డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని..
Published Sat, Jul 23 2016 1:06 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
హైదరాబాద్: డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి భారీగా డబ్బులు దండుకున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు 100 మంది నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతుండటంతో బాధితులు పోలీసులను అశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement