వైరల్‌: ప్రెజర్‌ కుక్కర్‌లో చపాతీ! | How to Make Chapati in Pressure Cooker | Sakshi
Sakshi News home page

వైరల్‌: ప్రెజర్‌ కుక్కర్‌లో చపాతీ!

Published Fri, May 21 2021 3:44 PM | Last Updated on Fri, May 21 2021 8:33 PM

How to Make Chapati in Pressure Cooker - Sakshi

చపాతీ.. భారతీయుల భోజనంలో ప్రధాన ఆహారం. మనకు అన్నం ఎలానో ఉత్తరాది వారికి చపాతీ అలా. అయితే చపాతీ చేయడం కాస్త కష్టమైన పని. పిండి కలపాలి.. చపాతీ రుద్దాలి.. ఆ తర్వాత దాన్ని పెనం మీద వేసి కాల్చాలి. కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది కనుక బ్యాచిలర్స్‌ మెనూలో చపాతీ ఉండదు. అయితే ఇప్పుడు ఈ న్యూస్‌ చదివితే వారు కూడా చపాతీ ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీర చూడబోయే చపాతీలను ప్రెజర్‌ కుక్కర్‌లో తయారు చేస్తున్నారు. అది ఎలా సాధ్యమో తెలియాలంటే ఇది చదవండి. 

ఇక్కడ ఓ మహిళ స్టవ్‌ వెలిగించి.. ఖాళీ ప్రెషర్‌ కుక్కర్‌ పెట్టి.. ఎక్కువ మంట మీద బాగా వేడి చేస్తుంది. అది వేడయ్యేలోపల సదరు మహిళ ఓ మూడు చపాతీలు తయారు చేస్తుంది. ఆ తర్వాత వాటన్నింటిని బాగా వేడిచేసిన ప్రెషర్‌ కుక్కర్‌లో ఒక దాని తర్వాత ఒకటి వేస్తుంది. ఆ తర్వాత కుక్కర్‌కి మూత పెట్టి.. విజిల్‌ పెడుతుంది. 

మూడు నిమిషాల తర్వాత స్టవ్‌ ఆపేసి కుక్కర్‌ని దించుతుంది. ఆ తర్వాత ప్రెజర్‌ పోయేలాగా చేసి.. విజిల్‌ తీసి.. కుక్కర్‌ మూత తీస్తుంది. అందులో ఉన్న వేడి వేడి చపాతీలను బయటకు తీసి.. ఒక్కొక్కటి వేరు చేసి ప్లేట్‌లో పెడుతుంది. సాధారణంగా పెనం మీద కాల్చిన చపాతీలకు.. ఇలా కుక్కర్‌లో వండిన చపాతీలకు ఏ మాత్రం తేడాలేదు. చాలా బాగా కాలాయి. ఇక ఇది చూసిన నెటిజనులు బ్యాచిలర్స్‌కు ఈ ఐడియా బాగా హెల్ప్‌ అవుతుంది. ఒక్కో చపాతీ కాల్చడం కన్నా ఇలా అన్ని ఒకేసారి కుక్కర్‌లో పడేస్తే.. సరి.. స్టవ్‌ దగ్గర నిల్చునే పని లేదు అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: కూర‌గాయ‌ల‌పై క‌రోనాను ఖ‌తం చేసే టెక్నిక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement