Rhinoceros
-
ఆ ఖడ్గమృగం ఇప్పుడు ఎలా ఉంది?.. వీడియో షేర్ చేసిన సీఎం
డిస్పూర్: రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కును ఓ ఖడ్గమృగం ఢీకొట్టిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. లారీని ఢీకొట్టిన ఆ రైనో పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్లింది. ఈ సంఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద జరిగింది. అయితే, ఇప్పుడు ఆ ఖడ్గమృగం ఎలా ఉంది? గాయాలై ఇబ్బందులు పడుతోందా? అనే విషయంపై ఆందోళనలు నెలకొన్నాయి. లారీని ఢీకొట్టిన ఖడ్గమృగం పరిస్థితిపై వీడియోను ట్విటర్లో షేర్ చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ‘అర్జెంట్ అప్డేట్.. హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మన రైనో ఫ్రెండ్ ఆరోగ్యంగానే ఉంది. ఈ ఉదయం డ్రోన్ ద్వారా తీసిన వీడియోను షేర్ చేస్తున్నా. జంతువుల పట్ల ప్రతి ఒక్కరు ప్రేమగా ఉండాలని కోరుతున్నా. జంతువులు రోడ్డు దాటే కారిడార్ల వద్ద కాస్త నెమ్మెదిగా వెళ్లండి’ అని పేర్కొన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అంతకు ముందు జాతీయ రహదారి 37పై జరిగిన ఈ ప్రమాదం వీడియోను షేర్ చేస్తూ.. ఇలాంటి ప్రమాదలు నివారించేందుకు కారిడార్లను విస్తరిస్తున్నట్లు చెప్పారు. An urgent update: Our Rhino friend, who met with an accident in Haldibari recently, is found to be doing good. I am sharing a drone video taken this morning. Urge all to be kind to our animals. Go slow while passing through corridors, where you know some animals might cross. pic.twitter.com/utgKwhUPXh — Himanta Biswa Sarma (@himantabiswa) October 11, 2022 ఇదీ చదవండి: భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్‌కి ఊహించని షాక్ -
హఠాత్తుగా రోడ్డుపై ఖడ్గమృగం ప్రత్యక్షం.. జనం హడల్!
ఖడ్గమృగం భారీ ఆకారంతో ముందు పెద్ద కొమ్ముతో ఉంటుంది. దానిని ‘జూ’లో దూరం నుంచి చూస్తేనే మీదికొచ్చేస్తుందమోనని భయం వేస్తుంది. అలాంటిది జనావాసంలో రహదారిపై హఠాత్తుగా ప్రత్యక్షమైతే ఇంకేమన్నా ఉందా? భయంతో పరుగులు పెట్టాల్సిందే. అలాంటి ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద. వీడియోలో.. రోడ్డుపై భారీ ఖడ్గమృగం వేగంగా పరుగెడుతోంది. దానిని చూసిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. రోడ్డు నిర్మానుష్యంగా మారటంతో దర్జాగా వెళ్లిపోయింది. అయితే.. ఈ వీడియో ఎక్కడిదనేది తెలియరాలేదు. ‘మనుషులు ఖడ్గమృగం స్థావరంలోకి వెళ్లినప్పుడు.. ఒక రైనో నగరంలోకి రావటం సరైనదే. దానిని గందరగోళానికి గురిచేయవద్దు.’ అని రాసుకొచ్చారు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ట్విట్టర్లో 70వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఖడ్గమృగం రక్షణపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత ఏం జరిగిందిని వాకాబు చేశారు. నందా మాటలతో ఏకీభవించిన కొందరు అడవుల్లో నిర్మాణాలకు అనుమతులపై నిషేధం విధించాలని కోరారు. When the human settlement strays into a rhino habitat… Don’t confuse with Rhino straying in to a town pic.twitter.com/R6cy3TlGv1 — Susanta Nanda IFS (@susantananda3) August 5, 2022 ఇదీ చదవండి: కుక్క కోసం భారీ కొండ చిలువతో చిన్నారుల పోరాటం -
వైరల్: ఈ ఖడ్గమృగం చాలా స్పెషల్! బర్త్‌డేకి ఏం చేసిందో తెలుసా?
వాషింగ్టన్: మనుషులు పుట్టిన రోజు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే జంతుప్రేమికులు కొన్నిసార్లు తమ పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు చేస్తుంటారు. అయితే తాజాగా డెన్వర్ జూలో ఒక ఖడ్గమృగం తన పుట్టినరోజున తనే స్వయంగా కీబోర్డ్‌ను ప్లే చేసింది. జూలోని బంధు అనే ఖడ్గమృగానికి 12 సంవత్సరాలు నిండాయి. దాంతో బంధుకు పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 18 వేల మంది వీక్షించగా..వందల మంది లైక్ కొట్టారు. "మా జూలో ఉండే కొమ్ము గల మగ ఖడ్గమృగానికి ఈ రోజుతో 12 ఏళ్లు నిండాయి. ఇది తన పుట్టినరోజు. అయితే బంధు స్వయంగా తాను రాసిన ఒక ప్రత్యేక పాటతో మీ అందరికీ చికిత్స చేయాలనుకున్నాడు. తన పుట్టినరోజున మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరిచేందుకు అనేక మార్గాలలో ట్యూన్ కంపోజ్ చేయడానికి అతని ప్రిహెన్సిల్ పెదవిని ఉపయోగించాడు." అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా, దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "పుట్టినరోజు శుభాకాంక్షలు బంధు! అవును! ఆ పెద్ద పిల్లవాడిని ప్రేమించండి! " అంటూ కామెంట్ చేశాడు. "జంతువులకు నాకన్నా ఎక్కువ ప్రతిభ ఉంది" అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Denver Zoo (@denverzoo) (చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!) -
రనౌట్ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో చెపాక్ వేదికగా ఆర్సీబీతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓపెనర్ క్రిస్ లిన్‌తో జరిగిన మిస్ కమ్యునికేషన్ వల్ల రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్ ఒక విషయంలో మాత్రం అభిమానులు, నెటిజనల మనసులు గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆడేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో గ్రౌండ్‌లోని కొన్ని కెమెరా యాంగిల్స్ రోహిత్ శర్మ షూపై పడ్డాయి. రోహిత్ వేసుకున్న షూపై ''సేవ్ ది రైనోస్'' అని రాసి ఉంది. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ తన ట్విటర్లో దీనిపై స్పందించాడు. ''నేను నిన్న మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆట కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. క్రికెట్ ఆడడం అనేది నాకు డ్రీమ్.. దానిని నెరవేర్చుకున్నా.. కానీ ప్రకృతిని కాపాడలనేది మన బాధ్యత.. అందరం కలిసికట్టుగా పోరాడితే కచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. విషయం ఏంటంటే.. మన దేశంలో ఇండియన్ రైనోలు అంతరించే స్థితికి చేరుకున్నాయి.. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనది.. అందుకే నా షూపై అలా రాసుకున్నా. అంటూ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ ఇచ్చిన అవగాహన నెటిజన్లు మనసు దోచుకుంది. మ్యాచ్‌లో రనౌట్ అయితే అయ్యావు.. కానీ మా మనసులు గెలిచావ్ రోహిత్'' అంటూ కామెంట్లు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ 48, మ్యాక్స్‌వెల్ 39, కోహ్లి 33 పరుగులతో రాణించారు. చదవండి: గతేడాది ఒక్క సిక్స్ కొట్టలేదు.. ఈసారి రిపీట్ అవ్వొద్దనే ఇదేం కోడ్ నాయనా.. ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేసిన జాఫర్ Yesterday when I walked on to the field it was more than just a game for me. Playing cricket is my dream and helping make this world a better place is a cause we all need to work towards. (1/2) pic.twitter.com/fM22VolbYq — Rohit Sharma (@ImRo45) April 10, 2021 -
బెదరగొట్టిన ఖడ్గమృగం!
-
రూల్స్ బ్రేక్ : వ్యక్తిని బెదరగొట్టిన ఖడ్గమృగం!
ఖాట్మండు : లాక్డౌన్లో కూడా నిబంధనలను అతిక్రమించి రోడ్డుపై ఎంచక్కా నడుస్తున్న ఓ వ్యక్తిని బెదరగొట్టింది ఓ ఖడ్గమృగం. నేపాల్‌లో రోడ్డుపైకి వచ్చిన ఖడ్గమృగానికి సంబంధించి వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన చిత్వాన్ నేషనల్ పార్క్ నుంచి భారీ జంతువులు తరచుగానే జనసంచారంలోకి వస్తుంటాయి. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటిస్తే కొందరు నిబంధనలను అతిక్రమిస్తూ బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వీధులను తనిఖీ చేయడానికి ఖడ్గం వచ్చింది అంటూ ప్రవీణ్ కాస్వాన్ పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఖడ్గమృగం కుమ్మడానికి వెంబడించి, తర్వాత తనదారిన వెలిపోతుంది. కాగా ప్రవీణ్ కాస్వాన్ పోస్ట్ చేసిన వీడియోకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పిటర్సన్ స్మైలీ సింబల్‌తో బదులిచ్చారు. ఖడ్గమృగాన్నిచూసి వీధుల్లోని యువకుడు రాకెట్ స్పీడుతో అక్కడి నుంచి జారుకున్నాడు అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేయగా, లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన ఆయువకుడిని తన గొప్ప మనసుతో ఖడ్గమృగం వదిలిపెట్టిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కరోనా వైరస్ అరికట్టడానికి నేపాల్ ప్రభుత్వం మార్చి24న వారంపాటూ లాక్డౌన్ ప్రకటించి, తర్వాత ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. దీంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారడంతో అడవుల్లోని జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. -
అల్విదా మేరా దోస్త్..
మరణానికి మరికొన్ని క్షణాలు.. ఓ జాతి అంతరించడానికి మరికొన్ని క్షణాలు.. సూడాన్ శాశ్వత నిద్రకు మరికొన్ని క్షణాలు.. రిజర్వు పార్కు రేంజర్ ముథాయ్ పరుగుపరుగున వచ్చాడు.. మరికొన్ని క్షణాల్లో ఈ లోకాన్ని విడిచివెళ్తున్న తన మిత్రుడికి తుది వీడ్కోలు పలకడానికి.. సూడాన్‌ను చూడగానే ఎప్పుడూ తన మోముపై వికసించే నవ్వు నేడు నేలరాలింది.. రెప్పచాటు ఉప్పెన కట్టలు తెంచుకుంది..అక్కడే అలా కూలబడ్డాడు..సూడాన్‌ను ప్రేమగా నిమిరాడు..చివరిసారిగా... అల్విదా మేరా దోస్త్.. సూడాన్.. ప్రపంచంలోనే ఏకైక మగ నార్తర్న్ వైట్ రైనో(45).. ఒకప్పుడు ఉగాండా, సూడాన్, కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఎక్కువగా ఉండేవి. కొమ్ముల కోసం వేటగాళ్లు ఈ ఖడ్గమృగాలను విచ్చలవిడిగా వధించడంతో అంతరించే దశకు చేరాయి. చివరికి మగ నార్తర్న్ వైట్ రైనోల్లో సూడాన్ ఒక్కటే మిగిలింది. ఆ జాతి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడటంతో చెక్ రిపబ్లిక్‌లోని జూలో ఉన్న దీన్ని 2009లో కెన్యా ఫారెస్టు రిజర్వ్ పార్కుకు తెచ్చారు. సూడాన్‌తోపాటు రెండు ఆడ నార్తర్న్ వైట్ రైనోలనూ కూడా తెచ్చి.. సంతానోత్పత్తి చేయించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు సూడాన్‌కు సాయుధ రక్షణను కూడా ఏర్పాటు చేశారు. వాచ్ టవర్స్, డ్రోన్లు, వేట కుక్కలు వంటివాటిని పెట్టారు. దీంతో సూడాన్ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ అయింది. లక్షల మంది దీన్ని చూడ్డానికి వచ్చేవారు. అయితే, వీటి సంతతిని పెంచడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత తర్వాత సూడాన్ ఆరోగ్యం క్షీణించింది. కనీసం లేవలేని పరిస్థితి వచ్చింది. దీని బాధను చూడలేక సూడాన్‌కు కారుణ్య మరణం ప్రసాదించినట్లు మంగళవారం రిజర్వు పార్కు ప్రకటించింది. ఓ వైద్యుడు ఇంజెక్షన్ ద్వారా సూడాన్‌కు విముక్తినిచ్చినట్లు తెలిపింది. అది జరడానికి కొన్ని క్షణాల ముందు.. సూడాన్ మృత్యువు ముంగిట ఉన్న సమయంలో తీసిన చిత్రమే ఇది. ప్రకృతి పట్ల, సాటి జీవుల పట్ల మానవుడు చూపుతున్న క్రూర స్వభావానికి నిదర్శనంగా సూడాన్ చరిత్రలో నిలిచిపోతుందని రిజర్వు పార్కు సీఈవో రిచర్డ్ అన్నారు. ‘కేవలం తన జాతికే కాదు.. మానవుడి అక్రమ కార్యకలాపాల వల్ల అంతరించిపోయే దశలో ఉన్న అనేక వేల జంతు, పక్షి జాతులకు ప్రతినిధిగా వ్యవహరించాడు’అని చెప్పారు. మిగిలినవి రెండూ ఆడ ఖడ్గమృగాలు కావడంతో ఇక ఈ జాతి అంతరించినట్లే అని చెబుతున్నారు. అయితే, శాస్త్రవేత్తలు చనిపోయే ముందు సూడాన్ జెనెటిక్ మెటీరియల్‌ను సేకరించారని.. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఈ జాతిని రక్షించేందుకు తమ ప్రయత్నాలు సాగుతాయని రిచర్డ్ చెప్పారు. -
ఈ చిత్రం అందరినీ కదిలించింది
దక్షిణాఫ్రికా: మనిషి తన స్వార్థం కోసం చేసే దారుణాలకు ప్రతీక.. ఇదిగో ఇక్కడ నెత్తురు కక్కుతూ.. నిర్జీవంగా కనిపిస్తున్న ఈ ఖడ్గమృగం.. దక్షిణాఫ్రికాలో కొమ్ము కోసం ఓ ఖడ్గమృగాన్ని కొందరు వేటగాళ్లు కిరాతకంగా హతమార్చిన ఈ చిత్రం అందరినీ కదిలించింది. అందుకే ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రాన్ని బ్రెంట్ స్టిర్టన్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ఏటా ప్రదానం చేసే ఈ అవార్డు కోసం 92 దేశాల నుంచి దాదాపు 50 వేల ఎంట్రీలు రాగా.. ఇది మొదటి బహుమతిని గెలుచుకుంది. -
చావుతో సెల్ఫీ దిగినంత పనైంది!!
ప్రస్తుతం భూమి మీద ప్రాణాలతో ఉన్న ఖడ్గమృగాల్లో మూడింట రెండొంతులు నివసించేది అక్కడే. అత్యధికంగా ఖడ్గమృగాలు హత్యకు గురవుతున్నది కూడా అక్కడే. అది ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటి. ఇంకా ఎన్నో విశిష్టతలున్న ఆ చోటు అసోంలోని కజిరంగా జాతీయపార్కు. అరుదైన ఖడ్గమృగాలు, పక్షిజాతులకు నివాసస్థావరం. గడిచిన కొద్దికాలంగా పేట్రేగిపోతోన్న స్మగ్లర్ల బారి నుంచి జంతువులను కాపాడేందుకు సుశిక్షితులైన రేంజర్లను నియమించారు పార్కు అధికారులు. అలా నియమితుడైన ఓ రేంజర్ కు శుక్రవారం గొప్ప చిక్కొచ్చిపడింది. వాహనాలు వినియోగిస్తే స్మగ్లర్లు పారిపోయే అవకాశం ఉంటుందికాబట్టి కాలినడకన పార్కులో కలియదిరగడం రేంజర్ల విధి. అలా తన విధులు నిర్వహిస్తోన్న రేంజర్.. ఓ భారీ ఖడ్గమృగం కంటబడ్డాడు. పైగా అది పిల్ల తల్లి కూడా. సహజంగానే పిల్లతల్లులైన జంతువులు మిగతా సమయాల్లోకంటే ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. రేంజర్ ను చూసిన ఖడ్గమృగం, అతను ఎక్కడ తన పిల్లకు, తనకు హాని చేస్తాడేమోనని కంగారుపడింది. ఆ కంగారు కాస్తా కోపంగామారి రేంజర్ వైపు గుర్రుగా దూసుకొచ్చింది. దిక్కుతోచని రేంజర్ పక్కనే ఉన్న చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. నిజానికి ఆ చెట్టును కూల్చేసి, అతణ్ని చంపడం ఖడ్గమృగానికి పెద్ద పనేంకాదు. కానీ దాని లక్ష్యం పిల్లల్ని కాపాడుకోవటమేకాబట్టి దారి దొరకగానే పిల్లతోసహా తన దారినతాను వెళ్లిపోయింది. అదే పార్కులో తిరుగాడుతోన్న కౌషల్ బొరువా అనే జంతుశాస్త్రవేత్త ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. ప్రాణాలతో బయటపడ్డతర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉందని ఆ రేంజర్ ను అడిగితే..'చావుతో సెల్ఫీ దిగినంత పనైంది' అని బదులిచ్చాడు. -
సరస్వతికి మగ బిడ్డ
జూలో మగ పిల్లకు జన్మనిచ్చిన ఖడ్గమృగం బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఖడ్గమృగం సరస్వతి శుక్రవారం ఒక మగ పిల్లకు జన్మనిచ్చింది. కాన్పూర్ జూ నుంచి మూడేళ్ల క్రితం జంతువు మార్పిడిలో భాగంగా సరస్వతి, సూరజ్ అనే ఖడ్గ మృగాలను జూకు తీసుకువచ్చారు. జూకు వచ్చే నాటికే గర్భంతో ఉన్న సరస్వతి శుక్రవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బుల్లి ఖడ్గం మృగం బరువు 50 కిలోల ఉందన్నారు. జూపార్కు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 6న బుల్లి ఖడ్గమృగానికి నామకరణం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఖడ్గ మృగానికి Z+
చుట్టూ కమాండోల రక్షణ.. కంటికి రెప్పలా కాపాడుకునే అధికారులు.. ప్రతి క్షణం పరిచర్యలు చేసే సిబ్బంది.. సాధారణంగా ఇలాంటి సౌకర్యాలన్నీ ఏ వీవీఐపీకో కల్పిస్తారు. ఇక్కడ మాత్రం ఓ తెల్ల ఖడ్గమృగానికి ఇస్తున్నారు. ఎందుకంటే.. ఇది ప్రపంచంలో ఉన్న ఏకైక తెల్ల ఖడ్గమృగం. సూడాన్‌లో ఉన్న ఈ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆఖరికి కొమ్ము వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో దాన్ని కోసేశారు కూడా. 43 ఏళ్ల వయసున్న ఈ రైనో.. 50ఏళ్ల వరకు మాత్రమే బతికే అవకాశముందట.. ఈ సమయంలో ఎలాగైనా ఈ జాతిని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు.