సాక్షి,సిటీబ్యూరో: ఆన్‌లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ స్పెషల్ అపరేషన్ టీమ్ (ఎస్‌వోటీ) పోలీసులు శనివా రం అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన మేరకు.. ఈస్ట్‌గోదావరిలోని దేవరపల్లికి చెంది న జోగేశ్వరరావు కష్ణానగర్, ఎస్‌ఆర్ నగర్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంతమంది వ్యభిచారముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. టెక్నాలజీని ఉపయోగించి.. యువకులను ఆకర్షించే విధంగా యువతు ల అర్ధనగ్నచిత్రాలను వెబ్‌సైట్‌లలో ఆప్‌లోడ్ చేసేవాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన మోడల్స్, ఆర్టిస్టులు, విదేశీ మహిళలు, యాంకర్లను కూడా ఈ వ్యభిచార రొంపి లోకి దింపేవాడు. ఇతర రాష్ట్రాల వ్యభిచార నిర్వాహకులకు ఐదు నుంచి పది రోజుల నగదు అడ్వాన్స్‌గా ఇచ్చి విమాన టికెట్లు సమకూర్చి నగరంలోని స్టార్ హోటల్స్‌లో యువతులను ఉంచేవాడు. విటుల నుంచి రూ.50వేలకుపైగా డబ్బు వసూలు చేసేవాడు. మరో వ్యభిచార నిర్వాహకుడు, గతంలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన లక్ష్మన్నవరి గోపాల్‌తోను కలిసి కొంత మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు.
కొన్ని సందర్భాల్లో ఇక్కడి యువతులను అక్క డకు పంపి పరస్పర అవగాహనతో ఒప్పందం కుదుర్చుకునేవాడు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెం దిన వ్యభిచార నిర్వాహకుడు ఉస్మాన్‌తో మా ట్లాడి వారం పాటు ఒప్పందంపై ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువతిని నగరానికి తీసుకొచ్చాడు. ఈ నెల 19 నుంచి కత్రియా హోటల్ లో ఉంచి కస్టమర్ల వద్దకు పంపిస్తున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ నేతత్వంలోని బృం దం దాడిచేసి వ్యభిచార ప్రధాన నిర్వాహకులు జోగేశ్వరరావు, లక్ష్మన్నవరి గోపాల్, సహాయ నిర్వాహకుడు కీసన గోపాల్‌లను అరెస్టు చేసి, ఉబ్జెకిస్తాన్ మహిళను పట్టుకున్నా రు. వీరి నుం చి రూ.25వేల నగదుతో పాటు కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ‘ఆరు నెలల టూరిస్ట్ వీసాపై తొమ్మిది నెలల క్రితం ఢిల్లీకి వచ్చాను. వీసా గడువు ముగిసి ఇప్పటికే మూడు నెలలు దాటింది. ఈ క్రమంలోనే ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన వ్యభిచార నిర్వాహకులతో పరిచయం ఏర్ప డింది. అలా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాన’ని బాధితురాలు పోలీసు విచారణలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment