నగరంలో లక్ష ‘డబుల్’ ఇళ్లు
Published Wed, Aug 30 2017 3:51 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
హైదరాబాద్: నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ బుధవారం టెండర్లను ఆహ్వానించింది. ఒకే చోట లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇచ్చే నగరంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రికార్డు సృష్టించనుందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
లక్ష ఇళ్ల నిర్మాణానికి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖలతో సమన్వయంతో జీహెచ్ఎంసీ పనిచేస్తుందన్నారు. రూ. 8000 కోట్లకు పైగా వెచ్చించి లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. శరవేగంగా వీటిని నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామని మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఒక్కో ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు వివరించారు.
Advertisement