చెడు అలవాట్లకు బానిసలై దోపిడీ దొంగలుగా మారిన 8 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు పోలీసులకు చిక్కారు.
కాకినాడ: చెడు అలవాట్లకు బానిసలై దోపిడీ దొంగలుగా మారిన 8 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు పోలీసులకు చిక్కారు. వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 13 బైక్‌లు, 28 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన బైకులపై తిరుగుతుండగా ఇద్దరు పోలీసులకు దొరికారు. వీరిని విచారించగా డొంకంతా కదిలింది.
ఇంట్లో ఒంటరిగా ఉన్నవృద్ధులను లక్ష్యంగా వీరి దోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గత నెల 13న తేదీన ఓ నర్సును హత్య చేసి లక్ష రూపాయలు చోరీ చేసినట్టు చెప్పారు. విశాఖపట్నంలో దంపతులను బంధించి దోపిడీ చేసిన కేసులోనూ వీరు నిందితులని తెలిపారు. అరెస్టైన 8 మంది పెద్దాపురం, విశాఖపట్నం, కాకికాడ సిటీ, కాకినాడ రూరల్ ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు.