hunters
-
బెబ్బులి బెదురుతోంది!
దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన పెద్దపులుల అభయారణ్యం శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్). అలాంటి చోటే వాటికి పెను ముప్పు ఎదురవుతోంది. పెరుగుతున్న పులుల సంతతికి తగ్గట్టు ఆవాసం, ఆహార లభ్యత దొరకడం లేదు. వీటి ప్రధాన ఆహార జంతువులైన దుప్పులు, కణుతుల సంఖ్య పెరగకపోగా రోజురోజుకు వాటి సంఖ్యలో తరుగుదల కనిపిస్తోంది. ఇందుకు అటవీ పరిధిలో వేటగాళ్లు మాటు వేయడం.. వారిని కట్టడి చేసే స్థాయిలో సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఎంతో భద్రమైనదిగా భావించే నల్లమలలోనే వాటి సంరక్షణ గాలిలో దీపంలా మారింది.ఆత్మకూరు రూరల్: అటవీ ఆవరణ వ్యవస్థలో అగ్రభాగాన ఉండే పెద్దపులులు అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం– నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో 87 ఉన్నాయి. అయితే, పులులు పెరిగే కొద్ది వాటి ఆవాస ప్రాంతం, ఆహార లభ్యత పెరగడం లేదు. ఇందుకు తగినన్ని గడ్డి మైదానాలు అభివృద్ధి కాలేదు. పులుల ప్రధాన ఆహార జంతువుల సంఖ్య పెరగడమూ లేదు. నల్లమలలోని ఆత్మకూరు, నంద్యాల , గిద్దలూరు,మార్కాపురం డివిజన్లలో వేటగాళ్ల కదలికలు రోజురోజుకు పెరుగుతుండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన కొందరు వేటగాళ్లు గడ్డితినే జంతువులు సంచరించే నీటివనరుల వద్ద, జేడ (సాల్ట్ లిక్)మైదానాల వద్ద ఉచ్చులు వేసి మాటు గాస్తున్నారు. ఆ ఉచ్చులకు చిక్కిన వన్యప్రాణులను మాంసంగా మార్చి పట్టణాల్లో పెద్ద మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రమాదకర స్థితిలో పులి ఎంతో భద్రమైనదని భావించే ఎన్ఎస్టీఆర్ లో ప్రాణాంతక వైరస్‌లా వేటగాళ్ల చొరబాటు పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది విస్పష్టం.ఎన్ఎస్టీఆర్ సర్కిల్లో మొత్తం నాలుగు డివిజన్లలో 750 (ఇది పాత లెక్క)మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 250 మందే ఉన్నారు. ఈ అరకొర సిబ్బందితో వేటగాళ్లను నియంత్రించ లేని పరిస్థితి. ఫలితంగా పులి సంరక్షణ ప్రమాదకర స్థితిలో పడింది. ఫుట్ పెట్రోలింగ్‌కు అదే సమస్య అటవీ సంరక్షణలో రోజువారి ఫుట్ పెట్రోలింగ్ ( కాలి నడకతో ప్రదేశాన్ని చుట్టి రావడం)కు కూడా సిబ్బంది కొరతే ప్రధాన అడ్డంకిగా ఉంది. సుమారు 3,750 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఫుట్ పెట్రోలింగ్‌కు ఉన్న వనరులు కేవలం బేస్ క్యాంప్ సిబ్బంది మాత్రమే. పులి సంరక్షణలో మేటి అని చెప్పుకునే ఆత్మకూరు అటవీ డివిజన్లో ఉన్న 23 బేస్ క్యాంపుల్లో సుమారు వంద మంది ప్రొటెక్షన్ వాచర్లు పని చేస్తుంటారు.అయితే, వీరిలో కొందరు వీక్లీ ఆఫ్‌లో ఉంటారు. మిగతా వారిని ప్రత్యేకించి ఫుట్ పట్రోలింగ్కు కేటాయించలేని పరిస్థితి. ప్రొటెక్షన్వాచర్లను పర్యవేక్షించేందుకు ఒక్కో బేస్ క్యాంపులో ఒక రెగ్యులర్ అటవీ సిబ్బంది ఉండాలి. ఈ రూల్ పుస్తకాలకు మాత్రమే పరిమితమైంది. వేధిస్తోన్న ఆహార కొరత .. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఆహార లభ్యతను బట్టి ఒక్కో పెద్దపులి తన అధీన ప్రాంతం (టెరటరీ)గా సుమారు 40 చ.కిమీ పరిధిని ఉంచుకుంటోంది. పులి సాధారణంగా ఆరు సార్లు దాడులు చేస్తే ఒకసారి వేట సాఫల్యమవుతుంది. ఇందుకోసం అది ఆరు రోజులు కూడా ఆకలితో నకనకలాడాల్సి ఉంటుంది. కనీసం వారానికో జంతువును వేటాడినా ప్రస్తుతం నల్లమలలో ఉన్న పులులకు వారానికి సుమారు 90 ఆహార జంతువులు అవసరమవుతాయి. నెలకు 360, సంవత్సరానికి దరిదాపుగా నాలుగు వేలకు పైగా జంతువులు అందుబాటులో ఉండాలి. ఇది కనిష్ట అవసర స్థితి. ఈ నిష్పత్తిలో ఆహార లభ్యత లేక పోతే పులుల ఆధీన ప్రాంతం క్రమేపీ పెరుగుతుంది. దీంతో పులుల మధ్య ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఈ పోరులో ఎన్నో పులులు మరణించే అవకాశం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పులి ఆహారం వేటగాళ్ల చౌర్యానికి గురైతే జరిగే నష్టం లెక్కకట్టలేనిది. అడపాదడపా కేసులు... శిక్షలు శూన్యం? అటవీ అధికారులు అడపాదడపా ఎవరో ఒకరిని వన్యప్రాణి వేట కేసుల్లో పట్టుకుని కేసులు పెడుతున్నారు. అయితే, వారిలో ఏ ఒక్కరికీ కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం కూడా సిబ్బంది కొరతే. కనీసం పీఓఆర్ను కాని చార్జ్ షీట్‌ను కాని ముద్దాయిలకు శిక్ష పడేలా రాసుకోలేని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరు రేంజ్ లోని గుమ్మడాపురం కు చెందిన కొందరు దుప్పి తలతో అధికారులకు చిక్కారు.ఇదే రేంజ్ లోని శివపురం సమీపంలో ఏప్రిల్ నెలలో ఇద్దరు ఎలుగు బంటి మాంసంతో చిక్కారు. ముసలమడుగు సమీపంలో అక్టోబర్ నెలలో కొందరు అడవి పంది మాంసంతో పట్టుబడ్డారు. వీరందరిపై పీఓఆర్ నమోదు అయి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే వారిపై సరైన సెక్షన్లు పెట్టకపోవడంతో నిందితులు 24 గంటల్లో బెయిల్‌పై తిరిగి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఉచ్చులతో పులికీ ప్రమాదంవేటగాళ్లు పులి ఆహార జంతువులైన జింకల కోసం నీటి వనరుల వద్ద ఉచ్చులు పన్ని ఉంచు తారు. అయితే ఈ ఉచ్చులలో ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు పెద్ద పులులు కూడా చిక్కు కుని మరణిస్తుంటాయి. గతంలో సిద్దాపురం చెరువులో పన్నిన ఉచ్చులకు ఓ పెద్దపులి చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా రెండేళ్ల కిందట ఆత్మకూరు డివిజన్ లోని నల్లకాల్వ సెక్షన్ లో ఓ పులి కళేబరం గాలేరు ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. దాని మెడలో ఒక ఉచ్చు బిగిసి ఉంది. ఇలా వేటగాళ్ల వల్ల పులుల ఆహార జంతువులు తగ్గిపోవడంతో పాటు కొన్నిసార్లు అవి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. అదే పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే వేటగాళ్లను నియంత్రిచవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా దీనిపై ఎన్ఎస్టీఆర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వివరణ కోరగా ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని, కింది స్థాయిలో రిక్రూట్మెంట్ జరగడం లేదని, తమ వరకు పులుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఎవరీ వేటగాళ్లు... నల్లమల పులి ఆహారానికి పీడగా మారిన వేటగాళ్ల గురించి ఆరా తీస్తే కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పడుతున్నాయి. ప్రధానంగా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వేటగాళ్ల కదలికలను గమనిస్తే అవి ఎక్కువగా మండలంలోని వెంకటాపురం, నల్లకాల్వ, కొత్తరామాపురం,సిద్దాపురం పరిధిల్లోనే కనిపిస్తున్నాయి. మండలంలోని మాజీ నేరస్తుల ఆవాస గ్రామానికి చెందిన కొందరు దాదాపు ప్రతి గ్రామంలోనూ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ అక్రమ మద్యం దుకాణాలు నడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే లుంపెన్ తరగతులకు చెందిన యువకులను తమ వెంట తిప్పుతూ ఇటు నాటుసారా అక్రమ రవాణాకు, అటు వన్యప్రాణుల వేటకు వినియోగించుకుంటున్నారు. -
41 ఏళ్ల క్రితం చనిపోతే..ఇప్పుడామె..!
నేరాలు ఎంత అనాలోచితంగా, కుట్రపూరితంగా చూస్తుండగానే క్షణాల్లో జరిగిపోతాయి. ఆ ఘటనలు మిగిల్చే నష్టం, బాధ అంతా ఇంతా కాదు. ఆఖరికి వాటి ఇన్విస్టిగేషన్ కూడా ఓ పట్టాన వీడని మిస్టరీలా ఉండిపోతాయి. అంత తేలిగ్గా చిక్కుముడి వీడదు. ఒక్కోసారి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. బాధితులకు తీరని మనో వ్యధ జీవితాంతం ఉంటుంది. ఆ వ్యక్తి తాలుకా వివరాలు బంధువులకు చేరక ఒకవైపు, ఆ కేసులోని చిక్కులు వీడక అధికారులు మరోవైపు ఇలా ఇరువురు తెలియని నరకం చూస్తారు. అలాంటి ఒక గాథ ఇది. 41 ఏళ్ల క్రితం నాటి మహిళ అదృశ్యం కేసు. ఆమె ఏమైంది? ఎలా చనిపోయింది? అనేది తెలియని ఓ అంతుచిక్కని మిస్టరీ. కానీ ఇప్పుడు ఆమె ఎవరనేది ఇప్పటికీ గుర్తించి ఆ బాధితురాలి కూతురికి తెలియజేస్తే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది మాటలకందని భావోద్వేగమే కదా!. ఒరెగాన్లోని కొన్నీ లోరైన్ క్రిస్టెన్సన్ అనే మహిళ కనిపించకుండా పోయింది. ఆమె చివరిసారిగా 1982లో టేనస్సీలోని నాష్‌విల్లేలో కనిపించింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె బంధువులు మిస్సింగ్ కేసుగా ఫైల్ చేశారు. కానీ ఆమె ఆచూకీ ఎక్కడన్నది కానరాకుండా పోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఆమె ఇండియానాలోని ఓ గ్రామంలో చనిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ ఆమెకు సంబంధించిన వస్తువులు హైహిల్స్, బంగారు ఉంగరం తదితర వస్తువులను కొన్నీగా స్వాధీనం చేస్తుకున్నారు విచారణలో ఆమె వేటగాళ్ల చేతిలో శవమైనట్లు విచారణలో తేలింది. ఆమె మృతదేహానికి సంబంధించిన అవశేషాలు అదృశ్యమైన కొన్నీ లోరైన్ అవశేషాలతో సరిపోలాయి. దీంతో ఆమె గురించి వారి బంధువులకు తెలయజేయాలనే ఉద్దేశ్యంతో కరోనర్ కార్యాలయంలో ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ విభాగంలో స్టోర్ చేశారు పోలీసులు. ఆమె తుపాకీ గాయం కారణంగా మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. అయితే కొన్నీ లోరైన్ హత్య ఎలా జరిగిందనేది తెలియరాలేదు పోలీసులకు. అయితే విచారణలో వాకింగ్ కోసం బయటకు వచ్చిందని, అప్పుడామె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. అలాగే ఆమెకు ఓ ఏడాది కూతురు కూడా ఉందని, ఆమెను తన తోపాటు బయటకు తీసుకువెళ్ల లేదని తేలింది. ఇక ఇండియానా స్టేట్ పోలీస్ ఫోరెన్సిక్ లాబరేటరీ ఆమెకు సంబంధించిన అవశేషాలను, డీఎనే రిపోర్ట్‌ని వెబ్సెట్లో అందుబాటులో ఉంచడమే గాక ఆమె దుస్తులను, తాలుక వస్తువులను భద్రపరిచారు. ఆమె అవశేషాలు బంధువులకు చేర్చేలా గుర్తింపు చర్యలు ముమ్మరంగా సాగించింది. ఎట్టకేలకు ఆమె అవశేషాలు ఘటన జరిగిన 41 ఏళ్లకు ఆమె కూతురు చెంతకు చేరాయి. ఆమె తాలుకు బంగారపు ఉంగరం, వజ్రాలు అన్నింటిని అధికారలు ఆమెకు అందజేశారు. తన తల్లి ఏమైందీ? ఎక్కడుంది? అనే సమాధానంలేని వేల ప్రశ్నకు ఆ కూతురికి ఇన్నేళ్లకు సమాధానాలు దొరికాయి. తల్లి గురించి తెలుసుకోగలిగానని ఆనందపడాలో ఎలా అనాథలా చనిపోయిందని తెలుసుకుని బాధపడాలో తెలియని ఉద్విగ్న స్థితితో ఉక్కిరిబిక్కిరి అయ్యింది కొన్నీ లోరైన్ కూతురు. పైగా తన తల్లి ఆచూకి కనీసం ఇప్పటికైనా తనకు తెలిసేలే కృషి చేసినందుకు పోలీసులుకు వేవేల కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ అవశేషాలను ఖననం చేసి..తన తల్లికి భారంతో కూడిన హృదయంతో ఘనంగా వీడ్కోలు పలికింది ఆ కూతురు. (చదవండి: వింత ఘటన: ఓ మహిళ టూత్‌బ్రెష్‌ని అనుకోకుండా మింగేసింది! అంతే..) -
వేటగాళ్ల నయా ట్రెండ్
చంద్రగిరి (తిరుపతి జిల్లా): వన్యప్రాణుల వేటలో వేటగాళ్లు కొత్త రూటులు వెతుకుతున్నారు. గతంలో వన్యప్రాణులను వేటాడేందుకు తుపాకులు, ఉచ్చులను వాడేవారు. అయితే ఇప్పుడు వేట కుక్కలను ఇందుకు వినియోగిస్తున్నారు. వీటితో వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఇందుకోసం వేట కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వన్యప్రాణులను వేటాడాక వాటి మాంసాన్ని భారీ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణమవుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వేటగాళ్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు రెండు వేట కుక్కలను అదుపులోకి తీసుకుని పనపాకం అటవీ కార్యాలయానికి తరలించారు. పనపాకం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేట.. గత కొంతకాలంగా పనపాకం పరిసరాల్లోని ఈటలదొడ్డి, బొప్పిగుట్ట, వెదురుల కొండ, కందరవారి గుట్ట, మొరవగట్టు, నచ్చు బండ, గుడిసె గుట్ట, దొంగలబండ, మాలవాడి చెరువు ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి వచ్చిన మంజు, సాయిలకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. వీరు ఆదివారం రాత్రి వేటకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో సోమవారం తిరుగు ప్రయాణంలో అటవీ అధికారులకు పట్టుబడ్డారు. వేటగాళ్ల సెల్ఫోన్లను పరిశీలించిన అటవీ అధికారులు ఆశ్చర్యపోయారు. వాటిలో వేట కుక్కలకు శిక్షణ ఇచ్చే వీడియోలు, కుక్కలు.. అడవి పందులను వేటాడే వీడియోలు ఉన్నాయి. గతంలోనూ పనపాకం పరిసర ప్రాంతాల్లో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలవారు వేట సాగించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడితే ఎంతటివారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పనపాకం అటవీ చెక్‌పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్న కుక్కలు పెంపుడు జంతువులే. వేటకు శిక్షణ ఇచ్చేందుకు వీటిని తీసుకొ చ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పూచీకత్తుపై విడుదల చేశాం. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం. స్వా«దీనం చేసుకున్న శునకాలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టాం. – మాధవీలత, ఎఫ్ఆర్వో, పనపాకం రేంజ్ -
రాకాసి మొసలి
ఈ రాకాసి మొసలి అమెరికాలోని మిసిసిపీ రాష్టంలో వేటగాళ్ల బృందానికి దొరికింది. యజూ నదిలో ఇటీవల వేటకు వెళ్లిన వేటగాళ్ల బృందానికి ఈ అతిభారీ మొసలి చిక్కింది. దీని పొడవు 14.3 అడుగులు, బరువు 364.007 కిలోలు. మిసిసిపీలో ఇదివరకు దొరికిన భారీ మొసలి కంటే ఇది పొడవులోను, బరువులోను ఎక్కువగా ఉండటంతో ఈ మొసలి కొత్త రికార్డును నెలకొల్పింది. మిసిసిపీలోనే 2017లో ఒక భారీ మొసలి దొరికింది. దాని పొడవు 14.0 అడుగులు, బరువు 347.67 కిలోలు. యజూ నది ఒడ్డుకు చేరువలో ఉండే జనాలు ఇక్కడకు తమ పెంపుడు కుక్కలను విహారానికి తీసుకొస్తుంటారు. కొంతకాలంగా ఈ మొసలి ఒడ్డుకు వచ్చి తిరుగుతూ, దొరికిన కుక్కనల్లా పలారం చేసేస్తుండటంతో దీనికోసం వేటగాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేటగాళ్లు పట్టి తెచ్చిన ఈ మొసలి పొడవు, బరువు వివరాలను మిసిసిపీ వన్యప్రాణులు, జలచరాలు, ఉద్యానవనాల సంరక్షణ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట దొరికిన భారీ మొసలి రికార్డును ఇది అధిగమించిందని వారు ప్రకటించారు. -
వజ్రాల వేట.. కొందరికే ‘అదృష్టం’.. ఇక్కడే ఎందుకంటే?
తొలకరి పలకరించగానే వారిలో ఆశలు చిగురిస్తాయి. సద్ది సిద్ధం చేసుకుని పొలాల బాట పడతారు. నేలలో అణువణువూ శోధిస్తారు. ప్రతి రాయి కదుపుతారు. మెరిసే రాళ్లను సేకరిస్తారు. వాటిని తీసుకెళ్లి ఏజెంట్లకు చూపుతారు. అది వజ్రమైతే వారి పంట పండినట్లే! లేదంటే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. ఇలా ఏటా వజ్రాల వేట నిరాటంకంగా సాగుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వేటలో కొందరు లక్షాధికారులు కాగా... మరికొందరు అన్వేషకులుగానే మిగిలిపోయారు. అనంతపురం డెస్క్: వజ్రాల పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చే ఊరు వజ్రకరూరు. ఇక్కడ దొరుకుతున్న వజ్రాల కారణంగానే కవులూరు గ్రామం కాస్తా కాలక్రమేణా కరూరుగా.. వజ్రకరూరుగా రూపాంతరం చెందింది. ఇక్కడ వజ్రాలు ఉన్నట్లు బ్రిటీష్ హయాంలోనే గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేసి అన్వేషణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వపరంగా వజ్రాన్వేషణ అంత లాభదాయకంగా లేదు కానీ.. సామాన్యుల అన్వేషణ మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలు మొదలు కాగానే వజ్రకరూరు ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. వజ్రకరూరు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఎర్రనేలలు జనంతో రద్దీగా కనిపిస్తాయి. ఒక్కో పొలంలో 30–40 మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు. బలమైన వర్షాలు పడినప్పుడు ఈ సంఖ్య వందకు పైగానే ఉంటుంది. వాననీటి ప్రవాహం వల్ల భూమిలోని వజ్రాలు పైకి తేలి.. దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువమంది ఆ దిశగా అన్వేషణ సాగిస్తుంటారు. స్థానికులే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ఇక్కడికి వచ్చి వజ్రాన్వేషణలో నిమగ్నమవుతున్నారు. ఇతర ప్రాంతవాసుల రాక 15 ఏళ్లుగా ఎక్కువైంది. కొందరు రోజుల తరబడి స్థానికంగానే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలు అత్యంత విలువైనవిగా చెబుతుంటారు. రూ.లక్ష మొదలుకుని రూ.50 లక్షలకు పైగా విలువైన వజ్రాలు ఇక్కడ లభిస్తున్నట్లు సమాచారం. వజ్రకరూరు, రాగులపాడు, కమలపాడు, బోడిసానిపల్లి, పొట్టిపాడు గ్రామాల పరిధిలోని ఎర్ర నేలల్లో అన్వేíÙంచే వారికి ఏటా 15 నుంచి 20 వజ్రాలు దొరుకుతున్నట్లు అంచనా. వీటిని గుత్తి, కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి ధర నిర్ణయిస్తున్నారు. విక్రయదారులకు డబ్బుతో పాటు బంగారం ముట్టజెబుతున్నారు. విక్రయదారులకు ధర నచ్చని పక్షంలో టెండర్ పద్ధతిలో వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. వజ్రాన్వేషణ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తమ మనుషుల (ఏజెంట్లు)ను పెట్టి వజ్రాలు దొరికిన వారి సమాచారం వ్యాపారులు సేకరించుకుంటున్నారు. వజ్రకరూరుతో పాటు ఈ ప్రాంతానికి 50 కి.మీ.లోపే దూరం ఉన్న కర్నూలు జిల్లా జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి ప్రాంతాల్లోనూ వజ్రాలు లభిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభించే కింబర్లైట్ పైపులు భూఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయని గనులు, భూగర్భశాఖ అధికారులు చెబుతున్నారు. దానికితోడు ఈ ప్రాంతంలోని భూమి గడిచిన ఐదువేల సంవత్సరాల్లో దాదాపు అర కిలోమీటరు మేర కోతకు గురైందని, అందుకే ఇక్కడ తరచూ వజ్రాలు దొరుకుతున్నాయని అంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాన్వేషణకు 1934 సంవత్సరంలోనే బ్రిటీష్ వారు ‘ది న్యూ వజ్రకరూరు డైమండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్’ స్థాపించారు. వజ్రాలు లభించే పొలాలను సేకరించారు. ఈ కంపెనీని స్వాతంత్య్రం వచ్చాక 1970లో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) పరిధిలోకి తెచ్చారు. 1974 నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో వజ్రాన్వేషణ చేపడుతున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వజ్రకరూరులోని వజ్రాల ప్రక్రమణ కేంద్రం (డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్) నడుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ కార్యకలాపాలు చురుగ్గా జరిగేవి. వివిధ కారణాలతో ప్రస్తుతం మందగించాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ ప్రాంతంలోని వజ్ర నిక్షేపాలపై దృష్టి సారించినప్పటికీ మైనింగ్‌కు మాత్రం ముందుకు రాలేదు. -
వేటగాళ్ల ఉచ్చుకు యువకుడు బలి
తిర్యాణి(లింగాపూర్): కొమురంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం దంపూర్ గ్రామంలో అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు గురువారం రాత్రి ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిర్యాణి మండలం దంతన్‌పెల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు భీమన్న దేవుని గంగస్నానం కోసం గురువారం దంపూర్ గ్రామం మీదుగా కాలినడకన జన్నారం వైపు వెళ్లారు. గంగస్నానం ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో రాత్రివేళ దంపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి దంతన్‌పల్లి గ్రామానికి చెందిన ఆత్రం భీమ్రావు(21) అక్కడికక్కడే మృతి చెందాడు. భీమ్రావుతోపాటు ఉన్న ఆత్రం పావుగా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడికి లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఆత్రం భీము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపార -
20 పులులను చంపిన చిట్టిరాజు.. అసలు ఆ కథేమిటంటే..?
ప్రత్తిపాడు రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్తిపాడు మండలంలోని పులి సంచారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటువంటి ఈ ప్రాంతంలో స్వతంత్రానికి పూర్వం పులులు విస్తారంగా సంచరించేవన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పటి తరం వారికి మాత్రం పులుల సంచారం, స్థానిక వేటగాళ్ల ధైర్య సాహసాల గురించి బాగా తెలుసు. తమ సైనికులకు రక్షణ కల్పించాలంటూ అప్పటి వేటగాళ్లను బ్రిటిష్ ప్రభుత్వం అర్థించింది. ప్రత్తిపాడు పరిసరాలు, నాగులకొండ ప్రాంతాల్లో పులులు, చిరుత పులులు విస్తారంగా సంచరించేవట. అనుకోని అతిథిలా ప్రత్తిపాడు ప్రాంతానికి వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ తూర్పుకనుమల్లో కనిపించడం ఇదే ప్రథమం. అయితే ఈ ప్రాంతంలో పులులు లేవా, ఉంటే ఏమయ్యాయి అన్నదానిపై సమాచారం సేకరిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 20 పులులను సంహరించిన చిట్టిరాజు జగ్గంపేట మండలం రాయవరానికి చెందిన చిట్టిరాజు ప్రపంచంలోనే ప్రముఖ వేటగాడు జిమ్ కార్బెట్ సమకాలికుడు. 1918 – 1926 మధ్య నరమాంస భక్షకిగా హడలెత్తించిన రుద్ర ప్రయోగ చిరుతపులిని చంపడానికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న వేటగాళ్ల కోసం గాలించింది. అందులో జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన చిట్టిరాజు ఒకరు. సరిగ్గా అదే సమయంలో ప్రత్తిపాడు అటవీ ప్రాంతంలో గుర్రాల మీద వెళ్లే బ్రిటిష్ సైనికులను పులులు చంపి తినేస్తుండటంతో బ్రిటిష్ అధికారులు కొట్టాం సంస్థానం, తుని రాజా వారికి పులులను సంహరించే బాధ్యతలను అప్పగించారు. రామచంద్రరాజు వేటాడిన బెంగాల్ టైగర్ ఆ పనిని తుని రాజా వారు చిట్టిరాజుకి అప్పగించారు. మనం చేయాల్సిన పనిని పులులు చేస్తున్నాయి. అటువంటి పులులను తాను సంహరించలేనని దేశభక్తి భావంతో ఆయన నిరాకరించారట. అయితే బ్రిటిష్ సైనికులతో పాటు స్థానిక ప్రజలు పులి దాడిలో మృతి చెందటంతో రాజాజ్ఞ ప్రకారం పులులను సంహరించే బాధ్యతను స్వీకరించారు. పులిని సంహరించిన తర్వాత ఏ తెల్లదొర తనతో కరచాలనం చేయరాదని షరతుతో పులిని వేటాడినట్టు తెలిసింది. ఆయన జీవిత కాలంలో మనుషులకు హాని కలిగించే 20 పులులను సంహరించినట్లు భోగట్టా. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు రుద్రయాగ చిరుత పులి సంహారానికి రమ్మని చిట్టిరాజుకు కూడా వర్తమానం పంపారట. జిమ్ కార్బెట్ అప్పటికే అక్కడ పులి వేటలోకి దిగిపోయారు. ఐదు వందల చదరపు మైళ్లు తిరిగి, రెండున్నర నెలలు పాటు మాటు వేశారు. అధికారిక లెక్కల ప్రకారం రుద్రప్రయోగ పులి 125 మందిని చంపిందని చెబుతున్నా అనధికారికంగా రెండు వేలకు పైనే చనిపోయి ఉంటారు. రాజుబాబు వేటాడిన చిరుత ఆంధ్ర జిమ్ కార్బెట్.. రాజబాబు చిట్టిరాజు తర్వాత రామచంద్రపురానికి చెందిన శ్రీరాజా కాకర్లపూడి రామచంద్రరాజు బహుదూర్ (రాజబాబు)ను ప్రధానంగా చెబుతారు. ఈయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో కొందరికి వేటాడ్డానికి అనుమతులు ఉండేవి. ఆంధ్ర జిమ్ కార్బెట్గా చెప్పుకునే రామచంద్రపురం రాజబాబు వేటాడిన వాటిలో 5 బెంగాల్ టైగర్లు ఉండగా 20 వరకూ చిరుత పులులు ఉన్నాయట. ఇప్పటికీ రామచంద్రపురంలో రాజబాబు వధించిన పులుల కళేబరాలు గోడలకు అలంకరించి ఉన్నాయి. చిరుత నోటిలో చేయి పెట్టిన కృష్ణమూర్తిరాజు జగ్గంపేట మండలం మల్లిసాలకి చెందిన వత్సవాయి కృష్ణమూర్తిరాజు పదికి పైగా చిరుత పులులను వేటాడినట్టు చెబుతారు. ఈయన చిట్టిబాబురాజు మనువడు. చిరుతపులి వేటలో కృష్ణమూర్తిరాజు ధైర్యసాహసాలు, శక్తి యుక్తులను ప్రదర్శించి చిరుత నోటిలోనే తన చేతిని నెట్టి త్రుటిలో ప్రాణాలను కాపాడుకున్నారట. అయితే అప్పటికే పులికి కృష్ణమూర్తిరాజు తూటా దెబ్బ తగిలి ఉంది. దెబ్బ తిన్న పులి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం చిన్నవిషయం కాదు. చిరుత నోటిలో పెట్టిన చేతిని చిరుత చప్పరించేసిందట. అనంతరం వేటలో ఉండగా పరుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. పులికి ఎదురెళ్లిన సూరిబాబురాజు ఇంకొకరు రాజోలు మండలం చింతపల్లికి చెందిన అల్లూరి సూరిబాబురాజు దేశం నలుమూలలా తెలిసిన వేటగాడు. ఈయన చిరుత పులులతో పాటు, బెంగాల్ టైగర్స్‌ను కూడా వేటాడారు. మారేడుమిల్లి అడవిలో రోడ్డు మీద ఎదురుపడ్డ పులికి ఎదురెళ్లిన వేటగాడు సూరిబాబుని పాతతరం వారు చెబుతుంటారు. సూరిబాబు ఇటీవల కాకినాడలో మృతి చెందారు. -
దాక్కో పులి..లేదంటే ఉచ్చుకు బలి
ఆళ్లగడ్డ: నల్లమల అడవుల్లో వన్యమృగ వేటగాళ్ల ముఠా పంజా విసురుతోంది. చాకచక్యంగా పెద్ద పులులను హతమారుస్తోంది. అటవీ శాఖ యంత్రాంగం మాత్రం తనకేమీ తెలియనట్లు నిద్ర నటిస్తోంది. ఛత్తీస్గడ్, బిహార్ ప్రాంతాలకు చెందిన వారు యథేచ్ఛగా వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శిరివెళ్ల మండలం మహదేవపురం నుంచి వైఎస్సార్ జిల్లా సరిహద్దు చాగలమర్రి వరకు నల్లమల అడవులు ఉన్నాయి. చిరుతలు, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు, కుందేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, కొండ మేకలతో పాటు నెమళ్లు, కొండకోళ్లు, వివిధ రకాల పక్షులు ఉన్నాయి. అభయారణ్యంలో పులుల వృద్ధి పెరిగి, ఈ ప్రాంతంలో వీటి సంచారం మొదలైంది. వీటిపై వేటగాళ్ల కన్ను పడింది. రెండేళ్లలో నాలుగు పులులు మృతి చెందగా.. ఇంకా వెలుగులోకి రానికి కొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు సమీపంలోని అడవిలో కొందరు వేటగాళ్లు పెద్ద పులిని ఉచ్చులో బిగించి చంపేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వేటగాళ్లు నేరం నుంచి తప్పించుకునేందుకు పెద్దపులి కళేబరాన్ని తెలుగుగంగ కాల్వలో పడేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 15 మంది అనుమానితులను శిరివెళ్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగానే బుధవారం గండ్లేరు రిజర్వాయర్‌లో పెద్దపులి కళేబరం లభ్యమైంది. కొనసాగుతున్న వేట రుద్రవరం, చలిమ అటవీ రేంజ్‌ల పరిధిలో వన్యప్రాణుల వేట ఆగడంలేదు. నిత్యం ఏదో ఒకచోట వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. హద్దులు నిర్ణయించుకుని వేట సాగిస్తున్నట్లు సమాచారం. తెలుగుగంగ కాల్వ వెంట ఉన్న అడవిలో వన్యప్రాణులు తిరిగే ప్రాంతాలను బట్టి కిలో మీటర ఒక హద్దుగా వేటగాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వారి హద్దులో ఇంకొక వేటగాడు ఉచ్చులు వేయడం గాని, ఎరలు పెట్టడం గాని చేయకూడదనే నిబంధన సైతం విధించుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉదాసీనంగా ఉండడంతో ఫలితం లేకుండా పోతోంది. స్మగ్లర్లతో ఒప్పందాలు వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేసే వ్యక్తులతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాత్రి వేళల్లో వేటగాళ్లు అడవిలో సన్నని ఇనుప బైండింగ్ వైర్లను అమర్చి, హైటెన్షన్ విద్యుత్ వైర్లకు అనుసంధానం చేస్తారు. అలాగే క్లచ్ వైర్లతో ఉచ్చులు కూడా వేస్తారు. ఉచ్చులో చిక్కుకున్న జంతువును మారణాయుధాలతో హతమారుస్తారు. మరి కొందరు విషపు, మత్తు గుళికలు ఆహారంలో కలిపి ఎరగా వేస్తున్నారు. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో ఛత్తీస్గడ్, బిహార్ ప్రాంతాలకు చెందిన వేటగాళ్లు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీరు గన్‌తో గురి చూసి విషపు ఇంజక్షన్లు వన్యప్రాణులకు ఎక్కించి, చంపడంలో నేర్పరులని సమాచారం. కొరవడిన నిఘా వన్యప్రాణుల వేటను అటవీశాఖ అధికారులు అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతులు పంట పొలాల రక్షణ కోసం అమర్చే విద్యుత్ తీగలకు తగిలి వన్యప్రాణులు బలవుతున్నాయని తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆత్మకూరు అటవీ సమీపంలో ఓ పులి అనుమానాస్పదంగా మృతి చెందింది. తాజాగా రుద్రవరం మండలం గుండ్లేరు రిజర్వాయర్‌లో మరొక పులి కళేబరం లభ్యమైంది. ఇవే కాదు అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, తోడేళ్లు పదుల సంఖ్యలో అనుమానాస్పదంగా మృత్యువాత పడుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వేటగాళ్లను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించిన ఘటనలు స్వల్పంగా ఉన్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారం, పది రోజులు హంగామా చేయడం, తదనంతరం దానిని పట్టించుకోక పోవడం పరిపాటిగా మారింది. ఇవీ ఘటనలు ► 2019 బాచేపల్లె తండా సమీపంలో తిప్పపై పెద్దపులి మృతి చెందింది. ► అదే సంవత్సరం మరో నెలలో ఎర్రచెరువులో పెద్దపులి మృత్యువాత పడింది. ► రెండు సంవత్సరాల క్రితం గండ్లేరు రిజర్వాయర్‌లో చిరుత కళేబరం కనిపించింది. ► నెల క్రితం ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా కళాశాల సమీపంలో వేటకు జింక బలైంది. ► పక్షం క్రితం రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు మృతి చెందాయి. ► తాజాగా బుధవారం గండ్లేరు రిజర్వాయరులో పెద్దపులి కళేబరం లభ్యమైంది. వన్య ప్రాణుల వేట చట్ట విరుద్ధం పులి మృతికి కారణమైన వారిని వదిలిపెట్టం. పోస్టుమార్టం ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల వేట చట్ట విరుద్ధం. ఎవరైనా అటవీ సిబ్బంది ఇందుకు సహకరిస్తున్నారని తెలిస్తే వారిపై వేటు వేస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. – వినీత్‌కుమార్, డీఎఫ్ఓ వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత ప్రతి ఒక్కరూ వన్యప్రాణులను ప్రేమించాలి. వాటిని సంరక్షించే బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకోవాలి. వన్యప్రాణులు నశిస్తే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అడవులు అంతరించి పోయే ప్రమాదం ఉంది. – డాక్టర్ ఈపనగండ్ల శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ కఠినంగా శిక్షించాలి అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్ని రకాల వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. వన్యప్రాణులు లేకుంటే పర్యావరణ పరిరక్షణ పూర్తిగా దెబ్బతింటుంది. వన్యప్రాణులను వధించే వారిని కఠినంగా శిక్షించాలి. – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!
ఫిన్ల్యాడ్: మనం చాలా నిధుల గురించి విని ఉంటాం అయితే ఈ ఫిన్ల్యాండ్లోని లెమ్మిన్కైనెన్ అనే నిధి నిక్షేపం కోసం 30 ఏళ్లుగా పరిశోధిస్తునే ఉన్నారంటా. అంతేకాదు ఈ లెమ్మిన్కైనెన్ అనే నిధి కోసం "ట్వెల్వ్ టెంపుల్" పేరుతో పన్నెండు మంది బృందం 1987 నుండి అన్వేషిస్తోందట. (చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !) పైగా ఈ నిధిలో 1500 కోట్లు పైన ఉండచ్చని భావిస్తున్నారు. అంతేకాదు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వజ్రాలు, నీలమణులు, పురాతన కళాఖండాలు వంటివి 50వేలుకు పై చిలుకే ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వెయ్యేళ్లనాటి నిధిని చేధించేందకు ఈ పన్నెండు బృందాలు 30 ఏళ్లుగా అన్వేషిస్తునే ఉంది. ఈపరిశోధనల్లో భాగంగా వాళ్ల చాలా కష్ట నష్టాలను చవిచూశారు. అయితే ఇంతవరకు ఎవరు ఈ నిధిని కనుగొన లేకపోయారు. ఈ మేరకు ఆ పన్నెండు మంది బృందం తాము కొద్ది దూరంలో ఉన్నామని త్వరలోనే ఈ నిధిని కనుగొన గలమంటూ విశ్వాసం వ్యక్తం చేసింది. లెమ్మిన్కైనెన్ నిధి అన్వేషణాధికారి మాట్లాడుతూ...గణనీయమైన పురోగతి సాధించాం. త్వరలోనే మా బృందం ఆ నిధిని గుర్తించ గలదు" అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు) -
దాక్కో పులి.. లేదంటే ఉచ్చుకు బలి
సాక్షి, మంచిర్యాల: వలస పులులకు వేటగాళ్ల ఉచ్చులు దినదినగండంలా మారాయి. కొంత కాలంగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా– అందేరీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి పులుల అభయారణ్యం నుంచి తెలంగాణలోకి పులులు అడుగుపెడుతున్నాయి. కాగజ్‌నగర్‌లో కొన్ని పులులు స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకుని వాటి సంతతి పెంచుకుంటున్నాయి. అలా ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న పెన్‌గంగా, ఆసిఫాబాద్‌కు, మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత, గోదావరి దాటి ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, గోదావరి నదుల తీరం దాటి భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలకు పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఈ వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వలస వస్తున్న పెద్దపులులకు వేటగాళ్ల ఉచ్చులు సవాల్‌గా మారాయి. కొందరు వేటగాళ్లు పులి సంచరించే ప్రాంతాలు తెలుసుకుని డబ్బు ఆశతో వాటిని మట్టుబెట్టే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూశాయి. జీవ వైవిధ్యంలో ప్రధాన పాత్ర పోషించే జాతీయ జంతువు.. భవిష్యత్ తరాలకు గోడ చిత్రంగా మిగిలిపోతుందా అని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు పరిధిలో కే 4 (కాగజ్‌నగర్) అనే ఆడ పులికి వేటగాళ్లు అమర్చిన ఉచ్చు నడుము వద్ద చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలోనే సంచరిస్తోంది. ఈ పులి జీవించి ఉందో లేదోననే అనుమానాలున్నాయి. ఈ చిత్రంలో కర్రకు బిగించి ఉన్న వైరు (వృత్తంలో) వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ కంచె. ఏదైనా జంతువు ఈ వైరుకు తాకగానే కొద్ది సెకండ్లలోనే ప్రాణాలు కోల్పోతుంది. రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామస్తులు ఈ కంచెపై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే కరెంట్ సరఫరా నిలిపివేశారు. అయితే అటవీ అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే నాగంపేట, బొప్పారం ప్రాంతాల్లో జే–1 అనే మగ పులి సంచరిస్తోంది. 2016లో ఇదే మండలంలోని పిన్నారంలో విద్యుత్ కంచెకు తగిలి మూడేళ్ల వయసున్న మగ పులి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అడవుల్లో ఇదే తీరున ఉచ్చు వేసి పులిని హతమార్చారు. దేశవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటనలు జరగడం వాటి ప్రాణాలకున్న ముప్పును, అటవీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. కాగజ్‌నగర్ అడవుల్లో పులి కూనల సయ్యాట పులి సంరక్షణకు చర్యలు పులి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కొందరు రైతులు పంటల రక్షణకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తుండడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది. అలాగే, వేటగాళ్ల నుంచి కూడా జాతీయ జంతువు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. పలుచోట్ల పోడు భూములు పులి ఆవాసాలకు ప్రతికూలంగా మారాయి. ఉచ్చులు, వేట ఎంత ప్రమాదకరమైనవో అటవీ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పులి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాం. శివాని డోగ్రా, జిల్లా అటవీ అధికారి, మంచిర్యాల జిల్లా -
వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!
ములుగు: కొడిశాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాట్లు చేసిన ఉచ్చుకు పులి బలైంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన ఐదుగురు వేటగాళ్లు అటవీప్రాంతంలో ఉచ్చులను ఏర్పాటు చేశారు. రెండువారాల క్రితం ఏర్పాటు చేసిన ఉచ్చుకు చిక్కుకొని గేదె మృతి చెందింది. అయినా అటవీ అధికారులు స్పందించలేదు. అదే ఉచ్చుకు తాజాగా పులి బలి అయినట్లుగా సమాచారం. రెండురోజుల క్రితం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులకు పులి కళేబరం కనిపించింది. దీంతో కూపీ లాగిన పోలీసులు వేటగాళ్లను గుర్తించడంతోపాటు వారి నుంచి పులిచర్మం, ఎనిమిది గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో సంచరించిన పులి ఇదేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు ఉచ్చులు వేసిన వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించినా అటవీ, పోలీస్ అధికారులు స్పందించలేదు. -
వైరల్: వేటగాళ్ల క్రూరత్వం.. తీరం మొత్తం రక్త సిక్తం..
మనిషిని సంప్రదాయం పేరిట ఉండే మూఢ నమ్మకం పిచ్చివాడిని చేస్తుంది. మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతువులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతుజాతులు కనుమరుగైపోతున్నాయి. పూర్వం వన్యప్రాణులను రకరకాల కారణాల వల్ల వేటాడుతుండేవారు. కొందరు తమ బలప్రదర్శన, ధైర్య సాహసాలు నిరూపించుకోవడం కోసం జంతువులను వేటాడి చంపేవారు. ఫారో ఐస్లాండ్స్(తోర్షావ్న్): ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన ఫ్రోస్లోని గ్రిన్‌డ్రాప్ లేదా గ్రైండ్ అని పిలిచే ద్వీపంలో ఆదివారం చోటు చేసుకుంది. దాదాపు 20 పడవల్లో వచ్చిన వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. సముద్ర తీర ప్రాంతంలో ఓ చోట 52 పైలట్ తిమింగలాలను చంపగా.. మరో చోట 123 తిమింగలాలను హతమార్చారు. దీంతో సముద్ర తీరం మొత్తం రక్త సిక్తమైంది. ఈ విధంగా గత దశాబ్ద కాలంలో 6,500 పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను బలితీసుకున్నారు. ఇదో అనాగరికమైన చర్యగా సీ షెపర్డ్ పేర్కొంది. ఇలా వెలుగులోకి.. సీ షెపర్డ్ పరిరక్షణకారులు ఓ డ్రోన్‌ను పంపించారు. అది తిమింగలాలు ఉండే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఈ సంగతి బయట పడింది. అయితే ఆ సమయంలో ఓ ముష్కరుడు ఫోర్మ్యాన్ను వేటాడండి అంటూ.. డ్రోన్‌పై షాట్గన్తో కాల్పులు జరిపాడు. ఇక దీనిపై ఫారో దీవుల్లోని వారు కొన్ని గ్రూపులుగా విడిపోయాయి. కానీ చాలామంది వారి సంస్కృతిని గౌరవించాలని విదేశీ మీడియా, ఎన్జీఓలను కోరుతున్నారు. తిమింగలం మాంసం చాలా మంది స్థానికులు తింటారు. అయితే ఈ విధంగా భారీగా హతమార్చడాన్ని భరించలేమని వాటి పరిరక్షకులు వాదిస్తున్నారు. చదవండి: Covaxin: భారత్ బయోటెక్‌కు మరోసారి ఎదురుదెబ్బ జాకబ్ జుమాకు 15నెలల జైలు శిక్ష -
బ్యాగులో కోతుల కళేబరాలు: మాంసం కోసం..
భువనేశ్వర్ : వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..వేటగాళ్ల దుశ్చర్యలు ఆగడం లేదు. రాయిఘర్ సమితి టిమరపూర్ పంచాయతీ బినయపూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లకు రెండు కోతులు బలైపోయాయి. ఫారెస్ట్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు వన్యప్రాణులను వేటాడుతూ కనిపించారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయారు. ఆ ప్రాంతంలో ఒక బ్యాగు, మోటారు బైక్‌ను విడిచిపెట్టి వెళ్లడంతో ఫారెస్ట్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగును పరిశీలించగా అందులో రెండు కోతుల కళేబరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కేసు నమోదు చేశారు. వారి సూచనల మేరకు మృతి చెందిన కోతులకు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కోతి మాంసం విక్రయించేందుకే వాటిని చంపినట్లు ఫారెస్ట్ సిబ్బంది అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారి శ్రీ దుక్కు తెలిపారు. -
‘నయా’ వేటగాళ్లు దొరికారు
సాక్షి, నిజామాబాద్ : విదేశీ టెలిస్కోపిక్ రైఫిళ్లు.. రాత్రివేళల్లో సైతం స్పష్టంగా చూడగలిగే బైనాక్యులర్లు.. శక్తిమంతమైన సెర్చ్లైట్లు.. ఇవి వారి అధునాతన వేట పరికరాలు.. నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణులను వేటాడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా ఎట్టకేలకు చిక్కింది. జకోరాలో ఓ రైస్‌మిల్లును నడుపుతున్న హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు చెందిన లుక్మాన్ అఫ్రిది (47), ఇమ్రాన్ అఫాండి (50), ఎండీ ఫారుఖ్ఖాన్ (23), షేక్రాజ్ అహ్మద్ (43), ఎండీ జమీలుద్దీన్ (61)లను అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం తెలిపారు. వీరిపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గుడిమల్కాపూర్‌లో లుక్మాన్ అఫ్రిది ఇంట్లో కూడా వన్యప్రాణుల మాంసం లభించినట్లు పేర్కొన్నారు. చదవండి: నటి చిత్ర మరణంపై అనుమానాలు పక్కా సమాచారంతో.. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ ముఠా శుక్రవారం రాత్రే నిజామాబాద్ జిల్లా హున్సా, మందర్న ప్రాంతాల్లో వన్యప్రాణుల వేటకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్‌వో నేతృత్వంలోని అధికారుల బృందం ఆదివారం వర్ని మండలంలో తనిఖీలు నిర్వహించింది. ఇందులో భాగంగా జకోరా వద్ద ఉన్న బిన్నీ రైస్‌మిల్లును తనిఖీ చేసి ఆ ముఠాను అదుపులోకి తీసుకుంది. అక్కడ సెర్చ్ చేయగా రెండు టెలిస్కోపిక్ సైలెన్సర్ రైఫిళ్లు, మందుగుండు సామగ్రి, నైట్‌విజన్ బైనాక్యులర్, కత్తులు, సెర్చ్‌లైట్లతో పాటు కుందేలు మాంసం లభించాయి. అలాగే ఆ ముఠా తీసుకొచ్చిన ఓ టాటా సఫారీ వాహనాన్ని కూడా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: నీళ్లు తాగేందుకు వస్తే.. కాళ్లు నరికారు అలవాటుగా వేట.. అటవీశాఖ అధికారులు అరెస్టు చేసిన ముఠాకు నేతృత్వం వహిస్తున్న లుక్మాన్ అఫ్రిది తరచూ వన్యప్రాణులను వేటాడుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. అఫ్రిది తన స్నేహితులతో కలసి వర్ని అటవీ ప్రాంతంలో వేటకు వచ్చినట్లు సమాచారం రావడంతో అప్రమత్తమైన అటవీశాఖ విజిలెన్స్ బృందం వారి కదలికలపై నిఘా పెట్టి ఆట కట్టించింది. -
అభయారణ్యంలో అలుగుల వేట
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యంలో అరుదైన వన్యప్రాణులు అలుగులు సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. వీటి మూతి ముంగీసను పోలి ఉంటుంది. వీటి జీవితకాలం సుమారు 20 ఏళ్లు. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవికి పొడవైన నాలుక ఉంటుంది. వీటి చర్మంపై ఉండే పెంకులు (పొలుసులు) దృఢంగా ఉంటాయి. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకూ సంచరిస్తున్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు చెప్పారు. అలుగులు రాత్రి సమయంలోనే ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తుంటాయి. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి ఉంటాయి. ఇవి సంచరిస్తున్న సమయంలో ఎటువంటి అలికిడి వచ్చినా బెదిరిపోయి బంతిలాగా ముడుచుకుపోతాయి. వీటి వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును తేలి గట్టిగా ఉంటాయి. అలుగులపై వేటగాళ్ల కన్ను అభయారణ్యంలో సంచరిస్తున్న అలుగులపై వేటగాళ్ల కన్ను పడింది. అలుగు జంతువు వీపుపై ఉండే పెంకులకు మంచి డిమాండ్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలుగు పెంకులను చైనాలో మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారని చెప్తున్నారు. దీంతో అటవీప్రాంతంలో కూడా అలుగుల కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు అలుగును పట్టుకుని రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్బుక్లో అలుగు వీడియోను అప్లోడ్ చేశారు. దీనిపై అధికారులు స్పందించి అలుగును అమ్మకానికి పెట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అరుదైన వన్య ప్రాణులను పట్టుకుని విక్రయించాలని చూస్తే చట్ట ప్రకారం ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధిస్తారని వైల్డ్ లైఫ్ అధికారులు పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడితే శిక్షిస్తాం చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజ్ అధికారి, పోలవరం -
వేటాడుతున్న నాటు తూటా
మన్యంలో నాటుతుపాకులు కలకలం రేపుతున్నాయి. గిరిజనులు వాటిని సొంతంగా తయారు చేసుకుంటూ యథేచ్ఛగా జంతువులను వేటాడడంతో పాటు తమ విరోధులపై కాల్పులు జరుపుతూ ప్రాణాలు బలిగొంటున్నారు. తుపాకులు దగ్గర ఉండడంతో చిన్నపాటి గొడవ జరిగినా కాల్పులు జరుపుతున్నారు. మన్యంలో తరచూ నాటు తుపాకులు గర్జిస్తుండడంతో అశాంతి వాతారణం నెలకుంటోంది. విశాఖపట్నం, కొయ్యూరు(పాడేరు): మన్యంలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. అడవి పందులు, దుప్పులు,కొండ గొర్రెలు, కణుజులను వేటాడేందుకు అధికంగా నాటు తుపాకులను వినియోగిస్తున్నారు.చింతపల్లి,గూడెంకొత్తవీధి,కొయ్యూరు మండలాలో గిరిజ నుల వద్ద 250 నాటుతుపాకులున్నాయి. జంతువులను వేటా డేందుకు ఉపయోగించాల్సిన తుపాకీ గుళ్లు మనుషుల గుండెలను చీల్చుతున్నాయి. కొన్నిసార్లు కక్షతో విరోధులపై తుపాకులను గురిపెడుతుంటే, మరికొన్ని సార్లు గురి తప్పి గాయపరుస్తున్నాయి. తాజాగా ఐదు రోజుల కిందట ఆర్.కొత్తూరు పంచాయతీ మల్లవరంలో జంపాశ్రీను అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కురుజు రమణాజీ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. మన్యానికి సమీపంలో ఉన్న రోలుగుంట మండలంలో అడవి పందుల వేటకు వెళ్తుండగా నాటు తుపాకీ పేలి గతంలో ఓయువకుడు మృతువాతపడ్డాడు. ఇలాంటి సంఘటనలు తరచూ మన్యంలో జరుగుతున్నాయి. గతంలో వింటిబద్దలు,బాణాలతో జంతువులను వేటాడేవారు. ఇప్పుడు వాటిస్థానంలో ఎక్కువగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి.ప్రతీ ఏటా వేసవిలో విశాఖ మన్యానికి ఒడిశా నుంచి వేటగాళ్లు వస్తారు. స్థానికులు వారి నుంచి కూడా తుపాకులు సేకరిస్తున్నారు. నాటు తుపాకులు కలిగి ఉన్న వేటగాళ్లను చూసీ మావోయిస్టులుగా భావించి పోలీసులు కాల్పులు జరిపి సంఘటనలు కూడా ఉన్నాయి. స్థానిక గిరిజనులే కాకుండా ఒడిశా నుంచి వచ్చిన వారు, విశాఖ–తూర్పుగోదావరి సరిహద్దుల్లో అటు తూర్పుగోదావరికి చెందిన గిరిజనులు కూడా నాటు తుపాకులతో జంతువులను వేటాడుతున్నారు. దీంతో మన్యం నిత్యం నాటు తుపాకీ కాల్పుల మోతలతో దద్దరిల్లుతోంది. దృష్టిపెట్టని పోలీసు,అటవీశాఖ అధికారులు ఆయుధాల చట్టం ప్రకారం లైసెన్స్ లేని నాటుతుపాకులు కలిగి ఉండడం నేరం. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలి. మన్యంలో ఎవరి వద్ద నాటు తుపాకులున్నాయో అటవీ శాఖ సిబ్బంది వద్ద సమాచారం ఉంది. అయితే వారెవరూ ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదు.పోలీసులు కూడా నాటు తుపాకులపై దృష్టిపెట్టడం లేదు.దీంతో తీవ్ర నష్టం జరిగిపోతోంది. జంతువులను విచ్చలవిడిగా చంపేస్తున్నారు.మరోవైపు కక్షలు ఉంటే విరోధులపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో నిత్యం తుపాకీలు గర్జిస్తున్నాయి. దృష్టి సారిస్తాం.. నాటు తుపాకులు ఎవరివద్ద ఉన్నా యో సమాచారం సేకరిస్తాం. తరువాత దాడులు చేసి స్వాధీనం చేసుకుంటాం. వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తాం.అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం చట్టరిత్యా నేరం .కె.ఆరీఫ్ హఫీజ్, ఏఎస్పీ, నర్సీపట్నం -
ఎన్జీవో ముసుగులో పులివేట గ్యాంగ్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పులి హత్య కేసు మిస్టరీ వీడింది. ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనాలతో డొంక కదిలింది. రామగుండం సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాలెంజ్‌గా తీసుకొని ఛేదించారు. యానిమల్ ట్రాకర్స్ సహకారంతో పథకం ప్రకారమే పులిని చంపినట్లు తేలింది. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను అరెస్టు చేశారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా శివ్వారం అడవుల్లో విద్యుత్ తీగలకు బలైన పులి కేసు మిస్టరీ వీడింది. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి డిసెంబర్లో ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన నాలుగేళ్ల మగ పులి జనవరి 8న శివ్వారంలో విద్యుత్ తీగలకు తాకి చనిపోవడం వెనుక పెద్ద కుట్ర నడిచినట్లు తేలింది. అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేసే శివ్వారం ప్రాంతపు యానిమల్ ట్రాకర్స్ పులి జాడను వేటగాళ్లకు తెలియజేయగా, పథకం ప్రకారమే విద్యుత్ తీగను అమర్చి అరుదైన పెద్దపులిని హతమార్చినట్లు రామగుండం సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ విచారణలో వెల్లడైంది. పులి చనిపోయిన తరువాత దాని చర్మాన్ని, గోళ్లను ఒలిచి, తలను గుర్తుపట్టకుండా గొడ్డళ్లతో నరికిన వేటగాళ్లు చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారు. పులులను అంతమొందించేలా యానిమల్ ట్రాకర్స్ ద్వారా వేటగాళ్లను ఉసిగొల్పుతూ ‘టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్’అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్ పింప్లేతో పాటు ఏడుగురి దందాను పోలీసులు ఛేదించారు. మందమర్రిలో డిసెంబర్ 24న ‘పులిచర్మం’దొరికిన వ్యవహారంతో మొదలైన ఈ కేసుకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె. ఝా కోరిక మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు అటవీశాఖ సాధారణ పులిచర్మం దొరికిన కేసుగా వదిలేసిన కేసును రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు అప్పగించడంతో మిస్టరీ వీడింది. రామగుండం సీసీఎస్ (అడ్మిన్) అదనపు డిప్యూటీ కమిషనర్ అశోక్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ సీఐల నేతృత్వంలో విచారణకు ఆదేశించగా, వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ మేరకు టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ సంస్థ నిర్వాహకుడు నందకిషోర్ పింప్లేతో సహా ఏడుగురు సభ్యుల చంద్రాపూర్ గ్యాంగ్‌ను, ఇద్దరు యానిమల్ ట్రాకర్స్, ముగ్గురు వేటగాళ్లు, నలుగురు బ్రోకర్స్ సహా 16 మందిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు తొలినాళ్లలో మరో నలుగురిని అరెస్టు చేశారు. మొత్తంగా ఈ కేసులో 20 మందిని అరెస్టు చేసినట్లు కమిషనర్ వి.సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలను అభినందిస్తూ పత్రికలో వచ్చిన కథనాల వల్లనే కేసును అటవీశాఖ నుంచి పోలీసులకు బదిలీ చేసినట్లు చెప్పారు వేటగాళ్లు ఉపయోగించిన మారణాయుధాలు, నగదు పులి హత్యలను ప్రోత్సహిస్తూ.. చంద్రాపూర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే నందకిషోర్ పింప్లే 2002 నుంచి 2007 వరకు చంద్రాపూర్–గడ్చిరోలి హైవేలోని వాలని గ్రామంలో దాబా నడిపేవాడు. 2008 నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసి, సరైన సంపాదన లేకపోవడంతో వన్యప్రాణి వేటగాళ్లను పట్టిస్తానని అటవీశాఖ ఇన్ఫార్మర్గా మారాడు. వేటగాళ్లు చంపిన పులి, చిరుత చర్మాలు, వాటి గోర్లు మొదలైన పక్కా సమాచారాన్ని అందించి అటవీ అధికారుల నుంచి డబ్బులు తీసుకొని నమ్మకం సంపాదించాడు. తరువాత వేటగాళ్లను ఇన్ఫార్మర్ పేరుతో భయపెట్టి డబ్బులు సంపాదించేవాడు. దీన్నే వ్యాపారంగా మార్చుకోవాలని భావించి 2016లో టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ ప్రారంభించాడు. గుర్నేలే సురేష్, భుక్యా భీమ, పియూస్ బార్డే, అశ్విన్, రాకేష్ చక్రవర్తి, తోడాసే థామస్‌లతో కలసి సంస్థను అడ్డుపెట్టుకొని వన్యప్రాణుల వేటగాళ్లను బెదిరిస్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. వన్యప్రాణుల కన్నా పులులను చంపితే చర్మానికి రూ. 30లక్షలు వస్తాయని వేటగాళ్లకు ఆశచూపి, వారు తీసుకొచ్చిన పులి చర్మాలపైనే డబ్బులు పెట్టి పూజలు చేస్తే డబుల్ అవుతాయని మభ్యపెట్టి , చర్మాలను అటవీ అధికారులకు పట్టించే మోసానికి తెరలేపాడు. ఇలా ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 60కి పైగా చర్మాలను పట్టించాడు. ఎన్జీవో సంస్థ కారణంగానే దేశంలో పులులు హతమైనట్లు రామగుండం కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో వన్యప్రాణుల వేటగాళ్లను 100 మందిని గుర్తించినట్లు చెప్పారు. మీడియా సమావేశంలో డీసీపీ వేణుగోపాల రావు, అడిషనల్ డీసీపీలు అశోక్‌కుమార్, రవి కుమార్, సీఐలు సాగర్, ఎడ్ల మహేశ్, శ్రీనివాస్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పులుల వేట వెనుక చంద్రాపూర్ ముఠా జనవరి 24న మందమర్రిలో పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు పులి చర్మాన్ని స్వా«ధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతను అటవీశాఖ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనుమానం రావడంతో రాష్ట్ర స్థాయిలో అటవీశాఖ పీసీసీఎఫ్ ఝా డీజీపీ మహేందర్ రెడ్డికి, ఇంటెలిజెన్స్ సహకారాన్ని కోరారు. ఈ మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్ ఆధ్వర్యంలో రెండు బృందాలు అటవీశాఖతో కలసి దర్యాప్తు ప్రారంభించాయి. పట్టుబడిన పులి చర్మం ఎక్కడిదనే కోణంలో జరిగిన దర్యాప్తులో శివ్వారంలో యానిమల్ ట్రాకర్స్ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో వన్యప్రాణుల వేటగాళ్లు పులిని విద్యుత్ తీగలతో హతమార్చినట్లు వెల్లడైంది. కేసు దర్యాప్తులో భాగంగా తీగను లాగితే డొంక కదిలినట్లు చంద్రాపూర్ గ్యాంగ్ పాత్ర వెల్లడైంది. (పోలంపల్లి ఆంజనేయులు) -
పులి చర్మాల దందాలో చంద్రాపూర్ గ్యాంగ్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రిలో పులి చర్మాన్ని విక్రయిస్తూ ముగ్గురు వ్యక్తులు అటవీశాఖకు చిక్కడంతో మొదలైన వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. వన్యప్రాణులు గుంపులుగా సంచరించే జైపూర్ మండలం శివ్వారం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ తీగలతో వాటి ఉసురు తీయడం సాధారణం. ఇదే తరహాలో శివ్వారం గ్రామానికి చెందిన దంతవేని సాయిలు (45) విద్యుత్ తీగలను అమర్చగా, ఈ నెల 7వ తేదీ రాత్రి వేళలో పెద్దపులి ఆ తీగలకు తాకి మృత్యువాత పడింది. పులిని చూసి షాక్ అయిన సాయిలు సహచరులు తోకల మల్లయ్య, తోకల బుచ్చిరాజంలతో కలసి దాని చర్మాన్ని, గోళ్లను విక్రయించి, లక్షలు సంపాదించాలని భావించారు. ఈ క్రమంలో మొదలైన ‘ఆపరేషన్ టైగర్ స్కిన్’వ్యవహారంలో మహా రాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా వచ్చి చేరింది. పులి చర్మం కొనుగోలు చేసేందుకు ముందు గా ఫోన్లో లక్షల్లో బేరం మాట్లాడిన ఈ ముఠా సభ్యులు, చివరికి బ్లాక్ మెయిల్‌కు దిగి... అది కూడా వర్కవుట్ కాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాము పులుల వేటను నిరోధించేందుకు ఏర్పాటైన ఎన్జీవో సొసైటీ సభ్యులుగా అటవీశాఖ అధికారులనే నమ్మించి పరారయ్యారు. ఈ కేసును రామగుండం కమిషనరేట్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించడంతో గూడుపుఠాణి బహిర్గతమవుతోంది. చంద్రాపూర్ ముఠాతో బేరసారాలు ఈ నెల7న రాత్రి పులి కరెంటు తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోగా, 8న అది చూసిన ముగ్గురు నిందితులు పులి చర్మం, గోళ్లు అమ్మితే లక్షలు సంపాదించవచ్చని భావించారు. మంథని మండలం నాగా రాని చెందిన బెజపల్లి కొమురయ్య (40), పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మేకల నర్సయ్య (40)కు సమాచారం అందించారు. వీరంతా శివ్వారం వచ్చి చనిపోయిన పులిని 200 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చర్మం, గోళ్లు ఒల్చి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు మంచిర్యాలలో మెడికల్ షాపులో పనిచేసే నర్సింబోజు రవీందర్ (42) ఒప్పుకున్నాడు. చర్మం విక్రయించే విషయంలో గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన పూర్ణచందర్‌ను సంప్రదించారు. పూర్ణచందర్ ద్వారా ఆసిఫాబాద్‌కు చెందిన పాండురంగ ప్రవేశం చేశాడు. ఈ క్రమంలో మందమర్రికి చెందిన ఐలవేని అంజయ్యను కూడా తమ ముఠాలో చేర్చుకున్నారు. అసలు కథ పాండు ద్వారానే... ఆపరేషన్ టైగర్ స్కిన్ వ్యవహారం తాను నడిపిస్తానని, రూ.లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన పాండు.. చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్, థామస్‌కు సమాచారం ఇచ్చాడు. నందకిషోర్ గతంలో పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరించాడు. ఈ పేరుతో దందా లు సాగిస్తున్నట్లు చంద్రాపూర్ పోలీసులు గమనించి దూరం పెట్టడంతో అటవీశాఖతో సంబంధాలు ఏర్పా టు చేసుకుని ఇన్ఫార్మర్ అవతారం ఎత్తాడు. . దీంతో ఏకంగా పులుల వేటను అంతం చేయడమే లక్ష్యమని ‘పులుల వేట అంతం’పేరుతో సొసైటీగా ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌కు రావాలని నందకిషోర్, థామస్‌లు సాయిలు గ్యాంగ్‌ను కోరగా, పోలీస్ చెకింగ్ భయంతో రాలేమని మందమర్రికి వస్తామని చెప్పారు. అయితే పులిచర్మం కొనుగోలు కోసం వస్తున్నట్లు చెప్పిన చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్, థామస్లకు బేరసారాల్లో తేడా వచ్చినట్లు సమాచారం. ఒక పథకం ప్రకారం ముందే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన చంద్రాపూర్ గ్యాంగ్ పులి చర్మం విషయంలో బేరం కుదరకపోవడంతో పట్టించారని తెలుస్తోంది. నలుగురు అరెస్టు.. పులికి విద్యుత్ తీగను అమర్చి మరణానికి కారణమైన సాయిలును 5వ నిందితుడిగా చూపించి రిమాండ్ చేశారు. అతనితో పాటు మేకల నర్సయ్య (ఏ–3), బెజపల్లి కొమురయ్య (ఏ–4), నరింబోజు రవీందర్ (ఏ–6)లను రిమాండ్ చేశారు. ఆసిఫాబాద్‌కు చెందిన పాండు, గోదావరిఖనికి చెందిన పూర్ణచందర్, శివ్వారం తోకల మల్లయ్య , తోకల బుచ్చిరాజం, మందమర్రికి చెందిన ఐలవేని అంజ య్య, కారు డ్రైవర్ పరారీలో ఉన్నారు. -
పులి హంతకులెవరు?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర అభయారణ్యాల నుంచి ఆది లాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన పులుల మరణం మిస్టరీగా మారింది. రెండేళ్లలో మూడు పెద్ద పులులు వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలకు తగిలి బలయ్యాయి. పులుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న అధికార యంత్రాంగం.. వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలను అమరుస్తుండటాన్ని అరికట్ట లేకపోవడం పలు అనుమానా లకు తావిస్తోంది. అడవి పంది, జింక, దుప్పి, మెకం, సాంబార్ వంటి వన్యప్రాణుల కోసం వేటగాళ్లు, వన్యప్రాణుల నుంచి పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు అమర్చే విద్యుత్ తీగలకు తగిలి పెద్దపులులు ప్రాణాలు కోల్పోతున్నాయని అటవీశాఖ అధికారులు ఘటనల తీవ్ర తను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వన్య ప్రాణుల పేరిట పెద్దపులుల ఉసురు తీసేం దుకు ఇతర శక్తులేవైనా ప్రయత్నిస్తున్నాయా అనే కోణంలో ఇప్పటి వరకు ఎలాంటి అడుగు పడకపోవడం గమనార్హం. ప్రమాదకరమైన కరెంటు తీగల ఉచ్చులో ఆరితేరిన వ్యక్తులు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల సూచనలకు అనుగుణంగానే ఈ వేట సాగుతుందని అర్థమవుతోంది. మంచి ర్యాల జిల్లా శివ్వారంలో అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ హతం వెనుక కూడా స్మగ్లర్ల హస్తం ఉందని పోలీసు అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు పులులు ఒకే రీతిన 2016, డిసెంబర్లో కోటపల్లి మండలం పిన్నా రంలో విద్యుత్ తీగలకు చిక్కి పులి హతమైంది. స్థానిక వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తాకి ఈ పులి చనిపోయిందని అటవీశాఖ అధికారులు దర్యాప్తులో తేల్చారు. సరిగ్గా రెండేళ్లకు గత నెలలో నిర్మల్ జిల్లా పెంబి మండలం పుల్గంఫాండ్రి వద్ద మరో పులిని హత మార్చారు. ఈ పులి చర్మాన్ని, గోళ్లను ఒలిచి, కళేబరాన్ని పూడ్చేశారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిందని భావిస్తున్న ఈ పులి చర్మాన్ని విక్రయించే ప్రయత్నంలో ఇచ్చోడ వద్ద అటవీశాఖ అధికారులకు చిక్కారు. తాజాగా తిప్పేశ్వర్ నుంచే వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన మగపులి శివ్వారంలో మృతిచెందిన సంఘటన పుల్గం ఫాండ్రి పులిని హతమార్చిన రీతిలోనే ఉండటం గమనార్హం. ఉచ్చులో పడి మృత్యువాత పడ్డ పులి చర్మాన్ని, గోళ్లను వొలిచి విక్రయించే ప్రయత్నంలో దొరి కిపోయారు. ఈ 2 ఘటనలకు మధ్య సారూప్యం ఉండటం,, నెల రోజుల వ్యవధిలోనే చోటు చేసుకోవడం వెనుక పులి చర్మాల స్మగ్లింగ్ ముఠా హస్తం ఉండొచ్చని అటవీ, పోలీస్ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానిక వేటగాళ్లతోనే స్మగ్లర్ల బేరసారాలు వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేసే వ్యక్తులతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాత్రి వేళల్లో వేటగాళ్లు సన్నని ఇనుప బైండింగ్ వైర్లను కిలోమీటర్ల పొడవునా అమర్చి త్రీఫేజ్, హై టెన్షన్ వైర్లకు అనుసంధానం చేసి వన్యప్రాణులను బలిగొం టున్నారు. ఇలా వారానికి ఒక టైనా అడవి జంతువు వేటగాళ్ల బారిన పడటం సహజం. ఇలాంటి వేటగాళ్లతో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు బేరసారాలు కుదుర్చుకొని పులుల మృతికి కారణమవుతున్నారని ఆరో పణలున్నాయి. స్థానిక వేటగాళ్లకు డబ్బుల ఎరచూపి, పులులు బలైన తరువాత చర్మాలను కొనుగోలు చేయడంలో ధర గిట్టుబాటు గాక వారే సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నట్లు కూడా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. మరణ శాసనం రాస్తున్న బైండింగ్ తీగలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మండ లాల్లో ప్రతి రోజు రాత్రి జరిగే ఈ వేటలో అధికారులు పసిగట్టలేకపోతున్నారు. పులి చర్మంపై క్రేజీ ఉండటంతో అవి సంచారం చేసే చోట బైండింగ్ వైర్ ఏర్పాటు చేసి హైటెన్షన్ విద్యుత్ తీగలకు అనుసంధానిస్తున్నారు. దీనికి తగిలి ఇతర వణ్యప్రాణులతో పాటు పులులు కూడా చనిపోతున్నాయి. మనుషులకూ ప్రాణాంతకమే ఈ నెల 10న రాత్రి రెబ్బెన మండలం తక్కల్ల పెల్లికి చెందిన కోట శ్రీనివాస తన సహచరుల తో పులికుంట శివారులోని అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు అమర్చిన కరెంట్ వైరు తగలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. గతంలోనూ ఇదే గ్రామంలో ఒకరు మృతి చెందారు. చెన్నూర్ మండలం సోమన్‌పల్లి అటవీ ప్రాంతంలో పంట పొలాలను రక్షిం చేందుకు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి గతంలో ఓ రైతు కూడా మృతిచెందాడు. పులి వేటపై సీఎం సీరియస్ అటవీ అధికారులతో శనివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. అడవుల సంరక్షణ, కలప అక్రమ రవాణా నిరోధంపై జరిగిన ఈ భేటీలో ఆదిలాబాద్ అడవుల్లో పులుల మృత్యువాత అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అటవీ సంరక్షణ దళం ఏర్పాటు చేసి పులుల సంరక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, వేటగాళ్లను, స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
పులి హంతకులెవరు?
-
తిప్పేశ్వర్ పులి.. శివ్వారంలో బలి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎక్కడో తిప్పేశ్వర్ అభయారణ్యంలో పుట్టిన పులి.. ఆహారం కోసం ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన నెల రోజులకే వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైంది. ఆదిలాబాద్ అడవుల్లోకి మరో పులి వచ్చి చేరిందన్న సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైంది. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో లభించిన పులి చర్మం కవ్వాల్‌లో కనిపించిన పులిదేనని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించడం లేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు చెబుతున్నా.. పులి చర్మం తాజాగా ఉండటం, కవ్వాల్‌లో కనిపించిన పులి మాయమవడం, పులి ఫొటోలు, పులి చర్మం ఒకేరకంగా ఉండటాన్ని బట్టి కవ్వాల్‌లో కనిపించిన పులిగానే నిర్ధారించారు. నీల్వాయి ప్రాంతంలో తిరుగుతున్న కె–4 ఆడపులి సాంగత్యం కోసం గానీ, గుంపులుగా సంచరించే జింకల కోసమో ఈ పులి శివ్వారం అడవుల్లోకి వచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. అడవి పందులు, జింకల కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకొని 15 రోజుల క్రితమే ఈ పులి హతమైంది. శివ్వారానికి చెందిన తొమ్మిది మంది పులిని హతమార్చిన ఘటనలో నిందితులు కాగా సాయిలుని ఏ–1గా పోలీసులు కేసు నమోదు చేశారు. కొమురయ్య, సాయిలు కొడుకు శ్యామ్, మధునయ్య, లింగ య్యలను అరెస్టు చేసి పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. పోలీసుల చర్యతోనే.. మందమర్రిలో పులి చర్మం వెలుగుచూసిన వ్యవహారంపై రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు తక్షణమే స్పందించి ఒక్కరోజులోనే కేసు మిస్టరీని ఛేదించింది. నిందితులను విచారించగా, శివ్వారంలో పులిని హతమార్చిన ప్రాంతం వివరాలు వెల్లడించారు. ఈ మేరకు కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల రావు, డీఎఫ్ఓ రామలింగం, ఇతర అటవీ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
చిరుత.. మృత్యువాత
మంచిర్యాలఅర్బన్: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిరుతపులి బలైంది. ఈ ఘటన సోమవారం మంచిర్యాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. మంచిర్యాల ఫారెస్ట్ డివిజన్ అధికారి వెంకటేశ్వరావు కథనం ప్రకారం... లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని పాత మంచిర్యాల బీట్ రంగంపేట్ అటవీ సమీపంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఓ చెట్టుకొమ్మకు క్లచ్ వైరుతో ఉచ్చు బిగించారు. ఓ చిరుతపులి అటుగా వచ్చి ఈ ఉచ్చులో చిక్కుకుంది. తప్పించుకునే ప్రయత్నం చేసినా అది మెడకు మరింతగా బిగుసుకుపోవటంతో మృత్యువాత పడింది. సోమవారం అటవీ ప్రాంతంలోకి వంటచెరుకు కోసం వెళ్లిన స్థానికులు ఉచ్చులో పడి ఉన్న చిరుతను గమనించారు. సమాచారం అందుకు న్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. 3 రోజుల కిందట చిరుత మృతి చెందినట్లు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు తెలిపారు. అనుమానాస్పదస్థితిలో చిరుత మృతి మాక్లూర్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ మేరకు నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4న గుత్ప శివారులోని ఓ మామిడితోటకు వేసిన ఇనుప కంచె కు చిక్కిన చిరుత అదేరోజు సాయంత్రం తప్పించుకుంది. ఈ నేపథ్యంలో అటవీప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన చిరుత కళేబరం కనిపించింది. అటవీ అధికారులు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విచారణ చేపట్టారు. చిరుతపులి చనిపోయిన స్థలంలో కొద్ది దూరంలోనే దాని తల, నడుము, మరి కొద్ది దూరంలో కాలు పడి ఉన్నాయి. చిరుత కళేబరం పూర్తిగా కుళ్లిపోయింది. పక్కనే బీడీల కట్ట, అంబర్ ప్యాకెట్ లభించాయి. డాగ్‌స్క్వాడ్ ఆధారంగా గుత్ప తండాకు చెందిన రవికుమార్, తులసీరాం, నరేందర్, విజయ్‌లను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి పులికి సంబంధించిన 7 గోర్లు, 4 దంతాలను స్వాధీనం చేసుకున్నారు. చిరుత అనారోగ్యంతో మృతి చెందిందా.. లేదా వేటగాళ్లు చంపేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ల్యాబ్‌కు పంపారు. -
వేటగాళ్ల చేతిలో చిరుత హతం
అనంతపురం ,కంబదూరు: తమపై దాడి చేస్తుందేమోనన్న భయంతో చిరుతపైకి వేటగాళ్లు తిరగబడ్డారు. ప్రాణ రక్షణ కోసం చిరుతను హతమార్చారు. కంబదూరు మండలం కొత్తూరు గ్రామ సమీపాన పెన్నానది ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అడవి పందుల వేట కోసం కుక్కలను వెంటబెట్టుకుని అడవిలోకి వెళ్లారు. పెన్నానది పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో కుక్కలు నిలేశాయి. ఈ సమయంలో తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని వేటగాళ్లు ప్రాణ రక్షణ కోసం వెంట తీసుకెళ్లిన కత్తులు, కర్రలతో చిరుతపై దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత చిరుతను గ్రామంలోకి తెచ్చి కాల్చేశారు. సమాచారం తెలుసుకున్న డీఎఫ్ఓ చంద్రశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో విచారణ చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. నిందితులందరిపైనా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ శివప్రసాద్, తహసీల్దార్ మసూద్‌వలి, ఎస్ఐ రాగిరి రామయ్యతో పాటు ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కూడా పరిశీలించారు. -
వన్య ప్రాణికి కరువైన రక్షణ
ఒకప్పుడు ఎటూ చూసిన అడవులే. అంతటా పచ్చిక బయళ్లే. వాటిలో స్వేచ్ఛగా సంచరించే జంతువులు కనువిందు చేసేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేటగాళ్లు సాధు జంతువులను వేటాడుతున్నారు. వల వేసి పడుతున్నారు. గ్రామాల్లోని ప్రధాన అడ్డాలైన కల్లు దుకాణాలు, అంగళ్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కొందరికైతే మరీ ముందస్తు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు మాత్రం చీమకుట్టు కూడా చలించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేటగాళ్ల బారి నుంచి సాదు జంతువులను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇక వారు ఏ మేరకు స్పందిస్తారో..! నస్రుల్లాబాద్(బాన్సువాడ): రోజు రోజుకు వన్య ప్రాణులకు రక్షణ లేకుండా పోతోంది. శాఖాహార జీవాలను వేటగాళ్లు వలలు వేసి మరీ పట్టుకుని కాల్చుకుతింటున్నారు. కాపాడాల్సిన వారు పట్టించుకోకపోవడంతో వారికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇటీవలే మండలంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో దానికి శస్త్ర చికిత్స చేసి రాజధాని జూకు తరలించారు. అయినా కూడా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటువైపు అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. ప్రతి నెల వచ్చే వేతనాలను తీసుకోవడంలో ఉన్న ఆతృత ఉద్యోగం చేయడంలో చూపించడంలేదని వన్య ప్రేమికులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద, గాంధారి, సిరికొండ, మాచారెడ్డి, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, భీమ్‌గల్ తదితర మండలాల్లో గతంలో దట్టమైన అడవులు ఉండేవి. అయితే అవి కాస్త ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో వేటగాళ్లు అటవీ జంతువులను వేడాడి వాటి మాంసాన్ని పాళ్లుగా వేస్తున్నారు. దీంతో వారికి ‘మూడు పాళ్లు.. ఆరు వేలు’గా ఆదాయం సమకూరుతోంది. వేటగాళ్లు ప్రధానంగా గ్రామాల్లోని కల్లు దుకాణాలు, వైన్సులను అడ్డాలుగా మార్చుకుని మరీ విక్రయిస్తున్నారు. కన్నెత్తి చూడని అటవీ అధికారులు.. ‘ఒకవైపు వన్య ప్రాణులను కాపాడాలి’ అన్న నినాదంతో శాకాహార జంతువుల పెంపకం కోసం వన సంపద పెంచాలని ప్రభుత్వం హరితహారం నిర్వహించి మరీ మొక్కలను పెంచుతోంది. వేటగాళ్ల చేతులకు సాదు జీవులు బలై పోతున్నాయి. దీంతో రాబోయో రోజుల్లో సాదు జీవాలను జంతు ప్రదర్శన శాలలో మాత్రమే చూడాల్సి వస్తోంది. ఇలా ఇష్టారీతిన జంతువులను చంపుకు తింటూ ఉంటే మాత్రం రానురాను వన్య ప్రాణులు మాత్రం అంతరించి పోతున్నాయి. ఐదేళ్ల క్రితం నస్రుల్లాబాద్ మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరించే అటవీ జీవుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం తగ్గిపోయింది. వర్ని–నస్రుల్లాబాద్ మధ్య ఉన్న గండిలో సాయంత్రం అయితే జన సంచారం ఉండేది కాదు. అయితే నేటి జనాలు క్రూర మృగాలుగా మారి కనుమరుగు చేస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని పంట పొలాలు, పచ్చిక బయల్లు వంటి ప్రాంతాల్లో వలలు, ఉర్లు వంటివి పెట్టి యథేచ్ఛగా పెడుతున్నారు. ముందస్తు సమాచారంతోనే... పచ్చిక బయల్లు, అడవి ప్రాంతాల్లో పట్టిన శాఖాహార జంతువులు కుందేళ్లు, అడవి పంది, దుప్పి, కొండ గొర్రె, అడవి పక్షులు, కంజు పిట్టలు, పావురాలు వంటి వాటిని పట్టుకు వచ్చి సమీపంలోని కల్లు దుకాణాల్లో, అంగట్లో, బస్టాండ్ ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనికితోడు కొన్ని గ్రామాల్లో ముందస్తుగానే చెప్పి మరీ వేటకు వెళుతున్నారు. పెద్ద మొత్తంలో మద్యం వ్యాపారం జరిగే గ్రామాల్లో కల్లు దుకాణాల్లో ప్రతి రోజు వివిధ రకాల వన్య ప్రాణులు లభిస్తాయని సమాచారం. ఇంతగా వన్యప్రాణులు విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వన్య ప్రాణులను కాపాడాలని వన ప్రేమికులు కోరుతున్నారు. -
కొనసాగుతోన్న వాయుగుండం
విశాఖపట్నం జిల్లా: జంషెడ్పూర్ పరిసర ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయిగుండం పశ్చిమ వాయివ్య దిశగా పయనిస్తూ మరో 24 గంటల పాటు కొనసాగనుంది. క్రమణా బలహీన పడి రేపటికి(సోమవారానికి) తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. ద్రోణి ప్రభావంతో కోస్తాలో చెదురుముదురు వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 50కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ముప్పు లేకపోవడంతో పోర్టు హెచ్చరికలను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఉపసంహరించుకుంది. -
కర్నూలు బాట పడుతున్న వజ్రాల వేటగాళ్లు
-
వేటగాళ్ల ఉచ్చులో అటవీ జంతువులు
వన్యప్రాణుల చట్టం అమలులో ఉన్నప్పటికీ మూగజీవాల వేట ఆగడం లేదు. జిల్లాలోని అభయారణ్యంలో వేటగాళ్ల సంచారం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నగరానికి అభయారణ్యం వందకిలోమీటర్ల పరిధిలో ఉండటంతో పలువురు వేటగాళ్లు ఇక్కడికి వచ్చి తరచూ జంతువులను వేటాడతున్నారు. ఇదిగాక తూప్రాన్ మండల పరిసర దాబాల్లో సైతం జంతు మాంసం విరివిగా దొరుకుతోంది. ఈ మాంసానికి ఇక్కడ డిమాండ్ కూడా ఎక్కువే.. ఇక్కడి నుంచి హైదరాబాద్‌లోని పలు హోటళ్లకు సైతం సరఫరా అవుతున్నట్లు సమాచారం. మెదక్‌జోన్: అభయారణ్యంలోని వణ్యప్రాణులకు రక్షణ కరువైంది. మానవుల జిహ్వచాపల్యం, విలాసాలకు మూగజీవాలు బలవుతున్నాయి. అధికారులు సరైన నిఘా ఏర్పాటు చేయకపోవడం, ఆకలిదప్పిక తీర్చుకునేందుకు వాటికి అనువైన పరిస్థితులు కరువవడంతో ప్రాణులు అడవులను విడిచి బయటకు వస్తున్నాయి. ఇదే అదునుగా బావిస్తున్న వేటగాళ్లు జంతువులను వేటాడుతున్నారు. మూగజీవాల వేట ఉదంతాలు జిల్లాలో తరుచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మంగళవారం తెల్లవారు జామున హైదరబాద్‌కు చెందిన నలుగురు యువకులు హవేళిఘణాపూర్ మండల పరిధిలోని పోచారం అరణ్యంలో సెర్చ్‌లైట్లతో సహా పట్టుబడ్డారు. నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం, మెదక్, హవేళిఘణాపూర్, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట తదితర మండలాల పరిధిలో సుమారు 58వేల హెక్టార్లమేర అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పిలు, కొండగొర్లు, నీల్గాయిలు, అడవిపందులు, నెమళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. పోచారం అభయారణ్యంలో రెండు జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాలు సైతం ఉన్నాయి. ఇక్కడ వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. జంతు మాంసానికి భలే డిమాండ్.. రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ అడవి ప్రాంతం ఉంది. దీంతో హైదరాబాద్‌కు చెందిన పలు ఉన్నత కుటుంబాల యువకులు, విశ్రాంత ఉద్యోగులు వేటకోసం జిల్లాలోని అటవీ ప్రాంతాలకు తరుచూ వస్తుంటారు. అడవుల్లో తిరిగేందుకు అనువైన వాహనాలతో పాటు తుపాకులు సెర్చ్‌లైట్లతో వచ్చి వేటాడిన ఉదంతాలు కోకొళ్లలుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా 44వ జాతీయ రహదారి తూప్రాన్, కండ్లకొయ్యతో పాటు పలు దాబాల్లో జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ దాబాల్లోకి మాంసాన్ని సరఫరా చేసేందుకు తూప్రాన్‌కు మండలానికి చెందిన కొందరు వేటను వృత్తిగా ఎంచుకున్నారు. వీరు జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన కొంత మందిని సహాయకులుగా ఏర్పాటు చేసుకుని జింకలు, నెమళ్లు, కొండగొర్ల వంటి వణ్యప్రాణులను వేటాడుతునట్లు జరిగిన పలు సంఘటనలు బట్టి రుజువవుతోంది. వణ్యప్రాణుల మాంసానికి డిమాండ్ బాగా ఉండటం, కిలో జింక మాంసానికి రూ.1500 ధర పలుకుతుండటంతో వేటగాళ్లు దీనినే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నట్లు సమాచారం. 2016 సంవత్సరం జులై మాసంలో వెల్దుర్తి మండలం శెట్టిపల్లి వద్ద పట్టుబడిన నాలుగు జింకల శరీర భాగాలు హైదరాబాద్‌కు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. వాటిని మెదక్ మండలం పాతూర్ అడవుల్లో వేటాడినట్లు, అంతేకాకుండా హైదరబాద్‌లోని పలు హొటళ్లకు ఈ మాంసం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. కఠిన చర్యలు తీసుకోవాలి.. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం మూగజీవాలను వేటాడటం నేరం. విచారణలో నేరం రుజువైతే జరిమానాతో పాటు జైలు శిక్షసైతం ఉంటోంది. కాగా పలు సందర్భాల్లో వేటాడుతూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఈనెల 17న, తెల్లవారు జామున పోచారం అభయారణ్యంప్రాంతంలో అనుమాన స్పదంగా దొరికిన నలుగురు వ్యక్తుల వద్ద సెర్చ్లైట్లు ఉండటంతో వేటగాళ్లేనని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మచ్చుకు కొన్ని సంఘటనలు... ఐదేళ్ల క్రితం తూప్రాన్ మండల పరిధిలో వన్యప్రాణులను వేటాడే ముఠాను అటవీ అధికారులకు పట్టుకున్నారు. అప్పట్లో వారి నుంచి వన్యప్రాణులను వేటాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 8 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు చెందిన కొంత మంది వన్యప్రాణులను వేటాడేందుకు రామాయంపేట మండలంలోని అటవీప్రాంతాల్లోకి తుపాకులతో వచ్చి అధికారులకు పట్టుబడ్డారు. గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం.. ఎవరైనా అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో సంచరిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నమోదైన కేసులు కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇకనుంచి అడవిలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. అనుమానితులను ఎవరినీ వదలిపెట్టం. –పద్మజారాణి, డీఎఫ్ఓ -
అరణ్యంలో వేటగాళ్లు!
మెదక్ జోన్: సమయం తెల్లవారు జామున 4 గంటలు.. చేతిలో సెర్చ్ లైట్లు, బైనాక్యులర్లతో నలుగురు యువకులు పోచారం అభయారణ్యం ప్రాంతంలో తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. డీఎఫ్ఓ పద్మజరాణి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు మంగళవారం మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం బూర్గుపల్లి శివారులోని పోచారం అభయారణ్యం వద్ద తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెర్చ్ లైట్లతో పాటు బైనాక్యులర్లను, బ్రీజా కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా దారితప్పి వచ్చినట్లు వారు చెబుతున్నారని తెలిపారు. కానీ వారి వద్ద సెర్చ్ లైట్లు ఉండటంతో అనుమానితులుగా కేసు నమోదు చేసి కోర్టుకు పంపనున్నామని పేర్కొన్నారు. వేటకోసమే వచ్చారా? పట్టుబడ్డ యువకుల వద్ద సెర్చ్లైట్లు బైనాక్యులర్లు చూస్తుంటే వారు వేట కోసమే వచ్చి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. అధునాతన సెర్చ్లైట్లు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతువులను నిలువరింపజేస్తుందని, బైనాక్యులర్లు సైతం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేనినైనా స్పష్టంగా చూడవచ్చునని పలువురు చెబుతున్నారు. గతంలో మెదక్, హవేళిఘణాపూర్, నర్సాపూర్ తదితర అడవుల్లో వేటగాళ్లు జింకలు, కొండ గొర్రెలు, ఏదులను వేటాడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అన్నీ అనుమానాలే.. పోచారం అటవీ ప్రాంతం వద్ద పట్టుబడ్డ నలుగురు యువకులను ఫారెస్ట్ అధికారులు మీడియా ముందు ప్రవేశ పెట్టకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వారి పేర్లను సైతం వెల్లడించకపోవడం చూస్తుంటే పట్టుబడ్డ వారు ప్రముఖుల పిల్లలుగా భావిస్తున్నారు. -
స్వార్థం వల.. వన్యప్రాణి విలవిల
అడవి అంటే.. పచ్చని చెట్లు.. గలగల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల సవళ్ల గుర్తుకు వస్తాయన్నది నాటి మాట. కనుమరుగైన చినుకు జాడ.. ఎండిన నీటివనరులు.. ఆగని వేట.. విద్యుదాఘాతాలు.. ప్రమాదాలతో వన్యప్రాణుల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. అడవి జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో జీవవైవిధ్యానికి ఎసరొస్తోంది. పలమనేరు: జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. రకరకాల కారణాలతో ఎప్పుడు దేని ప్రాణం పోతుందో తెలియదు. అరుదైన చిరుత పులులు సైతం ఇటీవల కాలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఇక మృత్యువాత పడుతున్న ఏనుగుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వన్యప్రాణులు, మృగాలకు సంబంధించి పటిష్టమైన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వన్యప్రాణి మనుగడ ప్రశ్నార్థకమైంది. జిల్లాలోని అడవుల్లో అమర్చిన ఉచ్చులు, నల్లమందు ఉండలు, నాటు తుపాకులతో ఆటోమేటిక్ ఫైరింగ్, అడవిని ఆనుకుని ఉన్న పొలాల్లో కరెంటు తీగలకు బలవుతూనే ఉన్నాయి. వన్య ప్రాణాలకు తప్పని ముప్పు కొన్నాళ్లుగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతోంది. కొందరు నిత్యం అడవిలో వేటే జీవనోపాధిగా మార్చుకున్నారు. దీంతో అడవుల్లో నాటు తుపాకుల మోత తగ్గడం లేదు. ఉరులు, నాటు బాంబులతో సైతం వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. అలాగే అటవీ శివారు ప్రాంతాల్లోని రైతులు అడవి జంతువుల బారి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి విద్యుత్ తీగలు అమర్చుతున్నారు. మేత, నీటి కోసం వస్తున్న వన్యప్రాణులు ఆ తీగలకు తగులుకుని మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రోజురోజుకీ వన్యప్రాణుల సంఖ్య క్షీణిస్తోంది. ఐదేళ్లలో 12 ఏనుగులు, మూడు చిరుతలు మృతి 2013 నుంచి 2017వ సంవత్సరం మధ్య కాలంలో పది ఏనుగులు నీటి దొనల్లో పడి, విద్యుత్ షాక్, వ్యవసాయ బావులు మృతి చెందాయి. గతేదాడి కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగులు విద్యుదాఘాతానికి బలయ్యాయి. ఇటీవల ఎర్రావారిపాళెం మండలం కోటకాడిపల్లె వద్ద ఓ ఏనుగు మృతి చెందింది. చిరుతల విషయానికొస్తే గత జనవరిలో బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లె అటవీ ప్రాంతంలో ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మృతి చెందింది. ఐరాల మండలం మల్లార్లపల్లె వద్ద ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చుకు చిక్కింది. దీన్ని జూకి తరలించగా మృతి చెందింది. తాజాగా కుప్పం సరిహద్దులోని క్రిష్ణగిరి వద్ద ఓ చిరుతను ఓ వ్యక్తి కత్తితో నరికి చంపేశాడు. ఇప్పటికైనా అటవీశాఖ తగుచర్యలు తీసుకోవాల్సి ఉంది. -
వన్యమృగాల అరణ్య రోదన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. అంతర్రాష్ట్ర వేటగాళ్లతో పాటు గ్రామాల్లోని స్థానికులు సైతం వన్యప్రాణాల ఉసురు తీస్తున్నారు. కుందేళ్లు మొదలుకొని అడవిపందులు, జింకలు, కొండగొర్రెలతో పాటు పులులు, చిరుతలను కూడా బతుకనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా విచిత్రం ఏంటంటే... చనిపోయిన పులు ల చర్మాలకు సైతం రక్షణ లేని పరిస్థితి పూర్వ ఆదిలాబాద్ అడవుల్లో నెలకొంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, అవి నీతి అక్రమాల కారణంగా అడవులు, అటవీ జంతువులు మనుగడ సాగించడమే ప్రశ్నార్థకమవుతోంది. సీసీ కెమెరా ల్లో ఎప్పుడో ఓ పులి కనిపించగానే హడావుడి చేయడం, ఆ పులి పేరుతో కేంద్రం నుంచి వచ్చే నిధులతో సంవత్సరాల పాటు గడపడం అటవీశాఖలో సర్వసాధారణమై పోయిం ది. కవ్వాల్ పులుల అభయారణ్యానికి పులులు రాకుండా పోవడాకి గల కారణాలను విశ్లేషించి, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారు. అదే సమయంలో కవ్వాల్‌తో పాటు ఆదిలాబాద్ పూర్వ జిల్లాలోని చెన్నూర్, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలో కి వచ్చిన పులులను కాపాడలేక, చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ పాత జిల్లా పరిధిలో ఎన్ని పులులు ఉన్నాయంటే నోరు వెళ్లబెట్టే పరిస్థితి. ఏడాదిలో ఓ పులి మరణం.. మరో పులి పిల్లకు ఉచ్చు 2016 డిసెంబర్ తొలివారంలో కోటపల్లి మండలం పిన్నా రం గ్రామంలో ఫాల్గుణ–2 అనే పులి వేటగాళ్ల ఉచ్చుకు బ లైంది. అడవిపందుల కోసం పొలం చుట్టు రైతు వేసుకున్న విద్యుత్ కంచెకు తగిలి ఆ పులి చనిపోయినట్లు అధికారులు తేల్చినా,దాని వెనుక వేటగాళ్ల ప్రమేయం ఉందనేది వాస్త వం. ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పెద్దగా పురోగతి కూడా లేదు. ఇది మరువక ముందే ఫాల్గుణ–1 అనే ఆడపులికి 2016లో జన్మించిన నాలుగు పిల్లల్లో ఒకటి (కె–4) చెన్నూర్ ప్రాంతానికి వచ్చింది. ఆరు నెలల క్రితం దీనిని వేటాడేందుకు వేటగాడు పెట్టిన ఉచ్చును తప్పించుకొని వచ్చిన కె–4కు ఇనుప తీగ ఒకటి శరీరానికి చుట్టుకుపోయింది. అది మెల్లమెల్లగా వెనుక కాళ్ల దగ్గర తుంటి ప్రాం తానికి వచ్చి ఆగింది. సుమారు రెండు సంవత్సరాల వయ స్సు వచ్చిన ఈ పులి తుంటి చుట్టూ ఇనుప ఉచ్చు అలాగే బిగుసుకుంటోంది. దీన్ని తొలగించాలంటే జాతీయ స్థాయిలో అనుమతి అవసరం. దాంతో ప్రాణాపాయ స్థితిలో పులి నీల్వాయి–చెన్నూర్ అడవుల్లోనే తిరుగుతోంది. తల్లి... మూడు పిల్లల జాడేది..? మహారాష్ట్ర నుంచి 2015లో కాగజ్‌నగర్ ప్రాంతానికి రెండు పులులు (ఫాల్గుణ–1, ఫాల్గుణ–2) రాగా, ఫాల్గుణ–2 కోటపల్లిలో పొలం చుట్టు నాటిన కరెంటు తీగలు తగిలి చనిపోయింది. ఫాల్గుణ–1 మాత్రం నాలుగు పిల్లలకు జన్మనివ్వగా, అందులో నాలుగవ పిల్ల కె–4 చెన్నూర్ ప్రాంతంలో తిరుగుతోంది. అంటే తల్లి ఫాల్గుణ–1, మిగతా మూడు పిల్లలు (కె–1, 2, 3) కాగజ్‌నగర్ రేంజ్‌లోనే ఉండాలి. కానీ వాటికి సంబంధించిన జాడలేవీ ఈ మధ్య కాలంలో కని పించలేదు. పులి పిల్లలు ఆరునెలల వయసు రాగానే తల్లి నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఒక పులి సంచరించే ప్రాం తానికి కనీసం 30 నుంచి 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో మరో పులి ఉండదు. ఈ నేపథ్యంలో ఈ తల్లి, మూడు పిల్లలు ఎక్కడ ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. కానీ కాగజ్‌నగర్ ప్రాంతంలో ఒక పులి మాత్రం సీసీ కెమెరా పుటేజీల్లో, కాలి గుర్తుల ద్వారా తేలింది. కుమరంభీం జిల్లా అటవీశాఖ అధికారి సైతం కాగజ్‌నగర్‌లో నాలుగు పులులున్నాయని ‘సాక్షి’కి తెలిపారు. కానీ ఈ పులులకు సంబంధించి గత కొంతకాలంగా ఎలాంటి గుర్తులు, ఆధారాలు గానీ కనిపిం చలేదు. పూర్వ ఆదిలాబాద్‌లోని కవ్వాల్‌లో ఒకటి, నీల్వా యి ప్రాంతంలో మరోటి, కాగజ్నగర్లోఒకటి చొప్పు న పులులున్నట్లు ఆధారాలుండగా, అధికారులు చెప్పే మిగతా ఏడు పులులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవు. సాంబార్ జింక బావిలో పడితే గోప్యత ఎందుకు? డిసెంబర్ 20న కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కుందేళ్ల కోసం వెంకటాపూర్ వెళ్లే దారిలో ఉర్లు పెడుతుండగా, అటవీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెపుతున్నారు. అయితే ఈ ఐదుగురు కుందేళ్ల కోసం కాకుండా జింకల కోసమే ఉర్లు పెట్టారని, ఓ జింక అందులో పడి చనిపోతే బెల్లంపల్లి ఎఫ్డీఓ కార్యాలయం ఆవరణలోనే పాతిపె ట్టారని ప్రచారం జరిగింది. దీనిని అటవీశాఖ అధికారులు ఖండించి ఉర్లు పెట్టిన ఐదుగురు వ్యక్తులను సోమవారం రిమాండ్‌కు పంపారు. డిసెంబర్ 20వ తేదీన సంఘటన జరిగితే, సర్పంచ్ భర్త గజానంద్, ఎంపీటీసీ భర్త మంగీలాల్ సంతకాలు తీసుకొని వారిని ఎందుకు వదిలేశారనే దానిపై అధికారుల వద్ద సమాధానం లేదు. ఊరి ప్రజాప్రతినిధులు చెప్పినందుకు వదిలేశామంటున్న అధికారులు విషయం ‘సాక్షి’లో వచ్చిన తరువాత అరెస్టు చూపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిని బట్టి ఎలాంటి వన్యప్రాణి విషయంలోనైనా అటవీశాఖ అధికారులు సానుభూతితోనే వ్యవహరిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీశాఖ రిమాండ్‌కు పంపించిన ఐదుగురిలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. పులి చర్మం మాయం కుమురం భీం జిల్లా బెజ్జూర్‌లోని ఫారెస్ట్ క్వార్టర్స్‌లో భద్రపర్చిన పులి చర్మం ఇటీవల మాయమైన సంఘటన అటవీ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2016 నవంబర్ 21న మ హారాష్ట్రకు చెందిన కొందరు పులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు అప్పటి బెజ్జూర్ ఎఫ్ఆర్వో మోహన్‌రావు మండలంలోని ఏటిగూడ గ్రామంలో పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితుల ను కోర్టులో హాజరుపర్చడంతో పాటు పులి చర్మాన్ని కోర్టు కు స్వాధీనం చేశారు. అయితే పులి చర్మాన్ని సేఫ్ కస్టడీ కింద ఉంచాలని కోర్టు అటవీశాఖ అధికారులకు సూచిం చింది. దీంతో ఆ చర్మాన్ని అప్పటి బెజ్జూర్ సెక్షన్ అధికారి వేణుగోపాల్‌కు అప్పగించగా, ఆయన బీట్ అధికారి రవీం దర్ సంరక్షణకు అప్పగించారు. రవీందర్ తాను నివాసం ఉంటున్న క్వార్టర్లోని ఓ గదిలో పులి చర్మాన్ని భద్రపర్చా రు. ఏడు నెలల క్రితం రవీందర్ సస్పెండ్ కాగా, నెలన్నర క్రితం వేణుగోపాల్ సైతం అవినీతి వ్యవహారంలో సస్పెం డయ్యారు. కొత్తగా సెక్షన్ అధికారిగా నియమితులైన శ్రావణ్‌కుమార్ పాత రికార్డులను పరిశీలిస్తూ పులి చర్మం భద్రపర్చిన విషయాన్ని గుర్తించారు. అయితే తాను పులి చర్మాన్ని చూసిన తర్వాతనే రికార్డులు స్వాధీనం చేసుకుంటానని అన్నారు. దీంతో అధికారులు డిసెంబర్ 18న గది తాళం ప గులగొట్టి చూడగా.. పులి చర్మం మాయమైన విషయం వెలుగులోకొచ్చింది. ఈకేసులో అనుమానంతో వేణుగోపా ల్, రవీందర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మాయమైన పులి చర్మం రూ.50లక్షల నుంచి రూ.కోటి విలువ చేస్తుం దని అధికారులు పేర్కొంటున్నారు. బెజ్జూర్‌లో పులి చర్మం మాయం కావడంతో గతేడాది కోటపల్లి అడవుల్లో మరణిం చిన పులిచర్మం ఎక్కడ ఉందనేది చర్చనీయాంశమైంది. -
ఆగని వేట
జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులు, మృగాలకురక్షణ కరువైంది. వేటగాళ్ల ఉచ్చులకు ఎప్పుడు దేని ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వన్యప్రాణులు జనారణ్యంలో రావడం కాదు.. జనమేఅడవుల్లోకి వెళుతూ వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. జిల్లాలోని పలు అడవుల్లో వన్యప్రాణుల కోసం అమర్చిన ఉచ్చులు, నల్లమందు ఉండలు,అడవిని ఆనుకొని ఉన్న పొలాల్లో కరెంటు తీగలు దర్శనమిస్తున్నాయి. మేతకోసం వెళ్లే మేకలు, పశువులు ఉచ్చులో పడి మృత్యువాత పడుతున్నాయి.పదేళ్లలో నాటు తుపాకుల కాల్పులు, నల్లమందు ఉండలకు బలైన వారు 25మంది పైమాటే.వందలాది పశువులు, మేకలు, కుక్కలు సైతం మృత్యువాత పడ్డాయి.–పలమనేరు అడవిలోకి వెళ్లాలంటే భయం భయం.. ⇔ నాలుగేళ్లలో 12 ఏనుగులు, రెండు చిరుతల మృతి ⇔ 2013 వికోట మండలం నాయకనేరి వద్ద మదపుటేనుగు దాడిలో ఆడ ఏనుగు చనిపోయింది. ⇔ 2013లోనే బైరెడ్డిపల్లె మండలం వెంగవారిపల్లెలో ఓ ఏనుగు మృతి చెందింది. అదే ఏడాది గున్న ఏనుగు మృతిచెందింది. ⇔ 2014లో పలమనేరు మండలం కాలువపల్లె వద్ద నీటిదొనలో పడిన గున్న ఏనుగును తిరుపతి జూకి తరలించగా మృతి చెందింది. ⇔ 2013లో రామకుప్పం మండలం నినియాల తాండాలో విద్యుత్‌షాక్‌కు గురై ఓ ఏనుగు మృతి చెందింది. ⇔ 2015లో రామకుప్పం మండలంలోమరో ఏనుగు మృతి చెందింది. ⇔ 2015లో ఆగస్టులో రామకుప్పం మండలంలో బావిలో పడిన గున్న ఏనుగును తిరుపతి జూకు తరలించగా చనిపోయింది. ⇔ 2015లో రామకుప్పం మండలం పల్లికుప్పం వద్ద ఓ ఏనుగు కరెంట్ షాక్‌తో మృతిచెందింది. ⇔ 2017లో కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగులు కరెంటు షాక్‌కు బలయ్యాయి. ⇔ తాజాగా ఎర్రావారిపాళ్యం మండలం కోటకాడిపల్లెవద్ద ఓ ఏనుగు మృతిచెందింది. ⇔ ఈ ఏడాది జనవరిలో బంగారుపాళ్యం మండలం పెరుమాళ్లపల్లె అటవీప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిరుత చిక్కుకుంది. ⇔ మూడు రోజుల క్రితం ఐరాలమండలం మల్లార్లపల్లి వద ⇔ వేటగాళ్ల ఉచ్చులో జింక పడింది. దీన్ని జూకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. శేషాచలంలో 1,700 రకాల జీవులు చిత్తూరు, కడప జిల్లాలో వ్యాపించి ఉన్న శేషాచలం అడవులు 4775 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. ఇందులో 178 జాతులకు చెందిన 1700 రకాల జీవులకు నిలయంగా ఉం ది. 178 రకాల పక్షులకు ఈ అడవి ఆవాసం. అలాగే కౌండిన్య అభయారణ్యంలోకి 1983లో తమిళనాడులోని అనెకల్, çహోసూర్, కర్ణాటకలోని మైసూరు, బన్నేరుగట్ట అడవుల నుంచి ఏనుగులు, ఇతర జంతువులు వచ్చి చేరాయి. అడవుల్లో లభించే వెదురు, ఇతర ఆకులు, బెరడు ఆహారంగా తీసుకుంటూ ఇక్కడి అడవుల్లోని చిన్న కుంట లు, చెరువుల్లో నీటిని తాగుతూ ఉంటున్నాయి. ప్రధానంగా కౌండి న్య, కైగల్, పాలారు నదులను ఆనుకుని వీటి జీవనం సాగుతోంది. వన్యప్రాణులకు నిలయం కౌండిన్య జిల్లాలోని పశ్చిమ భాగంలో కౌండిన్య అభయారణ్యం పలు వన్యప్రాణులకు నిలయంగా ఉంది. బంగారుపాళ్యం నుంచి పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల వరకు సుమారు 357 చదరపు కిలోమీటర్ల మేర ఈ అడవి వ్యాపించి ఉంది. ఈ అడవిలో 39 ఏనుగులు, ఏడు వేలకు పైగా జింకలు, ఎనిమిదివేల దుప్పులు, కణితలు, ఎలుగుబంట్లు, కొన్ని హైనాలు, చీటాలు ఉన్నా యి. అడవి గొర్రెలు, కుందేళ్లు, బావురు పిల్లులు, ఉడుములు, నక్కలు, నెమళ్లు, 40 రకాల క్షీరదాలు,160కి పైగా పలురకాల పక్షులు, అరుదైన కొంగలు, వంద రకాల సీతాకోక చిలుకలు, నక్షత్ర తాబేళ్లు, ఇతర కీటకాలతో పాటు మరికొన్ని జంతువులు ఉన్నాయి. జిల్లాలోని మధ్యప్రాంత అడవుల్లో భాగంగా ఉన్న పెద్ద ఉప్పరపల్లె, సోమల, తుంబకుప్పం, తుంబపాళ్యం అడవుల్లోనూ 300 రకాలకుపైగా వన్యప్రాణులున్నాయి. ఈ ప్రాంతంలో నాలుగు దాకా చీటాలున్నట్టు తెలుస్తోంది. పంథా మార్చిన వేటగాళ్లు అటవీప్రాంత గ్రామాల్లోని కొం దరు వేటగాళ్లు నిత్యం వేట కెళ్లడం జీవనోపాధిగా మార్చుకున్నారు. దీనిపై మూడేళ్ల కిందట దృష్టి సారించిన పోలీసులు పెద్ద సంఖ్యలో నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వేటగాళ్లు పంథా మార్చారు. పాత వేట పద్ధతులను ఎంచుకున్నారు. నాటు బాంబులను, నల్లమందు ఉండలను అడవిలో పెట్టి వస్తున్నారు. కమ్మీలు, వైర్లతో తయారు చేసిన ఉచ్చులు, ఉరులను పగటి పూట అడవిలో చెట్ల మధ్య అమర్చుతున్నారు. వాటిల్లో ఇరుక్కున్న జం తు వులను అక్కడే చంపి మాంసాన్ని తీస్చుకువస్తున్నారు. ఇది నిత్యం జరుగుతున్న సంఘటనే. నాటు తుపాకి ట్రిగ్గర్‌కు రబ్బర్ బ్యాండ్ కట్టి దానికి దారంతో పది అడగుల పొడవున రెండు అడుగుల ఎత్తులో కట్టడం, పొలాలకు రక్షణ పేరిట కరెంటు లాగడం తదితరాలను చేపడుతున్నారు. వీటితో పశువుల కాపరులు, కలపకోసం వెళ్లే కూలీలు సైతం చనిపోతున్నారు. పదేళ్లలో అడవుల్లోకెళ్లి నాటుతుపాకుల కాల్పులు, నల్లమందు ఉం డలకు బలైన వారు 25మందిపైమాటే. తాజాగా చిత్తూరు సమీపంలోని ఓ చెరుకుతోటలో ఏర్పాటు చేసిన కరెంటు తీగలకు ఇద్దరు బలైన విషయం తెలిసిందే. అటవీశాఖ చట్టం ప్రకారం విద్యుత్ తీగలను అడవులకు సమీప పొలాల్లో కంచెగా ఏర్పాటు చేయకూడదనే నిబంధలున్నాయి. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో జంతువులు, ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. 15.83 శాతం అడవులు జిల్లా భౌగోళిక అటవీ ప్రాతం 15,151 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఏడు ప్రాంతాల్లో మాత్రం అతి దట్టమైన అడవులు, 29 ప్రాంతాల్లో దట్టమైన అడవులున్నాయి. ఓపెన్ ఫారెస్ట్‌గా 1463 కిలోమీటర్లు, మిగిలినవి చిట్టడవులుగా వ్యాపించి ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో అడవులు 15.83 శాతం విస్తరించి ఉన్నాయి. -
ఈ చిత్రం అందరినీ కదిలించింది
దక్షిణాఫ్రికా: మనిషి తన స్వార్థం కోసం చేసే దారుణాలకు ప్రతీక.. ఇదిగో ఇక్కడ నెత్తురు కక్కుతూ.. నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ఖడ్గమృగం.. దక్షిణాఫ్రికాలో కొమ్ము కోసం ఓ ఖడ్గమృగాన్ని కొందరు వేటగాళ్లు కిరాతకంగా హతమార్చిన ఈ చిత్రం అందరినీ కదిలించింది. అందుకే ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రాన్ని బ్రెంట్ స్టిర్టన్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ఏటా ప్రదానం చేసే ఈ అవార్డు కోసం 92 దేశాల నుంచి దాదాపు 50 వేల ఎంట్రీలు రాగా.. ఇది మొదటి బహుమతిని గెలుచుకుంది. -
పెద్దపులే టార్గెట్
► నల్లమలలోకి హర్యానాకు చెందిన వేటగాళ్ల ముఠా ప్రవేశించినట్లు సమాచారం ► రెడ్ అలర్ట్ ప్రకటించిన అటవీశాఖ ► అడవిని జల్లెడ పడుతున్న అధికారులు ► అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గిరిజనులకు సూచన ఆత్మకూరు రూరల్(కర్నూలు): ప్రపంచంలో అంతరించి పోతున్న జాతిగా రెడ్ డాటా బుక్‌లో నమోదైన పెద్ద పులులకు అత్యంత సురక్షిత అభయారణ్యంగా నల్లమలకు పేరుంది. నల్లమలలోని నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యాలు పెద్దపులులు అత్యంత వేగంగా ప్రవర్ధనం చెందడానికి అనువైన ప్రదేశాలుగా దేశంలోనే గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతాల్లో సుమారుగా వంద పులులకు తక్కువ కాకుండా ఉండవచ్చని ఓ అంచనా. అంతా బాగుంది అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో వాటి భద్రతకు మళ్లీ ముప్పు ముంచుకొచ్చింది. హర్యానాకు చెందిన ముగ్గురితో కూడిన వేటగాళ్ల ముఠా పులులను వేటాడేందుకు నల్లమలలో ప్రవేశించినట్లు జాతీయ పులుల సంరక్షణ సాధికార సంస్థ (ఎన్టీసీఏ) నుంచి నల్లమలలోని నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ శర్వానంద్‌కు సమాచారమందింది. అలాగే వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు న్యూఢిల్లీ నుంచి కూడా ఇదే సమాచారం నల్లమల పరిధిలోని అటవీ అధికారులకు చేరింది. దీంతో అటవీ శాఖ నల్లమల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పులు వేటలో ఘనాపాఠీలు: నల్లమలలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న ముఠా సభ్యులు లక్ష్మీచాంద్, పప్పు, లీలావతిలు హర్యానా రాష్ట్రంలోని పంచకుర జిల్లాలో వేట ప్రధాన వృత్తిగా గల ఓ తెగకు చెందిన వారు. వీరు దేశంలోని పలు పెద్ద పులుల అభయారణ్యాలు నేషనల్ పార్కులలో వేటాడి చంపిన కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. అలవాటు నేర ప్రవృత్తి కలిగిన ఈ బృందం నల్లమల చేరుకుందన్న సమాచారం అటవీ శాఖ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక నిఘా మహానంది: నల్లమలలోకి పెద్ద పులల వేటగాళ్లు ప్రవేశించారనే సమాచారం మేరకు నల్లమల పరిధిలోని మహానంది, అహోబిలం, ఓంకారం, గుండ్ల బ్రహ్మేశ్వరం పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నంద్యాల డీఎఫ్ఓ శివప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఆయా పుణ్యక్షేత్రాల పరిధిలోని ప్రొటెక్షన్ వాచర్లు, సిబ్బందిని అలర్ట్ చేశామన్నారు. ఫారెస్ట్ రేంజర్లు, డివిజనల్ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంటు బీట్ ఆఫీసర్లు, ప్రొటెక్షన్ వాచర్లతో ప్రత్యేక టీములను కేటాయించామన్నారు. పగలు, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్లమల ఘాట్ రోడ్డు అయిన నంద్యాల–గిద్దలూరు దారిలో నిత్యం వాహనాల తనిఖీ చేపడతామన్నారు. అడవంతా గాలింపు నల్లమలలో పెద్దపులల వేటగాళ్లు ప్రవేశించారనే సమాచారంతో అటవీశాఖాధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. చెంచుగూడేల్లో, అటవి సమీప గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్ని బేస్‌క్యాంపుల సిబ్బంది సమన్వయంతో కాలినడకన అడవంతా జల్లెడ పడుతున్నారు. హిందీ మాట్లాడే ఉత్తర భారతదేశ వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారాన్ని తమకు తెలియజేయాలని ఆత్మకూరు అటవీ డివిజన్ ముఖ్య అధికారి సెల్వం ప్రకటించారు. 9440810058, 9493547206, 9493547207, 9493547221, 9493548832, 9493548825 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి వన్యప్రాణును కాపాడాలని కోరారు. గతంలోనూ ఉత్తరాది వేటగాళ్ల సంచారం నల్లమలలో పలుమార్లు ఉత్తర భారత దేశానికి చెందిన పులుల వేటగాళ్లు సంచరించారు. ఢిల్లీకి చెందిన రాణి సాహెబా అనే మహిళా వన్యప్రాణి స్మగ్లర్ తరఫున ఓ వేట గాళ్ల బృందం నల్లమలలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారులకు పట్టు బడింది. ఈ బృందంలోని వారు పగలు అటవీ సమీప గ్రామాల్లో బొమ్మలు, శాలువాలు, రగ్గులు అమమ్ముతూ తిరుగుతూ రాత్రి పూట అడవుల్లో ప్రవేశించి వన్యప్రాణులను వేటా డుతారు. పట్టు బడిన వేటగాళ్ల బృందం ఇచ్చిన సమాచారం మేరకు రాణి సాహెబాపై నాగలూటి రేంజ్ అధికారులు కేసు నమమోదు చేసి ఆమెను ఢీల్లీలో అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఆత్మకూరు అటవీ డివిజన్ వెలుగోడు రేంజ్‌లోని నార్త్ బీట్‌లో పులులను వేటాడేందుకు ఉపయోగించే ఇనుప ఉచ్చు(ఐరన్ ట్రాప్) గతంలో లభ్యమయింది. ఈ తరహా ఉచ్చులను హర్యానా వేటగాళ్లు వినియోగిస్తారని అధికారుల ద్వారా తెలుస్తోంది. -
పులి చర్మం కోసం రూ.10 లక్షల చెక్కు
- సంచిలో పులి చర్మం? - విదేశాలకు తరలిస్తున్నట్లు అనుమానం - ఛత్తీస్‌గఢ్ వ్యాపారి నుంచి కొనుగోలు - దుప్పుల వేట కేసులో కొత్త కోణం సాక్షి, భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దుప్పులవేట కేసులో మరో దారుణం చోటు చేసుకున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుప్పులను వేటాడిన నిందితులు విదేశాలకు తరలించేందుకు పులిచర్మాన్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యాపారి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు దాడి చేసిన తర్వాత చాకచ క్యంగా ఈ పులిచర్మాన్ని తప్పించినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో పక్కదారి పట్టిన పలు అంశాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గన్నీ బ్యాగులో పులి చర్మం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి వద్ద ఈ నెల 19న రాత్రి అటవీశాఖ అధికారులు దాడి చేయగా దుప్పులను వేటాడిన నిందితులు పారిపోయారు. సంఘటనా స్థలంలో టాటా ఇండికా విస్టా కారు, రెండు దుప్పు ల కళేబరాలు, ఖాళీ బ్యాంకు చెక్కు, ఫజల్ మహ్మద్ ఖాన్‌కు చెందిన ఆధార్‌కార్డు, కారు రిపేరు చేయిం చిన రసీదు, కత్తి, ఖురాన్ వంటి వస్తువులతోపాటు రూ.10 లక్షల విలువైన సంతకం చేసిన చెక్కు, ఫ్లైట్æ టికెట్, మొబైల్ ఫోన్లు లభించినట్లు తెలుస్తోంది. గ్రామస్తులందరూ చూస్తుండగానే టాటా ఇండికా విస్టా కారు నుంచి ఓ గన్నీ సంచిని ఏ–4 నిందితుడు అక్బర్‌ఖాన్ తీసినట్లు తెలు స్తోంది. ఈ సంచిలో ఏముందనే ప్రశ్న వారం రోజు లుగా అంతు చిక్కకుండా ఉంది. తాజాగా విశ్వసనీ య వర్గాల సమాచారం ప్రకారం ఈ గన్నీ సంచిలో పులిచర్మం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ జంతువైన పెద్దపులిని చంపడం, చర్మాన్ని, శరీరభాగాలతో వ్యాపారం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. అందువల్లే కేసును పక్కకు పెట్టినట్లు సందేహాలున్నాయి. మంథని కోర్టుకు ముగ్గురు వేటగాళ్లు మహదేవపూర్(మంథని): దుప్పులవేట కేసులో కరీంనగర్ జైలులో ఉన్న ముగ్గురు వేటగాళ్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకొని గురువారం మంథని కోర్టులో హాజరుపరిచారు. అక్బర్ ఖాన్ పరారీలో ఉండగా పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ వాసి షికారు సత్యం, మహదేవపూర్వాసి అస్రార్ ఖురేషీ, ఖరీముల్లాఖాన్లను పోలీసులు మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజ రుపర్చగా 13 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే. -
మొత్తం వేటగాళ్లు ఏడుగురు
మహదేవపూర్ దుప్పుల వేట ఘటన సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దుప్పుల వేటకు సంబంధించి మొత్తం ఏడుగురు వేటగాళ్లు ఉన్నట్లు పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన వ్యక్తులకు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో వేటాడ టం అలవాటని, వీరికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడం అక్బర్‌ఖాన్ పనని మహదేవ పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రభాను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటవీ జంతువుల ను వేటాడే అలవాటున్న మహదేవపూర్‌కు చెందిన అక్బర్‌ఖాన్ హైదరాబాద్, కరీంనగర్, మహదేవపూర్‌లకు చెందిన ఫజల్ అహ్మద్ ఖాన్, జలాల్, మున్నా మొజిన్, గట్టయ్య, మహమ్మద్ ఖలీమ్, మహమ్మద్ అస్రార్ ఖురేషీలను వేటకు ఆహ్వానించాడు. వీరితో పాటు సత్యనారాయణ అలియాస్ షికారి సత్తన్న, అతని బంధువులు కార్లలో మహదేవ పూర్ చేరుకున్నారు. అక్కడ మద్యం తాగి అందరూ కలసి కారులో వేటకు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు పలిమెల ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది టాటా ఇండికాను ఆపే ప్రయత్నం చేయగా ఆపకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత మహదేవపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ వాహనాన్ని ఆపగా దానిలో ఉన్నవారు ఫారెస్టు సిబ్బందిని బెదిరించి ఆ ప్రదేశం వదిలి వెళ్లిపోయారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలి పారు. ఈ కేసులో నిందితులైన నలువాల సత్యనారాయణ, మహమ్మద్ ఖలీమ్, అస్రార్ ఖురేషీలను ఇప్పటికీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. మంత్రుల ఒత్తిడి మాపై లేదు: విజిలెన్స్ మహాదేవపూర్: ‘దుప్పుల వేట ఘటనలో కేసు మాఫీ చేయాలంటూ మంత్రులెవ్వరూ మాపై ఒత్తిడి తేలేదు. వేటగాళ్లు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అటవీశాఖ విజి లెన్స్ అడిషినల్ పీసీసీఎఫ్వో స్వర్గం శ్రీనివాస్ స్పష్టం చేశారు. వన్యప్రాణుల వేటకు సంబం ధించి వాస్తవాలను పరిశీలించేందుకు ఆయన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌కు వచ్చారు. ఈ కేసులో విచార ణ వేగవంతం చేశామని చెప్పారు. పోలీసుల సహకారంతో ఇప్పటికే ముగ్గురు వేటగాళ్లను పట్టుకున్నామని, త్వరలోనే మిగతావారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. అనంతరం నిందితుల ఇళ్లు, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనా బాను ఇంటితోపాటు టీఆర్ఎస్ కార్యాలయం లో ఆయన సోదాలు నిర్వహించారు. వేటగాళ్లు ఉపయోగించిన ఇండికా కారును పరిశీలిం చారు. అంబట్‌పల్లిలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. -
మంత్రిగారి ఫోన్‌తో మారిన సీన్
♦ వేటగాళ్లను వదిలేయాలంటూ హుకుం ♦ తూచా పాటించిన అటవీశాఖ సిబ్బంది ♦ ఆయుధాలతో పారిపోయిన వేటగాళ్లు ♦ విచారణలో కనుమరుగవుతున్న వాస్తవాలు సాక్షి, భూపాలపల్లి: మహదేవపూర్ అడవుల్లో జరిగిన జింకల వేట కేసులో నిందితులను కాపాడటం వెనుక ఓ మంత్రి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి ఫోన్ కాల్‌తో మొత్తం సీన్ మారిపోయినట్లు సమాచారం. అసలు రాత్రి జరిగిన సంఘటనకు, తెల్లవారిన తర్వాత అధికారులు చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయాయి. రాష్ట్ర కేబినెట్లో ఓ ముఖ్య నేతకు చెందిన వ్యక్తులు 19న పలిమెల మండలం అడవుల్లో వేటాడేందుకు వచ్చినట్లు సమాచారం. పక్కా సమాచారంతో ఫారెస్టు అధికారులు దాడి చేశారు. అంబట్పల్లి వద్ద అధికార పార్టీకి చెందిన స్థానిక నేత ఇంట్లోని పశువుల కొట్టంలో దాక్కున్న వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో ఆదిలాబాద్ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఓ మంత్రి నుంచి సంఘటన స్థలంలో ఉన్న స్థానిక నేతకు ఫోన్ రాగానే.. అతను సదరు ఫోన్‌ను అటవీ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. మంత్రి ఏం చెప్పారో గానీ, క్షణాల్లో అటవీ అధికారుల వైఖరి మారిపోయింది. రెండు దుప్పుల కళేబరాలను విస్టా వాహనం డిక్కీలో బలవంతంగా కుక్కారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు కనిపించకుండా పోయాయి. ఈ క్రమంలో విస్టా వాహనం అక్కడే వదిలేసి, ఎర్ర జిప్సీలో వేటగాళ్లు దర్జాగా వెళ్లిపోయారు. ఫోన్‌కు ముందు హైడ్రామా ఫారెస్టు అధికారులు దాడి చేసిన విషయం తెలియగానే సర్వాయిపేటలో దావత్లో ఉన్న అధికార పార్టీకి చెందిన స్థానిక నేత క్షణాల్లో వచ్చేశాడు. వెంటనే ఈ ప్రాంతంలో టేకు దుంగల అక్రమ రవాణాలో ఆరితేరి ‘తూర్పు వీరప్పన్’గా పేరొందిన వ్యక్తికి ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన సదరు వ్యక్తి.. పట్టుకున్న వారిని విడిపించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ‘తమ వాహనాన్ని ఢీ కొట్టడంతో పాటు.. ఏకంగా తుపాకీ ఎక్కుపెట్టిన వారిని వదిలే ప్రసక్తి లేదం’టూ ఫారెస్టు అధికారులు తెగేసి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక నేతతో పాటు.. సదరు వ్యక్తి తమతో దగ్గరి సంబంధం ఉన్న ఓ శాసనసభ్యుడికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే నుంచి మంత్రికి ఫోన్ వెళ్లినట్లు సమాచారం. జింకల కళేబరాలకు పోస్టుమార్టం చేస్తున్న వైద్యులు (ఫైల్) గ్రామస్తుల సమక్షంలో.. రాత్రి పది గంటల సమయంలో ఫారెస్టు అధికారులు గ్రామంలోకి రావడంతో అంబట్పల్లి వాసులు మేల్కొన్నారు. అప్పటికీ ఎర్రజిప్సీ అంబట్పల్లిలో ఉంది. దుప్పుల కళేబరాలు నేలపై ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికంగా అధికార పార్టీకి చెందిన నేత రావడం, టేకు దుంగల స్మగ్లర్‌గా భావిస్తున్న వ్యక్తి ఫోన్, ఓ శాసన సభ్యుడి జోక్యం, చివరగా మంత్రి ఫోన్ ఆపై దుప్పుల కళేబరాలు ఇండికా డిక్కీలో ఎక్కించడం చకచకా జరిగిపోయాయి. సంఘటన జరిగి ఐదు రోజులు గడిచినా విచారణ నత్తనడకన సాగుతుండటం అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అదుపులో అనుమానితులు దుప్పుల వేటకు సంబంధించి స్థానికంగా సహకరించినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తుల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు అనుమానితుల ఫొటోలను మహదేవపూర్ రేంజర్ రమేశ్‌కు చూపించిన ట్లు తెలిసింది. వీటి ఆధారంగా ఆయన కొం దరు నిందితులను గుర్తించారు. వీటితో పా టు ఈ కేసులో అందరి నోటానానుతున్న ఎరుపు రంగు జిప్సీ వాహనంతో పాటు మిలిటరీ జీపుతో సంబంధం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసిం ది. మరోవైపు ఫారెస్టు శాఖ విజిలెన్స్ విభాగం సిబ్బంది ఆధార్ కార్డు ఆధారంగా హైదరాబాద్‌లోని ఫజల్ మహ్మద్‌ఖాన్ ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు సమాచారం. రిపోర్టుల్లో తకరారు.. దుప్పుల వేట కేసు విషయంలో పోలీసు, అటవీ శాఖ అధికారుల విచారణలో ప్రాథమిక అంశాలు వేర్వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా ఇండికా విస్టా వాహనంతో ఢీ కొట్టిన అనంతరం తుపాకీతో బెదిరించి వేటగాళ్లు పారిపోయినట్లు ఫారెస్టు అధికారులు పేర్కొంటున్నారు. టాటా ఇండికా విస్టా వాహనంలో రెండు దుప్పి కళేబరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫారెస్టు శాఖ నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత పోలీసులు అంబట్పల్లికి వెళ్లి గ్రామస్తులను విచారించి.. తొలుత నేలపై దుప్పి కళేబరాలు ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు దుప్పి కళేబరాలు ఉంచిన స్థలంలో మ్యాపింగ్ చేశారు. ఫారెస్టు శాఖ ప్రైమరీ అఫెన్స్ రిపోర్టులో ఫజల్ మహ్మద్ ఖాన్‌తో పాటు మరో నలుగురు వేటలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. -
సందు దొరికితే సంపుడే..!
మహదేవపూర్ అడవుల్లో జోరుగా వేట ⇒ హైదరాబాద్ నుంచి వస్తున్న బడాబాబులు ⇒ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న స్థానిక ముఠా ⇒ విదేశాలకు జంతు చర్మాలు ⇒ గోదావరి తీరంలో షూటింగ్ రాకెట్ సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీరం వణ్యప్రాణుల వేటకు నిలయంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన బడాబాబులు తమ మృగయానం దం తీర్చుకునేందుకు మహదేవపూర్ అడవుల్లోకి షికారుకు వస్తున్నారు. ఇక్కడ వేటాడిన జంతువుల మాంసంతో నగరంలో దావత్‌లు చేసుకుంటున్నారు. జంతు చర్మాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెండేళ్లుగా ఈ తంతు పకడ్బందీగా కొనసాగుతోంది. మహదేవపూర్ రేంజ్ పరిధిలో ఆదివారం(19న) రాత్రి ఫారెస్టు అధికారులు జరిపిన దాడిలో హైదరాబాద్‌కు చెంది న కారు, రెండు జింకల మృతదేహాలు లభిం చడంతో వేట ఇక్కడ సర్వసాధారణం అన్న అంశం తెరపైకి వచ్చింది. గతంలో ఉచ్చులు, కరెంటు తీగలు అమర్చడం ద్వారా అటవీ జంతువులను వేటాడేవారు. ఇలా వేటాడిన జంతువుల మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకునేవారు. కరెంటు తీగలు అమర్చడం వల్ల స్థానికులు మరణిస్తుండటంతో కొన్నేళ్లుగా కరెంటు తీగలు, ఉచ్చులతో వేటాడటం తగ్గుముఖం పడుతోంది. దీని స్థానంలోకి తుపాకులు, జిప్సీలు, బైనాక్యులర్స్ ఉపయోగిస్తూ వేటాడేవారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌లో హై–ఫై సర్కిళ్లకు వన్యప్రాణుల మాంసాన్ని సరఫరా చేసే ముఠాల సంచారం పెరిగింది. స్థానికంగా ఉండే వారు వీరికి సహకారిస్తూ ఒక రాకెట్‌గా ఏర్పడ్డారు. ఫలితంగా అడవి జంతువులు బలవుతున్నాయి. ముందస్తు సమాచారం మహదేవపూర్, పలిమెల మండలాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నాయి. ఈ రెండు మండలాల పరిధిలోనే ప్రాణహిత, ఇంద్రావతి నదులు గోదావరిలో కలుస్తున్నాయి. దట్టమైన అడవితో పాటు జంతువులు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ మావోయిస్టులు, పోలీసుల సంచారం ఎక్కువగా ఉంటుంది. మావోయిస్టులు, పోలీసుల కూంబింగ్‌లు జరగని రోజులను వేటగాళ్లు ఎంపిక చేసుకుంటున్నారు. వేటగాళ్ల ముఠాకు సహకరించేందుకు స్థానికంగా అధికార పార్టీకి చెందిన ఓ నేత ఆధ్వర్యంలో పదిహేను మందితో కూడిన ప్రత్యేక దళం పని చేస్తున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. పెద్ద బండ్లు కాళేశ్వరంలో దైవదర్శనానికి వచ్చే భక్తులు మినçహా మహదేవపూర్ మండలంలోకి పెద్ద పెద్ద కార్లు వచ్చే సందర్భాలు అరుదు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భం గా వాహనాల రాక పెరిగినా అనుమానాస్ప దంగా తిరిగే కార్ల సంఖ్య అధికమైనట్లు తెలుస్తోంది. మహదేవపూర్–పలిమెల మార్గంలోకి ఫార్చునర్, ఇన్నోవా వంటి కార్లు అకస్మాత్తుగా రావడం రోడ్డు పక్కన అడవుల్లో గంటల తరబడి పార్కింగ్ చేసి ఉండటాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అలాగే, వేటకు అనువుగా ఉండే జిప్సీ, టాప్‌లెస్ జీపుల వినియోగం ఇటీవల ఈ ప్రాంతంలో పెరగడం జంతువుల వేట జోరుగా సాగుతోందన్న సందేహాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. లక్షల్లో వ్యాపారం.. హైదరాబాద్‌లో జరిగే పలు పార్టీల్లో అడవి జంతువుల మాంసాన్ని ప్రత్యేక ఆకర్షణగా పేర్కొంటున్నారు. ఇలాంటి పార్టీలకు మాంసం చేరవేసేందుకు పక్కా నెట్‌వర్క్‌తో పనిచేస్తున్నారు. దీంతో మహదేవపూర్ అడవుల్లో వేట వ్యవహారం కనీస జీవనోపాధి దశ నుంచి కార్పొరేట్ స్థాయికి చేరుకుంది. వేటలో లభించిన జంతువును బట్టి రేటును నిర్ణయిస్తున్నారు. జింక మాంసాన్ని కేజీకి వేలల్లో అమ్ముతున్నట్లు సమాచారం. లేదా సగటున 25 కేజీలు ఉండే జింక, దుప్పి వంటి జంతువులను చర్మంతో సహా టోకుగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. జంతు చర్మాలను హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
మహదేవపూర్ అడవుల్లో జింకల వేట
-
ఉచ్చులో చిక్కిన ఎలుగు బంటి మృతి
రామయ్యకుంట బేస్‌క్యాంప్(ఆత్మకూరురూరల్): ఆత్మకూరు అటవీ డివిజన్ బైర్లూటీ రేంజ్ పీఏపురం నార్త్‌బీట్‌లోని గోగుల గుండం వద్ద శనివారం వేటగాళ్ల ఉచ్చు నుంచి క్షేమంగా బయట పడిన ఎలుగు బంటి ఆదివారం మరణించింది. అటవీ అధికారులు ఉచ్చు నుంచి తప్పించిన ఎలుగుబంటిని రామయ్య బేస్‌క్యాంప్‌నకు తరలించారు. అక్కడే దానికి చికిత్స చేశారు. రాత్రంతా పర్యవేక్షిస్తూ ఆహారాన్ని అందించారు. కాగా షాక్‌కు గురైన ఎలుగుబంటి తేరుకోలేక మృతి చెందింది. ఏసీఎఫ్ సాయిబాబా, బైర్లూటీ రేంజర్ శంకరయ్య పర్యవేక్షణలో బేస్ క్యాంప్‌లోనే పోస్టుమార్టం నిర్వహించి, కళేబరాన్ని దహనం చేశారు. -
వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి
పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ అధికారులు కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాతపడింది. వన్యప్రాణులను హతమార్చేందుకు అమర్చిన తీగకు తగిలి పులి ప్రాణాలు కోల్పోరుుంది. దీన్ని గుర్తించిన వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా దానిని అడవిలోనే ఖననం చేశారు. చెన్నూర్ రేంజ్ పరిధి కోటపల్లి మండలంలోని పిన్నారం, ఎడగట్ట అటవీ ప్రాంతంలో పులిని హత్య చేసి పూడ్చి పెట్టారని శుక్రవారం అజ్ఞాత వ్యక్తి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పిన్నారం, ఎడగట్టల మధ్యలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పిన్నారం అటవీ సమీపంలోని లోయలో పులిని చంపి పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. పూడ్చిపెట్టిన పులి కళేబరాన్ని బయటికి తీశారు. అక్కడే పంచనామా చేసి, మళ్లీ ఖననం చేశారు. కాగా, ఈ పులి వారం రోజుల క్రితమే వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి మృతి చెందింది. పులికి సంబంధించి ఎలాంటి అవయవాలను వేటగాళ్లు తీసుకెళ్లలేదు. ఇదిలా ఉంటే.. గత నెల 17న మండలంలోని పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కింది ఈ పులేనని.. పులిని హతమార్చిన వ్యక్తులను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని ఫారెస్ట్ డివిజనల్ అధికారి తిరుమల్‌రావు తెలిపారు. -
వేటగాడి చేతికి చిక్కి..
► ఎక్కడ నుంచో వలస వచ్చి ఇక్కడ ►ప్రాణాలు కోల్పోతున్న విదేశీ పక్షులు ► అతిథి విహంగాలకు కనీస రక్షణ ►కరువవుతున్న వైనం కాశీబుగ్గ : ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన విదేశీ విహంగాలు వేటగాళ్లకు బలైపోతున్నా రుు. అతిథి విహంగాల విషయంలో కొన్ని ప్రాంతాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే పలాస-కాశీబుగ్గలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్ర దర్శిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంతరకుడ్డ చెరువులో సైబీరియా దేశానికి చెం దిన విదేశీ పక్షులు (రత్తకన్న) వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారుు. విచక్షణారహితంగా వాటి ని చంపి సంచుల్లో వేసుకుని దర్జాగా వెళ్లిపోతున్నా అడిగే వారు లేకపోయారు. చెరువుల్లో పంటపొలాల్లో మాటువేసి దొరికిన గువ్వపిట్టను పాదంతో తొక్కిపట్టి చంపుతున్న వైన సా క్షి కెమేరాకు చిక్కింది. దీన్ని చూసిన స్థానికులు చింతాడ మాధవరావు, పైల చిట్టి, ప్రతాప్‌కుమార్‌లు పక్షిని పరిశీలించి వారిని మందలిం చారు. వారంతా దీన్ని రత్తకన్న పక్షిగా గుర్తిం చారు. అప్పటికే వేటగాళ్లు నాలుగు గువ్వపిట్టల పీక నులిపి చంపారు. టెక్కలి మండలం తేలి నీలాపురం ప్రసిద్ధ విదేశీపక్షులు కేంద్రం నుంచి ఆహారం కోసం సముద్ర తీరం గుండా కొన్ని వివిధ ప్రాంతాలకు వస్తుంటారుు. ఇప్పుడిప్పుడే పలాస, పూండి వంటి ప్రాంతాలకు చల్లని వాతావరణం కోసం వలస వస్తున్నారుు. ఈ పరిస్థితి గమనించిన వేటగాళ్లు వీటిని వేటాడి చంపేస్తున్నారు. వీరు పలాసలోనే నివాసముం టున్నట్లు సమాచారం. పూర్తిగా తుప్పు పట్టిన, గుర్తింపులేని ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. పక్షుల వేటనే వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న ఈ కుటుంబాలు ప్రతి నెలరోజులకు ప్రాంతాలు మారుతుంటారు. ఇకనైనా అధికారులు స్పందించి పక్షులను కాపాడాలని, పక్షిజాతిని కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు. -
వేటగాళ్ల బారిన పడిన జింక
మోతుగూడెం : వేటగాళ్ల బాణాల దాడికి తీవ్రంగా గాయపడిన ఓ జింక అడవి నుంచి తప్పించుకుని వచ్చి మోతుగూడెంలోని ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వణుకుతూ, తీవ్ర గాయాలతో ఉన్న జింకను ఆ ఇంటి యాజమాని పి.దేముడు స్థానికుల సహకారంతో లక్కవరం అటవీ రేంజర్ ఉషారాణికి అప్పగించారు. ఆమె తక్షణ వైద్యం కోసం ఆ జింకను చింతూరు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. -
ముగ్గురు వన్యప్రాణి వేటగాళ్ల అరెస్ట్
సైదాపూర్ : వన్యప్రాణులను వేటాడేందుకు నాటు బాంబులు తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు శనివారం సాయంత్రం పట్టుకున్నారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఆకునూర్ గ్రామానికి చెందిన బాషవేని కొమురయ్య, తూటి సమ్మయ్య, బాషవేని రాజయ్య కొన్నిరోజులుగా వన్యప్రాణులను నాటు బాంబులతో వేటాడుతున్నారు. వీరికి హన్మకొండకు చెందిన సురేందర్ నాటు బాంబులు సరఫరా చేస్తున్నాడు. శనివారం జంతువుల రక్తం పూసిన నాటుబాంబులు తీసుకుని ద్విచక్రవాహనంపై ఎగ్లాస్పూర్ గుట్టల్లోకి బయల్దేరారు. సోమారం చౌరస్తా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వీరిని ఆపి తనిఖీ చేశారు. నాటు బాంబులు దొరకడంతో అదుపులోకి తీసుకున్నట్లు ఎసై ్స రవి తెలిపారు. నిందితుల నుంచి 42 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బాషవేని కొమురయ్య, తూటి సమ్మయ్య, బాషవేని రాజయ్యతోపాటు నాటు బాంబులు సరఫరా చేసిన సురేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎసై ్స చెప్పారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
వేటగాళ్ల కోసం ముమ్మరంగా గాలింపు
వెల్దుర్తి: జింకలను వేటాడి అతి క్రూరంగా చంపిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నామని డీఎఫ్ఓ శ్రీధర్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో పలువురిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22న ఉదయం ఆటోలో వేటగాళ్లు జింకలను చంపి తీసుకెళ్తుండగా శెట్టిపల్లి వద్ద వీఎస్ఎస్ బాలయ్య గమనించి పట్టుకున్నాడని తెలిపారు. విషయం మా దృష్టికి తేగా తమ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి అడవిలోనే ఖననం చేశారన్నారు. ఒక మగ జింక, ఆడ జింకలకు పొట్టలు, గొంతులు కోశారని , రెండు పిల్ల జింకలకు సైతం గొంతులు కోశారని తెలిపారు. అనుమానితులైన ఇద్దరు తమ అదుపులో ఉన్నారని, జింకలను సరఫరా చేసే ఆటోను సీజ్ చేశామన్నారు. ఇదిలా ఉండగా గ్రామస్తులతోపాటు బాలయ్య మాట్లాడుతూ హైదరాబాద్ నుండి పిస్తోల్ కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రతి శనివారం సాయంత్రం సమయంలో శెట్టిపల్లి అడవిలోకి వచ్చి జంతువులను వేటాడుతుంటాడని డీఎఫ్‌ఓకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణ చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది అడవి జంతువులు వివిధ రకాల పంటలను ధ్వంసం చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 10.50 లక్షలను రైతులకు పంట నష్ట పరిహారంగా అందచేశామన్నారు. పంటలు ధ్వంసమైతే 24 గంటలలోపు రైతులు తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎకరాకు పంటను బట్టి రూ. 6 నుండి రూ. 10వేల వరకు నష్ట పరిహారం అందజేస్తామన్నారు. ఆయన వెంట వైల్డ్‌లైఫ్ పోచారం అభయారణ్యం రేంజ్ అధికారి భర్నోబా, సిబ్బంది ఉన్నారు. -
మాంసం వదిలి పరార్..
ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ఖానాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా జంతువులను వేటాడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు దుప్పులు, ఒక మనుబోతు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వస్తున్నారని గుర్తించిన వేటగాళ్లు.. మాంసంతో పాటు, వేటాడానికి వినియోగించిన పరికరాలను అక్కడే వదిలి పరారయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
వేటగాళ్ల తూటాకు జింక బలి
నిజామాబాద్ జిల్లా రెంజల్లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇద్దరు వేటగాళ్ల అరెస్టు
నాటు తుపాకులతో అటవి జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డుబండ ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. -
వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణి మృతి
వేటగాళ్ల ఉచ్చుకు ఒక దుప్పి, నాలుగు గేదెలు మృత్యువాడపడ్డాయి. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఎర్రగుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలలో ఉచ్చు పెట్టారు. వాటికి చిక్కుకుని దుప్పి, నాలుగు గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
వేటగాళ్లు అరెస్ట్: నాటు తుపాకి స్వాధీనం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని మామడ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంతువులను వేటాడుతున్న ఆరుగురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాటు తుపాకి,జీపు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ఐదువేల సంవత్సరాలు కలిసి బతికారు
టోక్యో: గత చరిత్ర మొత్తం కూడా సంఘర్షణలతో నిండుకొని రక్తపు సిరాతో రాయబడిందని చెప్తుంటారు. బలంకలవాడు బలహీనుడిని చిత్రహింసలు పెట్టి పెత్తనం చెలాయిస్తూ తన కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే వ్యవస్థగా తయారుచేసుకున్నాడని కూడా చెప్తారు. ఈ క్రమంలోనే సమాజ నిర్మాణంలో, సంస్కృతి, సంప్రదాయాల్లో విభిన్న మార్పులు రావడం జరిగిందని, సమాజాల విచ్ఛిన్నతకు ప్రధాన కారణం యుద్ధాలవంటి ఘర్షణలే అని చెప్తారు. కానీ, ఒక్కసారి జపాన్‌లో క్రీస్తు పూర్వం కిందటి చరిత్ర చూస్తే మాత్రం పై విషయాలకు పూర్తి భిన్నం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేటగాళ్లంతా కూడా ఒకే సమాజంగా రూపొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదువేల సంవత్సరాలపాటు కలిసి కట్టుగా జీవించారని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. జపాన్‌కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం 14,500 నుంచి క్రీస్తు పూర్వం 300 వరకు ఉన్న చరిత్రను పరిశీలించారు. అందులో భాగంగా ఆ మధ్య కాలంలో జీవించి చనిపోయినవారి అవశేషాలను పరిశీలించారు. ఇందులో ముఖ్యంగా వారి ఎముకలపై ప్రశ్నలు జరపగా ఏ ఒక్కరికీ కూడా గాయాలు అయినట్లు బయటపడలేదు. ఇలా దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలంలో లభించిన ఎముకలను పరిశీలించగా ఇలాంటి ఆధారాలే కనిపించాయి. ఆటవిక జీవితాన్ని అనుభవిస్తూ వేటపై ఆధారపడి జీవించే అప్పటి వారే ఎలాంటి ఘర్షణలకు దిగకుండా హాయిగా బతికేశారని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు అప్పట్లోనే సమాజ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వారు జీవించారని కూడా చెప్తున్నారు. -
వేటగాళ్ల విద్యుత్ తీగలకు చిరుత బలి
వై.రామవరం: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం యార్లగడ్డ గ్రామ శివారులోని గురమంద అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యు త్ తీగలకు ఓ చిరుతపులి బలైంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చిం ది. వేటగాళ్లు చిరుత కాలి గోళ్ల కోసం పంజాల వరకూ నరికి పట్టుకుపోరుు, కళేబరాన్ని అక్కడే వదిలిపెట్టారు. చనిపోరుున చిరుత వయసు పదేళ్లు ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. -
నలుగురు వేటగాళ్లు అరెస్టు
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో అటవీ పక్షులను వేటాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 100 పక్షులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దేముల్లో అర్ధరాత్రి హైటెన్షన్
పెద్దేముల్: మండల పరిధిలోని తొర్మామిడి చౌరాస్తా వద్ద సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేట కోసం వచ్చిన నలుగురు వ్యక్తులు కాల్పులు జరపడంతో పోలీసులు అలర్టైపెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులను చూసిన వేటగాళ్లు బైక్‌పై పారిపోయే ప్రయత్నంలో బండరాయిని ఢీకొట్టారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు.. పెద్దేముల్ మండలం హన్మాపూర్ సర్పంచు లొంక నర్సిములు సోమవారం సాయంత్రం తాండూరుకు వచ్చి రాత్రి 10:30 గంటలకు తిరిగి గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పెద్దేముల్-తొర్మామిడి చౌరస్తా వద్దకు రాగానే ఆయన బైక్ పంక్చర్ అయింది. దీంతో దాన్ని నెట్టుకుంటూ వస్తున్న నర్సింలు తనను నలుగురు వ్యక్తులు వెంబడిస్తున్నట్లు గమనించాడు. దీంతో గ్రామస్తులకు, పెద్దేముల్ ఎస్ఐ రమేష్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అంతలోనే ఆ నలుగురు వ్యక్తులు గొట్లపల్లి శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు అనుమానంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకుగురైన పెద్దేముల్ ఎస్ఐ వెంటనే తాండూరు డీఎస్పీ, రూరల్ సీఐలకు సమాచారం ఇచ్చాడు. దీంతో మరికొంత మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం 30 మంది పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. తప్పించుకోబోయి ఢీకొట్టారు గాలింపులో దుండగుల ఆచూకీ తెలియకపోవడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చౌరస్తా వద్ద పోలీసులు పికెటింగ్ వేశారు. ఇంతలోనే కొద్ది దూరం నుంచి నలుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై రావడాన్ని గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే దుండగులు ఆ బైక్‌ను ఆపకుండా అలాగే వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు బైక్‌ను వెంబడించారు. గొట్లపల్లి గేటు సమీపంలో వేగంగా వెళుతున్న బైక్ పెద్ద బండరాయికి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరు అక్కడినుంచి పరారయ్యారు. కాల్పులు జరిపింది వీరే.. అంతకుముందు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి, కాల్పులు జరిపింది తామేనని గాయపడిన ఇద్దరు చెప్పినట్లు తెలిసింది. చనిపోయిన వ్యక్తి పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండాకు చెందిన రమేష్(29) అని గాయపడ్డ ఇద్దరు బద్రు, వినోద్లని పోలీసులు గుర్తించారు. రమేష్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హైదరాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. మంగళవారం ఉదయం జిల్లా అదనపు ఎస్పీ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మందుగుండు స్వాధీనం తాండూరు రూరల్: ఈ నలుగురు అటవీ ప్రాంతంలో నెమళ్లు, కుందేళ్ల వేటకు వచ్చారా లేక దారి దోపిడీకి వచ్చారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ షెక్ ఇస్మాయిల్ తెలిపారు. సంఘటన స్థలం నుంచి రెండు టార్చిలైట్లు, కొంత మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
అడవి జంతువులపై వేటగాళ్ల కన్ను
బాన్సువాడ, న్యూస్‌లైన్ : అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వేటగాళ్లకు ఊతమిస్తోంది. అధికారుల పర్యవేక్షణ, ని ఘాలోపం కారణంగా బాన్సువాడ ప్రాంతంలో ని దట్టమైన అడవుల్లో వేటగాళ్లు మూగజీవుల ను సంహరిస్తున్నారు. హైదరాబాద్, మెదక్ జి ల్లాల నుంచి వస్తున్న వేటగాళ్లు యథేచ్ఛగా జం తువులను వేటాడుతున్నట్లు తెలుస్తోంది. వీరికి అటవీశాఖ అధికారులు సైతం సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం గ తంలో జరిగిన సంఘటనలే. ప్రస్తుతం ఎండ ప్రతాపం చూపుతుండడంతో అటవీ జంతువు లు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో వేట గాళ్లు అటవీ జంతువులను వేటాడుతున్నారు. అంతరిస్తున్న అడవులు... బాన్సువాడ అటవీశాఖ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, గాంధారి, పిట్లం, నిజాంసాగర్, వర్ని, సదాశివనగర్ మండలాల్లో గతంలో దట్టమైన అడవులు విస్తరించి ఉండేవి. ఈ అడవులు 15 ఏళ్ల క్రితం వరకు మావోయిస్టులకు అడ్డాగానూ ఉండేవి. మావోయిస్టులు ఈ అడవుల్లోనే ఆశ్రయం పొందుతూ తమ కార్యకలాపాలను కొనసాగించే వారు. జిల్లాలోనే బాన్సువాడ ఆటవీ ప్రాంతానికి ఎంతో గుర్తింపు ఉండేది. ఈ అడవుల్లో ఉండే వివిధ రకాల జంతువులు కనువిందు చేసేవి. బడాపహాడ్ ప్రాంతంలో ఉండే నెమళ్లు, జింకలను చూసేందుకు హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేకంగా పర్యాటకులు వచ్చేవారు. అప్పట్లో జంతువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఆటవీశాఖలో బీట్ ఆఫీసర్లను నియమించి వాటిని సంరక్షించే బాధ్యతలను అప్పగించారు. కొందరు అక్రమార్కుల కన్ను బాన్సువాడ ప్రాంతంలోని అటవీ ప్రాంతంపై పడడంతో ఆ తర్వాత అడవులు నరికివేతకు గురయ్యాయి. కలప స్మగ్లర్లు అర్ధరాత్రి వేళ బడాపహాడ్, జలాల్పూర్, గాంధారి, మొండి సడక్, చిల్లర్గి తదితర ఆటవీ ప్రాంతాల్లో ఉన్న కలపను యథేచ్చగా నరికి వేస్తూ జిల్లాకేంద్రానికి తరలించేవారు. వీరికి అటవీ శాఖ అధికారులు సైతం వత్తాసు పలకడంతో 1998 నుంచి 2002 వరకు వేలాది హెక్టార్లలో చెట్లు నరికివేతకు గురయ్యాయి. అడ్డుతగిలిన గ్రామస్తులపై దాడులు సైతం జరిగాయి. దీంతో దట్టమైన అడవి కాస్త చిట్టడివిగా మారింది.