
అసెంబ్లీకి వెళ్లిదే ఎవరు.. ప్రజా ప్రతినిధులు. వారు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వ్యక్తిగత అలవాట్లను పక్కన పెడితే, అసెంబ్లీని మాత్రం శుభ్రంగా ల్సిన కనీస బాధ్యత వారిపై ఉంటుంది. అది కూడా ఎమ్మెల్యేలు చేయకపోతే, ఇక ప్రజలకు వారిచ్చే సందేశం ఏముంటుంది. మరి అటువంటి ఎమ్మెల్యేలు తమ బాధ్యతను మరిచి కనీసం అసెంబ్లీని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే, ఇలానే ఉంటుంది. అసలు ఏమి జరిగిందనే విషయాన్ని ఒక్కసారి చూస్తే..
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికరమైన ఉదంతం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీ హాల్‌ను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. అనంతరం విధాన సభలో ఆయన చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. సభా ప్రాంగణంను శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరిన ఆయన.. తాను శుభ్రం చేయడానికి గల కారణం చెప్పడంతో ఎమ్మెల్యేలంతా తలలు దించుకున్నారు.
సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీష్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఉదయం విధాన సభ హాల్‌లో జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకాయన పాన్ మసాలా నమిలి ఉమ్మేశారు. విషయం తెలియగానే నేనే స్వయంగా వెళ్లి అక్కడ శుభ్రం చేశా. ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూశా. కానీ, పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవడం లేదు.

తనంతట తానుగా ఆయన నా దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చుకుంటే మంచిది. లేకుంటే నేనే పిలవాల్సి ఉంటుంది. ఈ సమయంలో దయచేసి మీ అందరికీ ఓ విజ్ఞప్తి. ఇక మీదట అలా ఎవరైనా చేస్తుండడం మీరు గమనిస్తే.. వాళ్లను అడ్డుకోండి. ఎందుకంటే.. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని అన్నారు.
#WATCH | Uttar Pradesh Assembly Speaker Satish Mahana raised the issue of some MLA spitting in the House after consuming pan masala. He said that he got the stains cleaned, urged other MLA to stop others from indulging in such acts and also appealed to the MLA to step forward and… pic.twitter.com/VLp32qXlU8
— ANI (@ANI) March 4, 2025
Comments
Please login to add a commentAdd a comment