chapati
-
రోజూ రోటీయేనా ?
కోల్‌కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు. వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్‌చేశాక పోలీసులు సంజయ్‌ను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్రైస్లాంటి ఎగ్ చావ్మీన్ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం. అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. -
చపాతీలు మిగిలిపోతే పడేస్తున్నారా?.. అయ్యయ్యో వద్దమ్మా!
ఇంట్లో చపాతీలు మిగిలిపోతే పారేస్తున్నారా?. ఐతే ఇక నుంచి పడేయొద్దు. అవే దివ్య ఔషధం అని బోలెడన్ని ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు మంచిదని చెబుతున్నారు. చాలామంది నిల్వ అయిన చపాతీలు తినేందుకు ఇష్టపడరు. కానీ ఆరోగ్య నిపుణులు అవే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పారు. అవేంటంటే..? తాజాగా అప్పటి కప్పుడు చేసుకున్న గోధుమ చపాతీలనే ఇష్టంగా తింటా. ఒకవేళ మిగిలపోతే కుక్కలకు పెట్టడం లేదా బయటపడేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యనిపుణులు ఇది అనారోగ్యం కాదని నొక్కి చెబుతున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉంటుంది. పైగా సోడియం కూడా తక్కువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి చిరుతిండిగా కూడా పేర్కొనవచ్చు అని అన్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. ముఖ్యంగా జీర్ణక్రియకు.. రాత్రి పూట అంతా నిల్వ ఉండి లేదా చపాతీలు చేసిన 12 నుంచి 15 గంటల తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. అలా నిల్వ ఉండటం వల్ల అదులో చేరిన బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. మంచి శక్తిని అందిస్తాయి.. అల్పాహారంలో బాసి రోటీ(నిల్వ అయిన చపాతీ! బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల రోజంతా శక్తిమంతంగానూ బలంగా ఉంటుంది. ఎక్కువ తిన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్న చేసేందుక చాలా టైం పడుతుంది. అందువల్ల త్వరితగతిన ఆకలవ్వదు. పైగా పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. 30 రోజుల్లో బరువు తగ్గడానికి.. మిగిలిపోయిన చపాతీల్లో కేలరీలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి (30 రోజుల్లో బరువు తగ్గడానికి) సహాయకరంగా ఉంటుంది. నిజానికి, ఉదయాన్నే పాత చపాతీ(నిల్వ చపాతీ) తిన్నప్పుడు పొంట నిండుగా ఉన్నట్లు అనిపించి, త్వరితగతిన ఆకలివేయదు. తద్వారా మీరు అతిగా తినకుండా ఉండగలుగుతారు. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. బీపీ, షుగర్ నియంత్రణలో.. డయాబెటిక్ రోగులకు పాత చపాతీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో వీటిని తినడం వల్ల రోజంతా వచ్చే షుగర్ స్పైక్‌ల నుండి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో, పాత చపాతీల్లో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది, దీని కారణంగా రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం అనేది ముఖ్యం..! రోటీ లేదా పాత చపాతీ సరైన విధంగా 12 గంటల పాటు నిల్వ ఉంచినప్పుడూ..వాటి రుచి, ఆకృతి స్టార్చ్ కూర్పులు మార్పులకు లోనవ్వుతాయి. ఇది మన ఆరోగ్యానికి ఉపయోగాపడే ఫైబర్ లాగా రెసిస్టెంట్ స్టార్చ్లా మారుతుంది. ఫలితంగా తేలికగా గ్లూకోజ్‌గా విడిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ తాజా లేదా పాత చపాతీల మధ్య గ్లైసెమిక్ ఇండెక్స్‌లో వ్యత్యాసం ఉంటుంది. తాజా చపాతీలు రక్తంలోని చక్కెర నియంత్రణను గణనీయంగా ప్రభావితం చేయవు కానీ నిల్వ చపాతీలు చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. ఇక్కడ చపాతీలు బూజు పట్టకుండా మంచి పద్ధతిలో నిల్వ చేయడం అనేది అత్యం ముఖ్యం అని గుర్తించుకోవాలి. తాజా చపాతీ రుచిగా ఉంటే ..నిల్వ ఉన్న చపాతీలను చాలా నెమ్మదిగా తినాలి, రుచి తక్కువుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ తెలుసుకోవాల్సింది.. నిల్వ ఉండటం వల్ల గోధుమ పులుస్తుంది దీన్నే కిణ్వనప్రక్రియ అంటాం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే మంచి పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?) -
టేస్టీగా పొటాటో స్టఫ్ చపాతీలు చేసుకోండిలా..!
కావలసినవి: బంగాళదుంపలు – 2 (తొక్క తీసి, తురుముకోవాలి) గోధుమ పిండి – 2 కప్పులు (కొద్దిగా నూనె ఉప్పు వేసుకుని.. గోరువెచ్చని నీళ్లతో చపాతీ ముద్దలా చేసుకుని.. మూత పెట్టుకుని, 15 నిమిషాలు పక్కన పెట్టుకుని, కాస్త పెద్దగా, చతురస్రాకారంలో చపాతీల్లా ఒత్తుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు కారం, ఉప్పు, పసుపు – తగినంత నూనె – సరిపడా తయారీ విధానం: బంగాళదుంప తురుమును, మూడు లేదా నాలుగు కప్పుల నీళ్లల్లో 3 నిమిషాల పాటు ఉడికించి.. నీళ్లన్నీ పోయేవరకు వడకట్టులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి.. అందులో బంగాళదుంప తురుము వేసుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత.. కారం, ఉప్పు, పసుపు కొద్దికొద్దిగా వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక చపాతీపై కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని.. మరో చపాతీతో కప్పి.. గుండ్రటి చిన్న ప్లేట్‌ని దానిపై వేసి గట్టిగా ఒత్తాలి. అనంతరం ప్లేట్ చుట్టూ ఉన్న చపాతీని తొలిగించి.. ఆ గుండ్రటి చపాతీలను నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి ఈ చపాతీలు. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్
కావలసినవి: చికెన్ – అర కిలో ; నిమ్మకాయ– ఒకటి ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; ఉప్పు – రెండు టీ స్పూన్లు లేదా రుచికి తగినట్లు. మసాలా కోసం: బాదం – పది ; పిస్తా – పది ; చిరోంజి– 2 టీ స్పూన్లు ; పచ్చిమిర్చి– 3 ; దాల్చిన చెక్క– అర అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఏలకులు –4 ; మిరియాలు – అర టీ స్పూన్. గ్రేవీ కోసం: నూనె– 3 టేబుల్ స్పూన్లు ; నెయ్యి – 2 టీ స్పూన్లు ; పెరుగు– పావు కప్పు ; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (వేయించాలి) ; టొమాటో పేస్ట్ – అర కప్పు ; రెడ్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్లు ; గ్రీన్ చిల్లీ సాస్ – టేబుల్ స్పూన్; షాజీరా– టీ స్పూన్ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; వేయించిన జీలకర్ర పొడి – టీ స్పూన్ ; కశ్మీర్మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; కొత్తిమీర తరుగు – కప్పు ; తాజా మీగడ– 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ► చికెన్‌ను శుభ్రం చేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలపాలి. ► మందపాటి బాణలిలో మసాలా దినుసులన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీలో తగినంత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ► ఈ మసాలా పేస్టును చికెన్‌కు పట్టించాలి. అందులో నూనె, నెయ్యి, మీగడ మినహా గ్రేవీ కోసం తీసుకున్న అన్నింటినీ వేసి కలిపి రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ► బాణలిలో నూనె, నెయ్యి వేడి చేసి అందులో ఫ్రిజ్‌లో నుంచి తీసిన చికెన్‌ను వేసి మీడియం మంట మీద అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల సేపు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత మీగడ వేసి దించేయాలి. గ్రేవీ చిక్కదనం చూసుకుని అవసరమనిపిస్తే మరిగించిన నీటిని తగినన్ని పోసి కలుపుకోవాలి. నోరూరించే తెలంగాణ రెడ్ చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీ, రోటీ, బగారా రైస్లకు మంచి కాంబినేషన్. (క్లిక్ చేయండి: తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..) -
‘సింగపూర్‌లో చపాతీల కోసం భారతీయుల కటకట!’
సింగపూర్ పంజాబీలకు చపాతీ కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఈ ఏడాది మే నెల నుంచి భారత్ గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. ముఖ్యంగా సింగపూర్ వంటి దేశాల్లో నార్త్ ఇండియా నుంచి ఎగుమతయ్యే గోధుమల రవాణా తగ్గిపోయింది. దీంతో ఆ గోధుమలతో తయారు చేసిన చపాతీలు లభ్యం కాకపోవడంతో వాటిని అమితంగా ఇష్టపడే పంజాబీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మూడు రెట్లు ఎక్కువే ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం కారణంగా విదేశాల్లో గోధుమల కొరత తీవ్రంగా ఏర్పడింది. అవసరానికి అనుగుణంగా గోధుమలు లేకపోవడం, వాటిని ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో ఉన్న భారత్ ఎగుమతుల్ని నిలిపివేయడంతో సింగపూర్‌లో భారతీయులకు చపాతీల కొరత ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఆ చపాతీ పిండి కొనుగోలు చేయాలంటే భారత్‌తో పోలిస్తే మూడింతలు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిపోతున్న ధరల భారాన్ని వినియోగదారులపై మోపడం కష్టంగా ఉందని సింగపూర్‌లో ఐదు రెస్టారెంట్ అవుట్ లెట్స్ నిర్వహిస్తున్న శకుంతలా రెస్టారెంట్ ప్రతినిధులు చెబుతున్నారు. కష్టంగా ఉంది సింగపూర్‌లో కేజీ గోధుమ పిండిని 2డాలర్లు చెల్లించే కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అదే కేజీ గోధుమ పిండి ధర 8డాలర్లకు చేరింది. గోధుమ పిండిని అధిక మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయడం కష్టంగా మారిందని పంజాబీ, బెంగాల్ వంటలకు ప్రసిద్ధి చెందిన మస్టర్డ్ సింగపూర్ రెస్టారెంట్ యజమాని రాధిక అబ్బి తెలిపారు. -
వీడియో: ఇదేందయ్యా ఇది.. జస్ట్ మిస్ భయ్యో అసలుకే ఎసరు వచ్చేదిగా..!
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు వ్యక్తులు విభిన్న మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో క్లిక్ అయి మంచి ఆఫర్ సైతం కిట్టేసిన వారున్నారు. ఇదే క్రమంలో అడ్రస్ లేకుండా గల్లంతైనా వారు కూడా లేకపోలేదు. కాగా, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వ్యక్తి చేసిన పని.. నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వైరల్ అయిన వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే.. ఓ యువకుడి తన ఇంట్లో చపాతి(రోటీ చేసేందుకు) రెడీ అయ్యాడు. చపాతీ చేసి గ్యాస్ పొయ్యి మీద పెట్టి కాలుస్తున్నాడు. ఇంతలో ఏదో చేద్దామని ప్రయత్నిస్తే.. మొదటికే మోసమైంది. పెనం మీద ఉన్న చపాతీని ఎగరేసే క్రమంలో కర్రకు ఉన్న పెనం ఊడిపోయి అతడి మీదే పడిపోయింది. దీంతో గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియో మరింత ఫన్నీగా ఉండేందుకు యోగా గురువు రామ్దేబ్ బాబా నవ్విన ఓ ఫన్నీ సీన్‌ను యాడ్ చేశాడు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి. -
Recipe: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా!
రొటీన్‌గా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ చపాతి సులువుగా ఇంట్లోనే చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్ చపాతి తయారీకి కావలసినవి: ►గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు (ఓ అరగంట ముందు గోరువెచ్చటి నీళ్లు, ఉప్పు వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి) ►గుడ్లు – 4 లేదా 5 ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►ఉప్పు –తగినంత ►పసుపు – చిటికెడు ►కారం – 1 టీ స్పూన్ ►చిక్కటిపాలు – 1 టేబుల్ స్పూన్ ఎగ్ చపాతి తయారీ విధానం: ►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, పాలు పోసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ►తర్వాత చపాతీలు చేసి పెట్టుకోవాలి. ►అనంతరం రెండు స్టవ్‌లు ఆన్ చేసుకుని, రెండింటిపైన రెండు పెనాలు పెట్టుకుని, ఒకవైపు చపాతీ కాలుస్తూ.. మరోవైపు ఆమ్లెట్ వేసుకోవాలి. ►ఇరువైపులా దోరగా కాలిన చపాతిని ఒకవైపు కాలని ఆమ్లెట్‌పై వేసుకుని రెండు అతుక్కున్నాక అటు, ఇటు తిప్పి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ ఇలా! -
చపాతి గొడవ.. కస్టమర్ ప్రాణం తీసిన కుక్
సంభాల్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చేటు చేసుకుంది. దాబాలో పనిచేసే ఓ కుక్.. కస్టమర్‌పై దాడి చేసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖెంపాల్ అనే ట్రాన్స్పోర్టర్ సంభాల్‌లోని తన షాప్‌కు సమీపంలో ఉండే ఓ దాబాలో భోజనం అర్డర్ చేశాడు. అర్డర్ చేసిన భోజనాన్ని దాబా బేరర్ ఖెంపాల్కు ఇచ్చాడు. అయితే భోజనం ఎలా ఉందో తెలుసుకోవాలని ఖెంపాల్ ఫుడ్ తెరిచి చూశాడు. అందులో చపాతిలు సగం కాలినట్లు మాడిపోయి కనించాయి. దీంతో ఖెంపాల్ వాటిని చేసిన కుక్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఖెంపాల్ అక్కడి నుంచి తన షాప్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న అనిల్.. ఖెంపాల్ షాప్ వద్దకు వెళ్లి అతనిపై దారుణంగా దాడి చేశాడు. దీంతో ఖెంపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. స్థానిక ఎస్పీ చక్రేశ్ మిశ్రా మాట్లాడుతూ.. రాత్రి సమయంలో కుక్ అనిల్.. ఖెంపాల్ షాప్ వద్దకు వెళ్లి కర్రతో దాడి చేయడంతో అతను మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించామని పేర్కొన్నారు. నిందితుడు అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
చపాతీ ఎఫెక్ట్.. చూపు కోల్పోయిన బాలుడు
భోపాల్: ‘‘అతి సర్వత్రా వర్జయేత్’’ అన్నారు పెద్దలు... అంటే దేనిని అతిగా చేయడం మంచిది కాదని అర్థం. ముఖ్యంగా తిండి విషయంలో.. ఎంత రుచిగా ఉన్నా.. మన కడుపుకు సరిపోయేంతనే తినాలి తప్ప.. అతిగా లాగించకూడదు. కాదని బాగా తింటే.. ఎంతటి తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో ఇది చదివితే అర్థం అవుతుంది. పన్నెండేళ్ల కుర్రాడికి చపాతీలు అంటే చాలా ఇష్టం. ఎంత అంటే రోజుకు 40 చపాతీలు తినేవాడు. ఫలితంగా కంటి చూపు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వైద్యులు ఆ బాలుడికి సర్జరీ చేసి చూపు ప్రసాదించారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ శిప్పూరి జిల్లా ఖోడ్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల సందీప్ కంటి చూపు క్రమంగా మందగించడం ప్రారంభం అయ్యింది. ఓ రోజు పూర్తిగా చూపు కోల్పోయాడు. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి.. పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే సందీప్ శరీరంలోని అవయవాలు అన్ని పనిచేయడం మానేశాయి. అతడు కేవలం ఊపిరి తీసుకోగల్గుతున్నాడు అంతే. అక్కడ సందీప్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడి రిపోర్టులు చూసి షాక్ తిన్నారు. వైద్యులను అంతలా ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే సందీప్ బ్లడ్ షుగర్ లెవల్స్ ఏకంగా 1206 మిల్లీగ్రాములుగా ఉన్నట్లు గమనించారు. ఇంత చిన్న కుర్రాడికి ఇంత పెద్ద మొత్తంలో షుగర్ లెవల్స్ ఉండటం ఏంటని ఆశ్చర్యపోయి.. అతడి ఆహారం గురించి ఆరా తీశారు. సందీప్ రోజుకు 40 చపాతీలు తినేవాడని అతడి తండ్రి తెలిపాడు. ఇంత పెద్ద మొత్తంలో చపాతీలు తినడం వల్ల సందీప్‌లో షుగర్ లెవల్స్ పెరగడమే కాక మెదడులో చీము చేరింది. దాని వల్ల అతడు కంటి చూపు కోల్పోవడమే కాక.. శరీరంలోని మిగతా అవయవాల పని చేయడం మానేశాయి. ఈ క్రమంలో వైద్యులు సందీప్ తలకు సర్జరీ చేసి 720 మిల్లీ లీటర్ల చీము తొలగించారు. చక్కెర స్థాయిలను తగ్గించడం కోసం ప్రతి రోజు సందీప్‌కు 6 యూనిట్ల ఇన్సులిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చాక.. కంటి వైద్యుడు సందీప్‌ను పరీక్షించి.. ఆ బాలుడు డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నాడని తెలిపారు. వీలైనంత త్వరగా సందీప్‌కు సర్జరీ చేస్తే.. అతడికి కంటి చూపును తిరిగి తెప్పించవచ్చన్నారు. సందీప్ తల్లిదండ్రులు అందుకు అంగీకరించడంతో ఆపరేషన్ చేశారు. ఇప్పుడు సందీప్ చూడగల్గుతున్నాడు. ప్రస్తుతం సందీప్‌కు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. అతడిని అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు వెల్లడించారు. -
వైరల్: ప్రెజర్ కుక్కర్లో చపాతీ!
చపాతీ.. భారతీయుల భోజనంలో ప్రధాన ఆహారం. మనకు అన్నం ఎలానో ఉత్తరాది వారికి చపాతీ అలా. అయితే చపాతీ చేయడం కాస్త కష్టమైన పని. పిండి కలపాలి.. చపాతీ రుద్దాలి.. ఆ తర్వాత దాన్ని పెనం మీద వేసి కాల్చాలి. కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది కనుక బ్యాచిలర్స్ మెనూలో చపాతీ ఉండదు. అయితే ఇప్పుడు ఈ న్యూస్ చదివితే వారు కూడా చపాతీ ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీర చూడబోయే చపాతీలను ప్రెజర్ కుక్కర్లో తయారు చేస్తున్నారు. అది ఎలా సాధ్యమో తెలియాలంటే ఇది చదవండి. ఇక్కడ ఓ మహిళ స్టవ్ వెలిగించి.. ఖాళీ ప్రెషర్ కుక్కర్ పెట్టి.. ఎక్కువ మంట మీద బాగా వేడి చేస్తుంది. అది వేడయ్యేలోపల సదరు మహిళ ఓ మూడు చపాతీలు తయారు చేస్తుంది. ఆ తర్వాత వాటన్నింటిని బాగా వేడిచేసిన ప్రెషర్ కుక్కర్లో ఒక దాని తర్వాత ఒకటి వేస్తుంది. ఆ తర్వాత కుక్కర్‌కి మూత పెట్టి.. విజిల్ పెడుతుంది. మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్‌ని దించుతుంది. ఆ తర్వాత ప్రెజర్ పోయేలాగా చేసి.. విజిల్ తీసి.. కుక్కర్ మూత తీస్తుంది. అందులో ఉన్న వేడి వేడి చపాతీలను బయటకు తీసి.. ఒక్కొక్కటి వేరు చేసి ప్లేట్లో పెడుతుంది. సాధారణంగా పెనం మీద కాల్చిన చపాతీలకు.. ఇలా కుక్కర్లో వండిన చపాతీలకు ఏ మాత్రం తేడాలేదు. చాలా బాగా కాలాయి. ఇక ఇది చూసిన నెటిజనులు బ్యాచిలర్స్‌కు ఈ ఐడియా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కో చపాతీ కాల్చడం కన్నా ఇలా అన్ని ఒకేసారి కుక్కర్లో పడేస్తే.. సరి.. స్టవ్ దగ్గర నిల్చునే పని లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: కూరగాయలపై కరోనాను ఖతం చేసే టెక్నిక్! -
చపాతీ వెజ్ రోల్స్ చేయడం ఇంత సులువా?
చపాతీ వెజ్ రోల్స్ కావలసినవి: చపాతీలు – 4, క్యాప్సికమ్ – 2, టమాటోలు –2, బంగాళదుంపలు – 2(మెత్తగా ఉడికించి ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చి బటానీలు – 2 టేబుల్ స్పూన్లు(నానబెట్టి, ఉడికించుకోవాలి), ఉల్లిపాయ – 2(ముక్కలు కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 3(ముక్కలు కట్ చేసుకోవాలి), మిరియాల పొడి – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, టమాటో కెచప్ – 1 టీ స్పూన్, ఉప్పు – సరిపడా, నూనె – తగినంత తయారీ: కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, టమాటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసుకుని కూరలా చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా కెచప్ వేసి ఉడికించాలి. అనంతరం చపాతీలను పెనంపై ఇరువైపులా కాల్చి.. కర్రీ వేడిగా ఉన్నప్పుడే చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. డేట్స్ హల్వా కావలసినవి: ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఒక బౌల్లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్రింజాల్ రోల్స్ కావలసినవి: వంకాయలు (బ్రింజాల్) – 3 లేదా 4 (పొడవైనవి), ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 4 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బియ్యం రవ్వ – ముప్పావు కప్పు, అవకాడో – 1, నూనె – డీప్ ప్రైకి సరిపడా, టమాటా ముక్కలు – పావు కప్పు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, బీట్ రూట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, పుదీనా తరుగు – 1 టేబుల్ స్పూన్లు, క్యారెట్ – 3, వేరుశనగలు – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత తయారీ: ముందుగా వంకాయలను శుభ్రం చేసుకుని, కాడలు తొలగించి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆలీవ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఓ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే వేరుశనగ రవ్వ, బీట్రూట్ తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో ఆలివ్ మిశ్రమం కూడా వేసుకుని, చివరిగా సరిపడా ఉప్పు వేసుకుని, బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికిన వంకాయలను పొడవుగా (థిన్ స్లైస్‌లా) కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని, అందులో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకుని కొత్తిమీర లేదా పుదీనాతో గార్నిష్ చేసుకుని, టమాటా సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. సేకరణ: సంహిత నిమ్మ -
భకర్వాడి
కావలసినవి: మైదా పిండి – ఒకటిన్నర కప్పులు ; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు + డీప్ ఫ్రైకి సరిపడా; ధనియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; సోంపు – అర టీ స్పూను; లవంగాలు – 2; నువ్వులు – ఒక టీ స్పూను ; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – చిటికెడు; గరం మసాలా – ఒక టీ స్పూను; ఆమ్ చూర్ – అర టీ స్పూను; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పంచదార – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి పావు గంట సేపు పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి వేయించాలి. జల్లెడ పట్టిన సెనగ పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఆ పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. నూనె లేకుండా స్టౌ మీద బాణలి ఉంచి, అందులో ధనియాలు వేసి వేగాక, జీలకర్ర, సోంపు, లవంగాలు జత చేసి మరోమారు వేయించాలి. బాగా వేగిన తరవాత నువ్వులు జత చేసి వేయించి దింపి చల్లారాక, మిక్సీలో వేసి పొడి చేయాలి. మిరప కారం, పసుపు, గరం మసాలా, ఆమ్ చూర్, జత చేసి మరో మారు మిక్సీ తిప్పాలి. ఈ పొడిని సెనగ పిండిలో వేసి, కొద్దిగా ఉప్పు, పంచదార పొడి కూడా జత చేసి బాగా కలపాలి. పక్కన ఉంచిన మైదా పిండిని ఒక ఉండ పరిమాణంలో తీసుకుని చపాతీలా ఒత్తి, దాని మీద కొద్దిగా నూనె పూయాలి. సెనగ పిండి మిశ్రమాన్ని పైనంతా ఒక పొరలా పూయాలి. ఒత్తి ఉంచుకున్న చపాతీని కొద్దికొద్దిగా మడుస్తూ గట్టిగా దగ్గరగా ఉండేలా రోల్ చేయాలి. ఆఖరి మడత దగ్గర మరి కాస్త నూనె పూసి చుట్టి రోల్ చేయాలి. చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చేతికి కొద్దిగా తడి చేసుకుని కట్ చేసిన ముక్కల అంచులకు తడి పూయాలి. బాణలిలో నూనె కాగిన తరవాత వీటిని అందులో వేసి రంగు మారేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. -
ఉండ్రాళ్లు
కావలసినవి : బియ్యపురవ్వ– కప్పు; నీళ్లు – రెండు కప్పులు; శనగపప్పు – పావు కప్పు(నానబెట్టాలి); జీలకర్ర – టీ స్పూన్; నెయ్యి – మూడు టీ స్పూన్లు; ఉప్పు–కొద్దిగ; పచ్చికొబ్బరి – 3 టేబుల్ స్పూన్లు తయారి: ముందుగా మందపాటి పాత్రలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, శనగపప్పు వేసి కొద్దిగా వేయించాలి. అందులో నీరు పోసి, ఉప్పు వేసి, మరుగుతుండగా, బియ్యపు రవ్వ వేసి కలపాలి. సన్నని సెగ మీద ఉడికించాలి. చల్లారాక చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి. వీటిని ఆవిరి మీద ఉడికించి, దించి, తీసుకోవాలి. బెల్లం తాలికలు కావలసినవి: బియ్యప్పిండి – గ్లాసు; గోధుమ పిండి – అర గ్లాసు; బెల్లం – 2 గ్లాసులు; ఎండు కొబ్బరి ముక్క లు – కొద్దిగా; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు, బాదంపలుకులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారి: అర గ్లాసు నీళ్లు పోసి, కొద్దిగా బెల్లం వేసి కరిగించాలి. దీంట్లో గోధుమపిండి వేసి చపాతీపిండిలా కలపాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ సన్నగా తాల్చాలి. గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీళ్లుపోసి మరుగుతుండగా బెల్లం కరిగించి, తాలికలను ఉడికించాలి. దీంట్లో బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం బాగా ఉడికాక, ఏలకుల పొడి వేయించిన బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు కలపాలి. -
మల్లన్న అల్పహారంగా చపాతీలు
శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకంలో భాగంగా భక్తులకు చపాతీని అల్పాహారంగా అందజేస్తున్నట్లు ఈఓ నారాయణభరత్‌గుప్త తెలిపారు. మంగళవారం రాత్రి అన్నపూర్ణ భవన్లో కొత్తగా ఏర్పాటు చేసిన చపాతీ తయారు యంత్రానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. ఆ తర్వాత యంత్రం ద్వారా తయారైన చపాతీలను భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ శ్రీశైలమహాక్షేత్రానికి ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతం నుంచి వేలాది మంది భక్తులు మల్లన్నదర్శనార్థమై వస్తుంటారన్నారు. వారి ప్రధాన ఆహారం చపాతీలని, భక్తులకు మెరుగైన అల్పాహరాన్ని అందించాలనే సంకల్పంతో చపాతీ మిషన్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ మిషన్ ద్వారా గంటకు సుమారు వెయ్యి చపాతీలను తయారు చేయవచ్చునని తెలిపారు. రోజూ సాయంత్రం 6.30 నుంచి 9 గంటల వరకు చపాతీని అందజేస్తామని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 2 వేలు, రద్దీ (శని,ఆది,సోమ) రోజుల్లో 4 వేల చపాతీలు పంపిణీ చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఈఓ తెలిపారు. -
'మా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది'
ముంబై: తమ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. ఇతర మతాల పట్ల తమ పార్టీకి ఎటువంటి ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. శివసేన ఎంపీలు ఢిల్లీలో ముస్లింతో బలవంతంగా చపాతి తినిపించేందుకు ప్రయత్నించి అతడి ఉపాసన దీక్షను భగ్నం చేశారని వచ్చిన ఆరోపణలపై థాకరే స్సందించారు. 'ఇది శివసేన గొంతు నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నం. హిందుత్వ వాదులుగా ఉనప్పటికీ ఇతర మతాల పట్ల మాకు ద్వేషభావం లేదు' అని ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు. మహారాష్ట్ర సదన్ లో ముస్లింతో శివసేన ఎంపీలు బలవంతంగా చపాతి తినిపించేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు బయటకు రావడంతో నిరసన వ్యక్తమవుతోంది. -
'చపాతి' ఘటనపై అద్వానీ అసంతృప్తి
న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన 'చపాతి' ఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్య చర్య కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో ముస్లింతో బలవంతంగా శివసేన ఎంపీలు చపాతి తినింపించిన ఘటనపై ఆయనీ విధంగా స్పందించారు. తమకు మహారాష్ట్ర వంటకాలు పెట్టలేదనే ఆగ్రహంతో శివసేన ఎంపీలు ముస్లిం కేటరింగ్ సూపర్వైజర్ తో బలవంతంగా చపాతి తినిపించే ప్రయత్నం చేశారు. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. -
'చపాతి' ఘటనపై అట్టుడికిన పార్లమెంట్
-
'చపాతి' ఘటనపై అట్టుడికిన పార్లమెంట్
న్యూఢిల్లీ: శివసేన ఎంపీలు ముస్లిం కార్మికుడితో బలవంతంగా చపాతి తినిపించిన ఘటన పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభంకాగానే పలువురు విపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విమర్శించారు. వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉండగానే ఈ గందరగోళం చోటుచేసుకుంది. స్పీకర్ సమిత్రా మహాజన్ సర్దిచెప్పినా వారు వెనక్కు తగ్గలేదు. దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా 'చపాతి' ఘటనపై అట్టుడికింది. ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్ లో తమకు మహారాష్ట్ర వంటకాలు వండిపెట్టలేదన్న కారణంతో ఆగ్రహానికి గురైన 11 మంది ఎంపీలు ముస్లిం మతస్థుడైన కేటరింగ్ సూపర్వైజర్ తో బలవంతంగా చపాతి తినిపించారు. అతడి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేశారు. ఈ వీడియో వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)