
వివరాలు వెల్లడిస్తున్న క్రైం ఏసీపీ ఫల్గుణరావు
గాజువాక: నగరంతోపా టూ జిల్లాలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు అపహరిస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఒక ముఠా ను గాజువాక క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ మోడళ్లకు చెందిన 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరో 12 ద్విచక్ర వాహనాలను తమ దురలవాట్ల కోసం విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం ఏసీపీ ఫల్గుణరావు ఆ వివరాలను వెల్లడించారు. విశాఖ జిల్లా మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన మర్రా జగన్నాథరావు అలియాస్ జగదీష్ బైక్ మెకా నిజంలో నిపుణుడు. అదే గ్రామానికి చెందిన ఉరు టి వంశీ అలియాస్ పొట్టి, మైలపల్లి భరత్ అలియాస్ బాస్, తోటాడ అజయ్‌కుమార్ అలియాస్ డీఎ స్పీ సహకారంతో ద్విచక్ర వాహనాలను తస్కరించి అమ్మేస్తున్నాడు.
నగరంలోని గాజువాక, పరవాడ, ఎయిర్‌పోర్ట్ జోన్‌తోపాటు జిల్లాలోని అనకాపల్లి, ముగనపాక, కశింకోట, చోడవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. గాజువాకలో ఇటీవల కాలంలో నాలుగు ద్విచక్ర వాహనాల అపహరణపై అందిన ఫిర్యాదులపై విచారణలో భాగంగా గాజువాక క్రైం సీఐ కె.పైడపునాయుడు ఆధ్వర్యంలో క్రైం ఏసీపీ ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం తమ విచారణను కొనసాగిస్తున్న తరుణంలో లభించిన సమాచారం మేరకు స్థానిక జగ్గు జంక్షన్ వద్ద నింది తుడు జగన్నాథరావును అదుపులోకి తీసుకొని విచా రించారు. దీంతో ఈ ముఠా విషయం వెలుగు చూ సినట్టు క్రైం ఏసీపీ తెలిపారు. ఈ విచారణ కోసం సౌత్ ఏసీపీ జె.రామ్మోహన్‌రావు సహకరించారని చెప్పారు. విచారణలో ప్రతిభ చూపిన క్రైం ఎస్‌ఐలు ఎన్.సునీల్, ఎన్.అశోక్‌చక్రవర్తి, పి.పాపారావు, హెడ్ కానిస్టేబుళ్లు కె.సూర్యనారాయణ, ఎన్.మురళి, కానిస్టేబుళ్లు రవి, లక్ష్మణ్, ఎస్.కె.వల్లి, డి.ఎన్. మూర్తి, ఎస్.వినోద్‌లను ఆయన అభినందించారు. సమావేశంలో గాజువాక సీఐ కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment