అరెస్టయిన వేటగాళ్లు, స్వాధీనం చేసుకున్న అధునాతన ఆయుధాలు
సాక్షి, నిజామాబాద్ : విదేశీ టెలిస్కోపిక్ రైఫిళ్లు.. రాత్రివేళల్లో సైతం స్పష్టంగా చూడగలిగే బైనాక్యులర్లు.. శక్తిమంతమైన సెర్చ్‌లైట్లు.. ఇవి వారి అధునాతన వేట పరికరాలు.. నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణులను వేటాడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా ఎట్టకేలకు చిక్కింది. జకోరాలో ఓ రైస్‌మిల్లును నడుపుతున్న హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు చెందిన లుక్మాన్ అఫ్రిది (47), ఇమ్రాన్ అఫాండి (50), ఎండీ ఫారుఖ్‌ఖాన్ (23), షేక్‌రాజ్ అహ్మద్ (43), ఎండీ జమీలుద్దీన్ (61)లను అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం తెలిపారు. వీరిపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గుడిమల్కాపూర్‌లో లుక్మాన్ అఫ్రిది ఇంట్లో కూడా వన్యప్రాణుల మాంసం లభించినట్లు పేర్కొన్నారు. చదవండి: నటి చిత్ర మరణంపై అనుమానాలు
పక్కా సమాచారంతో..
ఐదుగురు సభ్యులతో కూడిన ఈ ముఠా శుక్రవారం రాత్రే నిజామాబాద్ జిల్లా హున్సా, మందర్న ప్రాంతాల్లో వన్యప్రాణుల వేటకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌వో నేతృత్వంలోని అధికారుల బృందం ఆదివారం వర్ని మండలంలో తనిఖీలు నిర్వహించింది. ఇందులో భాగంగా జకోరా వద్ద ఉన్న బిన్నీ రైస్‌మిల్లును తనిఖీ చేసి ఆ ముఠాను అదుపులోకి తీసుకుంది. అక్కడ సెర్చ్ చేయగా రెండు టెలిస్కోపిక్ సైలెన్సర్ రైఫిళ్లు, మందుగుండు సామగ్రి, నైట్‌విజన్ బైనాక్యులర్, కత్తులు, సెర్చ్‌లైట్లతో పాటు కుందేలు మాంసం లభించాయి. అలాగే ఆ ముఠా తీసుకొచ్చిన ఓ టాటా సఫారీ వాహనాన్ని కూడా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: నీళ్లు తాగేందుకు వస్తే.. కాళ్లు నరికారు
అలవాటుగా వేట..
అటవీశాఖ అధికారులు అరెస్టు చేసిన ముఠాకు నేతృత్వం వహిస్తున్న లుక్మాన్ అఫ్రిది తరచూ వన్యప్రాణులను వేటాడుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. అఫ్రిది తన స్నేహితులతో కలసి వర్ని అటవీ ప్రాంతంలో వేటకు వచ్చినట్లు సమాచారం రావడంతో అప్రమత్తమైన అటవీశాఖ విజిలెన్స్ బృందం వారి కదలికలపై నిఘా పెట్టి ఆట కట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment