rotis
-
చపాతీలు మిగిలిపోతే పడేస్తున్నారా?.. అయ్యయ్యో వద్దమ్మా!
ఇంట్లో చపాతీలు మిగిలిపోతే పారేస్తున్నారా?. ఐతే ఇక నుంచి పడేయొద్దు. అవే దివ్య ఔషధం అని బోలెడన్ని ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు మంచిదని చెబుతున్నారు. చాలామంది నిల్వ అయిన చపాతీలు తినేందుకు ఇష్టపడరు. కానీ ఆరోగ్య నిపుణులు అవే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పారు. అవేంటంటే..? తాజాగా అప్పటి కప్పుడు చేసుకున్న గోధుమ చపాతీలనే ఇష్టంగా తింటా. ఒకవేళ మిగిలపోతే కుక్కలకు పెట్టడం లేదా బయటపడేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యనిపుణులు ఇది అనారోగ్యం కాదని నొక్కి చెబుతున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉంటుంది. పైగా సోడియం కూడా తక్కువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి చిరుతిండిగా కూడా పేర్కొనవచ్చు అని అన్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. ముఖ్యంగా జీర్ణక్రియకు.. రాత్రి పూట అంతా నిల్వ ఉండి లేదా చపాతీలు చేసిన 12 నుంచి 15 గంటల తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. అలా నిల్వ ఉండటం వల్ల అదులో చేరిన బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. మంచి శక్తిని అందిస్తాయి.. అల్పాహారంలో బాసి రోటీ(నిల్వ అయిన చపాతీ! బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల రోజంతా శక్తిమంతంగానూ బలంగా ఉంటుంది. ఎక్కువ తిన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్న చేసేందుక చాలా టైం పడుతుంది. అందువల్ల త్వరితగతిన ఆకలవ్వదు. పైగా పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. 30 రోజుల్లో బరువు తగ్గడానికి.. మిగిలిపోయిన చపాతీల్లో కేలరీలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి (30 రోజుల్లో బరువు తగ్గడానికి) సహాయకరంగా ఉంటుంది. నిజానికి, ఉదయాన్నే పాత చపాతీ(నిల్వ చపాతీ) తిన్నప్పుడు పొంట నిండుగా ఉన్నట్లు అనిపించి, త్వరితగతిన ఆకలివేయదు. తద్వారా మీరు అతిగా తినకుండా ఉండగలుగుతారు. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. బీపీ, షుగర్ నియంత్రణలో.. డయాబెటిక్ రోగులకు పాత చపాతీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో వీటిని తినడం వల్ల రోజంతా వచ్చే షుగర్ స్పైక్‌ల నుండి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో, పాత చపాతీల్లో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది, దీని కారణంగా రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం అనేది ముఖ్యం..! రోటీ లేదా పాత చపాతీ సరైన విధంగా 12 గంటల పాటు నిల్వ ఉంచినప్పుడూ..వాటి రుచి, ఆకృతి స్టార్చ్ కూర్పులు మార్పులకు లోనవ్వుతాయి. ఇది మన ఆరోగ్యానికి ఉపయోగాపడే ఫైబర్ లాగా రెసిస్టెంట్ స్టార్చ్లా మారుతుంది. ఫలితంగా తేలికగా గ్లూకోజ్‌గా విడిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ తాజా లేదా పాత చపాతీల మధ్య గ్లైసెమిక్ ఇండెక్స్‌లో వ్యత్యాసం ఉంటుంది. తాజా చపాతీలు రక్తంలోని చక్కెర నియంత్రణను గణనీయంగా ప్రభావితం చేయవు కానీ నిల్వ చపాతీలు చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. ఇక్కడ చపాతీలు బూజు పట్టకుండా మంచి పద్ధతిలో నిల్వ చేయడం అనేది అత్యం ముఖ్యం అని గుర్తించుకోవాలి. తాజా చపాతీ రుచిగా ఉంటే ..నిల్వ ఉన్న చపాతీలను చాలా నెమ్మదిగా తినాలి, రుచి తక్కువుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ తెలుసుకోవాల్సింది.. నిల్వ ఉండటం వల్ల గోధుమ పులుస్తుంది దీన్నే కిణ్వనప్రక్రియ అంటాం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే మంచి పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?) -
Video: రెస్టారెంట్లో దరిద్రం.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ..
రోజూ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తిని బోర్ కొట్టి వారానికి ఒకసారి అయిన బయట భోజనం చేయాలని చాలా మందికి ఉంటుంది. హోటల్‌కి వెళ్లి నచ్చి ఆహారం తెచ్చుకోవడం లేదా ఆర్డర్ పెట్టడం చేస్తుంటారు. అయితే వెళ్లిన హోటల్ మంచిదేనా.. వారు వంట ఎలా చేస్తున్నారో అసలు పట్టించుకోం. రుచిగా ఉందా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ కొన్ని హోటళ్లలో కనీస శుచి, శుభ్రత పాటించకుండా దారుణంగా వంట చేస్తారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ఆహార పదార్థాలు, స్నాక్స్ తయారు చేస్తూ వాటిలో ఉమ్మివేసిన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి మరొ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్లో తందూరీ రోటీని తయారు చేస్తున్న ఓ వ్యక్తి పిండిపై ఉమ్మివేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో గురువారం జరిగింది. సాహిదాబాద్ ప్రాంతంలోని రెస్టారెంట్లో తసీరుద్దీన్ అనే వ్యక్తి తందూరి రోటీలపై ఉమ్మివేస్తూ తయారు చేస్తున్నాడు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు రెస్టారెంట్‌ను మదీనా హోటల్‌గా గుర్తించిన తిలా మోర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై బుధవారం 269, 270 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని, అతనిపై చర్యలు తీసుకుంటామని సాహిబాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పూనమ్ మిశ్రా వెల్లడించారు. చదవండి: Delhi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు వేధింపులు.. బయటకొచ్చిన వీడియో..! Uttar Pradesh | A video was going viral on social media from the area under Tila More police station, in which a man was making rotis by applying spit. Accused Taseeruddin has been arrested in the case & further legal action is being taken: Poonam Mishra, ACP, Sahibabad (19.01) pic.twitter.com/cHi5jtOrwi — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 20, 2023 -
వీడేం మనిషి రా బాబు.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ..
-
Recipe: అటుకులు, జొన్నపిండి.. నోరూరించే పోహా రోటీ- ఆమ్లెట్ రోల్స్ తయారీ ఇలా
రోటీ, ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా! ఇలా వెరైటీగా అటుకులు, జొన్నపిండితో రొట్టె చేసుకుని.. ఆమ్లెట్ రోల్స్ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది. పోహా రోటీ – ఆమ్లెట్ రోల్స్ కావలసినవి: ►గుడ్లు – 3 (ఒక బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని, అందులో ఉప్పు,కారం, పసుపు, పాలతోపాటు ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కూరగాయల తరుగు వంటివి అభిరుచిని బట్టి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి) ►అటుకులు – 2 కప్పులు ►జొన్నపిండి – పావు కప్పు ►నెయ్యి – టేబుల్ స్పూన్ ►గోరు వెచ్చని నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ►ముందుగా అటుకులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►జొన్నపిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని, గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. ►15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని, తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ►ఆ ఉండలను చపాతీల్లా ఒత్తుకోవాలి. ►పాన్‌పై సరిపడా నూనె వేసుకుని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ►ఒకవైపు ఆమ్లెట్ వేసుకుని.. సర్వ్చేసుకునే ముందు.. నచ్చిన మసాలా కర్రీతో రోల్స్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా -
Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా!
హర్యానా స్టైల్.. నోరూరించే శనగపిండి మసాలా రోటీ తయారీ విధానం తెలుసుకుందాం! శనగపిండి మసాలా రోటీ తయారీకి కావలసినవి: ►శనగపిండి – కప్పు ►గోధుమ పిండి – కప్పు ►పసుపు – అర టీస్పూను ►వాము – టీస్పూను ►ఉప్పు – టీస్పూను ►పెరుగు – అరకప్పు మసాలా: ►కారం – అరటీస్పూను ►జీలకర్ర పొడి – అరటీస్పూను ►ధనియాలపొడి – అరటీస్పూను ►నెయ్యి – టేబుల్ స్పూను. తయారీ.. ►గోధుమపిండి, శనగపిండి, పసుపు, వాము, ఉప్పులను గిన్నెలో వేయాలి. ►దీనిలో పెరుగు అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుని ముద్దలా కలుపుకోని ఇరవై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ►మసాలా కోసం తీసుకున్న అన్ని పొడులు, నెయ్యిని గిన్నెలో వేసి చక్కగా కలపుకుని పక్కనపెట్టుకోవాలి. ►పిండిముద్దను ఉండలు చేయాలి. ►ఒక్కో ఉండను పిండి చల్లుకుంటూ గుండ్రని చపాతీలా వత్తుకోవాలి. ►ఈ చపాతీపై కలిపిపెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి త్రికోణాకృతిలో మడతపెట్టి మరోసారి చక్కగా వత్తుకోవాలి. ►రోటీని రెండువైపులా నెయ్యి చల్లుకుంటూ చక్కగా కాల్చుకుంటే శనగపిండి మసాలా రోటీ రెడీ. ఇవి కూడా ట్రై చేయండి: Saag Chicken Recipe: హర్యానా వంటకం.. సాగ్ చికెన్ తయారీ ఇలా! -
Recipe: మొక్క జొన్న పిండి, ఉప్పు, వాము.. మక్కి రోటీ ఇలా ఈజీగా!
మక్కి రోటీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంట్లో ఇలా సులభంగా తయారు చేసుకోండి. కావలసినవి: ►మొక్కజొన్న పిండి – రెండు కప్పులు ►వాము – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►వేడి నీళ్లు – కప్పు ►నెయ్యి – రోటి ఫ్రైకి సరిపడా. తయారీ.. ►మొక్కజొన్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, వాము వేసి చక్కగా కలుపుకోవాలి. ►దీనిలో కొద్దికొద్ది గా వేడి నీళ్లు పోస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ►ఈ పిండి ముద్దను పదినిమిషాలు నానబెట్టాలి. ►తరువాత పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేయాలి. ►ఒక్కో ఉండను మందపాటి చపాతీలా వత్తుకోవాలి∙ ►ఉండలన్నింటిని ఇలా వత్తుకున్న తరువాత, నెయ్యి వేసి రోటిని రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మక్కీ కి రోటీ రెడీ అయినట్లే. ►ఏ గ్రేవీ కర్రీలోనైనా ఈ రోటీ నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ తయారీ! Recipe: చామదుంపతో.. నోరూరించే కచ్లు చాట్ తయారీ ఇలా! -
Recipes: సువాసన భరిత బటర్ టీ.. టింగ్మో, ఖమీరి రోటీ ఇంట్లోనే ఇలా ఈజీగా!
Recipes In Telugu: రారమ్మని పిలిచే లద్దాఖ్ ప్రకృతి అందాలు.. నీలంరంగు ఆకాశం, మంచు దుప్పట్లు కప్పారా అన్నట్లున్న పర్వతాలతో ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. టిబెట్ సంస్కృతీ సంప్రదాయ మూలాలున్న లద్దాఖ్ వాసుల వంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు టిబెట్, ఇండియన్ రుచుల కలబోతతో ఎంతో రుచికరంగా ఉంటాయి. లద్దాఖ్ వెళ్లి అక్కడి వంటకాల రుచి చూడాలంటే కాస్త కష్టమే కాబట్టి, అక్కడిదాకా వెళ్లకుండానే లద్దాఖ్ పాపులర్ వంటకాలను ఎలా వండుకోవచ్చో చూద్దాం... ఖమీరి రోటీ కావలసినవి: ►గోధుమపిండి – రెండుంబావు కప్పులు ►నల్ల జీలకర్ర(కలోంజి) – టీస్పూను ►పాలు – కప్పు, పంచదార పొడి – అరటేబుల్ స్పూను ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ►పొడి ఈస్ట్ – ఒకటిన్నర టీస్పూన్లు ►పుచ్చకాయ విత్తనాలు – టీస్పూను ►నువ్వులు – టీస్పూను, కొత్తిమీర – గుప్పెడు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ.. ►ముందుగా గోరువెచ్చని నీటిలో ఈస్ట్వేసి నానబెట్టాలి. ►ఒక పెద్దగిన్నెలో గోధుమపిండి, పంచదార వేసి కలపాలి. ►ఈ పిండిలోనే పాలు, ఈస్ట్వేసిన నీళ్లు వేసి మెత్తటి ముద్దలా కలపాలి. ►ఈ పిండి ముద్దపై తడివస్త్రాన్ని కప్పి ఇరవై నిమిషాలు పక్కనపెట్టాలి. ►ఇరవై నిమిషాల తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఉండ మధ్యలో చిన్న రంధ్రం చేసి పుచ్చకాయ, నువ్వులు, నల్లజీలకర్ర వేసి మూసేయాలి ►ఇప్పుడు ఉండలను రెండు అంగుళాల మందంలో చిన్నసైజు రోటీల్లా వత్తుకోవాలి. ►ఈ రోటీలను బేకరీ ట్రేలో లేదా పెనం మీద ఆయిల్ రాసి దానిపై రోటీని ఉంచాలి. ►ఈ పెనాన్ని సన్నని మంటమీద బోర్లించి రోటీని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఉడికించాలి. ►వేడివేడి రోటీలను కొత్తిమీరతో గార్నిష్‌చేసి, పైన కొద్దిగా నెయ్యి చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి. టింగ్మో కావలసినవి: ► గోధుమపిండి – పావు కేజీ ►ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి) ►వెల్లుల్లి తరుగు – టీస్పూను ►బేకింగ్ పౌడర్ – రెండు టీస్పూన్లు ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), నీళ్లు – రెండు కప్పులు, కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు. తయారీ.. ►గోధుమపిండిని ఒక గిన్నెలో వేసి టేబుల్ స్పూను ఆయిల్, బేకింగ్ పౌడర్ వేసి తగినంత నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి. ►పిండి ముద్దను చిన్న చిన్న రోల్స్ చేయాలి. ►ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుని చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని రోల్స్‌లో నింపి పువ్వులా వత్తుకోవాలి. ►ఈ పువ్వులను ఆవిరి మీద ఇరవై నిమిషాలు ఉడికిస్తే టింగ్మో రెడీ. సుజా (బటర్ టీ) కావలసినవి: ►ఎండు టీ ఆకులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►పాలు – ముప్పావు కప్పు ►బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ►నీళ్లు – రెండున్నర కప్పులు ►ఉప్పు – అరటేబుల్ స్పూను. తయారీ.. ►గిన్నెలో నీళ్లు, టీపొడి వేసి మరిగించాలి ►టీపొడి బాగా మరిగి డికాషన్ సువాసన వస్తున్నప్పుడు వేరే పాత్రలోకి వడగట్టాలి ►ఇప్పుడు వడగట్టిన డికాషన్‌లో పాలు, బటర్, ఉప్పువేసి హ్యాండ్ బ్లెండర్తో ఐదునిమిషాలపాటు చిలకాలి ►చక్కగా చిలికిన తరువాత మరోసారి వేడి చేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి 👇 Nadru Yakhni: చపాతీ, అన్నంలోకి తామర పువ్వు కాడతో రుచికరమైన వంటకం! ఇలా Mango Vada: పచ్చిమామిడి తురుముతో మ్యాంగో వడ.. -
Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్
సాక్షి బళ్లారి (కర్ణాటక): రూపాయికే రెండు రొట్టెలు, దాల్, లేదా చిత్రాన్నం వివిధ రకాల ఫ్రైడ్ రైస్‌లతో కూడిన భోజనాన్ని అందించేందుకు జైన్ యువక మండలి ముందుకు వచ్చింది. తక్కువ ధరకే భోజనాన్ని శుక్రవారం నుంచి పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. నగరంలోని జైన్ దేవాలయం వద్ద ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. జైన్ యువక మండలి పదాధికారులు భరత్‌జైన్, తదితరులు మాట్లాడుతూ ఓపీడీ ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, ప్రైవేట్, ప్రభుత్వ బస్టాండ్ల వద్దకు ఈ మొబైల్ వాహనం చేరుకొని పేదలకు రూ.1కే భోజనం అందిస్తుందని తెలిపారు. చదవండి: విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్ -
బతకడం కోసం.. గడ్డి రోటీలు తింటున్నారు
భారీ వర్షాలు, వరదలకు చెన్నైవాసులు వారం రోజుల పాటు ఎన్నో కష్టాలుపడ్డారు. తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు దొరకక అలమటించారు. చెన్నై వాసుల కష్టాలు చూసి దేశమంతా చలించిపోయింది. వారిని ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందుకువచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో చాలా గ్రామాల్లో నిత్యం ఇదే పరిస్థితి. అక్కడ వర్షాలు, వరదలు లేవు కానీ.. కరువు, పేదరికంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేదు. గడ్డితో తయారు చేసిన రోటీలు తిని బతుకుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. యూపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో వర్షాభావం వల్ల కొన్నేళ్లుగా పంటలు పండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు పేదరికంతో మగ్గిపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. వారికి గడ్డి, కలుపు మొక్కలే ఆహారం. వీటిని రోటీలుగా చేసుకుని కడుపు నింపుకొంటున్నారు. 'సాధారణంగా గడ్డిని పశువులకు వేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం బతకాలంటే ఇదే గడ్డి తినడం మినహా మరో మార్గం లేదు' అని స్థానికులు వాపోయారు. ఎండిన గడ్డి మొక్కలను (ఫికార్) కోసుకుని వాటిలోని విత్తనాలను ఇంటికి తీసుకెళతారు. ఆ విత్తనాలను రోకట్లో దంచి పిండిలా తయారు చేస్తారు. ఈ పిండినీ రోటీల ఆకారంలో చేసి పొయ్యిలో కాల్చుకుంటారు. ఆ ప్రాంతంలో లభించే 'సమాయ్' అనే మొక్కల ఆకులను నీళ్లలో ఉడికించి కొంచెం ఉప్పు, నూనె వేసి కూరగా చేస్తారు. వీటిని పిల్లలకు వండిస్తారని స్థానికులు తెలిపారు. పేదరికం వల్ల బుందేల్‌ఖండ్‌లో చాలా గ్రామాల ప్రజలకు రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని రెణ్నెల్ల క్రితమే యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. -
రోటీ బ్యాంకు!
మార్గం ఎప్పుడూ ఉంటుంది. ఉండాల్సింది మనసే! మనసున్న ఆ యువకులు ఆకలితో అలమటించే వాళ్ల కడుపులు నింపాలనుకున్నారు. అది చిన్న విషయమేమీ కాదు. ఎంత ఖర్చవుతుందో వాళ్లకి తెలుసు. అయినప్పటికీ వాళ్లు ఖర్చుకు భయపడలేదు. ‘మా కోరిక సాధ్యపడుతుందా?’ అని ఒకటికి పదిసార్లు ఆలోచించలేదు. మనసు ఉంది... మార్గం తెరుచుకుంది. ఆ మార్గమే... ‘రోటీ బ్యాంక్’! రోటీ బ్యాంకు అంటే ఒక చల్లని నీడ. పేదోళ్ల కంటిపాప. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా వెనకబడిన జిల్లా. ఈ జిల్లా కేంద్రంలో సౌకర్యాలు, అభివృద్ధి మాట అలా ఉంచి... ఏ మూల చూసినా పేదరికం ఉట్టిపడుతున్నట్లు ఉంటుంది. అన్ని పక్కల్నుంచీ ఆకలికేకలు వినిపిస్తున్నట్లుగానే ఉంటుంది. ఈ పరిస్థితికి చలించిన ఐదుగురు యువకులు... అన్నార్తుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఒక బృందంగా ఏర్పడ్డారు. వారికి మరో అయిదుగురు తోడయ్యారు. ఆ అయిదుగురికి ఇంకో అయిదుగురు... ఇలా మొత్తం నలభై మంది యువకులు ఒక బృందంగా ఏర్పడ్డారు. రోటీ బ్యాంకును స్థాపించారు. ఈ బృందంలోని యువకులు రోజూ పట్టణమంతా తిరుగుతూ ధనికులు, మధ్యతరగతి కుటుంబాల నుంచి రొట్టెలను, కూరలను సేకరిస్తారు. ప్రతి ఇంటి నుంచి రెండు రొట్టెలు సేకరించాలని నియమంగా పెట్టుకున్నారు. నిజానికి ఇలా సేకరించడం మొదట కష్టంగా ఉండేది. కొందరు రేపుమాపు అని తప్పించుకునే వారు. మరి కొందరు ‘‘ ఈ రొట్టెలను ఎక్కడైనా అమ్ముకుంటారా ఏమిటి?’’ అని అనుమానంగా ప్రశ్నించేవాళ్లు. కొందరైతే వాసన వచ్చే నిల్వ రొట్టెలు ఇచ్చేవారు. అయినా కూడా బృంద సభ్యులు నిరాశ పడలేదు. వెనక్కి తగ్గాలనుకోలేదు. తమ ఆలోచన గురించి, ఆశయం గురించి ఓపిగ్గా చెప్పడం ప్రారంభించారు. మెల్లగా అందరిలోనూ కదలిక వచ్చింది. ప్రతి ఇంటివారూ రెండు తాజా రొట్టెలను ఇవ్వడం ప్రారంభించారు. స్థానిక పత్రికల ద్వారా రోటీ బ్యాంకు గురించి అందరికీ తెలిసింది. ఇక అపార్థాలు బంద్. మూతివిరుపులు బంద్. పాచి రొట్టెలు, పనికి రాని రొట్టెలు ఇవ్వడం బంద్. పట్టణాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాలకు సంబంధిం చిన బాధ్యతలను పంచుకున్నారు ఈ నలభైమంది యువకులు. మెల్లగా ‘రోటీ బ్యాంక్’లో రొట్టెల సంఖ్య రోజురోజుకూ పెరగడం ప్రారంభించింది. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందడం మొదలైంది. రొట్టెలు ఇవ్వలేనివారు పిండి ఇస్తే, దానితో వాలంటీర్లు రొట్టెలు చేసి పంచుతుంటారు. చిన్నగా మొదలైన ‘రోటీ బ్యాంకు’ ఇప్పుడు ఒక ఉద్యమంగా మారి రోజూ నాలుగు వందల మంది ఆకలి తీరుస్తోంది. రైల్వేస్టేషన్ ముందు కనిపించే యాచకులు, చెత్త ఏరుకునే వాళ్ల నుంచి మొదలు... ఆస్పత్రిలో బీద పేషెంట్ల వరకు ఈ ‘రోటీ బ్యాంకు’ ఎందరి ఆకలినో తీరుస్తోంది. అరవై ఏళ్ల రామ్‌ప్రకాశ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న ‘రోటీ బ్యాంకు’ ప్రతిరోజూ అతడి ఆకలిని తీరుస్తోంది. ఇరవై నాలుగేళ్ల సురేష్ నిరుద్యోగి. రోజంతా ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో ప్రయత్నిస్తుంటాడు. ఎక్కడికి వెళ్లినా కాలినడకనే వెళ్లే సురేష్ దగ్గర చిల్లర డబ్బులు కూడా ఉండవు. అతడి ఆకలినీ తీరుస్తోంది రోటీ బ్యాంక్. ఇంతమంది కడుపులు నింపుతోన్న రోటీ బ్యాంక్ అంటే మహోబాలోని వారికి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల వారికీ ఎంతో గౌరవం. ‘‘ఆ యువకులను... పేదవాళ్ల కోసం దేవుడు పంపించాడు’’ అంటాడు కృతజ్ఞత నిండిన కంఠంతో రామ్‌ప్రకాశ్. ‘‘రోటీబ్యాంక్ అనేది లేకుంటే ఆకలితో చనిపోయేవాడిని’’ అంటాడు సురేష్. ‘‘ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే. దయచేసి మా బ్యాంకుకు తాజా రొట్టెలను మాత్రమే ఇవ్వండి’’ అంటు న్నాడు ‘రోటీ బ్యాంకు’ సభ్యుడైన హాజీ మహ్మద్. మరిన్ని నగరాలలో ‘రోటీ బ్యాంక్’ కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది నలభైమంది యువకుల ఆశయం. వారి ఆశయం త్వరగా ఫలించాలని ఆశిద్దాం! -
ధర్నాలు, దహనాలు
రైల్వే చార్జీల పెంపుపై దేశవ్యాప్త నిరసనలు ఉపసంహరించాలని విపక్షాల డిమాండ్ ఢిల్లీ, యూపీ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైలు చార్జీలను భారీగా పెంచడంపై శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో విపక్షాలు ధర్నాలు, రైల్‌రోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టాయి. సామాన్యులపై పెను భారం మోపేలా ఉన్న ఈ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ అరవిందర్‌సింగ్ లవ్లీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రైల్ భవన్ వెలుపల ధర్నా నిర్వహించారు. సీపీఎం నేతలు కూడా వీరికి జత కలిశారు. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్తంభించింది. నిరసనకారులు బ్యారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వాటర్ కేనన్లతో వారిన చెదరగొట్టారు. తమను గెలిపిస్తే దేశానికి మంచి రోజులు తీసుకొస్తామంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పిన వారు (ప్రధాని మోడీని ఉద్దేశించి) ఇప్పుడు కఠిన నిర్ణయాలు, చేదు గుళికలు అంటూ మాట్లాడుతున్నారని లవ్లీ దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అధికార సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎదుట ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద ప్రధాని మోడీ దిష్టబొమ్మను తగలబెట్టడంతోపాటు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఎస్పీ కార్యకర్తలతో ఘర్షణకు దిగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. వారణాసి, అలహాబాద్, మథుర, అలీగఢ్, కాన్పూర్ తదితర రైల్వే స్టేషన్ల వద్ద నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గత యూపీఏ ప్రభుత్వం రైలు చార్జీలను పెంచగా అది ప్రజావ్యతిరేక విధానమంటూ నాటి ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాసిన గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ ఇప్పుడు అదే ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారని బెంగాల్ ప్రతిపక్ష నేత సూర్యకాంతా మిశ్రా విమర్శించారు. కేరళలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో రైల్‌రోకోలు చేపట్టి నిరసన తెలిపారు. మరోవైపు రైలు చార్జీలను తగ్గించాలంటూ డీఎంకే చీఫ్ కరుణానిధి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి గత యూపీఏ సర్కారుకు ఏమాత్రం భిన్నంగా లేదని విమర్శించారు.