మొగల్ సామ్రాజ్య పతనంతో 1857లో గోల్కొండ సంస్థానం స్వతంత్ర రాజ్యంగా ఉనికిలోకి వచ్చింది. అప్పట్లో దాదాపు దేశం మొత్తం బ్రిటిష్ కరెన్సీ వినియోగించినా.. హైదరాబాద్ మాత్రం సొంత కరెన్సీ రూపొందించుకుంది. ఐదో నిజాం ఆఫ్జలుదౌల్లా హైదరాబాద్‌లోని సుల్తాన్ షాహీలో నాణాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు.
ఈ నాణాలను నాలుగు రకాలుగా.. బంగారం, వెండి, రాగి, ఇత్తడితో తయారు చేసేవారు. తొలుత 12.03 గ్రాముల బరువుండే రాగి నాణాలు, 11.02 గ్రాముల వెండి నాణాలు విడుదల చేశారు. తర్వాత 1890 ప్రాంతంలో 1.37 గ్రాములు, 2.07 గ్రాముల బరువుండే చిన్న వెండి నాణాలను, చిన్న రాగి, ఇత్తడి నాణాలను ముద్రించారు. ఇక 1905 నుంచి 1945 మధ్య నాలుగు రకాల బంగారు నాణాలనూ ముద్రించారు. వాటిల్లో 11.09 గ్రాముల బంగారు నాణెం చాలా గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment