Rhino
-
రైనో కళ్లలో పడ్డారు, ఆపై.. కజిరంగా పార్క్‌లో భయానక ఘటన
Viral Video మృత్యువు.. ఎటు నుంచి, ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. అలాంటిది చావు ముఖం ఇలా ఉంటుందా? అని ఆ తల్లీకూతుళ్లు గజగజ వణికిపోయారు కాసేపు. అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో జరిగిన ఓ భయానక ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.ఖడ్గమృగం.. చూడడానికి ఎంతటి భారీకాయంగా ఉంటుందో అంతే ప్రమాదకరమైంది కూడా. ఉగ్రరూపంలో అది చేసే దాడి.. పెద్ద పెద్ద వాహనాలను సైతం కూలదోస్తుంది. అలాంటి జీవి కళ్లెదుట ఆ తల్లీకూతుళ్లు ప్రాణ భయంతో రోదనలు పెడుతూ కాసేపు గడిపారు.కజిరంగా నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం మంద నడుమ.. టూరిస్టుల జీపులు తిరుగుతూ కనిపించాయి. అయితే మరి దగ్గరగా ఉండడంతో.. వేగంగా వెళ్లేందుకు రెండు జీపులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో హఠాత్తుగా మలుపు తిరిగిన రెండో జీపు వెనుక నుంచి తల్లీకూతుళ్లు కిందపడిపోయారు. అంతే.. ఒక్కసారిగా అటు టూరిస్టులు.. ఇటు ఆ తల్లీకూతుళ్ల అరుపులతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆ ఇద్దరికీ అతిసమీపంలోనే ఉన్న ఖడ్గమృగం(Rhino).. వెనక్కి తిరిగివాళ్లను చూసింది. ఈలోపు.. అక్కడే ఉన్న మరో ప్రయాణికుల జీపు వైపుగా ఇంకో రైనో దూసుకెళ్లింది. కట్ చేస్తే..ఆ తల్లీ తన కూతురిని అదిమి పట్టుకుని నేలపై పడుకునిపోయింది. రక్షించమంటూ గట్టిగా అరుస్తూ వేడుకుంది. ఈలోపు.. ముందుకు వెళ్లిన జీపు నెమ్మదిగా వాళ్ల దగ్గరకు చేరుకుంది.క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బిడ్డతో తల్లి వాహనం ఎక్కేసింది. దీంతో ఖడ్గమృగం దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.కాస్త దూరంలో మరో టూరిస్టు వాహనంలో ఉన్న వ్యక్తి.. అదంతా చిత్రీకరించడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో.. పర్యాటకుల భద్రత గురించి చర్చ మొదలైంది. తమదాకా విషయం రావడంతో అధికారులు వైరల్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు.. ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కజిరంగాలో బాగోరీ రేంజ్లో ఈ మధ్యే ఈ ఘటనచోటు చేసుకున్నట్లు సమాచారం.అసోం కజిరంగా(Kaziranga) నేషనల్ పార్క్‌లో 2,613 రైనోలు ఉన్నాయి(2022 లెక్కల ప్రకారం..). ప్రపంచంలోని ఖడ్గమృగాల జనాభాలోనే ఇది దాదాపు 70 శాతం.పైగా ఒంటి కొమ్ము రైనోలకు కజిరంగా నేషనల్ పార్క్ సుప్రసిద్ధం. కొమ్ము 57 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతుంది.బరువు.. 2,200 కేజీల నుంచి 3 వేల కేజీల బరువు దాకా పెరుగుతాయి. ఎత్తు 5.7-6.7 ఫీట్లు Horrible incident at the Kaziranga National Park in Assam. Two women fell off a safari jeep as a rhino could be seen in very close proximity. Moments later, a second rhino came running towards another jeep safari, forcing it to take a reverse gear. The women escaped unharmed… pic.twitter.com/6s9zz8WHSZ— Vani Mehrotra (@vani_mehrotra) January 6, 2025అంత భారీకాయం ఉన్నప్పటికీ.. గంటకు 25 మైళ్ల వేగంతో(40 కిలోమీటర్లు) పరిగెడుతాయి. ఇవి బాగా ఈదగలవు కూడా.ఇవి హెర్బివోర్స్. గడ్డి, ఆకులు, పండ్లు తింటాయి.వీటి చర్మం దళసరిగా ఉండి.. ముడలతో ఉంటుంది. వీటి జీవితకాలం 40 సంవత్సరాలుప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీని వరల్డ్ రైనో డేగా నిర్వహిస్తారు.ఈ భూమ్మీద ఐదు జాతుల ఖడ్గమృగాలు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం అవగాహనగా ఈ రోజును నిర్వహిస్తుంటారు. 2024లో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా నిర్వహించారుకీప్ ద ఫైవ్ ఎలైవ్(ఆ ఐదింటిని బతకనిద్దాం) పేరుతో డేను నిర్వహించారు. -
వైరల్ వీడియో: అదృష్టమంటే అంటే వీరిదే..
వన్యమృగాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా టూరిస్టులు.. నేషనల్ పార్కుల్లో పర్యటిస్తున్నప్పుడు జంతువులను రెచ్చగొడితే.. అవి ఆగ్రహంతో దూసుకువస్తాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పర్యాటకులను ఓ ఖడ్గమృగం వెంబడించి.. వారికి చుక్కలు చూపింది. దీంతో, వారు పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి జీపుల్లో తప్పించుకున్నారు. కాగా, ఈ ఘటన అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొందరు టూరిస్టులు నేషనల్ పార్క్‌లో పర్యటిస్తున్నారు. కాగా, కజిరంగా పార్క్‌లో దాదాపు 2700లకు పైగా సంఖ్యలో రైనోలు ఉంటాయి. ఈ సందర్భంగా పర్యాటకులు రైనోతో అనుచితంగా ప్రవర్తించి దాన్ని రెచ్చగొట్టారు. దీంతో, ఆగ్రహానికిలోనైనా రైనో.. వారి వెంబండించింది. ఈ క్రమంలో పర్యాటకులు జీపుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగో అంటూ పరుగుతీశారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా జీపు నడపడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా టూరిస్టులు బయటపడ్డారు. దీంతో, అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. #Assam: Kaziranga National Park tourists went through a gripping experience as they got chased by a one-horned rhino while they were on a safari ride. The incident took place in the Bagri forest area of Kaziranga National Park.#kariranganationalpark #wildlife #onehornedrhino pic.twitter.com/PBjWDpYgbr — India Today NE (@IndiaTodayNE) December 31, 2022 -
ఆ ఖడ్గమృగం ఇప్పుడు ఎలా ఉంది?.. వీడియో షేర్ చేసిన సీఎం
డిస్పూర్: రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కును ఓ ఖడ్గమృగం ఢీకొట్టిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. లారీని ఢీకొట్టిన ఆ రైనో పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్లింది. ఈ సంఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద జరిగింది. అయితే, ఇప్పుడు ఆ ఖడ్గమృగం ఎలా ఉంది? గాయాలై ఇబ్బందులు పడుతోందా? అనే విషయంపై ఆందోళనలు నెలకొన్నాయి. లారీని ఢీకొట్టిన ఖడ్గమృగం పరిస్థితిపై వీడియోను ట్విటర్లో షేర్ చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ‘అర్జెంట్ అప్డేట్.. హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మన రైనో ఫ్రెండ్ ఆరోగ్యంగానే ఉంది. ఈ ఉదయం డ్రోన్ ద్వారా తీసిన వీడియోను షేర్ చేస్తున్నా. జంతువుల పట్ల ప్రతి ఒక్కరు ప్రేమగా ఉండాలని కోరుతున్నా. జంతువులు రోడ్డు దాటే కారిడార్ల వద్ద కాస్త నెమ్మెదిగా వెళ్లండి’ అని పేర్కొన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అంతకు ముందు జాతీయ రహదారి 37పై జరిగిన ఈ ప్రమాదం వీడియోను షేర్ చేస్తూ.. ఇలాంటి ప్రమాదలు నివారించేందుకు కారిడార్లను విస్తరిస్తున్నట్లు చెప్పారు. An urgent update: Our Rhino friend, who met with an accident in Haldibari recently, is found to be doing good. I am sharing a drone video taken this morning. Urge all to be kind to our animals. Go slow while passing through corridors, where you know some animals might cross. pic.twitter.com/utgKwhUPXh — Himanta Biswa Sarma (@himantabiswa) October 11, 2022 ఇదీ చదవండి: భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్‌కి ఊహించని షాక్ -
భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్‌కి ఊహించని షాక్
ఒక ఖడ్గమృగం రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద చోటు చేసుకుంది. వాస్తవానికి వాహనం వేగంగా వెళ్తుంటే ఖడ్గమృగం నాదారికే అడ్డుగా వస్తావా అన్నట్లుగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ జంతువుకు ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అయితే సదరు వాహనాన్ని పోలీసులు ఆపి జరిమాన విధించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్లో షేర్ చేస్తూ...ఈ రహదారిలో ఆ జంతువులకు ఇబ్బంది కలిగిస్తే ప్రయాణించేందుకు అనుమతించం అని ట్వీట్ చేశారు. తాము ఈ కజిరంగా వద్ద జంతువులను రక్షించాలనే ఉద్దేశంతో సుమారు 32 కి.మీ ఎలివేటర్ కారిడర్ని అధికారులు చేత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ రహదారిలో వాహనాలు వేగంగా వెళ్తే చెట్లకు, జంతువులకు ఇబ్బంది కలగవచ్చని కొందరూ, మరికొందరూ నుమాలిగర్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న వంతెన పూర్తి అయితే వాహనాలను అటు మళ్లించే ఏర్పాట్లు చేయడమే కాకుండా అంతవరకు ఈ రహదారిలో వాహనాలు తక్కువ వేగంతో వెళ్లేలా చూడాలంటూ సలహలిస్తూ...ట్వీట్ చేశారు. Rhinos are our special friends; we’ll not allow any infringement on their space. In this unfortunate incident at Haldibari the Rhino survived; vehicle intercepted & fined. Meanwhile in our resolve to save animals at Kaziranga we’re working on a special 32-km elevated corridor. pic.twitter.com/z2aOPKgHsx — Himanta Biswa Sarma (@himantabiswa) October 9, 2022 (చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్) -
హఠాత్తుగా రోడ్డుపై ఖడ్గమృగం ప్రత్యక్షం.. జనం హడల్!
ఖడ్గమృగం భారీ ఆకారంతో ముందు పెద్ద కొమ్ముతో ఉంటుంది. దానిని ‘జూ’లో దూరం నుంచి చూస్తేనే మీదికొచ్చేస్తుందమోనని భయం వేస్తుంది. అలాంటిది జనావాసంలో రహదారిపై హఠాత్తుగా ప్రత్యక్షమైతే ఇంకేమన్నా ఉందా? భయంతో పరుగులు పెట్టాల్సిందే. అలాంటి ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద. వీడియోలో.. రోడ్డుపై భారీ ఖడ్గమృగం వేగంగా పరుగెడుతోంది. దానిని చూసిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. రోడ్డు నిర్మానుష్యంగా మారటంతో దర్జాగా వెళ్లిపోయింది. అయితే.. ఈ వీడియో ఎక్కడిదనేది తెలియరాలేదు. ‘మనుషులు ఖడ్గమృగం స్థావరంలోకి వెళ్లినప్పుడు.. ఒక రైనో నగరంలోకి రావటం సరైనదే. దానిని గందరగోళానికి గురిచేయవద్దు.’ అని రాసుకొచ్చారు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ట్విట్టర్లో 70వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఖడ్గమృగం రక్షణపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత ఏం జరిగిందిని వాకాబు చేశారు. నందా మాటలతో ఏకీభవించిన కొందరు అడవుల్లో నిర్మాణాలకు అనుమతులపై నిషేధం విధించాలని కోరారు. When the human settlement strays into a rhino habitat… Don’t confuse with Rhino straying in to a town pic.twitter.com/R6cy3TlGv1 — Susanta Nanda IFS (@susantananda3) August 5, 2022 ఇదీ చదవండి: కుక్క కోసం భారీ కొండ చిలువతో చిన్నారుల పోరాటం -
2,500 ఖడ్గమృగం కొమ్ములను కాల్చేసిన అస్సాం ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?
దిస్పూర: సెప్టెంబర్ 22 ప్రపంచ ఖడ్గమృగం దినోత్సవం సందర్భంగా అస్సాం ప్రభుత్వం వినూత్నంగా వేడుకలు నిర్వహించింది. వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వేలాది ఖడ్గమృగాల కొమ్ములను దగ్దం చేసింది. కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోని బోకాఖట్‌లో 2,500 ఒంటి కొమ్ము ఖడ్గమృగాల కొమ్ములను అక్కడి అధికారులు బహిరంగంగా దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదవండి: డ్రగ్స్ కోసం దాడి: అవమానం తట్టుకోలేక ఫ్రెండ్ ఆత్మహత్య ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేపట్టిన ‘రైనో హార్న్ రీ-వెరిఫికేషన్’ కార్యక్రమంలో భాగంగా వీటిని స్మగ్లర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత వారం రాష్ట్ర మంత్రివర్గం కొమ్ముల దహనం చేయనున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఆస్సాం ప్రభుత్వం ఖడ్గమృగం కొమ్ములను దహనం చేయడం వెనుక ఓ కారణం ఉంది. చదవండి: చీర కట్టుకొని వస్తే ఎలా? రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు అవమానం వీటి కొమ్ములను చైనీయులు సంప్రాదాయక ఔషధాల తయారీలో వాడుతారనే కారణంతో వేటగాళ్లు అటవీ అధికారుల కళ్లుగప్పి ఒక కొమ్ము ఖడ్గమృగాలను వేటాడుతున్నారు. అత్యంత కిరాతకంగా వాటిని చంపి, కొమ్ములు కోసుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో రైనో కొమ్ములకు ఎలాంటి ఔషధ ప్రాముఖ్యత లేదని వేటగాళ్లకు బలమైన సందేశం ఇవ్వడం కోసం అసోం సర్కారు ఇలా చేసింది. -
ఇండియన్ ఆయిల్ కొత్త మస్కట్ ఇదే?
ఇండియన్ ఆయిల్ సంస్థ తమ కంపెనీని ప్రతిబింబించేలా కొత్త మస్కట్‌ని రూపొందించింది. శక్తికి, ధృడత్వానికి పేరైన ఖడ్గమృగాన్ని తమ కంపెనీ మస్కట్‌గా ఎంచుకుంది. ఏదైనా ఈవెంట్, లేదా బ్రాండ్ ప్రమోషన్ కోసం మస్కట్లను ఎంచుకోవడం సర్వ సాధారణం. ఇటీవల వెలుగులోకి వచ్చిన అస్సాం ఆయిల్స్ లిమిటెడ్ సంస్థ మస్కట్‌ను ఏర్పాటు చేసుకుంది. అదే బాటలో ఇండియన్ ఆయిల్ సైతం మస్కట్‌ని ట్విట్టర్ వేదికగా లాంఛ్ చేసింది. As we welcome #IndianOilRhino into the IndianOil family as its brand mascot, the similarities between the two are striking. Like a match made in heaven. Massive yet Agile, Tough yet Caring, Gentle yet Majestic. Reason enough to open up our hearts to the IndianOil Rhino. pic.twitter.com/LPgC0sCdTI — Indian Oil Corp Ltd (@IndianOilcl) September 1, 2021 ఇండియల్ ఆయిల్ కొత్తగా మాస్కట్ని లాంఛ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మస్కట్లను విడుదల చేయడంపకై ఉన్న శ్రద్ధ పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపుపై పెడితే బాగుంటుందంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. చదవండి : Petrol,diesel: రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు -
సగం షేవ్‌తో కల్లిస్.. ఎందుకిలా!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వస్ కల్లిస్ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. దక్షిణాఫ్రికా తరఫున సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన కల్లిస్.. టెస్టుల్లో, వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లను సాధించిన ఏకైక క్రికెటర్. తన కెరీర్లో 166 టెస్టులు, 328 వన్డేలు ఆడాడు. ఇక పొట్టి ఫార్మాట్లో దేశం తరఫున 25 టీ20ల్లో పాల్గొన్నాడు. టెస్టుల్లో 13,289 పరుగులు చేసిన కల్లిస్.. వన్డేల్లో 11,579 పరుగులు చేశాడు. టెస్టుల్లో 292 వికెట్లు సాధించగా, వన్డేల్లో 273 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌కు దూరమైన తర్వాత పెద్దగా కనిపించని కల్లిస్.. తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది సగం షేవ్‌తో ఉన్న ఫొటో కావడంతో హాట్ టాపిక్ అయ్యింది. అయితే కల్లిస్ ఇలా ఎందుకు దర్శనమిచ్చాడంటే.. ఒక చాలెంజ్‌లో భాగంగా కచ్చితంగా సగం గడ్డం, సగం మీసంతో కనిపించాడు. దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా ‘సేవ్ ద రైనో’ చాలెంజ్‌ను స్వీకరించిన కల్లిస్ ఈ రకంగా అలరించాడు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కల్లిస్ ఫోటోను పోస్ట్ చేయగా, అందుకు పాజిటివ్‌గా కామెంట్లు వస్తున్నాయి. కల్లిస్ కొత్త లుక్‌లో అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. -
డ్రైవర్‌తో సహ కారును దొర్లించిన ఖడ్గమృగం
-
‘కుసిని’కి కోపమొచ్చింది..
బెర్లిన్: మామూలుగా మనుషులకు కోపం వస్తే ఏం చేస్తారు... అరవడం, చేతిలో ఉన్న వస్తువులను విసరడం లాంటివి చేస్తారు. అదే జంతువులకు కోపమొస్తే.. ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఆగ్రహంతో ఊగిపోతున్న ఓ ఖడ్గమృగం ఎదురుగా ఉన్న కారును, డ్రైవర్‌తో సహ కిందకు దొర్లించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన జర్మనీలోని హోడెన్హాగన్లోని సెరెంగేటి సఫారి పార్క్‌లో చోటు చేసుకుంది. కుసిని అనే ఖడ్గమృగానికి ఉన్నట్టుండి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో తన ఎదురుగా ఉన్న వాహనం మీద దాడికి దిగింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్ కూడా ఉంది. అదృష్టం కొద్ది ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ ఆమె వాహనం మాత్రం నామరూపాల్లేకుండా పోయింది. దీని గురించి పార్కు మేనెజర్ మాట్లాడుతూ.. ‘కుసిని ఇక్కడ 18 నెలలుగా ఉంటుంది. గతంలో ఎప్పడు ఇలా ప్రవర్తించలేదు. సందర్శకులకు కూడా ఎలాంటి హానీ తలపెట్టలేదు. కానీ ఈ రోజు దాని ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు వచ్చింది. వాహనంపై దాడి చేసింది. ప్రస్తుతం వైద్యులు కుసినిని పరీక్షిస్తున్నారు’ అని తెలిపాడు. -
వడలూరుకు రాము
బహదూర్‌పురా: జంతు మార్పిడిలో భాగంగా నెహ్రూ జూలాజికల్ పార్కులో పుట్టి పెరిగిన ఖడ్గమృగం రాము, రెండు జతల మూషిక జింకలను చైన్నైలోని వడలూరు జూకు తరలించారు. చైన్నై జూ నుంచి నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఒక జత నీటి గుర్రాలు, రెండు జతల నీలగిరి కోతులు, బారాసింగా జింకలు, జత గ్రే వుల్ఫŠస్ జూకు తీసుకురానున్నారు. జంతువు రక్త మార్పిడిలో భాగంగా వన్యప్రాణులను ఇతర జూలకు తరలించి అక్కడి నుంచి జూకు అవసరమయ్యే వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు సెంట్రల్ జూ అథారిటీ అనుమతి ఇచ్చింది. జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎ.హకీం గురువారం ఖడ్గమృగం రాము, రెండు జతల మూషిక జింకలను వడలూరు జూ సిబ్బందికి అప్పగించారు. మొత్తం మీద జూపార్కులో జంతువు రక్త మార్పిడి కార్యక్రమం సంవత్సరంలో రెండు మూడుసార్లు జరుగుతుండటం గమనార్హం. జూపార్కులో 2015 జూలై 15న సూరజ్, సరస్వతిలకు రాము ఖడ్గమృగం జన్మనిచ్చిందన్నారు. అప్పటి నుంచి జూ సందర్శకులను అలరిస్తున్న రాము ఇతర జూలకు జంతువు మార్పిడిలో తరలివెళ్లింది. -
వైరల్ : పాపం ఆ బిడ్డకి తెలియదు తల్లి చనిపోయిందని..
న్యూఢిల్లీ : తల్లి.. ఎవరికైనా తల్లే. అది మనుషులకైనా, జంతువులకైనా. మాతృమూర్తి చూపించినంత ప్రేమ ప్రపంచంలో మరెవరూ చూపించలేరనేది నగ్నసత్యం. అలాంటి తల్లి మన నుంచి దూరమైతే..? వినడానికే బాధగా ఉంది. మనుషులకే కాదు జంతువులకు సైతం తల్లి అవసర. తల్లిని కోల్పోతే అవి ఎంతగా బాధపడతాయో తెలియజేసే హృదయవిదారకర వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రవీణ్ కశ్వన్ అనే ఫారెస్ట్ అధికారి మొదటగా ఆ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియో ప్రకారం.. ఓ తల్లి ఖడ్గమృగాన్ని(రైనో) వేటగాళ్లు చంపేశారు. అది తెలియక పిల్ల రైనో తల్లి మృతదేహం చూట్టూ తిరుగుతోంది. తనకు ఆకలిగా ఉందని, పాలు ఇచ్చే టైం అయినా ఇంకా లేవడం లేదనే విధంగా మృతదేహం చుట్టూ తిరుతూ తల్లిని లేపడానికి ప్రయత్నిస్తోంది. పాపం ఆ పిల్ల రైనోకి తెలియడం లేదు తల్లి చనిపోయిందని, ఇక రాదని. ఈ వీడియోను ప్రవీణ్ పోస్ట్ చేస్తూ.. వేట ఎంత విధ్వంసకరమైనదో వీడియో చూసైనా కనువిప్పు కలగాలని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ప్రముఖ నటి స్వర్ణ భాస్కర్‌తో సహా పలువురు ఈ వీడియోను రీట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోలో చనిపోయిన ఖడ్గమృగం 2018 ఫిబ్రవరిలో సోతాఫ్రికాలోని నేషనల్ పార్క్‌కు చెందినదిగా తెలుస్తోంది. రైనోల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో వేటగాళ్లు రైనోలను చంపి వాటి దంతాలను తీసుకెళ్తున్నారు. భూగోళంపై అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలోకి రైనోలు కూడా ఉన్నాయి. The picture of poaching !! A baby #rhino tries to wake #mother, who is killed by poachers for the #horn. Devastating & eye opening. pic.twitter.com/EnAS2PAHiD — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 2, 2019 -
బేబి దియా
ఏ స్టార్‌కి ఎక్కడ ఫ్యాన్స్ ఉంటారో చెప్పలేం. వాళ్ల మాతృభాషలో ఉండొచ్చు.. పరాయి భాషల్లోనూ ఫ్యాన్స్ ఉండొచ్చు. అంతెందుకు? పరాయి దేశాల్లో కూడా ఫాలోయింగ్ ఉండి ఉండొచ్చు. ఒకవేళ అభిమానం ఎక్కువైతే ఆ స్టార్ పేరు తమ పిల్లలకో, అభిమానంగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులకో పెట్టుకుని ఫ్యాన్స్ మురిసిపోతారు. ఇప్పుడు దియా మీర్జా పేరు ఓ ఖడ్గమృగానికి సెట్ అయింది. ‘లగేరహో మున్నాభాయ్, దస్, సంజు’ సినిమాలతో బాలీవుడ్లో ఫేమ్ సంపాదించారు దియా. యుఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్, భారతదేశపు వన్యప్రాణ సంరక్షణ ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలను అందిస్తున్నారామె. కెన్యాలోని ఓఐపెజెటా సంరక్షణ సంస్థలోని ఓ ఖడ్గ మృగానికి దియా మిర్జా పేరుని పెట్టారు. ఈ విషయాన్ని దియా తెలియజేస్తూ –‘‘థ్యాంక్యూ ఓఐపెజెటా. నా పేరును ఓ బ్యూటిఫుల్ బేబీకు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. కెన్యాలోని ఈ ప్లేస్‌ని ఎవరైనా విజిట్ చేసినప్పుడు దియాతో ఫొటో దిగి నాకు షేర్ చేయండి’’ అని పేర్కొన్నారు. -
రైనోలను వేటాడితే మరణ దండనే..
కెన్యా: భూగోళంపై అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలోకి ఉత్తర ప్రాంతపు తెలుపు జాతి రైనో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒకే ఒక మగ రైనో ‘సుడాన్’ (45) గత నెలలో అనారోగ్యంతో కెన్యాలోని ఓల్ పెజెటా జాతీయ పార్కులో మరణించిన సంగతి తెలిసిందే. ఏనుగులు, రైనోల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అరుదైన జాతికి చెందిన ఈ తెల్ల రైనోల దంతాల కోసం స్మగ్లర్లు విచ్చల విడిగా వేటాడటంతో వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇందుకోసం కెన్యా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. రైనోలను వేటాడితే వారికి మరణశిక్ష తప్పదని తెలిపింది. అయితే మగ రైనో సుడాన్‌ను సంరక్షించి ఆ జాతిని వృద్ధి చేద్దామనుకున్న పార్కు నిర్వాహకులకు నిరాశే మిగిలింది. కండరాల, ఎముకల క్షీణత వ్యాధితో బాధపడుతూ సుడాన్ మరణించింది. ప్రపంచం మొత్తంలో గల రెండు వైట్ రైనోలు సుడాన్ సంతతే. సుడాన్ మృతితో దాని సంతానం నాజిన్(27), ఫతు(17) చిన్నబోయాయి. అవి రెండూ కన్నీరు కారుస్తూ.. సుడాన్ మృతి పట్ల మౌనం వహించాయి. పార్కు నిర్వాహకులు సుడాన్ స్మృతి చిహ్నం వద్ద శనివారం ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమంలో నాజిన్, ఫతులు మౌనంగా రోదిస్తున్న దృశ్యాలు జంతు ప్రేమికులతో సహా ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి. ఆ దిశగా కెన్యా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇకపై ఏనుగు, రైనోల దంతాల స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ వారికి మరణశిక్ష విధిస్తామని తెలిపింది. ఆ మేరకు కెన్యా ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది. -
'బాహుబలి' రేంజ్లో రైనో విహారం!
-
'బాహుబలి' రేంజ్లో రైనో విహారం!
'బాహుబలి' మొదటిపార్టులో భారీ దున్నపోతు రానా అలియాస్ భల్లాలదేవుడిని ఎదుర్కొనే సన్నివేశం రోమాంఛితంగా ఉంటుంది. అదేవిధంగా 'బాహుబలి' రెండోపార్టులో మదమెక్కిన భారీ ఏనుగును ప్రభాస్ నిలువరించే సీన్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అవి రెండూ గ్రాఫిక్ సన్నివేశాలే అయినా.. నేపాల్‌లో మాత్రం వాటిని తలదన్నే స్థాయిలో భారీగా ఉన్న ఓ రైనో నడిరోడ్డుమీద వీరవిహారం చేసింది. అభాగ్యులైన ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళుతుండగా.. వారిని వెంటాడుతూ శరవేగంగా చూపరుల ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. నేపాల్‌లోని హెటావుడా పట్టణంలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని అడవి నుంచి తప్పించుకొని వచ్చిన ఓ రైనో హెటావుడాలో భయభ్రాంతులకు గురిచేసింది. పట్టణంలో వీరవిహారం చేస్తూ ఒకరిని హతమార్చి.. పలువురిని గాయపర్చింది.ఈ సందర్భంగా నడిరోడ్డు మీద బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వేగంగా తప్పించుకొని పోతుండగా.. వారిని అంతేవేగంగా వెంటాడుతూ దూసుపోతుతన్న రైనో వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. గ్రేటర్ రైనోలు దాదాపు అంతరించిపోయేదశకు చేరుకున్న తరుణంలో నేపాల్‌లో వీటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
శవమై తేలిన మరో ఖడ్గమృగం!
అసోంః కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో మరో ఖడ్గమృగం శవమై తేలింది. ఇప్పటికే ఎన్నోసార్లు వేటగాళ్ళ బారిన పడి ఆ మూగజీవాలు మృత్యు వాత పడ్డ విషయం తెలిసిందే. వాడిగా ఉండే వాటి కొమ్ములకోసం వేటగాళ్ళు ఏంకగా వాటి ప్రాణాలనే బలితీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కాగా తాజాగా కొమ్ములతోసహా ఓ మగ ఖడ్గమృగం కనిపించి కలకలం రేపింది. అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ (కేఎన్ పీ) సమీపంలో ఖడ్గ మృగం మృతదేహం కనిపించింది. పార్కు సమీపంలోని జపోరిపత్తర్ గ్రామస్థులు కొమ్ములతోపాటు ఉన్న జంతువు శరీరాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కొహోరా రేంజ్ లోని మికిర్జన్ అటవీప్రాంతం డిప్లూ నదిలో ఖడ్గమృగం శరీరం కొట్టుకొని వచ్చినట్లు జపోరిపత్తర్ గ్రామస్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కేఎన్పీ అధికారులు, పశువైద్యులు శరీరాన్ని పరిశీలించి.. ఆ మృగానిది సహజ మరణంగా నిర్థారించారు. ఎంతో దృఢంగా ఉండే ఖడ్గమృగం కొమ్ములను సురక్షితంగా భద్రపరిచేందుకు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కజిరంగాలో ఆగని ఖడ్గమృగాల హత్యలు
-
కజిరంగాలో ఆగని ఖడ్గమృగాల హత్యలు
అసోం: కజిరంగా జాతీయ పార్క్‌లో ఖడ్గమృగాలకు రక్షణ కరువైంది. ఎంతో అరుదైన ఈ అటవీ జంతువుల మరణ మృదంగం దొంగల దాడుల రూపంలో మారుమ్రోగుతోంది. కరడుగట్టిన దొంగలు ఒకటికాదు రెండు కాదు ఏడాది కాలంలో ఇప్పటి వరకు 20 ఖడ్గ మృగాల ప్రాణాలను తీసి వాటి కొమ్ములను ఎత్తుకెళ్లారు. కాగా, తాజాగా మరోసారి దొంగలు అదే అఘాయిత్యానికి తెగబడ్డారు. పార్క్‌లోకి చొరబడి ఓ మగ రైనోను చంపేసి దాని కొమ్మును కోసుకొని పారిపోయారు. తుపాకుల చప్పుళ్లు విని అధికారులు అక్కడి వచ్చేలోగానే ఆ దొంగలు దాని కళేబరాన్ని అక్కడ వదిలేసి కొమ్ముతో పరారైపోయారు. తిరిగి ఎప్పటిలాగానే ఘటనా స్థలి వద్ద చనిపోయి పడిఉన్న ఖడ్గమృగం, ఖాళీ బుల్లెట్లు లభించాయి. దీంతో, మరోసారి పార్క్ సంరక్షణ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభమై నెల రోజులు పూర్తికాకుండానే వరుసగా ఇది మూడో ఘటన. మొత్తం పన్నెండు నెలలు పరిగణనలోకి తీసుకుంటే ఇది 20వ ఘటన. అంటే 20 ఖడ్గమృగాలను దారుణంగా చంపేశారన్నమాట. ఈ వరుస సంఘటనలు చూస్తుంటే అధికారులు జాతీయ పార్క్‌పై నియంత్రణ కోల్పోయి దొంగలను అదుపుచేయలేకపోయారనే అనుమానం కలుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. -
మరో రైనోను చంపేశారు!
గౌహతి: ప్రపంచ చారిత్రక ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన అసోంలోని ఖజిరాంగా నేషనల్ పార్క్‌లో మరో ఒంటి కొమ్ము రైనోను వేటగాళ్లు పొట్టన పెట్టుకున్నారు. పార్క్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా రైనో మృతదేహాన్ని సోమవారం కనుగొన్నారని పార్క్ డైరెక్టర్ ఎంకె యాదవ్ తెలిపారు. నాటు తుపాకీ గాయంతో పాటు, రైనో కొమ్ము కనిపించకపోవడంతో ఇది అక్రమ వేటగాళ్ల పనేనని పార్క్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రపంచంలో ఉన్న ఒంటి కొమ్ము రైనోలు దాదాపు 70 శాతం ఖజిరాంగా పార్క్‌లోనే ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదీతీరంలో సుమారు 858 చదరపు కి.మీ.పరిధిలో విస్తరించి ఉన్న ఈ జాతీయ పార్క్‌లో ఈ సంవత్సరంలో గత జనవరి నుంచి 12 రైనోసార్లు హత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. -
ఖడ్గమృగాన్ని చంపేశారు
కజిరంగ: అసోంలోని కజిరంగ పార్క్‌లో ఓ ఆడ ఖడ్గ మృగాన్ని ఎవరో దుండగులు చంపేశారు. దాని కొమ్ములు తొలగించి తీసుకొని పారిపోయారు. పార్క్ అధికారుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం బార్బోరిబిల్ ఫారెస్ట్ క్యాంప్‌లో తుపాకీ పేలుళ్ల చప్పుళ్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన పార్క్ రక్షణ అధికారులు ఏం జరిగి ఉంటుందా అని పెట్రోలింగ్ నిర్వహించగా చనిపోయి రక్తపు మడుగులో పడిఉన్న ఖడ్గమృగం కనిపించింది. అక్కడే వారు ఐదు ఖాళీ తూటాలను గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఏడాదిలో దొంగల కారణంగా ఖడ్గమృగాలు చనిపోవడం ఇది తొమ్మిదో ఘటన.