నోట్ల మార్పిడి పేరుతో మోసం.. ముఠా అరెస్ట్
Published Thu, Dec 15 2016 9:55 AM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM
హైదరాబాద్: నోట్ల మార్పిడి పేరుతో రూ.61 లక్షలతో ఉడాయించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆజాంబాద్ క్రాస్ రోడ్డు వద్ద వారం క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.61 లక్షల విలువైన పాత రద్దయిన నోట్లకు పది శాతం కమీషన్‌పై కొత్త నోట్లను ఇస్తామంటూ ఓ వ్యాపారిని రప్పించారు. అనంతరం అతనిని బెదిరించి ఆ సొమ్ముతో పరారయ్యారు.
ఈ విషయంపై మాదాపూర్‌కు చెందిన ఆ వ్యక్తి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముషీరాబాద్‌కు చెందిన ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. దోచుకున్న రూ.61 లక్షల నగదులో రూ.19 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement