ఇంట్లో చపాతీలు మిగిలిపోతే పారేస్తున్నారా?. ఐతే ఇక నుంచి పడేయొద్దు. అవే దివ్య ఔషధం అని బోలెడన్ని ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు మంచిదని చెబుతున్నారు. చాలామంది నిల్వ అయిన చపాతీలు తినేందుకు ఇష్టపడరు. కానీ ఆరోగ్య నిపుణులు అవే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పారు. అవేంటంటే..?
తాజాగా అప్పటి కప్పుడు చేసుకున్న గోధుమ చపాతీలనే ఇష్టంగా తింటా. ఒకవేళ మిగిలపోతే కుక్కలకు పెట్టడం లేదా బయటపడేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యనిపుణులు ఇది అనారోగ్యం కాదని నొక్కి చెబుతున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉంటుంది. పైగా సోడియం కూడా తక్కువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి చిరుతిండిగా కూడా పేర్కొనవచ్చు అని అన్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు.
ముఖ్యంగా జీర్ణక్రియకు..
రాత్రి పూట అంతా నిల్వ ఉండి లేదా చపాతీలు చేసిన 12 నుంచి 15 గంటల తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. అలా నిల్వ ఉండటం వల్ల అదులో చేరిన బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు.
మంచి శక్తిని అందిస్తాయి..
అల్పాహారంలో బాసి రోటీ(నిల్వ అయిన చపాతీ! బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల రోజంతా శక్తిమంతంగానూ బలంగా ఉంటుంది. ఎక్కువ తిన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్న చేసేందుక చాలా టైం పడుతుంది. అందువల్ల త్వరితగతిన ఆకలవ్వదు. పైగా పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.
30 రోజుల్లో బరువు తగ్గడానికి..
మిగిలిపోయిన చపాతీల్లో కేలరీలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి (30 రోజుల్లో బరువు తగ్గడానికి) సహాయకరంగా ఉంటుంది. నిజానికి, ఉదయాన్నే పాత చపాతీ(నిల్వ చపాతీ) తిన్నప్పుడు పొంట నిండుగా ఉన్నట్లు అనిపించి, త్వరితగతిన ఆకలివేయదు. తద్వారా మీరు అతిగా తినకుండా ఉండగలుగుతారు. దీంతో సులభంగా బరువు తగ్గుతారు.
బీపీ, షుగర్ నియంత్రణలో..
డయాబెటిక్ రోగులకు పాత చపాతీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో వీటిని తినడం వల్ల రోజంతా వచ్చే షుగర్ స్పైక్‌ల నుండి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో, పాత చపాతీల్లో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది, దీని కారణంగా రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది.
సరైన పద్ధతిలో నిల్వ చేయడం అనేది ముఖ్యం..!
రోటీ లేదా పాత చపాతీ సరైన విధంగా 12 గంటల పాటు నిల్వ ఉంచినప్పుడూ..వాటి రుచి, ఆకృతి స్టార్చ్ కూర్పులు మార్పులకు లోనవ్వుతాయి. ఇది మన ఆరోగ్యానికి ఉపయోగాపడే ఫైబర్ లాగా రెసిస్టెంట్ స్టార్చ్‌లా మారుతుంది. ఫలితంగా తేలికగా గ్లూకోజ్‌గా విడిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ తాజా లేదా పాత చపాతీల మధ్య గ్లైసెమిక్ ఇండెక్స్‌లో వ్యత్యాసం ఉంటుంది. తాజా చపాతీలు రక్తంలోని చక్కెర నియంత్రణను గణనీయంగా ప్రభావితం చేయవు కానీ నిల్వ చపాతీలు చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది.
ఇక్కడ చపాతీలు బూజు పట్టకుండా మంచి పద్ధతిలో నిల్వ చేయడం అనేది అత్యం ముఖ్యం అని గుర్తించుకోవాలి. తాజా చపాతీ రుచిగా ఉంటే ..నిల్వ ఉన్న చపాతీలను చాలా నెమ్మదిగా తినాలి, రుచి తక్కువుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ తెలుసుకోవాల్సింది.. నిల్వ ఉండటం వల్ల గోధుమ పులుస్తుంది దీన్నే కిణ్వనప్రక్రియ అంటాం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే మంచి పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?)
Comments
Please login to add a commentAdd a comment