
దక్షిణాఫ్రికా: మనిషి తన స్వార్థం కోసం చేసే దారుణాలకు ప్రతీక.. ఇదిగో ఇక్కడ నెత్తురు కక్కుతూ.. నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ఖడ్గమృగం.. దక్షిణాఫ్రికాలో కొమ్ము కోసం ఓ ఖడ్గమృగాన్ని కొందరు వేటగాళ్లు కిరాతకంగా హతమార్చిన ఈ చిత్రం అందరినీ కదిలించింది. అందుకే ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రాన్ని బ్రెంట్ స్టిర్టన్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ఏటా ప్రదానం చేసే ఈ అవార్డు కోసం 92 దేశాల నుంచి దాదాపు 50 వేల ఎంట్రీలు రాగా.. ఇది మొదటి బహుమతిని గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment