ఖడ్గమృగం భారీ ఆకారంతో ముందు పెద్ద కొమ్ముతో ఉంటుంది. దానిని ‘జూ’లో దూరం నుంచి చూస్తేనే మీదికొచ్చేస్తుందమోనని భయం వేస్తుంది. అలాంటిది జనావాసంలో రహదారిపై హఠాత్తుగా ప్రత్యక్షమైతే ఇంకేమన్నా ఉందా? భయంతో పరుగులు పెట్టాల్సిందే. అలాంటి ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద. వీడియోలో.. రోడ్డుపై భారీ ఖడ్గమృగం వేగంగా పరుగెడుతోంది. దానిని చూసిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. రోడ్డు నిర్మానుష్యంగా మారటంతో దర్జాగా వెళ్లిపోయింది. అయితే.. ఈ వీడియో ఎక్కడిదనేది తెలియరాలేదు.
‘మనుషులు ఖడ్గమృగం స్థావరంలోకి వెళ్లినప్పుడు.. ఒక రైనో నగరంలోకి రావటం సరైనదే. దానిని గందరగోళానికి గురిచేయవద్దు.’ అని రాసుకొచ్చారు ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ట్విట్టర్‌లో 70వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఖడ్గమృగం రక్షణపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత ఏం జరిగిందిని వాకాబు చేశారు. నందా మాటలతో ఏకీభవించిన కొందరు అడవుల్లో నిర్మాణాలకు అనుమతులపై నిషేధం విధించాలని కోరారు.
When the human settlement strays into a rhino habitat…
— Susanta Nanda IFS (@susantananda3) August 5, 2022
Don’t confuse with Rhino straying in to a town pic.twitter.com/R6cy3TlGv1
ఇదీ చదవండి: కుక్క కోసం భారీ కొండ చిలువతో చిన్నారుల పోరాటం
Comments
Please login to add a commentAdd a comment