gang arrest
-
విస్కీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు
-
దొంగల్లో అతిప్రమాదకరం.. పార్థి ముఠా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జాతీయ, రాష్ట్ర రహదారులపై దారి దోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు, హత్యలకు పాల్పడే ప్రమాదకరమైన ముఠాగా పార్థి గ్యాంగ్‌కు పేరుంది. మహారాష్ట్ర మూలాలు కలిగిన ఈ గ్యాంగ్ ఉమ్మడి జిల్లాలో మూడు నెలలుగా రెచ్చిపోతోంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వెంట దోపిడీలు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ గ్యాంగ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రవేశించి దారుణాలకు పాల్పడుతోంది. దోపిడీలకు అడ్డొస్తే క్రూరంగా హత్యలు చేసే ఈ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరిని పట్టుకున్నారు. మిగతా ఇద్దరిని పట్టుకునేందుకు మహారాష్ట్రకు పోలీసు బృందాన్ని పంపించారు. కట్టంగూర్ వద్ద హత్య పార్థి గ్యాంగ్ పనే..జాతీయ రహదారి వెంట ఇటీవలి కాలంలో జరిగిన దారి దోపిడీలు, హత్య పార్థి ముఠా పనిగానే పోలీసులు గుర్తించారు. శుక్రవారం పెద్ద అంబర్పేట్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డు వద్ద పట్టుకున్న ఇద్దరు దొంగలు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మే 18వ తేదీన హైదరాబాద్‌లో ఇంటిసామాను దింపి తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పామర్రు మండలం చెట్లవారిపురం గ్రామానికి వెళ్తున్న కొల్లూరి రాజవర్ధన్ అనే డీసీఎం డ్రైవర్ కట్టంగూర్ మండలంలోని ఎర్రసానిగూడెం స్టేజీ వద్ద డీసీఎం ఆపుకొని నిద్రిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు అతని కాళ్లను కట్టేసి, గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. రోడ్డుకు అవతలివైపున పడేశారు. ఈ హత్య తామే చేశామని దొంగలు ఒప్పుకున్నట్లు తెలిసింది. అదే కాదు.. ఇతర ప్రాంతాల్లో మరో రెండు హత్యలు చేశామని అంగీకరించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.పార్థి గ్యాంగ్ చేసిన అరాచకాలెన్నో...గడిచిన ఐదు నెలల్లో మొత్తంగా నల్లగొండ జిల్లాలో 279 దొంగతనం కేసులు నమోదు కాగా, అందులో 46 కేసుల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే 103 దోపిడీ, దొంగతనం కేసులు నమోదు కాగా కేవలం మూడు కేసుల్లోనే నిందితులు దొరికారు. మిగతా కేసుల్లో ఎలాంటి పురోగతీ లేదు. అయితే ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఈ దోపిడీలు, దొంగతనాల్లో 15 ఘటనల్లో వారి ప్రమేయమే ఉన్నట్లు శుక్రవారం దొరికిన దొంగలు ఒప్పుకున్నట్లు తెలిసింది. జూన్ 22వ తేదీన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పాండ్రేగుపల్లికి చెందిన కాట్రాల ఉపేందర్, తన స్నేహితుడు బాబాతో కలిసి హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులోని స్వాతి దాబా వద్ద ఆగి రొట్టెలు తిన్నారు. నిద్ర రావడంతో కారులోనే పడుకున్నారు. అర్ధరాత్రి 2.40 గంటల ప్రాంతంలో నిద్ర లేచారు. అంతకుముందే కారు డ్యాష్ బోర్డులో పెట్టిన రూ.2.21 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతోపాటు జూన్ 9వ తేదీన చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని జాతీయ రహదారి వెంట ఉన్న ట్రక్ బేలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం తోట్లపాలెం గ్రామానికి చెందిన పల్లెపు శృతి ఆమె అన్న పంచాక్షరి, వదిన అఖీల, వారి కుమారుడు దేవాన్‡్ష కారు ఆపుకొని నిద్రిస్తున్న సమయంలో కారుపై రాళ్లతో దాడి చేసి బంగారం దోచుకెళ్లారు. అది ఈ గ్యాంగ్ పనేనని పోలీసులు భావిస్తున్నారు. దొరికిపోయే రోజున.. దొంగతనంపోలీసులు వలపన్ని పట్టుకున్న పార్థి గ్యాంగ్‌లోని ఇద్దరు దొంగలు శుక్రవారం తెలవారుజామున ఉదయం 3 గంటలకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం దగ్గర ఒకరి ఇంట్లో కత్తులతో బెదిరించి చోరీ చేశారు. అంతకుముందు చౌటుప్పల్‌లోనూ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో కట్టంగూర్ వద్ద ఒక బైక్ దొంగతనం చేసి దానిని అబ్దుల్లాపూర్‌మెంట్ వద్ద వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ సభ్యులు సాధారణంగా ఫోన్లు వినియోగించరని, బాధితుల ఫోన్లను తీసుకొని వాడుకుంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అత్యవసరం అయినప్పుడే తమ సొంత ఫోన్లను వినియోగిస్తారని, దొంగల్లో ఒకడు తన భార్యకు సొంత ఫోన్లో మాట్లాడగా, అదే ఫోన్‌నంబరు గతంలో దోపిడీ జరిగిన ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించినట్లు తెలిసింది.మూడు నెలలు దొంగతనం.. మహారాష్ట్రలో విక్రయంఒక ప్రాంతంలో మూడు నెలలపాటు వరుస దొంగతనాలు చేస్తారని, ఆ తరువాత మూడేళ్లపాటు ఆ ప్రాంతానికి రాకుండా, మరో ప్రాంతానికి వెళ్లి దొంగతనాలు చేయడం వీరి ప్రత్యేకత అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా తాము పోలీసులకు దొరక్కుండా ఉంటామనే ఆలోచనతో అలా చేస్తారని చెబుతున్నారు. మరోవైపు ఈ గ్యాంగ్ చోరీ చేసిన బంగారం, అభరణాలను మహరాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తామని ఒప్పుకున్నట్లు తెలిసింది. జింకలను వేటాడటమే వృత్తిగా కలిగిన పార్థీ గ్యాంగ్ కుటుంబాలు మహరాష్ట్రలోనూ ఎక్కువ శాతం గుట్టల్లోనే నివసిస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తాము దోపిడీ చేసే సమయంలో ఎవరైనా అడ్డువస్తే కిరాతకంగా హతమార్చేందుకు వెనుకాడకపోవడం వారి నైజమని పేర్కొంటున్నాయి. -
హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లుకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు..
-
కిరాతక ముఠా అరెస్ట్
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దారి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడే అత్యంత కిరాతక ముఠాను అరెస్ట్ చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్బన్ ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్, రూరల్ ఏఎస్పీలు ఎన్.వి.ఎస్.మూర్తి (క్రైం), వై.రిశాంత్‌రెడ్డి (అడ్మిన్)తో కలిసి ఆదివారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ 8న పాలడుగు వద్ద అత్యాచార ఘటన, డిసెంబర్ 6, 7 తేదీల్లో యడ్లపాడు పరిధిలోని లింగారావుపాలెం రోడ్డులో, సొలస వెళ్లే రోడ్లో దారి దోపిడీలు జరిగాయి. పాలడుగు ఘటన సంచలనం సృష్టించింది. ఎనిమిది ప్రత్యేక బృందాలతో జల్లెడ పట్టి నిందితులను పట్టుకున్నారు. అరెస్టయింది వీరే.. ఈ నెల 8న కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ మహానందిరోడ్డు యానాది సంగం కాలనీకి చెందిన ఎ.లింగమయ్య, చిందుకూరు వాసి డి.ఓబులేసు, డి.లింగమయ్య, పాణ్యంటౌన్ వాసి సీహెచ్ హనుమంతు, నెమలికుంట గ్రామవాసి డి.వెంకన్నను చంఘీజ్‌ఖాన్‌పేట గ్రామ పరిధిలోని కొండవీటి కొండల్లో, 9న ఇ.రమణయ్యను నంద్యాలలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.73 లక్షల బంగారం/వెండి సొత్తు, కర్రలు, కత్తులు, సుత్తులు స్వాధీనం చేసుకోగా, రిమాండ్ నిమిత్తం వారిని చిలకలూరిపేట ఏజేసీజే కోర్టుకు తరలించారు. ఇలా చేసేవారు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లింగమయ్యకు డి.జమ్ములు, సుంకన్న, ఓబులేసు బావమరుదులు. డి.జమ్ములు కొడుకు చిన్న లింగమయ్య, వారి బంధువులైన అంకన్న, చిన్న హనుమంతు ముఠాగా ఏర్పడ్డారు. రాత్రి వేళల్లో మోటారు సైకిళ్లపై, నడిచి వెళ్లే జంటలను లక్ష్యంగా చేసుకొని దోపిడీ చేశాక మహిళలపై సామూహిక అత్యాచారాలకు తెగబడేవారు. వీరంతా యువకులే. ఇద్దరు పరారీలో ఉన్నారు. నేరాలివే.. ► గతేడాది సెప్టెంబర్ 8న పాలడుగు వెళ్లే దారిలో చెట్టు కొమ్మను రోడ్డుపై వేసి, భార్య భర్తను అడ్డగించి పొలంలోకి తీసుకెళ్లారు. భర్తను చితకబాది, భార్యపై అత్యాచారం చేసి బంగారు వస్తువులు, డబ్బులు లాక్కున్నారు. ► డిసెంబర్ 6న లింగారావుపాలెం వెళ్లే రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలను మరణాయుధాలతో అడ్డగించి గాయపరిచారు. నగలు, నగదు దోపిడీ చేశారు. ► డిసెంబర్ 7న సొలస గ్రామం వెళ్లే రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలను అడ్డగించి వారిని చితకబాది నగలు, నగదు ఎత్తుకెళ్లారు. అర్బన్ పరిధిలో 18 దారి దోపిడీ కేసులు, రూరల్ పరిధిలో 5 కేసులు నమోదయ్యాయి. -
బీహార్ గ్యాంగ్: పక్కా ప్లాన్ చేసి రాత్రి ఆయితే..
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీలోని చాందిని చౌక్ మార్కెట్ ప్రాంతంలో స్థిరపడిన బీహార్ గ్యాంగ్ దుకాణాలను టార్గెట్‌గా చేసుకుంది. నగరంతో పాటు కేరళలోనూ మూడు షాపుల షట్టర్లు పగుల కొట్టి (లిఫ్టింగ్) చోరీలు చేసింది. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దీనిపై కేరళ అధికారులకు సమాచారం ఇచ్చినా... వారి నుంచి స్పందన లేదు. బీహార్‌కు చెందిన షేక్ మసిరుద్దీన్ చాందినీ చౌక్‌లో ఎలక్టాన్రిక్ వస్తువులు విక్రయిస్తుంటాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో షెట్టర్ లిఫ్టింగ్స్ మొదలెట్టాడు. కొందరితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని 2019లో మహంకాళి, మాదాపూర్, రాయదుర్గం ఠాణాల పరిధిలో నేరాలు చేశాడు. ఈ కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన అతగాడు కొన్నాళ్లు స్వస్థలంలో ఉండి మళ్లీ ఢిల్లీ చేరాడు. ఈసారి వరుస నేరాలు చేయడానికి చాందినీ చౌక్‌లోనే చిరు వ్యాపారులుగా ఉన్న బీహారీలు మహ్మద్ ఎజాద్, పర్వేజ్ ఆలం, మహ్మద్ జావేద్, మహ్మద్ అక్తర్ హుస్సేన్, ఆసిఫ్ ఆలంలతో కొత్త ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా ఆగస్టు 24న రైలులో సిటీకి వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో తలదాచుకున్నారు. మరుసటి రోజు మార్కెట్ ప్రాంతంలో కట్టర్, ఇనుప రాడ్డు, స్క్రూడైవర్ ఖరీదు చేశారు. వీటిని పట్టుకుని అదే రోజు అర్థరాత్రి రోడ్డుపై సంచరిస్తూ పలు దుకాణాల వద్ద రెక్కీ చేశారు. అక్కడి హోల్‌సేల్ కిరాణా దుకాణం డైమండ్ హౌస్ చోరీ చేయడానికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాళ్లు చుట్టుపక్కల గమనిస్తుండగా... మసీరుద్దీన్ షట్టర్ పగులకొట్టి లోపలకు వెళ్లాడు. క్యాష్ కౌంటర్లోని డబ్బు తస్కరించి మళ్లీ రైల్వే స్టేషన్ వద్దకు చేరారు. అక్కడ నుంచి 26వ తేదీ తెల్లవారుజామున కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. రైలులో కేరళలోని కసరగోడ్ చేరుకున్నారు. ఆ ప్రాంతంలో మరో రెండు దుకాణాల్లో దా దాపు రూ.50 లక్షల సొత్తు చోరీ చేసి రైలులో నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. మార్కెట్ కేసు దర్యాప్తు కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరి విచారణలో నగరంలో నేరంతో పాటు కేరళలో చేసినవీ బయటపడ్డాయి. వాటికి సంబంధించి రూ.50 వేలు రికవరీ కూడా చేశారు. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చి పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లమని కోరారు. అయితే ఇప్పటి వరకు కేరళ పోలీసుల నుంచి స్పందన లేదు.ఢిల్లీ గ్యాంగ్ కసరగోడ్‌లో చేసిన నేరాలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయలేదని తెలుస్తోంది. తాజాగా నమోదు చేయాలంటే సాంకేతిక ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు ఈ ఢిల్లీ గ్యాంగ్ విషయాన్ని పట్టించుకోవట్లేదని అనుమానిస్తున్నట్లు నగర పోలీసులు చెప్తున్నారు. చదవండి: Falaknuma Dancer: డ్యాన్సర్ మృతి కేసు: వివాహేతర సంబంధమే కారణం.. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో -
అటెన్షన్ డైవర్ట్ పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్
-
గుంటూరు : తిమింగళం లాలాజలం విక్రయించే ముఠా అరెస్ట్
-
గ్యాంగ్స్టర్ల పేరుతో బెదిరింపులు
సాక్షి, నేరేడ్మెట్: రాజకీయ నాయకులు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకొని గ్యాంగ్స్టర్ల ముసుగులో బెదిరిస్తూ దోపిడీలకు యత్నించిన ముగ్గురు యువకులు రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు చిక్కారు. శనివారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు తెలిపారు. ► యాదాద్రి భువనగిరి జిల్లా మటూరుకు చెందిన సందెపల్లి క్రాంతికుమార్(23), సందెపల్లి సింహాద్రి(19) అన్నదమ్ములు. సోమరాజిగూడేనికి చెందిన సంగి జశ్వంత్(20) వీరి స్నేహితుడు. ► సింహాద్రి ఆన్లైన్లో నీటి సరఫరా కోసం మొబైల్‌యాప్‌ను రూపొందించాడు. క్రాంతికుమార్ సూచన మేరకు సింహాద్రి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత బీర్లా ఐలయ్యను కలిసి పెట్టుబడి పెట్టాలని కోరాడు. అయితే ఆయన అంగీకరించలేదు. మరికొందరిని కూడా కలిసినా వారూ నిరాకరించారు. దీంతో ముగ్గురు కలిసి సులభంగా డబ్బులు సంపాందించాలని నిర్ణయించుకున్నారు. గ్యాంగ్స్టర్ల ముసుగులో బెదిరించి దోపిడీలు చేయాలని పధకం వేశారు. ► ఐలయ్యకు గ్యాంగ్‌స్టర్ ఖలీల్‌గా పరిచయం చేసుకొని రూ. 5కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని సింహాద్రి బెదిరించాడు. అయితే వారి పాచిక పారలేదు. తరువాత మహిళల పేరిట ఆకర్షించి దోచుకోవాలని భావించి శ్రీనివాస్ అనే వ్యక్తితో క్రాంతి చాటింగ్ చేశారు. రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై బాధితులు యాదగిరిట్టు, ఆలేరు ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు సరికొత్త మొబైల్ ట్రాకింగ్ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఇతర అన్ని కోణాల్లో విచారణ చేసి నిందితులను గుర్తించారు. ఈ మేరకు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించడంతో నిందితులను అరెస్టు చేశారు. -
హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. బీదర్‌లోని హిందూ డ్రగ్స్ ఫార్మా ఎండీ ఎన్వీరెడ్డిని అరెస్ట్ చేశారు. మియాపూర్‌లో అతడిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. ఎన్వీరెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో దొరికిన రూ. 62 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. హిందూ ఫార్మా నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ ముఠా.. డ్రగ్స్ సరఫరా చేస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. చదవండి: ‘నాతో రాకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా’ మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
పీఎంపాలెం (భీమిలి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను శనివారం రాత్రి విశాఖ పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్‌ల ప్రక్రియ సూత్రధారి పరారు కాగా నలుగురిని అరెస్టు చేశారు. వారివద్ద నుంచి సుమారు రూ.3 లక్షలు విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను పీఎంపాలెం సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. ఈ నెల 9 నుంచి జరుగుతున్న పాకిస్తాన్ సూపర్‌లీగ్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌లపై వీరు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రుషికొండ పనోరమాహిల్స్ సెలబ్రిటీ టవర్స్ 15వ అంతస్తులోని ఫ్లట్‌ను చేబోలు శ్రీనివాస్ ఎలియాస్ కేబుల్ శ్రీను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించేందుకు ఎల్రక్టానిక్ పరికరాలు సిద్ధం చేశాడు. విశాఖలోని అక్కయ్యపాలేనికి చెందిన కుంచంగి రవికుమార్ (29), సుజాతానగర్‌కు చెందిన తమ్మారెడ్డి ధనుంజయ్ (34), శ్రీకాకుళం జిల్లా నరసయ్యపేట మండలం బుచ్చిపేట మండలానికి చెందిన మార్పు శివాజీ (29), విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన వీరపునేని రాంబాబు (43)లను ఉద్యోగులుగా నియమించాడు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒకేసారి 30 మందితో 30 సెల్ఫోన్ల ద్వారా మాట్లాడగల సామర్థ్యం ఉన్న సెటప్ బాక్సు ఏర్పాటు చేసి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. తప్పుడు రేటింగ్‌లు చెబుతూ.. పాకిస్తాన్ సూపర్‌లీగ్ టీ–20 మ్యాచ్‌లలో శనివారం రాత్రి 9.30 గంటలకు కెట్ట గ్లాడియర్స్–పెషావర్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. క్రికెట్ లైవ్ గ్రూపులో చూస్తూ మ్యాచ్ గెలుపోటములపై కోడ్ ద్వారా అసలు రేటింగ్‌కు బదులు తప్పుడు రేటింగ్‌లు చెబుతూ బెట్టింగులు కాసేవారిని తప్పు దోవ పట్టిస్తూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందడంతో పీఎంపాలెం సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి నలుగురు నిందితులను అరెస్టుచేసి వారివద్ద నుంచి పలు పరికరాలు, రూ.1,500 నగదు స్వాదీనం చేసుకున్నారు. అప్పటికే ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. -
సుంకి చెక్ పోస్టు: సంచుల కొద్దీ నకిలీ నోట్ల పట్టివేత
సాక్షి, కొరాపుట్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) సుంకి చెక్ పోస్టు వద్ద పొట్టంగి పోలీసులు సోమవారం సాయంత్రం భారీగా నకిలీ నోట్లను పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై సునాబెడ ఎస్డీపీఓ నిరంజన్ బెహచరా పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి పోలీసులు పట్టుకున్న నకిలీ నోట్లతో పాటు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. పొట్టంగి ఎస్సై ఎస్.కె.స్వంయి, ఏఎస్సై ఎమ్.ఎస్.నాయక్‌లు వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఒక ఫోర్డు ఫిగో కారు రావడంతో ఆపి తనిఖీ చేయగా నకిలీ రూ. 500 నోట్లు ఆ కారులో సంచుల కొద్దీ కనబడ్డాయి. కారులో ఉన్న ముగ్గురు నిందితులు, నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జంగిర్చంపా జిల్లాకు చెందిన నిందితులు రాజధాని రాయిపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న వారి సహచరులకు నకిలీ నోట్లు చేరవేసేందుకు వెళ్తున్నారు. మెజిస్ట్రేట్ సమక్షంలో నకిలీ నోట్లను లెక్కపెట్టగా రూ.7,90,00,000 ఉన్నాయని, నేరస్తులను అరెస్టు చేయడంతో పాటు వారి దగ్గర గల రూ.35 వేల నగదు, 5 మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్డీపీఓ నిరంజన్ బెహరా వివరించారు. -
మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు..
సాక్షి, మీర్‌పేట: ఖాళీ ప్లాట్లపై కన్నేసి యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను విక్రయించి మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాదర్గుల్కు చెందిన వల్లాల ప్రేమ్‌కుమార్ (45), బాలాపూర్‌కు చెందిన చెరుకూరి కిరణ్‌కుమార్, శ్రీనివాస్‌నాయక్, కృష్ణారెడ్డి, హేమలత, నరేష్, వి.శివారెడ్డి, ఏ.సంతోష్, ఎలిమినేటి సుకుమార్‌రెడ్డిలు కలిసి 1980–90 నాటి వెంచర్లలోని ఖాళీ ప్లాట్లపై కన్నేసి వాటికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసి అసలు యజమానులకు తెలియకుండా ఇతరులకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన అక్కాచెళ్లెల్లు తుమ్మల రమాదేవి, తుమ్మల యహేమలతలకు చెందిన మీర్‌పేట నందిహిల్స్ సర్వే నం.29లో రెండు ప్లాట్ల (నం–21, 22)కు సైతం 1985 నాటి నిజమైన పత్రాలను పోలి ఉండేలా నకిలీ పత్రాలను తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న ప్లాట్ల యజమానులు రమాదేవి, హేమలత వెంటనే మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకూరి కిరణ్‌కుమార్‌తో కలిసి మొత్తం 8 మంది సభ్యులు మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఏ3గా ఉన్న వల్లాల ప్రేమ్‌కుమార్, ఏ6గా ఉన్న ఎలిమినేటి సుకుమార్‌రెడ్డిలను శుక్రవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ పత్రాలు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నాడని సీఐ పేర్కొన్నారు. -
సిమ్ స్వాప్ చేసి లక్షలు కాజేస్తున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దశాబ్ద కాలంగా మోసాలకు పాల్పడుతున్న మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, 4 రబ్బరు స్టాంపులు, 15 మొబైల్ ఫోన్లు, నకిలీ లెటర్ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 నుంచి సిమ్ స్వాప్ దందా చేస్తూ రూ.కోట్లు కాజేశారని తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పలు సంస్థల ఆర్థిక లావాదేవీలు చేస్తున్న ఫోన్ నంబర్లనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారని వివరించారు. ఆ లావాదేవీలు చేస్తున్న మొబైల్ సిమ్‌లను బ్లాక్ చేసి నిందితులు నగదు కాజేస్తున్నారని తెలిపారు. వీరి బారిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మోసపోయారు. వీరిద్దరి నుంచి రూ.11 లక్షలు కాజేశారని చెప్పారు. అయితే ఈ ముఠాకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక అకౌంట్లు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. కాజేసిన డబ్బులను బిట్‌కాయిన్, హవాలా ద్వారా నైజీరియాకు పంపిస్తున్నారని వెల్లడించారు. -
సోఫియాను అంటూ హైదరాబాద్ వ్యక్తికి కాల్..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్‌ల పేరుతో అమాయకులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియా, ఘనా తదితర దేశాలకు చెందిన ఎక్‌పాల్‌గడ్‌స్టీమ్, అడ్జల్, కిక్కి కాన్ఫిడెన్స్ దావిద్, పి. క్రోమవోయిబో, ఎజిటర్ డానియల్ కొంత కాలంగా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో మకాం వేసిన వీరు ‘డింగ్ టోన్’ యాప్ ద్వారా అబ్బాయిలతో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన యువకుడికి సోఫియా అమ్మాయి పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నామని మెసేజ్ పంపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో లాండ్ అయ్యానని, తన వద్ద 75 వేల విదేశీ కరెన్సీ, గోల్డ్ చైన్, మొబైల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులు ఉన్నాయని, వాటికి సంబందించి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని చెబుతూ బాధితుడితో డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని మల్కాజిగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు సీపీ తెలిపారు. నిందితుల ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్‌లను సీపీ అభినందించారు. -
‘నయా’ వేటగాళ్లు దొరికారు
సాక్షి, నిజామాబాద్ : విదేశీ టెలిస్కోపిక్ రైఫిళ్లు.. రాత్రివేళల్లో సైతం స్పష్టంగా చూడగలిగే బైనాక్యులర్లు.. శక్తిమంతమైన సెర్చ్లైట్లు.. ఇవి వారి అధునాతన వేట పరికరాలు.. నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణులను వేటాడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా ఎట్టకేలకు చిక్కింది. జకోరాలో ఓ రైస్‌మిల్లును నడుపుతున్న హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు చెందిన లుక్మాన్ అఫ్రిది (47), ఇమ్రాన్ అఫాండి (50), ఎండీ ఫారుఖ్ఖాన్ (23), షేక్రాజ్ అహ్మద్ (43), ఎండీ జమీలుద్దీన్ (61)లను అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం తెలిపారు. వీరిపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గుడిమల్కాపూర్‌లో లుక్మాన్ అఫ్రిది ఇంట్లో కూడా వన్యప్రాణుల మాంసం లభించినట్లు పేర్కొన్నారు. చదవండి: నటి చిత్ర మరణంపై అనుమానాలు పక్కా సమాచారంతో.. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ ముఠా శుక్రవారం రాత్రే నిజామాబాద్ జిల్లా హున్సా, మందర్న ప్రాంతాల్లో వన్యప్రాణుల వేటకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌వో నేతృత్వంలోని అధికారుల బృందం ఆదివారం వర్ని మండలంలో తనిఖీలు నిర్వహించింది. ఇందులో భాగంగా జకోరా వద్ద ఉన్న బిన్నీ రైస్‌మిల్లును తనిఖీ చేసి ఆ ముఠాను అదుపులోకి తీసుకుంది. అక్కడ సెర్చ్ చేయగా రెండు టెలిస్కోపిక్ సైలెన్సర్ రైఫిళ్లు, మందుగుండు సామగ్రి, నైట్‌విజన్ బైనాక్యులర్, కత్తులు, సెర్చ్‌లైట్లతో పాటు కుందేలు మాంసం లభించాయి. అలాగే ఆ ముఠా తీసుకొచ్చిన ఓ టాటా సఫారీ వాహనాన్ని కూడా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: నీళ్లు తాగేందుకు వస్తే.. కాళ్లు నరికారు అలవాటుగా వేట.. అటవీశాఖ అధికారులు అరెస్టు చేసిన ముఠాకు నేతృత్వం వహిస్తున్న లుక్మాన్ అఫ్రిది తరచూ వన్యప్రాణులను వేటాడుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. అఫ్రిది తన స్నేహితులతో కలసి వర్ని అటవీ ప్రాంతంలో వేటకు వచ్చినట్లు సమాచారం రావడంతో అప్రమత్తమైన అటవీశాఖ విజిలెన్స్ బృందం వారి కదలికలపై నిఘా పెట్టి ఆట కట్టించింది. -
సెల్ఫోన్లు కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో పెట్టేసి..
సాక్షి, హైదరాబాద్: రహదారుల సమీపంలోని మొబైల్ షాపుల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వీటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తారు. వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తారు. ఇదీ అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా పని. వీరిని ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ ఠాణా పరిధిలోని రిలయన్స్ డిజిటల్ షాపులో గత నెల 14న తెల్లవారుజామున 119 సెల్ఫోన్లు తస్కరించి ముంబైకి తీసుకెళ్లిన ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 113 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్‌లతో కలిసి సీపీ సజ్జనార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ప్రధానంగా వీటిపైనే దృష్టి.. ⇔ ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ తాబ్రేజ్ దావూద్ షేక్ నాగ్‌పూర్‌లో చోరీ కేసుల్లో 2016లో జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో మరో నిందితుడు రాజు పాండురంగతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఫర్హాన్ ముంతాజ్ షేక్, రషీద్ మహమ్మద్ రఫీక్ షేక్, మహమ్మద్ షుఫియాన్ షేక్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ⇔ కర్ణాటకలోని బ్రహ్మపురంలో 80 సెల్ఫోన్లు, సూరత్‌లోని ఓ మొబైల్ షాప్‌లో 180 సెల్ఫోన్లు అపహరించారు. దీంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో నేరాలు చేస్తే దొరికిపోతామనే భయంతో హైదరాబాద్‌కు అద్దె వాహనం (ఇన్నోవా)లో వచ్చారు. ⇔ నంబర్ ప్లేట్‌ను ఏపీ09గా మార్చి గత నెల 13న నగరానికి చేరుకున్నారు. ప్రధాన రహదారి వెంట సెల్‌ఫోన్ షాప్‌లను పరిశీలించారు. 14వ తేదీ వేకువ జామున మియాపూర్‌లోని రిలయన్స్ డిజిటల్ షాప్ షెట్టర్లను గడ్డపార, ఇతర సామగ్రితో పగులగొట్టి తెరిచారు. 119 సెల్ఫోన్లు సంచిలో వేసుకొని కారులో వెళ్లారు. ⇔ పంజాగుట్ట ఓ షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచి ఖజానాలో ఉన్న రూ.4వేలు తీసుకున్నారు. అనంతరం పటాన్‌చెరులోని వైన్స్ దుకాణం షెట్టర్ పగులగొట్టి రూ.700 నగదుతో పాటు మద్యం సీసాలను దొంగిలించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ముంబై పోలీసుల సహకారంతో... ⇔ సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు నిందితులు వాడిన వాహనం ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లిందో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని గుర్తించి సమీప రాష్ట్రాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. ⇔ షోలాపూర్ టోల్‌ప్లాజా నుంచి ముంబైకి వెళ్లినట్టుగా తెలిసింది. వెంటనే మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు బృందాలు ఏర్పడి 20 రోజులకుపైగా అక్కడే తిష్ట వేశారు. ముంబై పోలీసుల సహకారంతో అయిదుగురిని పట్టుకున్నారు. ⇔ ‘గతంలో చోరీ చేసిన సెల్ఫోన్లను ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు విక్రయిస్తామని, నగరంలో చోరీ చేసిన సెల్ఫోన్లను సైతం అలాగే విక్రయిద్దామనుకున్నాం’ అని నిందితులు విచారణలో వెల్లడించినట్లు, వీరిని ట్రాన్సిట్ వారెంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చినట్లు సీపీ వివరించారు. -
గంజాయి రవాణా చేసే నార్త్ ముఠాకు చెక్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కంచరపాలెం పోలీసుల స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరివద్ద నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టు అయిన వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారని, ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల నుంచి గంజాయి సేకరిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ప్యాకెట్లుగా మార్చి గుట్టుగా రైళ్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఈ ఐదుగురు నిందితులు డిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు రైల్యే ఉద్యోగం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. విశాఖ ఎజెన్సీ ప్రాంతాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు గంజాయిని రైలులో తరలించే క్రమంలో వీరిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రవణ్ తెలిపారు. -
‘గొల్లాస్ గ్యాంగ్’ అరెస్ట్
సాక్షి, అమరావతిబ్యూరో: పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం దోపిడీ దొంగలు జన నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిపూట ఆ ఇళ్ల తలుపులు పగులగొట్టి ఇంట్లో నిద్రిస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలకు పాల్పడేవారు. ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠాల్లో పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ ముందువరుసలో ఉంటుంది. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో ఈ ముఠాలు దోపిడీలకు తెగబడేవి. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత ఆ ముఠా తరహాలోనే విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉయ్యూరు మండలం కాటూరులో ఈ నెల 10న అర్ధరాత్రి ఓ ఇంట్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు 62 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదుతోపాటు ఓ సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణ చేసి తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు దోపిడీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉయ్యూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తలుపులు పగలగొట్టి బీభత్సం.. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగ రజనీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులు, చేతులకు గ్లౌజులు, నిక్కర్లు ధరించి ఇంటి తలుపును గునపాలు, బండరాయితో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు బద్ధలవుతున్న శబ్దం విన్న రజనీకాంత్ అతని భార్య హాలులోకి వచ్చేసరికి దోపిడీ దొంగలు వారిని కత్తులు, గునపాలతో బెదిరించి చేతులు కట్టేశారు. ఇంట్లో విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. తమ వద్ద ఉన్న 62 గ్రాముల బంగారు ఆభరణాలు ఇవ్వగా.. కోళ్లఫారం వ్యాపారివి నీ వద్ద ఇంతేనా ఉండేదని ప్రశ్నించగా.. రజనీకాంత్ తనకు కోళ్లఫారం లేదని.. పక్కింట్లోని వ్యక్తిదని పేర్కొనడంతో దొంగలు కొంత శాంతించారు. తర్వాత బంగారు ఆభరణాలతోపాటు ఒక ఐఫోన్‌ను రూ. వెయ్యి నగదును తీసుకెళ్లిపోయారు. చివరగా దొంగల సృష్టించి భయోత్పాతానికి రజనీకాంత్ దంపతులు తమ వద్ద ఉన్న వెండి ఆభరణాలు ఇవ్వగా వాటిని తిరిగి వారికే ఇచ్చేశారు. ఆధారాలు సేకరించి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరు పరిశీలించారు. ఘటనా స్థలం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సేకరించిన వివరాలను విశ్లేషించారు. దొంగల పాద ముద్రలు దొరికాయి. బాధితుల చెప్పిన వివరాల మేరకు దోపిడీకి వచ్చిన నేరగాళ్లు వచ్చిరాని తెలుగులో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అంతరాష్ట్ర ముఠా పనేనని అనుమానించారు. మిర్యాలగూడ దోపిడీతో కేసు కొలిక్కి.. కాటూరులో దోపిడీ ఏ ముఠా చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. అచ్చం ఈ తరహా దోపిడీనే డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో జరిగినట్లు తెలిసింది. వెంటనే సీసీఎస్ పోలీసులు అక్కడకు వెళ్లి బాధితులతో మాట్లాడగా.. అక్కడ కూడా నలుగురు వచ్చీరాని తెలుగులో మాట్లాడారని, ఒక్కడు మాత్రం కోస్తా యాసలో స్పష్టమైన తెలుగు మాట్లాడినట్లు వారు తెలిపారు. దీంతో ఈ తరహా దొంగతనాలు చేసే ముఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని దర్యాప్తు చేపట్టి.. చివరకు ఈ దోపిడీకి పాల్పడింది తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ అని గుర్తించారు. తాత ముత్తాల నుంచి ఇదే వృత్తి.. దీంతో ఈ ముఠా సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు? అని పరిశోధించగా చివరకు తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో పాల శివ, అతని కుమారుడు పాల వేణు, తమ్ముడు పాల లక్ష్మినారాయణ, పెనుమాక మహేష్, మేకల ఏసు, దొడ్డి పోతురాజులు అద్దెకు ఇల్లు తీసుకుని జీవిస్తున్నట్లు గుర్తించారు. దోపిడీ వీరి పనేని తేలడంతో పోలీసులు వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా పాల లక్ష్మినారాయణ పరారీలో ఉన్నాడు. పాల శివపై 35 వరకు దోపిడీ కేసులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పక్కా రెక్కీ.. అనంతరమే దోపిడీ.. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయాల్లో కోళ్లు, గొర్రెలు, మేకలు, బడ్డీ కొట్లు వంటి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడే ఈ ముఠాకు పాల శివ నేతృత్వం వహిస్తాడు. కాటూరు గ్రామంలో నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రజనీకాంత్ ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నారు. రెక్కీ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అందరూ పాల శివ ఆటోలో బయలుదేరి వెళ్లారు. ఆటోను రజనీకాంత్ ఇంటి సమీపంలో ఉన్న కోళ్లఫారం దగ్గర ఉన్న వెంచర్లో పార్క్ చేశారు. ఆ తర్వాత రజనీకాంత్ ఇంటి ప్రహరీ గోడను దూకి మొదట గునపంతో తలుపు తీయడానికి యత్నించారు. సాధ్యపడకపోవడంతో ఇంటి వెనుకవైపు ఉన్న పెద్ద బండరాయితో తలుపును బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. -
అదుపు తప్పిన బాలుడు.. నగరంలో దందాలు
చాంద్రాయణగుట్ట: తనకంటే పెద్ద వారిని ముఠాగా ఏర్పాటు చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడి ఉదంతాన్ని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఘటనలో పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సూత్రధారి మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్య కుమార్ తెలిపిన మేరకు.. బాల్యం నుంచే నేర ప్రవృత్తిని ఎంచుకున్న బాలుడు శాస్త్రీపురానికి చెందిన మహ్మద్ వకీల్ అలియాస్ పర్వేజ్ (21), బహదూర్‌పురాకు చెందిన షేక్ హుస్సేన్ అలియాస్ గోర్ (30), కామాటీపురాకు చెందిన మహ్మద్ దస్తగిర్ (24), తీగలకుంటకు చెందిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ మస్తాన్ (25), దూద్‌బౌలికి చెందిన గౌస్ పాషా (24), జహనుమాకు చెందిన గౌస్ మోయినోద్దీన్ అలియాస్ మాము (64), తాడ్‌బన్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ ఇమ్రాన్ (23), కామాటీపురాకు చెందిన షాబాజ్ ఖాన్(26), తీగల కుంటకు చెందిన హసన్ అంజా (28), కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్ (19)లను అనుచరులుగా ఏర్పాటు చేసుకొని దోపిడీలకు పాల్పడసాగాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మధుమోహన్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఇందులో పదో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులను తదుçపరి విచారణ నిమిత్తం కామాటీపురా పోలీసులకు అప్పగించారు. నిందితుల వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఒక డాగర్, ఎనిమిది సెల్పోన్లు, రెండు తాళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాల్యం నుంచే అదుపు తప్పి... మైనర్‌గా ఉన్న బాలుడి తండ్రి చిన్న తనంలోనే ముంబైకి వెళ్లడంతో తల్లితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే పాఠశాలలో ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను బెదిరిస్తూ అవారాగా మారాడు. మద్యానికి బానిసయ్యాడు. ఏడు కేసులలో ప్రమేయముండి జువైనల్ హోంకు వెళ్లి వచ్చినా తన నేర జీవితాన్ని మార్చుకోకుండా ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. వీరందరికి లీడర్‌గా ఉంటూ నేరాలకు పాల్పడసాగాడు. కామాటీపురా అనుమియా గూడ శ్మశాన వాటికను అడ్డాగా చేసుకొని నేరాలు చేయసాగాడు. ఇప్పటికే ఆ యువకుడు రెండు హత్య కేసులతో పాటు ఐదు హత్యాయత్నం కేసులలో ప్రమేయం ఉన్నాడు. ఇటీవల ఫిబ్రవరి మాసంలో కామాటీపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జువైనల్ హోంకు వెళ్లాడు. -
అమావాస్య గ్యాంగ్ అరెస్ట్
దొడ్డబళ్లాపురం : అమావాస్య రోజే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారిన అమావాస్య గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తుమకూరు టౌన్ సీతకల్లు గ్రామం నివాసి గణేశ్, తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా వడ్డగెరె గ్రామం నివాసి వినయ్కుయార్లన అరెస్ట్ చేశారు. వీరు అమావాస్య రోజే బైక్ చోరీలకు పాల్పడ్డం విశేషం. నిందితులు బెంగళూరు, తుమకూరు, నెలమంగల పరిధిలోనే బైక్‌లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడేవారు. చోరీ చేసిన బైక్‌లను స్నేహితుల ఇళ్లల్లో ఉంచి కస్టమర్లను వెదికి విక్రయించేవారు. రెండు రోజుల క్రితం బెంగళూరు గొట్టగెరెలో యమహ ఎఫ్‌జడ్ బైక్ చోరీ చేసి తుమకూరు వైపు వెళ్తుండగా లక్కూరు గ్రామం వద్ద దాబస్‌పేట పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరినీ విచారించిన పోలీసులు వారు దాచి ఉంచిన 13 ఖరీదైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వీరి గ్యాంగ్‌లో ఎవరెవరున్నారు?ఎ క్కడెక్కడ చోరీలు చేసారనే సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు. -
డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు
కంటోన్మెంట్: నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముగ్గురు ముఠా సభ్యులను గురువారం బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు ముగ్గురినీ మాటు వేసి పట్టుకోవడంతో వారి నుంచి విలువైన మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను బేగంపేట ఏసీపీ రామ్‌రెడ్డి, బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం పట్టణానికి చెందిన తాడిమర్రి చెన్నకేశవులు రెడ్డి స్థానిక సీవీరామన్ జూనియర్ కళాశాలలో పీఆర్ఓగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తాను ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న ఎపిడ్రిన్ (క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని పెంచే పదార్థం) డ్రగ్‌ను విక్రయించేందుకు ఇటీవల నగరానికి వచ్చాడు. తాడిపత్రికి చెందిన టప్పల్ సిలార్ అహ్మద్ వలీ ద్వారా నగరంలోని గాజులరామారానికి చెందిన ఆకుతోట కిషోర్‌ను కలిశారు. బోయిన్‌పల్లిలోని స్వీట్ హార్ట్ హోటల్ వద్ద డ్రగ్ కొనుగోలుదారుడి కోసం వేచిచూస్తున్న క్రమంలో డీఐ స్వామి గౌడ్ ఆధ్వర్యంలోని బృందం దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. రూ.50 వేలకు కొని రూ.10 లక్షలకు అమ్మేయత్నం... ప్రధాన నిందితుడు చెన్నకేశవరెడ్డి తాను, అనంతపురానికి చెందిన సీనయ్య నాయుడు (పరారీలో ఉన్నాడు)తో కలిసి 2017లో 600 గ్రాముల ఎపిడ్రిన్ డ్రగ్‌ను రూ.50వేలకు కొనుగోలు చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. రెండేళ్లుగా దాన్ని అమ్మలేకపోయాడు. ఇదే విషయాన్ని రెండు నెలల క్రితం రమణ (పరారీలో ఉన్నాడు)కు తెలుపగా, అతడు డ్రగ్ సాంపిల్ తీసుకుని దాన్ని రూ.10 లక్షలకు విక్రయిస్తానని చెప్పాడు. రమణ సూచనల మేరకు అమ్మద్ వలీకి డ్రగ్ అప్పగించగా, అతడు కిశోర్‌ను సంప్రదించాడు. కిశోర్ ఓ కొనుగోలుదారుడితో మాట్లాడి, డ్రగ్ తీసుకుని రావాల్సిందిగా చెన్నకేశవులు, అహ్మద్ అలీకి సూచించాడు. వీరు ముగ్గురు బుధవారం రాత్రి స్వీట్హార్ట్ హోటల్ వద్ద కొనుగోలుదారుడి కోసం ఎదురుచూస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యహరించిన డీఐ స్వామిగౌడ్, ఏఎస్ బలరామ్, కానిస్టేబుళ్లు రమణమూర్తి,మహేశ్, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, సుధాకర్, శ్రీనివాస్, లింగమ్, వెంకటేశ్, మోహన్‌రెడ్డిలను ఏసీపీ రామ్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ రాజేశ్‌లు ప్రత్యేకంగా అభినందించారు. మరింత లోతుగా విచారణ.. డ్రగ్‌కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు ఓ జూనియర్ కాలేజీలో ఉద్యోగి కావడంతో కాలేజీలు కేంద్రంగా సాగుతున్న డ్రగ్ విక్రయాలపై ఆరా తీయనున్నట్లు ఏసీపీ తెలిపారు. చెన్నకేశవులుకు డ్రగ్ అమ్మిన వ్యక్తులెవరు? సదరు డ్రగ్ కొనేందుకు యత్నించిన వారి కోసం కూడా గాలిస్తున్నామన్నారు. ఇక డ్రగ్ విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి నెట్‌వర్క్‌పై కూడా ఆరాతీస్టున్నట్లు ఏసీపీ రామ్‌రెడ్డి తెలిపారు. త్వరలో డ్రగ్ రాకెట్‌ను చేధించనున్నట్లు వెల్లడించారు. -
నయా మోసగాళ్లు!
బెల్లంపల్లి: జనాల్లో ఉన్న మూఢనమ్మకాలే ఆ యుధంగా ఓ ముఠా టోపీ పెట్టేందుకు సిద్ధమైంది. ‘మరుగుమందు విక్రయం’ అంటూ పన్నాగం పన్నింది. కానీ, పోలీసుల అప్రమత్తతతో ఆ న యా మోసగాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. కట్ చేస్తే.. ఆ ముఠా కటకటాలపాలైంది. ఈ సంఘటన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ వి.బాలు జాదవ్ గురువారం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇలా వెల్లడించారు. మరుగుమందు పేరుతో కొందరు జనాలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారమందింది. దీంతో రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్ టీమ్‌తోపాటు తాళ్లగురిజాల పోలీసులు సంయుక్తంగా బెల్లంపల్లి మండలం దుగినేపల్లి గ్రామ శివారులోని ఓ మామిడితోటలో బుధవారం ఆకస్మిక దాడి చేశారు. తోటలో మరుగుమందును అమ్మడానికి ప్రయత్నిస్తున్న తుమ్మిడ మల్లేష్ (చిన్న రాస్పల్లి, దహెగాం మండలం), ఎలుకారి అంజన్న(చిన్న రాస్పెల్లి, దహెగాం మండలం), చింతకింది రమేష్ (నవభారత్కాలనీ, రామకృష్ణాపూర్), పాగిడి మధుకర్ (దుగినేపల్లి, బెల్లంపల్లి), కొండగొర్ల రాజేష్(జన్కాపూర్, కన్నెపల్లి మండలం), జాడి స్వామి (బొప్పారం, నెన్నెల మండలం), కరెకొండ రామన్న(బొప్పారం, నెన్నెల మండలం), జావీద్ (ఐబీ, తాండూర్ మండలం), వొడ్నాల సాయివిజయ్( 24 డీప్ ఏరియా, బెల్లంపల్లి మున్సిపాలిటీ), టేకం గంగు (మాలగొండి, ఆసిఫాబాద్)ను అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు. వారి నుంచి చెట్ల పసరు సీసాలు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పన్నాగమేమిటంటే.. ఈ మోసగాళ్లు తాము తయారు చేసిన మందును ముందు కోడిపై ప్రయోగిస్తారు. అప్పుడు మందు రాసినవారు చెప్పినట్లు నడుచుకుంటుందని నమ్మిస్తారు. ఆ తర్వాత ఈ కుట్రను తమ ప్రయోగంగా చెప్పుకుంటూ మందును ప్రజలకు అమ్ముతారు. అంటే, మనుషులకు కూడా ఈ మందు రాస్తే.. రాసినవారి చుట్టూ రాయించుకున్న వారు తిరుగుతారని నమ్మిస్తారు. ఇలా నమ్మించి మందును అమ్మి కోట్లలో దండుకోవడమే వారి వ్యూహం. కేవలం ప్రజల నమ్మకాలను ఆసరా చేసుకుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో మరుగుమందు పేరుతో సదరు ముఠా ఈ పథక రచన చేసినట్లు ఏసీపీ వివరించారు. మూఢనమ్మకాలు వీడాలి.. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ప్రజలు నమ్మినంతా కాలం ఇలాంటి నయా మోసగాళ్లు పుడుతూనే ఉంటారని, ఇప్పటికైనా వీరితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్, కానిస్టేబుళ్లు రాజేందర్, దేవేందర్, శేఖర్, సదానందం, హోంగార్డులు హైదర్, మహాంకాళితోపాటు తాళ్లగురిజాల పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. పట్టుబడ్డ నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ అల్లం నరేందర్, తాళ్ల గురిజాల ఎస్సై సీహెచ్.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. బాలుజాదవ్, ఏసీపీ -
ఆలయాల్లో చోరీలకు పాల్పడే దొంగల ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: అర్థరాత్రి సమయాల్లో దేవాలయాల్లో దేవుని హుండీలను పగులగొట్టి దొంగతనం చేసే ముఠాను గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ అరెస్ట్‌చేసి శుక్రవారం కోర్టుకు అప్పగించారు. చోరీలకు పాల్పడిన వారి వద్దనుంచి రూ.10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర శివారుల్లో ఆలయాల్లో చోరీలు అధికమయ్యాయన్న సమాచారం మేరకు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాలమేరకు సీసీఎస్ అడిషనల్ ఎస్పీ ఎస్.రాఘవ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ అబ్దుల్ కరీం నేతృత్వంలో టీంలుగా ఏర్పడి విచారించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మండలంలోని అడవితక్కెళ్ళపాడు గ్రామంలోగల నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నగరంలోని పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన షేక్ ఖాజా అలియాస్ అమ్మూ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులకోసం గతంలో నగరంలోని లాలాపేట, పాతగుంటూరు, నల్లపాడు, పెదకాకాని తదితర చోట్ల చోరీలకు పాల్పడి పోలీసులకు దొరికి, అనేకసార్లు విజయవాడలోని జువైనల్ హోంలో శిక్ష అనుభవించాడు. జైలునుంచి విడుదలైన అనంతరం పాతగుంటూరులో అతని ఇంటివద్ద క్యాటరింగ్ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో క్యాటరింగ్ పనుల్లో ఆతనికి తోడుగా వచ్చిన పాతగుంటూరు యానాదికాలనీకి చెందిన షేక్ జాఫర్అలి, షేక్ అస్గర్ పరిచయమయ్యారు. దీంతో గతంలో తాను చేసిన చోరీలను గురించి ఖాజీ వారిద్దరికీ తెలిపాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించవచ్చని చెప్పి రాత్రి సమయాల్లో చోరీలకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ఈనెల 10న మండలంలోని చౌడవరం గ్రామంలో గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో తలుపులు పగులగొట్టి హుండీలోని రూ.5 వేల నగదును అపహరించారు. అదే రోజు అదే గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో హుండీని పగులగొట్టి అందులోని రూ.5 వేల నగదును అపహరించుకుపోయారు. మండలంలోని వెంగళాయపాలెం, నల్లపాడు, హౌసింగ్‌బోర్డు తదితర ప్రాంతాల్లో పలు ఆలయాల్లో చోరీలకు ప్రయత్నం చేయగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయటంతో పారిపోయారు. ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయాల్లోని సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల వివరాలను సేకరించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా చేసిన చోరీలను ఒప్పుకున్నారు. దీంతో నిందితులు ముగ్గురిని కోర్టుకు అప్పగించనున్నట్టు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకోవటంలో చొరవ చూపిన సీసీఎస్ సీఐ అబ్దుల్ కరీం, సురేష్‌బాబు, నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐ బాబూరావు, సిబ్బంది సాయికుమార్, గురవయ్య, రమేష్‌బాబు, సాగర్‌బాబు, వీరాంజనేయులు, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తదితరులను అర్బన్ ఎస్పీ అభినందించారని తెలిపారు. -
ఘరానా దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు, తిరుపతి క్రైం: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులతో కలసిపోయి బస్సు ఎక్కుతున్నట్టు నటిస్తూ బంగారు ఆభరణాలు చోరీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.21లక్షల విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాలు...స్థానిక టీటీ డీ భూదేవి కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తచ్ఛాడుతున్న కర్ణాటక రాష్ట్రం గదక్ తాలూకాకు చెందిన ఎం.బేల (45), ముట్టుగారి రేణుక(55), అడల్ కార్తీక్ (20), సంతోష్ గైక్వాడ్(28), వాణిశ్రీ(50), ఓవీ సవిత(30), ముట్టుగారి నాగరాజు(21), అనూప్ (24), ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన నల్లపోతల మధును క్రైం సీఐ రసూల్ సాహెబ్ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.91లక్షల విలువ చేసే 97 గ్రాముల బంగారం, 30వేల నగదుతో పాటు నేరాలకు ఉపయోగించిన టాటా సుమోను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఇప్పటికే సీసీఎస్, ఈస్ట్ పీఎస్, తిరుచానూరులో ఒక్కొక్క కేసు నమోదై ఉన్నాయి. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది. వీరు గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పలు నేరాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించారు. భలే కిలాడీలు ఈ దొంగలు ప్రయాణికుల వలే ఏదో ఒక వాహనాన్ని ఎంచుకుని వారు ముందుగా ఎంచుకున్న ప్రాంతానికి వస్తారు. గ్రూపులుగా విడిపోయి బస్సుల్లో, బస్టాండ్లలో, గుళ్లలో చోరీలకు పాల్పడుతుంటారు. వారం 10 రోజుల పాటు దొంగతనాలు చేసి ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జంప్ అయ్యేవారు. తిరుచానూరు గుడిలో నేరాలకు పాల్పడినప్పుడు సీసీ పుటేజీల ఆధారంగా ఈ ముఠాను గుర్తించారు. వారి కోసం గాలిస్తున్న తరుణంలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా భక్తుల రద్దీ ఉండే ఆలయాలు, ప్రయాణికుల తాకిడి ఉండే బస్టాండ్లనే టార్గెట్ చేసుకుని తమ హస్త లాఘవంతో ఆభరణాలు కొట్టేయడంలో ఈ ముఠా ఆరితేరిందని డీఎస్పీ చెప్పారు. -
మోటారు సైకిల్ దొంగల అరెస్టు
గుంటూరు: వ్యసనాలకు బానిసలుగా మారి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీసీఎస్ ఏఎస్పీ రాఘవ తన కార్యాలయంలో సోమవారం విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకా రం... గుంటూరులోని హనుమయ్యనగర్‌కు చెం దిన ముత్తుకూరి సాయిరామ్ తాళం వేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేసిన కేసుల్లో గతంలో విజయవాడలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా డు. క్యాటరింగ్ పనులకు వెళుతున్న క్రమంలో అక్కడ గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్ళపాడుకు చెందిన షేక్ అల్లాభక్షు పరిచయం కావడంతో అతనితో పాటు కలసి ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. గత నెల 8న అల్లా భక్షును పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో సాయిరామ్ తప్పించుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన లంజేపల్లి షడ్రక్ అలియాస్ రవితో కలసి సాయిరామ్ ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనంపై అరండల్‌పేట ఫైఓవర్ వద్ద వేచి ఉన్నారు. వారు పోలీసులను గమనించి పరారవుతుండగా సీసీఎస్ పోలీసులు ఇద్దరినీ వెంటాడి అదుపులోకి తీసుకొని, వారి దైనశైలిలో విచారించారు. చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. రూ.5 లక్షల విలువ చేసే బుల్లెట్‌తో పాటు ఐదు యాక్టివాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీతో పాటు డీఎస్పీ డి.ప్రసాదు, సీఐ లు సీహెచ్‌వీబీ సుబ్రహ్మణ్యం, ఆర్.సురేష్‌బాబు, ఎస్సైలు కిషోర్, మహేంద్ర పాల్గొన్నారు. -
కొత్తగా భద్రావతి గ్యాంగ్.. పొడి వేస్తారు.. దోచేస్తారు!
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : భద్రావతి గ్యాంగ్.. బహుశా ఈ గ్యాంగ్ పేరు ఎప్పుడూ విని ఉండరు. కర్ణాటకకు చెందిన ఈ గ్యాంగ్‌లో ఐదుగురు ఉన్నారు. డబ్బుతో వెళ్తున్న వ్యక్తులను గుర్తించి వారిపై జిల కలిగించే పొడి చల్లుతారు. వారు జిలతో ఇబ్బంది పడుతుండగా డబ్బుతో ఉడాయిస్తారు. వీరు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో చోరీకి పాల్పడ్డారు. కర్ణాటకలోని భద్రావతి గ్యాంగ్‌కు చెందిన రవిబాబు అనే ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.1.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసరావు తనకార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. టీమ్ ఇలా.. కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా, భద్రావతి పట్టణానికి చెందిన రవిబాబు బట్టల వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. అదే ప్రాంతానికి చెందిన అతని స్నేహితులు సురేష్, శివ, ఆశీష్, విక్రం జులాయిగా తిరుగుతూ డబ్బు కోసం దొంగతనాలు చేసేవారు. గతంలో ఉన్న పరిచయం కారణంగా రవిబాబు వారి గ్యాంగ్‌లో చేరాడు. అందరూ కలిసి కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రద్దీగా ఉండే పట్టణాల్లో చోరీకి వ్యూహ రచన చేసేవారు. పొడి చల్లి.. దృష్టి మల్లించి అందరూ కలిసి జిల కలిగించే పొడిని తయారు చేశారు. కరక్కాయ పొడిలో పాండ్స్ పౌడర్ కలిపి వీరు జిల పొడిని తయారు చేశారు. సురేష్, శివ డబ్బు ఉన్న మనుషులను గుర్తించగా ఆశీష్ ఎవ్వరికీ అనుమానం రాకుండా వెనకవైపున వారిపై పొడి చల్లుతాడు. జిలతో వారి దృష్టి మరల్చగా మైనర్ బాలుడైన శివ ముందు వైపున ఉండి డబ్బును చాకచక్యంగా కొట్టేయగా కొంత దూరం వెళ్లగానే ఆ డబ్బును రవిబాబు తీసుకుంటాడు. తర్వాత ఆ డబ్బును అందరు సమానంగా పంచుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 26న భద్రావతి గ్యాంగ్ సభ్యులు ఐదుగురు ప్రొద్దుటూరుకు వచ్చారు. రద్దీగా ఉన్న శివాలయంవీధి, లైట్‌పాలెం చోరీ చేయడానికి అనువుగా ఉంటుందని అక్కడే మాటేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో పట్టణానికి చెందిన తిరువీధి వెంకటసత్యనారాయణ రిటైల్ వ్యాపారి కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. అతను రోజు దుకాణాల వద్దకు వెళ్లి డబ్బు వసూలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను డబ్బు కలెక్షన్ చేయడానికి లైట్పాలెంలోని గోమతి జనరల్ స్టోర్‌కు వెళ్లాడు. దుకాణ దారుడు ఇచ్చిన డబ్బును బ్యాగ్‌లో వేసుకొని స్కూటర్ డిక్కీలో పెట్టాడు. స్కూటర్ స్టార్ట్ చేసుకొని వెళ్లే సమయంలో అతని వెనుక వైపున సురేష్, శివ పొడి చల్లారు. దీంతో వెంకటసత్యనారాయణకు జిల, మంట కలగడంతో పక్కనే దుకాణంలోకి వెళ్లి చొక్కా విప్పి చూసుకుంటుండగా మైనర్ బాలుడు విక్రం స్కూటర్ డిక్కీలోని డబ్బు బ్యాగ్‌తో ఉడాయించాడు. కొద్ది సేపటి తర్వాత అతను వచ్చి డిక్కీలో చూడగా డబ్బు బ్యాగ్ కనిపించలేదు. అందులో రూ.2 లక్షలు ఉన్నట్లు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడు రవిబాబు ఆర్టీసీ బస్టాండులో ఉన్నాడని సమాచారం రావడంతో శుక్రవారం టూ టౌన్ ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ.1.92 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. గ్యాంగ్‌లోని నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. టూ టౌన్ సీఐ మల్లికార్జునగుప్త పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర జాబ్ స్కామ్‌లో హైదరాబాదీ
సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆన్లైన్ స్కాలర్షిప్ ఫర్మ్ డైరెక్టర్, గ్రాఫిక్ డిజైనర్, టెక్కీ, ఈవెంట్ మేనేజర్, హెచ్ఆర్ ప్రొఫెషనల్, జాబ్ కన్సల్టెంట్, కృషి భవన్ ఉద్యోగులు... ఇలా ఎనిమిది మందితో ఏర్పడిన ముఠా.. నవరత్నాలుగా పిలిచే ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ... వంటి సంస్థల్లో ఉద్యోగాల పేరుతో వల వేసింది. ఆసక్తి చూపిన వారికి ఏకంగా ఢిల్లీలోని ‘అధికారిక ప్రాంతమైన’ కృషి భవన్లో ఇంటర్వ్యూలు చేసింది. స్పూఫ్డ్ మెయిల్స్‌తో ఆఫర్ లెటర్స్ ఇచ్చి రూ.కోట్లలో దండుకుంది. ఈ అంతర్రాష్ట్ర ముఠా చేతిలో మోసపోయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన వారూ ఉన్నారు. ఈ గ్యాంగ్‌లో ఐదుగురితో పాటు కృషిభవన్ ఉద్యోగులైన ఇద్దరిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఓ హైదరాబాదీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జాబ్ కన్సల్టెంట్ అయిన ఇతడు స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు చెప్తున్నారు. వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చి... ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన కిషోర్ కునాల్ (ఫర్మ్ డైరెక్టర్), జగదీష్, సందీప్ (కృషి భవన్ ఉద్యోగులు), వశీం (గ్రాఫిక్ డిజైనర్), అంకిత్ (ఈవెంట్ మేనేజర్), విశాల్ (సాఫ్ట్వేర్ ఇంజినీర్), సుమన్ (హెచ్ఆర్ ప్రొఫెషనల్)తో పాటు హైదరాబాద్‌కు చెందిన జాబ్ కన్సల్టెంట్ రవిచంద్ర ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి కేంద్రం ఆధీనంలో ఉండే నవరత్నాలుగా పరిగణించే ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ వంటి సంస్థల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు తెరలేపారు. దీనికోసం వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడంతో పాటు వ్యక్తిగతంగానూ అనేక మంది నిరుద్యోగుల్ని ఆకర్షించారు. దరఖాస్తు చేసిన వారికి ఇంటర్వ్యూ లేఖలను మెయిల్ చేయడంతో పాటు ఫోన్‌కాల్స్ చేశారు. దీనికోసం వీరు ఢిల్లీలో ఉన్న కృషి భవన్‌ను వినియోగించుకున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ భవన్‌లోనే అనేక కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ పని చేసే నాలుగో తరగతి ఉద్యోగుల ద్వారా అధికారులు లేని సమయంలో లోపలకు వెళ్లి ఫోన్ కాల్స్ చేసేదీ ముఠా. రవిచంద్ర హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగుల్ని ఆకర్షించి ఈ ముఠాకు పరిచయం చేసేవాడు. దీనికోసం ఇతడికి భారీ మొత్తంలో కమీషన్ ముడుతుండటంతో తనకు ఉన్న పరిచయాలతో ఇతర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకూ టోకరా వేశాడు. ఇంటర్వ్యూలు సైతం కృషి భవన్‌లోనే... ఒక్కో ఉద్యోగానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రేటు చెప్పే ఈ గ్యాంగ్ ఉద్యోగార్థుల నుంచి ప్రాథమికంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకునేది. దీనికోసం కృషి భవన్ నుంచి ఫోన్‌కాల్స్ చేసి నమ్మించేది. ఆపై ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలంటూ కాల్ లెటర్స్ పంపేది. గతంలో ఈ ముఠా అక్కడి స్టార్ హోటల్స్‌లోని గదుల్లో ఇంటర్వ్యూలు చేసింది. అయితే నిరుద్యోగుల్ని పూర్తిగా నమ్మించడానికి తమ పంథా మార్చింది. కృషి భవన్‌లోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు చేసే జగదీష్, సందీప్‌లకు అందులోని ఏ ప్రాంతానికైనా యాక్సస్ ఉండేది. దీన్ని దుర్వినియోగం చేసిన వారు ముఠా సభ్యుల్ని భవన్ లోపలకు తీసుకువెళ్లే వారు. ఆ రోజు ఏ అధికారి సెలవులో ఉంటే ఆ కార్యాలయాన్ని వీరికి అప్పగించే వారు. నిరుద్యోగుల్ని అక్కడకు పిలిపించే ముఠా సభ్యులు ఆ కార్యాలయాల్లోనే ఇంటర్వ్యూలు చేసే వారు. దీంతో ఉద్యోగార్థులు పూర్తిగా ముఠా వలలో పడిపోయేవారు. ఈ ఇంటర్వ్యూలు చేసే వ్యవహారాల్లోనూ రవిచంద్ర పాత్ర కీలకంగా ఉండేదని పోలీసులు అనుమానిస్తున్నారు. స్పూఫింగ్ మెయిల్స్, ఫోన్‌కాల్స్... నిర్ణీత రుసుం తీసుకుని స్పూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్నెట్ ద్వారా చేసే కాల్. దీనిలోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్ నెంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు ఇతడికి సెల్ఫోన్లో ఎవరి నెంబర్ డిస్ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇదేరకంగా ఈ–మెయిల్ ఐడీ స్పూఫింగ్ వెబ్సైట్లలో మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేస్తారు. ఇ లా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్ చేసినట్లు, ఈ–మెయిల్ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా వినియోగించేస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేశారు. ఈ అంతర్రాష్ట్ర గ్యాంగ్ స్పూఫింగ్ ద్వారా ఓఎన్జీసీ నుంచి ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్ వచ్చినట్లు సృష్టించారు. ఇంటరŠూయ్వలు పూర్తయిన వారికి ఇలానే నియామక కబురు అందించి మిగిలిన మొత్తం డిమాండ్ చేశారు. తమకు ఓఎన్జీసీ నుంచే లేఖ/కాల్ వచ్చిందని నమ్మిన నిరుద్యోగులు మిగిలిన మొత్తం ఆ ముఠాకు చెల్లించేసేవారు. వ్యవహారం వెలుగులోకి వచ్చిందిలా... కొన్నాళ్లుగా ఈ పంథాలో మోసాలు చేస్తున్న ఈ ముఠాపై తొలిసారిగా రెండు నెలల క్రితం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్, ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులకు ఈ ముఠా ఓఎన్జీసీలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలంటూ ఎర వేసింది. ఇంటర్వ్యూల వరకు పూర్తి చేసి వీరి నుంచి రూ.22 లక్షలు తీసుకుంది. ఆపై బోగస్ లేఖలు అందించింది. వీటిని పట్టుకున్న నిరుద్యోగులు ఓఎన్జీసీ కార్యాలయానికి వెళ్లారు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు అక్కడి వసంత్‌కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన ఈ స్పెషల్ టీమ్ సోమ వారం కిషోర్ కునాల్, జగదీష్, సందీప్, వశీం, అంకిత్, విశాల్, సుమన్‌లను అరెస్టు చేసింది. వీరి నుంచి 27 సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్స్, 10 చెక్ బుక్స్, నకిలీ గుర్తింపుకార్డులు, 45 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకుంది. వీరి విచారణ నేపథ్యంలోనే రవిచంద్ర పాత్ర వెలుగులోకి రావడంతో వేట ము మ్మరం చేసింది. ఇతడిని పట్టుకోవడం కోసం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లోనూ గాలిస్తోంది. -
సైట్లోనే సీయింగ్!
‘బిట్ కాయిన్స్’ ముఠా చేతిలో మోసపోయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శని–ఆదివారాల్లో ఈ ముఠా చేతిలో దగాపడిన మరో 20 మంది టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రమేష్ బిట్ కాయిన్స్ కోసం బోగస్ ఖాతాలు తెరిచాడు. వీటిలోనే రాబడి చూపించి జనాలను ఆకర్షించాడు. పెట్టుబడితో పాటు లాభాలు, కమీషన్లను సైతం బోగస్ వెబ్సైట్లో చూపించి బురిడీ కొట్టించాడు. సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ నగరంలో అప్పుడప్పుడు మల్టీ లెవల్ మార్కెంటింగ్ (ఎంఎల్ఎం) వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందాలో తొలుత చేరిన వారు భారీగా లాభపడటం... ఆఖరులో చేరిన వారు నష్టపోవడం పరిపాటి. అయితే క్రిప్టో కరెన్సీ పేరుతో, కాయినెక్స్‌ట్రేడింగ్.కామ్ వెబ్సైట్ ముసుగులో స్కీ(స్కా)మ్స్ నడిపిన రమేష్ చేతిలో మాత్రం మొదటి నుంచి ఆఖరి వరకు అందరూ నష్టపోగా, కేవలం అతడితో పాటు ప్రధాన దళారులు నలుగురు మాత్రమే లాభపడ్డారు. పెట్టుబడితో పాటు లాభాలు, కమీషన్లను సైతం బోగస్ వెబ్సైట్లో చూపించడమే దీనికి కారణం. ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయిన మొత్తం రూ.కోట్లల్లో ఉంది. ఈ ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. శని–ఆదివారాల్లో ఈ ముఠా చేతిలో మోసపోయిన మరో 20 మంది టాస్క్‌ఫోర్స్‌ను ఆశ్రయించారు. వీరిలో కరీంనగర్, మంథని, విశాఖపట్నం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బోయిన్పల్లి ఠాణాకు పంపారు. బోగస్ వెబ్సైట్లో ప్రత్యేక ఖాతాలు... స్కామ్‌కు పథకం రూపొందించిన రమేష్ ముంబైకి చెందిన సీబీ ఆన్లైన్ సంస్థకు రూ.లక్ష చెల్లించడం ద్వారా వారితో కాయినెక్స్‌ట్రేడింగ్.కామ్ వెబ్‌సైట్‌తో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించాడు. దీని నిర్వహణ కోసం ప్రతి నెలా వారికి రూ.25 వేల చొప్పున చెల్లిస్తున్నాడు. సీబీ సంస్థకు చెందిన సునీల్ చౌహాన్, మోహన్ ఈ సైట్లో ఆకర్షనీయమైన స్కీములు ప్రకటించడంతో పాటు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేక ఖాతా రూపొందించి ఇచ్చే సౌలభ్యం కల్పించారు. బాధితుల నుంచి పెట్టుబడులన్నీ నగదు రూపంలోనే తీసుకున్న రమేష్ వాటిని డాలర్లుగా మార్చి క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నమ్మించాడు. అందుకు అయ్యే ఎక్స్ఛేంజ్ మొత్తాన్నీ వారి నుంచే వసూలు చేశాడు. ఇన్వెస్టర్ పేరుతో తమ వెబ్సైట్ కేంద్రంలో ఓ ఖాతా తెరుస్తామంటూ చెప్పడంతో పాటు వారికి ఓ ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించేవాడు. వీటి ద్వారా లాగిన్ అయిన వారికి తన ఖాతాలో ఉన్న బిట్‌కాయిన్స్, వాటి విలువను చూసుకునే అవకాశం ఉండేది. ఆ వ్యక్తి పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభం, ఎంఎల్‌ఎంలో ఓ వ్యక్తిని చేర్చగా వచ్చిన కమీషన్ ఇలా అన్నీ ఇందులోనే చూపిస్తూ కనికట్టు చేశాడు. ఈ కేసులో సీబీ ఆన్లైన్ సంస్థకు చెందిన సునీల్ చౌహాన్, మోహన్‌లను నిందితులుగా చేర్చారు. ‘భయంకరమైన’ లాభాలంటూ.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలను ఆకర్షించేందుకు రమేష్ 12 వేర్వేరు స్కీములు రూపొందించాడు. వీటికి బేసిక్, స్టాండర్డ్, బ్రాంజ్, సిల్వర్ ప్లాన్స్‌తో పాటు గోల్డెన్, ప్లాటినం, రాయల్, ప్రీమియం, డైమండ్, ఇన్ఫినిటీ, ఎక్స్పర్ట్, ఎలైట్ ట్రేడ్ అంటూ పేర్లు పెట్టాడు. ఒక్కో దాంట్లో రోజుకు .4 శాతం నుంచి 10 శాతం వరకు బోనస్ వస్తుందని, కనిష్టంగా 134 రోజుల (ఎలైట్ ట్రేడ్) నుంచి గరిష్టంగా 500 రోజుల్లో (బేసిక్ ప్లాన్) పెట్టుబడి రెట్టింపు అవుతుందని నమ్మించాడు. ఈ స్కీముల్లో 100 అమెరికన్ డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడికి ఆస్కారం ఉందంటూ ప్రచారం చేయడంతో పాటు దీనికోసం 10 నిమిషాల నిడివితో ఓ షార్ట్‌ఫిల్మ్ కూడా రూపొందించాడు. ఇందులో తొలుత బిట్‌కాయిన్ వివరాలు చెబుతూ దానిపై బిల్‌క్లింటన్ వరకు పలువురి అభిప్రాయాలను చూపించాడు. ఆపై తన స్కీమ్స్‌ను ప్రచారం చేస్తూ రండి త్వరగా కోటీశ్వరులుకండి అంటూ ఆకర్షించాడు. కస్టమర్లను తీసుకువచ్చిన ప్రధాన దళారులైన సత్తయ్య, వెంకటేష్, హరిగోపాల్, శ్రీనివాస్‌లకు మాత్రం 10 శాతం చొప్పున కమీషన్లు ఇస్తూ వచ్చాడు. 30 మంది బయటకు వస్తేనే... ఈ గ్యాంగ్ గతేడాది మార్చి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని 1200 మంది నుంచి రూ.10 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయింది రూ.1.37 కోట్లుగా ఉంది. ఎల్బీనగర్కు చెందిన బాల్‌రాజ్ రూ.1.89 లక్షలు, బోయిన్‌పల్లికి చెందిన రమేష్ గుప్త రూ.33.5 లక్షలు, ఆసిఫ్‌నగర్‌కు చెందిన జగ్గారావు రూ.18.71 లక్షలు, చిక్కడపల్లికి చెందిన అభినవ్‌కుమార్ రూ.3.5 లక్షలు, మియాపూర్ వాసి కృష్ణ రూ.9.37 లక్షలు, మీర్‌పేటకు చెందిన ప్రభాకర్‌రావు రూ.15.6 లక్షలు, సంగారెడ్డికి చెందిన పూవింత్రన్ రూ.21.74 లక్షల చొప్పున మోసపోయారు. శని–ఆదివారాల్లో మరో రూ.కోటికి పైగా నష్టపోయిన 20 మంది టాస్క్‌ఫోర్స్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే రమేష్ గ్యాంగ్ బాధితులు నేరుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆశ్రయించాలని కోరుతున్నారు. స్థలాలు, కార్లు ఖరీదు... ఈ దందాలో వచ్చిన డబ్బులో భారీగా కమీషన్లు చెల్లించడమేగాక మిగిలిన దాంట్లో కొంత మొత్తాన్ని రమేష్ రియల్ ఎస్టేట్ రంగం వైపు మళ్లించాడు. రూ.1.23 కోట్లు వెచ్చించి నాలుగు ప్రాంతాల్లో స్థలాలు ఖరీదు చేశాడు. ఈ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బోయిన్‌పల్లిలోని అతడి జీఆర్ఎం ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు రమేష్, ఇతడి బంధువైన మరో నిందితుడు శ్రీనివాస్ తదితరుల నుంచి రూ.29.2 లక్షలు రికవరీ చేశారు. రూ.26.4 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని సైతం రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకుగాను నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణ యించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు, ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, కేఎస్ రవిలను కమిషనర్ అంజనీ కుమార్ ప్రత్యేకంగా అభినం దించారు. వీరికి నగదు రివార్డులు ఇవ్వనున్నారు. -
బిట్ కాయిన్ రాకెట్ ముఠా అరెస్ట్
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కడప అర్బన్ : కడప సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామం ముద్దనూరురోడ్డులో మంగళవారం ఉదయం క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల పరిధిలో క్రికెట్ బెట్టింగ్ భారీగా జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. పుల్లాసి గురుప్రసాద్‌కు సంబంధించిన ప్రసాద్ హోటల్లో తొమ్మిది మంది ఈ నెల 23న జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన డబ్బులను మార్పిడి చేసుకుంటూ, గంజాయి సంచితో కనిపించగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8.98 లక్షల నగదు, 1150 గ్రాముల నిషేధిత గంజాయి సంచి, కారు (ఏపీ04 ఏఎం7793), 16 సెల్ఫోన్లు, క్రికెట్ బెట్టింగ్ పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ప్రొద్దుటూరు దస్తగిరిపేటకు చెందిన కటిక సులేమాన్, ఎర్రగుంట్ల మండలం వలసపల్లెకు చెందిన తమ్మిశెట్టి బాలయ్య, వీఎన్ పల్లె మండలం ఉరుటూరు వాసి సొదుం రమేష్‌కుమార్‌రెడ్డి, ఎర్రగుంట్ల మండలం వలసపల్లె నివాసి రాజోలు బయపురెడ్డి, కర్చుకుంటపల్లె గ్రామానికి చెందిన బొందల వెంకటేశు, చిలంకూరుకు చెందిన పుల్లాసి గురుప్రసాద్, ఎర్రగుంట్ల పట్టణంలోని దొండపాడు రోడ్డులో నివసిస్తున్న చింతల వెంకటప్రసాద్ అలియాస్ నల్ల ప్రసాద్, అదే ప్రాంత నివాసి పిల్లిగోయిల శ్రావణ్‌కుమార్ అలియాస్ చిన్నా, ప్రొద్దుటూరు టౌన్ జిన్నారోడ్డులో నివసిస్తున్న షేక్ మహమ్మద్ ఉన్నారు. నిందితులను పకడ్బందీగా అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, కడప రూరల్ సీఐ హేమసుందర్రావు, ఎర్రగుంట్ల ఎస్ఐ జె.శివశంకర్, పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్కే రోషన్, కడప తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి, ఎర్రగుంట్ల కానిస్టేబుళ్లు పాములేటి, నాగాంజనేయులును డీఎస్పీ అభినందించారు. -
గంజాయి ముఠా ఆటకట్టు
నల్లగొండ క్రైం : నల్లగొండ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తూ, అమ్ముతున్న పది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్ ముఠా వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన కొండ అంజమ్మ, నల్లగొండ పాతబస్తీకి చెందిన కల్లెపల్లి కిరణ్‌కుమార్, జేబీఎస్ వాసి రావిల్ల నర్సింహ, మునుగోడు రోడ్డులోని మహ్మద్ గౌస్, అక్కచెల్మకు చెందిన బల్గూరి రాజు, మహ్మద్ మూజుబుద్దీన్, షేక్ రఫీ, ప్రకాశం బజార్‌లోని టిటాంక్ రచన్‌సింగ్, తిల్పితీయ సమందర్‌సింగ్, నార్కట్‌పల్లికి చెందిన బాజ శివకుమార్‌లు ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోడ్రైవర్లుగా, పండ్లబండ్లు, ఇతర చిరు వ్యాపారాలు చేస్తున్నారు. సైడ్ బిజినెస్‌కు గంజాయి దందాను ఎంచుకున్నారు. వీరు అరకు, శ్రీశైలం, దూల్‌పేట ప్రాంతాలనుంచి ఒకటి, రెండు కేజీల చొప్పున తక్కువ ధరకు కొనుగోలు చేసి నల్లగొండకు తీసుకువస్తున్నారు. టిప్పర్ సిగరెట్, చిన్న ప్యాకెట్లలో సర్దుబాటు చేసి ఒక్కోటి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. గంజాయి కస్టమర్లు నల్లగొండ పట్టణంలో వందమంది దాకా ఉన్నారు. గంజాయి విక్రయిస్తున్నట్లు తెలియడంతో వీరిపై పోలీసులు కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో సోమవారం వీరు నల్లగొండ పట్టణ శివారులో గోకుల్ బీఈడీ రోడ్డులో, రైల్వెస్టేషన్ రోడ్డు, నార్కట్‌పల్లి ఎస్సీ కాలనీ, నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో గంజాయి అమ్ముతుండగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నాయి. వీరినుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అంజమ్మపై గతంలో గంజాయి అమ్మిన కేసు ఉంది. అదే విధంగా బల్గూరి రాజుపై నల్లగొండ వన్‌టౌన్‌లో రౌడీషీట్, మూజుబుద్దీన్‌పై కిడ్నాప్, కొట్లాట, షేక్ రఫీపై ఎస్సీ, ఎస్టీ కేసు, టిటాంక్ రచన్‌పై గంజాయి, హత్యాయత్నం, చీటింగ్ కేసులు ఉన్నాయి. కాల్‌డేటా ఆధారంగా కదలిన డొంక గంజాయి డొంకను పోలీస్‌లు కాల్‌డేటా ఆధారంగా ఛేదించారు. అమ్మేవారిని, కొనేవారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఏడేళ్ల క్రితం గంజాయి అమ్మిన ఓ వ్యక్తి పోలీస్‌లకు దొరకడంతో అప్పుడు అమ్మడం మానివేశాడు. మళ్లీ ఆరు నెలలుగా గంజాయి అమ్ముతున్నాడు. అతని కాల్‌డేటా ఆధారంగా గుర్తింపు అదుపులోకి తీసుకుని విచారణ జరిపగా, డొంక బయటపడింది. ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి మూలాలను కదిలిస్తామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. సమావేశంలో సీఐలు వెంకటెశ్వర్లు, రవికుమార్, పీఎన్డీ ప్రసాద్, సుబ్బిరాంరెడ్డి, క్యాస్ట్రో రెడ్డి, గోవర్దన్, 2టౌన్ ఎస్ఐ మధు పాల్గొన్నారు. -
ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ ద్వారా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రత్యేక బృందం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, ఓ మహిళకు విముక్తి కల్పించిందని డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన టి.సతీష్‌గౌడ్ నగరానికి వలసవచ్చి జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివాసముంటున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఆన్లైన్లో వ్యభిచార దందా చేయడానికి సిద్ధమైన ఇతగాడు ఖమ్మం నుంచి వలసవచ్చిన నాగ కార్తీక్‌ను సహాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన పేద మహిళలు, యువతులకు గాలం వేస్తున్న సతీష్ వారిని సిటీకి తరలిస్తున్నాడు. అభ్యంతరకరమైన ఫొటోలతో ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తూ తన ఫోన్ నంబర్ వాటిలో పొందుపరుస్తున్నాడు. వీటికి ఆకర్షితులై ఫోన్లు చేసిన వారి నుంచి నగదు వసూలు చేసి యువతుల్ని సరఫరా చేస్తున్నాడు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి.చాంద్‌బాష ఇటీవల ఆన్లైన్లో ఉన్న ఈ ప్రకటన గమనించారు. అందులోని ఫోన్‌నంబర్‌కు కాల్ చేయగా... రూ.3 వేలు తీసుకుని వెంకటగిరి ప్రాంతానికి రావాల్సిందిగా సతీష్ చెప్పాడు. దీంతో డెకాయ్ ఆపరేషన్‌కు రంగంలోకి దిగిన పోలీసులు విటుల మాదిరిగా అక్కడకు వెళ్లి సతీష్‌తో పాటు అతడి ఇంటిపై దాడి చేసి కార్తీన్‌ను పట్టుకున్నారు. వీరి చెరలో ఉన్న యువతికి విముక్తి కల్పించారు. -
నేరస్తుల ముఠా అరెస్ట్
అత్తాపూర్: హైదరాబాద్ పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో సుపారీలు తీసుకొని హత్యలు, చోరీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని ఆరుగురి నుంచి రెండు దేశీవాలి తుపాకులు, నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ పద్మజారెడ్డి వివరాలను వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని గురుద్వార్‌లో పూజారిగా పని చేస్తున్న సర్దార్ జితేందర్‌సింగ్ (42), చాంద్రయణగుట్ట అషామాబాద్కు చెందిన మహమ్మద్ జబ్బార్ (33), మహ్మద్ సయ్యద్ (34), శాస్త్రీపురానికి చెందిన అబ్దుల్ అజార్ (22), ఉప్పర్‌పల్లి ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన షేక్ వాహెద్ (25), మౌలాలి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇబ్రహం (45) ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు హైదరాబాద్‌లోని పలు పోలీస్స్టేషన్లలో హత్య, దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రూ.10 లక్షల సుపారి తీసుకోని 2016లో మౌలాలి ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణను హత్య చేశారు. ఆ కేసులో అరెస్ట్ అయినప్పడు ఒక దేశీవాలి పిస్టల్‌ను పోలీసులకు అప్పగించారు. మిగతా రెండు పోలీసులకు ఇవ్వకుండా గుర్తు తెలియని ప్రాంతంలో దాచిపెట్టారు. బెయిల్ నుంచి వచ్చిన అనంతరం రెండు తుపాకులను పట్టుకొని నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజులుగా రాజేంద్రనగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఒకరి హత్యకు సుపారీ తీసుకున్నట్లు సమాచారం రావడంతో ఈ ముఠాపై నిఘా పెట్టారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలో ఆదివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేందర్‌సింగ్, జెబ్బార్, అజార్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి నుంచి ఒక దేశివాలి పిస్టల్ రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ముగ్గురి సమాచారం తీసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక దేశివాలి పిస్టల్, రెండు లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆరుగురితో కూడిన ముఠా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ దయానంద్‌రెడ్డి, శంషాబాద్ ఎస్ఓటీ టీం, మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేశ్ పాల్గొన్నారు. -
బైక్ దొంగల అరెస్ట్
కోదాడ : గుంటూరు జిల్లాలో బైక్‌లను అపహరించి.. వాటిని కోదాడలో దాచిపెట్టి, విజయవాడలో విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కేసు వివరాలను ఏఎస్పీ ఇస్మాయిల్ ఆదివారం సాయంత్రం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాత నేరస్తుడు ధీకొండ వెంకటేశ్వర్లు ఆర్టీసీ అద్దె బస్సులో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. 2005లో దొంగతనం చేసి జైలుకి వెళ్లి వచ్చాడు. ఇతని తమ్ముడు ధీకొండ శ్రీకాంత్ కోదాడలో ఆర్టీసీ అద్దె బస్సులో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, సత్తెనపల్లి, రాజుపాలెం, మాచవరం, కారంపూడి, దుర్గి పోలీస్‌స్టేషన్ పరిధిలో 11 మోటారు సైకిళ్లను అపహరించాడు. వీటిని కోదాడలోని కట్టకొ మ్ముగూడెం రోడ్డులో ఉన్న తమ్ముడు శ్రీకాంత్ ఇంటిలో పెట్టాడు. వాటిలో ఒక దానిని అమ్మడానికి విజయవాడ తీసుకెళుతుండడంతో వాహనాల తనిఖీ చేస్తున్న పట్టణ పోలీసులకు చిక్కారు. విచారించగా దొంగతనాల వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి 11 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 5లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు. మరో కేసులో... గోదావరిఖనికి చెందిన అంటాల రాకేశ్ కోదాడలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో 2015–17 సంవత్సరంలో డిప్లోమా ఇన్ మైనింగ్ కోర్సు చదివాడు. ఇతను కొన్ని సబ్జెక్టులు తప్పి గోదావరిఖనిలో ఉంటూ చెడు వ్యసనాల బారినపడ్డాడు. ఈ క్రమంలో తప్పిన సబ్జెకులను రాయడానికి ఇటీవల కోదాడకు వచ్చి శ్రీనివాసనగర్‌లోని తన స్నేహితుడి రూంలో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన రాకేశ్ ఈ నెల 2వ తేదీన శ్రీనివాసనగర్‌లో ఎండి సల్మాన్ ఇంటి ఎదుట పార్క్ చేసిన మోటార్ సైకిల్‌ను అపహరించాడు. శనివారం దాని నెంబర్ ప్లేటు తొలగించి విజయవాడలో అమ్మడానికి వెలుతూ ఖమ్మం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు చిక్కాడు. విచారణలో దొంగతన విషయం బయటపడింది. దాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్య వహరించిన సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, పట్టణ సీఐ శ్రీని వాసరెడ్డి, ఎస్ఐలు మహిపాల్‌రెడ్డి, నజీరుద్దీన్, సిబ్బంది మనోహర్, రామారావు, నర్సింహారావు పాల్గొన్నారు. -
దారి దోపిడీ ముఠా అరెస్టు
ఒంగోలు క్రైం:ఒంగోలు శివారు ప్రాంతాలతో పాటు పరిసర మండలాల్లో దారిదోపిడీలు చేసి, దంపతులను, జంటలను వేధించిన దారిదోపిడీ ముఠాను ఒంగోలు సీసీఎస్, ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారని ఏఎస్పీ ఏబిటిఎస్.ఉదయరాణి వెల్లడించారు. ఈ మేరకు స్థానిక ఎస్పీ కార్యాలయంలోని ఐటీ కోర్ సెంటర్లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దారి దోపిడీలతో పాటు మహిళలు, యువతులపై అత్యాచారాలకు ఈ ముఠా పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగు చూసిందని వివరించారు. ముఠా నాయకుడు పాలపర్తి ఏసుతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు. వాళ్లలో ఒకరు బాలనేరస్తుడు కూడా ఉన్నారని వివరించారు. పాలపర్తి ఏసు చీమకుర్తి శిద్దానగర్కాలనీకి చెందిన వ్యక్తి. అతనితో పాటు చీమకుర్తి వెంకటేÔశ్వర కాలనీకి చెందిన నల్లబోతుల శ్రీనివాసరావు, చీమకుర్తి శిద్దానగర్ కాలనీకి చెందిన కొమరగిరి కొండయ్య, బొజ్జా దుర్గా ప్రసాదు, మన్నెం అంకమరావు, మన్నెం నరిశింహారావు, మన్నె గంగయ్య, తుపాకుల అంజయ్యలను అరెస్టు చేశామన్నారు. 17 నేరాలు చేసినట్లు అంగీకారం:పాలపర్తి ఏసు ముఠా మొత్తం మీద 17 నేరాలు చేసినట్లు అంగీకరించారని ఏఎస్పీ వెల్లడించారు. అందులో భాగంగా మొత్తం ఐదు కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సంతనూతలపాడు, టంగుటూరు పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు చేసినట్లు వివరించారు. ముద్దాయిల నుంచి బంగారపు రింగులు రెండు, బంగారు చైన్లు, ఇతర బంగారు ఆభరణాలు, మోటారు సైకిళ్లు ఐదు, సెల్ఫోన్లు 12 స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం వాటి విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందన్నారు. దారిదోపిడీలు, మహిళలను, యువతులపై అత్యాచారాలకు కూడా పాల్పడి ఆయా ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. శివారు ప్రాంతాలు, సాగర్ కాలువ గట్లు లక్ష్యంగా... పాలపర్తి ఏసు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి శ్రీనివాసులు, కొండయ్యలను గ్రూపులుగా ఏర్పాటు చేసి దారిదోపిడీలు, దాడులు, అత్యాచారాలకు పాల్పడటం వృత్తిగా పెట్టుకున్నారన్నారు. వీళ్లు ఒంగోలు నగర శివారు ప్రాంతాలు, సాగర్ కాలువ గట్లపై జంటగా వచ్చేవారిని లక్ష్యంగా చేసుకొని దాడులు, అత్యాచారాలు చేశారన్నారు. వెంగముక్కపాలెం, ముంగమూరు రోడ్డు, కొణిజేడు, లింగంగుంట శివారు, కొప్పోలు, మద్దులూరు, పొందూరు, చీమకుర్తి శివారు ప్రాంతాలతో పాటు మల్లవరం డ్యాం ప్రాంతాల్లో వీరు నేరాలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. సీసీఎస్ పోలీసులు రామకృష్ణ, అంజిబాబుతో పాటు మరికొందరికి వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు ప్రారంభించామన్నారు. మొత్తం ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయని మరో 12 కేసులు నమోదు కావాల్సి ఉందన్నారు. బాధిత మహిళలు ముందుకు రావాలి.... ఈ ముఠా బారిన పడి ఇబ్బందులు పడిన బాధిత మహిళలు, యువతులు ముందుకు రావాలని అలాంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఏఎస్పీ ఉదయరాణి పేర్కొన్నారు. నేరుగా న్యాయమూర్తి ముందే వాంగ్మూలం నమోదు చేస్తారని వివరించారు. ఒకసారి వస్తే చాలని తరువాత ఎప్పుడు కూడా అటు కోర్టుకు కాని, ఇటు పోలీస్ స్టేషన్‌కు కాని రావాల్సిన పనిలేదన్నారు. అందుకోసం మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. అత్యంత క్లిష్టమైన కేసులను చాకచక్యంగా చేధించిన ఒంగోలు సబ్ డివిజన్, సీసీఎస్ పోలీసులను జిల్లా ఏఎస్పీ ఏబిటిఎస్ ఉదయరాణి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఎస్సై వివి.నారాయణ, ఏఎస్సై వి.వెంకటేశ్వరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బాలాంజనేయులు, చంద్రశేఖర్, సురేష్, కోటయ్య, వెంకయ్య, కానిస్టేబుళ్లు అంజిబాబు, రామకృష్ణ, ఖాదర్, సాయి, శాంతకుమార్, శేషు, తాలూకా పోలీసులు శివ, మౌలాలి, సంధాని బాషలను అభినందించారు. -
నకిలీ ‘గుర్తింపు’ గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న అక్రమ గుర్తింపు కార్డుల జారీ దందాను గత నెలలో ‘సాక్షి’ గుట్టురట్టు చేసింది. నగదు చెల్లిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్ ఐడీ వంటి ఐడెంటిటీలను విక్రయిస్తున్న వ్యవహారంపై ‘అంగట్లో ఐడెంటిటీ’ శీర్షికన గత నెల 21న పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యవహారాన్ని అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి గుర్తింపు కార్డులతో ఎవరైనా పాస్‌పోర్టులు తీసుకున్నారా? అనే అంశంపై నగర టాస్క్‌ఫోర్స్ అధికారులు దృష్టి పెట్టారు. ఫలితంగా నార్త్‌జోన్ బృందానికి గురువారం ముగ్గురు ‘నకిలీరాయుళ్లు’ చిక్కారు. వీరు ఓటర్ ఐడీ, ఆధార్ వంటి నకిలీ గుర్తింపుకార్డులను సమర్పించి రెండు, మూడు చొప్పున పాస్‌పోర్టులు తీసుకున్నట్లు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు వెల్లడించారు. వీరి నుంచి ఏడు పాస్‌పోర్టులతో పాటు భారీ సంఖ్యలో బోగస్ ఐడెంటిటీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలాంటి వారు ఇంకా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని, త్వరలో వారినీ పట్టుకుంటామన్నారు. ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుతో కలిసి తన కార్యాలయం వివరాలు వెల్లడించారు. ఇలా రెండు, మూడు చొప్పున పాస్‌పోర్టులు పొందిన ఈ ముగ్గురూ ఆ విషయాన్ని దాచి ఉంచారు. గత నెలలో ప్రచురితమైన ‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్ పోలీసులు ఇలాంటి ‘నకిలీ ఐడెంటిటీగాళ్ల’పై నిఘా ముమ్మరం చేశారు. నార్త్‌జోన్ టీమ్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కె.శ్రీకాంత్ తమ బృందాలతో లోతుగా ఆరా తీయగా నర్సింగరావు, సాలం, హైదర్ అలీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గురువారం వీరి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ముగ్గురినీ పట్టుకుని ఆధారాలతో సహా స్థానిక పోలీసులకు అప్పగించారు. విదేశాలకు వెళ్లేందుకు అడ్డదారులు సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఎక్స్ రోడ్స్ ప్రాంతానికి చెందిన బండకాడ నర్సింగ్ రావు వృత్తిరీత్యా డ్రైవర్. అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనుకున్న ఇతను తొలుత బాల నర్సింగ్‌రావు పేరుతో పాస్‌పోర్ట్ పొంది వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని ఢిల్లీలోని కాన్సులేట్ అధికారులు తిరస్కరించడంతో ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించాడు. బెన్ని నర్సింగ్‌రావు పేరుతో నకిలీ గుర్తింపుకార్డులు, పత్రాలతో మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. దీని ఆధారంగా మరోసారి ఢిల్లీ కాన్సులేట్ నుంచి వీసా కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. అయినా తన పంథా మార్చుకోని నర్సింగ్‌రావు బోగస్ ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులతో సఫిల్‌గూడ చిరునామా, బీకే నర్సింగ్‌రావు పేరుతో మూడో పాస్‌పోర్ట్ పొందాడు. దీని ఆధారంగా వీసా కోసం దరఖాస్తు చేసినప్పటికీ కాన్సులేట్ తిరస్కరించింది. వెంకటశర్మగా మారిన హైదర్ అలీ అబిడ్స్ ప్రాంతానికి చెందిన హైదర్ అలీ లలానీ వృత్తిరీత్యా ఫుట్‌వేర్ వ్యాపారి. తన పేరుతోనే పాస్‌పోర్ట్ పొందిన ఇతను లండన్ వీసా సైతం తీసుకున్నాడు. ఈ పాస్‌పోర్ట్‌తో అమెరికాకు చెందిన బీ1 అండ్ బీ2 వీసా పొందడానికి కొన్ని అడ్డంకులు ఎదురవడంతో వెంకట శర్మగా మారాలని నిర్ణయించుకున్నాడు. తన ఫొటోనే వినియోగించి ఆ పేరుతో, జూబ్లీహిల్స్ చిరునామాతో నకిలీ ఐడెంటిటీలు పొందాడు. వీటి ఆధారంగా వీసా కోసం చెన్నై కాన్సులేట్‌లో దరఖాస్తు చేసుకున్నా సఫలీకృతుడు కాలేదు. ఇంకా కొందరున్నారు ‘ఇలా నకిలీ ఐండెటిటీలతో పాస్పోర్ట్స్ పొంది, వాటి ఆధారంగా వీసాలకు దరఖాస్తు చేస్తున్న వారి కారణంగా నిజమైన దరఖాస్తుదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలోనే కాన్సులేట్లు అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో తిరస్కరిస్తున్నాయి. తద్వారా పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన ఎంక్వైరీలోనూ జాప్యం జరుగుతోంది. సాధారణంగా ఒక రోజులో పూర్తయ్యే విచారణ ఈ నకిలీలను గుర్తించడానికి కొన్ని రోజుల పాటు సాగే అవకాశం ఉంది. ఇలాంటి వారు ఇంకొందరు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. వారినీ పట్టుకుని కటకటాల్లోకి పంపిస్తాం’ – టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు సలీంగా మారిన సాలం మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సాలం సైతం నకిలీ ఐడెంటిటీల ఆధారంగా రెండు పాస్‌పోర్టులు పొందాడు. వ్యాపారిగా ఉన్న అతను మొదటిసారి తన వివరాలతోనే పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. దీని కాలపరిమితి యుగియడంతో రెన్యువల్ కూడా చేయించుకున్నాడు. యూఎస్‌కు చెందిన బీ1 అండ్ బీ2 వీసాలు పొందాలని భావించిన సాలం అడ్డదారుల్లో మహ్మద్ సలీం పేరుతో ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డుతో పాటు ఇతర ధ్రువీకరణలు పొందాడు. వీటి ఆధారంగా ఆ పేరుతో దరఖాస్తు చేసుకుని రెండో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. దీనిని వినియోగించి వీసా కోసం అప్లై చేయగా... అనివార్య కారణాల నేపథ్యంలో చెన్నై కాన్సులేట్ తిరస్కరించింది. రెండోసారి అసలు పాస్‌పోర్ట్‌తో దరఖాస్తు చేసుకున్నా ఇదే పరిస్థితి ఎదురైంది. -
రాత్రిపూట చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
విజయవాడ : రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడే ముఠాను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశా రు. వారి నుంచి రూ.6.5 లక్షల విలువ చేసే బంగా రం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ షేక్ నవాబ్ జాన్ వివరాలు వెల్లడిం చారు. సీసీఎస్ పోలీసులకు అందిన సమాచారం మేరకు నలుగురు పాత నేర స్తులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన పాత నేరస్తులు తిల్లరి దుర్గారావు అలియాస్ పిచ్చి దుర్గారావు, షేక్ నాగూర్, దేవరకొండ దుర్గారావు అలియాస్ అఘోర, దేవరకొండ గోపి అలియాస్ పిట్ల.. చెడు అలవాట్లకు గురై అనేక దొంగతనాలు చేసి జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలై తిరిగి వారు దొంగతనాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులు తాజాగా నున్న ఏరియాలో 7, అజిత్‌సింగ్‌నగర్ పరిధిలో 5, భవానీ పురం పరిధిలో 1.. మొత్తం 13 నేరాలకు పాల్పడినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వీరి నుంచి రూ. 6.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీసీఎస్ ఏసీపీ వర్మ, లా అండ్ ఆర్డర్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు బైక్ దొంగల అరెస్ట్
గాజువాక: నగరంతోపా టూ జిల్లాలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు అపహరిస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఒక ముఠా ను గాజువాక క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ మోడళ్లకు చెందిన 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరో 12 ద్విచక్ర వాహనాలను తమ దురలవాట్ల కోసం విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం ఏసీపీ ఫల్గుణరావు ఆ వివరాలను వెల్లడించారు. విశాఖ జిల్లా మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన మర్రా జగన్నాథరావు అలియాస్ జగదీష్ బైక్ మెకా నిజంలో నిపుణుడు. అదే గ్రామానికి చెందిన ఉరు టి వంశీ అలియాస్ పొట్టి, మైలపల్లి భరత్ అలియాస్ బాస్, తోటాడ అజయ్‌కుమార్ అలియాస్ డీఎ స్పీ సహకారంతో ద్విచక్ర వాహనాలను తస్కరించి అమ్మేస్తున్నాడు. నగరంలోని గాజువాక, పరవాడ, ఎయిర్పోర్ట్ జోన్‌తోపాటు జిల్లాలోని అనకాపల్లి, ముగనపాక, కశింకోట, చోడవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. గాజువాకలో ఇటీవల కాలంలో నాలుగు ద్విచక్ర వాహనాల అపహరణపై అందిన ఫిర్యాదులపై విచారణలో భాగంగా గాజువాక క్రైం సీఐ కె.పైడపునాయుడు ఆధ్వర్యంలో క్రైం ఏసీపీ ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం తమ విచారణను కొనసాగిస్తున్న తరుణంలో లభించిన సమాచారం మేరకు స్థానిక జగ్గు జంక్షన్ వద్ద నింది తుడు జగన్నాథరావును అదుపులోకి తీసుకొని విచా రించారు. దీంతో ఈ ముఠా విషయం వెలుగు చూ సినట్టు క్రైం ఏసీపీ తెలిపారు. ఈ విచారణ కోసం సౌత్ ఏసీపీ జె.రామ్మోహన్రావు సహకరించారని చెప్పారు. విచారణలో ప్రతిభ చూపిన క్రైం ఎస్ఐలు ఎన్.సునీల్, ఎన్.అశోక్‌చక్రవర్తి, పి.పాపారావు, హెడ్ కానిస్టేబుళ్లు కె.సూర్యనారాయణ, ఎన్.మురళి, కానిస్టేబుళ్లు రవి, లక్ష్మణ్, ఎస్.కె.వల్లి, డి.ఎన్. మూర్తి, ఎస్.వినోద్‌లను ఆయన అభినందించారు. సమావేశంలో గాజువాక సీఐ కె.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ డాక్యుమెంట్ల తయారీ ముఠా అరెస్ట్
రాజంపేట: జిల్లాలో నకలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టులు సంపాదించే ముఠాను అరెస్టు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనగలూరుకు చెందిన బసిరెడ్డి వెంకటశివారెడ్డి 2012లో కువైట్‌కు వెళ్లి యేడాదిన్నర తర్వాత జీతం సరిపోక తిరిగి వచ్చాడు. మళ్లీ వెళ్లాలనుకొనే సమయంలో మెడికల్ అన్‌ఫిట్ కావడంతో పాత పాస్‌పోర్టు చెల్లలేదు. దీంతో ఎలాగైనా కువైట్‌కు వెళ్లాలనుకుని తమ గ్రామానికి చెందిన నర్సారెడ్డికి తన సమస్యను చెప్పుకున్నాడు. అతను బద్వేలుకు చెందిన పెంచల్‌రెడ్డి వద్ద నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించి ఇస్తానని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత వీరు బద్వేలుకు వెళ్లి పెంచల్‌రెడ్డిని సంప్రదించారు. అతను తప్పుడు చిరునామాతో నకిలీ ఓటరు కార్డు తయారు చేశాడు. అనంతరం బద్వేలులోని ప్రసాద్ ఆన్లైన్ సర్వీసెస్ అనే మీసేవ సెంటర్లో యజమాని ప్రసాద్, ఆపరేటర్ ఇస్మాయిల్ సాయంతో శివారెడ్డి పేరుతో నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆ నెంబరు పైన నకిలీ చిరునామా అప్డేట్ చేశాడు. ఈ ఆధార్‌తో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసి పాస్‌పోర్టు తీసుకున్నారు. ఈ విధంగా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినందుకు శివారెడ్డి వద్ద పెంచల్‌రెడ్డి రూ.25వేలు డబ్బులు తీసుకున్నాడన్నారు. ఇందులో నర్సారెడ్డి , మీసేవ యజమాని ప్రసాద్, ఆపరేటర్ ఇస్మాయిల్‌కు వాటా ఇచ్చాడన్నారు. ఈనెల 24న మీసేవ యజమాని ప్రసాద్, ఆపరేటర్ ఇస్మాయిల్‌తో పాటు శివారెడ్డి, నర్సారెడ్డిలను అరెస్టు చేశామన్నారు. పెంచల్‌రెడ్డి పరారీలో ఉన్నాడన్నారు. శివారెడ్డి ఒరిజనల్ ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ఓటరు కార్డును సీజ్ చేశామని వివరించారు. సమావేశంలో మన్నూరు ఎస్ఐ మహేశ్‌నాయుడు, రూరల్ పోలీసులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యం ‘ముఠా’ గుట్టురట్టు!
కర్నూలు : నకిలీ మద్యం ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఈఎస్ ఆర్.వి.సుధాకర్, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిఘా వేసి ఏపీ21 ఏఈ 8159 నంబరు గల టాటా సుమోలో తరలిస్తున్న 1400 మెక్‌డోవెల్స్ క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని రవాణాదారుడితో పాటు ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిమ్మాపురం కేంద్రంగా వ్యాపారం... ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం కేంద్రంగా నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రంగస్వామి రెండేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. కృష్ణగిరి, గోనెగండ్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం మండలాల్లో బెల్టు దుకాణాలే లక్ష్యంగా ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లాగౌడ్పై గతంలో పీడీ యాక్ట్... నకిలీ మద్యం వ్యాపారి ఎల్లా గౌడ్ గతంలో కూడా ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి దాదాపు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈయనపై పీడీ యాక్ట్ నమోదు కావడంతో కొంతకాలం పాటు వ్యాపారానికి విరామం ప్రకటించి అధికార పార్టీకి చెందిన నాయకుల అండతో రెండేళ్లుగా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీ ఇలా... రాయచూరు జిల్లా గిలకసుగూరు గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్ అదే గ్రామంలో ఓ రహస్య ప్రదేశంలో మెక్‌డోవెల్స్ కంపెనీకి చెందిన పాత సీసాలను పెద్దఎత్తున పోగుచేసి కలర్ నీళ్లలో స్పిరిట్ కలిపి సీసాలకు నింపి ప్రత్యేక మిషన్‌తో ప్లాస్టిక్ మూతలు బిగించి జిల్లాలోని బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మండలాల వారీగా ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బంటుపల్లె గ్రామానికి చెందిన బాలా గౌడ్, వీరాంజనేయులు దేవనకొండ మండలంలో బెల్టు షాపులకు స్పూరియస్ లిక్కర్ (విషపూరితమైన మద్యం) సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు నిఘా వేసి పట్టుకున్నట్లు సమాచారం. రెండు నెలలుగా నిఘా... ఎక్సైజ్ అధికారులు తిమ్మాపురం రంగస్వామిపై రెండు నెలలుగా నిఘా ఉంచి ఈదులదేవరబండ నుంచి వెంబడించి బేతపల్లె గ్రామ సరిహద్దులో పట్టుకున్నట్లు తెలుస్తోంది. గిలకసుగూరు నుంచి మాధవరం చెక్‌పోస్టు మీదుగా జిల్లాలోకి నకిలీ మద్యం రవాణా అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐదుగురు కానిస్టేబుళ్లను గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు, దేవనకొండ మండలం ఈదులదేవరబండ దగ్గర కాపలా ఉంచి పక్కా సమాచారంతో నకిలీ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్కార్ట్‌గా మరో వాహనంలో వెళ్తున్న ఏజెంట్లు బాలాగౌడ్, వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పత్తికొండ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారుల అదుపులో ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. చెక్‌పోస్టులకు ముందే సమాచారం... జిల్లా సరిహద్దు గ్రామాలకు గిలకసుగూరు ఆనుకుని ఉండటంతో కర్ణాటక పోలీసుల నిఘా కొరవడింది. దీంతో నకిలీ మద్యం రవాణాదారులు చెక్‌పోస్టులలో మామూళ్లు ముట్టజెప్పి వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని దాదాపు పది మండలాలను కేంద్రంగా చేసుకుని నెలకు రెండుసార్లు గిలకసుగూరు నుంచి బెల్టు దుకాణాలకు ఎల్లా గౌడ్ ఏజెంట్ల ద్వారా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తరలించే వాహనాల నంబర్లు చెక్‌పోస్టులో ఉన్న అధికారులకు ముందుగానే చేరవేస్తారు. దీంతో తనిఖీలు లేకుండానే అక్కడి అధికారులు వదిలేస్తుండటంతో నకిలీ మద్యం వాహనాలు జిల్లాలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. -
నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు
అన్నవరం (ప్రత్తిపాడు): నకిలీ కరెన్సీ మారుస్తున్న ముగ్గురు వ్యక్తులను అన్నవరం పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకటరమణ అన్నవరం పోలీస్ స్టేషన్లో బు«ధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద గల దేవస్థానం ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న కారులో నకిలీ కరెన్సీ ఉందన్న సమాచారం మేరకు అన్నవరం ఎస్ఐ పార్థసారథి, ఇతర సిబ్బంది అక్కడకు వెళ్లి ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.రెండు వేల నకిలీ కరెన్సీ నోట్లు 50, రూ.50 వేల అసలు కరెన్సీ లభ్యమైంది. వీరిలో ప్రధాన నిందితుడు నమ్మి శ్రీనివాసరావు రూ.లక్ష విలువైన 50 నకిలీ రెండు వేల నోట్లు తీసుకురాగా, అవి తీసుకుని అసలు కరెన్సీ రూ.50 వేలు ఇచ్చేందుకు వల్లభదాసు లక్ష్మణరావు, అతని సహాయకుడు మిద్దే రవికుమార్ వచ్చారని తెలిపారు. వీరు ముగ్గిరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు విశాఖ, పశ్చిమగోదావరి వాసులు నమ్మి శ్రీనివాసరావుది విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం. ఇతడు కలకత్తా నుంచి నకిలీ కరెన్సీ తెచ్చి వివిధ జిల్లాలలోని ఏజెంట్లకు నకిలీ కరెన్సీ విలువకు సగం అసలు కరెన్సీ ఇచ్చే షరతు మీద సరఫరా చేస్తుంటాడని తెలిపారు. గతంలో ఇదే నేరంపై శ్రీకాకుళం, రాజమండ్రిలో అరెస్టై బెయిల్ మీద వచ్చాడని, అతనిపై నాలుగు కేసులు ఉన్నట్లు డీఏస్పీ తెలిపారు. ఆ కేసుల్లో సుమారు రూ.25 లక్షల నకిలీ కరెన్సీ అతని నుంచి రికవరీ చేసినట్లు విచారణలో తెలిసిందని వివరించారు. అసలు కరెన్సీ ఇచ్చేందుకు వచ్చిన వల్లభదాసు లక్ష్మణరావుది పశ్చిమగోదావరి జిల్లా మెట్టు ఉప్పరగూడెం కాగా, సహాయకునిగా వచ్చిన మిద్దే రవికుమార్‌ది భీమడోలు జంక్షన్ అని తెలిపారు. వీరిద్దరు మారుతి సుజికీ వెర్టికా కారులో అన్నవరం వచ్చినట్టు తెలిపారు. 50 నోట్లపైనా ఒకటే నంబరు.. రూ.రెండు వేల నకిలీ కరెన్సీ నోట్లన్నీ ఒకే నెంబర్‌తో ఉండడం విశేషం. ఆ నోట్లన్నీ 8 సీబీ 608207 నెంబర్‌తో ఉన్నాయి. నిందితులను నకిలీ కరెన్సీ రవాణా, మార్పిడి తదితర కేసులపై నమోదు చేశామని వివరించారు. ప్రత్తిపాడు సీఐ ఎ.శ్రీనివాసరావు, అన్నవరం ఎస్ఐ పార్థసారథి, అడిషనల్ ఎస్ఐ చిరంజీవి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మత మార్పిడి ముఠా గుట్టు రట్టు
ఉప్పల్: విద్యార్థులను మతమార్పిడికి పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.ఇందుకు సంబంధించి మల్కాజిగిరి ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏసీపీ సందీప్‌రావు, మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జానకిరెడ్డితో కలిసి వెల్లడించారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన మహమ్మద్ సిద్దిఖి అలియాజ్ సత్యనారాయణ నగరంలోని నాదర్గుల్ మెగా డ్రీమ్ సిటీలో నివాసం ఉంటున్నాడు. ముందు క్రిస్టియన్గామారి ఆ తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. కొందరికితో కలిసి ముఠాగా ఏర్పడి పీస్ అర్బన్ హోమ్ సొసైటీని ఏర్పాటుచేసుకున్నారు. చిన్నారులకు విద్య నేర్పుతామంటూ ప్రచారం చేసేవారు. మహబూబ్‌నగర్, సూర్యాపేటలతో పాటు వెనుకబడిన ప్రాంతాలలో 4–14 సంవత్సరాలలోపు గల ఎస్సీ, ఎస్టీ బాలబాలికలను ఎంపిక చేసుకొని ఉచితంగా చదువు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. మొదట్లో ఎర్రకుంటలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకొని తరువాత రెండు నెలల క్రితం మౌలాలిలోకి స్కూల్‌ను మార్చారు. అయితే అక్కడ విద్యార్థులను బలవంతంగా మతానికి సంబంధించిన విషయాలు చెబుతూ మతమార్పిడికి యత్నిస్తున్నారని చైల్డ్ సొసైటీ నిర్వాహకులుఫిర్యాదు చేశారు. దీంతో దాడిచేసి 10 మంది బాలురు, 7 మంది బాలికలను అదుపులోకి తీసుకొని చైల్డ్ హోమ్‌కు తరలించారు. మతమార్పిడిలకు పాల్పడుతున్న ముఠాలోని 9 మంది సభ్యులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఒక్కరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
గుప్తనిధుల గుట్టు రట్టు
-
గుట్టు రట్టు
ఒంగోలు క్రైం: దొనకొండ మండలం కొచ్చర్లకోట గ్రామ పరిధిలోని గొంగటికొండ వద్ద గుప్త నిధుల తవ్వకాల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు వెల్లడించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలోని ఐటీ కోర్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గుప్తనిధుల తవ్వకాల ముఠా వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడు కనిగిరికి చెందిన సూరసాని రవీంద్రారెడ్డిని, అతని సోదరుడు సూరసాని లక్ష్మీ నరసారెడ్డి, విజయవాడకు చెందిన దొంగ గురూజీ ఉమామహేశ్వరరావు, రెండో దొంగ గురూజీ దొడ్డల ధర్మేంద్ర రాయుడులను రుద్రసముద్రం జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామన్నారు. వీరితో పాటు ఆర్థికంగా సహాయం చేసిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వారిని మొత్తం కలుపుకొని 64 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. వీరివద్ద నుంచి తవ్వకాలకు ఉపయోగించిన 175 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 91 జిలెటిన్ స్టిక్స్, 15 కేజీల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు పలు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 50 మంది కూలీలతో కలిసి నెలల తరబడి 300 అడుగులు లోతున గొంగటి కొండలో సొరంగం తవ్వారని వివరించారు. పెద్ద ఎత్తున పేలుడు సామగ్రితో పాటు రెండో ఆటోలు, రెండు జనరేటర్లు, కంప్రెసర్ ట్రాక్టర్, మోటారు సైకిల్, 60 రకాల గిల్ట్ నగలు, అమ్మవారి విగ్రహాలు రెండు, గణేష్ విగ్రహం, కమండలం, నంది విగ్రహం, రెండు స్పటిక లింగాలు, నాగ పడగలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముగ్గురు ఫైనాన్షియర్స్ కూడా అరెస్ట్.. గుప్త నిధుల తవ్వకాలకు సహకరించి సహకరించి పెట్టుబడి పెట్టిన ముగ్గురు ఫైనాన్షియర్స్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మారుబోయిన మాల్యాద్రి, దుబ్బకుటి మల్లికార్జున, దేరంగుల శ్రీనులు ఉన్నారు. అదేవిధంగా మార్కాపురానికి చెందిన శ్రీనివాసులు, గోపాల్ అనే వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టారు. వీరంతా గుప్తనిధులు దొరికితే వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వారితో పాటు పేలుడు సామగ్రి సరఫరా చేసిన బండారు వెంకటాద్రి మార్కాపురానికి చెందిన షేక్ హనీఫ్ బాష, రుద్రపాటి అనీల్ కుమార్, బొచ్చు శ్రీనులుకూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. మార్కాపురానికి చెందిన గుప్తనిధుల తవ్వకాలు జరిపారని అప్పట్లో కూడా ఆ ముగ్గురే పెట్టుబడి పెట్టారన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.47 లక్షలు గొంగటికొండ తవ్వకాలకోసం ఖర్చుచేశారని, అందులో రూ.23 లక్షలు ఫైనాన్షియర్స్ పెట్టుబడి పెట్టగా మిగతా మొత్తం రూ.24 లక్షలు ప్రధాన నిందితుడు సూరసాని రవీంద్రారెడ్డి ఒక్కడే ఖర్చు పెట్టాడని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కూలీలు... గొంగటి కొండ గుప్త నిధుల తవ్వకాలకోసం రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 50 మంది కూలీలను పిలిపించారు. పొన్నూరుకు చెందిన రవీంద్ర రెడ్డి కూలీలను చెరుకుపల్లి, నగరం. పొన్నూరు మండలాల నుంచి రప్పించాడు. వెంకటరెడ్డి అనే వ్యక్తి నెల్లూరు, నంద్యాల, డోన్ ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురానికి చెందిన బత్తుల రాంబాబును తవ్వకాలకు మిషన్ల ఆపరేటర్ కమ్ డ్రైవర్‌గా వినియోగించుకున్నారు. ఇతనితోపాటు చిలకలూరిపేటకు చెందిన సూరసాని ఖాశింరెడ్డి, యద్దనపూడి మండలం పూనూరుకు చెందిన కోడిరెక్క బాబు, వరికుప్పల లింగమయ్య, డేరంగుల ఈశ్వరయ్య, బండి లక్ష్మీరెడ్డి, బండి సుబ్బారావు, బండి రామాంజ నేయులు రెడ్డిలు ఉన్నారన్నారు. వీరితో పాటు గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి, నగరం, పొన్నూరు, కర్నూలు, శ్రీశైలం, ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు, దోర్నాల, మార్కాపురం, రాచర్ల, మార్టూరు, పెద్దారవీడు, కంబం, నెల్లూరు జిల్లా కూవూరు, విడవలూరు ప్రాంతాల నుంచి కూడా కూలీలను గొంగటికొండకు రప్పించారన్నారు. రూ.లక్షలు వచ్చే ఉద్యోగం వదిలి.. గుప్తనిధుల తవ్వకాలలో ప్రధాన నిందితుడు సూరసాని రవీంద్రా రెడ్డిది స్వగ్రామం కనిగిరి. ఇతను ఉత్తరాంచల్‌లో అగ్రికల్చరల్ ఎంబిఏ చదివాడు. స్టార్ ఆగ్రో కంపెనీలో ఇండియా మేనేజర్‌గా పనిచేస్తూ ఏడాదికి రూ.30 లక్షలు జీతం సంపాదించేవాడు. ఉద్యోగాన్ని వదిలి కమోడిటీస్ ట్రేడింగ్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఈ వ్యాపారాల్లో కోటి రూపాయల వరకు అప్పుల పాలయ్యాడు. తొందరగా డబ్బు సంపాయించాలన్న అత్యాశతో 2014 నుంచి విజయవాడలో ఉంటున్న దొంగ గురూజీ ఉమామహేశ్వరరావు మాయలో పడ్డాడు. గుప్త నిధుల కోసం రకరకాల పూజలు చేయించి ఆయన దాదాపు రూ.47 లక్షలు పోగొట్టుకున్నారు. ఉమామహేశ్వరరావు మాయలు నిజాలు కాదని తెలుసుకొని మరోదొంగ గురూజీ రాయుడుని ఆశ్రయించాడు. రాయుడు ద్వారా గొంగటికొండ, పులి కొండ గుహలో రాజుల కాలంనాటి విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, విగ్రహాలు మూడు పెట్టెల్లో తనకు కనిపించాయని చెప్పటంతో నమ్మి కూలీలు, సామగ్రితో అక్కడకు చేరుకున్నారు. తవ్వకాలు ప్రారంభించారు. ఇద్దరు దొంగ గురూజీలదీ మోసాలు చేయటమే పనిగా పెట్టుకొని ఎంతో మందితో కోట్లాది రూపాయలు ఖర్చు చేయించి పూర్తిగా నష్ట పరచటమే వీరిపని అని వివరించారు. రాళ్ల పరీక్ష కోసం అని నమ్మించి.. నెలల తరబడి కొండను తవ్వుతుంటే స్థానికులు నిలదీశరని, అయితే కొండను తవ్వటానికి అనుమతులు ఉన్నాయని, రాయిని పరీక్ష చేయించుకోవటానికి తవ్వుతున్నామని నమ్మించారు. మరోసారి వెలిగొండ టన్నెల్లో భాగంగా తవ్వుతున్నామని నమ్మబలికారు. నిజమేనని గ్రామస్థులు నమ్మారు. ఇడుపూరుకు చెందిన లక్ష్మీరెడ్డి గుప్త నిధుల ముఠా సబ్యులకు, కూలీలకు ఆశ్రయమిచ్చాడు. లక్ష్మీరెడ్డి కూడా గుప్తనిధుల బాధితుడే. దీంతో తన కుమారులతో ముఠా సభ్యులకు, కూలీలకు భోజనాలు సరఫరా చేయించాడు. ఇతను గతంలో గుప్తనిధుల తవ్వకాలలో దాదాపు 20 ఎకరాలు పోగొట్టుకున్నాడు. అత్యాశతో ముఠాకు సహకరించి వచ్చిన గుప్త నిధుల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఏబీటీఎస్.ఉదయరాణి, మార్కాపురం ఓఎస్డీ లావణ్య లక్ష్మీ, దర్శి డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజులు పాల్గొన్నారు. మార్కాపురం ఓఎస్డీ లావణ్య లక్ష్మీ, దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు, పొదిలి, దర్శి సీఐలు ఎం.శ్రీనివాసరావు రాఘవేంద్రరావు, దొనకొండ, మర్రిపూడి, కొనకనమిట్ల, మేదరమిట్ల, తాళ్ళూరు ఎస్ఐలు అజయ్‌బాబు, శ్రీహరి, బాలకృష్ణ, పాండురంగారావు, మహేష్, ఆర్ఎస్సై ప్రసాద్, ఎస్సై హుస్సేన్ బాష, సాంకేతిక సిబ్బందిని ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. దొంగ గురూజీతో డెమో.. – మోసగించే విధానాన్ని ప్రదర్శింప జేసిన ఎస్పీ ఒంగోలు క్రైం: గొంగటికొండ గుప్త నిధుల తవ్వకాల విషయంలో నమ్మించి మోసం చేసిన దొంగ గురూజీల్లో విజయవాడలో స్థిరపడిన భీమవరం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ఒకరు. ఈయన లంకె బిందెలున్నాయని, నోట్ల కట్టలు పది రెట్లవుతాయని జనాన్ని ఎలా మోసం చేస్తాడో శుక్రవారం ప్రదర్శన ద్వారా చూపించారు. ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేక చొరవతో స్థానిక ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం అనంతరం కార్యాలయ ప్రాంగణంలోనే ఒక గుంట తవ్వించి మరీ గుప్తనిధులను తీసే విధానంలో నమ్మినవారిని ఎలా మోసం చేస్తాడో నిందితుడితోనే చేసి చూపించారు. అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పెట్టుకున్న ఉమామహేశ్వరరావు తన ఇంట్లో దుర్గమ్మవారి పీఠం పెట్టి పూజలు చేస్తుంటాడు. ప్రజల మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. లంకె బిందెలు ఎలా తీస్తాడో చూపించాడు. అందరి ముందు గుంట తవ్వించి పూజలు, శాంతి పేరిట నిమ్మకాయలు కోయించి చాలా తతంగాలు చేస్తాడు. అందరినీ బయటకు పంపి పొట్టు సంచిలో పాత రాగి బిందెను తీసుకొచ్చి దానిని వారు బయటకు వెళ్లాక తరువాత దానిని ఆ గుంటలో పెట్టి దానిని పైకి వచ్చేట్టు చేస్తాడు. వచ్చిన దానిని ఆరు నెలలు తీయకూడదని, అరిష్టమని చెప్పి లక్షల్లో దండుకొని వెళ్లిపోతాడు. రూ.లక్ష అసలు నగదు పెట్టి రూ.10 లక్షలు అవుతుందని చెప్పి ఎంతో మందిని మోసం చేసిన విధానాన్ని కూడా ప్రదర్శింపజేశారు. ఇలా వేరు వేరు వ్యక్తులను దాదాపు రూ.3 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇంట్లో పూజలు చేసి ఆడవారికి అమ్మవారు వేషం వేయించి అమ్మవారు ప్రత్యక్ష అయ్యారని నమ్మించి, దిగంబర పూజలు కూడా చేసేవాడని వివరించారు. మరో గురూజీ ధర్మేంద్ర రాయుడుది స్వగ్రామం గుంటూరు జిల్లా పెద్దకూరపాడు గ్రామం. చిన్నప్పుడు ఉత్తరాంచల్ వెళ్లిపోయి దాదాపు 40 సంవత్సరాలు అక్కడే ఉండి అనేక రకాల పూజలు నేర్చుకున్నానని చాలా మందిని నమ్మించాడు. విజయవాడకు వచ్చి ఒక విధవరాలిని వివాహం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. రవీంద్రారెడ్డికి గుప్త నిధుల అత్యాశ ఉందని గమనించిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి రాయుడుకు పరిచయం చేశాడు. దొనకొండ మండలంలోని పులి గుహలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయని రవీంద్రారెడ్డిని నమ్మించి పులికొండకు మూడు కొండలతో లింక్ ఉందని తనకు పూజలో కనిపించిందని నమ్మించాడు. -
ఫారిన్ గర్ల్స్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
-
‘వల’ వేసి వంచిస్తారు !
టెక్కీలను దోచుకుంటున్న ముఠా అరెస్ట్ బనశంకరి: టెక్కీలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను సోమవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కబేగూరు నివాసి లత, పవన్, రూపేన అగ్రహార నివాసి రాఘవేంద్ర, విరాట్‌నగర కిరణ్, శాంత ఐదుగురు ముఠాగా ఏర్పడి సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా వారితో చనువుగా మాట్లాడి వారిని నిలువు దోపిడీ చేస్తోంది ఈ ముఠా. వివరాలు... ఈ గ్యాంగ్‌లో కీలకంగా ఉండే లత సాఫ్ట్వేర్ ఉద్యోగులు తరచూ తిరిగే ప్రాంతాల్లో చక్కగా ముస్తాబు చేసుకుని వారితో మాటలు కలుపుతారు. వారితో పరిచయం పెరిగి వారిని ముందే ఏర్పాటు చేసుకున్న గదికి తీసుకెళ్లేది. అప్పటికే ఆ గదిలో ఉన్న యువతితో సెక్స్‌లో పాల్గొనమని అక్కడిని నుంచి వెళ్లిపోయేది. పక్కా ప్లాన్ ప్రకారం కొద్ది నిముషాల లత గ్యాంగ్ గదిలోకి వచ్చి బాధితుడిని బెదిరించి అతడిని వ్యవహారాన్ని వీడియో తీసి, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు తీసుకుని ఉడాయిస్తారు. తాజాగా ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాఘవేంద్ర వీరి వలలో పడ్డాడు. అతనిని అర్దన్నగంగా వీడియో తీసి, అతని వద్ద ఉన్న రూ. 2 వేల నగదు, రెండు సెల్ఫోన్లు లాక్కున్నారు. రెండు రోజుల క్రితం హొంగసంద్ర రోడ్డులో కారులో వస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి శివకుమార్‌ను ఇలాగే దోచుకున్నారు. రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రగంలోకి దిగిన జాయింట్ పోలీస్‌కమిషన్ సతీశ్ కుమార్ సీఐ కులకర్ణి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు ఇక్కడి సిల్క్‌బోర్డు వద్ద ముఠా సభ్యుడు కిరణ్‌తో పాటు మరో నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. మరోకరి కోసం గాలిస్తున్నారు. -
నకిలీ కరెన్సీ చలామణి ముఠా గుట్టురట్టు
– ఆరుగురు అరెస్టు - రూ.27.32 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం హిందూపురం అర్బన్: నకిలీ కరెన్సీ తయారుచేసి చలామణి చేసే ముఠా గుట్టు రట్టయ్యింది. ముఠాలోని ఆరుగురిని హిందూపురం పోలీసులు అరెçస్టు చేసి వారి వద్ద నుంచి రూ.27.32 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం çహిందూపురం రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ఇలా... బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన ముబారక్ పరిగిమండలం కొడిగేపల్లిలోని తన అక్కబావల వద్ద కొంతకాలంగా ఉంటున్నాడు. ఇతడికి బాపూజీనగర్‌లోని హెచ్.శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడింది. రైస్‌పుల్లింగ్ చేసి దెబ్బతిన్నానని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏదైనా ఉపాయం చెప్పాలని శ్రీనివాసులు కోరగా.. బెంగళూరులో ఏదైనా పని ఇస్తానని ముబారక్ చెప్పాడు. అయితే సులభంగా డబ్బు సంపాదించడానికి వైఎన్ హోసకోటెకు చెందిన తనస్నేహితుడు సంగం శ్రీనివాసులుతో కలిసి దొంగనోట్లు చలామణి చేయాలని నిర్ణయించుకున్నట్లు ముబారక్ చెప్పగా, తనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానముందని తానూ భాగస్వామినవుతానని శ్రీనివాసులు కోరాడు. ఈ మేరకు అందరూ కలిసి హిందూపురంలో ఒక కంప్యూటర్ షాపులో అత్యాధునిక స్కానర్, ప్రింటర్ కొనుగోలు చేసి వాటిని వైఎన్ హోసకోటేలోని సంగం శ్రీనివాసులు ఇంటిలో నకిలీ నోట్లు తయారు చేయడం మొదలు పెట్టారు. మొదట రూ.40వేలు తయారుచేసి హిందూపురం, పాలసముద్రం, పెనుకొండ, గోరంట్ల, బెంగళూరు ప్రాంతాల్లో చలామణి చేశారు. వీటిని ఎవరూ దొంగనొట్లుగా గుర్తించలేకపోవడంతో త్వరగా చలామణి అయిపోయింది. దీంతో ఇక భయంలేదని ఎంతమొత్తంలోనైనా చలామణి చేసేవచ్చు అని రూ. 100, రూ.500, రూ.2వేల నోట్లను తయారు చేశారు. ఇలా దాదాపు రూ.27లక్షలకు పైగా సిద్ధం చేశారు. ముఠా సభ్యులు అలా దొరికిపోయారు.. పెద్ద ఎత్తున తయారుచేసిన నోట్ల మొత్తాన్ని అందరూ పంచుకుని చలామణికి సిద్ధమైపోయారు. ఇందులోభాగంగా హిందూపురంలోని నేతాజీ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ వి.ఈశ్వర్, రొద్దం మండలం తురకలాపల్లికి చెందిన హనుమంతరెడ్డితో పాటు రాజేష్‌కు రూ.4600 నోట్లు ఇచ్చి పంపించారు. అయితే రాజేష్ ఓ టీ స్టాల్ వద్ద దొరికిపోయాడు. అతడిచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో సీఐ రాజగోపాల్, ఎస్సైలు ఆంజినేయులు, జమాల్‌బాషా, శ్రీధర్, శరత్చంద్ర సిబ్బందితో నాలుగు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా కొడిగేపల్లి సమీపంలోని నాగులకట్ట వద్ద ఈ ముఠా ఉన్నట్లు తెలుసుకుని పట్టుకున్నారు. ఇందులో సంగం శ్రీనివాసులు వద్ద రూ.15.27 లక్షలు, ముబారక్ వద్ద రూ.4 లక్షలు, హెచ్.శ్రీనివాసులు వద్ద రూ.4 లక్షలు, వి.ఈశ్వర్ వద్ద రూ.2 లక్షలు, హనుమంతరెడ్డి వద్ద రూ.2 లక్షలు, రాజేష్ వద్ద రూ.4600 మొత్తం రూ.27,32,400 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రింటర్, స్కానర్, గ్లిట్టర్పెన్స్, నగదు ముద్రించిన కాగితాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. -
పోలీసుల అదుపులో ఫోర్జరీ రాకెట్ ముఠా!
– భారీగా ఆర్టీఏ కార్యాలయ రికార్డులు స్వాధీనం – నిందితుల్లో ఓ హోంగార్డు పాత్ర అనంతపురం సెంట్రల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నకిలీ పాసుపుస్తకాల కుంభకోణం’లో ఉన్న నిందితులు మరో స్కాం చేస్తూ వన్‌టౌన్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. గురువారం నగరంలో బీమా లాడ్జిలో ఫోర్జరీ ముఠా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు లాడ్జిపై దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బత్తలపల్లికి చెందిన పాసుపుస్తకాల కుంభకోణంలో కీలక నిందితుడు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఓ హోంగార్డు కూడా జతకలిశాడు. ఇటీవల ఆర్టీఏ కార్యాలయంలో ఫోర్జరీ సంతకాలు చేసి కోర్టును తప్పుదోవ పట్టించాడనే కారణంతో ఆర్టీఏ అధికారులు సదరు హోంగార్డును పోలీసుశాఖకు సరెండర్ చేశారు. అయితే మళ్లీ సదరు హోంగార్డు ఫోర్జరీ ముఠాతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయ రికార్డులను వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పాసుపుస్తకాల తయారీ నిందితునికి నార్కో పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సదరు నిందితులు వన్‌టౌన్ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. అయితే వారు మాత్రం తాము ఎలాంటి తప్పూ చేయలేదని అంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఏ కార్యాలయానికి చెందిన కొన్ని రికార్డులను తీసుకున్నట్లు తెలిపారు. అంతమాత్రాన ఫోర్జరీ చేసినట్లా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం వీటిపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
నగరంలో మరో డ్రగ్స్ రాకెట్
-
నగరంలో మరో డ్రగ్స్ రాకెట్
హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెం 12 లో తొమ్మిది మందిని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల ఎండీఎంఏ, 27 ఎస్ఎస్డీ యూనిట్లు, ఓ కారు, ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. నిందితులు వాడిన నిస్సాన్ కారును( AP10BE9509) పోలీసులు జప్తు చేశారు. -
పాత కరెన్సీ నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
రూ.కోటి పాత నోట్లు స్వాధీనం – 11 మంది అరెస్ట్, నిందితుల్లో ఒకరు కానిస్టేబుల్ – ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ అనంతపురం సెంట్రల్ : భారత ప్రభుత్వం రద్దు చేసిన పాత నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.కోటి పాత కరెన్సీ, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గురువారం ముందే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. నిందితుల వివరాలను స్థానిక పోలీసు కాన్ఫరెన్స్హాల్లో సీసీఎస్ డీఎస్పీ నాగసుబ్బన్న, అనంతపురం డీఎస్పీ మల్లికార్జనవర్మ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముఠా సభ్యులు వివరాలు పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు గ్రామానికి చెందిన తుత్తిరెడ్డి శర భారెడ్డి, బెంగళూరుకు చెందిన షేక్‌సాదిక్‌బాషా, తాడిపత్రి టౌన్‌కు చెందిన డాక్టర్ పందిర్లపల్లి సోమశేఖరరెడ్డి, అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన ధర్మవరం ఈశ్వరయ్య, నగరంలోని మారుతీనగర్‌కు చెందిన మునిశేషారెడ్డి, బుక్కరాయసముద్రం మండలం కొండాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్(ప్రస్తుతం హిందూపురం వన్‌టౌన్‌లో విధులు) గుద్దిలి ఆంజనేయులు(పీసీ నెంబర్ 1565), కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన షేక్నాసర్వలి, తాడిపత్రి టౌన్‌కు చెందిన అనకల శ్రీనివాసకుమార్, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన గంగాధర్, బెంగళూరుకు చెందిన రామేగౌడ, నగరంలో వెంకటేశ్వరనగర్‌కాలనీకి చెంది చిగిచేర్ల ఓబిలేసు ముఠాగా ఏర్పడ్డారు. ఓబిలేసు నివాసముంటున్న వెంకటేశ్వరనగర్‌లోని ఇంటిని కేంద్రంగా చేసుకొని పాత కరెన్సీ నోట్ల మార్పిడికి ప్రణాళికలు రచించారు. విషయం తెలుసుకున్న పోలీసులు 11 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నేపథ్యం ముఠాలో తుత్తిరెడ్డి శర భారెడ్డి కీలక నిందితుడు. గతంలో ఈయన కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న రూ. కోటి పాత కరెన్సీ ఇతనివే. ఇతని మామ కాసేపల్లి కృష్ణారెడ్డి తన భూమిని గతంలో అమ్మి ఆ డబ్బును తనవద్దే రహస్యంగా దాచుకున్నాడు. ఆయన చనిపోయాక అల్లుడైన శరభారెడ్డికి తెలిసింది. అప్పటికే పాతనోట్లు రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో తన మామ దాచిన పాత నోట్లను ఎలాగైనా మార్చుకోవాలని భావించాడు. ఎన్ఆర్ఐ కోటాలో మార్పిడి చేస్తే 80శాతం కరెన్సీ ఇప్పిస్తానని డాక్టర్ సోమశేఖరరెడ్డితో నమ్మబలకాడు. అయితే ఆయనకు చేత కాకపోవడంతో షేక్నాసర్వలీని సంప్రదించాడు. అతని నుంచి ధర్మవరం ఈశ్వరయ్య, కానిస్టేబుల్ ఆంజనేయులుకు వివరించారు. వీరంతా కలిసి బెంగళూరుకు చెందిన గార్మెంట్ పరిశ్రమ నిర్వాహకుడు షేక్ సాదిక్‌బాషాను సంప్రదించి 35శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో 5శాతం ముఠాసభ్యులు, మిగతా 30శాతం శరబారెడ్డి తీసుకునేలా నిర్ణయించారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి షేక్‌సాదిక్‌బాషా, ఆయన డ్రైవర్ రామేగౌడ ఒక కారులో స్థానిక వెంకటేశ్వరనగర్‌లో ఉన్న చిగిచేర్ల వెంకటేశులు ఇంటికి చేరారు. తుత్తిరెడ్డి శరబారెడ్డి, పందిర్లపల్లి సోమశేఖరరెడ్డి, ధర్మవరం ఈశ్వరయ్య, మునిశేషారెడ్డి, అనకల శ్రీనివాస్‌కుమార్, గాదంశెట్టి గంగాధర్, కానిస్టేబుల్ ఆంజనేయులు కోటి రూపాయల పాత కరెన్సీ నోట్లను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. గురువారం కరెన్సీని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నింస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బెంగళూరుకు చెందిన మరో కీలక నిందితుడు మనోహర్‌రెడ్డి పరారీలో ఉన్నారని డీఎస్పీలు వివరించారు. కానిస్టేబుల్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకలీ కరెన్సీని పట్టుకున్న డీఎస్పీలు, సీఐలు ఆంజనేయులు, ఇస్మాయిల్, సాయిప్రసాద్, ఎస్ఐలు చలపతి, కలాకర్బాబు, దాదాపీర్, హెడ్‌కానిస్టేబుల్స్ చెన్నయ్య, మహబూబ్‌బాషా, చిదంబరయ్య, నాగరాజు, కానిస్టేబుల్స్ రంజిత్, సుధాకర్, క్రిష్ణానాయక్, షాజాద్బాషా, హోంగార్డు లక్ష్మిరెడ్డిలను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారని వివరించారు. -
పాతనోట్లను మారుస్తున్న ముఠా గుట్టు రట్టు
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
మిర్యాలగూడ: ఇండియా - ఇంగ్లండ్ టీ 20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రకాశ్‌నగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4 లక్షల నగదు, 3 సెల్ఫోన్లు, 2 బైక్‌లు, ఓ ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. -
ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి..
హైదరాబాద్: ఓ వైపు తీవ్ర కరెన్సీ కష్టాలతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు కాస్తుంటే.. మరో వైపు ఏటీఎం మెషిన్లలో డబ్బు నింపే ఏజెన్సీలో పనిచేసే వారు చేతివాటం ప్రదర్శించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి వీరు స్వప్రయోజనాలకోసం వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 85 లక్షల నగదు, రూ. 3 లక్షల విలువైన బంగారం, 2 బైక్‌లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పక్కదారి పట్టిందని గుర్తించి, ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. -
నోట్ల మార్పిడి పేరుతో మోసం.. ముఠా అరెస్ట్
హైదరాబాద్: నోట్ల మార్పిడి పేరుతో రూ.61 లక్షలతో ఉడాయించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆజాంబాద్ క్రాస్ రోడ్డు వద్ద వారం క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.61 లక్షల విలువైన పాత రద్దయిన నోట్లకు పది శాతం కమీషన్‌పై కొత్త నోట్లను ఇస్తామంటూ ఓ వ్యాపారిని రప్పించారు. అనంతరం అతనిని బెదిరించి ఆ సొమ్ముతో పరారయ్యారు. ఈ విషయంపై మాదాపూర్‌కు చెందిన ఆ వ్యక్తి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముషీరాబాద్‌కు చెందిన ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. దోచుకున్న రూ.61 లక్షల నగదులో రూ.19 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నల్లధనం మార్పిడి ముఠా అరెస్ట్
సూర్యాపేట :నల్లధనం మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట ఎస్పీ పరిమళహననూతన్ అరెస్ట్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన గడగాని శ్రీను, బట్టిపల్లి వెంకటరమణ, పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కేసరి రంగారెడ్డి, బక్కయ్యగూడేనికి చెందిన సానం రామయ్య, లింగాల గ్రామానికి చెందిన కేసరి శోభ, నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన శానం వీరభద్రయ్య, గడ్డిపల్లికి చెందిన సంధ్యాల సతీష్‌తో పాటు కుత్బుషాపురం గ్రామ సర్పంచ్‌శ్రీనివాస్, గడ్డిపల్లి గ్రామ ఎంపీటీసీ సుందరి నాగేశ్వరరావు, ఆరెపురి నారాయణ, దేనుట్ల నాగరాజు, నీలకంఠ రాంబాబులు ముఠాగా ఏర్పడ్డారు.. స్వైపింగ్ మిషన్‌తో వ్యాపారం చేస్తున్న మహిళ, ఇరత బ్యాంకు ఖాతాదారులు 12 మంది ముఠాగా ఏర్పడి 10 నుంచి 30 వరకు పర్సంటేజీలు కట్‌చేసుకొని పాత నోట్లకు కొత్త నోట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. వీరిలో ప్రధానంగా గడ్డిపల్లికి చెందిన గడగాని శ్రీను గతంలో ఎస్బీహెచ్లో డ్రైవర్‌గా పనిచేశాడని.. పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కేసరి రంగారెడ్డి, బక్కయ్యగూడేనికి చెందిన సానం రామయ్యలు గతంలో బ్యాంకులో పనిచేసిన అనుభవంతో ఈ నోట్ల మార్పిడికి పాల్పడ్డారని చెప్పారు. వీరంతా తమకున్న పరిచయాలతో 14 మంది బ్యాంకు ఖాతాదారుల పాస్‌బుక్‌లను తమ వద్దకు తీసుకుని వాటిల్లో బ్లాక్‌మనీ జమచేశారన్నారు. వెంటనే పలువురుకి రోజుకు రూ.200 నుంచి రూ.500 మేరకు కూలీ ఇచ్చి బ్యాంకుల ముందు క్యూలో నిలబెట్టేవారని.. ఇలా అకౌంట్లలో వేయడం. తిరిగి తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే రూ.4 లక్షలను పదిశాతం తీసుకుని రూ.3.60 లక్షలు చెల్లించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. దీంతో ముఠాను పట్టుకునేందుకు గరిడేపల్లి, పెన్‌పహాడ్ పోలీసుల ఆధ్వర్యంలో వీరిపై నిఘా ఏర్పాటుచేశామని.. ఈ నేపథ్యంలోనే ఈనెల 22న లింగాల పెట్రోల్ బంకు సమీపంలో డబ్బులు మార్పిడి చేస్తూ.. పట్టుబడ్డారని వివరించారు. వీరి వద్ద నుంచి రూ.3.10 లక్షల కొత్త నోట్లు, రూ.86. 500 వేలు రూ.వెరుు్య పాత నోట్లను స్వాధీనం చేసుకున్నామని. చెప్పారు. వీరిపై ఐపీసీ 406,409, 420, 180ఆర్/డబ్ల్యూ, 109, 511 కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. సహించేది లేదని నోట్ల మార్పిడిలో కమీషన్లకు పాల్పడినవారితో పాటు అందుకు సహకరించిన వారిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీహెచ్చరించారు. వీరికి సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కూడా ఆరా తీస్తున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జల్సాలకు పోయి.. కటకటాల పాలై...
మల్యాలలో గొలుసుదొంగల ముఠా అరెస్టు ముగ్గురి రిమాండ్.. నాలుగున్నర తులాల గొలుసులు స్వాధీనం సిద్దిపేట జోన్: జల్సాలకు అలవాటుపడ్డ కొందరు.. దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి నాలుగున్నర తులాల గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ వెల్లడించిన వివరాలు ఇలా... సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కు (ఇందిరా కాలనీ)కు చెందిన వేముల శాంతారాం (25) మామిడాల గణేశ్(23), కొంచెం అశోక్ (22)తోపాటు కస్తూరి ప్రశాంత్ (17)లు ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలు చేసేందుకు డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 7న బెజ్జంకి మండలం దాచారం చౌరస్తాలో ఓ మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. ఆగస్టు 30న సిరిసిల్ల మండలం జిల్లెల్ల శివారులో మరో మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారాన్ని ఈ మూఠా దొంగిలించింది. మరోవైపు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది శివారులో జూన్ 22న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తస్కరించారు. ఈనెల 18న జక్కాపూర్ శివారులో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చిన్నకోడూరు ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీస్‌లు మల్యాల చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై శాంతారాం, గణేశ్, అశోక్, ప్రశాంత్‌లు పోలీసులకు అనుమానాస్పదంగా కన్పిపించారు. వారిని అదుపులోకి తీసుకోని విచారించగా గొలుసు దొంగతనాలకు పాల్పడిన వివరాలను వెల్లడించారు. వారి వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని శాంతారాం, గణేశ్, అశోక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే సంఘటనలో మైనర్ బాలుడు ప్రశాంత్‌ను సంగారెడ్డిలోని జువైనల్ హోంకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్ పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని..
హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి భారీగా డబ్బులు దండుకున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు 100 మంది నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతుండటంతో బాధితులు పోలీసులను అశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం
-ఐదుగురి అరెస్టు జైపూర్: విదేశీ కరెన్సీని చెలామణీ చేసేందుకు యత్నించిన ముఠాను ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ తెలిపిన వివరాలివీ.. టర్కీ దేశం కరెన్సీ ‘లిరా’ను చెలామణీ చేసేందుకు ఏడుగురు సభ్యుల ముఠా యత్నిస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం 300 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వాటి విలువ రూ. 500 కోట్లని తేలింది. అయితే, ఆ కరెన్సీ ప్రస్తుతం టర్కీలో చెలామణీలో లేదు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. -
శంషాబాద్ లో నకిలీ వీసా ముఠా అరెస్టు
శంషాబాద్: నకిలీ వీసాలను తయారు చేసి, ఉపాధి పేరుతో పలువురు మహిళలను విదేశాలకు పంపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. శంషాబాద్ పోలీసులు సోమవారం ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి వీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సుబ్బిరెడ్డి, తూర్పు గోదావరికి చెందిన వెంకటేశ్వర్లు, డేవిడ్ రాజు, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎడ్ల శంకర్, మణికంఠతో పాటు అనంతపురం వాసి ఇలియాస్ ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కల్తీ పాల తయారీ ముఠా అరెస్ట్
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్పల్లి, చేర్యాల గ్రామాల్లో కల్తీ పాలు తయారుచేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూరియాతో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీనోట్ల తయారీ ముఠా అరెస్ట్
-
నకిలీనోట్ల తయారీ ముఠా అరెస్ట్
శంషాబాద్: నకిలీ నోట్లు ముద్రిస్తున్న వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న మహేష్ అనే వ్యక్తి నకిలీ నోట్లను తయారు చేస్తున్నాడనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 83 వేల విలువైన నకిలీ నోట్లతో పాటు, ఓ ప్రింటర్, ఓ ల్యాప్‌టాప్, 50 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరి కొంత మంది ఉన్నట్లు సమాచారం. -
టిప్పర్ లో గంజాయి, కారులో ఫాలో...
నల్గొండ : టిప్పర్ వాహనంలో గంజాయిని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన ముఠాను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సూర్యాపేటలో అయిదు రోజుల క్రితం వాహనాల తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 250 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అంచనా. కాగా ట్రిప్పర్ కింద భాగంలో ప్రత్యేకంగా ఓ అరను ఏర్పాటు చేసి అందులో గంజాయిని దాచి పెట్టారు. అంతేకాకుండా ఆ ట్రిపర్ కు ఎస్కార్ట్ గా ముగ్గురు గంజాయి దళారులు కారులో ఫాలో కావటం విశేషం. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ కు ఈ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి మెదక్... అక్కడ నుంచి కర్ణాటక, అటు నుంచి ముంబైకి తరలించేందుకు ఈ ముఠా ప్లాన్ చేసినట్లు సమాచారం. -
నకిలీ మసాలా..
-
బడా కంపెనీల్లో ఉద్యోగాలంటూ ఎర
రూ. 2,500 నుంచి రూ. లక్షకు పైగా వసూలు హైదారాబాద్: బడా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు దండుకొని మోసం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ ముఠాకు నగర పోలీసులు చెక్ పెట్టారు. నోయిడాకు వెళ్లి నలుగురు నిందితులను అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ ప్రభాకర్‌రావు కథనం ప్రకారం... ముఖేశ్ మిశ్రా అనే వ్యక్తి సైన్.కామ్ నుంచి నిరుద్యోగులకు చెందిన మూడు వేల రెస్యూమ్(బయోడేటా)లు రూ. 6 వేలకు కొనుగోలు చేశాడు. ప్రీపెయిడ్ సిమ్ కార్డులను బల్క్‌గా కొనుగోలు చేశాడు. ఆ రెస్యూమ్‌లను నోయిడాకు చెందిన భగీరత్ త్యాగికి ఇవ్వగా, అందులో కొన్నింటిని ఎంపిక చేసి అతను టెలికాలర్స్కు ఇచ్చాడు. బయోడేటాలోని వివరాల ఆధారంగా టెలికాలర్స్ ఫోన్ చేసి... మేం షైన్.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం...బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల్లో ఉద్యోగాలున్నాయని నమ్మిస్తారు. ఎవరైనా ఆసక్తి చూపితే రిజిస్ట్రేషన్ ఫీజు కింద తొలుత 2,500 లు చెల్లించాలంటారు. ఆ తర్వాత ఫోన్లో ఇంటర్వ్యూ చేసి మీరు సెలక్ట్ అయ్యారని సమాచారమిస్తారు. ఆఫర్ లెటర్ కోసం రూ.5,600 లు డిపాజిట్ చేయమంటారు. ఆ తర్వాత ఒరిజినల్ కంపెనీల నుంచి వచ్చినట్టుగా అభ్యర్థులు భావించేలా ముఖేశ్ మిశ్రా ఈఎంకేఈఐ.సీజెడ్ నుంచి ఆఫర్ లెటర్లు తయారు చేసి పంపిస్తాడు. ఆ తర్వాత శిక్షణ ఫీజు, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చార్జీల కింద రూ.25 వేల వరకు డిపాజిట్ చేయాలని అభ్యర్థులను కోరతాడు. కొందరు అభ్యర్థులైతే ఏకంగా లక్షకు పైగా చెల్లించారు. కాగా, నగరానికి చెందిన బాధితుడు చటకొండ బాల యోగీశ్వర్ ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నగర సైబర్ క్రైమ్ పోలీసులు నోయిడా వెళ్లి నిందితులు ముఖేశ్ మిశ్రా, సునీల్ కుమార్ గుప్తా, భగిరత్ త్యాగి, సందీప్ సింగ్‌లను అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన సుమారు 70 మందిని వీరు మోసం చేసినట్టు విచారణలో గుర్తించారు. అయితే ఈ సంఖ్య రెండువేలకు పైగా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
అనంతపురం: నకిలీనోట్లు చెలామణీ చేస్తున్న ఆరుగురిని అనంతపురం వన్ టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,800 విలువ చేసే నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా గుంతకల్లుకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
నకిలీ విగ్రహాలను విక్రయించే ముఠా అరెస్ట్
చిత్తూరు (పెద్దతిప్పసముద్రం) : ఇనుప విగ్రహాలకు బంగారు పూత పూసి బంగారు విగ్రహాలని విక్రయిస్తూ పలువురిని మోసగిస్తున్న ముగ్గురు వ్యక్తులను పెద్దతిప్పసముద్రంలో పోలీసులు సోమవారం అరెస్ట్‌చేశారు. వీరి నుంచి 8 నకిలీ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
అఫ్జల్‌గంజ్: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అఫ్జల్‌గంజ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ సి. అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మనీష్ (35), సాహిల్ (34) వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి, ఒక్కోటి రూ.50 వేల చొప్పున విక్రయిస్తున్నారు. మనీష్ కాచిగూడలో ఉంటూ ఉస్మాన్‌గంజ్‌లో రత్న స్టడీ సొల్యూషన్స్ పేరిట ఓ స్టడీ సెంటర్‌ను నెలకొల్పాడు. ఇందులో చైతన్యపురికి చెందిన అనిల్, శిల్ప, హరీశ్ పని చేస్తున్నారు. ఈ స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, వివిధ రకాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. ఇతనికి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న సాహిల్ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సత్యప్రకాశ్ అనే వ్యక్తి మనీష్, అనిల్‌ల వద్ద నకిలీ సర్టిఫికెట్ కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లను, ల్యాప్‌టాప్‌ను, ప్రింటర్లను, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన సాహిల్ ను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. శిల్ప, హరీశ్ పరారీలో ఉండగా మనీష్, అనిల్, సత్యనారాయణలను రిమాండ్‌కు తరలించారు. -
రూ.5 లక్షల సొత్తు చోరీ: అదుపులో దొంగల ముఠా!
హైదరాబాద్: తాళం వేసున్న ఇంట్లో చోరీ చేసి రూ. 5 లక్షలకు పైగా విలువైన సొత్తును ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఈ ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైటెక్‌సిటీలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశేష్ గోకుల్, భార్య శిల్వా జైస్వాల్ నల్లకుంట తిలక్‌నగర్‌లోని రోహిణి చాంబర్స్ రెండో అంతస్థులో నివాసముంటున్నారు. వీరు శుక్రవారం సాయంత్రం హిమాయత్‌నగర్‌లో ఉంటున్న శిల్పా జైస్వాల్ తల్లిగారి(సుజాత)ఇంటికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉండిపోయారు. కాగా, శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని ఆగంతకులు విశేష్ గోకుల్ ఇంటి మెయిన్ డోర్ తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. రెండు బెడ్ రూమ్‌లలో ఉన్న అల్మారాల తలుపులు తెరచి 9.25 తులాల బంగారు ఆభరణాలు, 79 తులాల వెండి వస్తువులతో పాటు ఎల్సీడీ టీవీ, ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్లు, రూ. 10 వేల నగదు తీసుకుని పారిపోయారు. శనివారం ఉదయం పక్క ఫ్లాట్(202)లో నివాసముండే ఎన్కే. జెన్ విశేష్ గోకుల్ ఫ్లాట్‌లో చోరీ జరిగినట్టు గుర్తించి వారికి ఫోన్ ద్వారా తెలియజేశారు. విశేష్ దంపతులు వెంటనే తమ నివాసానికి చేరుకుని నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చోరీలో పాల్గొన్న దాదాపు పది మందికి పైగా దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
'అనంత'లో దొంగనోట్ల ముఠా అరెస్టు
అనంతపురం: అనంతపురం మూడో పట్టణ పోలీసులు దొంగనోట్లు చలామణీ చేస్తున్న ఓ ముఠాను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు సమాచారం. వారి వద్ద నుంచి రూ.40 వేల అసలు కరెన్సీ, రూ.5 లక్షల నకిలీ కరెన్సీ, ఒక కంప్యూటర్, ప్రింటర్‌తో పాటు మరో 12 రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ వ్యక్తి నకిలీ కరెన్సీ మారుస్తుండగా పట్టుబడ్డాడు. అతనిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. -
నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠా అరెస్టు
ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ముఠాను పుల్లలచెరువు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి నకిలీ పాస్ పుస్తకాల తయారీ, అమ్మకంతోపాటు పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది జనవరి 30న పుల్లలచెరువు మండల తహశీల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. పుల్లలచెరువు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన నారు వెంకటేశ్వరరెడ్డి నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారానికి ప్రధాన సూత్రధారని పేర్కొన్నారు. వెంకటేశ్వరరెడ్డి గుంటూరు నగరంలోని లాలాపేటలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆశ్రయించి నకిలీ పాస్ పుస్తకాల ప్రింటింగ్ చేయించేవాడు. అలా పూర్తి చేసుకున్న పాస్ పుస్తకాలను పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పాల శ్రీనివాసులు, యర్రగొండపాలెం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్న పూట్ల సుబ్బారావు, యర్రగొండపాలెంకు చెందిన ముక్కుమూడి రూబేనులకు పట్టాదారు పాస్ పుస్తకాలను విక్రయించేవాడు. ఈ పుస్తకాల్లో తహశీల్దార్ సంతకం, ఆర్ఐ సంతకం, వీఆర్ఓ సంతకంతోపాటు టైటిల్డీడ్లో ఆర్డీఓ సంతకాలు కూడా ఫోర్జరీవే. ఉప్పాల శ్రీనివాసులు ఫోర్జరీ సంతకాలు చేయటంలో చేయి తిరిగిన వ్యక్తి. పూట్ల సుబ్బారావు డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ తహశీల్దార్, ఆర్డీఓ, ఆర్ఐల స్టాంపులను తయారు చేయించి ఈ పాస్ పుస్తకాలపై ముద్రించేవాడు. పూట్ల సుబ్బారావు డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ తహశీల్దార్, ఆర్డీఓ, ఆర్ఐల స్టాంపులను తయారు చేయించి ఈ పాస్ పుస్తకాలపై ముద్రించేవాడు. ముక్కుమూడి రూబేనుతో కలిసి ఈ ముగ్గురు పుల్లలచెరువు గ్రామానికి చెందిన తంగెళ్ళ మూర్తయ్య, కొలకలూరి కుమార్, రాచకొండ నాగయ్యలకు విక్రయించేవారు. ఈ ముగ్గురూ కలిసి ఒక్కో రైతు వద్ద రూ.35 వేలు తీసుకొని పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్డీడ్లను అమ్మేసేవారు. ఈ విధంగా కొనుగోలు చేసిన వారు పొలాలున్నట్లుగా ఆ పాస్ పుస్తకాల్లో రాయించేసి బ్యాంకుల్లో రుణాలు కూడా పొందినట్లు తెలిసిందని ఎస్సీ తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి దుర్వినియోగానికి పాల్పడినందుకుగాను వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల రాకెట్ ప్రస్తుతం పుల్లలచెరువు మండలం వరకు మాత్రమే విచారించామని, జిల్లావ్యాప్తంగా ఏమైనా ఇలాంటి పరిస్థితి ఉందేమోనని ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దాదాపు 500కుపైగా నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు వివిధ వ్యక్తుల వద్ద ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పుల్లలచెరువులోని నాలుగు బ్యాంకుల్లో ఈ పాస్ పుస్తకాలను పెట్టి సుమారు రూ.2 కోట్లు రుణాలు పొందినట్లు సమాచారం ఉందని, అయితే ఆయా బ్యాంకులపై విచారణ చేపడతామన్నారు. రెవెన్యూ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది, బ్యాంకుల్లో మేనేజర్లు, ఫీల్డు ఆఫీసర్ల పాత్రపై కూడా కన్నేసినట్టు పేర్కొన్నారు. వాళ్ళ ప్రమేయం ఉందని తేలితే ఆయా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. పాస్ పుస్తకాలను ప్రింటింగ్ చేస్తూ నేరానికి సహకరించిన గుంటూరు నగరంలోని లాలాపేటకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఆకుల రమేష్, రామ్మోహన్‌లను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి బిఆర్ వరుణ్, జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్, మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు తదితరులు ఉన్నారు. -
దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లో ప్రేమికులను బెదిరించి.. అత్యాచారాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఫెయిజల్ దయాని ఆధ్వర్యంలో 30మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం పహాడీషరీఫ్ షాహిన్‌నగర్ ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లోకి చొరబడి దంపతులపై దాడి చేసి బంగారం, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పక్కాప్లాన్లో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో ముఠా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ముఠా నాయకుడితోపాటు మిగిలిన సభ్యుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :ఫైనాన్స్ వ్యాపారం ముసుగులో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడి చిరునామా కూడా తెలియకుండానే ముఠా సభ్యులు నకిలీ కరెన్సీని చలామణి చేయడం పోలీసులకు సవాలుగా మారింది. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎన్.శివశంకర్ రెడ్డి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వల్లూరి రాజశేఖర్ వడ్రంగి పని, వస్త్ర వ్యాపారం, రోల్డ్‌గోల్డ్ వస్తువుల వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. దీంతో అతడు మండపేటకు మకాం మార్చాడు. అలాగే అనపర్తి మండలం కుతుకులూరు కాలనీకి చెందిన మేడపాటి శ్రీనివాసరెడ్డి ఫైనాన్స్, ఇన్స్టాల్మెంట్ వ్యాపారాలు చేసి నష్టపోయాడు. కొద్దికాలం క్రితం రాజశేఖర్‌తో శ్రీనివాసరెడ్డికి పరిచయం ఏర్పడింది. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని వీరు నిర్ణయానికి వచ్చారు. ఇందుకు నకిలీ కరెన్సీయే మార్గమని భావించారు. సుమారు ఏడు నెలల క్రితం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ధన్‌బాద్‌రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్‌కు పరిచయమయ్యాడు. తాను నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తానని, అందుకు కొంత నగదు ఇవ్వాలన్నాడు. దీంతో రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి కలిసి ధన్బాద్రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. లక్ష రూపాయల నకిలీ కరెన్సీ నోట్లకు రూ.47 వేలు అసలు కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలివిడతగా ధన్‌బాద్‌రెడ్డి వారికి రూ.ఆరు లక్షల నకిలీ కరెన్సీ నోట్లు జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లా రేవానిజరియా పట్టణానికి చెందిన దివేష్ కుమార్ అనే వ్యక్తి ద్వారా రాజమండ్రికి పంపాడు. రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి కలిసి రాజమండ్రి నుంచి దివేష్ కుమార్‌ను మండపేట తీసుకువచ్చి నకిలీ కరెన్సీలో రూ.3.50 లక్షలను మహేంద్రవాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి మల్లిడి కుమార్ రెడ్డి (మణికంఠ)కు, రూ.2.50 లక్షల (రూ.500 నోట్లు)ను రామవరం కాలనీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కర్రి వెంకట రెడ్డికి ఇచ్చారు. వారి నుంచి రూ.లక్ష నకిలీ కరెన్సీకి రూ.53 వేలు చొప్పున రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి వసూలు చేశారు. ఆ సొమ్మును ధన్‌బాద్ రెడ్డి సూచించిన బ్యాంకు ఖాతాల్లో దఫదఫాలుగా జమ చేశారు. నకిలీ కరెన్సీ చలామణి వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో మరో రూ.పది లక్షలు ఇమ్మని ధన్‌బాద్ రెడ్డితో రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి దివేష్ కుమార్ వాటిని తీసుకుని మండపేట వచ్చాడు. దివేష్ కుమార్‌ను రాజశేఖర్ ఇంట్లో ఉంచి, అతడి వద్ద నుంచి రూ.8 లక్షల కరెన్సీ నోట్లు తీసుకున్నారు. మల్లిడి కుమార్ రెడ్డి, కర్రి వెంకట రెడ్డికి చెరో రూ.50 వేలు ఇచ్చి, వారి నుంచి అసలు నగదు తీసుకున్నారు. మిగిలిన నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు రాత్రి 8 గంటల సమయంలో మండపేట బస్టాండ్ చెట్టు వద్ద రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి పథకం రచించుకుంటుండగా, విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయగా, నకిలీ కరెన్సీ బాగోతం వెలుగుచూసింది. వీరితో పాటు దివేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1785 రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు, రూ.8,800 అసలు నగదు, రెండు మోటార్ బైక్‌లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ధన్‌బాద్ రెడ్డి, మల్లిడి కుమార్ రెడ్డి, కర్రి వెంకట రెడ్డిలు పరారీలో ఉన్నారు. నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ శివశంకర్ రెడ్డి, అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.సత్యనారాయణ అభినందించారు.