దీ ఈ పరీక్షను కాస్త కష్టతరం చేసేందుకు 2005లో రీక్యాప్చాను ప్రవేశపెట్టారు. ఇందులో రెండు పదాలు ఉంటాయి. ఒక పదాన్ని కంప్యూటర్ నేరుగా సృష్టించి ఇస్తుంది. స్కాన్ చేసి పెట్టిన పాత పుస్తకాలు, ఆర్టికల్స్ నుంచి మరో పదాన్ని ఇస్తుంది. మనం ఈ రెండు పదాలను నమోదు చేస్తే వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పదాలన్నీ డిజిటలైజ్ పాత పుస్తకాలు, ఆర్టికల్స్‌ను స్కాన్ చేసిన ఈ పదాలను మనం రీక్యాప్చా ల్లో ఎంటర్ చేస్తుం టాం. మరి అవన్నీ ఏమైపోతున్నాయో తెలుసా? కంప్యూటర్ మళ్లీ వాటిని తీసుకెళ్లి వరు సగా అమర్చుతుంది. చివరికి అదంతా డిజిటలైజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తారు కాబట్టి ఇది భారీగా ఉం టుంది. ఎంత అంటే.. అమెరికాలోని న్యూ యార్క్ టైమ్స్ పత్రికలో ఏడాది పాటు వచ్చిన ఆర్టికల్స్ అన్నీ నాలుగు రోజుల్లో డిజిటలైజ్అయిపోతాయన్నమాట. 2009లో ఈ ‘రీక్యాప్చా’ను కొనుగోలు చేసిన గూగుల్ సంస్థ.. పుస్తకాలను డిజిటలైజ్ చేయడానికి ఈ టెక్నాలజీని వినియోగిస్తోంది. కృత్రిమ మేధతో దెబ్బ! 2010–12 తర్వాత కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ) బాగా అభివృద్ధి చెందింది. ఎంతగా వంచడం, సాగదీయడం వంటివి చేసినా కూడా అక్షరాలను గుర్తించగల సామర్థ్యం రోబోలు, ప్రోగ్రాములకు సమకూరాయి. అవి క్యాప్చాలను సులువుగా పరిష్కరించడం మొదలుపెట్టాయి. æ2014లో గూగుల్ మెషీన్ లెర్నింగ్ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ స్థాయిలో మార్చిన అక్షరాలను మనుషులు 33 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తే.. ఏఐ ఆధారిత రోబోలు, ప్రోగ్రాములు ఏకంగా 99.8 శాతం కచ్చితత్వంతో గుర్తించగలిగాయి. రీక్యాప్చా వీ2: చిత్రాల సాయంతో.. ఇలా జరగడంతో ఏఐ ఆధారిత ప్రోగ్రాములు, రోబోల నుంచి తప్పించు కునేందుకు వెబ్సైట్లకు చిత్రాలతో కూడిన ‘రీక్యాప్చా వీ2’ను రూపొందించారు. 2015–16 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందులో కొన్ని చిత్రాలు చూపించి.. అందులో కొన్నింటిని గుర్తించే పరీక్ష పెట్టారు. ఉదాహరణకు.. చిత్రాల్లో ట్రాఫిక్ లైట్లు, రోడ్లు, షెడ్లు, చెట్లు, వాటి భాగాలు ఉన్న వాటిని గుర్తించాల్సి ఉంటుంది. అయితే, గూగుల్ తమ గూగుల్ మ్యాప్స్‌ను మెరుగుపర్చేందుకు ఈ డేటాను వాడుకుంటుండటం గమనార్హం. æ ఇంత చేసినా కూడా ఏఐ కంప్యూటర్ ప్రోగ్రాములు, రోబోలు వీటినీ సులువుగా గుర్తించడం మొదలుపెట్టాయి. రీక్యాప్చా వీ3: జస్ట్ క్లిక్ చేస్తే చాలు అన్ని రకాల క్యాప్చా పరీక్షలను ప్రోగ్రాములు, రోబోలు పరిష్కరిస్తుండటంతో.. కొత్తగా ‘రీక్యాప్చా వీ3’ని కొంతకాలంగా వినియోగిస్తున్నారు. ఇందులో వినియోగదా రుడు నేరుగా ఎలాంటి పరీక్ష ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కేవలం ‘ఐయామ్ నాట్ రోబో’ అని ఉన్న డిక్లరేషన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ‘రీక్యాప్చా వీ3’ కూడా కృత్రిమ మేధ ఆధారంగా పనిచే స్తుంది. ఇది వెబ్‌పేజీల బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ.. వినియోగిస్తున్నది మనుషులేనా, కాదా అన్నదానిపై నిఘా పెడుతుంది. ఉదాహరణకు మౌస్తో అత్యంత వేగంగా, అత్యంత కచ్చితంగా క్లిక్స్ చేయడం, వేగంగా టైపింగ్ చేయడం, చకచకా ఆప్షన్లు ఎంపిక చేసుకోవడం వంటి రోబోలు చేసే పనులు.. వీటి ఆధారంగా అది మనిషా, రోబోనా అని గుర్తిస్తుందన్నమాట. చూశారుగా.. మనం రోబో కాదని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయాసలు పడాల్సి వస్తోందో.. చదవండి: ఈ యాప్స్‌తో ఒత్తిడి పరార్..! -
పోటాపోటీగా ‘లైవ్‌లా, బార్ అండ్ బెంచ్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేనిక్కడ మీకొకటి చెప్పదల్చుకున్నాను. ఈ పిటిషన్లన్నింటిని ఇక్కడ పరిశీలించడం కన్నా, వీటిని ‘లైవ్‌లా’ వెబ్సైట్లోనో, మరో చోటనో పరిశీలించడమో మంచిది’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. విశేష ప్రజాదరణ పొందుతున్న న్యాయ వెబ్సైట్ ‘లైవ్‌లా’ గురించి న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. ‘లైవ్‌లా’తో పాటు ‘బార్ అండ్ బెంచ్’ వెబ్సైట్ వివిధ కోర్టుల్లో కొనసాగుతున్న వివిధ కేసులు, పిటిషన్ల విచారణ సహా కోర్టు సర్వ కార్యకాలాపాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నాయి. కోర్టుల తీర్పులు, ఉత్తర్వులే కాకుండా పిటిషన్లు, విజ్ఞప్తులు, వాటికి సంబంధించిన పూర్వ సమాచారాన్ని దాదాపు లైవ్‌గా అందిస్తున్నాయని చెప్పవచ్చు. కోర్టు లోపలకి టీవీ కెమేరాలను అనుమతించరు కనుక, కెమేరాలు లేకుండానే ఈ వెబ్సైట్లు ప్రత్యక్ష ప్రసారాలను చేస్తున్నాయని చెప్పవచ్చు. ఏ ముఖ్యమైన కేసుకు సంబంధించి అయినా సరే కోర్టు తీర్పు చెబుతుండగానే ‘ట్వీట్ల’ రూపంలో ఈ వెబ్సైట్లు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇంతవరకు తీర్పులే బయటకు వచ్చేవి. పిటిషన్లు, పిటిషన్లలోని అంశాలు ఒక్క న్యాయవాదులకే అందుబాటులో ఉండేవి. ఇప్పుడవన్నీ కూడా ఈ వెబ్సైట్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ రెండు వెబ్సైట్లను జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులే వీక్షిస్తున్నారనుకుంటే పొరపాటే. కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు, సామాజిక కార్యకర్తలు, లా విద్యార్థులతోపాటు ఆసక్తిగల సామాన్యులు కూడా వీక్షిస్తున్నారు. సమాజంలో కోర్టుల ఆవశ్యకతను, వాటి పాత్రను సముచితంగా అర్థం చేసుకొని పారదర్శకంగా సమాచారాన్ని అందిస్తుండడంతోనే ఈ రెండు వెబ్సైట్లకు అంత ఆదరణ పెరిగింది. ‘బార్ అండ్ బెంచ్’ సహ వ్యవస్థాపకురాలు పల్లవి సాజులా, ‘లైవ్‌లా’ ప్రతినిధి ఎంఏ రషీద్ 2010 నుంచి కోర్టు తీర్పుల అప్లోడింగ్ భారత్‌లో వివిధ కోర్టుల తీర్పులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం చాలా ఆలస్యంగా 2010లో ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ఈ రెండు వెబ్సైట్లు కక్షిదారులకు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. తమ కేసుల విచారణకు కోర్టులకు హాజరైన వారికి అక్కడి వాదనలు ఏమిటో ఓ మానాన అర్థం అయ్యేవి కావు. ఈ వెబ్సైట్ల రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘లైవ్‌లా లేదా బార్ అండ్ బెంచ్’ వెబ్సైట్లను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చూస్తామని ఇద్దరు హైకోర్టు జడ్జీలు చెప్పడం విశేషం. ఈ మధ్య వీటిని చూస్తున్న న్యాయవాదులే కాకుండా లిటిగెంట్లు కూడా న్యాయపరమైన పాయింట్లను లేవనెత్తుతున్నారని, అది ఒకరకంగా ఇబ్బందిగా ఉంటుందని, అందుకని తాము కూడా రోజూ చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెండు వెబ్సైట్లు ఇతర భాషల్లో కూడా వస్తే బాగుండని పాఠకులు సూచిస్తున్నారు. 2018లో సుప్రీం కోర్టు లోపలికి మొబైల్స్ అనుమతి బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ 2010లోనే తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటికీ 2015లో ట్వీట్ల ద్వారా పాపులర్ అయింది. ఆ సైట్‌కు సంబంధించిన లీగల్ రిపోర్టర్లు ట్వీట్ల ద్వారా కేసుల వివరాలు బయటకు తెలియజేసేవారు. 2018 వరకు సుప్రీం కోర్టులో లీగల్ రిపోర్టర్ల మొబైల్ ఫోన్లను అనుమతించేవారు కాదు. వారి బాధలను అర్థం చేసుకున్న అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో పరిస్థితి మారిపోయింది. ఆవిర్భావం వెనక మిత్రులు బెంగళూరులోని జాతీయ న్యాయ కళాశాలలో చదువుకున్న శిశిర రుద్రప్ప, బిపుల్ మైనాలి, అభిషేక్ పర్శీరా అనే మిత్రులు ‘బార్ అండ్ బెంచ్’ పత్రికను 2009లో స్థాపించారు. 2010 తర్వాత అది ఆన్లైన్ వెబ్‌సైట్‌గా మారింది. బార్ అండ్ బెంచ్ స్థాపించిన మూడేళ్లకు ‘లైవ్‌లా’ వెబ్‌సైట్‌ను ఎంఏ రషీద్, రఘుల్ సుదీశ్, రిచా కచ్వాహను 2012లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ రెండు వెబ్సైట్లకు మూడు లక్షల మంది ట్విటర్ ఫాలోవర్లు ఉన్నారు. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌పై సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు) -
పేట్రేగిన చైనా హ్యాకర్లు
న్యూఢిల్లీ: భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం భారత్‌కు చెందిన వెబ్‌సైట్లపైన చైనా హ్యాకర్ల దాడులు భారీ స్థాయిలో పెరిగినట్లు సింగపూర్ సంస్థ ఒకటి వెల్లడించింది. జూన్ 18వ తేదీ తర్వాత చైనా ఆర్మీ(పీఎల్ఏ)మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు ఒక్కసారిగా 300 శాతం మేర పెరిగాయని సైబర్ రీసెర్చ్ సంస్థ సైఫర్మా వెల్లడించింది. రెండు దేశాల సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జూన్ 15, 16వ తేదీల్లో ఘర్షణలు జరగ్గా ఆ తర్వాత నుంచి భారత వెబ్సైట్లే లక్ష్యంగా చైనా హ్యాకర్ల దాడుల్లో తీవ్రత, దూకుడు బాగా పెరిగినట్లు గుర్తించామని సైఫర్మా సీఎండీ కుమార్ రితేశ్ తాజాగా ‘ఇండియాటుడే’కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ)తో పంచుకున్నట్లు ఆయన వివరించారు. ‘హ్యాకర్లు మొదటి దశలో నిఘా వేసి భారత వెబ్సైట్ల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. దాని ఆధారంగా వారు లక్ష్యాలను నిర్ధారించుకుంటారు. రెండో దశలో సైబర్ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి’అని ఆయన తెలిపారు.‘జూన్ 18వ తేదీకి ముందు చైనా హ్యాకర్లు మొబైల్ ఫోన్ల తయారీ, నిర్మాణరంగం, టైర్లు, మీడియా కంపెనీలు, ఇతర ప్రభుత్వ రంగ ఏజెన్సీల వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకునే వారు. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం వెబ్సైట్లను పాడుచేయడం, వాటి ప్రతిష్టను దిగజార్చడం నుంచి కీలకమైన సమాచారాన్ని, సున్నితమైన వివరాలను, వినియోగదారుల డేటాను, మేధోహక్కులను దొంగిలించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు’అని వెల్లడించారు. ‘గతంలో పాకిస్తాన్, ఉత్తరకొరియా హ్యాకర్ల ద్వారా చైనా హ్యాకర్లు కార్యకలాపాలు సాగించేవారు. ఇప్పుడు వారే నేరుగా హ్యాకింగ్‌లో పాలుపంచుకుంటున్నారు. భారతీయ సంస్థల కీలక సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని కుమార్ రితేశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా చైనాలోని బీజింగ్, గ్వాంగ్ఝౌ, షెంజెన్, చెంగ్డులోని స్థావరాల నుంచి సైబర్ దాడులు ఎక్కువగా జరిగినట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. ప్రభుత్వ అండతో నడిచే గోధిక్ పాండా, స్టోన్ పాండా అనే హ్యాకింగ్ ఏజెన్సీలు తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకు చైనాకు బదులుగా అమెరికా, యూరప్, ఇతర ఆసియా దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. చైనా ఆర్మీకి చెందిన మౌలిక వసతులను ఇవి ఉపయోగించుకుంటాయి. ‘ప్రభుత్వ ప్రేరేపిత హ్యాకర్లు భారత్‌పై ఎప్పటి నుంచో కన్నేసి ఉంచారు. జూన్ తర్వాత వారి వైఖరిలో మార్పు వచ్చింది. వారి సంభాషణను డీకోడ్ చేయగా తరచుగా ‘భారత్‌కు గుణపాఠం చెప్పాలి’వంటివి ఎక్కువగా వాడుతున్నట్లు తేలింది. ప్రభుత్వ ప్రోద్బలంతో నడిచే హ్యాకింగ్ సంస్థలకు భౌగోళిక రాజకీయ లక్ష్యాలు ఉండేవి. కానీ, చైనా హ్యాకర్ల లక్ష్యం వాళ్ల పరిశ్రమలను కాపాడుకోవడమే’అని ఆయన తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన, అంతర్జాతీయంగా మంచి పేరున్న భారతీయ సంస్థలే చైనా హ్యాకర్ల ప్రస్తుత లక్ష్యం. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక వసతులను మెరుగుపర్చుతున్నప్పటికీ హ్యాకర్లు అంతకంటే ముందుంటున్నారు. నోడల్ ఆర్గనైజేషన్ నుంచి మిగతా సంస్థలకు సమాచారం అందజేత నెమ్మదిగా సాగుతోంది. సైబర్ దాడులను ఎదుర్కోవాలంటే మాత్రం సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం సత్వరమే జరిగిపోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు -
అశ్లీల వెబ్సైట్లు చూశారంటూ డబ్బు డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: ఈ–మెయిల్ ఎక్స్ట్రాక్షన్... ఇటీవల కాలంలో నగరంలో పెరుగుతున్న సైబర్ నేరం ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 18 రోజుల్లోనే ఎనిమిది మంది బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీరిని బెదిరించడానికి సైబర్ నేరగాళ్లు వాడుతున్న అస్త్రమే... అశ్లీల వెబ్సైట్లు సందర్శన. అలా చేయనివారు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తుండగా.. వీక్షించిన వాళ్లు మాత్రం గప్‌చుప్‌గా నేరగాళ్లు కోరిన మొత్తాలు చెల్లించేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫలితంగా అశ్లీల వెబ్సైట్ల వీక్షణం గణనీయంగా పెరిగిందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్‌గా పేరుగాంచిన పోర్న్ హబ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు భారత్‌లోనూ ఈ ధోరణి కొనసాగుతోంది. దేశంలోని దాదాపు ప్రతి టెలికం సంస్థా అశ్లీల వెబ్‌సైట్స్‌ను బ్యాన్ చేశాయి. అయినప్పటికీ మిర్రర్ డొమైన్స్ ద్వారా వీటిని చూస్తున్నారని పోర్న్ వెబ్ సంస్థ స్పష్టం చేస్తోంది. సాధారణ సమయాల్లో కంటే లాక్డౌన్ వేళ వీటి వినియోగం ఏకంగా 35 శాతం పెరిగినట్లు గణాంకాలు విడుదల చేసింది. దేశంలో పూర్తి స్థాయి నిషేధం ఉండి, తీవ్రమైన నేరంగా పరిగణించే చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ 90 శాతం పైగా పెరిగినట్లు పోర్న్ హబ్ గణాంకాలు చెప్తున్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి నైజీరియా సహా మరికొన్ని సౌత్ ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. పథకం ప్రకారం వీళ్లే కొన్ని రకాలైన అశ్లీల వెబ్‌సైట్స్‌ను రన్ చేస్తున్నారు. వీటికి బ్యాక్ గ్రౌండ్లో ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ను నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఎవరైనా ఈ సైట్స్‌లోకి ఎంటరై అశ్లీల చిత్రాలు, వీడియోలను వీక్షిస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో నిక్షిప్తమై ఉన్న ప్రోగ్రామింగ్ దానంతట అదే యాక్టివేట్ అవుతుంది. ఆ వెంటనే సదరు సైట్‌ను వీక్షిస్తున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లకు చెందిన కెమెరా తక్షణం యాక్టివేట్ అయి ఆ వ్యక్తి ఫొటోను సంగ్రహిస్తుంది. దీంతో పాటు అతడి మెయిల్ ఐడీ, దాని అనుబంధ వివరాలు, వీక్షించిన సైట్, సమయం తదితరాలను రికార్డు చేస్తుంది. ఈ వివరాలన్నీ వీక్షించిన వ్యక్తి ఫొటోతో సహా సైబర్ నేరగాళ్లకు అందిస్తుంది. ఇలా తన చేతికి చిక్కిన వివరాలతో ఆ సైబర్ క్రిమినల్స్ అసలు పని ప్రారంభిస్తున్నారు. పోర్న్ సైట్ వీక్షించిన వ్యక్తి ఈ–మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్ పంపిస్తున్నారు. ఇందులో అతడి ఫొటో, వీక్షించిన సైట్ వివరాలు, సమయం తదితరాలు జత చేస్తున్నారు. నిషేధం ఉన్నా వాటిని వీక్షించినందుకు పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయిస్తామనో, మీ మెయిల్ ఐడీలో ఉన్న ఇతర కాంటాక్టులకు పంపి పరువు తీస్తామనో బెదిరిస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే నిర్ణీత మొత్తం బిట్ కాయిన్స్ రూపంలో చెల్లించాలని సైబర్ నేరగాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ మెయిల్స్ అందుకున్న వారిలో 95 శాతం మంది బెదిరింపులకు లొంగిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. వీక్షించకపోయినా బెదిరింపులు... అశ్లీల వెబ్సైట్లు వీక్షించిన వారితో పాటు చూడని వారికీ ఈ ఈ–మెయిల్ బెదిరింపులు తప్పట్లేదు. నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిది మందీ ఈ కోవకు చెందిన వారే అని అధికారులు చెబుతున్నారు. అనేక డొమైన్లకు చెందిన ఈ–మెయిల్ ఐడీలను, పాస్వర్డ్స్ ను అనునిత్యం కొందరు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇలా సంగ్రహించిన వివరాలను డార్క్ నెట్ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. డీప్ వెబ్, డార్క్ వెబ్ గానూ పిలిచే ఈ డార్క్ నెట్ అనేది ఇంటర్ నెట్ ప్రపంచంలో అథోజగత్తు లాంటిది. సాధారణ బ్రౌజర్లు, విండోస్ ద్వారా ఎవరూ డార్క్ నెట్లోకి వెళ్లలేదు. దీనికి ప్రత్యేకమైన ట్రోజర్లు ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే డార్క్ నెట్లోకి వెళ్లి, బిట్ కాయిన్ల రూపంలో చెల్లింపు చేస్తూ సైబర్ క్రిమినల్స్ కొన్ని ఈ–మెయిల్ ఐడీలు, వాటి పాస్వర్డ్స్ ఖరీదు చేస్తున్నారు. వారందరికీ బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిస్తూ అశ్లీల వెబ్‌సైట్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ చూశారంటూ బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. నేరగాళ్లు పంపుతున్న మెయిల్స్‌లో తమ పాస్వర్డ్స్ సైతం ఉంటుండటంతో వీటిని అందుకున్న వాళ్లు ఆందోళనకు గురై పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిది మంది విషయంలో ఓ సారూప్యత ఉంది. వీళ్లందరూ వినియోగిస్తున్నది హాట్ మెయిల్.కామ్ కాగా... బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన వారంతా ఔట్లుక్.కామ్ వాడారు. వీరిలో కొందరికి వచ్చిన మెయిల్స్‌లో వారి ప్రస్తుత పాస్వర్డ్స్ కాకుండా గతంలో వినియోగించినవి పొందుపరిచారు. ఇలాంటి మెయిల్స్ వచ్చిన వాళ్లు భయపడవద్దని, తక్షణం తమ మెయిల్స్‌కు చెందిన పాస్ వర్డ్స్ మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నదీ నైజీరియా తదితర దేశాలకు చెందిన వారే అని అనుమానిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. -
‘కరోనా’ వెబ్సైట్లు ఓపెన్ చేయొద్దండి
సాక్షి, కర్నూలు: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడేందుకు యువత గూగుల్‌లో వెతుకుతున్నారు. అందుకు సంబంధించిన ఆర్టికల్స్‌ను కూడా చదువుచున్నారు. ఈ వైరస్ సమాచారంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో సైబర్ నేరగాళ్ల కూడా అదే రూట్లో వల వేస్తున్నారని ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మెయిల్, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వాటిని హ్యాక్ చేసేందుకు కరోనా వైరస్ పేరుతో వెబ్సైట్లు రూపొందించి యువతకు వల వేస్తున్నారని తెలిపారు. (కరోనాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం...అరెస్టు) పదుల సంఖ్యలో ఇలా కరోనా వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయని వాటిని సైబర్ క్రైం పోలీస్‌లు గుర్తించారని పేర్కొన్నారు. coronavirursstatus(.)space, coro navirus(.)zone, coronavir s-realtime(.com) bgvfr.coro navirusaware(.)xyz ఇవి చాలా డేంజరస్ డొమైన్స్ అని వీటిని క్లిక్ చేయవద్దని ఎస్పీ పేర్కొన్నారు. కరోనా వైరస్ అలర్ట్ వెబ్సైట్లు అసలు ఓపెన్ చేయొద్దని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సైబర్ ల్యాబ్ పోలీస్‌లకు గాని, సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
వాలెంటైన్స్ డే: ప్రేమికులకు గుడ్ న్యూస్...
సాక్షి, ముషీరాబాద్: ప్రేమికులకు గుడ్ న్యూస్... వాలెంటైన్స్ డే రోజున మీరు ఆనందంగా గడిపేందుకు, మీ లవ్‌ను ప్రపోజ్ చేసేందుకు, మీరు ప్రియుడు లేదా ప్రేయసికి సర్ప్రైజ్ గిఫ్ట్ లేదా పార్టీ ఇవ్వాలన్నా ఏమాత్రం కష్టపడనక్కర్లేదు. మీ కోసం ఆన్లైన్ సేవలు సిద్ధంగా ఉన్నాయి. లవర్స్ పాలిట ‘ఈవైబ్.కామ్’ వరంగా మారుతోంది. ఈ సైట్‌ను బిట్స్ పిలానిలో చదువుకున్న ఆంజనేయులు రెడ్డి, మెంఫిస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేసిన స్వాతి భావనకలు ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంలో డిన్నర్ ప్రేమికులిద్దరూ ప్రేమికుల రోజున కలసి డిన్నర్ చేసేందుకు ప్రత్యేకమైన ఆఫర్లను ఇస్తున్నారు వెబ్సైట్ నిర్వాహకులు. సిటీలోని టాప్ రెస్టారెంట్లు, హోటల్స్, రిసార్ట్స్‌లలో ఈ సేవలు అందిస్తున్నారు. ‘వాటర్‌ఫాల్ వ్యూ రొమాంటిక్ డిన్నర్, రొమాంటిక్ ఓపెన్ ఎయిర్ పూల్‌సైడ్ క్యాండిల్ లైట్, గ్రాండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అండర్ కబానా, బెస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్, ఎక్స్పీరియన్స్, కాజీ క్యాండిల్‌లైట్ డిన్నర్’లను మనకు నచ్చిన వ్యూ, డెకరేషన్స్లలో ప్లాన్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు నిర్వాహకులు. డెకరేషన్ అదుర్స్ లవర్ని సర్ప్రైజ్ చేసేందుకు డెకరేషన్ కూడా వీరు అదరహో అనేలా చేస్తున్నారు. కేక్ కటింగ్ ఫర్ కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌కి సర్ప్రైజింగ్ కేక్ కటింగ్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇటువంటి కేక్ కటింగ్ సర్ప్రైజ్ని ఇంట్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మనకు నచ్చే విధంగా డెకరేషన్ చేస్తారు. ప్రేమించుకునే రోజులను ఈ డెకరేషన్ ద్వారా గుర్తు చేస్తారు. చుట్టూరు డెకరేషన్ చేసి మధ్యలో మనకు నచ్చిన కేక్‌ని ఏర్పాటు చేస్తారు. ప్రియుడు లేదా ప్రేయసి ఆఫీస్ లేదా బయట నుంచి వచ్చే సరికి వారిని సర్ప్రైజ్ చేయడం విశేషం. కాగా వీటితోపాటు రొమాంటిక్ స్టేతో పాటు నచ్చిన ఫుడ్‌ని కూడా ఆఫర్ చేయడం విశేషం. లక్షకు పైగా ఈవెంట్లు వెబ్సైట్ ప్రారంభించిన 24 గంటల్లోనే పుట్టినరోజు పార్టీ నిర్వహించాలని ఆహ్వానం అందింది. 2014 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఒకటిన్నర సంవత్సరం వరకు.. కేవలం ఇద్దరు ఉద్యోగులతో మాత్రమే నడిచిన మా సంస్థ నేడు దాదాపు 200 మంది పార్టీ ప్లానర్స్‌కు ఉపాధి కల్పిస్తుంది. ఈవెంట్ మేనేజర్లకు, డెకరేటర్స్, ఫోటోగ్రాఫర్లకు వేదికగా మారింది. ఇప్పటివరకు దాదాపు 400 ప్రదేశాలలో 150 రకాల ప్యాకేజీలతో లక్షకు పైగా ఈవెంట్లు నిర్వహించాం. ఈ వాలంటైన్స్ డేకి మరిన్ని ప్లాన్స్‌తో ముందుకొచ్చాం. – ఫౌండర్స్, స్వాతి భావనక,ఆంజనేయులురెడ్డి -
సోషల్ మీడియాతో ఎక్కువ వ్యూస్
లండన్ : సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ వాడకం వల్ల వార్తల వెబ్సైట్లకు ఎక్కు వ్యూస్ వస్తాయని, ఎక్కువ వెబ్సైట్లను దర్శించే అవకాశం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. సామాజిక మాధ్యమాల వాడకం ప్రజలు చూసే వార్తల వైవిధ్యంపై ప్రభావం చూసుతుందని ఇప్పటివరకు నమ్మిన మూల సిద్ధాంతానికి పరిశోధకుల తాజా ఫలితం.. వ్యతిరేకంగా ఉంది. ఫేస్బుక్, గూగుల్‌లను వీక్షించేవాళ్లు ఎక్కువగా వార్తలకు సంబంధించిన అంశాలను చూస్తుంటారని, ఇంటర్నెట్లో వార్తల వినియోగానికి సామాజిక వినియోగానికి సామాజిక మాధ్యమాల వాడకం ముఖ్యమైన విధానమని జర్మనీలోని హోహెన్‌హీమ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్రాంక్ మాన్‌గోల్డ్ తెలిపారు. -
నుమాయిష్’ కేసు కొలిక్కి!
సాక్షి, సిటీబ్యూరో: నుమాయిష్ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేసి, అందులో ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన సమాచారాన్ని అక్రమంగా వినియోగించిన కేసు కొలిక్కి వచ్చింది. ఇందుకు బాధ్యుడైన వెబ్సైట్ నిర్వాహకుడు డి.మల్లికార్జునరావుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఎర్రగడ్డకు చెందిన మల్లికార్జునరావు కుమారుడు ఆర్టిజం బాధితుడు. దీనిపై అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్న అతను స్మైల్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దీని తరఫున 2017, 2018ల్లో ఎగ్జిబిషన్లో స్టాల్ ఏర్పాటు చేశారు. ఏటా నగరంలో నిర్వహిస్తున్న ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను నుమాయిష్‌గా పిలిస్తున్నప్పటికీ దీనికి ఓ ట్రేడ్ మార్క్ లేనట్లు గుర్తించాడు. దీంతో ముంబైలో ఉండే ట్రేడ్ మార్క్ జారీ సంస్థ నుంచి నుమాయిష్‌కు రిజిస్ట్రేషన్ పొందాడు. వాస్తవానికి ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పగించడానికే ఆయన ఈ ప్రక్రియ పూర్తి చేశాడు. ఇందుకు సంబం«ధించి మల్లికార్జునరావు గతంలో రెండు మూడుసార్లు ఎగ్జిబిషన్ సొసైటీని సంప్రదించి విషయం చెప్పాడు. అయితే వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ ట్రేడ్ మార్క్ ఆయన వద్దే ఉండిపోయింది. ఇదిలా ఉండగా మల్లికార్జునరావు నుమాయిష్ పేరుతో ఓ వెబ్సైట్ ( www.numaishonline.com) సైతం రిజిస్టర్ చేయించుకున్న నిర్వహిస్తున్నాడు. ఈ ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారమే జరిగింది. ఇటీవల ఎగ్జిబిషన్ సొసైటీపై హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్) అతడికి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. 2020 ఎగ్జిబిషన్‌కు సంబంధించి సమాచారాన్ని తన వెబ్సైట్లో ఉంచాలని భావించిన ఆయన ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన అధికారిక వెబ్సైట్ (www.exhibitionsociety.com) నుంచి కాపీ చేసి, తన దాంట్లో పేస్ట్ చేశారు. ఇది 2019 సంవత్సరానికి సంబంధించినది కావడంతో అందులో ఎగ్జిబిషన్లో 2900 దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఉంది. అయితే గత ఏడాది ఎగ్జిబిషన్లో జరిగిన అగ్నిప్రమాదానికి పరిమితికి మంచి దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వడమే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టులో కేసులు సైతం దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఎగ్జిబిషన్ సొసైటీ ఈ ఏడాది కేవలం 1500 దుకాణాల ఏర్పాటుకే నోటిఫికేషన్ ఇస్తున్నామని స్పష్టం చేయడంతో పాటు అమలు చేసింది. అయితే నుమాయిష్ వెబ్సైట్లో 2900 దుకాణాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉండటం, ఇది ఎగ్జిబిషన్ సొసైటీకి చెందినదే అని భావించడంతో ఓ వ్యక్తి దీని ఆధారంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో కోర్టుకు హాజరైన సొసైటీ నిర్వాహకులు నుమాయిష్ వెబ్సైట్ విషయం, అందులో ఉన్న సమాచారం తెలుసుకున్నారు. అది తమ అధికారిక వెబ్సైట్ కాదని స్పష్టం చేసిన సొసైటీ తమ అనుమతి లేకుండా తమ సైట్‌లోని పాత సమాచారం సంగ్రహించి, దుర్వినియోగం చేసినందుకు నుమాయిష్ వెబ్సైట్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు సాంకేతిక ఆధారాలతో మల్లికార్జునరావు బాధ్యుడిగా తేల్చారు. సోమవారం అతడిని సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు పిలిపించి వాంగ్మూలం నమోదు చేశారు. ఆపై ఆయనకు సీఆర్పీసీ 41 (ఎ) ప్రకారం నోటీసులు జారీ చేసి పంపారు. -
తప్పుల సవరణకు అవకాశం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ విషయంలోను ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాల్టికెట్లలో జరిగే లోపాల సవరణకు ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సైట్లోకి వెళ్లి తమ హాల్‌టికెట్‌లో తప్పులు ఏవైనా ఉంటే.. వాటిని సరి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. లోపాల సవరణకు ఆదివారం వరకు మాత్రమే వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా గత సంవత్సరం ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తప్పులు మరో సారి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 35,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తప్పొప్పుల సవరణ ఇలా.. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు బోర్డు సూచించిన వెబ్‌సైట్‌లోని వెళ్లి పదో తరగతి హాల్‌టికెట్ నంబర్‌తో ప్రథమ సంవత్సరం హాల్‌టికెట్ సరిచూసుకోవచ్చు. ఇక రెండో సంవత్సరం విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబర్‌తో హాల్‌టికెట్‌ను సరిచూసుకునేందుకు బోర్డు వెసులుబాటు కల్పిస్తుంది. ఆన్లైన్లో వచ్చిన హాల్‌టికెట్‌లో విద్యార్థి పేరు, తండ్రి, తల్లిపేరు, గ్రూప్, మీడియం, సెకండ్ లాంగ్వేజ్, పీహెచ్ కేటగిరి, సబ్జెక్టులు కట్టిన పరీక్ష ఫీజు వంటి తçప్పులు ఏవైనా ఉంటే వెంటనే విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి. ప్రిన్సిపాల్ కళాశాల లాగిన్లోకి వెళ్లి తప్పుల వివరాలను ఉన్నతాధికారులకు వివేదిస్తారు. ఈనెల 15వరకు బోర్డు అధికారులు తప్పుల వివరాలను సేకరించి, తర్వాత వాటిని సరిచేస్తారు. ఈ క్రమంలో అధికారులు తీసుకున్న చర్యల వల్ల హాల్‌టికెట్‌ల్లో తప్పులు ఉంటే విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అవకాశం ఉంది. దృష్టి సారించని విద్యార్థులు ఇదిలాఉండగా, ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలకు ముందే హాల్‌టికెట్లు, వాటిపై వివరాలను సరిచూసుకునేందుకు, తప్పొప్పులను సరిచేసేందుకు ఈ అవకాశం ఇవ్వగా.. విద్యార్థులు మాత్రం అంతగా ఆసక్తి చూపడంలేదు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సరిచేసుకోని యెడల పరీక్షల అనంతరం సర్టిఫికెట్‌పై సైతం అవే తప్పులు అచ్చయ్యే అవకాశం ఉంది. గతంలో ఇలా జరగగా.. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు తప్పుల సవరణ కోసం ఇంటర్ బోర్డు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. విద్యార్థులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు సరిచూసుకోవాలి జిల్లాలోని వివిధ ఇంటర్మీడియెట్ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తప్పకుండా తమ హాల్‌టికెట్, వివరాలు సరిచూసుకుని తప్పులు ఏవైనా ఉంటే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వాలి. వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకవేళ తర్వాత తప్పులు వస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. – వెంక్యానాయక్, జిల్లాఇంటర్మీడియెట్ శాఖ అధికారి,మహబూబ్‌నగర్ -
సిటీలో క్రికెట్ ఫీవర్.. వెబ్సైట్లు పనిచేయక ట్రబుల్స్
సాక్షి,సిటీబ్యూరో: భారత్– వెస్టిండీస్‌ల తొలి 20–20 క్రికెట్ మ్యాచ్ కోసం నగరం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ ఆర్జీఏ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున కోహ్లీతో పాటు టాప్ స్టార్ ఆటగాళ్లంతా అడనుండడంతో ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనీస టికెట్టు ధరను రూ.800గా నిర్థారించి ఆపై రూ.1000 నుంచి రూ.12500 నిర్ణయించారు. వీటి అమ్మకాలను టికెట్స్ ఈవెంట్ డాట్ ఇన్, ఈవెంట్స్ నౌ, పేటీఎం యాప్‌ల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. అయితే, కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ కాకపోవటంతో దళారులు బ్లాక్ మార్కెట్లో టికెట్ల బేరాలు మొదలుపెట్టారని పోలీస్‌లకు బుధవారం ఫిర్యాదులు అందాయి. మరోపైపు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు నగరం వేదిక కావడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచే స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉప్పల్ పరిసరాలను నిఘా నీడలో ఉంచారు. -
వలలోకి దించుతాయ్.. ఈ వెబ్సైట్లతో జాగ్రత్త!!
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): తియ్యటి మాటలతో యువకులను వలలో వేసుకుంటున్న వెబ్సైట్ నిర్వాహకులు కోలకతాలో కుప్పలు తెప్పలుగా ఉన్నారని సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపారు. శనివారం ఆయన కోల్‌కతాలో ఒక కాల్‌సెంటర్‌పై దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి సోమవారం నగరానికి చేరుకున్న సీఐ వి. గోపీనాథ్ సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపం అనే వ్యక్తి ఈ తరహా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న వీటిపై కోల్‌కతా పోలీసులకు అవగాహన లేదన్నారు. విశాఖ పోలీసుల చొరవతోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఆరు నెలల క్రితం బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న తాము గతంలో రెండుసార్లు కోల్‌కతా వెళ్లి ప్రయత్నించినా ఆచూకీ తెలియరాలేదన్నారు. స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డులు, గుర్తింపుకార్డులు మూడవసారి పకడ్బందీగా ప్రయత్నం చేయటంతో గుర్తించగలిగామని సీఐ గోపీనాథ్ వివరించారు. ఇందులో యువతులను కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకుంటున్నారని, తరువాత వారిని తమకు అనుకూలంగా మార్చి ఈ తరహా మోసాలకు గురి చేస్తున్నారని, అందుకు టార్గెట్లు, కమిషన్లు, బహుమతులు ఎరచూపి యువతులను వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. కాల్‌సెంటర్‌పై దాడి చేసి నప్పుడు 23 మంది యువతులతో పాటు, ఒక హెచ్ఆర్, ఆఫీస్ బాయ్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని అలిపూర్లో ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని తెలిపారు. వారి దగ్గర నుంచి 40 వరకు బేసిక్ ఫోన్లు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రూటర్, హార్డ్ డిస్కు, కొన్ని సిమ్‌లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు డిసెంబర్ 6న నగరంలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. వెబ్సైట్లతో జాగ్రత్త.. ఇంటర్నెట్లో పలు వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా పీపుల్ ఫ్రెండ్స్, కిన్ కీ, హానీ పికప్, ఫ్యాషన్, హాట్ టెంప్టేషన్ వంటి వెబ్సైట్లు ఉన్నాయన్నారు. చాలా వరకు తాము చేసిన దాడులతో వాటిని నియంత్రించగలిగామని తెలిపారు. ముఖ్యంగా వీరి వలలో నగరానికి చెందిన కొన్ని విభాగాల్లో ఉన్నతాధికారులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వివరించారు. యువత, ఉత్సాహవంతులు ఇలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. తేనెలా మాట్లాడుతూ నెమ్మదిగా తమ వలలోకి దించి వారి నుంచి లక్షల్లో డబ్బులు కాజేయటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
నెలకు పదివేల నుంచి లక్ష.. ఫ్రీలాన్స్ జాబ్స్ హవా!
మారుతున్న జీవన శైలి.. ఉరుకులు పరుగుల జీవితం.. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఆఫీస్‌కెళ్లి పనిచేయడం.. బాస్ తిడితే బాధపడటం.. సెలవు కావాలంటే ఇబ్బందిపడుతూ అడగటం.. ఇదీ రోజువారీ ఉద్యోగాలు చేసే సిటిజన్ల పరిస్థితి. అయితే ఇలాంటి ప్రహసన ఉద్యోగాలకు చెక్ పెడుతున్నారు కొందరు నగరవాసులు. తమకు నచ్చిన పని, నచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. వారికి వారే బాస్.. ఇళ్లే ఆఫీస్. ఇదే ‘ఫ్రీలాన్స్ జాబ్స్’ అంటే. ఇప్పుడు నగరంలో ఇదే ట్రెండ్‌గా మారింది. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటిజన్ల జాబ్ ట్రెండ్ మారింది. ఉరుకుల పరుగుల జీవితం. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని నిర్ణీత వేళకు ఆఫీసుకు వెళ్లి... ఎనిమిది నుంచి పది గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పట్టడం.. సెలవులు దొరక్క ఇబ్బందులు పడటం.. ఇప్పుడిలాంటి వాటికి చెక్ పెడుతున్నారు. ఇంట్లో కూర్చుని ఖాళీ సమయాల్లో తమ హాబీకి, టాలెంట్‌కు తగిన ఉద్యోగాన్ని వెదికిపెట్టే వెబ్సైట్లు బోలెడు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఉద్యోగాలకే సిటిజన్లు ఓటేస్తున్నారు. గృహిణులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వృత్తి నిపుణులు.. ఇలా మహానగరంలో ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తూ నెలకు పది వేల నుంచి లక్షకు పైగా ఆర్జిస్తున్నవారు లక్ష మందికిపైగానే ఉన్నారు. ప్రధానంగా మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, ట్రావెల్ ఎక్స్పర్ట్, ఫుడ్ బ్లాగర్, ఇంటీరియర్ డిజైనింగ్, మొబైల్ యాప్ తయారీ, వెబ్సైట్ మేకప్ తదితర ఫ్రీలాన్స్ జాబ్స్‌తో అత్యధికంగా ఉపాధి పొందుతున్నారు. పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్ చేసుకునే అవకాశం ఉండటం ఈ ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాల ప్రత్యేకత. ఇంకా బోలెడు.. ఫ్రీలాన్స్ ఇండియా, ఆన్కాంట్రాక్ట్ , డిజైన్హిల్ లాంటి ఫ్రీలాన్స్ జాబ్ వెబ్సైట్లను కూడా వేలాది మంది సంప్రదిస్తున్నారు. వీటికితోడు రెగ్యులర్ జాబ్ వెబ్‌సైట్స్ షైన్, లింక్డిన్, ఇండీడ్ లాంటి వాటిలోనూ జాబ్స్ వెతుక్కుంటున్నారు. హాబీల ద్వారా ఆదాయం.. పలువురు సిటిజన్లు తమ హాబీల ద్వారా కూడా ఫ్రీలాన్సర్‌గా డబ్బులు సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారు తమ ఫొటోలను కొన్ని వెబ్సైట్లలో తేలికగా విక్రయించుకొని ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇక సేవారంగంలో కొత్త తరహా వెబ్ సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. డోర్ స్టెప్ సర్వీసులు అందిస్తున్నాయి. అర్బన్ క్లాప్ డాట్ కామ్ తదితర వెబ్ సైట్లు కూడా సర్వీసులు అందిస్తూనే ప్రొఫెషనల్స్‌కు జాబ్ అవకాశాలు అందిస్తుండటం విశేషం. ఫైవర్ రెగ్యులర్ ఫ్రీలాన్స్ జాబ్స్‌తోపాటు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన జాబ్స్ ఈ వెబ్సైట్ ప్రత్యేకత. అంటే మీ వ్యక్తిగత నైపుణ్యాలను కూడా సొమ్ము చేసుకోవచ్చు. ట్రావెలింగ్ ఎక్స్పర్ట్, ఆర్ట్స్, హెల్త్, ఆస్ట్రాలజీ, ఆన్లైన్ లెసన్స్‌లాంటివి. వీటితోపాటు గ్రాఫిక్స్ అండ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, రైటింగ్, ట్రాన్స్లేషన్, ప్రోగ్రామింగ్, బిజినెస్ సెక్టార్లలో కూడా ఫ్రీలాన్స్ జాబ్స్ వెతుక్కోవచ్చు. మీ ఫ్రెండ్స్‌కు ఈ వెబ్‌సైట్‌ను రిఫర్ చేసి కూడా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఠీఠీఠీ.జజీఠ్ఛిటట.ఛిౌఝ అప్‌వర్క్ మన దేశంలో ఫ్రీలాన్సర్స్కు మంచి పార్ట్‌టైమ్ జాబ్స్ ఆఫర్లు ఇస్తున్న వెబ్సైట్ ఇది. ఇది అమెరికాకు చెందిన జాబ్ వెబ్సైట్. ఇంటర్నేషనల్ వెబ్సైట్ కావడంతో వేతనం కూడా ఆ మేరకే ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రైటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లాంటి రంగాల్లో ఫ్రీలాన్స్ జాబ్స్‌ను వెతుక్కోవచ్చు. ఇందులో ఫ్రీగా మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్ మీరు చేస్తే ఆ మొత్తంలో కొంత అప్‌వర్క్ తీసుకొని మిగతా డబ్బు మీకు ఇస్తుంది. ఠీఠీఠీ.upఠీౌటజు.ఛిౌఝ ఫ్రీలాన్సర్.కామ్ ఈమెయిల్ లేదా ఫేస్బుక్ ఐడీతో ఫ్రీలాన్సర్.కామ్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆసక్తి, నైపుణ్యమున్న వివిధ రంగాలను ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రీలాన్సర్ కల్పిస్తోంది. పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం స్టూడెంట్స్ ఈ వెబ్‌సైట్‌ను సంప్రదిస్తున్నారు. www.freelancer.com వర్క్ఎన్హైర్ ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే వెబ్‌సైట్స్‌లో ఇది ముందు వరుసలో ఉంది. ఎలాంటి గజిబిజి లేకుండా ఎవరైనా సింపుల్గావాడుకోవచ్చు. ఇండియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ వెబ్సైట్ ఇది. మీకు ఎలాంటి ఉద్యోగం కావాలో ఎంపిక చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్, పార్ట్‌టైమ్ జాబ్స్లాంటి కేటగిరీలు ఉంటాయి. www.worknhire.com ట్రూలాన్సర్ మన దేశంలో ఉన్న ఫ్రీలాన్స్ మార్కెట్‌పైనే దృష్టి సారిస్తున్న సైట్ ఇది. మన నైపుణ్యాలు కావాల్సిన విదేశీ కంపెనీల్లోనూ ఫ్రీలాన్స్ జాబ్స్ కోసం వెతుక్కునే అవకాశం ఉంటుంది. మీరున్న లొకేషన్‌ను బట్టి కూడా అక్కడ అందుబాటులో ఉన్న ఫ్రీలాన్స్ జాబ్స్ చూసుకోవచ్చు. www.truelancer.com -
అరచేతిలో ‘e’ జ్ఞానం
సాక్షి, బాపట్ల(గుంటూరు) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడో జరిగిన విషయాలను క్షణాల్లో మన ముందుంచడంతో పాటు, సక్రమంగా ఉపయోగించుకుంటే, చిన్న పిల్లల బొమ్మల దగ్గర నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన సమాచారం లభిస్తోంది. ఈ కోవలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు డిజిటల్ రూపంలో వివిధ వెబ్సైట్లలో లభిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేయలేని విద్యార్థులకు ఉచితంగా ఆయా పుస్తకాలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండటంతో ‘ఈ’ జ్ఞానం ఎంతో ఉపయోగకరంగా మారింది. గ్రంథాలయ శాఖ పుస్తకాలను డిజిటల్ రూపంలో ఉంచింది. ఇందులో నుంచి చాలా రకాలైన పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పుస్తకాలు అందుబాటులో.. మన దేశంలో 18 శతాబ్దంలో కోల్‌కతాలో పౌర గ్రంథాలయం, ఇంపీరియర్ గ్రంథాలయాలు ఉన్నాయి. 1953లో ఇంపీరియర్ గ్రంథాలయాన్ని భారత ప్రభుత్వం జాతీయ గ్రంథాలయంగా ప్రకటించింది. ఇక్కడ విలువైన వేలాది పుస్తకాలను భద్రపరిచారు. ఆ గ్రంథాలయంలోని పుస్తకాలను 2002లో ఇంటర్నెట్కు అనుసంధానించారు. ఇంటర్నెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) వారి సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అందులో విలువైన పుస్తకాలను డిజిటల్ రూపంలో చదువుకునేందుకు వీలుగా ఉంచింది. తిరిగి ఇచ్చేయవచ్చు ఇంటర్నెట్లో అనేక రకాలైన పుస్తకాలు లభ్యమవుతున్నా కాఫీరైట్ ఉన్న పుస్తకాలు లభించే అవకాశం లేదు. అలాంటి వాటిని కొనుగోలు చేయడం లేదా, అద్దెకు తీసుకునే అవకాశం కల్పించారు. రెంట్ మై టెక్ట్స్, కాఫీ కితాబ్ టెక్టŠస్ బుక్స్ వంటి వెబ్సైట్ల ద్వారా 30 నుంచి 70 శాతం వరకు పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త పుస్తకాలు చదవాలంటే వాటిని కొనుగోలు చేసి చదివిన తర్వాత తిరిగి ఇచ్చేస్తే, కొనుగోలు చేసిన ధరలో మనకు 70 శాతం నగదు మళ్లీ ఇచ్చేస్తారు. ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు ఉపయోగం ఇంజినీరింగ్, ఐటీ, మెడికల్ కోర్సులు చాలా ఖరీదైనవి. వాటికి సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.500 నుంచి రూ.1000 పైనే ధర ఉంటుంది. ఆ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఆయుర్వేదం, యునానీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పుస్తకాల ధర అధికంగా ఉన్నా, కొనుగోలు చేయాలన్నా మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైకోర్సులకు సంబంధించి పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ కోర్సుల పుస్తకాలు లభ్యం ఐఏఎస్, ఐపీఎస్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు సైతం ఉచితంగా ఈ గ్రంథాలయంలో దొరుకుతాయి. విజ్ఞానానికి పనికివచ్చే ప్రముఖుల జీవిత చరిత్రల పుస్తకాలు, చరిత్రాత్మక, విజ్ఞాన సంబంధం, వినోద సంబంధ పుస్తకాలు చదువుకోవచ్చు. పుస్తకాలు డౌన్‌లోడ్‌కు ఉపయోగించే వెబ్సైట్లు ► www.nationallibrary.com ► www.bookbum.com ► www.medicalstudent.com ► www.onlinelibrary.com ► www.rentmytext.com ► www.compitative.com -
‘కిడ్నీ డోనర్స్–బయ్యర్స్’పేరుతో వెబ్సైట్
నేరేడ్మెట్: కిడ్నీ విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా, గోవిందనగరం(అంబసముద్రం– తేని)కి చెందిన దీనదయాలన్ సూర్యాశివరామ్ శివ ( ‘కిడ్నీ డోనర్స్–బయ్యర్స్’పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన వారు కాంట్రాక్ట్ చేస్తే తాను కిడ్నీ ఫెడరేషన్లో ఏజెంట్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకునేవాడు. కిడ్నీ విక్రయించడానికి ఆసక్తి ఉన్న వారు అతడిని సంప్రదించగా ముందుగా ఫెడరేషన్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించాడు. ఇందుకు గాను తన ఖాతాలో రూ.15వేలు డిపాజిట్ చేయించాలని కోరేవాడు. అనంతరం వారి ఆధార్, పాన్, బ్యాంక్‌ఖాతా వివరాలు సేకరించే అతను ఆపరేషన్‌కు ముందు ఒప్పందం ప్రకారం 50శాతం డబ్బులు, తరువాత 50శాతం డబ్బులు చెల్లిస్తారని బాధితులను నమ్మించేవాడు. నకిలీ క్లయింట్ల జాబితాను తయారు చేసి, రూ.కోటి తన ఖాతాలో జమ అవుతున్నట్లు వచ్చిన నకిలీ ఎస్ఎంఎస్లను దాతల ఫోన్లకు పంపేవాడు. ఈ మేరకు ఫెడరేషన్ పేరుతో నకిలీ పత్రాలను తయారు చేసి ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా దాతలకు పంపించి నమ్మించేవాడు. పలువురిని నుంచి ఫీజుల పేరుతో ఖాతాల్లో నగదు జమ చేయించు కున్న అనంతరం వారి ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేవాడు. అతడి చేతిలో మోసపోయిన బాధిడుతు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ వివరాల ఆధారంగా నిందితుడిని నేరేడ్మెట్లో అరెస్టు చేశారు. అతడి నుంచి నకిలీ పత్రాలతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అవయవదానం చేయడానికి అనేక నిబంధనలు, చట్టాలు ఉన్నాయని, ఆన్లైన్లో ప్రకటనలు చూసి మోస పోవద్దని సీపీ సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందికి నగదు రివార్డులను ప్రకటించారు. -
అశ్లీల వీడియోలకు అడ్డుకట్ట వేయండి
సనత్‌నగర్: సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలు ప్రసారం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరారు. ఈ మేరకు మంగళవారం హోంమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. గాయత్రీ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్, ఝాన్సీ లక్ష్మిబాయి వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్లకు చెందిన పుష్పలత, దశరథ లక్ష్మి, ప్రొఫెసర్ కవిలత, జోయ, డాక్టర్ ప్రమీల, అనిత, జరీనా వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశ్లీల వీడియోల కారణంగా యువత పెడదోవ పట్టే అవకాశం ఉందన్నారు. అశ్లీల వీడియోలు ప్రసారం చేస్తున్న సామాజిక మాధ్యమాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత అత్యధికంగా వివిధ వెబ్సైట్లలో అశ్లీల చిత్రాలను చూస్తున్న కారణంగా మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు అశ్లీల వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 12 ఏళ్ల లోపు బాలికలపై లైంగికదాడికి పాల్పడితే ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రేణుకా ముదిరాజ్, కృష్ణగౌడ్, మధుగౌడ్, అనిత, సంగీత, నాగరాణి, తులసి తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం అందజేస్తున్న మహిళా సంఘాల ప్రతినిధులు... -
ఐసీసీ వరల్డ్‌కప్ : ఆ వెబ్సైట్లకు, రేడియో ఛానెళ్లకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్‌కప్ 2019ల మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆడియో ప్రసారం చేస్తున్న సుమారు 60 వెబ్సైట్లు, రేడియో ఛానెళ్లకు షాక్ ఇచ్చింది. ఛానెల్-2 గ్రూప్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీటి ఆడియో సేవలను ప్రసారం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జేఆర్ మిథా నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. అంతేకాదు దీనిపై సమాధానం ఇవ్వాలంటూ సంబంధిత వెబ్సైట్లకు, రేడియో ఛానెళ్లకు, ఇంటర్నెట్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు ఇంటర్నెట్, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సంబంధిత వెబ్సైట్లకు సంబంధించిన లింకులను తొలగించాలని సూచించింది. సన్నాహక మ్యాచ్‌లతో సహా మ్యాచ్‌లకు సంబంధించిన ఆడియోను ప్రసార హక్కులను పొందిన గ్రూప్ 2 ఛానల్ తమ ప్రత్యేకమైన, మేధో సంపత్తి హక్కులను కొన్ని వెబ్సైట్లు, రేడియో ఛానళ్లు దుర్వినియోగం చేశాయని ఆరోపించింది. తద్వారా తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతోందని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యూఏఈ ఆధారిత సంస్థ ఛానల్ 2 గ్రూప్ ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ నుంచి 2023 వరకు ప్రత్యేక గ్లోబల్ ఆడియో హక్కులను కొనుగోలు చేసింది. ప్రత్యేకమైన ఆడియో హక్కులను కలిగి ఉన్నప్పటికీ, ఇంటర్నెట్, మొబైల్ బ్రాడ్‌కాస్టర్ హాట్‌స్టార్‌కి అధికారికపార్టనర్గా ఉంది. ఐసీసీ క్రికెట్ కౌన్సిల్‌కు చెందిన వాణిజ్య సంస్థ ఐసీసీ బిజినెస్ కార్పోరేషన్‌తో కొన్ని సంవత్సరాల క్రితం ఆడియో హక్కుల ఒప్పందంపై సంతకాలు చేసింది. మే 30న మొదలైన ప్రపంచకప్ 2019 జులై 14 వరకు జరగనున్నసంగతి తెలిసిందే -
వెబ్సైట్, యాప్ లేకపోయినా చెల్లింపులు
బెంగళూరు: పేమెంట్ సొల్యూషన్ల కంపెనీ రేజర్‌పే నూతనంగా పేమెంట్ పేజెస్ అనే సర్వీస్‌ను ఆరంభించింది. అన్ని రకాల వ్యాపారస్తులు ఆన్లైన్ చెల్లింపులను స్వీకరించేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్టు ఈ సంస్థ తెలిపింది. ఎటువంటి హోస్టింగ్ వ్యయాలు, ఇంటెగ్రేషన్, నిర్వహణ చార్జీలు లేదా స్థిర ఫీజుల అవసరం ఇందులో ఉండదని పేర్కొంది. దేశ జీడీపీలో 30 శాతం వాటా కలిగిన చిన్న, మధ్య స్థాయి వ్యాపారుల్లో 68% మందికి వెబ్‌పోర్టళ్లు కానీ, యాప్స్ కానీ లేవని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆయా వ్యాపారులకు పేమెంట్ పేజీని ఐదు నిమిషాల వ్యవధిలోపే రేజర్ పే పెమెంట్ పేజెస్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది. -
ప్రాంతీయ భాషల్లో వెబ్సైట్లకు సర్వర్లు సిద్ధం
న్యూఢిల్లీ: తెలుగు సహా తొమ్మిది భారతీయ భాషల్లో వెబ్సైట్లను రిజిస్టర్ చేసుకునేందుకు ఉపయోగపడేలా అంతర్జాతీయ ఇంటర్నెట్ సర్వర్లు సిద్ధమవుతున్నాయి. జూన్ కల్లా ఈ ప్రక్రియ పూర్తి కాగలదని యూనివర్సల్ యాక్సెప్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ (యూఏఎస్జీ) చైర్మన్ అజయ్ డాటా తెలిపారు. ఈ తొమ్మిది భాషల్లో తెలుగు సహా తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతి, బెంగాలీ, ఒరియా మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లిష్ కాకుండా దేవనాగరి, అరబిక్, మాండరిన్, రష్యన్ తదితర కొన్ని భాషల్లో మాత్రమే వెబ్‌సైట్‌ను నమోదు చేసుకోవడానికి వీలుంటోంది. ఇంటర్నెట్ వెబ్సైట్ల పేర్లు తదితర అంశాలను సమీక్షించే అంతర్జాతీయ సమాఖ్య ఐకాన్‌లో భాగంగా యూఏఎస్జీ ఏర్పాటైంది. అరబిక్, హీబ్రూ, జపానీస్, థాయ్ తదితర భాషల్లో వెబ్సైట్ల నమోదుకు అవసరమైన ప్రమాణాలను రూపొందించే బాధ్యత దీనికి అప్పగించారు. -
ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రధాని కార్యాలయం సహా వివిధ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రుల చిత్రాలను తొలగించారు. అయితే కొన్ని మంత్రిత్వ శాఖల సైట్లలో మాత్రం మంత్రుల చిత్రాలను ఇంకా తొలగించలేదు. ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతాయని ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసీ ప్రకటన నుంచే ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో మంత్రులు, అధికారిక వర్గాలు పథకాలు, వాటికి నిధుల కేటాయింపులు జరపకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అధికార పార్టీ కానీ, మంత్రులు కానీ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాగే ప్రచారానికి అధికారులను ఉపయోగించుకోకూడదు. -
టీడీపీ వెబ్సైట్ క్లోజ్.. మళ్లీ ఓపెన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల డేటా చోరీతో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుందోననే భయంతో బుధవారం రాత్రి నుంచి పార్టీ వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో గురువారం రాత్రికి మళ్లీ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించింది. బుధవారం రాత్రి నుంచి టీడీపీ వెబ్సైట్ www. telugudesam. org తెరిస్తే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇప్పటికే డేటా చోరీ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో వెబ్‌సైట్‌లోని సమాచారం ద్వారా లేనిపోని ఇబ్బందులు వస్తాయనే కారణంతో దాన్ని నిలిపేసినట్లు తెలిసింది. నిలిపివేత వల్ల ప్రభుత్వం తప్పుచేసినట్లు ఒప్పుకున్నట్లేనని ప్రచారం జరగడంతో వెంటనే గురువారం రాత్రి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. -
నాన్నను మా అమ్మ ‘... మనిషి’ అని కులం పేరుతో తిట్టేది!
అయితే ఈ కథనం.. కులాంతర వివాహాల గురించి కాదు. పరువు హత్యలు జరిగినప్పుడు కులపట్టింపులపై జర్నలిస్టులు సంధించే ప్రశ్నల గురించి! ‘ఈ ధోరణి సరికాదు’ అని ఒక వెబ్‌సైట్‌కు రాస్తూ, తన తల్లిదండ్రుల జీవితాల్ని సమాజం ముందు పరిచారు ఆ అజ్ఞాత మహిళా జర్నలిస్టు. ‘‘మా తల్లిదండ్రులది ప్రేమ వివాహం. మా అమ్మ సంప్రదాయ నేత పనివారి కుటుంబంలో పుట్టింది. మా తాతయ్య దర్జీగా పనిచేసేవాడు. పేదరికం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, మా అమ్మని 1970 ప్రాంతంలో చదువుల కోసం మద్రాసు విశ్వవిద్యాలయానికి పంపాడు. అమ్మ బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి తన ఆరుగురు తోబుట్టువులకు అండగా ఉంటుందని భావించాడు తాతయ్య. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే బాగానే ఉంటుంది. అక్కడ చదువుకునే రోజుల్లోనే అమ్మకి మా నాన్నతో పరిచయం ఏర్పడింది. నాన్న దళిత కుటుంబానికి చెందినవాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, వివాహం చేసుకుందామనుకున్నారు. అగ్ర వర్ణంలో పుట్టిన అమ్మాయి, దళిత అబ్బాయిని వివాహం చేసుకోవడమేంటని అమ్మ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. మరోవైపు నాన్న దళితుడనే కారణంగా లిటరేచర్‌లో పి.హెచ్.డి. చేసే అవకాశం రాలేదు. ఒకవేళ నాన్న భయపడి తన గ్రామానికి Ðð ళ్లిపోతే, అక్కడ సైకిల్ రిపేర్ చేసుకుంటూ జీవనం సాగించవలసి వచ్చేది. ఇద్దరూ ధైర్యం చేశారు. బెంగళూరులో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో పార్ట్ టైమ్ జాబ్ చేయడం ప్రారంభించారు. నాన్నపై ఒత్తిడి తెచ్చారు వివాహం జరిగిన కొన్ని నెలల తరవాత, ఇరు కుటుంబాల వారు అమ్మనాన్నలను చూడటానికి వచ్చారు. నాన్న దళితుడు కావడంతో, తాతయ్య వాళ్లు నాన్నకి గౌరవం ఇవ్వకపోగా, అమ్మని చదివించడానికి అయిన ఖర్చు ఇవ్వమని ఒత్తిడి చేశారు. అమ్మకు ఒక బిడ్డ పుట్టి, రెండవసారి గర్భవతిగా ఉన్న సమయంలో, అమ్మ తోబుట్టువులు వచ్చి, డబ్బు కోసం ఒత్తిడి చేశారు. రెండుకుటుంబాలను పోషించడం కష్టం కావడంతో, ప్రసవించిన ఏడో రోజు నుంచి అమ్మ మమ్మల్ని ఇంట్లోనే ఉంచి ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. నేను పడుకున్న మంచం మీద నల్లులు కూడా ఉన్నాయి. నా పరిస్థితి చూసి అమ్మమ్మ వాళ్లు నన్ను వాళ్లతో తీసుకువెళ్లారు. నేను పుట్టిన రెండు సంవత్సరాలకి, అమ్మనాన్నలు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. దాంతో మళ్లీ అమ్మ దగ్గరకు వచ్చేశాను. మా ఆర్థిక పరిస్థితితో బాటు, అమ్మ వాళ్లకి మా బాధ్యతలు కూడా పెరిగాయి. అమ్మ వాళ్ల పుట్టింటివారిని, నాన్న వాళ్ల పుట్టింటివారినీ ఇద్దరినీ చూసుకునే బాధ్యత మరింత పెరిగింది. మా నాన్న తాను ఎందుకు డబ్బులు పంపలేకపోయాననే విషయం గురించి చెప్పబోతుంటే, ‘నువ్వు దళితుడివి. నీ మాటలు వినవలసిన అవసరం మాకు లేదు’ అని కఠినంగా మాట్లాడేవారు తాతయ్య. మా అమ్మ తన సోదరులకు, భర్తకు మధ్య నలిగిపోయేది. వారిని వెనకేసుకొస్తే నాన్నకి కోపం వచ్చేది. అమ్మానాన్నకు గొడవలు ఎక్కువైపోయాయి. అమ్మ విడిపోయింది అమ్మ తాను విడిగా ఉండటానికి నిశ్చయించుకుంది. అప్పటికి నా వయసు పది సంవత్సరాలు. నేను, మా అన్నయ్య ఇద్దరం నాన్నతోనే కలిసి ఉన్నాం. రానురాను బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. మా సెలవులన్నీ ఇంటికే పరిమితమైపోయాయి. ఏ పండుగను బంధువులతో జరుపుకునే అవకాశం లేకపోయింది. కేవలం చావుల సమయంలో మాత్రమే బంధువులు వస్తున్నారు. ప్రపంచం చాలా ఇరుకుగా కనిపించింది. మా అమ్మ తన ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడుపుతోంది. మా నాన్న ఎక్కడికైనా వెళ్లినప్పుడు అమ్మ ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్లేది. కొన్ని సంవత్సరాల తరవాత అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి బంధువులు ప్రయత్నించలేదు. ఇద్దరినీ కలపడానికి ఎవరూ లేకపోవడంతో వారి బంధం కూలిపోయింది. మా అమ్మనాన్నల మధ్యన వచ్చిన గొడవల కారణంగా, మా అమ్మ మా నాన్నను ‘... మనిషి’ అని కులం పేరుతో తిడుతుండేది. మా నాన్న బాధతో, ‘నేను బతికున్నంత కాలం ఈ మాటలు వింటూ ఉండవలసిందే’ అనేవారు. తల్లిదండ్రుల గొడవలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి. నా మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేకపోయాను. కులం నన్ను కూడా వెంటాడుతూనే ఉంది. నా కులం గురించి చెప్పగానే, అవతలి వారు విధించే నిబంధనలు వినడానికి నేను సిద్ధంగా లేను. దళితులను కులాంతర వివాహం చేసుకుంటే, బంధువుల నుంచి తెగదెంపులు ఎదుర్కోక తప్పడం లేదు. మనలో మతసహనం లోపిస్తోందనడానికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నెన్నో. ఏటా జరిగే ఉత్సవాలకు కూడా దళితులను గుడి వెలుపల నుంచి మాత్రమే పూజలు చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. గ్రామాలలో ఈ విషయంలో ఇంతవరకు మార్పు రాలేదు. ఇంకా ప్రమాదం ఏమిటంటే.. హింస జరిగినప్పుడు మాత్రమే మతసహనం గురించి ప్రస్తావిస్తున్నారు. మిగతా సమయాల్లో కులరహిత సమాజం వైపుగా చైతన్యం తెచ్చే ప్రయత్నాలను మనమెందుకు చెయ్యం? అనిపిస్తుంది’’ అని ఆ జర్నలిస్టు ఆలోచన రేపారు. ‘పరువు కోసం’ అని రాయకండి గతేడాది నవంబర్ పదహారు తమిళనాడు ప్రజలకి కాళరాత్రిని మిగిల్చింది. ‘గజ’ తుపాను బీభత్సం సృష్టించింది. ఆ తుపానులో కొట్టుకొచ్చిన రెండు మానవ దేహాల ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక యువ జంటను చంపేసి, కావేరీ నదిలోకి విసిరేశారు. వారివే ఆ మృతదేహాలు. ఆ అమ్మాయి వెనుకబడిన కుటుంబంలో పుట్టింది. అబ్బాయి దళితకులానికి చెందినవాడు. వారిలో ఈ దళితుడు అణగారిన వర్గానికి చెందినవాడి కింద లెక్క. సంప్రదాయాన్ని మైలపరచినందుకుగాను అమ్మాయి కుటుంబీకులు ఆ జంటను దారుణంగా హత్య చేశారు. దక్షిణ భారతదేశంలో ఇటీవల పరువు కోసం జరిగిన వరుస హత్యలలో ఇది మూడో హత్య. ఇటువంటి హత్యలు జరిగినప్పుడు, జర్నలిస్టులు ఆ ప్రాంతానికి చేరుకుని, ఆయా కుటుంబాల వారిని ప్రశ్నించి, కేసు పూర్వాపరాలు తెలుసుకుంటారు. ప్రతి కేసులోనూ ‘పరువు కోసం యువజంట దారుణ హత్య’ అనే రాస్తారు. నిత్యజీవితంలో కులం గురించి మరచిపోలేమా అనేది పక్కన పెడితే, వీటిపై ప్రత్యేక వార్తా కథనాలు ఇచ్చేటప్పుడు జర్నలిస్టులు ‘పరువు కోసం’ అంటూ తీర్పులు ఇచ్చేయకుండా.. సామాజిక ధోరణులను మలిచేలా సమస్య మూలాల్ని విశ్లేషించాలని ‘స్క్రాల్.ఇన్’లో వ్యాసం రాసిన ఆ పాత్రికేయురాలు కోరుతున్నారు. – జయంతి (‘స్క్రాల్.ఇన్’ ఆధారంగా) -
మీ నేత గురించి తెలుసుకోండి ఇలా..
షాద్‌నగర్ టౌన్: ఎన్నికల సంగ్రామంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులు నియమావళి ప్రకారం నామినేషన్‌కు సంబంధించిన పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, వారిపై నమోదైన కేసులు, ఆదాయ మార్గాలు, విద్యార్హతల గురించిన వివరాలను తెలుసుకోవాలని ఆయా నియోజకవర్గ ఓటర్లకు కుతూహలంగా ఉంటుంది. ఒక్క క్లిక్‌తో అన్ని విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్లను అప్లోడ్ చేసింది. (ceotelangana.nic.in) అనే వెబ్సైట్లో అభ్యర్థుల అఫిడవిట్లను అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్ ఎలక్షన్ 2018 ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే ఎన్నికల నియమ నిబంధనలు, నోటిఫికేషన్, ప్రభుత్వ ఉత్తర్వులు, అఫిడవిట్లు ఇలా రకరకాల వివిధ రకాల సమాచారం కనిపిస్తుంది. దానిలో అఫిడవిట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయగానే జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకోగానే అందులో నామినేషన్ వేసిన అభ్యర్థుల అఫిడవిట్లు కనపిస్తాయి. అందులో అభ్యర్థికి సంబంధించిన సమగ్ర సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. అఫిడవిట్‌కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
కాల్ గర్ల్ పేరిట వేధింపులు...
సాక్షి బెంగళూరు: కొత్తకొత్త సాంకేతికతలు పెరుగుతున్న కొద్ధీ నేరాల తీరు కూడా పెచ్చు మీరుతోం ది. అందులో సైబర్ నేరాల తీరు తెన్నులను అంచనా వేయడం, నిందితులను పట్టుకోవడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. ఈ క్ర మంలో మరో కొత్త సైబర్ నేరం పోలీసులకు తలనొప్పిగా మారింది. అశ్లీల వెబ్సైట్లలో వేరే ఎవరో యువతి ఫోటోపై వేరే ఎవరో ఫోన్ నంబర్ పెట్టి కాల్ చేయమని కొందరు నిందితులు యువతీ యువకులను వేధిస్తున్నారు. పోలీసులు ఈ కొత్తరకమైన నేరానికి ‘మొబైల్ రివెంజ్’ అని పేరు పె ట్టారు. ప్రస్తుతం వందలాది మంది నగర యువతీ యువకులను ఈ మొబైల్ రివెంజ్ విపరీతంగా వేధిస్తోంది. అశ్లీల వెబ్సైట్లో వేరే ఎవరో యువతి ఫోటో... అశ్లీల వెబ్సైట్లలో వేరే ఎవరో అర్ధ నగ్నంగా లేదా నగ్న ఉన్న ఫోటోలపై వేరే ఎవరో యువతి ఫోన్ నంబర్‌ను పెట్టి కాల్ గర్ల్ పేరిట మొబైల్ నంబర్ ను ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల గురిం చి మౌఖికంగా సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ రివెం జ్‌కు సంబంధించి ఒక యువకుడు ఈ నెల 2న నగర పోలీసు కమిషనర్ టి.సునీల్ కుమార్‌కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. అశ్లీల వెబ్సైట్లో వేరే ఎవరో యువతి ఫోటోపై తన నంబర్‌ను పెట్టారని అప్పటి నుంచి రోజూ ఫోన్ కాల్స్‌తో మానసికంగా వేధిస్తూన్నారని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల తన కుటుంబం ఎంతో ఇబ్బందుకు గురవుతుందని,తనసమస్యకు పరిష్కారం చూపాలనిఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. మొబైల్ రివెంజ్ అంటే.. మీ మొబైల్‌కు అనుమానస్పద వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చి.. ‘రాత్రి, పగలు ఎంత?, ఎక్కడున్నావ్, ఏ ఏరియా, రేటు ఎంత, ఏ స్థలానికి రావాలి??’ లాంటి ప్రశ్నలు విన్నారా!! ఇలాంటి తరహా ప్రశ్నలు వచ్చాయంటే అనుమానమే లేకుండా మీరు ‘ౖమొబైల్ రివెంజ్’కు బలి అయినట్లే.. మీ మొబైల్ నంబర్‌ను వేరే ఎవరో అశ్లీల వెబ్సైట్లో పెట్టినట్లు అర్థం. అందుకే మీకు ఇలాంటి తరహా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అశ్లీల వెబ్సైట్లో అర్ధనగ్నంగా ఉన్న యువతి ఫోటోపై మీ నంబర్ పెట్టి ‘నేను కాల్ గర్ల్.. లైంగిక సేవ కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయండి’ అంటూ కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పూనుకుంటున్నారు. ఆ సైట్లో మీ ఫోన్ నంబర్ చూసిన వ్యక్తులు లైంగిక సేవ కోసం ఫోన్లు చేస్తూ వేధిస్తూనే ఉంటారు. ఇలాంటి తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు సైబర్ పోలీసులు తెలిపారు. యువకులను విడిచిపెట్టడం లేదు.. వేరే ఎవరో యువతి ఫోటోపై వేరే మరో యువతి మొబైల్ నంబర్‌ను పెట్టి వేధిస్తున్న ఆకతాయిలు.. యువకులను సైతం విడిచిపెట్టడం లేదు. అశ్లీల వెబ్సైట్లలో యువతి అర్ధనగ్న ఫోటోలపై యువకుల నంబర్లను కూడా పెట్టి వేధిస్తున్నారని తెలిసింది. ఈ మొబైల్ రివెంజ్‌పై చాలా మంది సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వచ్చి మౌఖికంగా ఫిర్యాదులు చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి విరుద్ధ చర్యలకు వేరే ఎవరో అపరిచితులు పాల్పడడం లేదని చెబుతున్నారు. కేవలం పరిచయం ఉన్నవారు, సంబంధికులే ఇలాంటి పోకిరీ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. పలాన వ్యక్తిపై అసహనం, కోపం లేదా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్ధేశంతోనే తెలిసిన వారే ఇలాంటి ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో వెలుగులోకి వస్తోందని తెలిపారు. ఇలాంటి మొబైల్ రివెంజ్‌కు పాల్పడే వారిపై బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా మొబైల్ రివెంజ్‌కు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు తరలిస్తామని పోలీసులు హెచ్చరించారు. -
లొకంటో.కామ్ ...ఎరగా కాల్‌గాళ్స్
స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా పొందుపరుచుకోవడానికి ఉద్దేశించిన ‘లొకంటో.కామ్’ అక్రమాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఈ సైట్‌ను వేదికగా చేసుకుని నిలువునా ముంచే మోసగాళ్ల సంఖ్య పెరుగుతోంది. దానిద్వారా సైబర్ నేరస్తులు వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. గడిచిన నెలరోజుల్లో మూడు ఉదంతాలు బయటపడడం కలకలం రేపుతోంది. వెలుగులోకి రాని వ్యవహారాలు చాలానే ఉన్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. దీనిద్వారా మోసపోయినవారు బయటకు చెప్పుకోలేక గుట్టుగా ఉంటున్నట్టు భావిస్తున్నారు. నేరస్తులు ఇంటర్నెట్ నుంచి తీసిన జూనియర్ ఆర్టిస్టుల ఫొటోలను పోస్ట్ చేసి ‘ఆసక్తి’ ఉంటే తమను సంప్రదించాల్సిందిగా వాట్సప్ నంబర్లు ఇస్తున్నారు. ఎవరన్నా ఫోన్ చేస్తే.. ఆడవారే మాట్లాడుతున్నారు. తాము ‘అన్నింటికీ’ సిద్ధమని ఉచ్చులోకి దింపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా పొందుపరిచేందుకు ఉద్దేశించిన ‘లొకంటో.కామ్’ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఈ సైట్‌ను వేదికగా మోసాలకు పాల్పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత నెల రోజుల్లోనే మూడు ఉదంతాలు వెలుగులోకి వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. వివిధ కారణాల నేపథ్యంలో గుట్టుగా ఉండి పోతున్న వారి సంఖ్య పదుల్లో ఉంటుందన్నారు. ఉత్తరాదికి చెందిన వారే సూత్రధారులుగా ఈ నేరాలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వ్యభిచారం పేరుతో... ఈ సైట్‌ను దుర్వినియోగపరుస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా వ్యభిచార దందాను ఎంచుకుంటున్నారు. ఇంటర్నెట్ నుంచి సంగ్రహించిన, పరిచయస్తులైన వారితో పాటు జూనియర్ ఆర్టిస్టుల ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వీటితో పాటు తమ సెల్ నెంబర్లు ఇస్తూ ‘ఆసక్తి’ ఉంటే కాల్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే అందమైన గొంతుతో ఉండే యువతులు, స్త్రీలు మాట్లాడుతున్నారు. పోస్ట్ చేసిన ఫొటోలో ఉన్నది తామేనని, అన్నింటికీ సిద్ధమే అంటూ పూర్తిగా ఉచ్చులోకి దింపుతున్నారు. కలుసుకోవాలంటే కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు నిస్తున్నారు. వీటిలో డబ్బు పడిన తర్వాత సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని నిండా ముంచుతున్నారు. వాట్సాప్ కాల్స్... పేటీఎం పేమెంట్స్... ఈ మోసగాళ్ల తరఫున మాట్లాడుతున్న మరికొందరు యువతులు, మహిళలు మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రకటనల్లో ఇస్తున్న ఫోన్ నెంబర్లకు ‘ఓన్లీ వాట్సాప్’ అంటూ పొందుపరుస్తున్నారు. వీరిని ఎవరైనా సంప్రదించాలన్నా... వీరు ఎవరితోనైనా మాట్లాడాలన్నా అన్నీ వాట్సాప్ కాల్స్ ద్వారానే. ఈ కాల్స్ చేయడానికి ఫోన్లో సిమ్ ఉండాల్సిన అవసరం లేకపోవడం, కేవలం నెట్ ఉంటే సరిపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా వీరు ఎక్కడ నుంచి కాల్స్ చేస్తున్నారన్నది గుర్తించడం సాధ్యం కాదు. మరోపక్క బాధితుల నుంచి తీసుకునే నగదు కూడా బ్యాంకు ఖాతాల్లో వేయించుకుంటే పోలీసులకు ఆధారాలు లభించే అవకాశం ఉండటంతో పే టీఎం యాప్ వినియోగిస్తున్నారు. దీనిని కూడా బోగస్ వివరాలతో యాక్టివేట్ చేసుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు. నెలలో మూడు ఉదంతాలు... కీసర ప్రాంతానికి చెందిన గణేష్ లొకంటో.కామ్‌ను ‘ఆశ్రయించాడు’. సినీ తారలతో పాటు అనేక ఫొటోలను ఇందులో పోస్ట్ చేసిన గణేష్ వీరంతా కాల్‌గరల్స్ అంటూ పేర్కొని, ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ డబ్బు డిమాండ్ చేశాడు. ఓ క్యారెక్టర్ నటి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గణేష్ కటకటాల్లోకి చేరాడు. బెంగళూరుకు చెందిన ఓ యువతి బేగంపేట చిరునామాతో లొకంటోలో పోస్ట్ చేసింది. అందులో తాను అన్ని రకాల మసాజ్‌లు చేస్తానని, ఆసక్తి ఉన్న వారు వాట్సాప్‌లో సంప్రదించాలని కోరింది. వారి నుంచి బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయించుకుని బేగంపేటకు చెందిన తప్పుడు చిరునామా ఇచ్చింది. అనేక మంది ఈమె వల్లో పడి మోసపోయారు. లొకంటో మోసాలకు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ స్ట్రింగ్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాడు. ఓ ప్రకటన జారీ చేసిన వారితో సంప్రదింపులు జరపడంతో పాటు బేరసారాలు పూర్తి చేశాడు. చివరకు రూ.10 వేలు పేటీఎం ద్వారా బదిలీ చేసి ట్రాక్ చేయాలని ప్రయత్నించాడు. ఆ ఫోన్ నెంబర్, పేటీఎం ఉన్న నెంబర్ సైతం బోగస్విగా తేలడంతో దర్యాప్తు ముందుకు వెళ్లలేదు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం లోకంటో సైట్ కేంద్రంగా జరుగుతున్న నేరాలు ఇటీవల పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేయడంతో పాటు వీటికి చెక్ చెప్పడానికి చర్యలు తీసుకుంటున్నాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. బాధితుల బలహీనతే ఇలాంటి నేరగాళ్లకు క్యాష్‌గా మారుతోంది. అనేక మంది తాము మోసపోయామనే విషయాన్నీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. లోకంటోలో వ్యభిచారం పేరుతో వచ్చే ప్రకటనలు పూర్తి మోసపూరితం అని గుర్తుంచుకోవాలి. – జి.చక్రవర్తి, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్స్ విభాగం -
1662 వెబ్సైట్లు, కంటెంట్ బ్లాక్..
సాక్షి, న్యూఢిల్లీ : వదంతులు, బూటకపు వార్తలు వ్యాప్తి చేస్తోన్న వెబ్సైట్లను, అందులోని కంటెంట్‌ను సామాజిక మాధ్యమ వేదికల నుంచి తొలగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం మంగళవారం తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు 1662 ఫేక్ వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1076 యూఆర్ఎల్(యూనిఫాం రీసోర్స్ లొకేటర్)లను బ్లాక్ చేయాల్సిందిగా కోరగా.. ఫేస్బుక్ 956 యూఆర్ఎల్లను బ్లాక్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా ట్విటర్ 728కి 409, యూట్యూబ్ 182కు 152 , ఇన్స్టాగ్రామ్ 66 యూఆర్ఎల్లను బ్లాక్ చేసినట్లు లోక్‌సభలో వెల్లడించారు. జనవరి, 2017 నుంచి జూన్ 2018 వరకు వీటిని బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఏను అనుసరించి సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వదంతుల కారణంగా దేశ వ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వదంతుల ప్రచారానికి ఉపయోగపడుతున్న వేదికలను కూడా ప్రేరేపకాలుగానే భావిస్తామని, అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. వదంతులను ప్రచారం చేస్తున్న పోకిరీలు వాడే సాధనాలు తమ బాధ్యత, జవాబుదారీతనం నుంచి తప్పించుకోజాలవని పేర్కొన్న కేంద్రం.. అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. -
నిఘా రాజ్యంగా మారుస్తారా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ డేటాపై నిఘా పెట్టేందుకు సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పౌరులందరి కదలికలు, సంబంధాలపై పూర్తి నిఘా ఉండే రాజ్యంలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారా?’ అంటూ కేంద్రానికి కోర్టు మొట్టికాయలు వేసింది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ తదితర అన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్ట్‌లు, సందేశాలతోపాటు వార్తా వెబ్సైట్లు, బ్లాగులలో ప్రచురితమయ్యే కథనాలను సేకరించి, విశ్లేషించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ యంత్రాంగం ఏర్పాటు కోసం ఈ ఏడాది మే నెలలో కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ టెండర్ పిలిచింది. బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) అనే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఈ టెండర్ జారీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు మహువా మొయిత్రా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడంతో విషయం సుప్రీం కోర్టుకు చేరింది. రెండు వారాల్లో స్పందించండి.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం మహువా పిటిషన్‌ను విచారించింది. దీనిపై 2 వారాల్లో స్పందించాలంటూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. పిటిషన్ విచారణలో అటార్నీ జనరల్ వేణుగోపాల్ లేదా ఎవరో ఒక న్యాయాధికారి తమకు సాయంగా ఉండాలని ఆదేశించింది. మహువా తరఫున న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సోషల్ మీడియా హబ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో, ఈ–మెయిల్స్‌లో వచ్చే పోస్ట్‌లు, సందేశాలను విశ్లేషించాలనుకుంటోందని కోర్టుకు చెప్పారు. పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతా హక్కును కాలరాయాలని ప్రభుత్వం చూస్తోందని, రాజ్యాంగంలోని అధికరణాలు 14, 19(1)(ఎ), 21ల ద్వారా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులకు భంగంకలిగేవీలుందని వాదించారు. టెండర్‌ను ప్రభుత్వం ఆగస్టు 20న తెరవనున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో అంతకంటే ముందే, ఆగస్టు 3కు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. సోషల్ మీడియా హబ్ ఏర్పాటు చేయకుండా కేంద్రాన్ని అడ్డుకునేందుకు జూన్ 18నే అత్యవసర విచారణ జరపాల్సిందిగా మహువా కోరినా అప్పట్లో కోర్టు నిరాకరించింది. ఏ అధికారం లేకుండానే ప్రభుత్వం ప్రజల జీవితాల్లోకి చొరబడాలనుకుంటోందనీ, భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు సహా పలు ప్రాథమిక హక్కులకు దీని ద్వారా భంగం కలుగుతుందని మహువా పిటిషన్లో పేర్కొన్నారు. టెండర్లో ఏముంది? టెండర్లో తాము కోరుకుంటున్న సాఫ్ట్వేర్ యంత్రాంగం ఎలా ఉండాలో కేంద్రం వివరించింది. సామాజిక మాధ్యమాలతోపాటు, వార్తల వెబ్సైట్లు, బ్లాగులు తదితరాల్లోని డిజిటల్ సమాచారాన్నంతా ప్రాంతాల వారీగా దేశ వ్యాప్తంగా సేకరించి, ఆటోమేటిక్‌గా విశ్లేషించగలిగేలా సాఫ్ట్వేర్ ఉండాలి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఒక్కో జిల్లాలో కొంతమంది మీడియా వారిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకుంటారు. ఆటోమేటిక్‌గా సమాచారాన్ని వ్యూహాత్మకంగా విశ్లేషించి నివేదికలు ఇచ్చేలా సాఫ్ట్వేర్ ఉండాలి. ప్రత్యేకించిన వెబ్సైట్లో సమాచారాన్ని ప్రచురించగలగాలి. కేంద్రం చేపట్టే వివిధ పథకాల ఆన్లైన్ ప్రచార కార్యక్రమాల ప్రభావం ప్రజలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా అవకాశం ఉండాలని టెండర్లో ప్రభుత్వం పేర్కొంది. -
రక్తంతో కథ రాయండి
‘నైన్.. ఎ మూవ్మెంట్’ పేరుతో మే 25న ఒక వెబ్సైట్ ప్రారంభం కాబోతోంది. గర్ల్స్.. ఇందులో మీరూ భాగస్వాములు కావచ్చు. మీ మెన్స్ట్రువల్ స్టోరీలను షేర్ చేసుకోవచ్చు. రుతుక్రమం ప్రారంభం అయ్యేనాటికి భోలీ వయసు పన్నెండేళ్లు. తొలిసారి తన ఒంట్లోంచి వచ్చిన రక్తపు చారికను చూడగానే భయపడిపోయి తల్లి దగ్గరకు పరుగు తీసింది. ‘నువ్వు పెద్దమనిషివి అయ్యావు. ఇక నుంచీ కుదురుగా ఉండాలి’ అని తల్లి చెప్పింది. భోలీ ‘హా!’ అంది. తల్లి ఆమెను గుండెలకు హత్తుకుంది. మెత్తటి ఎండు గడ్డిని తెచ్చి, పలుచటి గుడ్డలో చుట్టి ‘ఇదిగో.. దీనిని అదిమి ఉంచు. రక్తాన్ని పీల్చుకుంటుంది’ అని చెప్పింది. ‘‘ఐదు రోజులు నువ్వు ఇంట్లోకి రాకూడదు. ఆ గొడ్ల చావిడిలోనే ఉండాలి’’ అని చెప్పింది. ఇదంతా భోలీకి వింతగా తోచింది. గడ్డి.. గొడ్ల చావిడి ఆ తర్వాత మూడు నెలలు భోలీ ఇలాగే చేసింది. నెలసరి రాగానే గుడ్డలో చుట్టిన గడ్డిని అదిమి ఉంచడం, గొడ్లచావిడిలో ఉండటం! అయితే ఆ గడ్డిలోంచి ఒక పురుగు ఆమె జననాంగంలోకి వెళ్లిన సంగతి ఆమెకు తెలీదు. చివరికి ఇన్ఫెక్షన్ అయి, ఆమె గర్భసంచిని తొలగించవలసి వచ్చింది. భోలీ ఇక ఎప్పటికీ తల్లి కాలేదన్న చేదు నిజం తెలిసి, తల్లి కుదేలైపోయింది. ‘నెలసరి వయసు’లో ఉన్న బాలికలు, మహిళల సంఖ్య ఇండియాలో 35 కోట్ల 50 లక్షల మంది వరకు ఉంది. వీరిలో దాదాపు 82 శాతం మంది రుతుస్రావాన్ని ఆపడానికి పాత గుడ్డపేలికల్ని, ఇసుకను వాడుతున్నారు! చదువు లేకపోవడం, చెప్పేవాళ్లు లేకపోవడం, పేదరికం.. ఇలాంటి అనేక కారణాల వల్ల రుతుక్రమాన్ని ఆరోగ్యవంతంగా దాటడం అనే హక్కును వీళ్లు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇప్పుడు ‘నైన్’ అనే ఉద్యమం మొదలైంది. నూటికి ఎనభై మంది ఇంతే! రుతుక్రమ పరిశుద్ధత కోసం ‘18 టు 82 బ్రిడ్జ్ ది గ్యాప్’ అనే నినాదంతో ‘నైన్’ ముందుకు వస్తోంది. పైన మీరు చదివిన భోలీ అనే బాలిక కథ నైన్ విడుదల చేసిన వీడియోలోనిదే. 18 అన్నది శానిటరీ నేప్కిన్లు వాడుతున్న మహిళల శాతం. 82 అన్నది.. భోలీలా అనారోగ్యకరమైన విధానాలు పాటిస్తున్న మహిళల శాతం. దేశంలోని మహిళలందరికీ మెరుగైన రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ప్యాడ్లను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అమర్ తులసియన్ అనే సోషల్ ఆంట్రప్రెన్యూర్ ‘నైన్’ అనే ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ‘నైన్.. ఎ మూవ్మెంట్’ పేరుతో మే 25న ఒక వెబ్సైట్ ప్రారంభం కాబోతోంది. సైట్ హోమ్ పేజీలో కనిపిస్తున్న రెండు అందమైన కళ్లను బట్టి నైన్ అనే పేరును ‘నయన’అనే అర్థంలో వాడారని తెలుస్తోంది. గర్ల్స్.. ఇందులో మీరూ భాగస్వాములు కావచ్చు. మీ మెన్స్ట్రువల్ స్టోరీలను షేర్ చేసుకోవచ్చు. రుతుక్రమ పరిశుభ్రతపై సదస్సు మే 28 ‘మెన్స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ డే’. వచ్చే ఐదేళ్లలో రుతుక్రమ పారిశుద్ధ్యంపై అవగాహన కోసం తను ఏం చేయబోతున్నది ‘నైన్’ ఆ రోజున వెల్లడిస్తుంది. ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రంతో ఇదే అంశంపై అనేక ప్రచార ఉద్యమాల్లో పాల్గొన్న అక్షయ్ కుమార్‌తో పాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, ఎన్జీవోలు, థాట్ లీడర్లు.. అంతా ఆరోజు జరిగే భారీ సదస్సులో మెన్స్ట్రువల్ హైజీన్ పై మాట్లాడతారు. ‘పైకి మాట్లాడదాం. పాత అలవాటును మాన్పిద్దాం’ అనే థీమ్‌తో ముంబైలో ఈ సదస్సు జరగబోతోంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఇల్లు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మహిళను ఆరోగ్యంగా ఉంచే బాధ్యత ఇంటిదీ, సమాజానిదే. -
రంగుల చీకటి
సూర్యుడు రాత్రి మొఖం మీద చీకటి దుప్పటి లాగేశాడు, నా భార్య పొద్దు పొద్దున్నే నా మొఖం మీద నుంచి లాగేసినట్టు. మా పెళ్లిరోజు ఆ రోజు. ప్రతి సంవత్సరం మా పెళ్లిరోజుని నేను కచ్చితంగా మరచిపోయానను కుంటుంది నా భార్య. కానీ నేను అలా ఎప్పుడూ మరచిపోలేదు. అందుకు కారణం నా భార్యే. మూడు నెలల ముందు నుంచే ఏదో ఒక విషయంలో, ఏదో ఒక నెపంతో నాకు ఆ విషయాన్ని కచ్చితంగా గుర్తు చేస్తుంటుంది. రాత్రి పడుకోబోయే ముందు కూడా ‘‘రేపైనా బయటకు తీసుకెళ్తావా లేదా..’’ అని అడిగింది. ‘‘ఎందుకు?’’ అన్నాన్నేను, నాకూ ఏమీ తెలియనట్టు.హాళ్ళో టీవీ ఆన్ చేసి బెడ్రూమ్ వైపు దొంగ చూపులు చూస్తోంది, నాకు పెళ్లిరోజు గుర్తుందా లేదా అని. నాకసలు ఆ విషయమే గుర్తులేనట్టు తన దగ్గరకొచ్చి నాకోసం టేబుల్‌పై పెట్టిన టీ అందుకొని పెదాలకి ఆనించుకుంటూ.. ‘‘పెళ్లి రోజు శుభాకాంక్షలోయ్’’ అన్నాను తన వైపు చూడకుండా. ‘‘పర్వాలేదే.. పెళ్ళయి ఆరు సంవత్సరాలైనా మన పెళ్లిరోజుని బాగానే గుర్తుంచుకున్నావు’’ సంతోషంగా అంది తను. ఎందుకో, ఆరోజు నాకు తనని ఇంకొంచెం ఆనందంలోకి తీసుకెళ్లాలనిపించింది. అలా చెయ్యడానికి సిగ్గుగా వున్నా, కొంచెం కష్టంగా వున్నా, ఇష్టం లేని పని అయినా కూడా బుగ్గ మీద ముద్దు పెట్టి ‘‘నువ్వు నా అదృష్టానివోయ్, నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాన్నో’’ అని కౌగిలించుకున్నాను. నా భార్య నిజమని నమ్మి ‘‘అవునా’’ అంటూ గారాలు పోతూ నన్ను కౌగిలించుకుంది. ‘‘ఎందుకు మా అమ్మని పట్టుకున్నావ్...’’ అంటూ ఏడుపు మొఖంతో బయటకు వచ్చాడు నా మూడేళ్ళ కొడుకు. ‘‘పట్టుకోలేదమ్మా! ముద్దు పెడుతున్నా’’ అన్నాను వాణ్నెత్తుకొని ముద్దు పెడుతూ. ‘‘ఛీ! ఊరుకో.. మంచి మాటలు చెప్తున్నావ్ పిల్లోడికి’’ అని వాణ్నెత్తుకొని వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళింది. నేను పెట్టిన ముద్దు గురించే ఆలోచిస్తున్నట్టు వుంది నా భార్య, అందుకే త్వరత్వరగా వాడికి గ్లాసుడు పాలిచ్చి టీవీలో కార్టూన్ చానల్ పెట్టి మళ్ళొచ్చి నా పక్కన కూర్చుంది. దగ్గరగా జరిగి కూర్చుంటూ ‘‘మరి ఈ రోజు ఆదివారం కదా.. బయటకి వెళ్దామా’’ అంది. ‘‘తప్పకుండా వెళ్దాం. కానీ నేను అడిగే ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెప్తేనే నిన్ను బయటకు తీసుకెళ్తా’’ అన్నాను, ఆదివారం పెద్దగా పనులేమీ లేకపోవడంతో. ‘‘అడుగు’’ అన్నది తను. ‘‘నేను నిన్ను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నాను?’’ అన్నాను. దీర్ఘంగా ఆలోచిస్తూ... ఆ రోజులోకే వెళ్లిపోయినట్టు మొఖం పెట్టి ‘‘ఆ రోజు నేను పింక్ చుడీదార్ వేసుకొని, నా ఫేవరేట్ భరతనాట్యం డాన్సర్ మౌనికా నటరాజన్ డాన్స్ ప్రోగ్రాం చూద్దామని ఆడిటోరియంకి వచ్చినప్పుడు చూశాను నిన్ను. చక్కగా పక్క పాపటి తీసుకొని వైట్ షర్ట్ బ్లూ ప్యాంటు వేసుకొని టక్ ఇన్ చేసుకొని వచ్చి నా పక్కన కూర్చున్నావ్. ఆ రోజు ఎందుకో మౌనికా నటరాజన్ డాన్స్ సగంలోనే ఆపేసి వెళ్లిపోయినప్పుడే కదా నీ పర్స్ నాకు దొరకడం, నేను నీకు ఫోన్ చెయ్యడం, ఆ నెపంతో నువ్వు నాకు రోజూ కాల్ చెయ్యడం... నాకన్నీ గుర్తున్నాయ్’’ అంది నా భుజంపై తలవాలుస్తూ. థ్యాంక్ గాడ్! ఆ ప్రశ్న ముందుగా నేనే అడిగాను. తనే అడిగుంటే నాకు అవేవీ గుర్తుకులేవని తెలిసేది. మనసులో నాకు నేను భుజం తట్టుకొని, ‘‘అమ్మో నాలాగే నీకు అన్నీ గుర్తున్నాయన్న మాట’’ అన్నాను నవ్వు నటిస్తూ. ‘‘కానీ మనం కలుసుకోవడం, ఫోన్లు చేసుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం చాలా విచిత్రంగా వుంది కదా ఇప్పుడు తలుచుకుంటుంటే. నేనసలు అనుకోలేదు నిన్ను ప్రేమిస్తానని, పెళ్లి చేసుకుంటానని’’ తను అలా మాట్లాడుతున్నప్పుడు కొంచెంసేపు మా ఇద్దరి మధ్యలో ఒక రకమైన నిశ్శబ్దం వచ్చి చేరింది. ఆ నిశ్శబ్దంలో నాకు కూడా అనుకోకుండా ఆ రోజులు, ఆ ఫోన్లు, ఆ పరిచయాలు, ఆ చిలిపి సరదాలు, చిన్న గొడవలు.. అలా ఒక దండెంపై ఆరేసున్న తెల్లటి గుడ్డ మీద ఎవరో నా జీవితాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నట్టు కనిపించీ కంపించకుండా నాలో ఒక ప్రశాంతతని కలుగజేసింది. ‘‘నిజమే’’ అన్నాన్నేను అదే మూడ్‌లో. ‘‘ఒకవేళ నేను ఆ రోజు అక్కడ నీ పక్కన కూర్చోకుండా ఉండుంటే, నీ పర్స్ నాకు దొరకుండా ఉండుంటే, నేను నీకు ఫోన్ చెయ్యకుండా ఉండుంటే, ఇప్పుడు మనం ఎక్కడ వుండే వాళ్ళమంటావ్.. నువ్వు ఎవర్ని పెళ్లి చేసుకొని ఉండేవాడివి.. వీడి పరిస్థితి ఏమయ్యేది? తలచుకుంటుంటే వింతగా వుంది కదా’’ అంది నా భుజం మీదనుంచి పైకిలేస్తూ. అప్పటిదాకా నాలో వున్న ప్రశాంతత ఒక అలజడిలా మారిపోయింది.అవును కదా! ఏమి జరిగి వుండేది? తను ఎవర్ని పెళ్ళిచేసుకొని వుండేది? నేనెవర్ని పెళ్లి చేసుకొని వుండేవాడిని? నేనెక్కడ వుండేవాడిని.. తనెక్కడ వుండేది? ఈ పిల్లాడు ఏమయ్యి వుండేవాడు? ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్న, ఇంకో ప్రశ్నకి పది ప్రశ్నలు కలిసిపోతూ ఒక ప్రశ్నల వలయం నా మెదడు చుట్టూ చేరి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మా ఆఫీసర్ నన్ను చెడామడా తిట్టేస్తున్నాడు, నాకీ మధ్య మతిమరుపు ఎక్కువ అయ్యిందని. చాలాసార్లు టక్ ఇన్ చేసుకోవడం మర్చిపోతున్నానంట. పక్క పాపటి కాదుకదా అసలు తలే దువ్వుకోవడం లేదంటా. నా భార్య ప్రతి విషయాన్నీ నాకు గుర్తు చెయ్యాల్సి వస్తోందంట, విసుక్కుంటోంది ప్రేమగా. నా కొడుకు నా దగ్గరకి ఎక్కువగా రావడం లేదు. నేను ఆ జాతకాలు చెప్పేవాడి దగ్గరే ఎక్కువ సమయం గడుపుతున్నానని నా ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం నాకు వింతగా వుంది. ఈ మధ్య నేను ఇంటర్నెట్లో వెతుకుతున్న వెబ్సైట్లు చూసి నా కొలీగ్స్ కొందరు నన్ను సైకియాట్రిస్టుని కలవమని సలహాలు ఇస్తున్నారు. ఆ రోజు నేను మా పెళ్లిరోజుని నిజంగానే మర్చిపోయాను. నా భార్య నాకు ఎన్నోసార్లు ఆ విషయాన్ని గుర్తుచేసే వుంటుంది. కానీ నాకు ఎందుకో ఆ విషయం నిజంగా గుర్తులేదు. నా భార్య నా మీద అలిగింది. నేనెలాగైనా తనని సంతోషపెట్టాలని అనుకుంటున్నా కానీ ఏం చేయాలో నాకర్థం కావడం లేదు. పాపం తను మాత్రం నేను పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పకపోయినా ఎప్పటిలాగే నా భుజంపై వాలి ఈ రోజు బయటకి వెళ్దామా అని అడుగుతోంది. ఐ లవ్ యూ అని ముద్దు కూడా పెట్టింది, నా కొడుక్కి తెలియకుండా. నాలో చలనం లేదు. స్పందన లేదు. తిరిగి ముద్దు పెట్టాలని వున్నా ఎందుకో పెట్టలేకపోతున్నా.‘‘సరే నీకోసం ఈ రోజు నేనో కొత్త డిష్ చేస్తా’’ అని నవ్వుతూ వంట గదిలోకి వెళ్ళింది. నా మనసులో మాత్రం సంవత్సరం కిందట మొదలైన అలజడి ఇంకా తగ్గలేదు. ఆ రోజు అక్కడికి నేను వెళ్ళకుండా ఉండుంటే ఏమయ్యేది? నేను నా పర్స్ పోగొట్టుకోకుండా ఉండుంటే ఏమయ్యేది? తను ఆ పర్స్ తీసుకొని నాకు ఫోన్ చెయ్యకుండా ఉండుంటే ఏమయ్యేది? తను ఎవర్ని పెళ్లి చేసుకొని వుండేది? నేను ఎవర్ని పెళ్లి చేసుకొని వుండేవాడిని? వీడు ఏమయ్యేవాడు? నేను ఏమయ్యేవాడిని? తను ఏమయ్యేది? ప్రశ్నకి ప్రశ్నలు కలుస్తూ నా బుర్రలో మెదడుకి బదులు ప్రశ్నలు మాత్రమే వున్నాయేమో అనిపిస్తోంది. నా భార్య తను ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్న కొత్త వంటకమేదో తెచ్చి నా ముందు పెట్టి తినమని లోపలికి వెళ్ళింది. నా కొడుకు నా జేబులోంచి ఫోన్ తీసుకొని వాడికి కావాల్సిన గేమ్ ఏదో ఆడుతున్నాడు. నా ఎదురుగా టీవిలో వస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్స్ నన్ను ఏమాత్రం కదిలించలేకపోతున్నాయ్. అసలు నువ్వు మనిషివేనా.. స్పందనలు లేని వెధవ్వా అని తిట్టుకుంటూ సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు. నేను కూడా. ఆ రోజు రాత్రి నా నుదుటి మీద వలయాకారంలో ఒక పచ్చని చిక్కటి రంగేదో పడుతోంది. దాన్ని నేను తుడుచు కోలేకపోతున్నాను. పొయ్యొద్దని ఆ పోసే వాడికి చెప్పలేకపోతున్నాను. ఆ పోస్తుందెవరో తెలియడం లేదు. ఆ రంగులో నేను ఆడిటోరియం ముందు నుంచొని వుండటం నాకు కనపడుతోంది. నేను లోపలికి వెళ్తున్నా. ప్రతి మెట్టు నేనే ఎక్కుతున్నా. నా కాళ్ళకి ఆ స్పర్శ, నా కళ్ళకి ఆ దృశ్యం, నా చెవులకి ఆ శబ్దం వినపడుతోంది. లేదు.. నేనే నిజంగా అక్కడ వున్నాను. మౌనికా నటరాజన్ డాన్స్ గురించి రాసివున్న ఒక పాంప్లేట్ నా చేతికి ఇస్తూ నన్ను లోపలికి ఆహ్వానించాడు సెక్యూరిటీ గార్డ్. నా సీటు ఎక్కడో వెతుక్కొని నేను దాన్లో కూర్చున్నా. ఆ పేపర్ని నా పర్స్‌లో పెట్టుకుందామనుకొని కూడా పర్స్ బయటకు తీయకుండా ఆ పేపర్ని షర్టు జేబులో పెట్టుకున్నా. మౌనికా నటరాజన్ డాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా. తెరలు తొలిగాయి. మౌనికా నటరాజన్ డాన్స్ మొదలయ్యింది. నా నుదుటిపై నారింజ రంగు పడుతోంది. పచ్చరంగంతా ఇంకిపోతోంది. నారింజ రంగులో దృశ్యం సరిగా కనిపించడం లేదు. ఆ రంగు మొత్తం చెరిపేసుకుంటుంటే, ఎవడు పోస్తున్నాడో తెలియదు గానీ అతి చిక్కటి ఎర్రటి రంగు, ఆ నారింజ రంగుపై. ఎర్రటి రంగు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆ రంగు మెరిసిపోతోంది. చీకట్లని చీలుస్తోంది. గుండ్రంగా మారి దూరంగా వెళ్లి సూర్యునిలా మారిపోయింది. కళ్ళు తెరిచాను. మా ఇంట్లోనే వున్నాను. నా జేబులో మౌనికా నటరాజన్ డాన్స్‌కు సంబంధించిన పాంప్లేట్ అలాగే వుంది. నిజంగానే వుంది. దాన్ని నేను తాకగలుగుతున్నా, మడవగలుగుతున్నా. అది ఆరు సంవత్సరాల క్రితం పాంప్లేట్. నాకొచ్చింది కలలా లేదు కానీ నేను ఈ రోజు ఈ ఇంట్లో ఉండటమే నాకు కలలా వుంది. నా భార్య నాకు టీ తెచ్చిస్తుంటే తను కలలో టీ తెచ్చి ఇస్తున్నట్టు వుంది. కానీ ఆ టీ వేడిగా వుండటం నేను ఇంట్లోనే వున్నానని గుర్తుచేసింది. ఆ పాంప్లేట్ నా జేబులోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు.మా ఆవిడకి చెబుదామన్నా దాన్ని నమ్మదు సరికదా నాకు పిచ్చి పట్టిందని నవ్వుకుంటుంది. అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇంకెవరైనా ఎలా నమ్ముతారు? అందుకే ఎవరూ నమ్మని దాన్ని మనం నమ్ముతున్నప్పుడు దాన్ని ఎవ్వరికీ చెప్పకపోవడమే మన నమ్మకానికి మంచిదని నేను దాని గురించి ఎవరి దగ్గరా ప్రస్తావించలేదు. కానీ నాకా రంగులు కావాలి. చీకట్లో స్పష్టంగా కనపడే రంగులు కావాలి. కాలం కర్పూరంలా కాలిపోతోంది. ఆ రంగులను వెతికే క్రమంలో పండువెన్నెల లాంటి నా కొడుకు అందాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. మంచు ముద్ద లాంటి నా భార్య ప్రేమని పంచుకోలేకపోతున్నాను. నేను చేస్తున్న ఉద్యోగంలో నా పని మాత్రమే వుంది. నేను లేను. నాకు కావాల్సింది చీకట్లో కనపడే ఆ రంగులు. ఆ రంగుల లోకం. అందుకే వెలుగు మీద కోపాన్ని, చీకటి మీద ప్రేమని పెంచుకున్నాను. నాకిప్పుడు చీకటి పతీవ్రత లాగా, వెలుగు వేశ్యలా కనిపిస్తోంది. రాత్రయింది. నిద్ర రావడం లేదు. నిద్రరాకపోతే రంగులు రావు. రంగులు రాకపోతే నాకు నిద్ర రాదు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ అది నటన అని నాకూ తెలుస్తోంది. నటిస్తే నటన వస్తుంది కాని నిద్ర రాదుకదా. నిద్రకు దూరంగా చాన్నాళ్ళు అలాగే ఉండిపోయాను. నిద్రరాక అల్లాడిపోయాను. నా భార్య, నా కొడుకు ఎంత సంతోషంగా నిద్రపోతున్నారో. ఎవరైనా నిద్ర అప్పిస్తే బాగుండుననిపిస్తోంది. ఎవరైనా నిద్రని అమ్మితే బాగుండుననిపిస్తోంది. ఆలోచనల్లో పడిపోయాను. ఆ రోజెందుకో నిద్రపోయాను. అదుగో రంగు. చిక్కటి పచ్చటి రంగు ఒక ధారలా నా నుదిటిపై పడుతోంది. నా నుదిటిపై పడ్డ రంగంతా నా మెదడులోకి ఇంకిపోతోంది. నా కళ్ళు పచ్చగా మారాయి. ఆ పచ్చటి రంగు వెనుక మౌనికా నటరాజన్ తను చేస్తున్న నృత్య ప్రదర్శన ఆపేసి బయటకు పరిగెట్టడం కనపడింది. పోలోమని అభిమానులు, మీడియా వాళ్ళు తన వెంటపడుతున్నారు. ఆవిడ మీద వున్న పిచ్చి అభిమానంతో నేను కూడా బయటకు పరిగెత్తాను. నేను బయటకు వెళ్లేసరికి తను మాయమయ్యింది. బహుశా కారెక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు.పార్కింగ్‌లో వున్న నా టూవీలర్‌ని స్టార్ట్ చేస్తున్నప్పుడు వెనుకనుంచి నా మీద చెయ్యి వేసింది మౌనిక నటరాజన్. ‘‘నన్ను మా ఇంటి దాకా డ్రాప్ చెయ్యగలరా? ప్లీజ్’’ అని అడిగింది. నమ్మలేకపోయాను. తనని నా బండిపై ఎక్కించుకోకుండా ఉండలేకపోయాను. ‘‘ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వగలరా...’’ అని అడిగింది. ‘‘మీరడిగితే ఫోన్ ఏంటి.. ప్రాణమయినా ఇస్తాను. మీరంటే నాకంత అభిమానం’’ అన్నాను ఫోన్ ఇస్తూ. ‘‘డాడీ.. వాడెళ్ళిపోయాడా? హి ఈజ్ చీటర్ డాడీ, ఐ డోంట్ లైక్ హిమ్. వాడికి చెప్పండి నేనిక వాడి మొహం చూడనని. ఆ.. ఇంటికే వస్తున్నా. నా అభిమాని బండి మీద. పర్లేదు.. నన్నెవ్వరూ గుర్తు పట్టర్లే. నేను నా మొఖానికి ముసుగు వేసుకొని వున్నాను. ఇంకొంచెం సేపట్లో అక్కడ ఉంటా’’ తను మాట్లాడుతూనే వుంది. నాకు వాడెవడో, అసలు తనకు వచ్చిన కష్టమేంటో తెలుసుకోవాలని చాలా ఆశగా వుంది. తను ఫోన్ మాట్లాడటం ఆపిన తరువాత ‘‘మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనుకుంటున్నా’’ అన్నాను. ‘‘చెప్పండి’’ అంది తను. నారింజ రంగు ధార నా నుదిటిపైన. ‘ఓహ్ షిట్’ దాన్ని తప్పించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. నా వల్ల కావడం లేదు. నాకు తెలుసు.. ఎర్ర రంగు వస్తుందని. అది రాక ముందే ఈ నారింజ రంగుని తుడిపేసుకోవాలని నా రెండు చేతులతో బలంగా ప్రయత్నిస్తున్నా. కొంచెం పోతోంది. మరింత పడుతోంది. నారింజ రంగుని పూర్తిగా నాశనం చెయ్యగలిగాను. మౌనికా నటరాజన్‌ని చూడగలుగుతున్నా కానీ నాకు తను మాట్లాడుతున్నదేదీ వినపడటం లేదు. తన మాటలకి బదులుగా యేవో శబ్దాలు. ఏదో ఫ్యాక్టరీలలో వచ్చే ప్రమాద సంకేతపు సైరన్ శబ్దాలు. ఎర్ర రంగు రానే వచ్చింది. దాన్ని చెరపడం నా వల్ల కాలేదు. కళ్ళు తెరిస్తే నా పక్కలో హాయిగా నిద్రపోతున్న నా కొడుకు, వాడి పక్కన నా భార్య. ఇద్దరూ చాలా అందమైన వాళ్ళు. వాళ్ళు దొరకడం నా అదృష్టం. ఎందుకో ఆ సమయంలో నా కొడుకుని గట్టిగా హత్తుకోవాలనిపించింది. వాణ్ని తీసుకొని నా మీద పడుకోపెట్టుకున్నాను. ఆ అలికిడికి నా భార్య లేచి వాణ్ని, నన్ను చూసి, ‘‘మమ్మల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకుంటున్నావా ఏంటి..’’ అంది నవ్వుతూ. ఆ వెంటనే నిద్రలోకి జారుకుంది. నా కొడుకుని గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టి వాడి చెవిలో ‘‘నువ్వే నా ప్రాణం రా’’ అన్నాను. వాడు నవ్వాడు. లేదు. వాడు నవ్వినట్టు నేను ఊహించుకున్నాను. నా ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ లిఫ్ట్ చేసి ‘‘హలో ఎవరూ’’ అన్నాను. ‘‘నేను మౌనికా నటరాజన్‌ని... ఇంటికి క్షేమంగా చేరేరా?’’ అంది అటునుంచి. నేను ఒకేసారి రెండు కాలాల్లో ఎలా జీవించగలుగుతున్నానో అర్థం కావడం లేదు. నా భార్యని ప్రేమిస్తూనే మౌనికా నటరాజన్‌ని కలవకుండా ఉండలేకపోతున్నాను. ఆ చీకటిలో వచ్చే రంగుల్లో నేనో కొత్త జీవితాన్ని గడపడం నాకే చాలా వింతగా వుంది. నేనసలు బతికున్నానా, చచ్చిపోయనా అర్థం కావడం లేదు. నేను బతికే వుంటే ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన మౌనికా నటరాజన్‌ని ఎలా కలవగలుగుతున్నాను? తనని తాకగలుగుతున్నాను. ముద్దు పెట్టుకోగలుగుతున్నాను. కౌగిలించుకోగలుగుతున్నాను. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం బాగుందో, మౌనికా నటరాజన్‌తో నా జీవితం బాగుందో ఏమాత్రం అర్థం కావడం లేదు. నాకు నా భార్య మీద వల్లమాలిన ప్రేమ వున్నా, మౌనికా నటరాజన్‌ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. మనసులో ఒకర్ని ఊహించుకుంటూ భార్యతో శారీరకంగా కలిసుండే చాలామంది మగాళ్ళ లాగే నేను సంస్కారవంతంగా బతుకుతున్నాను. మనకు నష్టం జరగనంత వరకూ రెండు జీవితాల్ని ఎంజాయ్ చెయ్యడం నాకేమీ తప్పనిపించలేదు. నిన్న రాత్రి తనని పెళ్లి చేసుకోమంది మౌనికా నటరాజన్. వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నాడు. నా భార్యకు అన్యాయం చేస్తానేమో అని భయంగా వుంది. నా ముద్దుల కొడుకుని వదిలెయ్యాల్సి వస్తుందేమోనని భయంగా వుంది. అలాగని మౌనికా నటరాజన్‌తో పెళ్లిని అంగీకరించకుండా ఉండలేకపోయాను. మౌనికా నటరాజన్‌తో రేపే నా పెళ్ళి. రంగులు మొదలయ్యాయి... పెళ్ళిలో తోరనాళ్ళ మంటపాళ్ళా. మౌనికా నటరాజన్ తెరకవతల, నేను ఇవతల. మౌనికా నటరాజన్‌ని పెళ్లి చేసుకుంటున్నానన్న ఆనందంలో వున్న నాకు నా భార్య గుర్తుకు రాలేదు. కొడుకూ గుర్తుకు రాలేదు. కావాలనే నేను గుర్తుకు తెచ్చుకోలేదు. మౌనికా నటరాజన్ నా తల మీద జీలకర్రా బెల్లం పెట్టింది. నేను కూడా. తనని చూడాలన్న ఆశ క్షణక్షణానికీ పెరిగిపోతోంది. గట్టి మేళం గట్టి మేళం అన్నాడు పంతులు గారు. ఆనందంగా తాలిబొట్టు కోసం వంగాను. నారింజ రంగు నుదుటి మీద. ధార లాగా. చెరిపేస్తున్నా. చెరిపెయ్యడానికి పోరాడుతున్నా. పోవడం లేదు. నేను వదలడం లేదు. మౌనికా నటరాజన్ ఆ రంగులో కలిసిపోతోంది. నన్ను విడిచి పోతోంది. నేను తన చెయ్యిని పట్టుకున్నాను. ఎర్ర రంగు మొదలయింది. నా శక్తినంతా కూడదీసుకొని ఎర్ర రంగుని వదిలించుకుంటున్నా. పోస్తున్న వాడికి దండం పెడుతున్నా ఆపమని. మౌనికా నటరాజన్‌ని పెళ్లి చేసుకోవాలనే కోరికలోంచి వచ్చిన బలంతో.. ఎర్రరంగుని వచ్చిన దాన్ని వచ్చినట్టు తుడిపేసుకుంటున్నా. ఎర్రరంగు అయిపోయే కొద్దీ వింత శబ్దాలు మొదలయ్యాయి. పోలీస్ సైరన్ లాంటివి, ఫ్యాక్టరీ సైరన్ లాంటివి. చెవులు పగిలిపోతున్నాయ్. కానీ నేను ఎర్రరంగుతో పోరాడుతున్నా. ఆశ్చర్యం. ఎర్రరంగు అయిపోయింది. కానీ రంగుల ధార ఆగలేదు. రకరకాల రంగులు నా నుదుటి మీద. ఒకదాని తరువాత ఒకటి. రంగులన్నీ కలసిపోయి వింత రంగు ఒకటి నాకు నన్నే కనపడకుండా చేసింది. ఆ వింత రంగు చీకటిలా మారి, కటిక చీకటిలా మారి, ధారలా కారుతున్న రంగులన్నింటినీ తనలో కలిపేసుకుంది. దాని వెనకాల మౌనికా నటరాజన్ మొఖం చంద్రబింబంలా, సూర్యతేజంలా వెలిగి పోతూ, నాకోసం, నేను కట్టబోయే తాళి కోసం, తలవంచుకొని ఎదురుచూస్తోంది. తాళి కట్టాను. నేను జయించాను. మౌనికా నటరాజ¯Œ ని సొంతం చేసుకున్నాను. అక్కడ వున్న ప్రజలంతా హర్షధ్వానాలతో, ఆనంద బాష్పాలతో మాపై అక్షింతల వాన కురిపించారు. ఆ అక్షింతల వానలో హటాత్తుగా పిడుగు పడ్డట్టు నా తలపై ఎవరో ఇనుప కమ్మీతో గట్టిగా కొట్టారు. నేను కిందకి పడిపోయాను. ‘‘ఇలంగో! ప్లీజ్ డోంట్ డూ దట్. అతణ్ని వదిలేయ్. చచ్చిపోతాడు. నీకు దండం పెడతా. అతను అమాయకుడు’’ అంటూ పెద్ద పెద్దగా అరుస్తోంది మౌనికా నటరాజన్. ఇలంగో నా మీద చాలా కోపంమీద ఉన్నట్టున్నాడు. నా తలపై ఇంకో దెబ్బ కొట్టాడు. ‘‘నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. అతన్నొదిలెయ్ ఇలంగో.. ప్లీజ్...’’ అంటూ ఇలంగో కాళ్ళు పట్టుకుంది మౌనికా నటరాజన్.చాలా నొప్పిగా వుంది. ఆకాశం వైపుకి చూస్తున్నా, నారింజ రంగేమైనా వస్తుందేమోనని, ఎర్ర రంగేమైనా వస్తుందేమోనని. రాలేదు. నొప్పి ఎక్కువైంది. నాకు చిన్న జ్వరం వస్తేనే తల్లడిల్లిపోయే నా భార్య గుర్తుకొచ్చింది. నేను ఏడ్చినట్టు నటిస్తేనే కళ్ళ నీళ్ళు పెట్టుకొనే నా కొడుకు గుర్తుకొచ్చాడు. వాళ్ళను చూడాలని వుంది. చెవుల్లో ఏదో తడి. ముక్కుల్లో ఏదో తడి. ఎర్ర రంగు వస్తే బాగుణ్ణు నొప్పి తట్టుకోలేకపోతున్నా. మా ఇంటికెళ్ళిపోవాలి. నా కొడుకుని కౌగిలించుకోవాలి. నా భార్యకు కష్టం రాకుండా చూసుకోవాలి. కళ్ళు మూతలు పడుతున్నాయ్. తల మీద ఏదో జిగట జిగటగా వుంది. ఎర్ర రంగు ధార వచ్చిందేమో అనుకొని చేత్తో ముట్టుకొని చూసాను. అది ఎర్రరంగే కానీ రక్తం. నిజం. కళ్ళు మూసుకున్నా. నా రంగుల ప్రపంచం చీకట్లో కలసిపోయింది. - చంద్రశేఖర్ ఇండ్ల -
ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, వెబ్సైట్లూ నియంత్రణ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగంలో అవాంఛిత అంశాల నియంత్రణకు స్కూళ్లు, గ్రంథాలయాలు, వ్యాపార,వాణిజ్ యసంస్థలు వంటివి ‘ఫిల్టరింగ్ టెక్నాలజీ’ ఉపయోగించడం సాధారణంగా జరిగేదే. ప్రధానంగా అశ్లీలసైట్లు (పోర్నోగ్రఫీ), సమాచారం దొంగిలించే పథకాలు (ఫిష్షింగ్ స్కీమ్స్), రెచ్చగొట్టే ప్రసంగాలు వంటి విభిన్న అంశాల నియంత్రణకు ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా దీనిని ఉపయోగించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, అంశాలు నియంత్రిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌లో దాదాపు 1200 ప్రత్యేక యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ (వెబ్అడ్రస్, వనరు గా పిలిచే యూఆర్ఎల్ ) బ్లాక్ అయినట్టు యూనివర్సిటీ ఆఫ్ టొరెంటోకు చెందిన ‘సిటిజన్ ల్యాబ్’ తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇంటర్నెట్ సెన్సారింగ్ అమలు తీరుపై జరిపిన విస్తృత అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. భారత్‌లో ఏయే సైట్లు బ్లాక్ చేశారన్నది సొంతంగా పరిశీలించేందుకు సిటిజన్ల్యాబ్తో ముంబయికి చెందిన ఓ ఆంగ్ల దినపత్రిక కలిసి పనిచేసింది. ఇంటర్నెట్ను సెన్సార్ చేస్తున్న దేశాల జాబితాలో భారత్ ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంటర్నెట్ను విస్తృతంగా వినియోగిస్తున్న ఇండియాలో ఇటువంటివి జరగడం ప్రజలను నిరుత్సాహపరుస్తుంది. గతంలో ప్రధానంగా పోర్న్, గేమింగ్ సైట్స్‌పై దృష్టి పెట్టినా, ఇప్పుడు జాతీయ భద్రతపైకి మళ్లింది. మానవహక్కుల బృందాలు, ప్రభుత్వేతర సంస్థల సైట్లు బ్లాకయ్యాయి. బ్లాకవుతున్నాయి’ అని ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రీతూ సరీన్ చెప్పారు. ఇదీ పరిశోధన...! కెనడాకు చెందిన వాటర్లూ సంస్థ నెట్స్వీపర్ ‘ఇంటర్నెట్ ఫిల్టరింగ్ టెక్నాలజీ’ సహాయంతో భారత్‌తో సహా పాకిస్థాన్, అప్గనిస్తాన్, బహ్రెయిన్,కువైట్, ఖతార్, సుడాన్, యూఏఈ, యెమన్, సోమాలియా నెట్స్వీపర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఈ పది దేశాలు కొన్ని ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా ‘సెన్సార్’ చేస్తున్నట్టు తాజాగా తమకు ఆధారాలు దొరికాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా వార్తలు, మతపరమైన, రాజకీయ విమర్శలు, వ్యతిరేక ప్రచారాంశాలు, లెస్బియన్, గే, బై సెక్పువల్, ట్రాన్స్‌జెండర్స్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)ల వనరులు, వంటి విషయాలపై ఇంటర్నెట్ సెన్సార్ అమలవుతున్నట్టు పేర్కొన్నారు. వెల్లడైన అంశాలు... గూగుల్ సెర్చ్‌లో గే, లెస్బియన్ అనే కీ వర్డ్‌లను యూఏఈ, బహ్రెయిన్, యెమన్ బ్లాక్చేశాయి అబార్షన్లు అనే కేటగిరి కింద ఉన్న వెబ్‌సైట్లన్నింటిని కువైట్ పూర్తిగా బ్లాక్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను యూఏఈ, కువైట్లలో పోర్నోగ్రఫీ కింద వర్గీకరించాయి రాజకీయవార్తలు, అభిప్రాయాలు, విమర్శలకు వేదికలుగా ఉన్న వెబ్సైట్లను బహ్రెయిన్, ఖతార్, సుడాన్, సోమాలియా బ్లాక్ చేశాయి యెమన్‌లో అంతర్యుద్ధానికి సంబంధించి ఇంటర్నెట్లో సరైన సమాచారం అందకుండా హౌతి తిరుగుబాటుదారులపై నియంత్రణ ఉంది భారత్‌లో శరణార్థుల సంక్షోభంపై ఫేస్బుక్ గ్రూపుల్లో చర్చ, అల్‌జజీర, యూకే టెలిగ్రాఫ్ కథనాలు, యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేక అంశాలపై చర్చను బ్లాక్ చేస్తున్నారు కువైట్‌లో అబార్షన్, సెక్స్ ఎడ్యుకేషన్, అల్కహాల్ సంబంధిత అన్ని సైట్స్ సెన్సార్ బహ్రెయిన్‌లో రాజకీయ, మానవహక్కుల గ్రూపుల, గూగుల్‌లో గే, లెస్బియన్ సెర్చ్‌లపై నియంత్రణ యూఏఈలో రాజకీయ,మానవహక్కులసంఘాలతో పాటు గ్రీన్‌పీస్ వార్తలు,ప్రత్యామ్నాయ జీవనశైలి (ఎల్జీబీటీక్యూ)పై సెన్సార్ యెమన్‌లో ఇంటర్నెట్ ప్రైవేసీ టూల్స్, ప్రతిపక్షరాజకీయపార్టీలు, ప్రతిపక్షాల వార్తలపై ఆంక్షలు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అశ్లీల వెబ్సైట్లకు వ్యతిరేకంగా ఎక్స్ వీడియోస్
తమిళసినిమా: అశ్లీల వెబ్సైట్లకు మంగళం పాడే విధంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సజో సుందర్ తెలిపారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఎక్స్ వీడియోస్. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ అశ్లీల చిత్రాలను ఎక్స్ వీడియోస్ పేరుతో ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు. అలాంటి వెబ్‌సైట్స్‌కు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. అశ్లీల సన్నివేశాలతో కూడిన వెబ్ చిత్రాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయని, ఎక్స్ అనే పదానికి దేనితోనైనా పోల్చవచ్చునని అన్నారు. ఎక్స్ వీడియోస్ అనే పేరు పెట్డడంతో తమ చిత్రం అశ్లీల చిత్రం కాదని అన్నారు. అలాంటి ఎక్స్ వీడియోస్ కారణంగా బాధితుల గురించి పోరాడే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. అదే విధంగా అసభ్యకరమైన పడకగది సన్నివేశాలు లాంటి ఉండవని, మహిళల రక్షణ గురించి బలంగా చెప్పే చిత్రంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు చూడాల్సిన చిత్రం ఇదని చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం విడుదలకు ముందే ఎక్స్ వీడియోలను నిషేధించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు దర్శకుడు తెలిపారు. -
మ్యూట్‌లో ఆటోప్లే వీడియోలు.. ఎలా?
గూగుల్ తన క్రోమ్ యూజర్లకు బుధవారం సరికొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. కొత్త కొత్త ఫీచర్లతో ఈ అప్డేట్ను ప్రవేశపెట్టింది. కొన్ని వెబ్సైట్లలో ఆటోప్లే అయ్యే వీడియోలకు ఈ అప్డేట్ శాశ్వత పరిష్కారం అందిస్తోంది. క్రోమ్ 64 పేరుతో ఈ అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఈ క్రోమ్ 64, వెబ్సైట్లలో ఆటోప్లే అయ్యే వీడియోలను మ్యూట్‌లో పెట్టుకునే ఫీచర్ పొందుపరించింది. చాలా వెబ్సైట్లలో కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా.. వీడియోలు కూడా ఆటోప్లే అవుతుంటాయి. అలా ఆ వెబ్సైట్లలలో ఆటోప్లే అయ్యే వీడియోలను మ్యూట్‌లో పెట్టుకునేందుకు సంబంధిత వెబ్సైట్ ట్యాబ్ పైన రైట్ క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ''మ్యూట్ సైట్'' అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో డీఫాల్ట్‌గానే ఆటోప్లే అయ్యే అన్ని వీడియోలు ఆగిపోతాయని వెర్జ్ రిపోర్టులు పేర్కొన్నాయి. గత నవంబర్లోనే గూగుల్ ఈ సమస్యపై చర్చించి, దీనికి పరిష్కారంగా క్రోమ్ 64ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. వెబ్సైట్లలో వచ్చే పాప్-అప్స్‌ను సమస్యపై కూడా గూగుల్ పరిష్కారం తీసుకొచ్చింది. పాప్-అప్స్ అనేవి మూడో వ్యక్తి కంటెంట్ కలిగి ఉన్న కొత్త పేజీలు. క్రోమ్ 64 వెబ్సైట్లను ప్రభావితం చేసే మెల్ట్‌డౌన్, స్పెక్టర్ భద్రతా లోపాలకు కూడా పరిష్కారం కనుగొంది. -
పహాణీ కుదింపు
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే పహాణీని కుదించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. పహాణీలో ఇప్పటివరకు రాస్తున్న వాటిలో ఉపయోగం లేని కాలమ్‌లను తొలగించి ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 31 కాలమ్‌లుగా ఉన్న పహాణీలను 14–15 కాలమ్‌లకు తగ్గించే కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాలను పాత ఫార్మాట్లోనే పహాణీలు చేస్తున్నా.... భవిష్యత్తు భూ రికార్డుల నిర్వహణ కోసం ఉపయోగించేందుకు ధరణి వెబ్సైట్లో కొత్త పహాణీ కోసం ప్రత్యేక డిజైన్ చేయాలని నిర్ణయించారు. ఆ 15 అప్డేట్ కావడం లేదు... ప్రస్తుతం పహాణీలో 31 కాలమ్‌లున్నా పంటల సాగు వివరాలతో కూడిన 15 కాలమ్‌లను కొంతకాలంగా అప్డేట్ చేయడం లేదు. దీంతో మిగిలిన 16 కాలమ్‌లలోనే పహాణీలోని వివరాలను పొందుపరుస్తున్నారు. అయితే ఆ 16 కాలమ్‌లలో కూడా కొన్ని కాలమ్‌లు ఉపయోగం లేదనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ భూములకు శిస్తు ఎప్పుడో రద్దయినా అందుకు సంబంధించిన కాలమ్ కొనసాగుతోంది. దీంతోపాటు పొజిషన్ (కబ్జా) కాలమ్, జలాధారం లాంటి కాలమ్‌లను తొలగించాలనే అభిప్రాయం రెవెన్యూ వర్గా ల్లో వ్యక్తమవుతోంది. టైటిల్, సీరియల్ నంబర్, సర్వే నంబర్, సబ్ డివిజన్, అనుభవదారుని పేరు తదితర వివరాలుంటే సరిపోతుందని, వాటికితోడు ఆ సర్వే నంబర్లోని ఎంత భూమిలో ఏ పంట సాగుచేశారనే వివరాలను కూడా నమోదు చేస్తే సరిపోతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అందరికీ అర్థమయ్యేలా పహాణీని తయారు చేయడం ద్వారా పారదర్శక విధానాన్ని అందుబాటులోకి తేవాలని రెవెన్యూ వర్గాలంటున్నాయి. సీఎం కేసీఆర్ కూడా పహాణీలోని కాలమ్‌ల కుదింపు, మార్పులకు అంగీకారం తెలపడంతో కొత్త పహాణీ రూపకల్పనకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాలను మాత్రం పాత ఫార్మాట్లోని పహాణీలోనే మాన్యువల్‌గా రాస్తున్నారు. అయితే దీనిని కంప్యూటరీకరించి «వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణకుగాను తయారు చేసే ‘ధరణి’వెబ్సైట్లో నమోదు చేసే సమయంలో కొత్త పహాణీ ఆధారంగా చేస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా పహాణీని డిజైన్ చేస్తున్నామని రెవెన్యూశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
ముగ్గురమ్మల కూతురు
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు గుర్తేమిటంటే.. స్త్రీలు స్వేచ్ఛగా బయట కూడా మసలగలగడం’ అని గాంధీజీ అన్నారు. కొంచెం కొంచెం పరిస్థితి మారుతోంది. సీసీ కెమెరాలు పెడుతున్నారు కదా! కానీ భార్యల్ని భర్తలు పెట్టే చిత్రహింసల్ని ఏ కెమెరాలు కనిపెడతాయి? కన్నవాళ్లకు, ఉన్న ఊరికి, ఆఖరికి దేశానికి కూడా దూరమై భర్తతో పాటు పరాయి తీరాలకు చేరిన బాధిత మహిళలను కనిపెట్టుకుని ఉండేదెవరు? భర్తే దగా చేస్తే, భర్తే దూరం చేస్తే, భర్తే మోసం చేస్తే.. ఆ స్త్రీకి దిక్కెవరు? ఇవాళ ఎన్నారై డే. ప్రవాసీ భారతీయ దివస్. 2003 నుంచి యేటా జరుపుకుంటున్నాం. జనవరి 9నే ఎందుకు? దక్షిణాఫ్రికాలో ఎన్నారైగా ఉన్న గాంధీజీ 1915లో ఇదే రోజున ఇండియాకు తిరిగొచ్చారు. అందుకు. ఈ సందర్భంగా మాట్లాడుకోవలసిన మంచి విషయాలు చాలా ఉన్నాయి. అన్నిటికన్నా మంచి విషయం.. ఎన్నారై బాధిత భార్యల కోసం మన దేశం ఓ వెబ్‌సైట్‌ను రెడీ చేస్తోంది. అది మొదలైతే.. మన సిస్టర్స్ విదేశాల్లోనూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఉండగలరు. ఎన్నారై వధువుల సంక్షేమం, సంరక్షణల కోసం భారత ప్రభుత్వం ఒక వెబ్సైట్ ప్రారంభించబోతోంది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దీనిని నిర్వహిస్తుంది. భార్యను వెళ్లగొట్టినవారిని ఈ సైట్ గుర్తిస్తుంది. భార్యను మోసం చేసి పరారైనవారిని పట్టితెస్తుంది. భార్యపై గృహహింసకు పాల్పడుతున్నవారిని చట్టానికి పట్టిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నారై పెళ్లి జరిగినా అక్కడి రిజిస్ట్రార్ వరుడి పూర్తి వివరాలను ఈ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేస్తే తప్ప మ్యారేజ్ సర్టిఫికెట్ బయటికి వచ్చేందుకు వీలు లేకుండా ఇప్పటికే ఒక సాఫ్ట్వేర్ కూడా సిద్ధం అయింది! పూర్తి వివరాలు.. అంటే.. వరుడి వృత్తి, ఉద్యోగం, చిరునామాలు, ఆ ఫోన్ నెంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, బ్యాంక్ అకౌంట్లు, ఇతర సోషల్ మీడియా అకౌంట్లు.. ఇలా కీలకమైనవన్నీ.బాధితురాలు ఈ సైట్లో ఫిర్యాదు ఇవ్వగానే ఆ వివరాల ఆధారంగా నిందితుడు ఎక్కడున్నా ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకుంటాయి. ఇందుకోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ సమన్వయంతో పనిచేస్తాయి. ఆ శాఖకు (మేనకా గాంధీ), ఈ శాఖకు (సుష్మా స్వరాజ్) ఇద్దరూ మహిళా మంత్రులే కాబట్టి బాధితురాలికి న్యాయం జరిగే విషయంలో అలసత్వానికి, జాప్యానికి అవకాశమే ఉండదు. ఈ రెండు శాఖలకు న్యాయ శాఖ సహకారం ఉంటుంది. ఎవిడెన్స్ యాక్టులో మార్పులు! ఎన్నారై బాధిత భార్యల కోసం అందుబాటులోకి తెస్తున్న వెబ్సైట్లో.. భర్తలకు ఇచ్చే కోర్టు సమన్ల కాపీలను కూడా అప్లోడ్ చెయ్యాలని సుష్మా స్వరాజ్ ఆలోచిస్తున్నారు. అందుకు వీలుగా ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు’లో సవరణలు చేయాలని సుష్మ నేతృత్వంలోని నిపుణుల బృందం న్యాయ శాఖను కూడా సంప్రదించింది.సవరణకు న్యాయ శాఖ ఒప్పుకుంటే.. ఫారిన్లో ఉన్న ఎన్నారై భర్తలను లీగల్‌గా డీల్ చెయ్యడం మన అధికారులకు మరింత సులభం అవుతుంది. (రెండు దేశాలు న్యాయ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి కనుక). దీంతో న్యాయశాఖకు ఇంకో ఆలోచన వచ్చింది. ‘మేమెలాగూ దేశంలోని ప్రతి పెళ్లినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని చట్టాన్ని తెచ్చే యోచనలో ఉన్నాం కనుక, పనిలో పనిగా ప్రతి ఎన్నారై మ్యారేజీని కచ్చితంగా వారం లోపు రిజిస్టర్ చేయాలన్న నిబంధనను చేరిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను మీరు మాకు పంపవచ్చు కదా’ అని స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు సలహా ఇచ్చింది. అదొకటి డిస్కషన్లో ఉంది. ►3,328 (2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలకు అందిన ఎన్నారై భార్యల ఫిర్యాదులు మొత్తం. వీటిల్లో భార్యలపై భర్తలు ఇచ్చినవీ ఒకటీ అరా ఉన్నాయి.) ►మూడు ముళ్ల బంధానికి మూడు శాఖల కాపలా! ►3,268 (పరిష్కారం అయిన ఫిర్యాదుల సంఖ్య) పరిష్కార విధానాలు ►కౌన్సెలింగ్ ► గైడెన్స్ ►న్యాయపరమైన సలహాలు ►ఎన్నారై భర్తలకు సమన్లు (విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె.సింగ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం అధారంగా) ►ఎన్నారై భార్యల నుంచి తరచూ వచ్చే ఫిర్యాదులు ►ఇండియాలో పెళ్లి జరిగిన వెంటనే వరుడు అదృశ్యమైపోవడం ►పెళ్లి చేసుకుని తీసుకెళ్లాక, భార్యను ఇండియా రానివ్వకపోవడం. ►భార్య పాస్‌పోర్ట్‌ను ఆమెకు అందుబాటులో లేకుండా చేయడం. ►భార్యను ఆ పరాయి దేశంలోనే వదిలేసి భర్త వెళ్లిపోవడం. ►భార్యను ఇండియా పంపించి, పిల్లల్ని తనతోనే ఉంచేసుకోవడం. (ఇవి కాక.. లైంగిక చిత్రహింసలు, అదనపు కట్నం కోసం వేధింపులు) -
నకిలీ వార్తలిచ్చే సైట్లను తొలగిస్తాం: గూగుల్
న్యూయార్క్: తప్పుడు సమాచారాన్ని అందించే వెబ్సైట్లపై టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కొరడా ఝులిపించింది. నకిలీవార్తలతో పాటు యాజమాన్యం, దాని ముఖ్యోద్దేశం, సొంత దేశం తదితర వివరాలను రహస్యంగా ఉంచే వెబ్సైట్లను తమ న్యూస్ ఫీడ్ నుంచి తొలగిస్తామని గూగుల్ హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ ఆదివారం పలు మార్గదర్శకాలు విడుదలచేసింది. ‘మీ గురించి లేదా మీ ఉద్దేశం గురించి తప్పుడు వివరాలు అందజేయవద్దు. మా న్యూస్ ఫీడ్‌లో ఉండే సైట్లు వినియోగదారుల్ని తప్పుదారి పట్టించడాన్ని అంగీకరించం’ అని గూగుల్ చెప్పింది. -
అర్ధనగ్నచిత్రాలతో యువకులకు వల
సాక్షి,సిటీబ్యూరో: ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ స్పెషల్ అపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు శనివా రం అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన మేరకు.. ఈస్ట్గోదావరిలోని దేవరపల్లికి చెంది న జోగేశ్వరరావు కష్ణానగర్, ఎస్ఆర్ నగర్లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంతమంది వ్యభిచారముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. టెక్నాలజీని ఉపయోగించి.. యువకులను ఆకర్షించే విధంగా యువతు ల అర్ధనగ్నచిత్రాలను వెబ్సైట్లలో ఆప్‌లోడ్ చేసేవాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన మోడల్స్, ఆర్టిస్టులు, విదేశీ మహిళలు, యాంకర్లను కూడా ఈ వ్యభిచార రొంపి లోకి దింపేవాడు. ఇతర రాష్ట్రాల వ్యభిచార నిర్వాహకులకు ఐదు నుంచి పది రోజుల నగదు అడ్వాన్స్‌గా ఇచ్చి విమాన టికెట్లు సమకూర్చి నగరంలోని స్టార్ హోటల్స్‌లో యువతులను ఉంచేవాడు. విటుల నుంచి రూ.50వేలకుపైగా డబ్బు వసూలు చేసేవాడు. మరో వ్యభిచార నిర్వాహకుడు, గతంలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన లక్ష్మన్నవరి గోపాల్తోను కలిసి కొంత మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఇక్కడి యువతులను అక్క డకు పంపి పరస్పర అవగాహనతో ఒప్పందం కుదుర్చుకునేవాడు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెం దిన వ్యభిచార నిర్వాహకుడు ఉస్మాన్‌తో మా ట్లాడి వారం పాటు ఒప్పందంపై ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువతిని నగరానికి తీసుకొచ్చాడు. ఈ నెల 19 నుంచి కత్రియా హోటల్ లో ఉంచి కస్టమర్ల వద్దకు పంపిస్తున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ నేతత్వంలోని బృం దం దాడిచేసి వ్యభిచార ప్రధాన నిర్వాహకులు జోగేశ్వరరావు, లక్ష్మన్నవరి గోపాల్, సహాయ నిర్వాహకుడు కీసన గోపాల్‌లను అరెస్టు చేసి, ఉబ్జెకిస్తాన్ మహిళను పట్టుకున్నా రు. వీరి నుం చి రూ.25వేల నగదుతో పాటు కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ‘ఆరు నెలల టూరిస్ట్ వీసాపై తొమ్మిది నెలల క్రితం ఢిల్లీకి వచ్చాను. వీసా గడువు ముగిసి ఇప్పటికే మూడు నెలలు దాటింది. ఈ క్రమంలోనే ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన వ్యభిచార నిర్వాహకులతో పరిచయం ఏర్ప డింది. అలా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాన’ని బాధితురాలు పోలీసు విచారణలో తెలిపింది. -
‘ఆ వెబ్సైట్ల’పై మా ఫిర్యాదు
-
‘ఆ వెబ్సైట్ల’పై 'మా' ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ప్రయివేట్ వెబ్సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ‘మా’ ఫిర్యాదు మేరకు అశ్లీల వెబ్ సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని 'మా' అసోసియేషన్ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి తమకు ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ ఎస్పీ రాంమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు వందల వెబ్సైట్లఫై ఈ విషయంలో ఫిర్యాదులు అందాయని తెలిపారు. సినీ సెలబ్రిటీలే కాకుండా, వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా కథనాలు రాసినా, ప్రచురించినట్లు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరిని అశ్లీలంగా చూపెట్టినా నిందితులు శిక్షార్హులని పేర్కొన్నారు. ఐటీ యాక్ట్ 66 ప్రకారం ఇటువంటి బూతు కథనాలు, అవాస్తవాలు రాయడం, ఫొటోలు మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు అప్ లోడ్ చేసేవారితో పాటు ఆ వెబ్ సైట్ల నిర్వాహకులఫై కేసులు నమోదు చేసి చర్య తీసుకుంటామన్నామని చెప్పారు. విదేశాల్లో ఉండి వెబ్సైట్లను నిర్వహిస్తున్న వారిని సైతం విడిచిపెట్టేది లేదన్నారు. -
అమెరికాలో పలు ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్!
వాషింగ్టన్: అమెరికాలో పలు ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. హ్యాక్ చేసిన దుండగులు వాటిలో ఇస్లామిక్ స్టేట్‌కు అనుకూలంగా సందేశాలను ఉంచారు. ఒహియో రాష్ట్రంలోని పలు వెబ్సైట్లు హ్యాకింగ్ బారిన పడినట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఒహియో రాష్ట్ర గవర్నర్ జాన్ కిసిచ్ ఆఫీస్ వెబెసైట్తో పాటు.. రిహాబిలిటేషన్, హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్, వర్క్‌ఫోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ల వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ముస్లిం దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి ట్రంప్ జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందన్న సందేశం హ్యాక్ చేసిన వెబ్సైట్లలో కనిపించింది. హ్యాకింగ్ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. హ్యాకింగ్ ఎలా జరిగిందనేదానిపై విచారణ జరుగుతుందని ఒహియో అడ్మినిస్ట్రేటీవ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. -
వెబ్సైట్లపై కబాలి పంజా
-
ఆ 240 వెబ్సైట్లు ఇక చూడలేరు
దిల్లీ: వ్యభిచారానికి ఉపయోగిస్తున్న 240 ఎస్కార్ట్ వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకుంది. ఎస్కార్ట్ సేవలు అందిస్తున్న 240 వెబ్సైట్లను నిలిపి వేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే నిపుణుల కమిటీకి తెలపాలని సూచించారు. అయితే ప్రభుత్వ చర్యను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడనర్లు తప్పుబట్టారు. కొన్ని వెబ్సైట్లపై నిషేధించి విధించినంత మాత్రానా సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఈ వెబ్సైట్లు పేర్లు లేదా లింకులు కొద్దిగా మార్చుకున్నా మళ్లీ వస్తాయని వెల్లడించారు. ఎస్కార్ట్ వెబ్సైట్లను నిర్వహించే వారిని కనిపెట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. దినపత్రికల్లో ఎస్కార్ట్ ప్రకటనలు రాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదని, మనదేశానికి చెందిన వెబ్సైట్లను మాత్రమే నిషేధించడం సబబు కాదని పేర్కొన్నారు. -
మహిళలను తొక్కేస్తున్న వెబ్ మీడియా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వార్తా వెబ్సైట్లు మహిళల అందానికిచ్చే ప్రాధాన్యం, వారి ఆలోచనలకు ఇవ్వడంలేదట. పురుషులకు సంబంధించి విషయ అవగాహనకు, విశ్లేషణలకు వెబ్సైట్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని తేలింది. ఆన్లైన్లోని వార్తల్లో పురుషుల అభిప్రాయాలు, వాదనలు అక్షరాలతో డామినేట్ చేస్తే మహిళలు మాత్రం ఎక్కువగా ఫోటోలకే పరిమితమయ్యారని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ అండ్ కార్డిఫ్ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అనుభవం లేదు అనే కారణం చూపిస్తూ మహిళలు ఎక్కువగా ఫీచర్స్ ఆర్టికల్స్, ఫ్యాషన్, ఎంటర్ టైన్ మెంట్, ఆర్ట్లకే పరిమితవ్వగా పురుషులు మాత్రం స్పోర్ట్స్, పాలిటిక్స్వంటి వాటిలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందట. 950 వార్తా వెబ్సైట్లు, 23 లక్షల ఆర్టికల్లు, 6 నెలల సమయం తీసుకొని ఈ పరిశోధనలు చేశారు. వార్తల్లో అట్రాక్షన్ కోసమే కేవలం అలంకార ప్రాయంగానే మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ విషయ పరిజ్ఞానికి వచ్చేసరికి తక్కువ ప్రాధాన్యం లభిస్తోందని తేలింది. -
బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ సమగ్ర సమాచారం
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు, అనధికార లే అవుట్లను, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గత నెలలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు www.telanganalrsbrs.in, http://eghmc.ghmc.gov.in వెబ్సైట్లను అందుబాటులో ఉంచారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తుకు ఇంకా నెలరోజులు మాత్రమే గడువు ఉంది. మరో పదిరోజుల్లో దరఖాస్తులు పరిశీలించనున్నారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ సంబంధించి ఏమైన సందేహాలు ఉన్నట్లయితే జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా వాటిని నివృత్తి చేసుకునేందుకు ఆస్కారం ఉంది. దీంతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లుకూ 155304/040-2322537 ఫోన్ చేయొచ్చు. క్రమబద్ధీకరణకు సంబంధించిన సందేహాలకు నరహరి (ఏసీపీ)7093906446, కె.గంగాధర్ (ఏసీపీ) 7702774317, అమృత్‌కుమార్ (ఏసీపీ) 9701363242, రమేష్‌బాబు (ఏసీపీ) 8006110487లను ఫోన్‌ద్వారా సంప్రదించవచ్చు. అలాగే దరఖాస్తులతోపాటు ధ్రుపత్రాల అప్‌లోడ్‌లో ఇబ్బందులు ఉంటే (జీహెచ్ఎంసీ) రామకృష్ణారెడ్డి (టీమ్ లీడర్, సీజీజీ) 9989930333, కోటిరెడ్డి (వ్యాపార విశ్లేషకులు,సీజీజీ) 9603563891, హరి (ప్రోగ్రామర్,సీజీజీ) 9848858380లను సంప్రదించవచ్చు. లెసైన్స్ పొందిన వ్యక్తి బిల్డింగ్ ప్లాన్లు, లే అవుట్ ప్లాన్, ప్లాట్ ప్లాన్‌ను గీయాల్సి ఉంటుంది. ఇందుకు కోసం 8897911680, 9346906744, 8096712869 సంప్రదించవచ్చు. siddharth_nnv@yahoo.com లో కూడా సంప్రదించవచ్చు. -
ఐఎస్ఐఎస్ వెబ్సైట్లపై వేటు!
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు చెందిన రెండు వెబ్సైట్లను భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్ట్-ఇన్ బ్లాక్ చేసింది. వాటితోపాటు జమ్ముకశ్మీర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల పేరుమీద నడుస్తున్న రెండు ఫేస్బుక్ పేజీలను కూడా నిషేధించింది. ఐఎస్ఐఎస్ స్వయంగా నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్లలో తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుండటంతోపాటు, బాంబులు ఎలా తయారుచేయాలి, మాడ్యూల్స్ ట్రెయినింగ్ వంటి నిషిద్ధ సమాచారాన్ని అందిస్తుండటంతో ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసుల అభ్యర్థన మేరకు సెర్ట్-ఇన్ ఈ చర్య తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంమంత్రిత్వశాఖ, దర్యాప్తు సంస్థల అధికారులతో కూడిన కమిటీ బుధవారం సెర్ట్-ఇన్ అధికారులతో భేటీ అయి.. ఈ వెబ్సైట్లతో పొంచి ఉన్న ముప్పు గురించి దాదాపు గంటపాటు చర్చించారు. ఆ తర్వాత వెబ్సైట్లను నిషేధించాలని నిర్ణయించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన 55-60 వెబ్సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ పేజీలను కేంద్రం ఈ ఏడాది బ్లాక్ చేసింది. -
ఛేంజ్ కోరుకుంటోంది!
'ఒక అమాయకురాలైన ఆడపిల్లకు న్యాయం చెయ్యలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత.. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం..! ఇది కాదండీ ప్రజలు కోరుకునేది. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు' ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తున్న, కనిపిస్తున్న డైలాగ్ ఇది. 'లీడర్' చిత్ర దర్శకుడు పలికించినట్టుగా నిజంగానే యువత మార్పు కోరుకుంటోంది. ఒకప్పుడు ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టుండే యువతరం ఇప్పుడు ఉగ్రనరసింహావతారం ఎత్తుతోంది. ప్రభుత్వాలను, వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఛేంజ్.ఆర్గ్ లాంటి వెబ్సైట్లు వీరికి వేదికగా నిలుస్తున్నాయి. పదిహేనేళ్ల లక్ష్మి పేరుకు తగ్గట్టు లక్ష్మీదేవిలా ఉండేది. ఆమె అందం, అమాయక చూపులు పదిమందిలోనూ ఆమెను ప్రత్యేకంగా నిలిపేవి. ఈ ప్రత్యేక గుర్తింపు టీనేజీ అమ్మాయిలను సంబరపెట్టేదే. అయితే లక్ష్మి విషయంలో జీవితాంతం వేదన మిగిల్చింది. ప్రేమిస్తున్నామంటూ, పెళ్లిచేసుకోవాలంటూ ఇద్దరు వ్యక్తులు వెంటపడేవారు. వారిని లక్ష్మి తిరస్కరించింది. అంతే.. సమీపంలోని మెడికల్ షాపులో యాసిడ్ కొన్నారు. తర్వాత జరిగేది మన ఊహకు అందని విషయమేమీ కాదు. ఏడేళ్లు గడిచాయి. లక్ష్మి చూస్తుండగానే వందల సంఖ్యలో యాసిడ్ దాడులు. వందల మంది లక్ష్మిలు! ఆమె గుండె రగిలింది. ఈ సమాజం మారదా అంటూ తనను తాను ప్రశ్నించుకుంది. లోలోపలే కుమిలిపోతే లాభం లేదనుకుంది. తన వ్యథను పంచుకుంటూ 'ఛేంజ్.ఆర్గ్' వెబ్సైట్ వేదికగా ఓ పిటిషన్ దాఖలు చేసింది. యూపీఏ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను ఉద్దేశిస్తూ.. 'భారత్‌లో యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ కావాలి' అంటూ గళమెత్తింది. పిటిషన్ పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే 27 వేల మంది మద్దతుగా సంతకాలు చేశారు. సుప్రీం కోర్టు జోక్యంతో నాటి యూపీఏ ప్రభుత్వం యాసిడ్ అమ్మకాలను నియంత్రిస్తామంటూ 2013, జూలై 16న ప్రకటించింది. లక్ష్మి విజయం సాధించింది. పరిణామాలు.. నెటిజన్ల ఆదరణ చూరగొన్న పిటిషన్లు ప్రభుత్వాలను సైతం కదిలించగలుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలే కాక, ప్రైవేటు వ్యవస్థల మీద కూడా ఈ సోషల్ ఉద్యమాల ప్రభావం ఉంటోంది. దీనికి నిదర్శనం అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ దేశాల్లో నెటిజన్లు సాధించిన విజయాలే. తన జననాంగాల కోతను (ఫీమేల్ జెనిటల్ మ్యుటిలైజేషన్) అడ్డుకోవాలంటూ లండన్‌కు చెందిన ఓ మైనారిటీ చిన్నారి చేసిన విజ్ఞప్తి, బాస్కెట్‌బాల్ క్రీడలో తలపాగాలు తొలగించబోమన్న ఓ సిక్కు క్రీడాకారుడి ప్రతిఘటన, ఫ్లిప్‌కార్ట్‌లో లింగ నిర్ధారణ పుస్తకాల విభాగాన్ని తొలగించాలంటూ చేసిన ఆందోళన, కేరళలో వీధి కుక్కలను చంపొద్దంటూ తెలిపిన నిరసన.. ఇవన్నీ ఛేంజ్.ఆర్గ్‌లో కనిపిస్తాయి. వేల సంఖ్యలో సంతకాలు పోగుచేసి విజయఢంకానూ మోగిస్తాయి. భారత్‌లో.. ఫేస్బుక్, ట్వీటర్ హవాలో నెగ్గుకురావడం కొంత కష్టమైన పనే అయినప్పటికీ మన దేశంలోనూ ఈ మధ్యే ఛేంజ్.ఆర్గ్ లాంటి సంస్థలు పుంజుకుంటున్నాయి. ఉబెర్ క్యాబ్స్ ఉదంతం, కర్ణాటకలో పాఠశాల విద్యార్థుల భద్రత, వేలాది చెట్లను నరికివేతకు కారణమైన హుబ్లీ ధర్వార్డ్ హైవే నిర్మాణం వంటి సమస్యలు ఈ ఆన్లైన్ వేదికపై విజయం సాధించాయి. కేరళలో వీధి కుక్కల సంహారం లాంటి అంశాలు విజయం సాధించనప్పటికీ, దేశంలో చర్చలకు కారణమవుతున్నాయి. తెలుగు విద్యార్థిని రిషితేశ్వరి పేరున కూడా ఈ వెబ్సైట్లో ఓ పిటిషన్ ప్రారంభమైంది. వివాదం.. ఈ వెబ్సైట్ ద్వారా సంఘ విద్రోహక పిటిషన్లకు కూడా మద్దతుదారులు పెరగడం లాంటి సంఘటనలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే, దీన్ని సున్నితంగా ఖండిస్తున్నారు నిర్వాహకులు. ఏదైనా అంశం ప్రజలకు నచ్చితేనే మద్దతు తెలుపుతారని, ఒక వర్గం ప్రజలకు మంచి అనిపించేది మరో వర్గానికి చెడుగా అనిపించవచ్చని వివరణ ఇచ్చుకుంటున్నారు. ఏంటీ ఛేంజ్.ఆర్గ్..? ఫేస్బుక్, ట్వీటర్, గూగుల్ ప్లస్.. ఇలా సామాజిక వెబ్సైట్లు ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటి కోవలోకి వచ్చేదే ఈ ‘ఛేంజ్.ఆర్గ్’. సామాజిక ఉద్యమాలే దీని ముఖ్య ఉద్దేశం. 2007 ఫిబ్రవరి 7న అమెరికాలో ప్రారంభమైన ఈ వెబ్సైట్లో ప్రస్తుతం 11 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఈ సైట్లో ఎవరైనా పిటిషన్ దాఖలు చేయవచ్చు. సమకాలీన అంశాలపై ప్రశ్నించవచ్చు. అధినాయకులను, సంస్థలను, ప్రభుత్వాలను విన్నవిస్తూ, నిలదీస్తూ పిటిషన్ ప్రారంభించవచ్చు. మద్దతుదారులు దీనిపై సంతకాలు చేస్తారు. తాము సంతకం చేసిన పిటిషన్‌ను ఫేస్బుక్, ట్వీటర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ కూడా చేస్తారు. భారీ సంఖ్యలో సంతకాల సేకరణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయపడతారు. -
పంచాయతీలకూ వెబ్సైట్లు
- నేషనల్ పంచాయత్ పోర్టల్ ద్వారా ఏర్పాటు - సర్పంచులు, కార్యదర్శులకూ కంప్యూటర్ శిక్షణ హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సమాచారం త్వరలోనే ఆన్లైన్లో ప్రతి ఒక్కరికీ సాక్షాత్కారం కానుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్సైట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు వెబ్సైట్ రూపకల్పన బాధ్యతలను నేషనల్ పంచాయత్ పోర్టల్ విభాగానికి కేంద్ర పంచాయతీరాజ్ విభాగం అప్పగించింది. www.panchayatportals.gov.in ద్వారా వివిధ రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలు తమ పంచాయతీలకు చెందిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేలా నేషనల్ పంచాయతీ పోర్టల్స్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది. ప్రధానంగా గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలకమైన 13 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చు. ముఖ్యంగా గ్రామం గురించి, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, గ్రామ సభ వివరాలు, బడ్జెట్, పంచవర్ష ప్రణాళిక-నిర్వహణ, కొత్త వార్తలు, అధికారుల టూర్ డైరీ, అధికారుల సమావేశాల్లో చేసిన తీర్మానాలు, చూడదగిన ప్రదేశాలు, మ్యాపులు, రవాణా సదుపాయాలు, పనుల టెండర్లు, ప్రజలకు తెలపాల్సిన సమాచారం.. తదితర అంశాలను పొందుపరిచేలా డిజైన్ చేశారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే ఉత్తర్వులు, సర్క్యులర్లు ఆయా గ్రామ పంచాయతీల వెబ్సైట్లలోనూ కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులకు కంప్యూటర్ శిక్షణ గ్రామ పంచాయతీల వెబ్సైట్ నిర్వహణ, గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలను అప్లోడ్ చేయడం, పరిపాలనకు సంబంధించిన వివరాల నమోదు.. తదితర అంశాలపై గ్రామ సర్పంచులతో పాటు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ విభాగం అందిస్తోన్న ఈ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 10,994 మంది డిగ్రీ చదువుకున్న ప్రజాప్రతినిధులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో 3,351 మంది సర్పంచులు, 3,300 మంది పంచాయతీ కార్యదర్శులు, 366 మంది జడ్పీటీసీలు, 4,277 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఈనెల 29న ప్రారంభమైన తొలివిడత శిక్షణకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇస్తుండగా, మలివిడతలో ఎంపీటీ సీలకు, జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వనున్నారు. తమిళనాడుకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. గ్రామ పంచాయతీల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు వెబ్సైట్(ఆన్లైన్) వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని, ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. -
కాయ్ రాజా.. కాయ్!
ఆన్లైన్లో జోరుగా డమ్మీ బెట్టింగ్ న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపుతూ, ఊహించని ఫలితాలతో క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. తెరవెనుక వీటిపై పందేలు కాసే బెట్టింగ్ రాజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. డబ్బుల ప్రసక్తి లేకుండా సరదాగా బెట్ చేద్దామనుకునే వారి కోసం ప్రస్తుతం బోలెడన్ని యాప్స్, వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. డబ్బులతో ప్రమేయం లేకుండా బెట్టింగ్ చేయాలనుకునే వారి సరదా తీరుస్తున్నాయి. బెట్మాకర్స్డాట్కామ్, లగాయ్ఖాయ్ లాంటివి ఆ కోవకి చెందినవే. ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీటికి యూజర్ల తాకిడి పెరిగింది. తాజాగా భారత్ సెమి ఫైనల్స్‌లోకి ప్రవేశించడంతో ఈ యాప్స్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది. వరల్డ్‌కప్ ఊతంతో చాలా మటుకు సైట్లు, యాప్స్‌లో పెద్దయెత్తున యూజర్లు చేరుతున్నారు. ఐపీఎల్ సీజన్ 7తో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉంటోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు గ్రాస్ప్ ఆన్లైన్ గేమ్స్‌కి చెందిన లగాయ్ ఖాయ్ అనే మొబైల్ యాప్, వెబ్సైట్లో 60,000 పైచిలుకు యూజర్లు నమోదు చేసుకున్నారు. వరల్డ్‌కప్ నేపథ్యంలో కేవలం ఒక్క వారం వ్యవధిలోనే 10,000 మంది పైగా వీటిలో చేరారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రోజున 32,000 మంది పైచిలుకు యూజర్లు బెట్టింగ్ చేశారు. వరల్డ్ కప్ ముగిసే సరికి కనీసం లక్ష యూజర్ల స్థాయిని చేరుకోవాలని లగాయ్ ఖాయ్ యోచిస్తోంది. ఇక బెట్మాకర్స్డాట్కామ్ సైటును సందర్శించే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో నెలకు 13,000 పైచిలుకు విజిటర్స్ ఈ సైటును ఉపయోగించగా.. వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ముందు నుంచే విజిటర్స్ సంఖ్య 22,000 పైచిలుకు పెరిగింది. అమెరికా, యూరప్, బ్రెజిల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా ఈ వెబ్సైట్లో చేరుతున్నారు. మరోవైపు, ఢిల్లీకి చెందిన ఆక్ట్రో అనే మొబైల్ గేమింగ్ సంస్థ తమ తీన్ పత్తీ యాప్‌లో క్రికెట్ బెట్టింగ్ ఫీచర్‌ను కూడా జోడించింది. ఇది ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంది. పాకిస్తాన్, ఇండియా మ్యాచ్‌పై దీని ద్వారా 60,000 మంది పైగా బెట్టింగ్ చేశారు. మహిళా యూజర్లూ ఎక్కువే.. బెట్టింగ్ యాప్‌లను వాడుతున్న యూజర్లలో 18-35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే ఎక్కువ. ఈ గ్రూప్‌నకు చెందిన వారి సంఖ్య సుమారు 85 శాతంగా ఉంది. ఇక మహిళా యూజర్లు కూడా గణనీయమైన స్థాయిలోనే ఉంటుండటం విశేషం. వీరి సంఖ్య దాదాపు 18 శాతం మేర ఉంటుందని ఆపరేటర్లు చెబుతున్నారు. క్రికెట్ అప్డేట్స్ తెలుసుకునేందుకు, మ్యాచ్‌ల ఫలితాలపై బెట్ కట్టేందుకు తెల్లవారుఝామున 3.30కి కూడా లేచి కూర్చుంటున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. గిఫ్టులు కూడా.. సాధారణంగా ఈ యాప్స్, వెబ్సైట్లు రూ. 100, రూ. 500 మొదలైన డినామినేషన్లలో వర్చువల్ గిఫ్ట్ వోచర్లు ఇస్తుంటాయి. వీటిని ఉపయోగించి బెట్టింగ్ చేయొచ్చు. అదనంగా మరింత కరెన్సీ కావాలనుకుంటే సదరు యాప్‌లోనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా ఇన్-యాప్ కొనుగోళ్లతో పాటు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ప్రకటనలు లాంటి వాటితో ఈ యాప్స్, వెబ్సైట్లు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఇలాంటి డమ్మీ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లలో డబ్బు పోగొట్టుకోవడం, గెల్చుకోవడం లాంటివేమీ ఉండకపోయినా.. ఆయా మ్యాచ్ ల ఫలితాలను మనం కచ్చితంగా ఊహించి ముందే చెప్పగలిగితే బహుమతులను దక్కించుకునే వీలుంది. బెట్మాకర్స్, ఇండియా బెట్, లగాయ్ ఖాయ్ లాంటి యాప్‌లు, సైట్లు .. ట్యాబ్లెట్ పీసీలు, ఐఫోన్లు, ఫ్లిప్‌కార్ట్ వోచర్లు మొదలైనవి అందిస్తున్నాయి. -
గజిబిజి టెక్స్ట్‌కు గుడ్‌బై...
ఈమెయిళ్లుగానీ, వెబ్సైట్ల నుంచి కాపీ చేసుకున్న టెక్స్ట్ కానీ... వర్డ్ప్రాసెసర్ ద్వారా ప్రింట్ చేశామనుకోండి. రకరకాల గుర్తులతో, అక్షరాలు దూరదూరంగా ప్రింట్ అవుతాయి. ఒరిజినల్ టెక్ట్స్‌లో ఉన్న ఫార్మాట్ల ఫలితమిది. వీటిని సులువుగా తొలగించుకునేందుకు ఎన్నో ఆప్షన్లున్నాయి. వాటిల్లో మచ్చుకు మూడు మీకోసం... స్ట్రిప్ మెయిల్: నెట్లో (ఠీఠీఠీ.ట్టటజీఞఝ్చజీ.్ఛ్ట) ఉచితంగా లభించే చిన్న సాఫ్ట్వేర్ ఇది. అన్ని రకాల ఈమెయిల్ క్లైయింట్లతో పనిచేస్తుంది. ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలో మామూలుగా కనిపించే కొన్ని గుర్తులను చెరిపేసి... టెక్ట్స్ సాఫీగా ఉండేలా చేస్తుంది. అక్షరాలు మొత్తం కుడివైపు నుంచి కుదురుగా మొదలవడంతోపాటు పేరాలుగా ఉండేలా చేస్తుంది. కేవలం 279 కిలోబైట్ల సైజుండే ఈ సాఫ్ట్‌వేర్‌ను డెస్క్టాప్పై ఉంచుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. తద్వారా టెక్ట్స్ చూడటానికి బాగా కనిపిస్తుంది. కాగితం వృథా కాదు కూడా. ఈమెయిల్ స్ట్రిప్పర్: మెయిల్ ఫార్వర్డ్ చేసిన ప్రతిసారీ లైన్ మొదలయ్యే చోట ’ాాాా ’ గుర్తులు కనిపించడం మనం చూసే ఉంటాం. ఈ మెయిల్స్ట్రిప్పర్ సాఫ్ట్‌వేర్‌తో ఈ ఇబ్బందికి చెక్ పెట్టవచ్చు. ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేసిన మెయిలైనా ఒకసారి దీంట్లో పడితే క్లీన్‌గా మారిపోతుంది. ఈమెయిల్‌లోని సమాచారం మొత్తాన్ని ఈ సాఫ్ట్‌వేర్‌లో పడేయడం ఒక్కటే మీరు చేయాల్సింది. ఆ తరువాత మీరు యథావిధిగా టెక్స్ట్‌ను కాపీ చేసి మెయిల్లో పేస్ట్ చేసి వాడుకోవచ్చు. సీనెట్ వంటి సైట్లలో ఉచితంగా లభిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ అన్ని వెర్షన్ల విండోస్‌తో, లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ పనిచేయగలదు. క్లిప్పీ: ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్లతోపాటు అనవసరమైన గుర్తులన్నింటినీ చెరిపేసి టెక్ట్స్‌ను కంటికి నదురుగా మార్చి ఇస్తుంది ఈ క్లిప్పీ సాఫ్ట్వేర్. రీఫార్మాట్ చేయాల్సిన టెక్స్ట్‌ను క్లిప్‌బోర్డ్‌లో పేస్ట్ చేసి సిస్టమ్ ట్రేలో ఉన్న క్లిప్పీ ఐకాన్‌ను క్లిక్ చేస్తే చాలు. దీంతోపాటు పదాలను లెక్కించేందుకు, పదాల మధ్యలో ఉండే అనవసరమైన వైట్ స్పేసెస్‌ను తొలగించేందుకు, కొన్ని ఇతర పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని విండోస్ ఓఎస్ వెర్షన్లతో పనిచేస్తుంది. -
ఆన్లైన్లో వ్యాఖ్యలపై అరెస్టులను తప్పుబట్టిన సుప్రీం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కొందరిని అరెస్టు చేయటంపై పోలీసులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇటువంటి అరెస్టులను కేంద్రం సమర్థించుకోజూడటాన్ని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ ను ఉపయోగించుకుని సోషల్ వెబ్సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్య లు చేసిన వారిని అరెస్టు చేయటం, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించటం చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని తేల్చిచెప్పింది. -
రైతుల పేర్లు గల్లంతు
గందరగోళంగా రుణమాఫీ జాబితాలు వివరాల కోసం వెళ్లిన రైతులను తిప్పి పంపిన బ్యాంకులు ఇంటర్నెట్ సెంటర్లలో పేర్లు చూసుకోవచ్చని ఉచిత సలహాలు కొన్ని చోట్ల తెరుచుకోని వెబ్సైట్లు.. మరికొన్ని చోట్ల అర్థం కాని జాబితాలు తండ్రి పేరుంటే, కుమారుల పేర్లు అదృశ్యం గుంటూరు: రైతుల రుణమాఫీ అర్హుల జాబితాలను రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్లో ఉంచింది. అయితే ఆ జాబితాల్లో కొంత మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. దాంతో వారిలో ఆందోళన నెలకొంది. రుణ మాఫీ అర్హుల జాబితాను ఆయా బ్యాంకుల బ్రాంచీలకు పంపినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో తమ పేర్లు ఉన్నాయో లేవో తెలుసుకొనేందుకు రైతులు సోమవారం బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. బ్యాంకు సిబ్బంది వెబ్సైట్లో జాబితా ఉంది చూసుకోమనడంతో రైతులంతా కాళ్లీడ్చుకుంటూ నెట్ సెంటర్లను ఆశ్రయించారు. కొన్ని చోట్ల వెబ్సైట్లు తెరుచుకోకపోవడం,మరి కొన్ని చోట్ల పేర్లు లేకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగివెళ్లారు. నెట్ జాబితాల్లో కొందరి పేర్లు గందరగోళంగా ఉండటంతో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే గందరగోళ పరిస్థితి ఏర్పడినట్టు చెపుతున్నారు. 2006లో రేషన్ కార్డులను జారీ చేశారు. అప్పుడు తండ్రి, కుమారులు పేర్లు అన్నీ ఒకే రేషన్ కార్డులో ఉన్నాయి. ఆ తరువాత కొన్ని కుటుంబాలు వేరు పడ్డాయి. దీంతో చాల మందికి రేషన్ కార్డులు రాలేదు. ఒక కుటుంబంలో తండ్రి, ఇద్దరు కుమారులు తలా రూ. 1.50 లక్షల రుణం తీసుకొన్నారు. అయితే ప్రస్తుత రేషన్ కార్డు ఆధారంగా తండ్రి మాత్రమే రుణ మాఫీకి అర్హులవుతారు. మిగిలిన ఇద్దరు కుమారులు రేషన్ కార్డు ఆధారంగా రుణ మాఫీకి అర్హులు కాకుండా పోయారు. ఇలాంటి వడపోతలతో లక్షల మంది పేర్లు గల్లంతు అయినట్టు చెపుతున్నారు. మరికొంత మందికి పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అధిక శాతం రైతుల పేర్లు గల్లంతు అయ్యాయంటున్నారు. ఇలాంటి వారంతా 14 శాతం వడ్డీతో రుణాలు చెల్లించాల్సి ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 11.70 లక్షల ఖాతాలకు...అర్హులు దాదాపు 3లక్షల లోపే.. జిల్లా వ్యాప్తంగా 11.70 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకొన్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి మాఫీ అవుతాయని ఎవరూ రుణాలను తిరిగి చెల్లించ లేదు. తీరా జాబితాల్లో పేర్లు చూసుకున్నాక బాబును నమ్మి నట్టేట మునిగామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రూ. 50వేల వరకు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ కానుంది. ఇలాంటి ఖాతాలు జిల్లాలో లక్షలోపు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా రెండు లక్షల ఖాతాలకు అంటే రూ. 50 వేల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మొదటి విడతలో 20 శాతం సొమ్మును ప్రభుత్వం జమ చేయనుంది. మిగతా సొమ్ము ఐదేళ్లలోపు ప్రభుత్వమే చెల్లించనుంది. రెండవ విడత జాబితాపై ఆశలు... రేషన్ కార్డు, ఆధార్ కార్డులేని వారికి, ధ్రువీకరణ పత్రాలు సమర్పించని వారికి అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు మాటలను మాత్రం చాల మంది రైతులు విశ్వసించడం లేదు. కొంత మంది రైతులు రెండవ జాబితాలోనైనా రుణ విముక్తులమవుతామని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
సులువుగా ఆన్లైన్ రిటర్నులు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ (జూలై 31) దగ్గరపడుతోంది. సాధారణంగా పన్ను చెల్లింపుదారులు చాలా మంది.. రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గరపడే వరకు దానిపై పెద్దగా దృష్టి పెట్టరు. తీరా చివరి నిమిషంలో ఆదరాబాదరాగా పరిగెడతారు. సీఏల చుట్టూ తిరుగుతారు. ఇలా పరుగెత్తాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గర్నుంచే ఆన్లైన్లో దాఖలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తూ పలు వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటివాటిలో కొన్ని ఇవి.. క్లియర్ ట్యాక్స్: ఈ వెబ్సైటు చూడటానికి ఇంపుగా ఉండటంతో పాటు ఫైలింగ్ ప్రక్రియ సులభతరంగా ఉంటుంది. మ్యాన్యువల్‌గా ఫైల్ చేయాలనుకుంటే నారింజ రంగు బటన్ ఎంచుకోవాలి. అదే ఫారం16ని స్కాన్చే సి, ఆటోమేటిక్‌గా వివరాలను పొందుపర్చాలంటే ఆకుపచ్చ రంగు బటన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సైట్లో ముందుగా మన పేరు, పాన్ నంబరు, చిరునామా తదితర వివరాలతో అకౌంటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఉచితమే. ఒకవేళ చార్టర్డ్ అకౌంట్ సాయం కావాలనుకుంటే ఈ సర్వీసు చార్జీలు రూ. 499 నుంచి ఉంటాయి. హెచ్ అండ్ ఆర్ బ్లాక్: క్లియర్‌ట్యాక్స్ లాగా ఇది కూడా ఉచితమైనదే. ఫ్రీ సర్వీసులో కూడా కావాలంటే సహకారం అందించేందుకు ఏజెంట్లు ఉంటారు. రిటర్న్ ఫారంలను సీఏలు పరిశీలించాలంటే రూ. 499, సీఏలే రిటర్నులను రూపొందించాలంటే రూ. 999 మేర చార్జీలు ఉంటాయి. ట్యాక్స్‌స్మైల్: వెబ్సైట్లో వివిధ విభాగాలు ఒకదాని పక్కన మరొకటి పేర్చేసినట్లు ఉన్నా.. గందరగోళం మాత్రం ఉండదు. రూ. 5 లక్షల దాకా ఆదాయ ఉన్న వారు ఈ సైటు నుంచి ఉచితంగా రిటర్నులు దాఖలు చేయొచ్చు. పెద్దగా ఇతరత్రా సహాయం లేకుండా వివరాలన్నీ మీరే నింపాల్సి వస్తుంది. మిగతా వాటితో పోలిస్తే ఇదే ఈ సైటులో కాస్తంత ఇబ్బందికరమైన విషయం. అదే రూ. 500 కట్టి, ఫారం 16ని అప్లోడ్ చేస్తే.. ఫైలింగ్ పనిని ట్యాక్స్స్మైలే చూసుకుంటుంది. ట్యాక్స్‌స్పానర్: మిగతా మూడు వెబ్సైట్లలో ఉచిత సర్వీసులు ఉండగా.. ఇందులో మాత్రం అంతా పెయిడ్ సర్వీసులే. ఒకవేళ మీ ఫారం 16 వివరాలు మీ అంతట మీరే నింపి, రిటర్నులు దాఖలు చేసినా కూడా రూ. 449 కట్టాల్సి ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే ఇందులో ప్రతికూల అంశం ఇదే. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు ఉన్న వారికి దాదాపు 50% డిస్కౌంటు లభిస్తుంది. వెబ్సైటులో ఫైలింగ్ ప్రక్రియ మాత్రం సులువుగా ఉంటుంది. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థలకు వార్షిక సబ్స్క్రిప్షన్ చార్జీలు రూ. 1,499 నుంచి ఉన్నాయి. -
ఆఫ్రికాలో సినిమా టిక్కెట్, అమెరికాలో గుడ్లు రేటు !
సమాచారం: ఇంటర్నెట్ అందరికీ తెలుసు. కానీ ఎలా వాడాలో మాత్రం అందరికీ తెలియదు. మనం వాడుతున్నది ఏదైనా తెలుసుకుని వాడితే గరిష్ట ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుంది. బహుశా ఇంటర్నెట్ వాడుతున్న వారిలో నూటికి నూరు శాతం దాని ప్రయోజనాలు తెలిసిన వారు దాదాపుగా ఉండరట. అదెప్పుడూ నేర్చుకునే విషయమే. అలాంటి ఓ విషయం తెలుసుకోండి. సింగపూర్‌లో రోజు ఖర్చు ఎంత? లాస్ఏంజెల్స్లో అద్దెలు ఎలా ఉన్నాయి? జర్మనీలో జీవితం ఎలా ఉంటుంది? మన దేశం ఖరీదైనదా, వాళ్ల జీవితం ఖరీదైనదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు ఎవరు చెబుతారు? మనకు తెలిసిన వారు విదేశాలకు వెళ్తుంటారు కానీ మనం కోరుకున్న నగరానికి వెళ్లరు కదా... అలాంటపుడు మనం తెలుసుకోవాలనుకున్న ఊరు గురించి మనకు తెలుసుకోవాలనుకున్న విషయాలు ఎవరు చెబుతారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పే వెబ్సైట్లు కొన్ని ఉన్నాయి. www.expatistan.com ఇది జీవన వ్యయాన్ని తెలిపే వెబ్సైట్. ఇందులో మీకు కావల్సిన నగరానికి చెందిన సమాచారం ఉంటుంది. అంటే ఆ ఊర్లో ఏవి ఎక్కడ ఉంటాయని కాదు... మీ సమీప నగరాన్ని ప్రపంచంలో ఏ నగరంతో అయినా పోల్చి చూసుకోవచ్చు. ఇందులో రెండు నగరాలను పోల్చిచూసుకుంటే ఆహారం, నివాసం, దుస్తులు, రవాణా సదుపాయాలు, వ్యక్తిగత ఖర్చులు, వినోదం వంటి ఖర్చులను మీరుంటున్న నగరం కంటే ఎంత ఎక్కువగా ఉన్నాయో చాలా స్పష్టంగా చెబుతంది. వీటికి సంబంధించి స్థూలంగాను, మళ్లీ వాటిలో ఉప విభాగాలను తెలుసుకోవచ్చు. ఇది వికీపీడియా మోడల్లో పనిచేస్తుంది. ఇందులో 1776 నగరాల సమాచారం ఉంది. ఇదంతా ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికులు నమోదుచేసిన సమాచారం. కాబట్టి ఎక్కువ కచ్చితమైన ధరలు తెలిసే అవకాశం ఉంది. ఇది మన రూపాయల్లో ధరను చెబుతుంది. కాబట్టి అంచనా వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. http://www.numbeo.com/ ఇది కేవలం జీవన వ్యయాలకు సంబంధించిన సమాచారాల సమూహమే కాకుండా చాలా విస్తృత సమాచారాన్ని ఇస్తుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్‌కు సంబంధించిన ప్రతి సమాచారమూ దేశాల ప్రకారం, నగరాల ప్రకారం అందించడమే కాకుండా గతంలో ఎలా ఉండేదన్న విషయాన్ని కూడా ఇవ్వడం ఈ సైటు ప్రత్యేకత. ఇందులో కేవలం ఈ కంపేరిజన్ కాకుండా జీవన వ్యయ ర్యాంకింగ్స్, ఇండెక్స్ వంటి సమూల సమాచారం దొరుకుతుంది. అలాగే ఒకదేశంలో నివసించాలంటే ఆ దేశపు శాంతి భద్రతల సమాచారం కూడా తెలిసి ఉండటం అవసరం. అందుకే క్రైమ్‌రేటును కూడా చాలా సంపూర్ణంగా అందిస్తోంది. అలాగే వివిధ దేశాల్లో, నగరాల్లోని స్థలాలు/అద్దెల ధరలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఆరోగ్యపరమైన సమాచారం, ఆ విషయంలో ఆయా దేశాల ర్యాంకింగ్‌లు, పోలికలు ఇస్తున్నారు. కాలుష్యం, ట్రాఫిక్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వంటి అనేక రకాల సమాచారం ఉంటుంది. ఈ పోర్టల్ అన్ని దేశాలకు సంబంధించిన 4433 నగరాల సమాచారాన్ని అందిస్తోంది. ఇది కూడా పాఠకులు అందించిన సమాచారం ఆధారంగా నడుపుతున్నదే. పైగా ఇది లక్షన్నర మంది పాఠకులు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండే సమాచారం. www.ifitweremyhome. com/ జపాన్‌లో పుట్టింటే మనం ఎలా బతికేవాళ్లం? ఏ చైనాలోనో ఉంటే ఎలా ఉండేది? బ్రెజిల్లో పుట్టిఉంటే మన జీతం ఎంత ఉండేది అన్న విషయాలను తెలియజెప్పే ఈ సైటును కొందరు ఔత్సాహికులు పెట్టారు. ఇది కేవలం పాఠకుల ఉత్సుకతను తీర్చడానికి నెలకొల్పిన పోర్టల్ అయినా చక్కటి సమాచారాన్ని ఇస్తోంది. ఇది చాలా విచిత్రమైన విషయాలను కంపేర్ చేసి చూపిస్తుంది. ఉదాహరణకు చిన్నప్పుడు చనిపోయే అవకాశం, విద్యుత్తు, వంటనూనె, డబ్బు వినియోగం, పిల్లలు, ఖర్చు కలిగి ఉండటం, వ్యాధులు సోకే అవకాశం వంటి చాలా చిత్రమైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు నువ్వు పుట్టాలి అనుకున్న దేశానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా ఇస్తుంది. ఇది కాస్త సరదాగా ఉంటుంది. వీటితో పాటు ఇతర దేశాలను, రాష్ట్రాలను సందర్శించినపుడు పనికివచ్చే మరికొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ప్రపంచాన్ని చుట్టేయడానికి అవసరమైన సమారాచాన్నిచ్చే tripadviser.com, వివిధ దేశాల కరెన్సీ ప్రస్తుత, పూర్వ సమారాచారాన్ని ఇచ్చే www.xe.com కూడా మంచి సమాచారాన్ని ఇస్తాయి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతాయి. -
వైఎస్ షర్మిలను కలవలేదు,మాట్లాడలేదు: ప్రభాస్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడలేదని సినీ హీరో ప్రభాస్ స్పష్టం చేశారు. షర్మిలపై కొంత కాలంగా కొన్ని వెబ్సైట్లలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రచారం అంతా నిరాధారం అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ షర్మిళను తానెప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడలేదని ప్రభాస్ తెలిపారు. ఈ ప్రచారంలో అణువంత కూడా నిజం లేదన్నారు. కొన్నాళ్లుగా ఈ రూమర్లను తాను పట్టించుకోలేదని తెలిపారు. అయితే ఇవి మరో వ్యక్తిని తీవ్రంగా బాధపెడుతున్నాయి. అందుకనే తాను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తికి భార్యగా, ఒక తల్లిగా సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తిని తీవ్రంగా దెబ్బతీసేలా ఈ రూమర్లు ఉన్నాయని బాధను వ్యక్తం చేశారు. అందుకే ఈమేరకు ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధారమైన రూమర్లు కారణంగా ఒక వ్యక్తి ఎంత తీవ్రంగా బాధపడతారో, మనస్తాపం చెందుతారో తాను అర్థంచేసుకోగలనన్నారు. ఈ తరహా రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టడానికి తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తన అనారోగ్యంపై కూడా పుకార్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను కోమాలో ఉన్నట్లు, తీవ్రంగా గాయపడినట్లు ఏవేవో ప్రచారం చేస్తున్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఫేస్బుక్లో కూడా ఆయన ఇదే విషయాన్ని తెలిపారు. తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు బహిరంగ లేఖ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. -
షర్మిలను కలవలేదు, మాట్లాడలేదు: ప్రభాస్
-
నెట్టింట్లో దెయ్యం
-
టైమ్‌పాస్ వెబ్సైట్లు...
అనుకుంటాంగానీ... టైమ్‌పాస్ చేసేందుకు ఫేస్బుక్, ట్విటర్లను మించినవి ఇంటర్నెట్లో బోలెడున్నాయి. కళ్లముందు అలా అలా కదిలిపోయే కుక్కపిల్లలు... చిత్రవిచిత్రమైన ఆకారాలు... మౌస్తో కదులుతూ అడ్డూ ఆపు లేకుండా బోలెడంత సేపు వినోదాన్ని పంచేవి... ఇలా ఎన్నో రకాల వెబ్సైట్లతో ఆ బోరుకొట్టే క్షణాలను ఇట్టే గడిపేయవచ్చు. ఉన్న బోలెడింటిలో మచ్చుకు కొన్ని మీ కోసం... 1. theuselessweb.com తెల్లటి హోంపేజీపై...‘నన్ను ఏదైనా ఓ చెత్త వెబ్‌సైట్‌కు తీసుకెళ్లు’ అన్న మెసేజ్ మాత్రమే ఉంటుంది. కింద క్లిక్ చేస్తే... ఒక్కోసారి ఒక్కో రకమైన వెబ్‌సైట్‌కు తీసుకెళుతుంది. ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకునేలోపు నిమిషాలు గడిచిపోతాయి. 2. staggeringbeauty.com నల్లటి గొట్టంలాంటి ఆకారం... మధ్యలో రెండు కళ్లు. అంతే ఈ వెబ్సైట్లో ఉండేది. మౌస్ కదలికలకు అనుగుణంగా ఈ ఆకారమూ కదులుతూ ఉంటుంది. కదిలిస్తూ.. కదిలిస్తూ అలసిపోవాల్సిందే! 3. dontevenreply.com చిత్ర విచిత్రమైన ఈమెయిళ్లు, ప్రకటనలతో నిండి ఉంటుంది ఈ వెబ్సైట్. ఈ చెత్త మెయిళ్లలోనూ టాప్ రేటెడ్ కోసం ప్రత్యేకమైన సెక్షన్లు కూడా ఉన్నాయి దీంట్లో. 4. shutupandtakemymoney.com చిత్ర విచిత్రమైన గాడ్జెట్లు అమ్మకానికి ఉంచిన వెబ్సైట్ ఇది. వీటిల్లో ఏవీ మనకు ఉపయోగపడవు కానీ... ఉంటే బాగుంటుందేమో అని అనిపించేలా ఉంటాయి వీటిల్లోని పరికరాలు. ఎన్ని ఉన్నాయో... అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటూ పోతే.. కాలం గడిచిపోతుందన్నమాట! 5. onreadz.com టైమ్‌పాస్‌కు పుస్తకానికి మించిన స్నేహితుడు ఉండడని అంటారు. ఇది నిజం కూడా. ఈ వెబ్సైట్లోకి వెళితే.. కావాల్సినన్ని పుస్తకాలు ఈ బుక్ వెర్షన్లో అందుబాటులో ఉంటాయి. నచ్చినదాన్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటే సరి! 6. wolframalpha.com గూగుల్ కంటే కొంచెం భిన్నమైన సెర్చ్ ఇంజిన్ వెబ్సైట్ ఇది. రకరకాల అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటే హోంపేజీలోని సెర్చ్ బాక్స్‌లో కీవర్డ్లను టైప్ చేయాలి. ఉదాహరణకు ఇండియా అని టైప్ చేస్తే... మనదేశానికి సంబంధించిన వివరాలు వివరంగా ప్రత్యక్షమవుతాయి. 7. lizardpoint.com/geography/ భూగోళ శాస్త్రం, గణితం వంటి సబ్జెక్ట్‌లతోపాటు పిల్లల కోసం ఆటలు కూడా ఉన్న వెబ్సైట్ ఇది. బ్రౌజర్ ఆధారిత లెర్నింగ్ యాక్టివిటీ ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం. రకరకాల క్విజ్లు, గణితశాస్త్ర వర్క్షీట్లు ఉంటాయి దీంట్లో. 8. weavesilk.com మీలో ఓ మంచి కళాకారుడు, చిత్రకారుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఈ వెబ్సైట్లోకి ఎంటరైపోండి. మౌస్‌ను అటు ఇటు కదిలించండి. మీ కల్లముందు అద్భుతమైన సిమెట్రిక్ చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. వీటిని సేవ్ చేసుకోవచ్చు. షేర్ కూడా చేసుకోవచ్చు. 9. freerice.com చిన్న చిన్న ప్రశ్నలతో కూడిన క్విజ్లు ఈ వెబ్సైట్లో ఉంటాయి. అయితే వీటికి సమాధానాలు చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడంతోపాటు ఇంకొకరికి ఉపకారం కూడా చేయవచ్చు. రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవండి.. వేర్వేరు సబ్జెక్టుల క్విజ్లు ఆన్సర్ చేయండి. సరైన సమాధానం ఒక్కోదానికి పది గింజల బియ్యం బహుమతి. మీకు కాదండోయ్. పేదరికంతో మగ్గిపోతున్న వారికి ఈ బియ్యం అందిస్తామని అంటోంది వెబ్సైట్.! -
వెబ్సైట్లో ‘జేఈఈ మెయిన్’ హాల్‌టికెట్లు
ఏప్రిల్ 6న రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ రాత పరీక్షను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. విద్యార్థులు జేఈఈ మెయిన్ వెబ్సైట్ (www.jeemain.nic.in) నుంచి హాల్‌టికెట్లు(అడ్మిట్ కార్డు) డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 150 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఇక ఆన్లైన్ పరీక్షను ఏప్రిల్ 9, 11, 12, 19వ తేదీల్లో 281 పట్టణాల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే సీబీఎస్ఈ హెల్ప్‌లైన్ కేంద్రాన్ని 8506061072, 8506061073, 8506061075, 8506061076, 8506061077 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది. అభ్యర్థులకు హాల్‌టికెట్లను పంపించడంలేదని, వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అర్హతలకు సంబంధించిన వివరాలు, పత్రాలను పరీక్ష రోజున ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని అంశాలను సమపాళ్లలో తీసుకొని నిపుణులు ఈ ప్రశ్న పత్రాన్ని రూపొందించారని వివరించింది. తేలిక, మధ్యస్తం, క్లిష్ట పద్ధతిలో వీటిని రూపొందించినట్లు వెల్లడించింది. గత ఏడాదిలాగే ఈసారి కూడా ప్రశ్నపత్రాలను రూపొందించినట్లు తెలిపింది. నేడు ‘గేట్’ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించిన గేట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు ఐఐటీ ఖరగ్‌పూర్ గురువారం తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నెల 2 వరకు గేట్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహించింది. ఫలితాలను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు వెబ్సైట్లో పేర్కొంది. వెబ్‌లో.. ‘అబ్జర్వర్స్’ జాబితా సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ విభాగంలో అబ్జర్వర్స్(ఇంజినీరింగ్) పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు జాబితాలను చూసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేసింది. టెన్త్ సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్ష వాయిదా? సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 11న నిర్వహించడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. అదే రోజున పదో తరగతి సోషల్ స్టడీస్ పేపర్-2 నిర్వహణ మీద విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,658 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా పరీక్ష నిర్వహించడం సాధ్యమయ్యే పనికాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 11న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసి, 16న నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. పరీక్ష వాయిదా గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు రాతపూర్వకంగా అందిన తర్వాతే... పరీక్ష వాయిదా గురించి చర్చిస్తామని అధికారులు చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల సాధ్యాసాధ్యాల గురించి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 12న ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్ష మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, 15న వొకేషనల్ కోర్సు థియరీ పరీక్ష ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న ఆదివారం, 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. టెన్త్ పరీక్షల తొలి రోజు 98.9 శాతం విద్యార్థులు హాజరు పదో తరగతి పరీక్షల తొలి రోజు 98.9 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. గురువారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న 50 మంది విద్యార్థులను గుర్తించామని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో గరిష్టంగా 19 మందిని పట్టుకున్నామని చెప్పారు. -
నటుల ఆత్మహత్యలకు వెబ్సైట్లే కారణం: చంద్రబోస్
గుత్తి, న్యూస్‌లైన్: సినీ నటుల ఆత్మహత్యలకు కొన్ని వెబ్సైట్లు కారణమవుతున్నాయని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆధారాలు లేకుండానే నటులపై గాసిప్స్ ప్రచారం చేస్తున్నాయని, చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపుతూ వేదనకు గురిచేస్తున్నాయన్నారు. -
హ్యాకర్ల ట్రెండు... మారిపోయింది..!
మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారు.. అకస్మాత్తుగా రిమోట్ మొరాయిస్తుంది. చానెళ్లు వాటంతటవే మారిపోతాయి. మీరు ఒక చానెల్ పెడితే... టీవీ తెరపై ఇంకేదో చానెల్ ప్రత్యక్షమవుతుంది. మీ టీవీ ఏకంగా మీ పైనే నిఘా పెట్టేస్తుంది! మీరు రోడ్డుపై కారులో రయ్యిన దూసుకుపోతున్నారు. అకస్మాత్తుగా మీ కారు బ్రేకులు ఫెయిలవుతాయి లేదా స్టీరింగ్ బిగుసుకుపోతుంది. చూస్తుండగానే యాక్సిడెంట్ జరిగిపోతుంది! అంతే కాదు... మీ గుండెకు అమర్చిన పేస్‌మేకర్ పరికరం హఠాత్తుగా పనిచేయడం మానేసి గుండెపోటు తెప్పించొచ్చు కూడా! అవును... ఎందుకంటే హ్యాకర్లు ఇప్పుడు ట్రెండు మార్చారు మరి! ఇంతవరకూ కంప్యూటర్లు, వెబ్సైట్లు, ఈ-మెయిళ్లు, క్రెడిట్‌కార్డుల వంటివాటి నుంచి సమాచార తస్కరణకు, ఆర్థికపరమైన దోపిడీకే పరిమితమైన హ్యాకర్లు.. ఇప్పుడు కాదేదీ హ్యాకింగ్కనర్హం అంటూ అన్నిరకాల ఆధునిక టెక్నాలజీలపైనా దృష్టిసారిస్తున్నారు. హ్యాకర్లు తెలివి మీరిపోతుండటంతో హ్యాకింగ్ ప్రక్రియ రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోందని ఇటీవల ‘ఐవోయాక్టివ్’ అనే అంతర్జాతీయ భద్రతా సంస్థ నిపుణులు హెచ్చరించారు. ఆటోమేటిక్ వాహనాలు, టీవీలు, వె బ్ కెమెరాలు, స్మార్ట్ఫోన్లు, వై-ఫైతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నింటినీ హ్యాకర్లు ఇప్పుడు తమ నియంత్రణలోకి తీసుకోగలుగుతున్నారని వారు వెల్లడించారు. గుండెకు అమర్చే పేస్‌మేకర్‌ను సైతం హ్యాక్ చేసి హత్యలు కూడా చేసేయగల స్థాయికి చేరారంటేనే.. టెక్నాలజీ ఎంత పెరిగినా భద్రత మాత్రం డొల్లగానే మారుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్టీరింగ్ చేతిలో ఉన్నా.. కారు మాట వినదు..! హైవేపై కారు గంటకు 90 కి.మీ. వేగంతో రయ్యిన దూసుకుపోతుంటుంది. ఒక్కసారిగా స్టీరింగ్ బిగుసుకుపోతుంది. కారు అడ్డం తిరుగుతుంది లేదా బ్రేకులు ఫెయిలవుతాయి లేదా ఉన్నపళంగా నడిరోడ్డు పైనే అడ్డంగా తిరిగి ఆగిపోతుంది. మొత్తానికి అన్నిరకాలుగా డ్రైవరు నియంత్రణ కోల్పోతాడు. కారు అత్యంత వేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇందులో ఏది జరిగినా పెను ప్రమాదం తప్పదు. కేవలం ఒక బటన్‌ను నొక్కి హ్యాకర్లు ఇదంతా చేయగలరన్నది అసలు సంగతి. భవిష్యత్తులో కంప్యూటర్ల సాయంతో నడిచే ఆటోమేటిక్ వాహనాల వాడకం బాగా పెరగనున్నందున హ్యాకర్లు వాటిని అదుపులోకి తీసుకుని నియంత్రించే ప్రమాదముందని ‘ఐవోయాక్టివ్’ కంపెనీ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కంప్యూటరైజ్డ్ ఆటోమేటిక్ కారును ఎలా హ్యాకింగ్ చేయవచ్చో కూడా వారు ఇటీవల లాస్‌వెగాస్‌లో చేసి చూపించారు. ఒక్క క్లిక్‌తోనే వారు ఓ ఆటోమేటిక్ కారును డ్రైవరు నుంచి పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆటోమేటిక్ కార్లలోని ఏదైనా ఒక్క కంప్యూటర్ను హ్యాక్ చేసినా... ఇక ఆ కారు, అందులో ఉండేవారి భద్రత గాలిలో కలిసినట్టే. రేడియో, యూఎస్బీ పోర్టు, జీపీఎస్ వ్యవస్థ, వై-ఫై వంటి సౌకర్యాలన్నీ హ్యాకర్లకు రాచమార్గాలేనట. అసలు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల కన్నా కార్ల హ్యాకింగే చాలా సులభం అయిపోతుందట. రిమోట్ కంట్రోల్‌తో కార్లను లాక్ చేసేటప్పుడు ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీ స్క్రాంబ్లర్ పరికరంతో సిగ్నళ్లను జామ్ చేసి హ్యాకర్లు లాక్ పడకుండా చేయగలరట. ఇంకేం... కారులో ఉన్న వస్తువులే కాదు... కారును కూడా ఈజీగా మాయం చేసేయొచ్చన్నమాట. ఇల్లు... గుల్లే! ఇంటి విషయానికి వస్తే... స్మార్ట్ ఫోన్ సాయంతో వై-ఫై, బ్లూటూత్‌తో నడిచే ఎలక్ట్రానిక్ పరికరాలతో ఏర్పాటుచేసే ‘లాకిట్రాన్’ వంటి డోర్ లాక్‌లను తెరవడమూ హ్యాకర్లకు పెద్ద కష్టం కాదట. ఒక్క సుత్తిదెబ్బ పడకుండా.. చడీచప్పుడు లేకుండా... తలుపు తెరవగలిగితే ఇంకేముంది... ఇల్లు గుల్ల అవడం ఖాయం! అలాగే ఇళ్లల్లో మన కంప్యూటర్లకు ఉండే వెబ్ కెమెరాలతో, టీవీలు, బల్బులు, ఇతర వస్తువుల్లో అమర్చే ప్రత్యేక పరికరాలతో కూడా నిరంతరం మనం ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడుకుంటున్నాం? ఎవరితో ఉన్నాం? వంటివీ వారు తెలుసుకోవచ్చట. విద్యుత్ బల్బులు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, ఏసీల వంటి వాటినీ హ్యాకర్లు నియంత్రించగలరట. కత్తులతో కాదు... పేస్‌మేకర్‌తో చంపేస్తారు..! కొందరు హ్యాకర్లు ఎంతగా తెలివిమీరి పోయారంటే.. హృద్రోగుల గుండె పనితీరు మెరుగుపర్చేందుకు అమర్చే పేస్‌మేకర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తమ నియంత్రణలోకి తీసుకోగలరట. ఇవన్నీ దాదాపుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్లూటూత్ వంటి టెక్నాలజీలతోనే నియంత్రణలో ఉంటాయి. కాబట్టి.. స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేస్తే.. లేదా బ్లూటూత్‌ను నియంత్రిస్తే వీటి పనితీరును మార్చేయవచ్చన్నమాట. అయితే ఇలా శరీరంలో అమర్చే వైద్యపరికరాలను హ్యాకింగ్ చేయవచ్చని, దీనిని ప్రదర్శించి చూపుతానంటూ హ్యాకింగ్‌లో నిపుణుడైన బార్నబీ జాక్ అనే యువకుడు ఇటీవల ముందుకొచ్చారు. ఇందుకు ‘బ్లాక్ హ్యాట్’ అనే కంపెనీ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది కూడా. కానీ ప్రదర్శనకు కొద్ది సమయానికి ముందే జాక్ చనిపోయాడు. అయితే అతడి మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. కొత్త పరిష్కారాలపై దృష్టిపెట్టాలి... ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నా... వెబ్సైట్ల మీద, కంప్యూటర్ల మీద జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతున్నాం. ఇక వాహనాలు, ఇళ్లు, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్, వైద్య పరికరాలపై కూడా హ్యాకర్ల దాడులు ముమ్మరం అయితే ఏం చేయాలో? అంటూ అంతర్జాతీయ భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఏదేమైనా.. హ్యాకర్లను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే కొత్త పరిష్కారాలు కనుగొనాల్సి ఉందని చెబుతున్నారు. నిపుణుల ఎత్తులకు హ్యాకర్లు ఎప్పటికప్పుడు పైఎత్తులు వేస్తూనే ఉన్నారని... వారి ఆట కట్టించాలంటే నిపుణులు కూడా ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే ఉండాలనీ, వినియోగదారులు తాజా సెక్యూరిటీ అప్డేట్స్ను డౌన్లోడ్ చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. - హన్మిరెడ్డి యెద్దుల ఇలా కూడా చేస్తారు... ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ప్రాచుర్యం పొందిన యాంగ్రీబర్డ్స్ వంటి ఆటల ద్వారా రహస్య కోడ్‌ను పంపి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను నియంత్రణలోకి తీసుకుంటారు. ఐఫోన్ చార్జ్ చేసేందుకు ఉపయోగించే పవర్ అడాప్టర్ ద్వారా కూడా దానిని హ్యాక్ చేస్తారు. స్మార్ట్‌ఫోన్ ఆప్‌తో పనిచేసే టాయిలెట్లను సైతం నియంత్రణలోకి తీసుకోగలరట. దీనివల్ల టాయిలెట్లో నీళ్లు కిందికి చిమ్మే విధానాన్ని కూడా మార్చేస్తారు. ఇంటర్నెట్కు అనుసంధానమై ఉండే లైటు బల్బులను కూడా ట్యాంపర్ చేసి వెలగకుండా చేస్తారు. డిజిటల్ ఫ్రిజ్‌ను ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా చేసి ఆ ఇంట్లోవారికి తెలియకుండానే ఆహారాన్ని పాడు చేస్తారు. ఏసీ యంత్రాలను ఆగిపోయేలా చేసి ఇంట్లోవారికి చెమటలు పట్టించేయగలరు. రేడియో ట్రాన్సీవర్లను ఉపయోగించి తప్పుడు సెన్సర్ సమాచారాన్ని పంపడం ద్వారా వైర్లెస్ టెక్నాలజీతో పనిచేసే విద్యుత్ కేంద్రాలను సైతం హ్యాకర్లు పూర్తిగా ఆగిపోయేలా చేయగలరట! ఇలా... హ్యాకర్లు తలచుకుంటే ఏమైనా చేయగలరు. జాగ్రత్త!