మల్లన్న అల్పహారంగా చపాతీలు
మల్లన్న అల్పహారంగా చపాతీలు
Published Wed, Jun 21 2017 12:21 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకంలో భాగంగా భక్తులకు చపాతీని అల్పాహారంగా అందజేస్తున్నట్లు ఈఓ నారాయణభరత్‌గుప్త తెలిపారు. మంగళవారం రాత్రి అన్నపూర్ణ భవన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన చపాతీ తయారు యంత్రానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. ఆ తర్వాత యంత్రం ద్వారా తయారైన చపాతీలను భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ శ్రీశైలమహాక్షేత్రానికి ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతం నుంచి వేలాది మంది భక్తులు మల్లన్నదర్శనార్థమై వస్తుంటారన్నారు. వారి ప్రధాన ఆహారం చపాతీలని, భక్తులకు మెరుగైన అల్పాహరాన్ని అందించాలనే సంకల్పంతో చపాతీ మిషన్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ మిషన్ ద్వారా గంటకు సుమారు వెయ్యి చపాతీలను తయారు చేయవచ్చునని తెలిపారు. రోజూ సాయంత్రం 6.30 నుంచి 9 గంటల వరకు చపాతీని అందజేస్తామని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 2 వేలు, రద్దీ (శని,ఆది,సోమ) రోజుల్లో 4 వేల చపాతీలు పంపిణీ చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఈఓ తెలిపారు.
Advertisement