సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్ ద్వారా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రత్యేక బృందం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, ఓ మహిళకు విముక్తి కల్పించిందని డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన టి.సతీష్‌గౌడ్ నగరానికి వలసవచ్చి జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివాసముంటున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఆన్‌లైన్‌లో వ్యభిచార దందా చేయడానికి సిద్ధమైన ఇతగాడు ఖమ్మం నుంచి వలసవచ్చిన నాగ కార్తీక్‌ను సహాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన పేద మహిళలు, యువతులకు గాలం వేస్తున్న సతీష్ వారిని సిటీకి తరలిస్తున్నాడు.
అభ్యంతరకరమైన ఫొటోలతో ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తూ తన ఫోన్ నంబర్ వాటిలో పొందుపరుస్తున్నాడు. వీటికి ఆకర్షితులై ఫోన్లు చేసిన వారి నుంచి నగదు వసూలు చేసి యువతుల్ని సరఫరా చేస్తున్నాడు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ బి.చాంద్‌బాష ఇటీవల ఆన్‌లైన్‌లో ఉన్న ఈ ప్రకటన గమనించారు. అందులోని ఫోన్‌నంబర్‌కు కాల్ చేయగా... రూ.3 వేలు తీసుకుని వెంకటగిరి ప్రాంతానికి రావాల్సిందిగా సతీష్ చెప్పాడు. దీంతో డెకాయ్ ఆపరేషన్‌కు రంగంలోకి దిగిన పోలీసులు విటుల మాదిరిగా అక్కడకు వెళ్లి సతీష్‌తో పాటు అతడి ఇంటిపై దాడి చేసి కార్తీన్‌ను పట్టుకున్నారు. వీరి చెరలో ఉన్న యువతికి విముక్తి కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment