మరో రైనోను చంపేశారు!
గౌహతి: ప్రపంచ చారిత్రక ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన అసోంలోని ఖజిరాంగా నేషనల్ పార్క్లో మరో ఒంటి కొమ్ము రైనోను వేటగాళ్లు పొట్టన పెట్టుకున్నారు. పార్క్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా రైనో మృతదేహాన్ని సోమవారం కనుగొన్నారని పార్క్ డైరెక్టర్ ఎంకె యాదవ్ తెలిపారు. నాటు తుపాకీ గాయంతో పాటు, రైనో కొమ్ము కనిపించకపోవడంతో ఇది అక్రమ వేటగాళ్ల పనేనని పార్క్ అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా ప్రపంచంలో ఉన్న ఒంటి కొమ్ము రైనోలు దాదాపు 70 శాతం ఖజిరాంగా పార్క్లోనే ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదీతీరంలో సుమారు 858 చదరపు కి.మీ.పరిధిలో విస్తరించి ఉన్న ఈ జాతీయ పార్క్లో ఈ సంవత్సరంలో గత జనవరి నుంచి 12 రైనోసార్లు హత్య కావడం ఆందోళన కలిగిస్తోంది.