Viral Video: Cook Spits on Rotis at Ghaziabad Hotel, Arrested - Sakshi
Sakshi News home page

Viral Video: మరో ఉదంతం.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ

Jan 20 2023 3:28 PM | Updated on Jan 20 2023 3:58 PM

Viral Video Of Cook Spits On Rotis At Ghaziabad Hotel  Arrested  - Sakshi

రోజూ ఇంట్లో తయారు చేసిన ఫుడ్‌ తిని బోర్‌ కొట్టి వారానికి ఒకసారి అయిన బయట భోజనం చేయాలని చాలా మందికి ఉంటుంది. హోటల్‌కి వెళ్లి నచ్చి ఆహారం తెచ్చుకోవడం లేదా ఆర్డర్‌ పెట్టడం చేస్తుంటారు. అయితే వెళ్లిన హోటల్ మంచిదేనా.. వారు వంట ఎలా చేస్తున్నారో అసలు పట్టించుకోం. రుచిగా ఉందా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ కొన్ని హోటళ్లలో  కనీస శుచి, శుభ్రత పాటించకుండా దారుణంగా వంట చేస్తారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ఆహార పదార్థాలు, స్నాక్స్‌ తయారు చేస్తూ వాటిలో ఉమ్మివేసిన ఘటనలు  ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా ఇలాంటి మరొ షాకింగ్‌ వీడియో వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్‌లో  తందూరీ రోటీని  తయారు  చేస్తున్న ఓ వ్యక్తి పిండిపై ఉమ్మివేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో గురువారం జరిగింది. సాహిదాబాద్‌ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో తసీరుద్దీన్‌ అనే వ్యక్తి తందూరి రోటీలపై ఉమ్మివేస్తూ తయారు చేస్తున్నాడు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు రెస్టారెంట్‌ను మదీనా హోటల్‌గా గుర్తించిన తిలా మోర్‌ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై బుధవారం 269, 270 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని, అతనిపై చర్యలు తీసుకుంటామని సాహిబాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పూనమ్ మిశ్రా వెల్లడించారు.  
చదవండి: Delhi: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు వేధింపులు.. బయటకొచ్చిన వీడియో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement