poachers
-
వాళ్లకు అసలు మానవత్వం లేదా: మహేశ్ బాబు
-
బరి తెగించిన వేటగాళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వేటగాళ్లు రెచ్చిపోయారు. వన్యమృగాలను వేటాడుతుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఎస్సై సహా ముగ్గురు పోలీసులు నేలకొరిగారు. ఒకరు పోలీసు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఒక దుండగుడు హతమయ్యాడు. అనంతరం సోదాల సమయంలో జరిగిన కాల్పుల్లో మరో నిందితుడి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గుణ జిల్లా అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను మృతవీరులుగా ప్రకటించారు. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గ్వాలియర్ జోన్ ఐజీని బదిలీ చేశారు. సాగ బార్ఖేడ గ్రామ సమీపంలోని షారోక్ రోడ్డు వద్ద కొందరు దుండగులు వన్యప్రాణులను వేటాడుతున్నారన్న సమాచారం అందడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీసు బలగాలు ఆప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను దుండగులు లక్ష్యపెట్టలేదు. పోలీసులపైకి యథేచ్ఛగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఎస్సై రాజ్‌కుమార్ జాటవ్, కానిస్టేబుళ్లు నీలేశ్ భార్గవ, శాంతారాం మీనా అసువులు బాశారు. పోలీసులపై కాల్పులకు తెగబడిన నేరగాళ్లు బిధోరియాకు చెందిన వారిగా గుర్తించినట్లు హోం మంత్రి తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో నలుగురి కోసం తీవ్రంగా గాలింపు జరుగుతోందన్నారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతం నుంచి కృష్ణజింకల కళేబరాలు ఐదు, ఒక నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. చదవండి: లౌడ్‌స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు -
ఎలుగుబంట్లను వేటాడి వాటి మర్మాంగాలు..
భోపాల్ : పులులను, ఎలుగుబంట్లను చంపిన వేటగాడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన ఆ వేటగాడు పోలీసుల విచారణలో పలు దిగ్ర్భాంతికర విషయాలు వెల్లడించాడు. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యార్లెన్ అలియాస్ లుజజెన్ అనే వేటగాడు నెమళ్లు, అడవి పందులు, ఎలుగు బంట్లను వేటాడి తినడంతో పాటు అమ్మేవాడు. 2014లో పులిని వేటాడి చంపిన కేసులో యార్లెన్ జైలుకు వెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత బెయిల్‌పై తిరిగి వచ్చిన అతగాడు.. మళ్లీ వేటాడడం మొదలు పెట్టాడు. గత ఐదు సంవత్సరాల నుంచి పలు పులులు, ఎలుగుబంట్లు, వందల కొద్ది అడవి పందులు, నెమళ్లు వేటాడాడు. అతన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేయని ప్రయత్నం లేదు. గుజరాత్-వడోదర జాతీయ రహదారిపై శాంటి ప్రాంతంలో ఉన్నట్టు యార్లెన్‌ను గుర్తించిన పోలీసులు.. ఇటీవల పట్టుకున్నారు. ఎలుగుబంటి (బల్లుకం) కళేబరాలను అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఎలుగుబంట్లను చంపి వాటి మర్మాంగాలను తినేవాడని విచారణలో తేలింది. కాంతా టైగర్ రిజర్వ్, చింద్వారా, బెతూల్, భెర్హన్ పూర్లో ఎలుగుబంట్లలను చంపి అమ్మేవాడనని వెల్లడించాడు. 2012లో టి13 టైగర్ కనిపించకపోవడంతో అటవీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2013 జనవరి 12న నేపాల్‌లో టి13 పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొని డైమ్ అనే వ్యక్తి అరెస్టు చేసి విచారణ జరిపారు. దీంతో ఈ పులిని వేటాడిన వ్యక్తి యార్లెన్ అని విచారణలో తేలింది. అప్పటి నుంచి యార్లెన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంలో గుజరాత్-వడోదర జాతీయ రహదారిలో యార్లెన్‌ను పట్టుకున్నారు. -
ఛీతా.. ఇట్టే పసిగట్టేస్తోంది
సాక్షి, మంచిర్యాలఅర్బన్: వేటగాళ్లు, కలప స్మగర్లపై అటవీశాఖ నిఘా పెంచింది. అక్రమార్కుల ఆగడాలు అరికట్టేందుకు అధికారులు ఇటీవల డాగ్స్క్వాడ్పై ప్రత్యేక దృష్టి సారించారు. పక్షం వ్యవధిలో రెండు చిరుత పులులను చంపిన నిందితులతో పాటు వన్యప్రాణి మాంసం, కలప స్మగర్లును పట్టుకోవడంలో ఈ డాగ్‌స్క్వాడ్ కీలకంగా వ్యవహరించిది. ఛీతా (జాగిలం) వచ్చిన కొద్ది రోజుల్లోనే పలు కీలక కేసుల్లో నిందితులను పక్కాగా పసిగట్టి చేధిస్తుండటంతో డాగ్స్క్వాడ్పైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కవ్వాల్ టైగర్‌జోన్‌లో తొలిప్రయత్నంలో భాగంగా ఇద్దరు బీట్ అధికారులతో డాగ్స్వాడ్ ఏర్పాటు చేశారు. కలపస్మగ్లింగ్, వ్యన్యప్రాణుల వేట అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌లో ఇచ్చిన శిక్షణకు జన్నారంనకు చెందిన అటవీ బీట్ అధికారులు సత్యనారాయణ, శ్రీనివాస్ వెళ్లివచ్చారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ కేంద్రంలో ఛీతాకు (జర్మన్ షెపర్డ్ శునకం)ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని డాగ్‌స్క్వాడ్ బృందం అడవికి కాపలా కాయడంతో పాటు నేరస్తుల అటకట్టించడంలో ముందు వరుసలో నిలుస్తోంది. ఈనెల 4న జన్నారం అటవీ డివిజన్లో చింతగూడ బీట్ కంపార్ట్మెంట్ నంబర్ 360లో వన్యప్రాణిని హతమార్చిన కేసులో మొదట డాగ్‌స్క్వాడ్ బృందం నిందితులను పట్టుకున్నారు. చింతగూడ బీట్‌లో వన్యప్రాణిని హతమార్చిన అనవాలు లభించడంతో డాగ్‌స్క్వాడ్ వాసన చూసి బొమ్మన గ్రామానికి చెందిన మల్లయ్య కొట్టంలోని పొయ్యి వద్దకు వెళ్లడం.. తర్వాత వండిన మాంసం స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. అలాగే చింతగూడ పొలాల్లో దాచిన దుంగలను పట్టించింది ఈ డాగ్‌స్క్వాడ్ కావడం విశేషం. బొమ్మన గ్రామంలో రెండు టెకు దుంగలను స్వాధీనం పర్చుకున్నారు. ఈనెల 9న జన్నారం అటవీ రెంజ్ పరిధిలో డాగ్‌స్క్వాడ్‌తో కలిసి దాడి నిర్వహిæంచగా 0.328 సీఎంటీ విలువ గల కలప గుర్తించారు. ఈనెల 14న నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పద మృతి చెందిన కేసులో డాగ్‌స్క్వాడ్ ఎంతో కీలకంగా మారింది. పులి మృతి చెందిన స్థలం సమీపంలో ఉన్న బీడీల కట్ట, అంబర్ ప్యాకెట్ ఆధారంగా వాసనతో పసిగట్టి అనుమానితులను గుర్తించారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రంగపేట్ అటవీ ప్రాంతంలో క్లచ్‌వైర్‌తో అమర్చిన ఉచ్చులో పడి పులి మృతి చెందిన విషయం తెలిసిందే. చెప్పుల ఆధారంగా పసిగట్టి వేటగాళ్లకు ఉచ్చు బిగిసేలా చేయటం వెనక ఈ డాగ్‌స్క్వాడ్ కీలకం కావడం గమన్హారం. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు మంచిర్యాలఅర్బన్: లక్సెట్టిపేట్ అటవీ రెంజ్ పరిధిలోని ముల్కల్ల, వెంపల్లి, రంగంపేట్ నీటి పరివాహక ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టారు. ఫీల్డ్ డైరెక్టర్ కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు, నిర్మల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్, ఎఫ్‌డీవో వెంకటేశ్వర్రావు నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో కలప స్మగ్లింగ్‌తో పాటు వన్యప్రాణులకు హాని తలపెట్టే ఉచ్చులు ఏమైనా ఉన్నాయనే దానిపై డాగ్‌స్క్వాడ్‌తో నాలుగు గంటలపాటు క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే విద్యుత్ లైన్ వెంట కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశీలన జరిపారు. ఈ నెల 14న రంగంపేట్ అటవీ ప్రాంతంలో ఉచ్చుకు చిరుతపులి హతమైన విషయం విదితమే. ఈ మేరకు ఎఫ్‌డీవో వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ రోజువారీ కార్యక్రమంలో భాగంగానే తనిఖీలు చేపట్టామని, శుక్రవారం కూడా డాగ్‌స్క్వాడ్‌తో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతామన్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో డాగ్‌స్క్వాడ్ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, లక్సెట్టిపేట్, దేవాపూర్ అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
అంతరించిపోతున్న సొర చేపలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అరేబియా సముద్రంలో సొర చేపలు (షార్క్స్) నశించిపోతున్నాయి. ప్రధానంగా వేట వల్లనే ఈ పరిస్థితి వస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. సొర చేపలను వేటాడంలో ప్రపంచంలోనే ఇండోనేసియా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. సొర చేపల్లోని ప్రతి అవయంతోని ఉపయోగం ఉండడమే అందుకు కారణం. సొర చేప చర్మాన్ని పాద రక్షలు, బ్యాగుల తయారీకి ఉపయోగించడం, దాని లివర్ నుంచి వచ్చే నూనెకు డిమాండ్ ఎక్కువగా ఉండడం, దానిలోని మదులాస్థిని ఔషధాల్లో ఉపయోగించడం లాంటి ఉపయోగాలెన్నో. మానవులకన్నా, వక్షాలకన్నా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే, అంటే దాదాపు 35 కోట్ల క్రితం నుంచి జీవిస్తున్న సొర చేపల్లో 153 రకాల సొర చేపలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 50 శాతం రకాలు అంతరించిపోయినట్లు డాక్టర్ రిమా జమాడో తెలియజేశారు. ఆయనతోపాటు పలు దేశాలకు చెందిన 24 మంది బయోలాజిస్టులు 2017లో ఆరేబియా సముద్రంతోపాటు పక్కనే ఉన్న ఎర్ర సముద్రం, ఓమన్ సముద్రంతోపాటు 20 దేశాలకు ఆనుకున్న సముద్రాల్లో వారు సొర చేపల మనుగడపై అధ్యయనం చేశారు. వారిలో భారత్‌కు చెందిన బయోలాజిస్టు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిషరీస్ కారణంగానే సొర చేపలకు ముప్పు వస్తోందని బయోలాజిస్టుల అధ్యయనంలో తేలింది. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న ఇతర చేపల లక్ష్యంగా ఫిషరీస్ విభాగాలు వేటాడుతుంటే సొరచేపలు ఎక్కువ పడుతున్నాయి, వాటిని మళ్లీ నీటిలోకి వదలకుండా వాటి అవయవాలకు కూడా డిమాండ్ ఉండడంతో అవి ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. అన్ని సొర చేపల లివర్ ఆయిల్‌కు డిమాండ్ ఉండదు. వెయ్యి అడుగుల లోతుల్లో తిరుగాడే సొర చేపల లివర్ ఆయిల్‌కే డిమాండ్ ఉంటుంది. వాటిలోనే ఔషధ గుణాలు ఉంటాయన్న నమ్మకం. ఇంతకుముందు మాల్దీవుల్లో, ఇప్పుడు జపాన్ ఈ లివర్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. -
హృదయాలను కలిచివేస్తున్న ఫోటో.. తల్లి కోసం..
తల్లి బిడ్డల బంధం విడదీయలేనిది. అది మనుషులకైనా, పశుపక్ష్యాదులకైనా ఒక్కటే. తన బిడ్డకు చిన్న గాయం అయినా తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. అలాగే తల్లికి ఏ చిన్న హానీ కలిగినా బిడ్డ అంతే బాధపడుతుంది. తన తల్లిని చంపేందుకు వచ్చిన వేటగాళ్లను ఎదిరించే దమ్ములేకపోయినా.. తల్లిని రక్షించడం కోసం చివరిదాక ప్రయత్నం చేసింది ఓ పిల్ల ఖడ్గమృగం(రైనో). కానీ తల్లిని రక్షించేకోలేక గాయాలతో తల్లి శవం వద్దే పడిఉంది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ హృదయ విచారక ఘటన అఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో జరిగింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరి హృదయం చలించిపోతుంది. ఖడ్గమృగాల కొమ్ముల కోసం వేటగాళ్లు వాటిని చంపేస్తుంటారు. సాధారణంగా ఖడ్గ మృగం కొమ్ములు తీసుకొని వెళ్ళడానికి వేటగాళ్ళు వచ్చినప్పుడు.. వాటి పిల్లలను కూడా చంపేయడమో.. లేదా వాటికి మత్తుపదార్థాలు పెట్టడమో చేస్తూ ఉంటారు. పిల్ల రైనోలు వారి పనికి అడ్డు తగిలే అవకాశం ఉంటుందని అలా చేస్తారు. వేటగాళ్లకు చిక్కిన ఓ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు ఓ బుల్లి రైనో తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఒక్క నెల వయస్తున్న ఆ రైనో తన తల్లికి హానీ కలిగించడానికి వచ్చిన వేటగాళ్లను ఎదురించించింది. ఇంకా కొమ్ములు కూడా రాని ఆ బుల్లి రైనో తన తల్లిని రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. చివరకూ వేటగాళ్ల చేతిలో గాయాలపాలై తల్లి శవం వద్దే పడిపోయింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. నెల వయస్సు ఉన్న రైనో తన తల్లికోసం అంత సాహసం చేయడం.. చివరకి వేటగాళ్ల చేతిలో ఓడిపోయి తల్లి శవం వద్ద దీనస్థితిలో పడిఉండడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కాగా ఆ బుల్లి రైనోని సఫారీ జూ సిబ్బంది తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తోంది. దానికి ఆర్థర్ అని పేరు పెట్టి ట్రీట్మెంట్కోసం విరాళాలను కూడా సేకరిస్తోంది. దానికి గాయాలు ఎక్కడెక్కడ అయ్యాయో.. తల్లికోసం అది చేసిన సాహసం ఏంటో తెలుపుతూ విరాళాలు సేకరిస్తున్నారు. జంతూ ప్రేమికులు కూడా బుల్లి రైనో ఆర్థర్‌కు పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నారు. ఆ విరాళాలతో ఇలా గాయపడిన ఎన్నో ఖడ్గమృగాలను రక్షిస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్ టు చంద్రాపూర్
జ్యోతినగర్(రామగుండం): మంచిర్యాల జిల్లాలో ఓ పులి వేటగాళ్ల ఉచ్చుతో విలవిలాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం పులుల చర్మాలు విక్రయిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. గోదావరిఖని ప్రాంతంలో అనుమానాస్పందంగా సంచరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం తాట్లంక గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్లపల్లి గ్రామానికి చెందిన మడకం చంద్రయ్య, కూనవరం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కోసవరం గ్రామానికి చెందిన సోడీ భీమయ్య, చింతూరు మండలం చిరుమూరుకు చెందిన సోయం రామారావు, సల్వం రాము, కొత్తగూడెం జిల్లా పాల్వంచ మం డలం పాలకాయ తండాకు చెందిన చిందం జంపయ్య, కొత్తగూడెం మేదరి బస్తీకి చెందిన కొంటు రఘుకుమార్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా వారి వద్ద ఉన్న రెండు సంచుల్లో చిరుత పులుల చర్మాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.50 లక్షలకు పులుల చర్మాలు విక్రయించేందుకు వెళ్తున్నట్లు తేలింది. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామగుండం సీపీ విక్రమ్‌జీత్ దుగ్గల్ తెలిపారు. వరుస ఘటనలపై అనుమానాలు.. రామగుండంప్రాంతంలోని ప్రజలు పులుల సంచారంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనికి తోడు చిరుత పులుల చర్మాలను విక్రయించే ముఠాను పోలీసులు పట్టుకోవడంతో పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఒకవైపు అటవీశాఖ అధికారులు ఆయుధాలతో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పులుల జాడ కోసమే ప్రత్యేక బృందాలు తిరుగుతున్న క్రమంలో పులి చర్మాలను విక్రయిం చే ముఠా గోదావరిఖని బస్‌స్టేషన్‌లో పట్టుబడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. రూ.5 లక్షల నుంచి 50 లక్షలు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు పులుల చర్మాలు అక్రమ రవాణా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన నలుగురుతో పాటు కొత్తగూడెం, చం ద్రాపూర్కు చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొం తకాలంగా పులి చర్మాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు అటవీ ప్రాంతాలకు వెళ్లి అక్కడ కొందరు వేటాడిన క్రూరమృగాల చర్మాలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో పులి చర్మానికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా ధర పలుకుతోంది. ఇదే క్రమంలో ఇటీవల గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన ఓ కార్మికుడి నుంచి కూడా ఓ పులి చర్మాన్ని పోలీసులు సేకరించారు. అక్రమ చర్మాల పయనం ఎటువైపు.. అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన చిరుత చర్మాలను వివిధ ప్రాంతాలకు తరలించే ముఠా ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారో అనే విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదని తెలుస్తోంది. ముఠా సభ్యులు విచారణ సమయం లో పోలీసులకు సహకరించకపోవడం మరింత ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. -
దినదిన గండం..
వేసవి కాలం వచ్చిందంటే వన్యప్రాణులకు దినదిన గండమే. అడవిలో ఆకురాలడంతో వాటికి ఆహారం దొరకదు. గుంతల్లో నీరు ఎండిపోతుంది. తాగేందుకు నీరు లభ్యం కాదు. అడవి కార్చిచ్చు ఓవైపు వెంట పడుతుంటే, తప్పించుకుని వచ్చే క్రమంలో వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో జిల్లాలో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కొత్తగూడ(ములుగు): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లోనే వన్యప్రాణుల ఆనవాళ్లు ఉన్నాయి. 2017 సెప్టెంబర్ నుంచే వర్షాలు ముఖం చాటేయడంతో అటవీ ప్రాంతంలో జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. ఎక్కడో ఓ చోట నీళ్లున్న దగ్గరకు దాహం తీర్చుకోవడానికి వెళ్లి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మార్గ మధ్యలో ఎక్కడ ఉచ్చులు, ఎక్కడ విద్యుత్ తీగలు, ఎక్కడ వేటగాళ్లు మాటు వేసి ఉంటారో తెలియక దినదిన గండంగా కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. గూడూరు, కొత్తగూడ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోని భీమునిపాదం గుట్టలు, గంగారం, తాడ్వా యి, గంగారం, బయ్యారం మండలాల సరి హద్దు అటవీప్రాంతంలోని పాండవుల గుట్ట లు, కొత్తగూడ, తాడ్వాయి మండలాల సరి హద్దు అటవీ ప్రాంతాలు వేటగాళ్లకు అడ్డాగా మారాయి. వేట మాంసానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి వేటాడుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్‌ను వాహకంగా వేటగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. వన్యప్రాణులు వెళ్లే దారులను గుర్తించి, వాటికి కాళ్లకు తగిలే విధంగా చెట్లకు బైండింగ్ వైర్ చుట్టి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వేసిన రోజు జంతువులు పడకపోతే కనీసం విద్యుత్ సరఫరాను కూడా తొలగించడం లేదు. ఉచ్చులను కూడా అలాగే వదిలేస్తున్నారు. దీంతో అడవులకు వెళ్లే సాదు జంతువులు, మనుషులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల గంగారం మండలంలోని కోమట్లగూడెం అటవీ ప్రాంతంలో రెండు దుక్కిటెద్దులు ఉచ్చులకు బలైన విషయం తెలిసిందే. గత ఏడాది ఓటాయి అటవీ ప్రాంతంలో వేసిన ఉచ్చుల్లో పడి మృతిచెందిన కణుజును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటాయి గ్రామంలో కణుజు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చినా ఫారెస్ట్ అధికారులు దాడి చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉచ్చులు వేస్తున్న వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. నీళ్లకు వచ్చే దారే వేటకు మార్గం వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తోంది. అందుకోసం అడవిలో బోర్లు వేసి సోలార్ పంపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటి వద్ద సీసీ కెమెరాలు బిగించారు. కానీ, అవే వాటి ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందనే చర్చ జరుగుతోంది. జింకలు, అడవి పందులు, దుప్పిలు, కణుజులు, కొండగొర్రెల తదితర వన్యప్రాణులు నీటికోసం అడవిలో ఒకే మార్గం గుండా వచ్చి వెళ్తుండడాన్ని గమనించిన వేటగాళ్లు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా కొంత దూరంలో ఉచ్చులు వేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా నివాసం ఉండని అధికారులు మహబూబాబాద్‌లో గంగారం, కొత్తగూడ రేంజ్‌లు విభజించి చిన్న చిన్న బీట్లు చేశారు. అయినా వన్యప్రాణుల సంరక్షణ మాత్రం సాధ్యం కావడం లేదు. గంగారం, కొత్తగూడ రేంజ్‌కు ఎఫ్ఆర్వోలు లేక ఇన్చార్జిలతో నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం అటవీశాఖ అధికారులకు విలాసవంతమైన క్వార్టర్లు నిర్మించినా ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి సాధారణ ఉద్యోగుల్లా వచ్చి వెళ్తున్నారు. దీంతో పోడు జరిగినా, వేట జరిగినా, స్మగ్లింగ్ జరిగినా సిబ్బంది వచ్చే సరికే జరగాల్సింది జరిగిపోతోంది. ఎప్పుడైనా ఉన్నతాధికారులు వస్తున్నారనో, లేక సమాచారం ఉన్నతాధికారులకు తెలిస్తేనో హడావుడి చేసి అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు, వివిధ కార్యకలాపాలను బేస్ క్యాంపు, స్ట్రైకింగ్ ఫోర్స్ ద్వారా అధికా రులు ఫోన్లలో గుట్టుగా నడుపుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా యూనియన్లు, ఇతర సమస్యలు తలెత్తుతాయని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా వన్యపారణులను కాపాడాల్సిన అవసరం ఉంది. నిఘా పెంచుతాం.. వన్యప్రాణులను సంరక్షించడానికి అటవీ ప్రాంతంలో నిఘా పెంచుతాం. ఎక్కడ దొరికినా వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. క్వార్టర్లు కేటాయించిన ఉద్యోగులు స్థానికంగా ఉండేలా చూస్తాం. లేదంటే చర్యలు తప్పవు. – కిష్టాగౌడ్, డీఎఫ్ఓ -
విద్యుదాఘాతంతో ఇద్దరు వేటగాళ్లు మృతి
-
విద్యుదాఘాతంతో ఇద్దరు వేటగాళ్లు మృతి
రొద్దం(అనంతపురం): పొలానికి రక్షణగా వేసిన విద్యుత్ కంచె తగిలి ఇద్దరు వేటగాళ్లు మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలం శ్యాపురం గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు గొల్ల అంజినప్ప తన పొలంపై అడవి జంతువులు దాడి చేయకుండా విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి కర్ణాటకలోని హుస్సేనాపురం గ్రామానికి చెందిన ముగ్గురు వేటగాళ్లు అటుగా వచ్చి.. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. మృతులు హుస్సేనాపురం గ్రామానికి చెందిన బోయ నర్సింహులు, బోయ చిన్నప్పగా పోలీసులు గుర్తించారు. -
కెన్యాలో ఏనుగు దంతాలను తగులబెట్టేశారు
-
ఏనుగు దంతాలను తగలబెట్టేశారు
వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలో భాగంగా ప్రతి ఏడాది వేలాది ఏనుగులను స్మగ్లర్లు చంపేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టాలని కెన్యా నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు దేశంలో ఏనుగులను చంపి సేకరించిన... దాదాపు రూ.105 మిలియన్ డాలర్ల విలువైన ఏనుగు దంతాలను కెన్యాలోని నైరోబి జాతీయ పార్క్‌లో శనివారం తగలబెట్టారు. ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా వీటికి నిప్పుంటించారు. దేశంలో దాదాపు 7000 ఏనుగులకు చెందిన దంతాలను అక్రమంగా తరలిస్తుండగా... అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో దంతాల అక్రమ వ్యాపారం కోసం ఏనుగులను చంపివేస్తుండటంతో వాటి సంఖ్య భవిష్యత్తులో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని కెన్యా భావించింది. అందులోభాగంగా దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏనుగు దంతాలలో ఎవరు ఎటువంటి వ్యాపారం చేయకూడదు అన్నారు. ఈ వ్యాపారం అంటేనే మరణం, ఏనుగులను చంపితే... మన జాతి సంస్కృతి మృతి చెందినట్లే అని దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఓ ఏనుగు చంపేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా అయితే రానున్న 10 ఏళ్లలో మరింత దుర్భరం అవుతుందన్నారు. 1970లో ఆఫ్రికాలో 1.2 మిలియన్ ఏనుగులు ఉండేవని.. కానీ నేటి వాటి సంఖ్య నాలుగు నుంచి నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. ఏనుగు దంతాలను తగలబెట్టడం ద్వారా వేటగాళ్లను కెన్యా ఓ సందేశాన్ని ఇచ్చింది. -
కజిరంగాలో ఆగని ఖడ్గమృగాల హత్యలు
-
కజిరంగాలో ఆగని ఖడ్గమృగాల హత్యలు
అసోం: కజిరంగా జాతీయ పార్క్‌లో ఖడ్గమృగాలకు రక్షణ కరువైంది. ఎంతో అరుదైన ఈ అటవీ జంతువుల మరణ మృదంగం దొంగల దాడుల రూపంలో మారుమ్రోగుతోంది. కరడుగట్టిన దొంగలు ఒకటికాదు రెండు కాదు ఏడాది కాలంలో ఇప్పటి వరకు 20 ఖడ్గ మృగాల ప్రాణాలను తీసి వాటి కొమ్ములను ఎత్తుకెళ్లారు. కాగా, తాజాగా మరోసారి దొంగలు అదే అఘాయిత్యానికి తెగబడ్డారు. పార్క్‌లోకి చొరబడి ఓ మగ రైనోను చంపేసి దాని కొమ్మును కోసుకొని పారిపోయారు. తుపాకుల చప్పుళ్లు విని అధికారులు అక్కడి వచ్చేలోగానే ఆ దొంగలు దాని కళేబరాన్ని అక్కడ వదిలేసి కొమ్ముతో పరారైపోయారు. తిరిగి ఎప్పటిలాగానే ఘటనా స్థలి వద్ద చనిపోయి పడిఉన్న ఖడ్గమృగం, ఖాళీ బుల్లెట్లు లభించాయి. దీంతో, మరోసారి పార్క్ సంరక్షణ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభమై నెల రోజులు పూర్తికాకుండానే వరుసగా ఇది మూడో ఘటన. మొత్తం పన్నెండు నెలలు పరిగణనలోకి తీసుకుంటే ఇది 20వ ఘటన. అంటే 20 ఖడ్గమృగాలను దారుణంగా చంపేశారన్నమాట. ఈ వరుస సంఘటనలు చూస్తుంటే అధికారులు జాతీయ పార్క్‌పై నియంత్రణ కోల్పోయి దొంగలను అదుపుచేయలేకపోయారనే అనుమానం కలుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. -
మరో రైనోను చంపేశారు!
గౌహతి: ప్రపంచ చారిత్రక ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన అసోంలోని ఖజిరాంగా నేషనల్ పార్క్‌లో మరో ఒంటి కొమ్ము రైనోను వేటగాళ్లు పొట్టన పెట్టుకున్నారు. పార్క్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా రైనో మృతదేహాన్ని సోమవారం కనుగొన్నారని పార్క్ డైరెక్టర్ ఎంకె యాదవ్ తెలిపారు. నాటు తుపాకీ గాయంతో పాటు, రైనో కొమ్ము కనిపించకపోవడంతో ఇది అక్రమ వేటగాళ్ల పనేనని పార్క్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రపంచంలో ఉన్న ఒంటి కొమ్ము రైనోలు దాదాపు 70 శాతం ఖజిరాంగా పార్క్‌లోనే ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదీతీరంలో సుమారు 858 చదరపు కి.మీ.పరిధిలో విస్తరించి ఉన్న ఈ జాతీయ పార్క్‌లో ఈ సంవత్సరంలో గత జనవరి నుంచి 12 రైనోసార్లు హత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. -
వన్య ప్రాణుల వేటగాళ్లు అరెస్టు
పశ్చిమగోదావరి : అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి మృతి చెందిన నున్నా అరుణకుమార్ కేసులో పోలీసులు కంచనగూడెం గ్రామానికి చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కంచనగూడెం వెదుళ్ళమెట్ట సమీపంలో వేటగాళ్ళు వన్య ప్రాణుల కోసం ఈ నెల 20 వ తేదీ రాత్రి ఈది కృష్ణకు చెందిన పొలంలో విద్యుత్ తీగలు అమర్చారు. గ్రామానికి చెందిన నున్న అరుణకుమార్ ఈ విషయం తెలియక తన పొలంలోకి బయలుదేరాడు. మధ్యలో కరెంట్ తీగలు తగిలి షాక్‌గురై మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన వేటగాళ్లు సాక్ష్యాలను తారుమారు చేసే ఉద్దేశంతో అరుణకుమార్ మృతదేహాన్ని కొద్ది దూరంలో ఉన్న నక్కా లక్ష్మీ కాంతం పొలంలో పడేశారు. మృతుని తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలవరం సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ వీఎస్ వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణ అనంతరం సంఘటనకు కారణమైన వన్య ప్రాణులను వేటాడే కొత్తపల్లి గాంధి, నీలం సూరిబాబు, మేడూరి చంటి, తన పొలంలో విద్యుత్ వైర్లు పెట్టుకోవడానికి అనుమతించిన ఈది కృష్ణలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పి వెంకట్రావు తెలిపారు. వీరితో పాటు మరో 9 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.