Viral Video మృత్యువు.. ఎటు నుంచి, ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. అలాంటిది చావు ముఖం ఇలా ఉంటుందా? అని ఆ తల్లీకూతుళ్లు గజగజ వణికిపోయారు కాసేపు. అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో జరిగిన ఓ భయానక ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఖడ్గమృగం.. చూడడానికి ఎంతటి భారీకాయంగా ఉంటుందో అంతే ప్రమాదకరమైంది కూడా. ఉగ్రరూపంలో అది చేసే దాడి.. పెద్ద పెద్ద వాహనాలను సైతం కూలదోస్తుంది. అలాంటి జీవి కళ్లెదుట ఆ తల్లీకూతుళ్లు ప్రాణ భయంతో రోదనలు పెడుతూ కాసేపు గడిపారు.
కజిరంగా నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం మంద నడుమ.. టూరిస్టుల జీపులు తిరుగుతూ కనిపించాయి. అయితే మరి దగ్గరగా ఉండడంతో.. వేగంగా వెళ్లేందుకు రెండు జీపులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో హఠాత్తుగా మలుపు తిరిగిన రెండో జీపు వెనుక నుంచి తల్లీకూతుళ్లు కిందపడిపోయారు. అంతే.. ఒక్కసారిగా అటు టూరిస్టులు.. ఇటు ఆ తల్లీకూతుళ్ల అరుపులతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆ ఇద్దరికీ అతిసమీపంలోనే ఉన్న ఖడ్గమృగం(Rhino).. వెనక్కి తిరిగివాళ్లను చూసింది. ఈలోపు.. అక్కడే ఉన్న మరో ప్రయాణికుల జీపు వైపుగా ఇంకో రైనో దూసుకెళ్లింది. కట్ చేస్తే..
ఆ తల్లీ తన కూతురిని అదిమి పట్టుకుని నేలపై పడుకునిపోయింది. రక్షించమంటూ గట్టిగా అరుస్తూ వేడుకుంది. ఈలోపు.. ముందుకు వెళ్లిన జీపు నెమ్మదిగా వాళ్ల దగ్గరకు చేరుకుంది.క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బిడ్డతో తల్లి వాహనం ఎక్కేసింది. దీంతో ఖడ్గమృగం దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
కాస్త దూరంలో మరో టూరిస్టు వాహనంలో ఉన్న వ్యక్తి.. అదంతా చిత్రీకరించడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో.. పర్యాటకుల భద్రత గురించి చర్చ మొదలైంది. తమదాకా విషయం రావడంతో అధికారులు వైరల్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు.. ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కజిరంగాలో బాగోరీ రేంజ్‌లో ఈ మధ్యే ఈ ఘటనచోటు చేసుకున్నట్లు సమాచారం.
అసోం కజిరంగా(Kaziranga) నేషనల్ పార్క్‌లో 2,613 రైనోలు ఉన్నాయి(2022 లెక్కల ప్రకారం..). ప్రపంచంలోని ఖడ్గమృగాల జనాభాలోనే ఇది దాదాపు 70 శాతం.
పైగా ఒంటి కొమ్ము రైనోలకు కజిరంగా నేషనల్ పార్క్ సుప్రసిద్ధం. కొమ్ము 57 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతుంది.
బరువు.. 2,200 కేజీల నుంచి 3 వేల కేజీల బరువు దాకా పెరుగుతాయి. ఎత్తు 5.7-6.7 ఫీట్లు
Horrible incident at the Kaziranga National Park in Assam.
Two women fell off a safari jeep as a rhino could be seen in very close proximity. Moments later, a second rhino came running towards another jeep safari, forcing it to take a reverse gear.
The women escaped unharmed… pic.twitter.com/6s9zz8WHSZ— Vani Mehrotra (@vani_mehrotra) January 6, 2025
అంత భారీకాయం ఉన్నప్పటికీ.. గంటకు 25 మైళ్ల వేగంతో(40 కిలోమీటర్లు) పరిగెడుతాయి. ఇవి బాగా ఈదగలవు కూడా.
ఇవి హెర్బివోర్స్. గడ్డి, ఆకులు, పండ్లు తింటాయి.
వీటి చర్మం దళసరిగా ఉండి.. ముడలతో ఉంటుంది. వీటి జీవితకాలం 40 సంవత్సరాలు
ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీని వరల్డ్ రైనో డేగా నిర్వహిస్తారు.
ఈ భూమ్మీద ఐదు జాతుల ఖడ్గమృగాలు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం అవగాహనగా ఈ రోజును నిర్వహిస్తుంటారు.
2024లో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా నిర్వహించారు
కీప్ ద ఫైవ్ ఎలైవ్(ఆ ఐదింటిని బతకనిద్దాం) పేరుతో డేను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment