ఇదేందిది.. ప్రజర్‌ కుక్కర్‌ను ఇలానూ వాడొచ్చా? | Woman Use Pressure Cooker as Iron for Cloths | Sakshi
Sakshi News home page

Viral Video: ఇదేందిది.. ప్రజర్‌ కుక్కర్‌ను ఇలానూ వాడొచ్చా?

Published Wed, Mar 13 2024 8:02 AM | Last Updated on Wed, Mar 13 2024 11:41 AM

Woman Use Pressure Cooker as Iron for Cloths - Sakshi

కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా ఇంటిలోని వస్తువులతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటువంటివాటిని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం. ఇన్నాళ్లూ ఈ సంగతి  మనకు తెలియలేదే.. అని ఆశ్యర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో ప్రజర్‌ కుక్కర్‌ నుంచి విజిల్ రాగానే ఓ యువతి చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే. హాట్ ప్రజర్‌ కుక్కర్‌ను ఉపయోగించి  ఆ యువతి దుస్తులు ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ప్రజర్‌ కుక్కర్‌ నుంచి విజిల్‌ రాగానే ఆ యువతి ఇండక్షన్ స్టవ్‌ నుంచి దించి, దానిని తీసుకుని గదిలోకి పరిగెడుతుంది. తరువాత ఆ కుక్కర్ సాయంతో ఒక షర్ట్  ఇస్త్రీ చేస్తుంది.

ఈ వీడియోను చూసిన యూజర్స్‌ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ 17 సెకన్ల వీడియో @Babymishra_ అనే ఖాతాతో  ‘ఎక్స్‌’లో  షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల మందికి పైగా వీక్షించగా, ఆరు వందల మందికి పైగా యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్‌ ‘ఆమె సృజనాత్మకతకు వందనం’ అని రాయగా, మరొక యూజర్‌ ‘ఇస్త్రీ పెట్టె నూతన ఆవిష్కరణ. వెంటనే పేటెంట్ తీసుకోవాలి’ అని రాశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement