ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 200 బైకులు | bikes robbery gang arrested in noida | Sakshi
Sakshi News home page

ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 200 బైకులు

Published Thu, Oct 26 2017 8:42 PM | Last Updated on Thu, Oct 26 2017 8:47 PM

bikes robbery gang arrested in noida

సాక్షి, నొయిడా (ఉత్తరప్రదేశ్‌): దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్కా స్కెచ్‌తో వందలాదిగా బైక్‌లను ఎత్తుకుపోతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలివీ.. నొయిడాలోని సెక్టార్‌-62కు చెందిన శివ్‌కుమార్‌, దినేష్‌ కుమార్‌ గత కొంతకాలంగా బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు గురువారం ఉదయం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో కాపుకాసే వీరిద్దరూ బైక్‌పై వస్తున్న ఒంటరి వ్యక్తులను అడ్డగించి, తుపాకీ చూపి బెదిరిస్తారు.

అనంతరం ఆ బైక్‌పై లాక్కుని తమ డెన్‌కు తీసుకుపోయి నకిలీ పత్రాలు తయారుచేసి, అమ్మేసుకుంటారు. ఈ విధంగా ఇప్పటి వరకు 200పైగానే మోటారుసైకిళ్లను చోరీచేసినట్లు అంగీకరించారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఘజియాబాద్‌, నొయిడా, బులంద్‌షహర్‌ ప్రాంతాల్లో వీరు దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు వారి నివాసంలో ఐదు చోరీ బైక్‌లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘరారా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement