Bikes Robbery
-
నగరంలో చోరీ.. తాండూరులో అమ్మకం
తాండూరు: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వికారాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. యాలాల మండలం, కమాల్‌పూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్, మ్యాతరి భాస్కర్, మ్యాతరి శివ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు ముఠాగా ఏర్పడి వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. నాలుగు నెలలుగా వాహనాలు అపహరిస్తూ.. మధ్యవర్తుల సాయంతో తక్కువ ధరకు తాండూరులో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు దొంగిలించారు. మాదాపూర్ పరిధిలో ఐదు బైకులు, కూకట్‌పల్లిలో రెండు బైకులు, ఒక ఆటో, మియాపూర్‌లో రెండు బైకులు, బంజారాహిల్స్ ప్రాంతంలో మూడు బైకులు, సనత్‌నగర్‌లో రెండు బైకులు, బాచుపల్లి ప్రాంతంలో ఒక ఆటో, చందానగర్‌లో మూడు, యూసుఫ్‌గూడలో ఒక బైక్ చోరీ చేశారు. యాలాల మండలంలోనూ రెండు బైకులను దొంగిలించారు. ఇందులో 9 ద్విచక్రవాహనాలను పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బోయిని ఆనంద్‌కు విక్రయించారు. మరో నాలుగు ద్విచక్రవాహనాలను యాలాల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పలి మహిపాల్‌కు విక్రయించారు. మిగతా వాటిలో బోయిని శ్రీకాంత్ వద్ద 3 బైకులు ఒక ఆటో, మ్యాతరి భాస్కర్ ఇంటి వద్ద 2 బైకులు, మ్యాతరి శివ ఇంటి వద్ద 2 బైకులు, ఒక ఆటోను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వాహనాలను కొనుగోలు చేసిన ఆనంద్, మహిపాల్‌లపై కేసు నమోదు చేశామన్నారు. దొరికారిలా.. యాలాల పీఎస్ పరిధిలో 2 ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 18న యాలాలలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను ఆపి పత్రాలు అడిగారు. వీరు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని, విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ రాంబాబు, యాలాల ఎస్ఐతో పాటు బృందాన్ని అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో అదృశ్యమైంది) -
హుండీని పెకలించి చోరీకి యత్నం
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో వారు గట్టిగా కేకలు వేయడంతో హుండీ అక్కడే వదిలి ఆటోతో సహా పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయాల్లో నగలు చోరీ శివమొగ్గ: బసవనగంగూరు గ్రామంలోని గుళ్లమ్మ, మాతంగమ్మ దేవాలయాల్లో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి దొంగలు చొరబడి దేవతామూర్తులకు అలంకరించిన రూ.లక్ష విలువైన బంగారు నగలు, హుండీలోని కానుకలను ఎత్తుకెళ్లారు. 14 బైక్‌లు స్వాధీనం యశవంతపుర: దేవస్థానాల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న మైసూరు జిల్లా శ్రీరంగపట్టణకు చెందిన శివకుమార్ అనే దొంగను చంద్రాలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.11.35 లక్షల విలువైన 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇతను జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర) -
స్నేహితులను దొంగలుగా మార్చిన జల్సాలు
సాక్షి, హైదరాబాద్: ఓన్లీ స్పోర్ట్స్ బైక్స్‌నే టార్గెట్‌గా చేసుకుని హైదరాబాద్‌తో పాటు నల్లగొండ జిల్లాలో 12 రోజుల్లో 8 ద్విచక్ర వాహనాలను కొట్టేసిన అంతర్రాష్ట్ర ముఠా విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టళ్ల వద్ద ఉన్న వాహనాలను తస్కరించాలనే ఆలోచన తన స్నేహితుడు, గ్యాంగ్ మెంబర్ విడిది చేసిన హాస్టల్ వద్ద పరిస్థితిని చూసిన తర్వాతే వచ్చిందని ప్రధాన సూత్రధారి బయటపెట్టాడు. ముగ్గురినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సింగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ► గుంటూరు జిల్లా నరసరావుపేట వాసి శివనాగ తేజ కుందన్‌బాగ్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి స్నేహితులైన గుంటూరు జిల్లా వాసులు చందు, మధు మద్యం, జల్సాల కోసం ఇతడి వద్దకు వచ్చేవాళ్లు. ► జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ఈ ముగ్గురూ కలిసి నేరాలు చేయాలని భావించారు. గత నెల మూడో వారంలో నగరంలో సమావేశమైన ఈ త్రయం వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించింది. ► తేజ ఉంటున్న హాస్టల్లో పార్కింగ్ సదుపాయం లేకపోడంతో అందులో ఉండే వాళ్లు తమ వాహనాలను రోడ్డు పక్కనే పార్క్ చేసేవాళ్లు. ఇది చూసిన ఈ త్రయం హాస్టల్స్ వద్ద బైక్స్‌నే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ► వాళ్లు వాడే స్పోర్ట్స్ బైక్స్ ఎలా తస్కరించాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. అల్యూమినియంతో తయారైన వాటి హ్యాండిల్‌ను కాలితో తేలిగ్గా విరగ్గొట్టవచ్చని, ఫ్యూజుల్లో పిన్నీసు పెట్టి వాహనం స్టార్ట్ చేయొచ్చని నేర్చుకున్నారు. ► పిడుగురాళ్ల నుంచి రాత్రి బస్సులో బయలుదేరే చందు, మధు తెల్లవారుజామున నగరానికి చేరుకునే వాళ్లు. ఆ రోజు అర్ధరాత్రి వరకు మద్యం తాగి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30– 3 గంటల మధ్య వాహనం తస్కరించే వాళ్లు. ► చందు, శివ ఓసారి మద్యం కోసం నల్లగొండ జిల్లాలో తెలంగాణ– ఏపీ సరిహద్దుల్లోని వాడపల్లికి బస్సులో వచ్చారు. తిరిగి వెళ్లడానికి అవసరమైన డబ్బునూ మద్యానికే వాడేశారు. తమ స్వస్థలాలకు చేరడానికి అక్కడో బైక్ తస్కరించారు. ►ఈ చోరులను పట్టుకోవడంతో ఆసిఫ్‌నగర్ క్రైమ్ కానిస్టేబుళ్లు శ్రీకాంత్, రామకృష్ణలు దాదాపు 100 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ పరిశీలించారు. అందులో దొరికిన క్లూతో ముగ్గురినీ సోమవారం అరెస్టు చేశారు. ►వీరిపై వాడపల్లిలోనూ ఓ కేసు నమోదై ఉంది. దీంతో ఈ త్రయం అరెస్టుపై అక్కడి పోలీసులకు ఆసిఫ్‌నగర్ అధికారులు సమాచారం ఇచ్చారు. త్వరలో వాళ్లు పీటీ వారెంట్‌పై ఈ ముగ్గురినీ అరెస్టు చేసి తరలించనున్నారు. -
నలుగురు బైక్ దొంగల అరెస్ట్
గాజువాక: నగరంతోపా టూ జిల్లాలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు అపహరిస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఒక ముఠా ను గాజువాక క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ మోడళ్లకు చెందిన 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరో 12 ద్విచక్ర వాహనాలను తమ దురలవాట్ల కోసం విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం ఏసీపీ ఫల్గుణరావు ఆ వివరాలను వెల్లడించారు. విశాఖ జిల్లా మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన మర్రా జగన్నాథరావు అలియాస్ జగదీష్ బైక్ మెకా నిజంలో నిపుణుడు. అదే గ్రామానికి చెందిన ఉరు టి వంశీ అలియాస్ పొట్టి, మైలపల్లి భరత్ అలియాస్ బాస్, తోటాడ అజయ్‌కుమార్ అలియాస్ డీఎ స్పీ సహకారంతో ద్విచక్ర వాహనాలను తస్కరించి అమ్మేస్తున్నాడు. నగరంలోని గాజువాక, పరవాడ, ఎయిర్పోర్ట్ జోన్‌తోపాటు జిల్లాలోని అనకాపల్లి, ముగనపాక, కశింకోట, చోడవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. గాజువాకలో ఇటీవల కాలంలో నాలుగు ద్విచక్ర వాహనాల అపహరణపై అందిన ఫిర్యాదులపై విచారణలో భాగంగా గాజువాక క్రైం సీఐ కె.పైడపునాయుడు ఆధ్వర్యంలో క్రైం ఏసీపీ ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం తమ విచారణను కొనసాగిస్తున్న తరుణంలో లభించిన సమాచారం మేరకు స్థానిక జగ్గు జంక్షన్ వద్ద నింది తుడు జగన్నాథరావును అదుపులోకి తీసుకొని విచా రించారు. దీంతో ఈ ముఠా విషయం వెలుగు చూ సినట్టు క్రైం ఏసీపీ తెలిపారు. ఈ విచారణ కోసం సౌత్ ఏసీపీ జె.రామ్మోహన్రావు సహకరించారని చెప్పారు. విచారణలో ప్రతిభ చూపిన క్రైం ఎస్ఐలు ఎన్.సునీల్, ఎన్.అశోక్‌చక్రవర్తి, పి.పాపారావు, హెడ్ కానిస్టేబుళ్లు కె.సూర్యనారాయణ, ఎన్.మురళి, కానిస్టేబుళ్లు రవి, లక్ష్మణ్, ఎస్.కె.వల్లి, డి.ఎన్. మూర్తి, ఎస్.వినోద్‌లను ఆయన అభినందించారు. సమావేశంలో గాజువాక సీఐ కె.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 200 బైకులు
సాక్షి, నొయిడా (ఉత్తరప్రదేశ్): దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్కా స్కెచ్‌తో వందలాదిగా బైక్‌లను ఎత్తుకుపోతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలివీ.. నొయిడాలోని సెక్టార్-62కు చెందిన శివ్‌కుమార్, దినేష్ కుమార్ గత కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు గురువారం ఉదయం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో కాపుకాసే వీరిద్దరూ బైక్‌పై వస్తున్న ఒంటరి వ్యక్తులను అడ్డగించి, తుపాకీ చూపి బెదిరిస్తారు. అనంతరం ఆ బైక్‌పై లాక్కుని తమ డెన్‌కు తీసుకుపోయి నకిలీ పత్రాలు తయారుచేసి, అమ్మేసుకుంటారు. ఈ విధంగా ఇప్పటి వరకు 200పైగానే మోటారుసైకిళ్లను చోరీచేసినట్లు అంగీకరించారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఘజియాబాద్, నొయిడా, బులంద్‌షహర్ ప్రాంతాల్లో వీరు దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు వారి నివాసంలో ఐదు చోరీ బైక్‌లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘరారా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. -
కాబోయే ఇంజనీర్లు దోపిడీ దొంగలయ్యారు
కాకినాడ: చెడు అలవాట్లకు బానిసలై దోపిడీ దొంగలుగా మారిన 8 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు పోలీసులకు చిక్కారు. వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 13 బైక్‌లు, 28 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన బైకులపై తిరుగుతుండగా ఇద్దరు పోలీసులకు దొరికారు. వీరిని విచారించగా డొంకంతా కదిలింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నవృద్ధులను లక్ష్యంగా వీరి దోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గత నెల 13న తేదీన ఓ నర్సును హత్య చేసి లక్ష రూపాయలు చోరీ చేసినట్టు చెప్పారు. విశాఖపట్నంలో దంపతులను బంధించి దోపిడీ చేసిన కేసులోనూ వీరు నిందితులని తెలిపారు. అరెస్టైన 8 మంది పెద్దాపురం, విశాఖపట్నం, కాకికాడ సిటీ, కాకినాడ రూరల్ ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. -
కాబోయే ఇంజనీర్లు దోపిడీ దొంగలయ్యారు